రాజ పుత్ర యుగం (క్రీ.శ. 647-1206)

రాజ పుత్రులు క్రీ.శ 647 -1206 వరకు ఉత్తర భారత దేశాన్ని పాలించారు .
• అనగా హర్షుడి మరణించిన సoవత్సరం 647 నుండి డిల్లీ సుల్తానత్ స్థాపన(1206) వరకు పాలించారు .
• చాంద్ బర్దాయ్ పృద్విరాజ్ రానో అనే కావ్యంలో చౌహానులు , సోలంకీలు , 'పరహరులు ; ప్రతీహారులు అగ్ని గుండం నుంచి జన్మించినందు వలన " రాజ పుత్రులు అగ్నికుల క్షత్రియులని " పేర్కొన్నాడు
• కల్నల్ చార్లెస్ టాడ్ "ఏనల్స్ ఆఫ్ రాజ్స్థాన్ " అనే గ్రంధంలో రాజ పుత్రులు " హుణు , శక , కుషాణ అనే విదేశీ సంతతికి చెందిని వారు అని పేర్కొన్నాడు .
• సి.వి.వైద్య , జి.ఎన్.ఓషీ , దా" దశరధి శర్మ అనే చరిత్ర కారులు రాజ పుత్రులు స్వదేశీయులు సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు .
ప్రతిహారులు :-
• వీరినే పరిహారులు అంటారు . వీరి రాజధాని కనోజ్ .
• ఉత్తర భారత దేశంలో మొట్టమొదట రాజకీయాధికారాన్ని స్థాపించిన రాజపుత్రం వంశం - ప్రతి హార .
• వీరు మధ్య ఆసియాలోని 'ఘార్జర ' జాతికి చెందిన వారు
• ప్రతి హారుడు అంటే ద్వార పాలకుడు . వీరు శ్రీరామునికి ద్వార పాలకుడైన " లక్ష్మనుని "
• సంతతి వారని పేర్కున్నారు .
• వీరి తొలి రాజధాని భీన్ మల్ (జోధ్ పూర్) .
• రెండవ రాజధాని కనోజ్ .
• మొదటి నాగ భటుడు ప్రతి హార రాజ్యాన్ని స్థాపించాడు .
• మిహిరభోజుడు వీరిలో గొప్పవాడు.
• క్రీ.శ. 1018-19 లో గజినీ దండయాత్రతో ప్రతిహారుల పాలన అంతమయినది .
గహద్వాల వంశం / రాఠోరులు :-
• ప్రతి హారులు అంతరించటంతో క్రీ.శ. 1085 లో గహద్వాలులు కనోజ్ ను ఆక్రమించారు .
• ఈ వంశ స్థాపకుడు చంద్ర దేవుడు .రాజధాని కనోజ్ .
• ఈయన ముస్లింలతో పోరాడుటకి తరుష్క దండన అనే పన్ను వసూలు చేశాడు .
• ఈ వంశం లో చివరి రాజు జయచం ద్రుడు .
• జయ చంద్రుడి శత్రువు పృద్విరాజ్ చౌహన్ .
• నైషద చరిత్ర రచించిన శ్రీ హర్షుడు జయ చం ద్రుని ఆస్థానం లో నివసించేవాడు .
చౌహానులు :-
• వీరు ప్రతిహారులకి సామంతులు .
• వీరి మొదటి రాజధాని శాకoబరి .(తూర్పు రాజస్థాన్)
• క్రీ.శ. 956 లో సింహరాజ్ చౌహన్ నాయకత్వం లో సాంబార్ ప్రాంతంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నారు .
• రెండవ అజయ రాజు అజయ మేరు(ajmeer) నగరాన్ని నిర్మించాడు .
• సోమ దేవి కవి విశాల రాజు ఆస్థాన కవి .
• లలిత విగ్రహ రాజ నాటకం ఇతని రచన.
• పృద్విరజ్ చౌహాన్ చౌహాన్లలో అతి ప్రసిద్దుడు .
• ఈయన గహద్వల రాజైన జయ చంద్రుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు .ఇతని ఘోరి మహమ్మద్ తో రెండు యుద్దాలు చేశాడు .
• క్రీ.శ. 1191 మొదటి తరైన్ యుద్దం - ఈ యుద్దంలో ఘొరీ మహమ్మద్ ను ఓడించి తరిమేశాడు .
• క్రీ.శ 1192 రెండవ తరైన్ యుద్ధం - ఈ యుద్దంలో పృధ్వీరాజ్ ఓడి పోయి మరణించాడు .
• హిందూ జాతీయ వీరుడు - పృధ్విరాజ్ చౌహాన్ .
సోలంకులు /లాట చాళుక్యులు :-
• వీరు గుజరత్ రాజ్యాన్ని పాలించినారు . రాజధాని -అన్ హిల్ వాడ్ .
• ఈ వంశాన్ని స్థాపించింది - మొదటి మూల రాజు .
• జయ సిం హుడు ఈ వంశం లో గొప్ప పాలకుడు.
• మహ్మద్ ఘోరీని ఓడించిన సోలంకీ రాజు - రెండవ భీమ రాజు .
• సోలంకి వంశాన్ని నిర్మూలించినది గుజరాత్ ని పాలించిన వాఘేలా వంశస్థులు .
పరామరులు :-
• వీరినే పవార్ అని అంటారు .
• వీరు క్రీ.శ 8 వ శతాబ్దం లో మాల్వా ప్రాంతాన్ని పాలించారు .
• వీరు రాష్ట్ర కూటుకులకు సామంతులు .
• ఈ వంశ స్థాపకుడు ఉపేంద్రుడు /కృష్ణరాజు .
• మంజ రాజు / వాక్పతి రాజు ఈ వంశ రాజుల్లో గొప్పవారు .
• నవ సాహసాంక చరిత్ర రచించిన పద్మ గుప్తుడు , ధనిక హలాయుధ / ధాన రూప గ్రంధ రచయిత ధనుంజయుడు ఇతని ఆస్థానంలో ఉండేవారు .
• భోజరాజు ఈ వంశం లో అత్యంత ప్రముఖుడు .
• ఈయన 23 కి పైగా గ్రంధాలు రచించిన ఘనత ఈయనకి సొంతం .
• ఇతను తన రాజ్యంలో భోజ్ పురి భోపాల్ అనే నగరం నిర్మించి ,ఆ నగరం లో భోజశాల అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు .
చందేలులు :-
• చందేలులు మధ్య భారత దేశంలోని ఋందేల్ ఖండ్ అనే ప్రాంతంలో ప్రతిహారులకి సామంతులుగా ఉన్నారు .
• ఈ వంశ మూల పురుషుడు జయశక్తి .
• రాజధాని ఖజరహో .
• స్వతంత్ర చందేల రాజ్య స్థాపకుడు యశోవర్మన్ .
• ఈయన ఖజరహో చతుర్భుజ ఆలయాన్ని కట్టించాడు .
• యశోవర్మ ఆస్థాన కవి భవ భూతి మాలతీ మాదవం , ఉత్తర రామ చరిత్ర అనే గ్రంధాలు వ్రాసాడు .
• ధాంగరాజు ఖజురహోలో విశ్వనాథ,జివనాథ ,దీన నాథ ఆలయాలు నిర్మించాడు .
• ఇవి శృంగార శిల్పాలకు ప్రసిద్ధి.
• అల్లాఉద్దిన్ ఖిల్జీ దాడుల వలన ఈ రాజ్యం అంతమైంది .
కాల చూరులు :-
• వీరినే హైహయాలు అని అంటారు . ఈ రాజ్యాన్ని చేధి రాజ్యం అంటారు .
• వీరి రాజధాని తిపురి
• ఈ వంశ స్థాపకుడు కొక్కల్లుడు
తోమారులు :-
• 36 వ రాజ పుత్ర శాఖలలో ఒక శాఖ .వీరు హర్యాన ప్రంతం మీద ఆధిపత్యం వహించారు .
• అనంగపాల తువార్ డిల్లీని నిర్మించి , తోమర రాజ వంశాన్ని ప్రారంభించాడు .
పాల వంశం :-
• పాల వంశ స్థాపకుడు గోపాలుడు . ఇతనిని ప్రజలే ఎన్నుకున్నారు .
• రాజధాని -పాటలీపుత్రం
• ఇతడు ఒడంత పురి విహారాన్ని నెలకొల్పాడు .
• ధర్మ పాలుడు ఈ వంశంలో గొప్ప వాడు
• పాల వంశం ను అంతం చేసినది -సేన రాజులు .
• సేన వంశం : వీరు కర్నాటకా క్షత్రీయులని చెప్పుకున్నారు .వీరు మొదట పాల రాజురాజులకి సామంతులు .
• పరి పాలనా విశేషాలు : గుప్త పుష్య భూతి వంశస్థుల పాలనా విధానాలె వీరు అనుసరించారు .
• భూమి శిస్తు 1/6 వంతు గా ఉండేది.రాజపుత్రులు నిర్మించిన దేవాలయలు
• భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం
• పూరీ జగన్నాధ ఆలయం
• కోణార్క్ లోని సూర్య దేవాలయం
• కాశ్మీర్ లోని మార్తాండ్ సూర్య దేవాలయం
పరిపాలనా విశేషాలు :-
• గుప్త,పుష్యభూతి వంశస్థుల పాలనా విధానాలే వీరు అనుసరించారు .
• ప్రధానాదాయం భూమిశిస్తు 1/6 గా ఉండేది.
• సైన్యాధికారులకు జీతాలకు బదులు భూములు ఇచ్చేవారు .
• సమాజంలో 64 వర్ణాలు కలవు
• వీరి కాలం లో రాజ భాష -సంస్కృతం
• వీరు బలమైన కోటలు నిర్మించారు - గాల్వియర్ , కలింజర్ , అశీర్ ఘర్ .
• ఈ యుగంలో త్రి మతాచార్యులు హిందు మత వృద్దికి కృషి చేశారు .
• త్రిమతాచార్యులు - వారి సిద్ధాంతాలు
• శంకరాచార్యులు - అద్వైతం
• మధ్వా చార్యులు - ద్వైత సిద్దాంతం
• రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం .