ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలు / కర్ణాటక యుద్ధాలు

1. మొదటి యుద్ధం :(1746-48):-
• ఈ యుద్ధానికి కారణం - ఐరోపాలో ఆస్ట్రియా ప్రష్యాల మధ్య జరిగిన వారసత్వ యుద్ధం .
• ఆంగ్లేయులు ఆస్ట్రియాకు , ఫ్రెంచి వారు ప్రష్యాకు మద్దతు ఇచ్చి ఈ యుద్ధంలో పాల్గొన్నారు .
• దీనితో భారత దేశం లో ఫ్రెంచి గవర్నర్ డూప్లే - ఆంగ్లేయుల ప్రధాన స్థావరం అయిన మదరాస్ ను ఆక్రమిoచాడు .
• ఆంగ్లేయులు కర్ణాటక నవాబు అన్వరుద్దిన్ ను ఆశ్రయించాడు .
• అన్వరుద్దీన్ పంపిన సైన్యాలను అడయార్ యుద్ధం శాంథాన్ యుద్ధం లో డూప్లే చిత్తుగా ఓడించాడు .
• ఎక్స్ -లా - చాపెల్ సంధి తో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది .
• ఈ సంధి ప్రకారం మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు తిరిగి ఇచ్చేశారు .
2. రెండవ యుద్ధం (1749-1756):-
• కర్ణాటక రాజధాని అర్కాటు .
• కర్ణాటక రాజ్యం కోసం అన్వరుద్దీన్, చందా సాహెబ్ ల మధ్య వారసత్వ పోరాటం ప్రారంభం అయింది అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీ .
• హైదరాబాద్ రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ 1748 లో మరణించాడు .
• హైదరాబాద్ రాజ్యం కొరకు నాజర్ జంగ్ ,అతని మేనల్లుడు ముజఫర్ జంగ్ ల మధ్య వారసత్వ యుద్ధము ప్రారంభమైనది .
• అన్వరుద్దిన్ ,నాజర్ జంగ్ లకు ఆంగ్లేయులు మరియు చందా సాహెబ్ ,ముజఫర్ జంగ్ వారికి ఫ్రెంచి మద్దతు ఇచ్చి వారసత్వ యుద్ధం యూరోపియన్లు ప్రవేశించారు .
• ఫ్రెంచి గవర్నర్ డూప్లే అంబూర్ యుద్ధంలో అన్వరుద్దిన్ ని చంపి చందా సాహెబ్ ని ఆర్కాట్ నవాబుగా నియమించాడు .
• అన్వరుద్దిన్ కుమారుడు మహ్మద్ అలీ తిరుచనా పల్లి పారిపోయాడు .
• హైదరాబాద్ లో నాజర్ జంగ్ ,ముజఫర్ జంగ్ ను ఓడించి బంధీ గా పట్టుకున్నాడు .
• కానీ డూప్లే కుట్ర వలన హిమ్మత్ ఖాన్ ,నాజర్ జంగ్ ను హత్య చేశాడు .
• డూప్లే బందీ గా ఉన్న ముజఫర్ జంగ్ ను విడిపించి దక్కన్ నవాబుగా నియమించాడు .
• కాని కడప నవాబులు ఆంగ్లేయుల పక్షం చేరి కడపలోని లక్కిరెడ్డి పల్లి వద్ద ముజఫర్ జంగ్ ను హత్య చేశారు .
• దీనితో ఫ్రెంచి సేనాని బుస్సీ హైదరాబాద్ చేరుకోని సలాబత్ జంగ్ ను నవాబుగా నియమించాడు .
• మహ్మద్ అలీ ఆంగ్లేయులతో సంధి చేసుకోని రాబర్ట్ క్లైవ్ తో ఆర్కాట్ పైకి దండెత్తాడు .
• 1752 లో ఆర్కాట్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ ను చంపి మహ్మద్ అలీని ఆర్కాట్ కు నవాబు గా నియమించాడు .
• ఆర్కాట్ వీరుడు - రాబర్ట్ క్లైవ్
• గౌడేహ్యూ అనే ఫ్రెంచ్ గవర్నర్ ఆంగ్లేయులతో పాండిచ్చేరి వద్ద సంధి చేసుకున్నాడు .దీనితో రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది .
• ఈ యుద్ధం ముగిసే నాటికి హైదరాబాద్ వారు ఫ్రెంచి లోను ,కర్ణాటకలో ఆంగ్లేయులు ఆధిపత్యం పొందారు .
3. మూడవ యుద్ధం (1756-63):-
• అమెరికాలో వలసల విషయంలో ఐరోపా వాసుల మధ్య సప్త వర్ష సంగ్రామం మొదలైంది .
• ఈ యుద్ధంలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ చెరోవైపు పాల్గొన్నాయి .
• దీనితో ఇండియాలో ఫ్రెంచి గవర్నర్ కొంట్ .డి.లాలీ మదరాసును ఆక్రమించటానికి హైదరాబాద్ లో ఉన్న బుస్సీ ని పంపించాడు .
• బుస్సీ హైదరా బాద్ నుండి వెళ్ళిపోగానే ఆంగ్లేయులు అక్కడికి చేరుకొని సలాబత్ జంగ్ తో సంధి చేసుకున్నారు .
• 1760 లో వంద వాసి యుద్ధం లో ఇంగ్లీష్ సేనాని సర్ ఐవర్ కూట్ కౌంట్ డి లాలిని బంధించాడు .
• 1763 లో ప్యారిస్ ఒప్పందం తో సప్త వర్ష సంగ్రామం ముగిసింది .ఈ సంధి ప్రకారం కౌంట్ డి లాలి ని విడిచి పెట్టారు .
• ఈ యుద్ధం లో ఓటమి వలన ఫ్రెంచివారు తమ వైభవాన్ని కోల్పోయారు .వారు పాండిచ్చేరి కి పరిమితమయ్యారు