మలి వేద కాలం

•క్రీ.పూ. 1000-600 మధ్య కాలాన్ని మలి వేద కాలం అని అంటారు .
•మలి వేదాలుగా గుర్తించబడినవి - సామవేదం , యజుర్వేదం, అధర్వణ వేదం .
•ఈ కాలం లో ఆర్యులు సప్థ సింధు నుండి గంగా మైదానంకు విస్తరించారు .
రాజకీయ వ్యవస్థ :-
•ఈ కాలoలో ఆర్య తెగలు కొన్ని కలసిపోయాయి .
•భరత , కురు తెగ కలసి పురు తెగ ఏర్పడింది .
•పురు తెగకు మధ్య జరిగిన పాండవులు , కౌరవులు మధ్య యుద్ధమే మహా భారత సంగ్రామం
•ఈ యుగంలో రాజు శక్తి వంతుడు అయ్యాడు . సభ , సమితులని అణచి వేసాడు .
•రాజు ధరించిన బిరుదులు - సార్వ భౌమ , ఏక్ విరాట్ , విరాట్ , విశ్వ జనీన .
•రాజు దైవాంశ సంభూతుడు అనే భావన ఏర్పడింది .
•రాజుకు సహకరించుటకు 12 మంది అధికారులు నియమించ బడ్డారు .వీరికి ద్వాదశ రత్నిన్ లు అని పేరు .
వారు
1. సేనాని
2.పురోహితుడు
3.రాణి
4.యువరాజు
5.బంగదుఘ (పన్నులు వసూలు చేయు అధికారి)
6.సంగ్రహిత్రి (కోశాధికారి )
7.సంధి విగ్రహం (విదేశీవ్యవహారాలు )
8.వ్రజపతి (పచ్చిక బయళ్ళ అదిపతి)
9.క్షాత్రి (రాజు గొడుగు పట్టే వాడు)
10.అక్షవాడు (గణకుడు)
11.సుమంతు(రధ చోదకుడు)
12.శత పతి (100 గ్రామాలకు అదిపతి)
ఆర్ధిక వ్యవస్థ :-
•మలి వేద కాలం లో ప్రదాన వృత్తి వ్యవసాయం
•ఈ కాలంలో వ్యవసాయ పనికి ఇనుము వినియోగం వాడుకలోకి వచ్చింది.
•మొదట ఇనుము ఉపయోగించిన ప్రాంతం-గాంధార (ఆఫ్ఘనిస్థాన్ ) .
•ఇనుప నాగలి వాడుకలోకి వచ్చింది . నాగలి దేవత - సీత.
•రాజుకు ప్రదాన ఆదాయం -
బలి - స్వచ్చదంగా లభించేది .
భాగ - పంటలో కొంత భాగం(1/6 వంతు)
శుల్య - వస్తువుల తయారీ పై విధించినది .
•స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు . భూమికి విలువ ఏర్పడింది.
•వస్తు మార్పిడి స్థానంలో నాణేలు ప్రవేశ పెట్టారు .శతమాన -బంగారు నాణెం , కర్షాపణ- వెండి నాణెం .
•ఈ కాలంలో ప్రధాన పంటలు - బార్లీ , వ్రిహి(వరి) , గోధుమలు .
•నూతన నగరాలు వెలిశాయి - హస్థినాపురం , రాజ గృహ, పాటలీ పుత్ర , కౌశంబి , వైశాలి .
•మట్టి కుండలు విరివిరిగా తయారు చేసుకో బడ్డాయి .
•నాలుగు రకాల కుండల తయారీ వాడుకలో ఉంది .
1.నలుపు
2. ఎరుపు
3.నలుపు - ఎరుపు చారలు
4. బూడిద రంగు .
సమాజం:-
•చాతుర్వర్ణ వ్యవస్థ తీవ్ర రూపం దాల్చింది .
•బహు భార్యత్వం , బాల్య వివాహాలు , వర కట్నం , కన్యాశుల్కం ఆచారాలు ఏర్పడ్డాయి .
•స్త్రీలు స్వేచ్చను కోల్పోయారు.స్త్రీ విద్య నిరాకరించబడింది .
•వర్ణాశ్రయ ధర్మాలు వాడుకలోకి వచ్చాయి . అవి నాలుగు
1.బ్రహ్మ చర్యం (విద్యార్ది దశ).
2.గృహస్థ (వివాహం , సంసార జీవనం)
3.వామ ప్రస్థం(కుటుంబ బాద్యతల నుంచి తప్పుకొనుట)
4.సన్యాసం (ఇంటిని వదిలి వెళ్ళుట).
అధర్వణ వేదంలో 8 రకాల వివాహాలు :-
1. బ్రహ్మ వివాహం : పెద్దల అంగీకారంతో శాస్త్రీయంగా జరిగేది .
2.దేవ వివాహం : దక్షిణతో పాటు తన కుమార్తెను బ్రాహ్మణుడికి ఇచ్చి వేయటం .
3.అర్ష వివాహం : ఒక ఎద్దును , ఆవును అమ్మాయి తండ్రికి ఇచ్చి పెళ్ళి చేసుకోవటం .
4.ప్రజాపత్య వివాహం : కన్యా శుల్కం , వర కట్నం ఏది ఉండదు .
5. గాంధర్వ వివాహం : పెద్దల అనుమతి లేకుండ పెళ్ళి చేసుకొనుట
6. అసుర వివాహం : వధువును కొనుగోలు చేసి వివాహం చేసు కొనుట .
7. రాక్షస వివాహం : అమ్మయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్ళి చేసుకొనుట .
8. పైశాచిక వివాహం : అమ్మయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి చేసుకోవటం
•ఇవి కాకుండా మరో మూడు సంప్రదాయాలు కలవు
1.అనులోమ వివాహం :- అగ్ర వర్గానికి చెందిన పురుషుడు నిమ్న వర్గానికి చెందిన స్త్రీ ని వివాహమాడుట .
2.ప్రతిలోమ వివాహం :-నిమ్న కులానికి చెందిన పురుషుడు అగ్ర వర్ణ స్త్రీలను వివాహ మాడుట .
3.నియోగ వివాహం:- సంతానం లేని స్త్రీ సంతానం కొరకు భర్త సోదరుని తో సహజీవనం చేయుత .
•చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్ర స్థానం బ్రాహ్మణులు పొందారు .
1.బ్రాహ్మణులు - రాజుకు సలహా దారులు ,యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తారు .
2.క్షత్రియులు -రాజ్య పాలనా నిర్వహణా బాధ్యతలు
3.వైశ్యులు - వర్తక వాణిజ్య వ్యవసాయ విధుల నిర్వహణ
4.శూద్రులు - పై మూడు వర్గాలకి సేవ చేయాలి .వీరికి ఉపనయన అర్హత లేదు .
•ద్విజులు - (ఉపనయనం అర్హత కలిగిన వారు)-బ్రాహ్మణులు , క్షత్రియులు , వైశ్యులు .
•ఈ కాలంలో ఆర్యుల జీవిత ధర్మాలు - చాతుర్విద ధర్మాలు
1.ధర్మం
2.అర్ధం
3.కామం
4.మోక్షం
•మలి వేద రచనలో గార్గి , మైత్రేయ అనే స్త్రీలు పోల్గొన్నారు .
•గార్గేయ అనేక రకాల ప్రశ్నలతో యజ్ఞవల్కుని ఇబ్బంది గురి చేసినది.
మత వ్యవస్థ
•తొలి వేద కాలంలో ప్రాధాన్యత కల్గిన దేవతలు ప్రాముఖ్యతను కోల్పోయారు .
•ఇంద్రుడు , అగ్నికి ప్రాధాన్యత తగ్గింది . త్రిమూర్తులైన బ్రహ్మ (ప్రజాపతి), విష్ణు (ప్రజా పోషకుడు ) , మహేశ్వరుడు (విలయకారుడు) లకు ప్రాదాన్యత ఏర్పడింది.
•యజ్ఞ యాగాల క్రతులకి ప్రాధాన్యత పెరిగింది .దీని వలన బ్రహ్మణాదిపత్యం పెరిగింది .
•మలి వేద కాలంలో రాజులు నిర్వహించిన యాగాలు
1.వాజ పేయ :- పోటీరాజులను అంతం చేయుటకు చేయునది.
2.అశ్వమేధ :-ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిపత్యం కొరకు చేయునది.
3. రాజసూయ :-ఆర్దిక వ్యవస్థను దృవీకరించుటకు చేయునది.
4.నరమేధ యాగం :- రాజు కోర్కెలను తీర్చు కొనుటకు చేయునది .
•నరమేధ యాగాలు చేసిన ఆధారాలు కల్గిన ఏకైక చక్రవర్తి రెండవ మాధవ వర్మ (విష్ణు కుండిన రాజు )
•ఉపనిషత్ లను వేదాంతం అంటారు . ఇవి యజ్ఞయాగాలను ఖండించాయి.