పవనములు
→ భూమికి క్షితిజ సమాంతరంగా కదిలే వాయు అణువుల సమూహాన్ని" పవనం అనీ, ఊర్ధ్వముఖంగా కదిలే వాయు అణువుల సమూహాన్ని" గాలి ప్రవాహం" అని పిలుస్తారు.
→ ప్రతీ పవనానికి లక్షణాలుంటాయి. అవి:
1. వేగం
2. దీశ
→ పవన వేగాన్ని ఎనిమోమీటర్ & బీఫోర్డ్ స్కేలు అను పరికరాలద్వారా కొలుస్తారు.
→ ఒక భౌగోళిక ప్రాంతంలో పీడన ప్రవణత్ర రేటు ఎక్కువగా ఉంటే పవనాల వేగం ఎక్కువగాను, పీడన ప్రవణత రేటు తక్కువగా ఉంటే పవనాల వేగం తక్కువగాను ఉంటుంది.
→ పవనాలు ఏదిశలో జనిస్తాయో ఆదిశ పేరుతో పవనాన్ని పిలుస్తారు.
→ పవనదేశను పవనదిశ అను పరికరం ద్వారా గుర్తిస్తారు.
→ పవనాల వేగం & వాటి చేత క్రింద తెలిపిన అంశాలచే ప్రభావిత మౌతాయి. అవి :
i) కోరియాలిస్ ప్రభావం : ఇది పవనం యొక్క దిశలో మార్పు కలుగజేస్తుంది.
ii) ఘర్షణా బలాలు : ఇవి పవనాల వేగం &దిరేలో మార్పు కలుగ జేస్తాయి.
iii) ఖండతరపు అంచులు: పవనం యొక్క దిశలో మార్పు కలుగజేస్తాయి.
iv) పీడన ప్రవణతా బలాలు: ఇవి పవనం యొక్క వేగంలో మార్పు కలగజేస్తాయి.
→ పవనాలు వీచే భౌగోళిక ప్రాంతాన్ననుసరించి వాటిని '3' రకాలుగా విభజించవచ్చు.
అవి:
1. ప్రపంచ పవనాలు/శాశ్వత పవనాలు
2. కాలాన్ని బట్టి వీచే పవనాలు
3. పవనాలు
1. ప్రపంచ పవనాలు :
→ "అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతంవైపు స్థిరంగా నిర్ణీతదిశలో సంవత్సరమంతా వీచే పవనాలు .
→ ప్రపంచ పవనాలు వీచే భౌగోళిక ప్రాంతాన్ని నుసరించి వాటిని 3 రకాలుగా వర్గీకరించారు.
అవి:
i) వ్యాపార పవనాలు
ii ) పశ్చిమ పవనాలు
iii) ధృవ / తూర్పు పవనాలు
వ్యాపార పవనాలు :-
→ ఉపఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడనా ప్రాంతం వైపు 5°-35° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు .
→ ఉత్తరార్థ గోళంలో ఈశాన్యదిశలో జనిస్తున్నందున వాటిని "ఈశాన్య వ్యాపార పవనాలు” అనీ, ద. గోళంలో ఆగ్నేయదిశలో వస్తున్నందున " ఆగ్నేయ వ్యాపార పవనాలు" అనీ పిలుస్తారు.
→ వ్యాపార పవనాలు ఉష్ణమండల ప్రాంతాల్లో వీస్తున్నందున అధికంగా భాష్పీభవనం చెంది అధిక వర్షపాతాన్ని కలుగజేస్తాయి.
→ వ్యాపార పవనాలు ఖండాల తూర్పు భాగంలో మాత్రమే వర్షాన్నిచ్చి, పశ్చిమ ప్రాంతాల్లో ఇవ్వలేనందున అక్షాంశాల మధ్యవున్న ఖండాల పశ్చిమ ప్రాంతమంతా 5-35° ఉష్ణమండల ఎడారులు ఏర్పడి ఉన్నాయి.
పశ్చిమ పవనాలు :-
→ ఉపఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుండి ఉపద్యన అల్పవడనా ప్రాంతువైపు 40-60° ఉత్తర, దక్షిణ అంది అక్షాంశాల మధ్య వీచే పవనాలు:
→ పశ్చిమ పవనాలు ఖండాల పశ్చిమ ప్రాంతంలో మాత్రమే వర్షాన్నిచ్చి తూర్పు ప్రాంతాల్లో వర్షాన్నివ్వలేనందున ఆ ప్రాంతమంతా శీతల ఎడారులేర్పడి ఉన్నాయి.
Ex: - మంగోలియ, చైనా దేశాల్లో విస్తరించివున్న గోబీ ఎడారి.
-అర్జెంటీనా ఆ పెటగోనియా ఎడారి.
→ ఉ.గోళంలోని పశ్చిమ పవనాలు నైఋతి దిశలను, ద, గోళంలోని పశ్చిమ పవనాలు. వాయువ్య దిశలోనూ జనిస్తాయి.
→ మధ్యధరా సముద్ర ఉత్తరతీర ప్రాంతాల్లో వర్షపాఠాన్నివ్వడంలో కీలకపాత్ర వహించే పవనాలు: పశ్చిమ పవనాలు
ధృవ/తూర్పు పవనాలు :-
→ "ధృవ అధిక పీడన ప్రాంతం నుండి ఉపధృవ అల్పపీడన ప్రాంతం వైపు 90° - 60° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు
→ ఉ. గోళంలో ఇవి ఈశాన్య దిశనుంచి ద. గోళంలో ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయి.
→ ఇవి అతిశీతల ప్రాంతాల్లో విస్తున్నందున భాష్పీభవనం చెందక వర్షపాతాన్ని వ్వలేదు.
కాలాన్ని బట్టి వీచే పవనాలు :-
→ ఋతువు ననుసరించి గానీ లేదా సమయాన్ననుసరించి గానీ తమ దిశలు మార్పు కలుగ జేసుకుంటూ వీచే పవనాలు"
భూపవనాలు & సముద్ర పవనాలు :-
→ ఒక అక్షాంశం మీదవున్న భూజల భాగాలలోని ఉష్ణోగ్రతలో గల తేడాలను అనుసరించి ఈ పవనాలు జనిస్తాయి.
→ పగటి సమయంలో జలభాగం నుంచి అల్పపీడనం వున్న భూభాగం వైపు వీచే పవనాలు 'సముద్ర/జల పవనాలు భూభాగాల్లో వాతావరణం చల్లబడుతుంది.
→ వీటి కారణంగా తీరప్రాంత ఈ పగటి సమయంలో ఢిల్లీ & HYD లాంటి ఖండాంతర్గత ప్రాంతాలతో పోలిస్తే చెన్నై ఓ ముంబయ్ లాంటి తీరప్రాంత భూభాగాల్లో వాతావరణం చల్లగా ఉండటానికి కారణం - సముద్ర పవనాల తాకిడి.
→ రాత్రి సమయాల్లో పవనాలు భూభాగం నుంచి అల్పపీడనం వున్న జలభాగం వీనా వైపు వీస్తాయి. వీటినే " భూపవనాలు/ స్థల పవనాలు " అని పిలుస్తారు. వీటి కారణంగా తీరప్రాంత భూభాగాలలో సాయంత్ర సమయం నుండి వాతావరణం
పర్వత&లోయ పవనాలు :-
→ ఇవి కూడా పర్వత ఉపరితలాలు, లోయ అడుగు భాగాల మధ్య ఉష్ణోగ్రతల గల తేడాననుసరించి జనిస్తాయి.
→ రాత్రి సమయంలో పర్వత ఉపరితలాల నుంచి లోయ అడుగు భాగం వైపు వీచే పవనాలను "పర్వత పవనాలు " అనీ, పగటి సమయాల్లో ఆయ అడుగు భాగం నుంచి పర్వత ఉపరితలాల వైపు పవనాలను "లోయ పవనాలు” అని పిలుస్తారు.
సరస్సు సమీరాలు:
→ పగటి సమయంలో సరస్సు నుంచి చుట్టూవున్న భూభాగం వైపు సాయంత్ర సమయం నుంచి భూభాగం నుండి మీదుగా సరస్సు వైపు వీచే పవనాలను ' సరస్సు సమీరాలు' అని పిస్తారు.
→ ఇవి కూడా రాత్రి, పగటి సమయాలలో ఉష్ణోగ్రతలోని తేడా వలన జనిస్తున్నందున కాలాన్ని బట్టి వీచే పవనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
స్థానిక పవనాలు :-
→ "కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాలలో నిర్దిష్ట ఋతువులలో ఉష్ణోగ్రతా పీడనా వ్యత్యాసాలలో కలిగే మార్పుల ననుసరించి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై వీచే పవనాలు".
→ ఇవి వీచే భౌగోళిక ప్రాంతాన్ననుసరించి ఇవి '2' రకాలు :
వేడి పవనాలు : -
ఫోయన్ :-
→ శీతాకాలంలో ఆల్ఫ్స్ పర్వతాలకు తూర్పుగా స్విట్జర్లాండ్ ' భూభాగం మీదుగా వీచే వేడి పాడి పవనాలు" ఫోయన్".
→ 'శీతాకాల దుప్పటి" (Winter Mild)
చినూక్ :-
→ "శీతకాలంలో అలస్కా, కెనడా ఉత్తర ప్రాంత భూభాగాల్లో వీచే వేడి పొడిగాలులు
→ వీటినే "హిమ భక్షికలు" అని పిలుస్తారు.
శాంతా అనా :-
→ కాలిఫోర్నియాలో వేసవిలో వీచే తీవ్రమైన వేడిపొడి పవనాలు
→ వీటిని పోలిన పవనాలను వివిధ దేశాల్లో ఈ విధంగా పిలుస్తారు.
అర్జెంటినా - జోండా
జపాన్ - యోమో
ఈజిప్ట్ - ఖం సిన్
ఆస్ట్రేలియా - బ్రిక్ ఫీల్డర్స్
హర్మటాన్ :-
→ "సహారా ఎడారిలో జనించి ఆఫ్రికా పశ్చిను తీరం వెంబడి వీచే వేడి పొడిగాలులు.
→ వీటినే " డాక్టర్ పవనాలు " అంటారు.
సిరాకో :-
→ సహారా ఎడారిలో జనించి మధ్యధరా సముద్రం మీదుగా ఇటులే దక్షిణ ప్రాంత భూభాగాలలోకి వీచే వేడి పొడిగాలులు".
→ వీటి కారణంగా ఇటలీ దక్షిణ ప్రాంతంలో ఎర్రమట్టి రేణువులతో కూడిన ధూళి తుఫాన్లు సంభవిస్తాయి.
Loo (లూ) :-
→ "భారత వాయువ్య ప్రాంతంలో వేసవిలో అత్యధిక వేగంతో వీచే వేడి పొడిగాలులు.
శీతల పవనాలు :-
మిస్ట్రల్ :-
→ వేసవిలో యుగోస్లావియా భూభాగం నుంచి ఏడ్రియాటిక్ సముద్రం వైపు వీచే పవనాలు "మిస్ట్రల్
బోర్లా :-
→ శీతాకాలంలో ఫ్రాన్స్లోని అవగ్నే పీఠభూమి నుంచి మధ్యధరా సముద్రం వైపు వీచే శీతల గాలులు.
BERGS :-
→ వేసవిలో దక్షిణాఫ్రికాలోని డ్రాకెన్స్బర్గ్ పర్వతాల పశ్చిమ వాలుల గుండా వీచే శీతల గాలులు "బెర్ల్స్".
బిజార్డ్స్ :-
→ ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాతాల్లో శీతాకాలంలో వీచే కటిక చలిగాలులు