వాతావరణ సంఘటనము - నిర్మాణము
→ భూ ఉపరితలం నుంచి దాదాపు 1600 km ఎత్తు వరకూ విస్తరించివున్న అనేక వాయువుల మిశ్రమం "వాతావరణం".
→ మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని క్లోరిన్ వాయువు తప్ప మిగతా వాతావరణంలో ఉన్నాయి.
→ మొత్తం భూ వాతావరణంలో 90% భూ ఉపరితలం నుంచి 50 కి.మీ. ఎత్తులో బరువైన వాయువులచే ఏర్పడి ఉండి, మిగిలినది ఆపైన 1600 కి.మీ. వరకు తేలికైన హైడ్రోజన్, హీలియం వాయువులచే ఏర్పడి పలుచబడి పోతూ ఉంది.
వాతావరణ సంఘటనము :-
i) నైట్రోజన్ (76.08% ) :
→ మొక్కలు వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్స్ రూపంలో పరీక్షంగా వినియోగించుకొని వాటి "పెరుగుదలలో ఉపయోగించుకుంటాయి.
→ వాతావరణంలో ఆక్సిజన్ - దహన ప్రక్రియను నైట్రోజన్ స్థిరీకరిస్తుంది.
ii ) ఆక్సిజన్ (20.9%) :-
→ జీవుల శ్వాసక్రియలో ఉపయోగపడుతున్నందున దీన్ని " ప్రాణవాయువు" అని పిలుస్తారు.
→ వాతావరణంలోని ఓజోన్ పొరను ఏర్పరచటంలో కీలకపాత్ర వహిస్తుంది.
iii) కార్బన్ డయాక్సైడ్ (0.03% ) :-
→ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారత్పాదనను చేపట్టడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. పగటి సమయంలో భూమిపై ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ కాకుండా రాత్రి సమయాల్లో మరీ తక్కువ కాకుండా మధ్యమిక స్థాయిలో ఉంచడంలో కీలకపాత్ర వహిస్తుంది.
iv) ఆర్గాన్ [0.98%] :-
→ ఎలక్ట్రిక్ బల్బులలో ఉపయోగిస్తారు.
→ పై వాయువులతో పాటు హైడ్రోజన్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్ వంటి అప్రధాన వాయువులు కూడా భూ వాతావరణంలో ఉన్నాయి.
వాతావరణ నిర్మాణము :-
→ సముద్రమట్టం నుండి వాతావరణంలో ఎత్తుకు పోయకొలదీ ఉష్ణోగ్రతలో కలిగే మార్పుననుసరించి వాతావరణాన్ని '5' ఆవరణములుగా విభజించడమైనది. అవి:
1. ట్రోపో ఆవరణము
2. స్ట్రాటో ఆవరణము
3. మీసో ఆవరణము
4. థర్మో/ఐనో ఆవరణము
5. ఎక్సో ఆవరణము
ట్రోపో ఆవరణము
→ భూ ఉపరితలం నుంచి సగటున 13 Km ఎత్తువరకు విస్తరించివున్న వాతావరణం లోని మొదటి పొర, "ట్రోపో ఆవరణము".→ భూ రేఖా ప్రాంతంలో 18 km, ధ్రువ ప్రాంతాల్లో 8km ఎత్తును కలిగివుంటుంది.
→ ఈ ఆవరణంలో ప్రతీ 1652రా, ఎత్తుకు వెళ్లేకొలదీ ఉష్ణోగ్రతలు 1°C చొప్పున తగ్గును. దీన్నే సాధారణ ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం" అంటారు.
→ భూ ఉపరితలం నుండి వాతావరణంలోకి విడుదలయ్యే 99% దుమ్ము ధూళికణాలు & నీటి ఆవిరి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమౌతాయి.
→ అందువలన ట్రోపో ఆవరణం అతధిక సాంద్రతను కలిగి ఉంటుంది.
→ ద్రవీభవనము, మేఘనిర్మాణం జరగడం, ఉరుములు, మెరుపులు, అల్పపీడనములు, వర్షపాతము వంటి వాతావరణ అలజడులన్నీ ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి.
→ ట్రోపో ఆవరణానికీ, దాని పైన గల స్ట్రాటో ఆవరణానికి మధ్యగల సరిహద్దు ట్రోపోఫాస్
→ ఈ ఆవరణం యొక్క పై సరిహద్దులో పశ్చిమం నుండి తూర్పుకు వంకర్లు తిరుగుతూ అత్యధిక వేగంతో వీచే పవనాలు " జెట్ స్ట్రీమ్స్",
స్ట్రాటో ఆవరణము
→ ట్రోపో ఆవరణం నుండి 50 km వరకు వున్న వాతావరణంలోని రెండవ పొర→ ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రత దాదాపు స్థిరం.
→ వర్షపాతం ఇవ్వలేనటువంటి అత్యధిక ఎత్తులో ఏర్పడే సిర్రస్ మేఘములు ఈ ఆవరణంలో కనిపిస్తాయి.
→ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు లేనందున వాతావరణం ప్రశాంతంగా ఉండి విమానయానం కొనసాగించబడుతోంది.
→ 25 km - 35 km) ప్రాంతంలో ఓజోన్ పొర కేంద్రకృతమై భూమివైపు ప్రసగించే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలను భూమిని చేరనీయకుండా నియంత్రించి జీవజాతిని పరిరక్షిస్తోంది.
→ స్ట్రాటో ఆవరణానికీ, దాని పైనగల మీసో ఆవరణానికి మధ్యగల సరిహద్దు" స్ట్రాటోఫాస్ ".
మీసో ఆవరణము
→ స్ట్రాటో ఆవరణం నుండి 80 km వరకు ఉన్న వాతావరణంలోని 3వ పార.→ ఈ ఆవరణలో ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రతలు చాలా హెచ్చు స్థాయిలో పతనమౌతాయి. దీని కారణంగా ఈ ప్రాంతంలోని వాయు అణువులు నిశ్చల స్థితిలో ఉన్నందున ఈ ప్రాంతంలో ఘర్షణాబలాలు జనిస్తాయి.
→ విశ్వాంతరాళం నుండి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఆస్టరాయిడ్స్ మరియు లేకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులు ఇక్కడి ఘర్షణ బలాల వలన పూర్తిగా మండించబడి భూగోళ పరిరక్షణ గావించబడుతోంది.
→ మీసో ఆవరణానికీ, దాని పైన,గల ఐనో ఆవరణానికే మధ్యగల సరిహద్దు "మీసోఫాస్"
థర్మో/ఐనో ఆవరణము
→ మీసో ఆవరణం నుండి. 400 km వరకూ గల వాతావరణం లోని 4వ పాఠం→ ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్ళేకొలదీ ఉష్ణోగ్రతలు చాలా హెచ్చు స్థాయిలో పెరుగుతాయి.
→ ఈ ప్రాంతంలో వాయువులు అయానల రూపంలో ఉన్నందున ఇక్కడ జరిగే ధర్మ న్యూక్లియర్ చర్యల వల్ల కొంతశక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదలౌతుంది. దీని కారణంగా రేడియో తరంగాలు భూమ్మీదకు పరావర్తనం చెందడం,
→ సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందడం జరుగుతోంది. అందుకే ఈ ఆవరణాన్ని "సమాచార వ్యవస్థ పొర" అని కూడా అంటారు.
ఎక్సో ఆవరణము
→ 400 km కన్నా పైన వున్న వాతావరణంలోని బాహ్య పొర.→ ఇక్కడ పదార్థం తేలికైన హైడ్రోజన్, హీలియం వాయువులచే ఏర్పడి ప్లాస్మా స్థితిలో ఉంటుంది.
→ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్లేకొలదీ హెచ్చుస్థాయిలో పెరుగుతాయి,