తురుష్కుల దండ యాత్రలు

మహ్మద్ గజనీ :- ఇతని రాజధాని మధ్య ఆసియా ప్రాంతంలోని గజినీ అనే పట్టణం .
• ఇతడు క్రీ.శ. 1000-1027 మధ్య 17 సార్లు భారత్ పై దాడి చేసి దోచుకున్నడు .
• ఇతని దాడులన్నీ ఆర్ధికంగా భారత దేశం దోపిడీ చేయుటకు ఉద్దేసించినవే .
• గజనీ భారత్ దేశ దండ యాత్రకు అనుమతించిన ఖలీఫా - ఖాదిర్ భిల్లా .
• గజనీకి ఖలీఫా ఇచ్చిన బిరుదులు - యామినుద్దౌలా , అమాని మిల్ ఉల్లత్.
• మొదటి దండ యాత్రలో క్రీ.శ 1000-1001 లో కుత్బుండ పురం రాజధానిగా పాలించే హిందూషాహీ వంశస్థుదైన జయపాలుడిని ఓడించాడు .
• 1008లో ఆనంద పాలుడిని,1014 లో త్రిలోచనా పాలుడిని ఓడించాడు . దీనితో హిందూ షాహి వంశం అంతమైంది .
• 1014-1022 మధ్య చందేల రాజు విద్యాధరుని చేతిలో రెండూసార్లు ఓటమి చెంది సంధి కుదుర్చుకున్నాడు
• ఇతని 16 వ దాడి క్రీ.శ. 1025 లో గుజరాథ్ లోని సోమ నాధ ఆలయాన్ని దోచుకున్నాడు .అప్పుడూ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు భీమ 1 సోలంకి వంశంకు చెందిన వాడు .
• ఇతని రాజధాని అనిల్వాడ్ .
• చివరిగా 17 వదాడి లో 1027 లో జాట్ అనే తెగను అణచి వేశాడు .
• ఇతను క్రీ.శ 1029 లో మరణించాడు .
• మహ్మద్ గజనీకి సుల్తాన్ అనే బిరుదునిచ్చిన ఖలీఫ -అల్ కైం.
• ఇతని ఆస్థానం లోని కవులు - రచనలు
• 1.ఉత్బి : తారిఖ్ -ఎ-యామిని
• 2.ఫిర దౌసి : షా -నామా
• ఫిరదౌసీ కి గజనీ ఇచ్చిన బిరుదు పారశీక బాషకు హోమర్ . ఇది గజనీ జీవిత చరిత్ర .
• 3.అల్- బెరూని : కితాబ్-ఉల్-హింద్
• అల్ బెరూని అసలు పేరు అమీర్ హాన్ . ఇతను వారణాసిలో సంస్కృత బాషను నేర్చుకున్నాడు .
• ఇతను గజనీతో పాటు భారత దేశం వచ్చాడు .
• గజనీ సంస్కృత బాషతో కూడిన వెండి నాణేలు జారీ చేశాడు .
మహమద్ ఘోరీ :-
• ఇతనికి గల ఇతర పేర్లు షిహాబుద్దిన్ మహ్మద్ , మోముజుద్దీన్ మహ్మద్
• క్రీ.శ. 1175 నుండి భూభాగం కోసం భారత్ పై దాడులు నివహించాడు .ఇతని ముఖ్య ఉద్దేశం భారత దేశంలో ఇస్లాం రాజ్య స్థాపన చేయుట .
• క్రీ.శ 1175 లో రెండవ భీమ లేదా రెండవ మూల రాజు చేతిలో " మౌంట్ అబూ " యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడు .ఇతనిని ఓడించిన మొదటి భారత పాలకుడు రెండవ భీముడు .
• తిరిగి క్రీ.శ 1178 లో రెండవ భీముని ఓడించెను .
• 1190 లో మహ్మద్ ఘోరీ భటిండాను ఆక్రమించుకున్నాడు .
• క్రీ.శ 1191 , 1192 లో పృధ్విరాజ్ చౌహన్ తో తరైన్ వద్ద రెండు యుద్దాలు జరిగాయి .
• తరైన్ యుద్దాలకు గల మరి యొక పేరు స్థానేశ్వర యుద్ధాలు .
• మొదటి యుద్ధంలో ఘోరీ ఓడిపోయాడు .
• రెండవ యుద్దంలో పృధ్విరాజ్ చౌహన్ ను ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించాడు.
• క్రీ.శ 1206 లో ఘోరీ నిస్సంతుగా మరణించతంతో అతని సేనాని కుతుబుద్దిన్ ఐబక్ ఘోరీ జయించిన ప్రాంతాలన్నీటిని కలిపి ఢిల్లీ కెంద్రంగా రాజ్యాలను ఏర్పరిచారు .