రాష్ట్ర కూటులు

వీరు బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు .
• వీరు రాష్ట్ర కూట అనే ఉద్యోగం చేయుట వలన వీరికి ఆ పేరు వచ్చినట్లు చరిత్ర కారులు అభిప్రాయం .
• వీరి రాజధాని ఎల్లోరా తర్వాత మాన్యఖేటం .
• చాళుక్య రెండవ కీర్తి వర్మను దంతి దుర్గుడు ఓడించి రాజ్యాన్ని స్థాపించాడు .
మొదటి కృష్ణుడు :-
• ఇతను ఎల్లోరాలోని కైలాస నాధ ఆలయాన్ని నిర్మించాడు.
ధృవుడు :-
• ఇతని బిరుదులు నిరూపమ , కవి వల్లభ , ధాన వర్ష , శ్రీ వల్లభ , ప్రతీహార .
• ఇంధ్రాయుదుడు , పాల వంశ రాజు ధర్మ పాలుడిని ఓడించి కనోజ్ ను జయించాడు .
• ఈ విజయానికి చిహ్నంగా గంగా - యమునా తోరణాన్ని రాష్ట్ర కూట ధ్వజం పై చేర్చాడు.
అమోఘ వర్షుడు :-
• ఇతనిని నృపతుంగుడు అని కూడా పిలుస్తారు .
• ఇతను కన్నడ బాషలో కవి రాజ మార్గం , రత్న మాలిక అనే గ్రంధాలు వ్రాశాడు .రత్న మాలిక జైన గ్రంధం .
• కవి రాజ మార్గం కన్నడ భాషలోని మొదటి అలంకార గ్రంధం
• ఇతడు మాన్య ఖేటం అనే రాజధానిని నిర్మించాడు .
• ఇతని కాలం లో సులేమాన్ అనే అరబ్ యాత్రీకుడు వీరి రాజ్యానికి వచ్చాడు.
• కన్నడ కవిత్రయంలోని పొన్నకవి మూడవ కృష్ణుడి ఆస్థాన కవి .
• మాన్యఖేటాన్ని నాశనం చేసినది పరమార శియకుడు .
• రాష్ట్ర కూటులలో చివరివాడు రెండవ కర్కరాజు .
• ఇతనిని చాళుక్య తైలపుడు ఓడించి మాన్యఖేటాన్ని క్రీ.శ.973 లో ఆక్రమించాడు .
• వీరు సంస్కృత ,కన్నడ భాషలను ఆదరించారు .
• వీరి కాలలో వ్రాయ బడిన గ్రంధాలు :
హలాయుధుడు కవి రహస్యం
అమోఘ వర్షుడు కవి రాజ మార్గం
త్రివిక్రముడు నలచంపూ
వీరాచార్యుడు గణితసార సంగ్రహం
జీవసేన పార్శవాభ్యుదయం
పోన్న(కవి చక్రవర్తి ) శాంతి పురాణం
పంప ఆది పురాణం , విక్రమార్కుని విజయం
రన్న అజిత పురాణం , గదా యుద్దం (సాహస భీమ విజయం )
వీరు నిర్మించిన ఆలయాలు :- ఎల్లోరాలో దశావతార దేవాలయం - దంతి దుర్గుడు .
• ఎల్లోరాలో కైలాస నాధ ఆలయం - మొదటి కృష్ణుడు
• ఎలిఫెంటా ద్వీపం లో గుహాలయాలు .
కళ్యాణి చాళుక్యులు :-
• వీరి రాజధాని మొదట మాన్య ఖేటం , తర్వాత కర్నాటకాలోని బీదర్ జిల్లాలోని కళ్యాణి .
• ఈ రాజ్యాన్ని చాళుక్య రెండవ తైలపుడు రాష్ట్రకూట రెండవ కర్క రాజును ఓడించుట ద్వార స్థాపించాడు .
• ఇతని ఆస్థాన కవి రన్న .
• రన్న కవి బిరుదు కవి చక్రవర్తి .
• రన్న కవి రచనలు - గదా యుద్దం , అజాత పురాణం .
• కళ్యాణి నగరాన్ని మొదట సోమేశ్వరుడు నిర్మించాడు .
• ఓడించుట కాకతీయ మొదటి రాజు ఇతని సేనాని
• ఆరవ విక్రమాదిత్యుడు ఈ వంశం లో గొప్పవాడు .
• క్రీ.శ 1076 లో చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు .
• ఇతని ఆస్థాన కవి బిళణుడు విక్రమాంక దేవ చరిత్ర ,చౌర పంచాశిక అనే గ్రంధాలు రాశాడు .
• మూడవ సోమేశ్వరుడు అభిలాష ,తీర్ధ చింతామణి ,మానసోల్లాసం అనే గ్రంధాలు వ్రాశాడు.
• నాల్గవ సోమేశ్వరుడు చివరి పాలకుడు .
• కల్యాణి చాళుక్య రాజ్యాన్ని అంతం చేసినది -యాదవ భిల్లముడు