భూమి అంతర్ నిర్మాణము

→ భూకంప తరంగాలు మరియు ఉల్కాపాతాలు లాంటి పరోక్ష ఆధారాల ద్వారా భూవిజ్ఞాన శాస్త్రజ్ఞలు భూ ఉపరితలం నుండి కేంద్రం వైపు వెళ్ళే కొలదీ ఏనోస్పియర్ ప్రతిబలరహిత ఆవరణం క్రింద తెలిపిన మార్పులు జరుగుతాయని పేర్కొనడమైనది. అవి:
1. ప్రతీ 32 మీ. లోతుకెళ్ళేకొద్దీ ఉష్ణోగ్రతలు 1°C చొప్పున పెరుగును.
2. భూమి యొక్క విశిష్ట సాంద్రతలు & పీడనా బలాలు భూకేంద్రంవైపు క్రమంగా పెరుగును.
3. భూవ్యాసార్థం దాదాపు 6400 km ఉంటుంది.
4. భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు 6000°C వరకూ ఉంటాయని అంచనా.

→ పై లక్షణాలను ఆధారంగా చేసుకొని సూయెస్ అను Geologist భూ అంతర్ నిర్మాణాన్ని SIAL, SIMA, NIFE అనే '3' పారలుగా విభజించారు.
→ వాండర్ గ్రాచ్ & గుటిన్బర్గ్ అను శాస్త్రవేత్తలు భూ అంతర్ నిర్మాణాన్ని '4' పారలుగా విభజించారు.
→ పై వర్గీకరణల ఆధారంగా భూ అంతర్ నిర్మాణాన్ని క్రింద తెలిపిన '3' ప్రధాన భాగాలుగా విభజించడమైంది. అవి :

i. భూపటలము (or) శిలావరణము
ii. భూ ప్రావరాము (or) మీసోస్పియర్
iii. భూకేంద్ర మండలము

భూపటలము

→ భూ ఉపరితలం నుండి సగటున 40 km లోతువరకు విస్తరించివున్న ఘన స్థితిలోని భూమి యొక్క బాహ్యపార".
→ భూపటల ఉపరితలంపై '2' ప్రధాన భాగాలను గుర్తించవచ్చు.

అవి:
ఖండ భూభాగాలు :-
→ ఇవి ప్రధానంగా సిలికాన్ (Si), అల్యూమినియం (Al) మూలకాలచే ఏర్పడి వున్నందున సూయస్ అను శాస్త్రవేత్త వీటిని "SIAL pora" అని పిలిచారు.
→ ఇవి తేలికైన గ్రానైట్ శిలలచే ఏర్పడి SimA పారపై తేలియాడుతున్నట్లు కన్పిస్తాయి.
→ విశిష్ట సాంద్రత : 2.9 - 3.0 వరకు ఉంటుంది.

సముద్ర భూతలాలు :-
→ ఇవి ప్రధానంగా 32, మెగ్నీషియం మూలకాలచే ఏర్పడి వున్నందున సూయ వీటిని "SIMA పార" అని పిలిచారు.
→ ఇవి బరువైన బసాల్ట్ శిలలచే ఏర్పడి ఉంటాయి.
→ విశిష్ట సాంద్రత : 3.0 - 3.5 వరకు ఉంటుంది.
→ SIAL & SIMA పొరలను వేరు చేస్తున్న పలుచని భూభాగాన్ని "Candrid Dis-continuity" అని పిలుస్తారు.

భూప్రావారము

→భూపటలం నుండి సగటున 2900 km లోతువరకు విస్తరించివున్న భూఅంతర్భాగం.

→ దీని విశిష్ట సాంద్రత : 3.5 - 5.5 వరకు
→ దీనిని '2' భాగాలుగా విభజించవచ్చు. అవి :

1) ఎగువ ప్రావార పొర :
→ 100 km మందమును కలిగి పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది.
→ అందువలన భూపటలము & ఎగువ ప్రావారపు పొరలను కలిపి "శిలావరణము" అని పిలుస్తారు.

2) దిగువ ప్రావార పొర :
→ ఇది సిలికేట్స్ మిశ్రమంచే ఏర్పడి ఉన్నందున దీనిని 'అంతర్ సిలికేట్ పొర” అని పిలుస్తారు.
→ ఇది జెల్లీ స్థితి " (పాక్షిక ఘన, ద్రవ) లో ఉంటుంది.
→ ఎగువ ప్రావారపు పొరకు, దిగువ ప్రావారపు పోరకు మధ్యలో ప్లాస్టిక్ ధర్మం కలిగిన 90 km మందం కలిగివున్న భూభాగాన్ని ఏస్తనోస్పియర్ ఆవరణం" అంటాడ
→ దీనిపై శిలావరణ ఫలకాలు కదులుతూ, తేలియాడుతూ ఉంటాయి.
→ భూపటలాన్ని, భూప్రావారాన్నే వేరుచేసే సరిహద్దు పార" మోహరేనిక్/ మెహో Dis continuity "

భూకేంద్ర మండలము

→ " భూప్రావారము నుండి దాదాపు 3300 km లోతువరకు విస్తరించివున్న భూ అంతర్భాగము
→ ఇది ప్రధానంగా సికెల్, ఐరన్ మూలకాలచే ఏర్పడి వున్నందున సూయెస్ దీనిని "NIFE పార" అని పించారు.
→ విశిష్ట సాంద్రత: 11 - 13 వరకు
→ దీన్ని '3' భాగాలుగా విభజించడమైంది. అవి :

a) బాహ్య భూకేంద్రమండలం :- ద్రవస్థితిలో ఉంటుంది.
b) మధ్య భూకేంద్రమండలం :- Colloidal స్థితిలో ఉంటుంది.
c) అంతర్ భూకేంద్రమండలం :- ఘన స్థితిలో ఉంటుంది.
→ భూప్రావారాన్ని, భూకేంద్రమండలాన్నీ వేరుచేస్తున్న సరిహద్దు పొర ను "గుటెన్ బర్గ్ Discontinuity " అంటారు.
→ భూపటంలో అధిక శాతంలో గల మూలకం : -
1. ఆక్సిజన్ - 46%
2. సిలికాన్ – 27%
3.అల్యూమినియం- 8.5%.
4. ఐరన్ - 6%→ భూపటలంలో అధికంగావున్న సమ్మేళనం: సిలికా (సిలికాన్ డై ఆక్సైడ్ - Sio2
→ భూమిలో అధికంగావున్న మూలకం : ఐరన్