వాతావరణ ఆర్ద్రత

→ వాతావరణంలోని నీటి ఆవిరి " ఆర్ద్రత.

→ ఆర్ద్రతను హైగ్రోమీటర్ అను పరికరంతో కొలుస్తారు.

→ వాతావరణంలోని వావరణంలో ఆర్ద్రతా పరిమాణం 0.2gm/cc నుంచి 4gm/cc వరకూ ఉంటుంది.

→ భూమ్మీద గల జలాశయాలు, వృక్ష సంపద & మంచు ప్రాంతాల నుండి భాష్పీభవనం, భాష్పోత్సేకము & ఉత్పతనము అను ప్రక్రియల ద్వారా వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.

→ వాతావరణ అర్ద్రతను 3 సూచికల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది.

1. నిరపేక్ష ఆర్ద్రత
2. విశిష్ట ఆర్ద్రత
3. సాపేక్ష ఆర్ద్రృత

నిరపేక్ష ఆర్ద్రత :-
→ ఒక ఉష్ణోగ్రత వద్ద 1 ఘ, సెం.మీ. గాలిలోని నీటి ఆవిరి బరువు నే 'నిరపేక్ష ఆర్ద్రత' అంటారు. దీన్ని గ్రా./ఘ.సెం.మీ అను ప్రమాణాలలో తెల్పుతారు. ఇది ఉష్ణోగ్రతకు అనులోమంగా ఉంటుంది.

విశిష్ట ఆర్ద్రత :-
→ ఒక కి. గ్రా. గాలిలోని నీటి ఆవిరి బరువును "విశిష్ట ఆర్ద్రత" అంటారు. ఇది ఆ ప్రాంతంలోని వాతావరణ పీడనానికి సమానం. విశిష్ట ఆర్ద్రతకు ప్రమాణాలు ఉండవు

సాపేక్ష ఆర్ద్రత:-
→ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గాలిలోని నీటి ఆవిరి బరువుకు, అదే ఉష్ణోగ్రత వద్ద గాలి గరిష్టంగా నిలుపుకోగల నీటిఆవిరి బరువుకూ గల నిష్పత్తిని "సాపేక్ష ఆర్ద్రత" అంటారు.

→ సాపేక్ష ఆర్ద్రతను ఎల్ల ప్పుడూ శాతాలలో వ్యక్తం చేస్తారు.

→ సాపేక్ష ఆర్ద్రత ఒక భౌగోళిక ప్రాంతంలోని ఉష్ణోగ్రతకు విలయంగా ఉంటుంది.

తుషారస్థానం:-
→ ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాతావరణ/ గాలి నీటిఆవిరితో సంతులతం చెందుతుందో ఆ ఉష్ణోగ్రతను "తుషారస్థానం" అంటారు.
→ తుషారస్థానం వద్ద వాతావరణంలోని సాపేక్ష ఆర్ద్రత పరిమాణం 100% గా ఉంటుంది.

ద్రవీభవనం : -
→ నీటి ఆవిరి నీటి బిందువుల రూపంలో గానీ లేదా మంచుకణాలుగా గానీ మారే ప్రక్రియ "ద్రవీభవనం .'
→ వాతావరణంలో ఉష్ణోగ్రత 3.8°C కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరి నీటిబిందువుల రూపంలో భూమిని చేరుతుంది.
→ ఉష్ణోగ్రత 3.8°C కన్నా తగ్గినపుడు నా నీటిఆవిరి మంచురూపంలో భూమిని చేరును.
→ ఈ ఉష్ణోగ్రతనే నీటియొక్క" సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు.
→ వాతావరణంలో ద్రవీభవనం తక్కువ స్థాయిలో జరిగినపుడు అది భూమిని క్రింద తెలిపిన '5' రూపాలలో చేరుతుంది. అవి :

తుషారము :-
→ శీతాకాలంలో ఉష్ణమండల ప్రాంతాల్లో చెట్ల ఆకులు, బండరాళ్ళు, గడ్డ ములకలపై నీటి బిందువుల రూపంలోవున్న ద్రవీభవనమే " తుషారము "

శ్వేత తుహినము :-
→" ఉన్నత అక్షాంశ ప్రాంతాలలో శీతాకాలంలో బండరాళ్లు, చెట్ల ఆకులు, గడ్డి మొలకలపై మంచు పెళికల (plates) రూపంలో ఏర్పడే ద్రవీభవనం ". -

పొగమంచు :-
→ శీతాకాలంలో పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు మరియు పర్వత నదీలోయ ప్రాంతాలల్లో ఉష్ణోగ్రతా విలోమ పరిస్థితులు ఏర్పడటం వల్ల భూఉపరితలాని అనుకొనివున్న గాలిలోని నీటి ఆవిరి చిన్నచిన్న నీటి బిందువులుగా ద్రవీభవిస్తుంది. ఈ నీటి బిందువుల సమూహాన్నే " పొగమంచు" అంటారు. ఇది వాతావరణ పారదర్శకతో నీటి బరి వంటే దుమ్ము, ధూళి రకాలలో లక్ష్మణాన్ని పోగొట్టడం వలన అవతలవున్న వస్తువులు ఆ ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. మనకు కన్పించవు.

పలుచని పొగమంచు :-
→ ఎక్కువ తేమగల పొగమంచుయే "పటాచని పొగమంచు" ఇది ఏర్పడినపుడు అవతల వున్న వస్తువులు పాక్షికంగా కన్పిస్తాయి.

హేజ్:-
→ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యకాలచే ఏర్పడివున్న పొగమంచు" హేజ్"

→ వాతావరణంలో ద్రవీభవనం అధికస్థాయిలో జరిగినపుడు నీటిఆవిరి తేమరూపంలో మారుతుంది.. ఈ తేమనే " అనహితము" అని పిలుస్తారు. ఇది భూమిపై గల వివిధ భౌగోళిక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో చేరును. వీటినే " అవపాత రూపాలు' అని పిలుస్తారు. అవి :

అవపాత రూపాలు :
హిమము :-
→ వాతావరణంలో ఉష్ణోగ్రతలు 0 o C కంటే తక్కువగా ఉన్నప్పుడు. Hexagonal తమ '6' ముఖాలు కలిగిన మంచుకణాల రూపంలో భూ ఉపరితలాన్ని చేరినట్లయితే దాన్ని "హిమము" అని పిలుస్తారు.

హిమశీకరము :-
→ వాతావరణంలోని నేను నీటి బిందువులుగా మారి భూ .. ఉపరితలాన్ని చేరే సమయంలో మార్గ మధ్యలోని అల్ప ఉష్ణోగ్రతల కారణంగా మంచు కణాలుగా మారి భూ ఉపరితలాన్ని చేరినట్లైతే దాన్ని హిమశీకరం" అంటారు.

→ శీతాకాలంలో H.P &.J.K రాష్ట్రాల్లో రోడ్డుపై భారవాహనాలు బోల్తా పడటానికి కారణం రోడ్డు చూర్ణాలపై ఏర్పడిన హిమశీకరము.

Glaze :-
→ వాతావరణంలోని తమ భూ ఉపరితలాన్ని చేరిన తర్వాత అల్ప ఉష్ణోగ్రతల కారణంగా మంచు కణాలుగా మారినట్లయితే దాన్ని "GLAZE అని పిలుస్తారు.

తుంపర :-
→ "తుఫాన్ల సమయంలో వర్షం ఆగిపోయిన తర్వాత గాలిలో వ్రేలాడుతూ ఉన్నటువంటి చిన్నచిన్న నీటి బిందువులు".

వడగండ్లు:-
→ వేసవికాలంలో క్యుముల్ నింబస్ మేఘనిర్మాణం నుండి భూ ఉపరితలాన్ని చేరే ఘనస్థితిలోని అవపాత రూపమే " వడగండ్లు ".

వర్షపాతం:-
→ ఉష్ణమండల & సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో నీటిబిందువుల రూపంలో భూ ఉపరితలాన్ని చేరే అవపాత రూపమే "వర్షపాతం".
వర్షపాతం సంభవించే విధానాన్ని అనుసరించి దీన్ని '3' రకాలుగా విభజించవచ్చు. అవి:

a) పర్వతీయ వర్షపాతం
b) సం వహన వర్షపాతం
c) చక్రవాత వర్షపాతం

పర్వతీయ వర్షపాతం :-
→ పర్వతాలు అడ్డుకోవడం వలన సంభవించే వర్షపాతం "పర్వతీయ వర్షపాతం"
→ పర్వతీయ వర్షపాతం ఎల్లప్పుడు పవనాభిముఖవిల్లో మాత్రమే సంభవిస్తుంది. కారణం తేమతో కూడిన పవనాలు ఊర్థ్వముఖంగా కదిలి ద్రవీభవనం చెందటం వలన.

→ పర్వత పరాన్ముఖ/వర్షచ్ఛాయా ప్రాంతాల్లో వర్షం సంభవించదు, కారణం గాలులు నమజ్ఞానం చెంది వేడెక్కి అసంతృప్త స్థితికి మారడమే.

→ 'పవనాభిముఖ దిశ ' అనగా పవనాలు పర్వతాన్ని ఢీకొనే దిశ. దానికి వ్యతిరేకంగా ఉన్న దిశ దిశయే వర్షచ్చాయ ప్రాంతం.

→ ప్రపంచం & భారత్లోనూ సంభవించే వర్షపాతం ఎక్కువగా పర్వతీయ రకానికి చెందినది.

సంవహన వర్షపాతం :-
→ వేసవిలో భూభాగాలు అధికంగా వేడెక్కడం వలన జరిగే విపరీత సంవహన ప్రక్రియ వలన సంభవించే వర్ష పాతం ఇది.

→ భారత్లో నైఋతి ఋతుపవన కాలానికి ముందు అనగా వేసవికాలంలో సంభవిస్తున్నందున దీన్ని" ఋతుపవన ఆరంభపు జల్లులు" అనీ పిలుస్తారు.

→ వీటిని దేశంలో ప్రాంతీయంగా వివిధ పేర్లతో పిలుస్తారు

* ఉ. ప్రదేశ్ - అంథలు (గుడ్డి జల్లులు): చెరకు
* ప.బెంగాల్, జార్ఖండ్ → కాలబైరెకీలు
* అసోం నార్వెస్టర్స్ /తేయాకు జల్లులు
* కర్నాటక → చెర్రీ బ్లోసమ్స్
* కేరళ&ఇతర రాష్ట్రాలు - Mango showers
* ఆంధ్ర ప్రదేశ్ → తొలకరి జల్లులు

→ భూ. రేఖా ప్రాంతంలో సంవత్సరమంతా సంభవించే వర్షపాతం సంవహన రకానికి చెందినదే.
చక్రవాత వర్షపాతం :-
→ చక్రవాతాల వల్ల సంభవించే వర్షపాతం " చక్రవాత వర్షపాతం". > ''చక్రవాతం' అనగా మధ్యలో అల్పపీడనం ఏర్పడి ఉండి చుట్టూ అధిక పీడన వాయు స్వరూపంతో కుడిన పవనవ్యవస్థ...

→ కీరియాలిస్ ప్రభావాన్ని అనుసరించి ఉ.గోళంలో చక్రవాతంలోని గాలులు చక్రవాత కేంద్రం వైపు అపసవ్యదిశలోనూ ద. గోళంలో సవ్యదిశలోనూ ఆ కదులుతాయి.

→ చక్రవాతాలు ఏర్పడే భౌగోళిక ప్రాంతాన్ని నుసరించి అవి '2' రకాలు:

I. సమశీతోష్ణ /మధ్య అక్షాంశ చక్రవాతాలు
→ ఇవి 40 - 60° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య రెండు విభిన్న లక్షణాలు గల (పశ్చిమ ఈ ధ్రువ పవనాలు) వాయురాశులు కలుసుకోవడం వల్ల ఏర్పడే సంధి ప్రాంతంలో జనించే తాత్కాలిక సరిహద్దు అయినటువంటి వాతాగ్ర ప్రాంతం లో ఏర్పడుతాయి.

→ ఇవి ఎక్కువగా శీతాకాలంలో పశ్చిమ పవనాలననుసరించి భూభాగంపై ఏర్పడతాయి.

→ ప్రపంచంలో ఇవి ఎక్కువగా ఏర్పడే ప్రాంతం; ఉత్తర అట్లాంటిక్ తీరప్రాంతాలు, అందుకే అట్లాంటిక్ మహాసముద్ర ను " కల్లోల సముద్రం" అని పిలుస్తారు.

ఉష్ణమండల/ ఆయనరేఖా మండు చక్రవాతాలు

→ ఇవి 8°- 15° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య అధిక ఉష్ణోగ్రతల వలన జరిగే విపరీత సంవహన ప్రక్రియవల్ల ఏర్పడు తాయి.

→ ఇవి వ్యాపార పవనాల వేసవికాలంలో సముద్రాల పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువగా ఏర్పడతాయి.

→ ప్రపంచంలో వీటిని ప్రాంతీయంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అవి:

* చైనా ,ఫిలిప్పీన్స్ & జపాన్ తీరాలను అనుకొని వున్న పశ్చిమ పసిఫిక్ తీరం - టైపూన్ లు

* వెస్టిండీస్ దీవులను ఆనుకొని వున్న కరేబియా సముద్రం- హరికేన్లు

* హిందూ మహాసముద్రం - సైక్లోన్ లు / తుఫాన్లు

* ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలోని పసిఫిక్ సముద్రం - విల్లీ విల్లీ లు

టోర్నడోలు :-
→ ఉత్తర అమెరికాలోని మిస్సిసిప్పీ - ముస్సోరీ నదీ పరివాహక ప్రాంతాల్లో మరియు మెక్సికో సింధుశాఖ ప్రాంతాలలో సంభవించే తీవ్రమైన గాలివానలతో కూడిన సమశీతోష్ణ చక్రవాతాలనే " టోర్నడోలు" అని పిలుస్తారు.

జలస్థంభాలు :-
→ అట్లాంటిక్ జలరాశిలో వేసవిలో ఏర్పడే గరాటు ఆకృతి టోర్నడోలనే "జలస్థంబాలు" అని పిలుస్తారు.
→ ISOHYTES -"ఒకే వర్షపాత పరిమాణం గల ప్రాణాలను కలుపుతూ గీయబడ్డ ఊహారేఖలు"
→ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాoతం- వయలీలీ శిఖరం (హవాయి దీవులు)
రెండవ స్థానం: మాసిన్ రాం - మేఘాలయ
→ ప్రపంచంలో అత్యధిక వార్షిక సగటు వర్షపాతం నమోదు : మాసిన్ రాం - మేఘాలయ