ఇస్లాం మత స్థాపన

మహ్మద్ ప్రవక్త (570-632):-
ఇస్లాం అనగా దైవానికి లొంగి ఉండుట అని అర్దం .
ఇస్లాం మతాన్ని మహ్మద్ ప్రవక్త స్థాపించాడు .
ఇతను క్రీ.శ 570 లో మక్కాలో జన్మించాడు .
ఇతని తల్లి తండ్రులు అబ్దుల్లా , అమీనా .
వీరు ఖురేషి తెగకు చెందిన వారు .
మహ్మద్ ను పెంచిన మేన మామ అబూ తాలీబ్ .
మహ్మద్ మక్కా నగర సమీపం లోని హీరా పర్వతాల వద్ద ద్యానం చేశాడు .
ఒకరోజు " జిబ్రయిల్ అనె దేవత ప్రత్యేక్షమై " నీవే భగవంతునివి దూతవు " అని భోదించింది .
దీనినే దివ్యావిష్కరణ అంటారు .
అప్పటి నుంచి ప్రజలకి ఇతను భోధనలు చేయసాగాడు .
క్రీ.శ 622 సెప్టెంబర్ 24 న ఇతని పై మక్కాలోని కొన్ని వర్గాలు ప్రజలు తిరుగు బాటు చేయగా మదీనా నగరానికి వలస వెళ్ళాడు . దీనినే హీజారా అని పిలుస్తారు .
మదీన నగరం అసలు పేరు మస్రీచ్ .
మదీన అనగా ప్రవక్తులు ఉందే నగరం అని అర్ధం .
క్రీ .శ . 630 లో మహ్మద్ అనుచరులు మక్కాను జయించారు .
ప్రవక్త క్రీ.శ 632 లో మరణించాడు .
మహ్మద్ అనంతరంఖలీఫాలు ఇస్లాం ను వ్యాపింప చేశారు . ఖిలీఫ అనగా వారసుడు .
మొదటి ఖలీఫాలు -
మొదటి ఖలీఫా - అబు బాకర్
రెండవ ఖలీఫా- ఉమర్
మూడవ ఖలీఫా - ఉస్మాన్
నాల్గవ ఖలీఫా - అలీ .
నాల్గవ ఖలీఫా మహ్మద్ ప్రవక్తా అల్లుడు . ఇతని భోధనలు పాటించే వారిని షియాలు అని పిలుస్తారు .
మొదటి ముగ్గురు ఖలీఫాల భోధనలను పాటించే వారిని సున్నులు అని అంటారు .
ముస్లీం ల పవిత్ర గ్రంధం ఖురాన్
ఖురాన్ గ్రంధాన్ని మొదటి ఖలీఫ అబూబాకర్ కాలం లో ఇబ్నే సాబాత్ సంకలనం చేశాడు .
ఖురాన్ లో 114 సురలున్నయి .
ప్రతీ ముస్లీం ఆచరించ వలసిన నియమాలు :
1.కల్మా : దేవుడు ఒక్కడే అతనే అల్లా అని చాటి చెప్పాలి .
2.నమాజ్ : ప్రతీ దినం 5 సార్లు మక్కా నగరం వైపు తిరిగి ప్రార్ధనలు చేయాలి .
3.జకాత్ - అల్ల పేరిట పేదలకు దాన ధర్మాలు చేయాలి .
4.రోజా - పవిత్ర రంజాన్ మాసం లో సూర్యో దయం నుండి సూర్య అస్తమయం వరకు కఠిన ఉపవాస దీక్ష చేయాలి .
5 . హజ్ : ప్రతీ ముస్లీం జీవితంలో ఒక్క సారైన మక్కా నగరాన్ని దర్శించా;లి .
6.జీహాద్ : చెడుకి వ్యతిరేకంగా పవిత్ర యుద్దం చేయాలి .