మొఘల్ సామ్రాజ్యం

మొఘలులు :- భారత దేశంలో మొఘల్ రాజ్య స్థాపకుడు బాబర్ .
1. బాబర్ (1520 -1530):-
• బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహ్మద్ .
• బాబర్ అంటే టైగర్ అని అర్ధం (పులి).
• బాబర్ 1483 ఫిబ్రవరి 14 న ఫర్గాన లో జన్మించాడు .
• ఇతని కుటుంబం తురుష్క జాతిలోని చాగ్ తాయ్ కు చెందింది .
• తండ్రి వైపు తైమూర్ వంశానికి , తల్లి వైపు చంగీజ్ ఖాన్ వంశానికి చెందిన వాడు .
• బాబర్ తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా .
• క్రీ.శ. 1494 లో 11 సం || ల వయసులో ఫర్గానకు రాజయ్యాడు .
• తైమూర్ రాజధాని సమర్ఖండ్ జయించాలనేది ఇతని చిరకాల వాంఛ .
• సమర్ఖండ్ పై దండెత్తగ జబ్బు పడ్డాడు .
• బాబర్ జబ్బు పడుట వలన ఫర్గానా కోల్పోయాడు .
• 1504 లో కాబుల్ లో రాజ్యాన్ని స్థాపించాడు .
• 1519-26 మధ్య భారత దేశం పై 5 సార్లు దండయాత్ర చేశాడు .
• 1526 లో దౌలత్ ఖాన్ లోఢీ ఆహ్వానం మేరకు ఢిల్లీ పైకి దండెత్తాడు .
మొదటి పానిపట్టు యుద్ధం (1526 ఏప్రియల్ 21) :-
• 1526 లో మొదటి పాని పట్టు యుద్దంలో ఇబ్రహిం లోడిని ఓడించి డిల్లీని ఆక్రమించాడు .
• ఈయన యుద్దంలో మేవాడ్ పాలకుడు రాణా సంగ్రాంసింగ్ బాబర్ కి సహకరించాడు .
• ఈ యుద్ధం లో బాబర్ అనుసరించిన వ్యూహం రూమీ .
• ఈ యుద్ధంలో బాబర్ విజయానికి కారణం - ఫిరంగి దళం
కాణ్వా యుద్దం:-(1526 మార్చి 17 ):-
• 1527 లో కాణ్వా యుద్ధంలో రాణా సంగ్రామ సిం హను ఓడించాడు .
• ఈ యుద్ధం లో బాబర్ మొదటి సారి జిహాద్ ప్రకటించాడు .
• మొఘల్ సామ్రాజ్య వ్యాప్తికి దీన్ని ఆరంభంగా గుర్తిస్తారు .
• చందేరి యుద్ధం 1528 :-
• 1528 లో చందేరీయుద్ధం లో మేథిని రాయ్ ని ఓడించాడు .
గోగ్రా యుద్ధం :-
• 1529 లో మహ్మద్ లోఢీ,నస్రత్ షా మొదలగు ఆఫ్ఘన్ లను ఓడించెను .
• బాబర్ 1530 లో ఆగ్రాలో మరణించాడు . ఇతని సమాధి కాబుల్ లో కలదు .
• బాబర్ సున్నీ తెగకు చెందినవాడు .
• 1528 లో బాబ్రీ మసీదు నిర్మించాడు .
• మధ్యపానాన్ని నిషేదించిన మొదటి మోఘల్ చక్రవర్తి .
• భారత దేశం లో ఫిరంగులు ఉపయొగించిన మొదటి వ్యక్తి -బాబరు.
• బాబర్ ను స్వీయ చరిత్రల రారాజు గా పిలుస్తారు .
• బాబర్ ను ఉద్యాన వనాల రాజుగా పిలుస్తారు
2. హుమయూన్ :-
• ఇతని అసలు పేరు నసీరుద్దిన్ మహ్మద్ .
• హుమయాన్ అనగా అదృష్టవంతుడు అని అర్దం . కాని అత్యంత దురదుష్ట వంతుడు.
బహుదూర్ షా తో పోరాటం -1535
• షేర్ షా తో పోరాటం - 1529
• బిల్ గ్రాం యుద్ధం 1540
హుమయూన్ భార్య పేరు హమీద భాను బేగం
• ప్రవాసం లో అమర్ కోట లో ఉండగా 1542 లో వీరికి అక్బర్ జన్మించాడు .
• హుమాయూన్ ఢిల్లీ సమీపాన దీన్ ఫణా అనే నగరాన్ని నిర్మించాడు .
• ఇతని సమాధి ఢిల్లీ లో కలదు .
• హుమాయున్ కు ఖగోళ , జ్యోతిష్య శాస్త్రాలలో ఆసక్తి అధికం .
• ఖగోళ శాస్త్ర అధ్యయనం కొరకు భవనం నిర్మించాడు .
షేర్ షా (1540-45):-
• ఇతను సూర్ వంశానికి చెందినవాడు .
• ఇతను బాబర్ కొలువులో కొంతకాలం పని చేశాడు .
• షేర్ షా బిరుదులు రాజ సిం హ న్యాయ సిం హ
• పరిపాలన : -
• పౌర పరిపాలనను రూపకల్పన చేసిన మొదటి ముస్లిం చక్రవర్తి
• రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించాడు .
• రైత్వారీ విధానం ప్రవేశపెట్టాడు .
• భూమి సర్వే చేయించి రైతులకు పట్టాలు ఇచ్చాడు .
• గ్రాండ్ ట్రంక్ రోడ్ లను నిర్మించాడు .
• అంచెల వారీ తపాలా విధానం ప్రవేశపెట్టాడు .
• ప్రయాణికుల కొరకు 17000 సత్రాలు నిర్మించాడు.
• హిందువులపై జిజియా పన్ను విధించాడు .
• ప్రభుత్వ శాఖలను తన ఆధీనం లో ఉంచుకున్నాడు .
4. అక్బర్ :-
• అక్బర్ 1542 నవంబర్ 23 న అమర్ కోటలో జన్మించాడు
• అక్బర్ పూర్తి పేరు జలాలుద్దీన్ మహమద్ అక్బర్ బాదూషా ఘాజీ.
• అక్బర్ తల్లి తండ్రులు - హమదాబానూ , హుమాయన్ .
• ఇతని సం రక్షకుడు భైరం ఖాన్ .
• హుమాయున్ మరణానంతరం 13 సంవత్సరాల వయస్సులో 1556 ఫిబ్రవరి 14 న పట్టాభిషేకం చేసుకున్నాడు .
• 1560 వరకు భైరంఖాన్ పాలనా వ్యవహారాలు చూసుకున్నాడు .
• 1560 లో బైరంఖాన్ ను మక్కా వెళ్ళమని స్వతంత్రం గా పాలించటం ప్రారంభీంచాడు .
• రాజపుత్ర విధానం :-
• అక్బర్ తో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్న తొలిరాజ పుత్ర రాజ్యం అంబర్ .
• అక్బర్ ని ఎదిరించిన రాజపుత్ర రాజ్యం మేవాడ్ .
• ఇతని ఆస్థానంలో కవులు :
• అబుల్ ఫజల్
• 1. అక్బర్ నామా
• 2.అయినీ అక్బారీ
• 2.అబ్దుల్ ఖాదీర్ బదౌనీ : ముంతక్ ఆబ్ ఉల్ తవారిక్.
• 3. నిజాముద్దిన్ అహ్మద్ : తబాఖత్-ఇ-ఆక్బారి.
మత విధానం :-
• మత విధానాన్ని సుల్ - ఎ- కుల్ అని పిలుస్తాం . ఇతని మత గురువు అబ్దుల్ లతీఫ్.
• 1563 లో తీర్ద యాత్రల్ పన్ను రద్దు చేశాడు .
• దక్షిణాది పై దాడులు ప్రారంబించిన తొలి మొఘలి చక్రవర్తి - అక్బర్
• అక్బర్ ను భరత జాతీయతా భావ పిత అని కీర్తించింది .నెహ్రూ.
• అక్బర్ ను ప్రభావితం చేసిన సూఫి మత గురువు షేక్ ముబారక్ .
• శ్రీరాముని గుర్తు తో వెండి నాణెం జారీ చేసిన ఏకైక చక్రవర్తి .
• 1562 లో బలవంతపు మతమార్పిడి విధానాన్ని రద్దు చేశాడు .
• 1564 లో జిజియా పన్నును రద్దు చేశాడు .
• 1575 లో ఫతేపూర్ సిక్రీ లో అన్ని మతాల వారు ప్రార్ధనలు చేసుకొనేందుకు అనుకూలంగా ఇబాదత్ ఖానా అనే ప్రార్ధనా మందిరాన్ని నిర్మించాడు .
• అక్బర్ 1582 లో దీన్-ఇ-ఇలాహి అనే మతాన్ని స్థాపించాడు .
భూమిశిస్తు విధానం :-
• దీనికే దఫ్ సాలా అని పేరు .
• దీని రూపకర్త రాజా తొడర్ మల్
• రైతులకు భూమి హక్కుని కల్పించాడు .
సైనిక విధానం :-
• సైనిక వ్యవస్థలో మున్సబు దారీ విధానం కలదు .
• అక్బర్ కాలం లో 33 శ్రేణులు ఉండేవి
• అక్బర్ ఆస్థానం లో గాయకుల సంఖ్య -36
• అక్బర్ నిరక్ష్యరాస్యుడు .
• తులసీ దాసు,సూరదాసు మొదలగువారు అక్బర్ ఆస్థాన కవులు
• అక్బర్ కాలం లో రాజ భాష -పారశీకం
• అక్బర్ నిర్మాణాలు :- జోధ్ భాయ్ మహల్
• దివాని ఆం
• దీవానీ ఖాస్
• పంచ మహల్
• బులంద్ దర్వాజా
జహంగీర్ (1605- 1627) :-
• ఇతను తండ్రిపై 3 సార్లు దాడి చేశాడు . భారతదేశం లో ఆంగ్లేయులకు వ్యాపారానికి అనుమతి ఇచ్చినది -జహంగీర్
• జహంగీర్ స్వీయ చరిత్ర - తుజక్ -ఇ- జహంగిరీ
• ఇతని కాలం లో పోర్చుగీసు వారు భారత్ లో పొగాకు ప్రవేశ పెట్టారు.
• గొప్ప చిత్రకారుడు .
• జహంగీర్ నిర్మాణాలు
• సికిందర్ వద్ద కల అక్బర్ సమాధి
• ఆగ్రాలో ఇతి మద్దౌలా సమాధి లాహోర్ లో మసీదు .
షాజహాన్ (1628-1658 ) :-
• ఇతని అసలు పేరు ఖుర్రం .
• 1629-30 లో పోర్చు గీసు వారిని హుగ్లీ నుంచి తరిమివేశాడు .
• గోల్కొండ,బీజాపూర్ రాజ్యాలను జయించాడు .
• మొఘల్ కాలం లో ఇది ఒక స్వర్ణ యుగం
• షాజహాన్ కాలం లో దక్కన్ లో గొప్ప కరువు ఏర్పడింది .
• 1630 లో ఇతని భార్య ముంతాజ్ మరణించింది .
• ఈమె జ్ఞాపకార్ధం 1631-53 ల మధ్య ఆగ్రాలో యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ను నిర్మించాడు .
• షాజహాన్ ఢిల్లీ లో జుమా మసీదు , ఆగ్రాలో మోతీ మసీదు నిర్మించాడు .
• ఇతను నెమలి సిం హాసనం తయారు చేయించాడు .
• 1658 లో ఇతను అనారోగ్యానికి గురి అవటంతో ఇతని కుమారుల మధ్య వారసత్వ పోరు మొదలైంది .
• షాజహాన్ సంతానం:-
• ధారాషికో
• రోషనార
• జహనార
ఔరంగ జేబు లేదా ఆలంగీర్(1658-1707) :-
• తీవ్రమైన మత విశ్వాసాలు కలవాడు .
• భారత దేశం ను ఇస్లాం దేశం గా మార్చటం ఇతని ఆశయం .
• ఖురాన్ నియమాలను పాటించేవాడు .
• హిందువుల పండుగలను రద్దు చేశాదు .
• హిందువులపై జిజియా పన్ను విధించాడు.
• ఇతను కాశీలో విశ్వనాథ ఆలయం , మధురలో కేశవరాయ ఆలయం ,గుజరాత్ లో సోమనాథ్ ఆలయం లను నాశనం చేశాడు .
• ఇతని మత విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక తిరుగుబాటు జరిగాయి .
• ఇతను సున్నీ మతానికి చెందినవాదు .
• షియాలు ఇతనికి వ్యతిరేకం
• 1689 లో శివాజీ తనయుడు శంభాజీ ని వధించాడు .
• 1707 లో మరణించాడు.
• కాఫీఖాన్,ఈశ్వర దాస్ ఇతని ఆస్థాన కవులు