ప్రాధమిక హక్కులు

• సాధారణ పరిస్థితులలో ,ఎట్టి పరిస్థితులలో రద్దు చేయుటకు వీలు లేని హక్కులను ప్రాధమిక హక్కులు అని అంటారు.
• భారత రాజ్యాంగంలో 3 వ భాగంలో ప్రకరణ 12-35 వరకు ప్రాధమిక హక్కులు ఉన్నాయి .
• ప్రాధమిక హక్కులకు మరొక పేరు - న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు
• ప్రాధమిక హక్కుల భావన అమెరికా నుంచి తీసుకోబడినది .
• భారతీయులకు ప్రాధమిక హక్కులను కోరిన మొదటి వ్యక్తి- బాలగంగాధర తిలక్ 1895 లో
• ప్రాధమిక హక్కుల కమిటీ చైర్మన్ -జె.బి.కృపలాని
• రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రాధమిక హక్కులు - 7
• ప్రస్తుతం ఉన్న ప్రాధమిక హక్కులు - 6
• ఇవి రాజ్యాంగంలోని 3 వ భాగం లో కలవు .
హక్కులు
సమానత్వపు హక్కు ఆర్టికల్ 14-18
స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19-22
పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23-24
మత స్వాతంత్య్రపు హక్కు ఆర్టికల్ 25-28
సాంస్కృతిక ,విద్యా విషయపు హక్కు ఆర్టికల్ 29-30
ఆస్తి హక్కు ఆర్టికల్ 31
రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32
• ప్రాధమిక హక్కులను అత్యవసర పరిస్థితిలో తాత్కాలికంగా రద్దు చేసే అధికారము రాష్ట్రపతికి కలదు .
• అత్యవసర పరిస్థితిలో తొలగించబడని హక్కులు -ఆర్టికల్ 20,21
• ప్రాధమిక హక్కులలో దేశీయులకు మాత్రమే చెందినవి - 15,16,19,29,30
• అత్యవసర పరిస్థితి కాలం లో ఆర్టికల్ 20,21 రద్దు కావు అనే అంశాన్ని 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు .
• ఆసిహక్కును 44 వ సవరణ 1978 ద్వారా ప్రాధమిక హక్కుల నుంచి తొలగించబడినది .
• ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కు లేదా శాసనపరమైన హక్కు లేదా న్యాయపరమైన హక్కు
• ఆస్తి హక్కును తెలిపే ఆర్టికల్ -300 ఎ
• ప్రాధమిక హక్కులకు ఏ భంగం కలిగినా వాటిని రాజ్యాంగ పరిహార హక్కు(Article 32) ద్వారా సంరక్షించవచ్చు .
ఆర్టికల్-12:-
• రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియచేస్తుంది.
• ప్రాధమిక హక్కుల అమలు భాద్యతను ప్రభుత్వానికి అప్పగించటం జరిగినది .
ఆర్టికల్ 13:-
• ప్రాధమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు ఏవీ చెల్లవు
13(1):-
• రాజ్యాంగం అమలులోకి రాకముందు చేసిన చట్టాలు ,రాజ్యాంగం అమలులోకి వచ్చినతర్వాత చేసిన చట్టాలు ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లుబాటు కావు అని చెబుతుంది .
ఆర్టికల్ 13(2):-
• ఈ నిబంధన న్యాయ సమీక్ష అధికారం గురించి తెలియ చేస్తుంది .
• భారత దేశంలో న్యాయ సమీక్షా అధికారం సుప్రీంకోర్ట్ మరియు హైకోర్ట్ లకు కలదు .
సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14-18):- • ఇది మొదటి ప్రాధమిక హక్కు
ఆర్టికల్ 14 :-
• చట్టం ముందు అందరూ సమానులే
ఆర్టికల్ 14 (ఎ):-
• చట్టం దృష్టిలో అందరూ సమానులే .
దీనికి మినహాయింపులు :-
• రాయబారులు ,దౌత్యవేత్తలు ,విదేశీ ప్రతినిధులకు
• ప్రకరణ 361 ప్రకారం భారత రాష్ట్రపతి &గవర్నర్ లకు ప్రత్యేక మినహాయింపు
• అర్టికల్ 15 కులమత ,జాతి,లింగ లేక జన్మస్థాన కారణాలనుబట్టి వివక్షత చూపుట నిషేధం
• ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు
• 16(1) ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలను పొందే విషయాలను పౌరులందరికీ సమాన అవకాశాలు
ఆర్టికల్ 16(2):-
• ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల విషయంలో కేవలం మతం,వర్ణం ,కులం,లింగం, జన్మస్థలం ,నివాస స్థలం ప్రాతిపదికపై ఏ పౌరుని ఎడల వివక్ష చూపరాదు.
ఆర్టికల్ 16(3):-
• కొన్ని ప్రాంతాల ప్రత్యేక సమస్యల దృష్ట్యా పార్లమెంట్ కొన్ని రకాల ఉద్యోగాలను ఆ ప్రాంతాల వారికి మాత్రమే పరిమితం చేసిన ,ఇతర ప్రాంతాల వారు ఆ ఉద్యోగాలకు అనర్హులుగా చట్టరీత్యా ప్రకటించవచ్చు.
• దీని ఆధారముగా ప్రభుత్వ ఉద్యోగాలు నివాస అర్హతల చట్టం 1957 ను పార్లమెంట్ రూపొందించింది.
ఆర్టికల్ 16(4) :-
• కొన్ని వెనకబడిన తరగతుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యంలేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లైతే వారికోసం కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ నిబంధనలను రూపొందించవచ్చు .
ఎస్.సి.లకు - 15%
ఎస్.టి.లకు -7.5%
బి.సి.లకు - 27%
మహిళలకు -33.3%
ఈ నిబంధన 81 వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా చేర్చబడింది .
బ్యాక్ లాగ్ ఖాళీలలో ఎస్.టి, ఎస్.సి, రిజర్వేషన్లపై చేయబడిన 50% పరిమితిని తొలగించేందుకు 81 వ రాజ్యాంగ సవరణ చేయబడినది .
ఆర్టికల్ 17 :- • అంటరానితనం నిషేధం ,అస్పృస్యత నివారణ చట్టం -1955
ఆర్టికల్ 18 :- •బిరుదుల రద్దు
•1977 లో జనతా ప్రభుత్వం వీటిని రద్దు చేస్తుంది .
•1980 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది .
స్వేచ్చా స్వాతంత్య్రపు హక్కు( ఆర్టికల్19-22):-
ఆర్టికల్ -19:-
•వ్యక్తిగత స్వేచ్చ
•సమాచార హక్కును పేర్కొనే అధికరణ -19 వ అధికరణ
ఆర్టికల్ 20 :- •నేరం ఋజువు కానిదే ఏ వ్యక్తిపై శిక్ష విధించరాదు .
•ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలి.
ఆర్టికల్ -21:-
•వ్యక్తి ప్రాణానికి ,వ్యక్తిగత స్వేచ్చకు రక్షణ
ఆర్టికల్ 21 (ఎ) :-
• ఉచిత నిర్బంధ విద్య
• 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయస్సుగల బాల బాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించుట
• ఈ నిబంధనను 86 వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 లో చేర్చారు .
• ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే
• 1.ఆదేశ సూత్రాలలోని 45 వ నిబంధనను
• 2.ప్రాధమిక విధులు 51 (ఎ) లో మార్పులు జరిగాయి.
• 1992 లో సుప్రీంకోర్ట్ మోహినీ జైన్ v/s కర్ణాటక రాష్ట్రం కేసులో ఉన్నత విద్య కూడా ప్రాధమిక హక్కుగా తెలపటం జరిగినది .
• 1993 లో ఉన్ని కృష్ణన్ v/s ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కేసులో ప్రాధమిక విద్య మాత్రమే ప్రాధమిక హక్కుగా తెలపటం జరిగినది .
ఆర్టికల్ -22
• అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరాలి .
• అరెస్ట్ చేసిన వ్యక్తికి కారణం తెలపాలి .
• భారతదేశంలో రెండు రకాలు నిర్బంధాలు కలవు .
1) Punitive Detention - చేసిన నేరానికి నిర్బంధం
2) Preventive Detention(నివారక నిర్బంధం) - • చట్ట వ్యతిరేక కార్య కలాపాలను ముందుగానే అడ్డుకొనుట
పీడనాన్ని వ్యతిరేకించే హక్కు ( ఆర్టికల్23-24):-
• ఆర్టికల్ 23 కట్టు బానిసత్వ నివారణ గురించి తెలుపుతుంది
• ఆర్టికల్ 24 ప్రమాదకరమైన గనులలో బాల కార్మికులచే పని చేయించటం నిషేధం
మత స్వాతంత్రపు హక్కు:-
ఆర్టికల్ -25:-
• ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చును .బలవంతపు మత మార్పిడి చేయరాదు .
• బలవంతపు మతమార్పిడి నిషేధ చట్టం చేసిన మొదట రాష్ట్రం -ఒడిశా (1965)
• 25 వ నిబంధన ప్రకారం బౌద్ధ ,సిక్కులు ,జైనులు హిందువులుగా పరిగణించబడతారు .
ఆర్టికల్ - 26:-
• ధార్మిక సంస్థలను స్థాపించుకొని ఆస్థులను సంపాదించుకోవచ్చు.
ఆర్టికల్ - 27:-
• మతపరమైన పన్నులు విధించకూడదు .
ఆర్టికల్ - 28:-
• ప్రభుత్వ విద్యాలయాలలో ,ప్రభుత్వ సహాయం పొందే సంస్థలలో మత మత బోధన చేయకూదదు .
• విద్యా విషయక సాంస్కృతిక హక్కు
• విద్యాహక్కు చట్టం 2009 సం||లో ఆమోదించారు .
• విద్యాహక్కు చట్టం విద్యను ప్రాధమిక హక్కుగా ప్రకటించింది .
• 6 నుండీ 14 సం|| ల లోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ఇవ్వాలని విద్యాహక్కు చట్టం ప్రకటించింది .
ఆర్టికల్ -29:-
• అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ
ఆర్టికల్ 30 :-
• విద్యా సంస్థలు స్థాపించుటకు ,నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గాలకు గల హక్కులు
• దీనిప్రకారం మైనారిటీ విద్యా సంస్థలు స్థాపించవచ్చు .
రాజ్యాంగ పరిహార హక్కు (32):-
• ప్రాధమిక హక్కూకు భంగం వాటిల్లితే 32 వ నిబంధన ద్వారా సుప్రీం కోర్ట్ ను , 226 ద్వారా హైకోర్ట్ ల నుంచి రక్షణ పొందవచ్చు .
న్యాయాదేశాలు :-
• 32(2) ద్వారా ప్రాధమిక హక్కులను కాపాడుటకు హైకోర్ట్ ,సుపీంకోర్ట్ లు జారీచేయు రిట్లు
• హెబియస్ కార్పస్
• ప్రొహిబిషన్
• మాండమస్
• సెర్షియోరారి
• కోవారంటో
ప్రాధమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన కేసులు :-
1) చంపకం దొరైరాజన్ v/s మద్రాస్ 1950 -
మతపరమైన రిజర్వేషన్ లు చెల్లవు
2) ఎ.కె.గోపాలన్ v/s తమిళనాడు 1950:-
అక్రమ అరెస్టులు నివారక ,నిర్బంధ చట్టం
3) శంకరీ ప్రసాద్ v/s ఇండియా :-
1951 న్యాయ సమీక్షా అధికారం మొదటిసారి వినియోగించబడినది .
4) గోలక్ నాథ్ v/s పంజాబ్ 1967:-
ప్రాధమిక హక్కులు ,మౌలిక నిర్మాణం సవరణకు అతీతం
5) కేశవానంద భారతి v/s కేరళ1973 :-
పార్లమెంటుకు ప్రాధమిక హక్కులను సవరించే అధికారం ఉంది .
6) మేనకా గాంధీ,1978 :-
సంచార హక్కు ,విదేశాలకు వెళ్ళే హక్కు
7) మినర్వా మిల్స్ :-
ప్రాధమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం