టైగామండలంఉనికి :-
→ 55° - 70° ఉత్తర అక్షాంశాల మధ్య

విస్తరణ:-
→ అలస్కా, కెనడా ఉత్తర ప్రాంతాలు
→ స్కాండినేవియా దేశాల ఉత్తర ప్రాంతం
→ రష్యాలోని సైబీరియా ప్రాంతం
శీతోష్ణస్థితి:-
→ సం.లో 8-9 నెలల కాలం 0° - 10v వరకూ ఉంటాయి.
→ మిగిలిన 3 నుంచి 4 నెలల కాలం. 10°c కన్నా కొద్దిగా ఎక్కువ.

→ రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉ. గళంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వెర్ కోయాన్ స్కీ అనే ప్రాంతం ఉంది. దీన్ని" శీతల ధృవం" అని పిలుస్తారు,

→ సైబీరియా ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు ఉంది.

వృక్ష సంపద:
→ ఈ శీతోష్ణస్థితి ప్రాంతంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శృంగాకార అడవులు విస్తరించివున్నాయి. ఈ ప్రాంతంలో పెరిగే వృక్షాలు మొత్తని కలపనిస్తాయి. అవి :

* సిల్వర్ ఫర్

* పైన్

* విల్లోస్

* దేవదారు

వ్యవసాయరంగం :-
→ వేసవిగా పిలవబడే 3 నుంచి 4 నెలల కాలంలో తక్కువ కాలవ్యవధి కలిగిన చిలగడ దుంపలు, బీట్రూట్స్, బఠాణీలు, పై, ఓట్స్ వంటి పంటలు సాగుచేస్తారు.

ప్రజల ముఖ్య వృత్తి :-
→ "లంబరింగ్ ". అనగా వృక్షాలను నరికివేసి వాటి కాండాల నుండి కొయ్యగుజ్జును తయారుచేసే విధానము.

→ స్వీడన్ లోని గల్లీవర్, కిరువా అను ప్రాంతాలలో ప్రపంచంలో కెల్లా నాణ్యమయిన చూగ్నటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజం లభ్యమౌతుంది.

→ ఉ. ధృవానికి అత్యంత నమోపంలో గల నగరం : ముర్మనాస్ (సైబీరియా)

టాండ్రా శీతోష్ణస్థితి :-
→ టాండ్రా ప్రాంతాలనే " మంచు ఎడారులు" అని పిలుస్తారు.

→ 66 1/2° - 90° ఉత్తర, దక్షిణ అక్షాంశాలమధ్య;

విస్తరణ:-
→ అలస్కా, కెనడాలలోని ఉత్తరపు అంచులు

→ గ్రీన్లాండ్ తీరప్రాంతాలు

→ స్కాండినేవియన్ దేశాల ఉత్తరపు అంచులు

→ సైబీరియా ఉత్తర ప్రాంతం

శీతోష్ణస్థితి :-
→ సంవత్సరములో 8 నుంచి 9 నెలల కాలం ఉష్ణోగ్రతలు O°C వరకూ ఉంటాయి.

→ మిగిలిన 3 నుంచి 4 నెలల కాలం 10°C వరకు ఉంటాయి.

→ శీతాకాలంలో ఈ ప్రాంత భూభాగమంతా "బ్లిజ్జర్డ్" తీవ్రత ఎక్కువ.

→ పెద్ద వృక్ష జాతులుండవు, అయితే మంచు పగుళ్లలోను, రాత్రి పగుళ్లలోనూ పెరిగే 'లైచెన్స్ ' జాతికి చెందిన నాచులు వివిధ వర్ణాలలో స్థూలమొక్కల వలె కన్పిస్తుంటాయి.

→ వీటినే పాపీలు", "లిల్లీలు", "వయోలెక్స్", 'బటర్ ఏసీ" అని పిలుస్తారు.

జంతు సంపద :-
→ ధృవపు జింకలు (కారీబా)

→ ధృవపు కుక్కలు, నక్కలు

→ ఉ. ధృవానికి మాత్రను పరిమితమై నివసించే 'ధృవపు ఎలుగుబంట్లు. ప్రాంతాలలో నివసించే అత్యంత క్రూర జంతువు)

→ కస్తూరి మృగాలు
→ ద. ధృవానికి మాత్రమే పరిమితమైన పెంగ్విన్ పక్షులు, మరియు సీల్ చేపలు మరియు వాల్ రస్ చేపలు

→ ఈ ప్రాంతాల్లో నివసించే జంతువుల శరీరంపై తెల్లటి మందమైన, దట్టమైన రోమాలు ఏర్పడి వుండి. బిజార్డ్స్ ప్రభావాన్ని నియంత్రిస్తూ వాటి శరీరాలను వెచ్చగా ఉంచుతాయి

ఆదిమతెగలు :-
→ అలస్కో, కెనడా, గ్రీన్ లాండ్ (ప్రాంతాల్లో నివసించే టండ్రా వాసులు "ఎస్కిమోలు".

→ వీరి ప్రధాన వృత్తి :- వేట& చేపలు పట్టడం.

→ శీతాకాలంలో వీరు మంచుతో నిర్మించుకొనే అర్థచంద్రాకార ఇండ్లు " ఇగ్లూలు".

→ రవాణాకు ఉపయోగించే కుక్కలు లాగే బండ్లు " స్లెడ్జ్ బండ్లు "

→ చేపలు పట్టడానికి వాడే పడవలు -ఉమియాక్స్

→ ఇగ్లులలో వెలుతురు కొరకు దీపాలు వెలిగించుటకు ఉపయోగించే నూనెను సీల్ చేపల నుండి తయారు చేస్తారు.

→ స్కాండినేవియా దేశాల్లో నివసించే టండ్రావానులు " లాప్స్"

→ వీరి కామధేనువుగా పిలవబడే జంతువు 'ధృవపు జింక . దీనినే శీతల ఎడారి ఓడ అని పిలుస్తారు.

→ సైబీరియ ప్రాంతాల్లో నివసించే ఆదిమ తెగలు: - చుక్ చీస్ , సమోయిడ్స్ ,యాకూట్స్

→ ఈ ప్రాంతాల్లో వేసవిలో చేపలకొరకు గుంపులుగా చేరివుండే పక్షులనే ' రూకరీలు' అని పిలుస్తారు.