Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Click Here for AP Dsc MOck Test Series


AP TET 2024: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?




AP dsc Topic wise (lesson Wise Tests) , Mega Grand tests లో కోసం 9492614463 కు సంప్రదించండి
→ ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) కొత్త నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది.

→ జులై 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి.. 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

→ నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

→ అదనపు సమాచారం కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

→ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్‌ నిర్వహించగా.. 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు.

→ అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

→ డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంది.