ప్రధాన భూస్వరూపాలు

పర్వతాలు

→ 900 m అంతకన్నా ఎక్కువ ఎత్తుకలిగి, అంచులు ఎక్కువ వాలును కలిగి, శిఖర భాగాలు తక్కువ విస్తీర్ణంతో మొనదేలి ఉండి, భూమి యొక్క క్షితిజ తలంతో దాదాపు 45° కోణం చేస్తున్నట్లయితే దాన్ని" పర్వతం" అంటారు.

→ 900m కన్నా కొద్దిగ తక్కువ ఎత్తుగల పర్వతాలు "కొండలు".

→ పర్వతాలను గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం : ఓరీజెనీ (orogeny)

→ పర్వత ఉద్భవ విధానాన్ని అనుసరించి వాటిని '4' ప్రధాన రకాలుగా విభజించడమైనది అవి :-

1. ముడుత పర్వతాలు
2. ఖండపర్వతాలు
3. ఆపశిష్ట/పరిశిష్ట పర్వతాలు
4. అగ్ని/సంచిత పర్వతాలు

ముడుత పర్వతాలు

→ ఇవి ఏర్పడటంలో ఇమిడివున్న బలాలు 'సంపీడన బలాలు

→ ఇవి ప్రధానంగా అవక్షేప శిలలచే ఏర్పడివున్న భూభాగాల్లో ఉద్భవించాయి.

→ ఇవి ఏర్పడిన కాలాన్ననుసరించి '2' రకాలు:-

పురాతన ముడుత పర్వతాలు :-
→ ముడుత పర్వత నిర్మాణ క్రమంలో అనగా దాదాపు 250 మిలియన్ సం॥లకు పూర్వం ఏర్పడిన పర్వతాలు,

-EX:
→ రాజస్థాన్ - ఆరావళీ పర్వతాలు
→ North అమెరికా - అపలేచియన్ పర్వతాలు
→ రష్యా - యూరల్ పర్వతాలు
→ ఆస్ట్రేలియా- గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు (వీటి దక్షిణ) భాగాన్ని 'ఆస్ట్రేలియన్ ఆర్ట్స్' అని పిలుస్తారు. (ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియాల్ కెళ్తే ఎత్తైన శిఖరం' కేషియాస్కో ఉంది.)

నవీన ముడుత పర్వతాలు:-
→ ముడుత పర్వత నిర్మాణ క్రమంలో ఇటీవల అనగా 30-50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం టెర్షియర్ కాలంలో ఏర్పడిన పర్వతాలు.

ఉదా:-
→ భారత ఉపఖండం - హిమాలయ వ్యవస్థ
→ North america - రాకీ పర్వతాలు
→ ద. అమెరికా - ఆండీస్ పర్వతాలు
→ ఐరోపా - ఆల్ఫ్స్ పర్వతాలు

ఖండ పర్వతాలు

→ ఇవి ఏర్పడటంలో ప్రధాన పాత్ర వహించే బలాలు- 'తన్యతా బలాలు.' (తన్యతాబలాలు -"ఒకదానికొకటి ఎదురుగా పయనించే బలాలు")
Ex :
→ భారతదేశం - వింధ్య, సాత్పురా పర్వతాలు
→ ఫ్రాన్స్ - వాస్ జెస్ పర్వతాలు.
→ జర్మనీ - బ్లాక్ ఫారెస్ట్
→ South Africa - డ్రాకెన్స్ బర్గ్ పర్వతాలు

→ ఖండ పర్వతాలనే "భ్రంశస్థిత శిలావిన్యాసం / Horst శిలావిన్యాసం' అని పిలుస్తారు.

→ ఖండ పర్వతాలతో పాటు పగులు లోయలు (Rift valley) శిలా విన్యాసాలు ఏర్పడుతాయి.

→ Ex: 1. వింధ్య-సాత్పురా పర్వతాల మధ్య వున్న నర్మదా పగులులోయ. ఈ లోయగుండా '4' నదులు ప్రవహిస్తాయి.

అవి:- నర్మదా - సోన్ , తపతి- దామోదర్
2. ఐరోపాలో వాస్ జెస్ & బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య రైన్ నదినది ప్రవహించే పగులు లోయ

3. ఎర్ర సముద్రం విస్తరించివున్న పగుబలోయ.

4. కాలిఫోర్నియాలోని మృతలోయ

5. ప్రపంచంలో అతిపెద్దదైన నైలునది ప్రవహించే పగులులోయ.

అవశిష్ట పర్వతాలు

→ ఒకప్పుడు ఎక్కువ ఎత్తుగా ఉండి బహిర్ జనిత బలాల క్రమక్షయ చర్యల వల్ల శిథిలమై ప్రస్తుతం చిన్నచిన్న గుట్టల రూపంలో మిగిరిపోయిన అవశేషాలనే 'అవశిష్ట పర్వతాలు' అని పిలుస్తారు.

→ రాజస్థాన్ - ఆరావళీ పర్వతాలు
→ జార్ఖండ్ - రాజ్మహల్ కొండలు
→ తమిళనాడు - నీలగిరులు

అగ్నిపర్వతాలు /సంచిత పర్వతాలు

→ ఇవి అన్ని పర్వత ప్రక్రియవల్ల ఏర్పడుతాయి.
→ జపాన్ - ఫ్యూజియామా
→ ఇటలీ - వెసూవియస్

పీఠభూములు

→ సముద్ర మట్టం నుండి దాదాపు 300 మీ ఎత్తుకలిగి ఉపరితలాలు ఇంచుమించు సమతలంగా ఎక్కువ విస్తీర్ణంతో ఉండి, అందులు వీలును కలిగి భర్మాలజ తలంత దాదాపు 10° కోణం చేస్తున్నట్లయితే వాటినీ 'పీఠభూములు' అంటారు.

→ పీఠభూములు ఏర్పడే విధానాన్ని అనుసరించి నాలుగు ప్రధాన రకాలు : అవి

పర్వతాంతర పీఠభూములు

→ చుట్టూ పర్వతలచే ఆవరించబడివున్న పీఠభూములు..

Ex:-ప్రపంచంలో అత్యంత ఎత్తయిన టిబెట్ పీఠభూమి దీనినే "ప్రపంచ పైకప్పు (Roof of the World) అంటారు.

→ ద. అమెరికాలోని బొలీవియా పీఠభూమి.

→ North America లో మెక్సిక్ పీఠభూమి.
→ మంగలియాలోని మంగోలియన్ పీఠభూమి.

పర్వతపాదగిరిపద పీఠభూములు

→ వీటికి ఒకవైపున పర్వతము, మరోవైపున మైదానంగానీ లేదా సముద్రాలు గానీ సరిహద్దుగా ఉంటాయి.
→ ఆ కొలరాడో పీఠభూమి. - U.S.A
→ దీనిపై ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అగాథధరి ఉంది. దీనినే (కొలరాడో నదిలో) "Grand Canyan of colarado అని పిలుస్తారు.

→ పెటగోనియా వీఠభూమి - అర్జెంటీనా

Ex:-
→ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నది ప్రవహించే " బైసనగార్జ్"
→ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మాపుత్ర నది ప్రవహించే "దిహాంగ్ గార్జ్ "
→ 'అగాథధరులు' అనగా నిట్టనిలువు గోడలు కలిగిన అతిలోతైన లోయలు.

లావా పీఠభూములు

→ అగ్నిపర్వత ప్రక్రియలో క్షారలావా భూఉపరితలంపై విడుదలయి ఘనీభవించుట వలన ఇవి ఏర్పడినవి.

అవశిష్ట పీఠభూములు

→ Ex:- భారతదేశం > ఛోటానాగపూర్ పీఠభూమి
→ దీనినే "Rhor of India " అనీ," ఖనిజాల కానాచీ" అని పిలుస్తారు.

→ వజీరాబాగ్ & రాంచీ పీఠ భూమి (రాగి నిల్వలు అధికం ) మరియు కోడెర్మా పీఠభూమి (దేశలలో మైకా నిల్వలు అధికం)

→ మధ్య ప్రదేశ్ బాదల్ ఖండ్ పీఠభూమి

→ దేశంలో అతిపెద్ద పన్నా వజ్రపు గనులు)

→ బంగారం & నికెల్ లాంటి ఖనిజాలు అవశిష్ట పీఠభూమి ప్రాణాల్లో లభ్యమౌతాయి.

Ex:-
ప్రపంచంలో అతిపెద్దదైన డు. ఆఫ్రికాలోని విట్విటర్స్ ర్యాండ్ బంగారుగని.

→ ఆస్ట్రేజియా - కూల్ గార్లి &కూల్ గార్డి బంగారు గనులు

→ అనంతపూర్ - రామగిరి బంగారు గని

→ కర్నాటక-కోలార్ & హట్టి గనులు

మైదానములు

→ సముద్ర మట్టానికి సమతలంగా గానీ లేదా కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి విశాలమైన పల్లపు ప్రాంతాలు 'మైదానాలు'

నదీ క్రమక్షయ మైదానాలు :
1) పెనిప్లేన్స్ :-
→ "నదీ క్రమక్షయ చర్యవలన ఏర్పడిన మైదానాలు" - పెనిప్లేన్స్, పెనిప్లేన్ మైదానాలలో అక్కడక్కడా మిగిలిపోయిన ఒంటరి & కఠిన శిలా భాగాలు / బోడిగుట్టలనే "మొనాడ్నాక్స్" అని పిలుస్తారు.

నదీ నిక్షేపణ మైదానాలు :-
→ నదీ నిక్షేప చర్యవల్ల తన ప్రవాహ మార్గంలో 3 రకాల మైదానాలు ఏర్పడతాయి.

పీడ్ మౌంట్ :-
→ నదులు పర్వతప్రాంతం వదిలి మైదానంలో కలిసేవారు. ఇసుక, గులకరాళ్లచే విసనకర్ర ఆకారంలో ఏర్పడే మైదానాలు.

వరద మైదానాలు :-
→ నదులు మైదానం గుండా ప్రవహించటప్పుడు నడగట్లకు ఇరువైపులా ఒండ్రుమట్టి నిక్షేపణ వల్ల ఏర్పడేవి.

డెల్టా మైదానాలు:-
→ నదులు సముద్రాలలో కలిసే చోట గ్రీకు అక్షరమయిన 'Delta' ఆకారంలో ఏర్పడే సారవంతమైన మైదానాలు.
→ డెల్టా మైదానాల ఆకారాన్ని అనుసరించి వాటిని క్రింది విధంగా విభజించవచ్చు.
a) పక్షి పాద డెల్టా - మిసిసిపి- మిస్సోరీ నది డెల్టా (U.S.A)
b) డిజిటల్ డెల్టా - గంగానదీ డెల్టా
c) లో బెల్ట్ డెల్టా - మహానదీ డెల్టా
d) కస్పేట్ డెల్టా - విస్తులానదీ (పోలండ్ ) , ఎల్బీనది (జర్మనీ)
పవన క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు :
పెడిప్లేన్:
"ఎడారి భౌగోళిక ప్రాంతాలలో పవన క్రమక్షయ చర్యవల్ల ఏర్పడే మైదానాలు.” ఈ మైదాన ఉపరితలాలు రాళ్లచే కప్పబడి ఉన్నట్లయితే ఆ రాతి మైదానాలను "హమ్మడాలు / Reg/ అని పిలుస్తారు. మందమైన ఇసుక పొరచేత కప్పబడి ఉన్నట్లయితే ఆ ఇసుక మైదానాలే " Ergs ".

పవన నిక్షేపణా మైదానాలు:-
లోయస్ మైదానాలు:-
→ అనార్ద్ర శీతోష్ణస్థితి ప్రాంతాల్లో పవన నిక్షేప చర్యవలన ఏర్పడే పసుపు వర్ణ మైదానాలు.
→ ప్రపంచంలో అతిపెద్ద లోయస్ మైదానం వాయువ్యచైనా ప్రాంతంలో ఉంది.
→ ఈ ప్రాతంగుండా చైనా దుఃఖదాయని హాయంగ్ హో నది ప్రవహిస్తున్నందున నదీజలాలు పసుపు వర్ణంలో కన్పిస్తాయి. అందుకే ఈ నదిని 'పసుపునది ' అంటారు. చివరకు ఈ నదీ జలాలు చైనా తూర్పు తీరాన్ని అనుకొనివున్నా పసిఫిక్ జలరాశిలో కన్నా కలుస్తున్నందున అవి పసుపు వర్ణంలో కన్పిస్తాయి. అందువలన ఆ పసిఫిక్ జలరాశిని " పసుపు సముద్రం ” అని పిలుస్తారు.

బార్కన్స్ (BARCONS) :-
→ ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో పవన విక్షేపణ చర్య వల్ల ఏర్పడే "అర్ధ చంద్రాకార "ఇసుక దిబ్బలు.
సైఫ్లు :-
→ ఎడారి భౌగోళిక ప్రాంతాలలో పవన నిక్షేపణా చర్య వలన ఏర్పడే ' కత్తి ఆకారపు ఇసుక దిబ్బలు.
అంతర్భూజల క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు :-
→ సున్నపురాయి భౌగోళిక ప్రాంతాల్లో అంతర్ భూజల క్రమక్షయ చర్య వలన ఏర్పడే ఎర్రనేలలను " టెర్రరీసా" అని పిలుస్తారు. భారత్లోని లేటరైట్ నేలలు/జేగురు నేలలు వీటిని పోలివుంటాయి..

అంతర్భూజల నిక్షేపణాచర్య వల్ల ఏర్పడే భూస్వరూపాలు : -
a) స్టాలక్ టైట్స్ : "అంతర్ భౌమ గుహల పైకప్పు నుంచి మర్రిచెట్టు ఊడలవలె క్రిందకు వేలాడే శిలా నిర్మాణాలు

b) సాలగె మైట్స్ : అంతర్ భౌమ గుహల అడుగు భాగం నుండి పాము పుట్టవలె పైకి పెరిగే శిలా నిర్మాణాలు

→ అంతర్భుజల క్రమక్షయ విక్షేప చర్యవల్ల ఏర్పడే భూస్వరూపాలన్ని "కార్డ్స్ భూస్వరూపాలు" అని పిలుస్తారు.

→ ఉన్నత అక్షాంశ ప్రాంతాలలో హిమానీ నద క్రమక్షయ చర్యవలన ఏర్పడే మైదానాలను "DRIFT / గోళాత్మ మృత్తిక మైదానాలు " అని పిలుస్తారు.