చోళులు

ప్రాచీన భారత దేశ రాజ్యాలలో చోళ రాజ్యం ఒకటి .
• సంగం రాజ్యాలలోని మూడు రాజ్యాలలో చోళ రాజ్యం ఒకటి . వీరిని ప్రాచీన చోళులు అందురు .
• నవీన చోళ రాజ్యాన్ని విజయాళాయుడు స్థాపించాడు .
• వీరి రాజధాని తంజావూరు .
• విజయాళయుడు తంజావూరులో ' విసoభ సూదిని ' ఆలయాన్ని నిర్మించాడు .
• ఆదిత్య చోళుడు చివర పల్లవ పాలకుడైన అపరిజిత వర్మను ఓడించి తోండై మండలాన్ని ఆక్రమించాడు .
మొదటి పరాంతక చోళ :-
• ఇతని పాండ్య రాజు రాజసిం హుణ్ణి ఓడించి పాండ్యుల రాజధాని మధురైను ఆక్రమించుకొని " మధురై కొండ " అనే పేరు ధరించాడు .
• ఇతను రాష్ట్ర కూట రాజులైన రెండవ కృష్ణున్ని పల్లాల యుద్దంలో ఓడించాడు .
• తక్కోలం యుద్దంలో మూడవ కృష్ణునిచే ఓడించబడ్డాడు .
• ఇతను ఉత్తర మేరుర్ శాసనం జారి చేశాడు .ఈ శాసనం చోళుల గ్రామీణ పరిపాలన గూర్చి తెలుపుతుంది .
రాజ రాజ చోళుడు :-
• ఇతని అసలు పేరు అరుమోళి వర్మ
• ఇతని బిరుదులు - జయకొండ , చోళ మార్తాండ , ముమ్ముడి చొళ , కేరళాంతక , శివ పాద శేఖర .
• ఇతను తంజావూరులో బృహదీశ్వర ఆలయం లేదా రాజ రాజేశ్వర ఆలయం నిర్మించాడు . దీని ఎత్తు 216 అడుగులు .
• ఈ ఆలయం 2009 సo|| లో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది .
• వేంగీ పాలకుడు రాజరాజ నరేంద్రునికి తన కుమార్తె కుందవ్వనిచ్చి వివాహం జరిపించాడు .
• వీరికి జన్మించిన వాడే రాజరాజ నరేంద్రుడు .
• శ్రీ విజయ సామ్రాజ్య పాలకుడు శ్రీ కుమార విజయ తుoగకు నాగ పట్నంలో చూడామణి బౌద్ధ విహారం నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు .
• ఆగ్నేయాషియాలో మలయా,జావా,సుమత్రా దీవులలో వ్యాపించి ఉన్న రాజ్యమే శ్రీ విజయ .
• ఈ విహారానికి రాజరాజు అనై మంగళం అనే గ్రామాన్ని దానం గా ఇచ్చాడు .
• సిం హళం పై దండెత్తి 5 వ మహేంద్రుడిని ఓడించాడు .
• ఉత్తర సిం హళం లో పోలో న్నరువ అనే రాజధాని నగరం నిర్మించాడు .
• ఉత్తర సిం హళానికి ముమ్ముడి చోళ మండలం అని పేరు పెట్టాడు .
మొదటి రాజేండ్రుడు :-
• ఇతని బిరుదులు - గంగై కొండ , కడారం కొండ , త్రీ సముద్రాదీశ్వర .
• గంగా నదీ తీరాన పాలవంశ రాజు పాలుడును ఓడించి గంగై కొండ అనే పేరు పొందాడు .
• కావేరీ నదీ తీరమున గంగై కొండ చోళపురం అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించాడు .
• ఇతని కాలంలో బంగాళాఖాతమునకు కు చోళ సముద్రం అనే పేరు ఏర్పడింది .
• ఆది రాజేంద్రుడు(1067-1070) చివరి చోళ రాజు .
• ఇతని మరణం తర్వాత చోళ రాజులు లేక పోవటం తో వేంగి రాజు రాజ రాజ నరేంద్రునకు అమ్మంగదేవికి జన్మించిన రాజేంద్ర కులుత్తంగ చోళుని పేరుతో క్రీ.శ.1070 లో చోళ సిం హా సనాన్ని అధిష్టించాడు .
చోళ చాళుక్యులు :-
• కులోత్తుంగ చోళులు అతని వారసులను చోళ - చాలుక్యుళుగా వ్యవహరిస్తారు .
• కులోత్తుంగుడు వేంగీ చాళుక్య రాజ్యాన్ని చోళ రాజ్యంలో విలీనం చేశాడు .
• ఇతనిని "సంగం తివర్త " గా పిలుస్తారు .

• ఇతడు కులోత్తుంగ చోళపురం (విశాఖ పట్టణాన్ని ) నిర్మించాడు.
• ఇతని ఆస్థాన కవి జయ గోండార్ కళింగ పట్టుపరణి అనే గ్రంధాన్ని రచించాడు .
• ఇతను శైవ మతస్థుడు .వైష్ణవులను బాధించాడు .
• ఇతడి వేధింపులకు తట్టుకోలేక రామానుజుడు హోయ సాల రాజ్యానికి పారిపోయాడు .
• 3 వ కులోత్తుంగుని కాలం లో కవి చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన కంబన్ తమిళంలో రామాయణాన్ని రచించినాడు .
• ఈయన కాలం లో శెక్కిలార్ అనే తమిళ కవి వ్రాసిన తిర్తుత్తోండర్ పురాణం /పెరియ పురాణం శైవ మతానికి తలమానికం వంటిది .
• దీనిని తమిళం లో పంచమ వేదం అంటారు .
పరిపాలన :-
• వీరి సచివాలయానికి పెరు మండ్రం అని పేరు . దీనికి అధిపతి-ఓలీయ నాయకుం
• వీరు రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు . మండలాలు - పల్నాడులు - నాడు - కుర్రం - గ్రామాలు .
• గ్రామాలలో ఉర్ ,సభ , నగరం అనే సభలుండేవి .
• గ్రామాన్ని 30 వార్డులుగా విభజించే వారు . వార్డులని కుటుంబాలు అంటారు .
• వార్డు సభ్యులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసేవారు .
• పండిన పంటలో 1/3 వ వంతు భూమి శిస్తు గా వసూలు చేసేవారు .
• గ్రామ సంఘం లో 30 మంది సభ్యులు ఉండేవారు .
• రాజు సైన్యమును కైక్నోలుర్ అని అంటారు .
• సైనిక దళాలుండే ప్రాంతమును కడగం అని పిలుస్తారు .
• రాజు అంగ రక్షకులను వేలైక్కారన్ అని పిలుస్తారు .
• ఈకాలానికి ప్రముఖ రచనలు
• నానార్ధవ సంక్షేమ - కేశవ స్వామి
• జీవక చింతామణి - తిరుక్క దేవర
• కళింగ పట్టపు రాణి -జయగోండార్
• యాప్పరుంగళం - అమిత సాగరుడు
• ఋగ్వేద భాష్యం - వెంకట మాధవుడు
• శ్రీ భాష్యం - రామానుజాచార్యులు
• పెరియ పురాణం -సెక్కిలార్
• వీరు ప్రధానం గా శైవులు
• వీరి కాలం స్థానిక పరిపాలనకు స్వర్ణ యుగం .
• వీరి కాలం తమిళ భాషకు స్వర్ణయుగం
• నటరాజ కాంస్య విగ్రహా తయారీ వీరి కాలం లోనే ఆరంభమైనది .
• చిదంబరం లో అతి పెద్ద నటరాజ విగ్రహం కలదు .
• వీరి రాజ చిహ్నం వృషభం .