అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సాంఘికశాస్త్రం బోధనా పద్ధతులు








→ నిర్ణయించుకున్న విద్యాలక్ష్యాలను సాధించడానికి దోధనావద్ధతులు ఒక సాధనంగా ఉపకరిస్తాయి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశ స్వభావము, విద్యార్థుల వయస్సు, పరిధిని అనుసరించి తగిన బోధనా పద్ధతులను ఎంపిక చేసుకొనవలెను
→ సాంఘిక అధ్యయనాలలో బోధనా పద్ధతులకు చాలా ప్రాముఖ్యం ఉంది.

విజయవంతమైన బోధన ప్రముఖంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది :-
→ ఉపాధ్యాయునికి విషయ పరిజ్ఞానంపై ఉన్న పట్టు
→ బోధనా నైపుణ్యం
→ ఇతరులు అభ్యసించడానికి దోహదపడే కళయే బోధన.
→ జాన్ అమోమన్ కొమెనియన్ (17వ శతాబ్దం) - ఆధునిక బోధన పద్ధతులకు మూలపురుషుడు. "ఇంద్రియజ్ఞానం పెంపొందించడంలో సరియైన బోధనా పద్ధతులను వినియోగించాలి అని కొమెనియన్" పేర్కొన్నాడు



మంచి బోధనా పద్ధతి లక్షణాలు :-
→ విద్యార్థులకు సాంఘికశాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించాలి.
→ అభ్యసనంలో విసుగును తొలగించేదిగా ఉండాలి
→ సాంఘిక అధ్యయనం అందరి విషయాలు సులభంగా అవగాహన చేసుకోవడంలో తోడ్పడాలి
→ సాంఘిక అధ్యయనాలను ఆనందంగా అభ్యసించే విధంగా ఉండాలి.
→ ఉపాధ్యాయునికి, అభ్యాసకునికి మధ్య మంచి అనుసంధానంను ఏర్పరచాలి. తరగతిలో అన్ని అభ్యసన స్థాయిల వారికి ఉపయుక్తమైనదిగా ఉండాలి .
→ విద్యార్థులు తమ సృజనాత్మక అనుభవాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చేవిధంగా ఉండాలి.
→ పాఠ్యాంశాల పట్ల విస్తృతమైన ఆసక్తిని రేకెత్తించేదిగా ఉండాలి.
→ సాంఘిక అధ్యయనాల పట్ల మంచి వైఖరులు పెంపొందించాలి
→ మూర్త, వాస్తవ అంశాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చేవిగా ఉండాలి.
→ బోధనా పద్ధతులు రెండు రకాలు

1. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు
2. విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతులు




ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు :-
1. ఉపన్యాస పద్ధతి
2. కథా పద్ధతి
3. వనరుల పద్ధతి

విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు :-
1. చర్చా పద్ధతి
2. ప్రకల్పన పద్ధతి
3. వనరుల పద్ధతి
4. సమస్యా పరిష్కార పద్ధతి
5. సాంఘీకృత ఉద్గార పద్ధతి
6. క్రీడాపద్ధతి





ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు



ఉపన్యాస పద్ధతి :-

→ సాంఘికశాస్త్రము / సాంఘిక అధ్యయనాలలో అతిపురాతనమైన పద్ధతి - ఉపన్యాస పద్ధతి.
→ ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠ్యాంశాన్ని మౌఖికంగా (నోటి ద్వారా) వివరించుటయే ఉపన్యాన పద్దతి. ఉపన్యాస పద్ధతిన్ని కళాశాల విశ్వవిద్యాలయ స్థాయిలో విరివిగా వినియోగించటం జరుగుతుంది
→ ఉపన్యాస పద్ధతి రూపాంతరములు : -
1. కథా పద్ధతి
2. జీవిత చరిత్రలు


ఉపన్యాస పద్ధతి ఉపయోగించు సందర్భములు : -
→ ఉద్దీపన చేయడానికి
→ విషయంలో స్పష్టత కల్గించడానికి
→ పునః సమీక్షించడానికి
→ నూతన పాఠ్య విషయం పరిచయం చేయడానికి
→విస్తృతమైన విషయజ్ఞానం అందించడానికి
→ సందేహాలను నివృత్తి చేయడానికి



ప్రయోజనాలు :-
→ పాఠ్యాంశాన్ని స్పష్టంగా తక్కువ సమయంలో బోధించడానికి
→ పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి
→ వినడంలో మంచి శిక్షణ ఇస్తుంది
→ అనుమానాలను నివృత్తి చేయడం ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధములు ఏర్పడతాయి
→ సాంఘిక అధ్యయనాలు విద్యార్థులలో మంచి వైఖరులను కల్గచేస్తాయి,



పరిమితులు :-
→ అన్ని పాఠ్యాంశాలను బోధించడానికి ఉపన్యాస పద్ధతిని అవలంభిస్తే విద్యార్థులకు విసుగుపుడుతుంది.
→ విద్యార్థి ప్రేక్షక పాత్ర వహిస్తాడు
→ విద్యార్థుల ప్రజ్ఞాస్థాయిని పరిగణనలోనికి తీసుకోదు.
→ Learning by doing సూత్రానికి విరుద్ధమైనది విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొనలేరు




విజయవంతమైన ఉపన్యాసానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :-

→ ఉపన్యాసానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి నోట్స్ తయారుచేసుకోవాలి.
→ అంశాలను క్రమపద్ధతిలో ఉంచుకోవాలి
→ ఉపన్యసించేటప్పుడు, స్వరంలో మార్పులు ఉండాలి
→ ఉపన్యాసంను ఉదాహరణలతో మేళవించాలి.
→ ముఖ్యాంశాలకు ప్రాధాన్యత కల్పించాలి.
→ ఉపన్యాసం మధ్య మధ్య సందర్భోచితంగా చతురోక్తులు జోడించి ఉపన్యాసం కొనసాగించాలి.
→ ఉపన్యాసంలో మంచి సరళమైన భాష, చక్కటి ఉచ్చారణ, మంచి కంఠస్వరం ఉండాలి .
→ ఉపన్యాసం మధ్య మధ్యలో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తూ వారిలోని విసుగును పోగొట్టాలి.








కథా పద్ధతి:-
→ సాంఘిక అధ్యయనాలలో కథాపద్ధతి ఒక మఖ్యమైన బోధనా పద్ధతి. ఉపాధ్యాయుడు పార్యాంశమును కథలరూపంలో వివరించుటను కథా పద్ధతి అంటారు. కథా పద్ధతి ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరము, ప్రాథమికస్థాయిలో విద్యార్థులు పాఠ్యాంశంను కథల రూపంలో వినడానికి ఆసక్తి కనపరుచుతారు. కథా పద్ధతిని అనుసరించి మహాపురుషులు, మహనీయులు జాతీయ నాయకుల, సాంఘిక సంస్కర్తల జీవిత కథా అంశాలను బోధించడము జరుగుతుంది




కథను బోధించేటప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు - ఉపాధ్యాయుని పాత్ర :-
→ కథను క్రమమైన విధానంలో బోధించాలి
→ కథను బోధించేటప్పుడు స్వరంలో మార్పు ముఖంలో తేడాలు చూపించాలి. (భయం / సంతోషం / ఆశ్చర్యం/ బాధ)
→ కథలో పాత్రను తనకు అన్వయించుకోవాలి
→ కథ పక్కదోవ పట్టకుండా చూడాలి
→ కథలో "ముఖ్యమైన విషయం మరిచినాను అని మధ్యలో చెప్పకుండా" ముందుగానే కథను క్రమపద్ధతిలో బోధించాలి.




కథా పద్ధతి - లాభాలు :-
→ విద్యార్థులలో సాంఘిక అధ్యయనాల పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు
→ చారిత్రక, పూర్వచారిత్రక, మధ్యయుగం నాటి సాంఘిక, సాంస్కృతిక అంశాలను బోధించడానికి తోడ్పడుతుంది.
→ అభ్యసనంలో విద్యార్థులకు ఏకాగ్రతను పెంపొందిస్తుంది
→ విద్యార్థులు సాంఘిక అధ్యయనాల పట్ల ఉత్సాహంగా ఉంటారు
→ ఉపాధ్యాయుని స్వరమార్పులు, కదలికల వల్ల పాఠ్యాంశాల ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది - విద్యార్థులలో ఊహాశక్తి / కాల్పనిక శక్తి పెంపొందుతుంది




విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు



చర్చా పద్ధతి :-

→ సాంఘిక అధ్యయనాలలో అత్యంత విలువైన బోధన పద్ధతి చర్చా పద్ధతి. చర్చా పద్దతిని ఖారతదేశంలోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా వినియోగించబడిన పద్ధతి చర్చా పద్ధతి
→ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఒకరి ఆలోచనకంటే ఇద్దరి ఆలోచనలు మంచివి" అనే సామెత చర్చా పద్ధతికి వర్తిస్తుంది.
→ చర్చలో మానసిక అంశాలు అయిన 1. ఆలోచన 2, విశ్లేషణ 3. ఊహ 4. విచక్షణ మొదలగునవి ఇమిడి ఉన్నాయి.
→ చర్చా రూపాలు : -
1. వక్తృత్వం
2. సెమినార్లు
3. వర్క్ షాపు
4. కాన్ఫరెన్సులు
5. సింపోజియమ్ మొదలగునవి

చర్చా ప్రక్రియ :-

ప్రణాళిక :-
→ చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం ప్రణాళిక

సంసిద్ధత :-
→ చర్చించబోయే అంశాలకు సంబంధించిన విషయాల పూర్వపరాలను గురించి అందలి విషయాల పట్ల సంసిద్ధత కల్గించడము.

నిర్వహణ : -
→ చర్చను క్రమశిక్షణతో కూడిన ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికి అవకాశం కల్పించేదిగా ఉంటుంది.

మూల్యాంకనము :-
→ చర్చా ప్రక్రియలో ఆఖరి సోపానం మూల్యాంకనము. చర్చ ముగిసిన తర్వాత చర్చలోని అంశాలు విద్యార్థి అభిరుచులకు తగినట్టుగా ఉండి ఎంతవరకు విద్యార్థుల వైఖరులను ప్రభావితం చేసింది మూల్యాంకనం ద్వారా తెలియజేస్తుంది




చర్చలోని ముఖ్య అంశాలు : -

→ చర్చలో ఉండవలసిన ప్రధానమైన అంశాలు ఐదు. -
1. నాయకుడు
2. సభ్యులు
3. సమస్య
4. విషయ సమాచారం
5.మూల్యాంకనము

నాయకుడు :
→ చర్చలో ఉపాధ్యాయుడే నాయకుడు, చర్చలో పాల్గొన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఒక సలహాదారునిగా సహాయకుడిగా వ్యవహరిస్తాడు.

సభ్యులు :
→ చర్చలోని సభ్యులు అందరూ విద్యార్థులే. విద్యార్థులందరికీ చర్చలో సమానమైన అవకాశం ఉంటుంది. సభ్యులు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించే విధంగా చూడాలి.

సమస్య :-
→ చర్చకు ఎన్నుకొన్న చర్చనీయాంశం లేదా సమన్య విద్యార్థుల వయస్సు, తరగతి, స్థాయి, అవనరాలు, అభిరుచికి తగినట్లుగా ఉండాలి

విషయ సమాచారం: -
→ చర్చించడానికి ఎంపిక చేసిన సమస్యకు అవసరమైన విషయ సమాచారాన్ని స్వీకరించాలి. పుస్తకాలు / పత్రికలు / రేడియో / టి.వి / దృశ్య - శ్రవణ ఉపకరణములు / చిత్రపటములు మొదలగువాటి ద్వారా సమాచారాన్ని సేకరించి, సమస్యలను ఖచ్చితంగా చర్చించేందుకు ఉపకరిస్తుంది.



మూల్యాంకనము :-
→ చర్చ ముగిసిన అనంతరం నిర్ణయించుకున్న విద్యాలక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలియజేసేది మూల్యాంకనము








చర్చా పద్ధతి - ఉపయోగాలు :-

→ చర్చా పద్ధతి పాఠ్యాంశం పట్ల ఆసక్తిని కల్గిస్తుంది.
→ ప్రజాస్వామ్య వాతావరణంలో అభ్యసన జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.
→ విద్యార్థులకు - ఉపాధ్యాయులకు మంచి సంబంధాలు ఏర్పడతాయి
→ విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందిస్తుంది.
→ సమస్యా పరిష్కారం చేసే శక్తి కలుగుతుంది
→ సమూహ / జట్టు, పోటీని, జట్టు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది
→ బట్టి స్మృతిని వ్యతిరేకిస్తుంది.
→ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది.
→ సభాపద్ధతులను పాటించడంలో శిక్షణ ఇస్తుంది
→ విద్యార్థులలో తార్కిక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుంది.


పరిమితులు:-

→ అన్ని పాఠ్యాంశాలను చర్చావద్దతిలో బోధించలేము
→ చురుకైన విద్యార్థులు మాత్రమే అధిగమిస్తారు
→ కాలమాపనతో కూడినది.
→ విద్యార్థులు భావోద్రేకాలకు లోను అగుతారు.
→ చర్చలో జరిగే వాగ్వివాదాలు చర్చను పక్కదోవ పట్టించేందుకు అవకాశం కల్పిస్తుంది.
→ అనవసరమైన విషయాలు చర్చకు దారితీస్తాయి



ప్రాజెక్టు పద్ధతి / ప్రకల్పన పద్ధతి :-

→ 1918 లో U.S.A దేశానికి చెందిన కొలంబియా విశ్వవిద్యాలయంలోని H.W. కిల్ పాట్రిక్ ప్రాజెక్టు పద్దతి రూపొందించాడు
→ ప్రాజెక్టు పద్ధతి learning by doing సూత్రంపై ఆధారపడినది.
→ ప్రాజెక్టు పద్ధతి - జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్వావాదం లోని Leaming by doing సూత్రం పై ఆధారపడినది
→ విద్యార్థులలో వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశంలో బోధన జరపడం జరుగుతుంది
→ కృత్యాధార బోధనా పద్ధతులలోకెల్లా అత్యున్నతమైనది.
→ జీవించడానికి నేర్చుకోక - జీవిస్తూ నేర్చుకోవాలి" అనే సూత్రం పై "ప్రాజెక్టు పద్ధతి” ఆధారపడినది



ప్రాజెక్టు - నిర్వచనాలు :

→ లక్ష్యసాధన కోసంగా సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యం / కృత్యాలు - ప్రాజెక్టు -1918 - H.W. కిల్‌పాట్రిక్ - U.S.A
→ "సహజ సన్నివేశంలో పూర్తిచేసిన సమస్యాత్మక కార్యకలాపం" ప్రాజెక్టు - JA స్టీవెన్ సన్ (రష్యా)
→ నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారంగా విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యం - A.C. బైనింగ్ మరియు D.H జైనింగ్
→ Teaching the social studies in the secondary school గ్రంథంలో పై నిర్వచనంను A.C. బైనింగ్ మరియు D.H జైనింగ్ లు పేర్కొన్నారు
→ పాఠశాల వాతావరణంలోనికి దిగుమతి చేయబడ్డ నిజజీవిత శకలమే ప్రాజెక్టు". - "బిల్లార్డ్
→ ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులు తమకు తాముగా ఇష్టపడి సమస్యా సాధన కోసంగా కృత్యాలు చేపడతారు

1. నటించడం
2. వేడుకలలో పాల్గొనడం
3. నమూనా తయారీ
4. మ్యాపులు గీయడం
5. ఆల్బమ్ తయారీ
6. చార్టులు తయారుచేయడం
7. చిత్రపటాల సేకరణ
8. చారిత్రక స్థల సందర్భన
9.వస్తు సందర్శన
10. చర్చ నిర్వహణ

→ మొదలగునవి నైపుణ్యాలను విద్యార్థులు కృత్యాల ద్వారా పొందుతారు



ప్రాజెక్టు పద్దతి 6 సూత్రాలు :-
→ ప్రాజెక్టు అనేది - కృత్యాధారంగా ఉండాలి (మానసిక, చలనాత్మక కృత్యాలకు అనుగుణంగా ఉండాలి)
→ ప్రాజెక్టు అనేది - ఉద్దేశ్యపూర్వకంగా ఉండాలి (అవనరమైనదిగా, ప్రయోజనకారిగా ఉండాలి ప్రాజెక్టు అనేది - అనుభవపూర్వకంగా ఉండాలి. (అభ్యసన అనుభవము కలిగించే విధంగా-ఉండాలి)
→ ప్రాజెక్టు అనేది - వాస్తవికతంగా ఉండాలి, (నిజజీవిత' అంశాలకు సంబంధించి ఉండాలి). - ప్రాజెక్టు అనేది - స్వేచ్ఛాయుతంగా ఉండాలి. (ప్రాజెక్టు నిర్వహణలో విద్యార్థి స్వేచ్ఛగా ఉండాలి
→ ప్రాజెక్టు అనేది - ఉపయోగకరంగా ఉండాలి. (కృత్యాలు అన్ని ఉపయోగకరంగా ఉండాలి)




ప్రాజెక్టు పద్దతి - సోపానాలు :-
→ సన్నివేశాలు ఏర్పాటుచేయడం
→ ప్రాజెక్టు ఎంపిక - ఉద్దేశ్య వివరణ.
→ ప్రణాళిక రచన
→ ప్రణాళిక అమలు / నిర్వహణ
→ మూల్యాంకనం
→ నమోదు చేయడం


ప్రాజెక్టు పద్దతి సోపానాలు - వివరణ



సన్నివేశాలు కల్పించడం :-
→ ప్రాజెక్టు పద్ధతిలో తొలిసోపానం సన్నివేశాలు ఏర్పరచడం
→ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ ప్రాజెక్టును ఇవ్వాలి అనుకుంటాడో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నివేశాలను ఉపాధ్యాయుడు ఏర్పాటుచేస్తాడు.
→ ఉపాధ్యాయుడు -సంభాషణలు, చర్చలు, చిత్రపట ప్రదర్శనము, నమూనాల ద్వారా విద్యార్థుల ఖభిరుచులు, అవసరాలు గుర్తించి తగిన సన్నివేశాన్ని కల్పించడం అనేది ప్రాజెక్టు పద్ధతిలో తొలిసోపానం,

ప్రాజెక్టు ఎంపిక - ఉద్దేశ్య వివరణ :-

→ ఉపాధ్యాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన సన్నివేశాలను ఏర్పరచిన తర్వాత విద్యార్థి తనకు నచ్చిన ప్రాజెక్టును తానే ఎంపిక చేసుకొంటాడు.
→ ఉపాధ్యాయుడు ఏర్పరచిన సన్నివేశాలకు అనుగుణంగా విద్యార్థి స్వయంగా ప్రాజెక్టును ఎంపిక చేసుకుంటాడు.
→ ప్రాజెక్టు ఎంపిక నిర్బంధం కాకూడదు. ప్రాజెక్టు ఎంపికలో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా ఉండాలి.
→ విద్యార్థి ఏదైనా సంబంధం లేని ప్రాజెక్టును ఎంపిక చేసుకొన్నట్లు అయితే ఆ ప్రాజెక్టులోని లాభనష్టాలు వివరించి ప్రాజెక్టు ఎంపికలో పునరాలోచించవల్సిందిగా కోరవచ్చును

ప్రణాళిక రచన :-

→ ప్రాజెక్టు పద్ధతిలో ప్రాజెక్టును నిర్వహించడానికి అవసరం అయిన ప్రణాళికను విద్యార్థులే రూపొందించుకొంటారు
→ ప్రణాళిక రచనలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు సలహాదారునిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు.
→ వనరులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రచన జరగాలి.

గమనిక : ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక రచనలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవసరమైన ప్రణాళికలు తాను ముందుగానే రచన చేసుకుంటే విద్యార్థులకు అవసరం అయిన సహాయం చేస్తాడు

ప్రణాళిక అమలు / నిర్వహణ :
→ ప్రణాళిక రచన జరిగిన తర్వాత విద్యార్థి ప్రణాళిక రచనలో పొందుపర్చబడిన విధంగా ప్రణాళికను తానే నిర్వహిస్తాడు / అమలుపర్చుతాడు
→ ప్రాజెక్టులో పనులు విద్యార్థుల అభిరుచి, సామర్థ్యాలను బట్టి విభజన జరుగవలెను. ఇందులో వివిధ రకాలైన అనగా సమాచార సేకరణ, స్థల ప్రదర్శన, ఇంటర్వ్యూ, సర్వే, పుస్తకం, విచారణ, ఉత్తరాలు వ్రాయడం వంటి పనులు అన్ని విద్యార్థుతే చేపడుతారు


మూల్యాంకనము :-
→ ప్రాజెక్టు కార్యక్రమములు అన్ని సక్రమంగా పూర్తి అయినది. లేనిది తెల్సుకోవడం మూల్యాంకనము
→ తప్పులు దొర్లకుండా, పొరపాట్లు జరగకుండా, నిలిచిపోయిన, వదిలివేసిన పనులు ఉంటే ప్రణాళికపరంగా పూర్తిచేయడం. మొదలగునవి అన్నీ సక్రమంగా జరిగినాయో, లేదా చూసుకోవడమే మూల్యాంకనం

నమోదు చేయటం:-
→ చేసిన పనులు, సాధించిన ఫలితాలను సక్రమంగా విద్యార్టో నమోదు చేస్తాడు. ఒకవేళ విద్యార్థి నమోదుచేయకపోతే విద్యార్థి ఆ విషయాలను మర్చిపోవడం ఆరుగుతుంది
→ ప్రాజెక్టు ఎంపిక - జరిపిన చర్చలు - పనుల విభజన పరామర్శించిన పుస్తకాలు సమాచార సేకరణ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ నమోదు చేయాలి.
→ నమోదు చేయబడిన ప్రాజెక్టు పుస్తకం - అందులోని అనుభవాలు అందరికి ఉపయోగపడ్డాయి







ప్రాథమిక స్థాయిలో చేపట్టే ప్రాజెక్టులు :-

1. మన ఊరు
2. మన ఆహారం
3. మన పంటలు
4.రవాణా
5. పక్షుల అధ్యయనం
6.వార్తా సౌకర్యాలు
7.స్థానిక స్వపరిపాలన
8.తోటపని
9. రిపబ్లిక్ డే నిర్వహణ



ప్రాజెక్టు పద్ధతి - ఉపాధ్యాయుడి పాత్ర : -
1. సలహాదారుడు
2. మార్గదర్శకుడు
3. పరిశీలకుడు



ప్రాజెక్టు పద్దతి - ప్రయోజనాలు :-
→ ప్రాజెక్టు పద్దతి మనస్తతత్వశాస్త్ర రీత్యా విద్యార్థులకు ఆనువుగా ఉంటాయి
→ స్వీయ అభ్యసన కృత్యాలలో విద్యార్థి స్వేచ్ఛను అనుభవిస్తాడు
→ విద్యార్థులు గ్రూప్ వర్క్ కు అలవాటుపడ్డారు.
→ స్వయంగా పనులు చేపట్టడం, సాధించడం ద్వారా విద్యార్థులలో పరిపక్వతకు దారితీస్తుంది.
→ సాంఘిక సర్దుబాటు - శిక్షణ జరుగుతుంది
→ ప్రజాస్వామ్య వద్ధతులకు దారితీస్తుంది
→ విద్యార్థులలో నిజాయితి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
→ శ్రమపట్ల గౌరవభావం పెంపొందించబడుతుంది
→ సవరణ కార్యక్రమాలతో కూడిన ఈ ప్రాజెక్టు నత్వర అభివృద్ధికి, నిజమైన అనుభూతికి దోహదం చేస్తుంది
→ విద్యార్థులు ఆత్మ సంతృప్తి పొందుతారు.
→ ఉపాధ్యాయులలోను, విద్యార్థులలోను ఆచరణాత్మక సమస్యా సాధనలు వ్యక్తిగతాభివృద్ధికి తోడ్పడతాయి



ప్రాజెక్టు పద్దతి - పరిమితులు :-
→ నిర్ణీత సమయానికి పాఠ్యప్రణాళికలు పూర్తిచేయడం కష్టం
→ ఉన్నత స్థాయి ప్రాజెక్టు రూపకల్పన చేయటం సులభం కాదు.
→ బోధనలో క్రమ అభ్యసనం అనేది జరగదు
→ ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు అవసరం





ప్రాజెక్టు రకాలు :-
→ ఉత్పత్తిదారుని రకం
→ సమస్యారకం
→ వినియోగదారుని రకం
→ తర్ఫీదు చేసే రకం





వనరుల పద్దతి / మూలాధార పద్ధతి :

→ సాంఘిక అధ్యయనాలను అత్యంత ఆసక్తికరంగా, సహజమైనదిగా బోధించడంలో ఉపయోగించే వివిధరకాల బోధనోపకరణాలను వనరుల వద్ధతి అంటారు

→ సాంఘిక అధ్యయనాలు అనేవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినందువలన వాటిని బోధించడంలో వనరుల పద్ధతి ప్రధానమైనది.
→ వనరుల పద్దతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్దతి
→ వనరుల పద్దతి : వాస్తవమైన, సహజమైన ఆధారాలను, విద్యార్థులకు పరిచయం చేసి వాటి ద్వారా విద్యార్థులకు అభ్యసన అనుభవాలను అందించి, అవి వాని స్వీయ అవగాహనకు తోడ్పడే విధానాలను వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి అంటారు
→ వనరుల పద్ధతి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను అందిస్తుంది.
ఉదా : తాజ్ మహల్, గోల్కొండ కోట, నాగార్జున సాగర్



→ వనరుల వర్గీకరణ : వనరులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు

ఎ) ప్రాథమిక వనరులు

బి) గౌణ వనరులు



ఎ) ప్రాథమిక వనరులు :
→ సాంఘిక అధ్యయనాలలో ప్రాథమిక సమాచారాన్ని అందించే ప్రత్యక్ష ఆధారాలే ప్రాథమిక వనరులు

→ ఇవి ప్రధానంగా రెండు రకాలు, 1. భౌతిక వనరులు 2 లిఖిత/ అలిఖిత వనరులు,

1. భౌతిక వనరులు :-

→ చారిత్రాత్మక సత్యాలను సాక్ష్యాధారములతో నిరూపించేవి భౌతిక వనరులు
→ ఉదా : భవనాలు, కోటలు, శిథిలాలు, మసీదులు, సమాధులు, చిత్రపటాలు, శిల్పములు
→ ప్రాచీన సంస్కృతిని సులభంగా, ఆసక్తికరంగా అభ్యసించడానికి దోహదపడతాయి



2. లిఖిత/ అలిఖిత వనరులు :

లిఖిత వనరులు :-
→ దీనిలో వ్రాతపూర్వక ఆధారాలుంటాయి. రాజశాసనాలు, రాజ్యాంగ చట్టాలు, అధికారఫత్రాల, కోర్టురికార్డులు జీవిత చరిత్రలు, ఉత్తరాలు, డైరీలు, ఒప్పందపత్రాలు, ప్రమాణపత్రాలు, చెల్లింపులు, రశీదులు, పద్దులు, వ్యవులు, రేఖాచిత్రములు, వంశవృక్షాలు, రచనలు మొదలైనవి వ్రాతపూర్వక ఆధారములు,

అలిఖిత వనరులు :-
→ పాటలు, కథలు, గేయాలు, ఒగ్గుకథలు, బుర్రకథలు మొదలైనవి మరియు ప్రాచీన జానవర్ సంస్కృతిని తెలియజేయడంలో అలిఖిత ఆధారములు అయిన కోలాటాలు, తోలుబొమ్మలాట, పగటివేషాలు మొదలైనవి

గౌణ వనరులు :-

→ సాంఘిక అధ్యయనాలలో ప్రాథమిక వనరులకు సంబంధించిన సమాచారాన్ని పరోక్షంగా వెల్లడిచేసేవి గౌణ వనరులు
→ ఉదా : ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా అనుభవం పొందనివారు చేసే రచనలను ద్వితీయ / గౌణ వనరులుగా చెప్పవచ్చు
→ ఉదా : పార్లమెంట్ లో/ అసెంబ్లీలో చేసిన చట్టాలు ప్రాథమిక ఆధారాలు అయితే అవే విషయాలను వార్తాపత్రికలలో ముద్రించికే అవి గౌణ / ద్వితీయ వనరులు అవుతాయి


మూలాధారములు ఉపయోగించే సందర్భములు:-
→ పాఠ్యాంశము ప్రారంభించేముందు
→ పాఠ్యాంశము మధ్యలో సందర్భానుసారంగా
→ పాఠ్యాంశం చివరిదశలో / ముగిసిన తర్వాత

వనరులను ఉపయోగించడం వలన కల్గే ప్రయోజనాలు :-
→ పాఠ్యాంశ విషయాలపట్ల విషయన్పష్టత లభిస్తుంది.
→ విద్యార్థులలో ప్రత్యక్ష అనుభవాలు / వాస్తవ పరిజ్ఞానం కల్గుతాయి
→ విద్యార్థులలో తార్కిక ఆలోచన / విమర్శనాత్మక ఆలోచన / ఊహ మొదలైన మానసిక అంశాలకు శిక్షణను ఇస్తుంది.
→ ప్రాథమిక వనరులు అందించే సమాచారం విషయం పట్ల దీర్ఘకాలిక స్మృతిని పెంపొందిస్తుంది.
→ విద్యార్థులలో నూతన పరిశోధనలకు దారితీస్తుంది.
→ వనరులను ఉపయోగించి బోధించడం ద్వారా ఉపాధ్యాయునికి సమయం, శక్తి రెండూ ఆదా అవుతాయి
→ అభ్యసనంలో వెనుకబడిన వారికి విద్యావిషయాలపట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి





వనరుల పద్ధతిలోని నష్టాలు :-
→ సహజ వనరుల / ప్రాథమిక వనరులు అందుబాటులో లేకపోవడము.
→ లిఖిత వనరులను వివరించడంలో ఉపాధ్యాయుడు భాషాపరమైన ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది , కాలయాపనతో కూడుకొన్ని పద్ధతి.
→ ప్రతి అంశాన్ని వనరులు వినియోగించి బోధించడం అనేది ఖర్చుతో కూడుకొన్నది.


సమస్యా పరిష్కార పద్ధతి :-

→ సాంఘిక అధ్యయనాలలో సమస్యాపద్ధతి, విద్యార్థులు తమ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంలో తార్కిక ఆలోచన, విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచన మొదలైన మానసిక శక్తులకు శిక్షణ ఇస్తుంది.
→ "వ్యక్తికి ఒక గమ్యం పుండి, ఆ గమ్యం చేరడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ విధానం కూడా సరైన విధంగా లేనప్పుడు సమస్య ఉద్భవిస్తుంది". గేట్స్
→ సమస్యను జవాబుకు కావల్సిన ప్రశ్నగా సూచిస్తారు - బైనింగ్ అండ్ బైనింగ్
→ సమస్యా పరిష్కారం అనేది విద్యార్థులను నూతన సరికొత్త కోణం నుంచి ఆలోచింపచేసేదిగా సూచిస్తుంది". - గేట్స్ - బైనింగ్ & బైనింగ్

సమస్యా పరిష్కార పద్ధతులు 2 రకాలు
1.ఆగమన పద్ధతి
2. నిగమన వద్దతి



ఆగమన పద్ధతి :-

→ ఈ పద్ధతిలో భాగాలనుంచి మొత్తం అభ్యసనానికి వీలు అవుతుంది. నిర్దిష్టతల నుంచి సామాన్యాలకు దారితీస్తుంది. విద్యార్థి పరిశీలన ద్వారా సూత్రాలు, సిద్ధాంతాలు నిర్ధారిస్తాడు.

→ విద్యార్థి వివిధ అంశాలను స్వయంగా పరిశీలించి, ఒకదానితో ఒకటి పోల్చడం, విభేదించడం చేస్తాడు.
ఉదా : విద్యార్థి సాధారణంగా సముద్రానికి సమీపంలోని కోస్తా ప్రాంతాల, ఉష్ణోగ్రత ఎక్కువగాను, పీఠభూమి ప్రాంతాలు అయిన తెలంగాణా జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువ అని పరిశీలన చేసి నిర్ధారణ చేస్తాడు.



నిగమన పద్ధతి :-

→ విద్యార్థి మొదటగా విషయానికి సంబంధించిన సూత్రాలను, సిద్ధాంతాలను అభ్యసించి, వాటి నిజానిజాలను పరిశీలన చేసి నిర్ధారిస్తాడు. విద్యార్థి మొదటి మొత్తంను అభ్యసించి తదుపరి భాగాలను పరిశీలన చేస్తాడు.
ఉదా : సముద్ర మట్టం నుంచి పైకిపోయే కొలది ప్రతి 1000 మీటర్లకు '6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది ఈ నియమాన్ని నిర్ధారించడంలో కోస్తా ప్రాంత విద్యార్థులను డెహరాడూన్, నీలగిరి కొండలు వంటి ఎకైన ప్రదేశాలకు తీసుకొని వెళ్ళినట్లు అయితే, పాఠ్యాంశాన్ని ముందుగా అభ్యసించిన విద్యార్థులు సముద్రతీర ప్రాంత ఉష్ణోగ్రతలను నీలగిరి ప్రాంతపు ఉష్ణోగ్రతలతో పోల్చి, పైన తెల్సిన నియమాన్ని, సిద్ధాంతాన్ని స్థిరీకరిస్తారు

సమస్యా పద్ధతిలో సోపానాలు :
→ సమస్యా ఎంపిక
→ సమాచారాన్ని పొందుపర్చడం
→ మూల్యాంకనం
→ సమస్య - సమాచార సేకరణ
→ సమస్య పరిష్కారాలను ఏర్పర్చడం


సమస్య ఎంపిక :-
→ ఉపాధ్యాయుడు, విద్యార్థుల వయస్సు, స్టాయి, ఆసక్తులు, అవసరాలకు సంబంధించిన సమస్యలను ఎంపిక చేయాలి. ఎంపి చేయబడే సమస్య విద్యా విలువలతో కూడినది అయి ఉండాలి.

సమాచార సేకరణ :-
→ సమస్యను గుర్తించి, దాన్ని స్పష్టంగా నిర్వచించి, అందుకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలనాగ్రంధాలు, వార్తాపత్రికలు మ్యాగజైన్స్ ద్వారా సేకరించాలి.


సమాచారాన్ని పొందుపర్చడం :-
→ విద్యార్థులు తాము ఎంపిక చేసిన సమస్యకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్దతిలో పొందుపర్చవలసి ఉంటుంది. ఇందులో నమస్యను నిగ్వచించడం, సమస్యలోని అంశాలను విశ్లేషించడం, సేకరించిన సమాచార సహాయంతో నేమన్యకు పరిష్కారాలను కనుక్కోవడము మొదలైనవి ఉంటాయి


సమస్య పరిష్కారాలను ఏర్పరచటము:-
→ సేకరించిన సమాచారాన్ని ఒక క్రమమైన విధానంలో పొందుపరచి సమస్యకు సంబంధించి వాటికి తగిన పరిష్కారాలను ఏర్పరచడము, సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతనే పరిష్కారాలను నిర్ణయించడం.
→ మూల్యాంకనము : ఎంపిక చేసిన సమస్యను పూర్తిగా విశ్లేషించి దాన్ని పరిశీలన చేసి ఏర్పరచుకున్న అభిప్రాయాలను స్థిరీకరించాలి.



సమస్యకు ఉండవలసిన మంచి లక్షణాలు :-
→ విద్యార్థుల ఆసక్తులు, అభిరుచుల స్థాయికి తగినదై ఉండాలి .
→ అర్థవంతమైనదిగా, ఉపయుక్తకరంగా ఉండాలి.
→ వాస్తవ సంఘటనలకు సంబంధించినదిగా ఉండాలి.
→ విద్యావిలువలు కల్గినదై ఉండాలి
→ విద్యార్థి అవసరాలకు, తగినదై ఉండాలి.
→ ఖచ్చితంగా నిర్వచించబడి, కావల్సిన వనరులు అందుబాటులో ఉండేదిగా ఉండాలి.
→ విద్యార్థులలో తార్కిక, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించేదిగా ఉండాలి.
→ ఇతర విషయాలలో సంబంధాన్ని కల్గి ఉండేదిగా ఉండాలి



సమస్య పద్ధతి - ప్రయోజనాలు :-

→ విద్యార్థులలో విషయజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది
→ సాంఘిక అధ్యయనాలపట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది.
→ విద్యార్థులలో తార్కిక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక శక్తులకు శిక్షణనిస్తుంది.
→ వాస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి సంసిద్ధులను చేస్తుంది.
→ విద్యార్థులను జ్ఞానాన్వేషణ చేయడానికి ప్రోత్సహిస్తుంది.
→ విద్యార్థులను పరిశోధనలవైపుకు దృష్టిని మరల్చేదిగా చేస్తుంది.
→ విద్యార్థి స్వీయనిర్ణయాలను చేయడంలో సహాయపడుతుంది.
→ విద్యార్థులలో చొరవ, బాధ్యతలను పెంపొందిస్తుంది.

పరిమితులు :-
→ అన్ని పాఠాలను సమన్య పద్ధతిలో బోధించలేము.
→ సమస్య పద్ధతి కాలయాపనతో కూడినది.
→ ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలోని పిల్లలకు నమస్యను విశ్లేషించే మానసిక శక్తులు ఉండవు- ఇది కళాశాల స్థాయివారికి తగినది.
→ దీనిలో సమాచార సేకరణకు అందులాటులో వనరులు లేనట్లయితే సమస్య సరిష్కాలాలు కనుక్కోవడం కష్టం అవుతుంది.



సంఘీకృత ఉద్గార పద్ధతి :-
→ సాంఘికశాస్త్ర బోధనలో పాఠ్యాంశాలను పరిచయం చేయడంలో, ముఖ్యమైన అంశాలు చర్చించడంలో, నమన్యలను విశ్లేషించడంలో సంఘీకృత ఉద్గార పద్ధతి చాలా ముఖ్యమైనది.
→ సాంప్రదాయ, ఉపన్యాస పద్ధతిలో గల లోపాలను సవరిస్తూ విద్యార్థులకు తరగతి గదిలో అర్థవంతమైన అభ్యసనంనకు. ఈ పద్ధతి తోడ్పడుతుంది
→ సంఘీకృత ఉద్గార పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఈ వద్ధతినందు విద్యార్థులు సహజంగా బోధన - అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేస్తుంది.
→ "విద్యార్థులు సహజ వాతావరణంలో సమస్యలపై సామూహిక చర్చలు జరుపుతూ, ప్రశ్నిస్తూ ప్రకటనలు చేస్తూ ప్రణాళికలను ఏర్పరచడమే" - సంఘీకృత ఉద్గార పద్ధతి అంటారు
→ సంఘీకృత ఉద్గార పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక స్నేహితునిగా, ఒక మార్గదర్శకడిగా, ఒక సహాయకుడిగా వుంటూ విద్యార్థులకు స్వీయపరిశోధనలు జరపడానికి సహకరిస్తాడు.



సంఘీకృత ఉద్గార పద్ధతి - రకాలు :-

1. సెమినార్
2. సింపోజియం
3. కార్యశిబిరాలు
4.నిపుణులు అయిన వ్యక్తులతో చర్చలు
5. మెదడుకు పని

→ సంఘీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు. నాయకుడు, విద్యార్థులందరూ కలసి ఒక విద్యార్థిని అధ్యక్షునిగా ఎన్నుకొని అతని ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.



సంఘీకృత ఉద్గార పద్ధతి - సోపానాలు :-
ప్రణాళిక :
→ విద్యార్థులు ఉపాధ్యాయునితో కలిసి చర్చ అంశాన్ని నిర్ణయించి, తగిన సమాచారం సేకరించి, చర్చ ఏ రూపంలో వుండాలో అంటే సెమినార్ / కార్యగోమ్ఠలులాగానా అని, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకొంటారు
నిర్వహణ :
→ చర్చ జరుగుతున్నప్పుడు విద్యార్థులు అంతా క్రమశిక్షణతో ఉండాలి. విద్యార్థులు ఒకరి ఎదురుగా మరొకరు కూర్చోవాలి. ఇతరుల అభిప్రాయాలు గౌరవిస్తూ, చర్చలను కొనసాగించాలి నివేదిక : విద్యార్థులు ఏ రూపంలో సంఘీకృత ఉద్గార పద్ధతిని చేపట్టినా ఆ కార్యక్రమాల వివరాలను రికార్డు రూపంలో ఒక పుస్తకంలో నోట్ చేయాలి. ప్రణాళిక, నిర్వహణకు సంబంధించిన అంశాలు నివేదన చేయాలి
మూల్యాంకనము :
→ సంఘీకృత పద్ధతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సోపానము. విద్యార్థులు తమ తప్పు- ఒప్పులను సరిచూసుకోవడం చేయాలి. సంఘీకృత ఉద్గార పద్ధతిలో నిర్వహణ అంతా అయిన తర్వాత తాము నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం, ఏర్పరచుకొన్న లక్ష్యాలు ఏ మేరకు సాధించినది. వాటి ఫలితాల విశ్లేషణ, ప్రణాళిక అమలు జరిగినదా లేదా, అని అన్ని అంశాలను పునఃపరీక్ష చేసుకోవడం మూల్యాంకనము.


ప్రయోజనాలు:-

→ విద్యార్థులకు మంచి శిక్షణ లభిస్తుంది.
→ ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు.
→ విద్యార్థులు విస్తృతమైన జ్ఞానాన్ని పొందుతారు
→ విద్యార్థులకు - ఉపాధ్యాయులకు మధ్య మంచి స్నేహపూరిత సత్సంబంధాలు నెలకొల్పబడ్డాయి
→ విద్యార్థులు ప్రణాళిక ఏర్పరచడంలో,చర్చలలో పాల్గొనడంలో అనుభవాలు పొందుతారు.
→ అభ్యసనం ఆసక్తికరంగా సాగుతుంది.
→ నాయకత్వ లక్షణాలు పెంపొందించబడ్డాయి




పరిమితులు :-
→ కాలయాపనతో కూడినది
→ విషయం ప్రక్కదోవపట్టే అవకాశం ఉంది.
→ కాలం వృధా అవుతుంది.
→ అన్ని పాఠ్యాంశాలకు తగినది కాదు
→ విద్యార్థులకు విసుగు ఏర్పడుతుంది
→ అనవసర వాగ్వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది




బోధనా యక్తులు:

పరీశీలన:-
→ ఏదైనా ఒక అంశాన్ని విషయాన్ని ప్రత్యేకమైన నిర్ధిష్టమైన దృష్టితో చూడడం
→ పరిశీలనలో వస్తువులను చూడడం, తాకటం, రుచి, వాసన చూడటం అనేవి ఉపయుక్తమైన వాస్తవ అనుభూతులను కల్గిస్తాయి
→ పరిశీలనల ద్వారా విద్యార్థులు శాస్త్రం పట్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని కనబరుస్తారు
→ విద్యార్థి సులభంగా అవగాహన చేసుకొంటాడు
→ విద్యార్థి విషయంలో స్పష్టంగా, నిర్దిష్టంగా అంశాలు తెలుసుకొంటాడు.
→ విద్యార్థి విస్తృత జ్ఞానాన్ని అర్జిస్తాడు
→ ఉదా :- విద్యార్థులను క్షేత్ర పర్యటనలో ఏదేని స్థలాలను సందర్శింపజేస్తే అక్కడి శిలాక్ృతులు, వస్తువులు, కోటలు, భవనాలు మొ|| ప్రత్యక్షంగా తాకి, చూసి ప్రాథమిక సమాచారాన్ని ఇస్తాయి
→ నోట్ :- పరిశీలన ద్వారా విద్యార్థులు విషయ సేకరణ చేస్తారు
→ ఉదా :- "ట్రాఫిక్ రూల్స్" పాఠాన్ని బోధించటానికి విద్యార్థులను ట్రాఫిక్ కూడలిని సందర్శింవజేస్తే ఎలక్ట్రానిక్ వరికరాల ద్వారా, చేతి గుర్తుల ద్వారా ట్రాఫిక్ ని ఎలా నియంత్రణ చేస్తారో తెలుసుకొనుట



పరిశీలనలోని రకాలు/రూపాలు: -
1) క్షేత్ర పర్యటనలు 2) సర్వేలు

క్షేత్ర పర్యటనలు :-
→ విద్యార్థులలో గల విసుగు, ఆసక్తిని తొలగించి, అభ్యసన ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా, అర్థవంతంగా, వైవిధ్యంగా చేస్తాయి.
→ క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్షానుభవాలు పొందుట మరియు విస్తృతమైన పరిజ్ఞానాన్ని పొందుతాడు
→ భావావేశరంగానికి సంబంధించిన లక్ష్యాలైన ఆసక్తులు, వైఖరులు, ప్రశంసనీయత లక్షణాలను అభివృద్ధి పరచటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి
→ ఇవి విద్యార్థుల ఆసక్తులు, వైఖరులలో మార్పును తీసుకొస్తాయి
→ ఉదా :- "మొగల్ సామ్రాజ్యం వారి కట్టడాలు" అనే పాఠ్యాంశానికి సంబంధించి ఢిల్లీ, ఆగ్రా కోటలు, పంచమహట ఫతేపూర్ సిక్రీ, తాజ్ మహల్ మొ| వాటిని సందర్శించిన విద్యార్థులు ఆనాటి గొప్పకట్టడాలు, ఆందలి కళానైపుణ్యాలను వారి సౌందర్యారాధనను ప్రశంసిస్తారు. వారి పరిపాలన పట్ల మంచి వైఖరులను పెంపొందించుకొని, వాలికి సంబంధించిన సమాచారాన్ని మరింత అభ్యసించటానికి ఇసక్తిని కనబరుస్తారు





క్షేత్రపర్యటనలు నిర్వహణ


ప్రణాళిక (Planning) :-
→ మంచి ప్రణాళిక పైనే ఏదైనా ఒక కార్యక్రమ విజయం ఆధారపడి ఉంటుంది
→ ఏ ప్రదేశానికి వెళ్ళాలి ? అక్కడ ఎన్ని రోజులు ఉండాలి? ఎంత ఖర్చగును ? ఎవరెవరు ఏమేమి చేయాలి ? ప్రణాళిక చేయుట


సిద్ధపరచుట (Readyness) :-

→ ఆ ప్రాంత శీతోష్ణ స్థితికి తగిన సామాగ్రిని సిద్దం చేసుకోవటం
→ ప్రయాణ మార్గాలు, భోజన సదుపాయాలు, చూడవలసిన ముఖ్య ప్రదేశాలు మొ॥వ సిద్ధం చేసుకొనుట

నిర్వహణ (Maintainance) :-
→ క్షేత్రపర్యటనలో అత్యంత ముఖ్య ఘట్టం నిర్వహణ
→ ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థులు కలసి సమన్వయంతో వ్యవహరించాలి
→ అక్కడి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకొని వాటిని నోట్ బుక్ లో పొందుపరచాలి
→ వీలైనంత వరకు చిత్రాల రూపంలో భద్రపరచటం
→ విద్యార్థులు సమయాన్ని పాటిస్తూ, క్రమశిక్షణతో ఉపాధ్యాయుని సూచనలు పాటిస్తూ, అన్ని ప్రదేశాలను దర్శించేలా చేయాలి



మూల్యాంకనం (Evaluation) :-
→ క్షేత్ర పర్యటన ముగిసిన అనంతరం, ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు ప్రతిస్థాయిలో ఏ విధంగా జరిగింది అనే అంశానికి సంబంధించిన లోటుపాట్లను బేరీజు వేసుకోవాలి
→ ఏఏ అంశాలను వదలివేసింది. ఏ ఏ సందర్భాలలో సమన్వయలోపం జరిగింది. మొ|| వాటినన్నింటిని మూల్యాంకనం చేయాలి

క్షేత్రపర్యటనల నిర్వహణలో గుర్తుంచుకోవలసిన అంశాలు : -
→ ఏ ఏ ప్రదేశాలను సందర్శించాలో ఉపాధ్యాయుడు, విద్యార్థులు కలసి నిర్ణయించాలి.
→ సందర్శించే ప్రదేశాలు విద్యా విలువలు పెంపొందించే విధంగా ఉండాలి
→ సందర్శన ప్రాంతాల రవాణా సౌకర్యాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి
→ సందర్శన ప్రాంతాలలో బసచేయడానికి కావలసిన అతిథిగృహాలను ముందుగా రిజర్వే చేసుకోవాలి
→ భోజన సదుపాయాలు గూర్చి నిర్ణయించుకోవాలి
→ సందర్శించే ప్రాంతాల విశేషాలను రికార్డు చేయడానికి అవసరమైన కెమెరా / వీడియో కెమెరా, పుస్తకం, కలాలు తీసుకొని వెళ్ళాలి
→ ప్రయాణంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే అవసరమైన ప్రథమ చికిత్స పెట్టె సిద్ధంగా వుంచుకోవాలి
→ కొన్ని కొన్ని ప్రాంతాలో గైడ్స్ చెప్పే విషయాలు వింటూ నోట్ చేసుకోవాలి. ఎత్తైన ప్రదేశాల వద్ద, సొరంగాలలోకి పోయేటప్పుడు, నీళ్ళుండే ప్రదేశాల దగ్గర జాగ్రత్తలు వహించాలి



ఉపయోగాలు:-
→ ప్రత్యక్ష అనుభవాలు అందిస్తాయి
→ విద్యార్థులలో సమాచార సేకరణ, నమోదు చేయుట, వ్యాఖ్యానం మొ వాటిలో శిక్షణనిస్తాయి
→ ఆసక్తి, ఉత్సాహాన్ని కల్గిస్తాయి
→ సామూహిక అధ్యయనాలకు తోడ్పడును
→ సాంఘిక జీవనానికి అవసరమైన శిక్షణనిస్తాయి.
→ విద్యార్థులు విస్తృతజ్ఞానాన్ని ఆర్జించి, అవగాహన చేసుకొనేందుకు అవకాశాన్ని కల్గిస్తాయి. - అని నూతన ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశాన్ని కల్గిస్తాయి
→ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్న అంతరాయాలను తొలగించి స్నేహపూరిత వాతావరణాన్ని రూపొందిస్తాయి
→ విద్యార్థులు ఒకరికొకరు సహకరించేందుకు / కలిసి పనిచేయడానికి నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి.




క్షేత్రపర్యటనలు - ఉపాధ్యాయుని పాత్ర :
→ ప్రదేశాల ఎంపిక దగ్గర నుండి నిర్వహణ వరకు ప్రతిస్థాయిలోను ఉపాధ్యాయుడు బాధ్యతతో వ్యవహరించాలి.
→ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి
→ ప్రమాద స్థలాలను నందర్శించేటపుడు విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగేలా చూడాలి






సర్వేలు:-



→ సమాజంలో ఉన్న సమస్యలను తెలుసుకొని, సరైన రీతిలో స్పందించేందుకు తోడ్పడును.
→ సామాజిక వ్యవహారాలలో విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశాలను కల్పించి వారిని ప్రజాస్వామ్య పౌరులుగా / క్రియాశీలమైన అంశాలను చేపట్టేలా చేయును
→ సామూహిక, వ్యక్తిగతమైన జీవనానికి అవసరమైన పరస్పర సహకారం, ఒకరిమీద మరోకరు ఆధారపడే విధానాలను తెలియజేయును
→ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు తమ పరిసరాలను పరిశీలించటం ద్వారా అందలి భౌతిక, సాంఘిక, సామాజిక, ఆర్జి విషయాలకు సంబంధించి జ్ఞానాన్ని పొందుతారు
→ ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను నిశితంగా, విమర్శనాత్మకంగా పరిశీలించటం ద్వారా నేటి విద్యార్థులను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి తోడ్పడును.

ఉదా :-
→ 5వ తరగతి విద్యార్థులను తమ గ్రామంలో వివిధ నేలలను, అక్కడ వండే పంటలను సర్వే చేయించుట
→ పంచాయితీ, ఆసుపత్రి, పోస్టాఫీస్ మొ॥ వాటి నిర్మాణం, పనితీరు, అందలి సమస్యలు, వాటికి పరిష్కార మార్గా అన్వేషణ మొ॥ వాటిని నర్వే చేయటం ద్వారా ప్రాథమిక నైపుణ్యాలైన సమాచార సేకరణ, కూర్పు, అన్వయం మూల్యాంకనాలను పెంపొందించగలం



సర్వేలు లాభాలు :-
→ విద్యార్థికి సామాజిక సమస్యలను గూర్చి తెలుసుకొనేందుకు అవకాశాన్ని ఇస్తాయి.
→ సర్వేలు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దును
→ సర్వేలు విద్యార్థులకు సాంఘికశాస్త్ర అధ్యయనాల పట్ల అభిరుచిని పెంపొందిస్తాయి



ప్రశ్నించడం :-
→ సాంఘికశాస్త్ర బోధనలో ప్రశ్నించటం ఒక ప్రధానమైన యుక్తి / ఉపాయం
→ బోధన, అభ్యసన, మూల్యాంకన ప్రక్రియలో ప్రశ్నించడం చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకొంది
→ సాధారణంగా బాగా ప్రశ్నించే ఉపాధ్యాయుడు బాగా బోధించగలడు
→ ప్రశ్నించటం బోధనలో ఒక కళ మరియు అంతర్భాగం
→ విద్యార్థులు అభ్యసనలో తనకు అర్థంకాని అంశాలను అనుమానాలను సివ్బత్తి చేసుకోవడానికి ఉపాధ్యాయులను ప్రశ్నిస్తాడు
→ విద్య అనుభవాలను ఒక క్రమమైన విధానంలో పొందుపరటానికి ప్రశ్నలు సాధనాలుగా ఉపకరిస్తాయి
→ సరైన సందర్భంలో వేసిన ప్రశ్నలు సరైన అవగాహనకు తోడ్పడును
→ విద్యార్థి పాఠ్యాంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు. రూపొందించిన లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో ఉపాధ్యాయునికి తెలియజేస్తాయి
→ పిల్లవాని సాంఘిక, మానసిక, భాషా సూచికగా ప్రశ్నించడాన్ని చెప్పవచ్చు



ప్రశ్నలు ఉద్దేశాలు :-
→ విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించుటకు
→ విద్యార్థులు అభ్యసించిన అంశాలను పునఃన్మరణ చేయడానికి
→ విద్యార్థులను తార్కికంగా ఆలోచింపచేయడానికి
→ విద్యార్థులలో అభ్యసించే అంశాల ఆసక్తిని పెంపొందించడానికి
→ అభ్యసనలో విద్యార్థులను మానసికంగా చురుకుగా ఉండేలా చేయుటకు
→ విద్యార్థులలో సహజత్వం, చురుకుదనాన్ని పెంపొందించటానికి
→ విద్యార్థులు పాఠాన్ని అనుసరిస్తున్నారో లేదో నిర్ధారించటానికి
→ విద్యార్థులు ఏ ఏ అంశాలను అభ్యసించడంలో వెనుకబడి ఉన్నారో గుర్తించడానికి
→ కొత్త అంశాలను పాత అభ్యసన అంశాలతో జతచేయదానికి
→ పాఠాన్ని పునఃపరిశీలన చేసి విద్యార్థులు వాస్తవాలను మనస్సులో ముద్రించుకోవడానికి



ప్రశ్నలు - 3 రకాలు :-
1. ప్రాథమిక లేదా ప్రవేశికలో వేయబడే ప్రశ్నలు
2.పాఠ్యాభివృద్ధి క్రమంలో వేసే ప్రశ్నలు
3. పునర్విమర్శకు సంబంధించిన ప్రశ్నలు


నియత ప్రశ్నలు (Teacher - Student) :-
→ విద్యార్థుల అభ్యసనస్థాయిని తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు అడిగేవి
→ ఉపాధ్యాయునికి ముం జవాబు తెలిసి అడుగుతాడు కనుక వీటిని నియత ప్రశ్నలు అంటారు



అనియత ప్రశ్నలు (Student - Teacher) :-
→ ఏదైనా ఒక తెలియని విషయాన్ని / కొత్త విషయాలను తెలుసుకోవడానికి విద్యార్థి ఉపాధ్యాయుని అడిగే ప్రశ్నలు సహజ ప్రశ్నలు




ప్రారంభ ప్రశ్నలు :-
→ పాఠాన్ని బోధించేందుకు ముందు విద్యార్థులను ప్రేరణకు గురిచేయడానికి, పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి వేసే ప్రశ్నలు
→ విద్యార్థులను అభ్యసనకు సంసిద్ధ సరచడానికిగాను అడిగేవి




పునర్విమర్శ ప్రశ్నలు :-
→ పాఠ్యాంశ ముగింపులో అడిగే ప్రశ్నలు, పాఠం విద్యార్థి ఎంతవరకు అర్థం చేసుకున్నాడు
→ బోధనా లక్ష్యాలు ఎంత వరకు సాధించడం జరిగింది మొ॥ వాటిని తెలుసుకోవడానికి
→ ఉపాధ్యాయుని బోధనలో ఉన్న జయాపజయాలు తెలుసుకోవచ్చు.



పాఠాన్ని అభివృద్ధిపరచడంలో అడిగే ప్రశ్నలు :-
→ ఇవి పాఠానికి వెన్నెముకలాంటివి
→ ఇవి విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన అంశంపై ఆలోచింపజేస్తాయి
→ విద్యార్థులు స్వయంగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి / సత్యాలు అన్వేషించడానికి తోడ్పడుతాయి
→ కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో ఉపకరిస్తాయి - కొత్త కోణంలో పాత అంశాలను చూడటంలో ఈ విధమైన ప్రశ్నలు దోపాదపడతాయి
→ ఇవి ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠ్యాంశాలను వివరిస్తున్న సన్నివేశంలో అడుగుతూ విద్యార్థులను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా, విభిన్నంగా తార్కికంగా ఆలోచింపజేయడానికి దోహదపడతాయి.




ప్రశ్నలు - రకాలు



1. పోలికలు - భేదాలు :-

ఉదా :- మాగ్మాకు, లావాకు మధ్య భేదం ఏమిటి ?



2. అనుకూల / ప్రతికూల చర్చలు :-
ఉదా :- విదేశీ పెట్టుబడులలో 100% వాటాకు అనుకూలమేనా ?

3. వర్గీకరణ ప్రశ్నలు :-
ఉదా :- పన్నులను, వర్గీకరించండి


4. సంబంధాలను తెలియజేసేవి :
ఉదా :- దేశప్రగతి, భవిష్యత్ ప్రధానమంత్రి పై ఆధారపడి ఉండునని ఎలా చెప్పగలవు?


5. ఉదాహరణలిచ్చు ప్రశ్నలు
ఉదా :- భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతానికి ఉదాహరణనిమ్ము?

6. విమర్శనాత్మక ప్రశ్నలు
ఉదా :-
1) తలసరి ఆదాయం ఆర్ట్స్ కాభివృద్ధికి మంచి సూచికగా ఎలా గ్రహించబడలేదు ?
2) ఒక దేశ ప్రగతికి పారిశ్రామికీకరణ తప్పనిసరి ?

7. చర్చా ప్రశ్నలు
ఉదా :- మధ్యయుగం నాటి మొగలాయిల వాస్తు శిల్ప కళా వైభవాన్ని చర్చించండి


8. సారాంశ ప్రశ్నలు : (క్లుప్తంగా వ్రాయండి)
ఉదా :- కాంస్య యుగం నాటి రాజకీయ, మత పరిస్థితులను గూర్చి క్లుప్తంగా వ్రాయండి ?

9.పరిశీలనాత్మక ప్రశ్నలు :-
ఉదా :- రాత్రిని భూమధ్యరేఖా మండలం చలికాలంగా పరిగణిస్తారు ? ఎందుకని ?


10. కారణాలు / ఫలితాల ప్రశ్నలు :-
ఉదా :- జాతీయ ప్రభుత్వాలేర్పడడానికి కారణాలు ఏవి ? వాటి ఫలితాలు తెలపండి ?

11. వివరణ / విశదీకరణ / వర్ణనా ప్రశ్నలు
ఉదా :-
1) ఆర్థిక కార్యకలాపాల చక్రీయ ప్రవాహాన్ని వివరించండి ?
2) దైనిక వాతావరణ స్థితి శీతోష్ణస్థితుల ప్రక్రియను విశదీకరించండి?
3) ప్రపంచ పవన వ్యవస్థను వర్ణించండి?



మంచి ప్రశ్నలకు ఉండవలసిన లక్షణాలు :-
→ సులభ భాషను ఉపయోగించాలి
→ చిన్నవిగా, స్పష్టంగా ఉండాలి
→ సందిగ్ధంగా, అర్థంకాకుండా లేదా అస్పష్టంగా ఉండకూడదు
→ మరీ పెద్దదిగా రెండు మూడు వాక్యాలలో ఉండకూడదు.
→ మరీ సులభంగానూ లేదా మరీ కఠినంగానూ లేకుండా మధ్యస్థంగా ఉండాలి
→ ప్రశ్నలు అవును లేదా కాదు అనే జవాబు ఇచ్చే విధంగా ఉండరాదు
→ "ఎకో ఎఫెక్ట్" ఉండే ప్రశ్నలు అడుగరాదు
ఉదా :- గాంధీగారు గుజరాత్లో పోరుబందరులో జన్మించారు. గాంధీగారు ఎక్కడ జన్మించారు ?
→ ఆలోచింపజేసే విధంగా ప్రశ్నలు అడగాలి
→ విద్యార్థులకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇచ్చి ఆ పై సమాధానాలు చెప్పమని అడగాలి
→ మౌఖిక ప్రశ్నలు ఒకే ఒక్క సమాధానాన్ని ఇచ్చే లక్ష్యాత్మక ప్రశ్నలై ఉండాలి
→ రాతపూర్వక ప్రశ్నలు వ్యాసరూపంలో వారి భాషా నైపుణ్యాన్ని, విషయ సామర్థ్యాన్ని, రచనా నైపుణ్యాన్ని నిర్ధారించే విధంగా ఉండాలి
→ వ్యక్తిగతంగా జవాబు చెప్పే విధంగా ఉండాలి




నాటకీకరణ (భావావేశరంగం + అంతర్గత సామర్థ్యాలు):-
→ నాటకీకరణలో నాటకాలు, ముఖాభినయాలు, తోలుబొమ్మలు, జానపద కళాప్రదర్శనలు, నాట్యరూవకాలు, నృత్యనాటికలు మొ||వి
→ ఇవి విద్యార్థులకు రకరకాల అభ్యసనానుభవాలను కలిగిస్తాయి
→ నోట్:- దీనిలో వేషధారణ ముఖ్యమైంది కాదు కాని భావ వ్యక్తీకరణ, నటనకు కంఠస్వరం, విషయ వివరణలో అధికప్రాముఖ్యం ఇవ్వబడుతుంది
→ విద్యార్థుల ఇష్టానుసారం పాత్రల ఎంపిక జరగాలి
→ దీనిలో వారి యొక్క అంతర్గత శక్తులను, వారి అసక్తులు, నటనా సామర్థ్యాలు ప్రతిభాపాటవాలు వెలికితీయవచ్చు.
→ దీనిలో విద్యార్థి అభ్యసన ఆసక్తికరంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా కొనసాగును
→ నేటి విద్యా విధానం విద్యార్థి కేంద్రీకృతమైనది. కనుక కాబట్టి విద్యార్థి ఆసక్తులు, వైఖరులు, అవసరాలకు ప్రాధాన్యాన్నిచ్చే నాటకీకరణను కల్పించాలి
→ నోట్:- ఈ నాటకీకరణ ద్వారా నహకారభావం, సత్ప్రవర్తన, కృషి, క్రమశిక్షణలాంటివి పెంపొందిస్తుంది. ఇది భావావేశరంగానికి ప్రాధాన్యతనిస్తుంది
→ ఉదా :- రాజారామ్మోహనాయ్ "సతి" అనే దురాచారాన్ని రూపుమాపిన విధానం



ప్రయోజనాలు :-

→ విద్యార్థులకు సాంఘిక అధ్యయనాల పట్ల ఆసక్తి పెంపొందిస్తుంది
→ విద్యార్థులలో అంతర్గతంగా ఉన్న సహజ సామర్థ్యాలు వెలికితీస్తుంది.
→ విద్యార్థులు సాంఘిక అధ్యయనాలను ఆనందంగా, అభ్యసించేలా చేస్తుంది
→ అభ్యసనలో ఏకాగ్రతను నిలుపుదల చేస్తుంది
→ సామాజిక జీవనానికి శిక్షణనిస్తుంది


పాత్ర పోషణ :-
→ అసహజమైన / కృత్రిమ పరిస్థితులలో వాస్తవమైన లేదా ఖచ్చితమైన పాత్రను పోషించడాన్ని "పాత్రపోషణ" అంటారు
→ దీనిలో విద్యార్థి తనను తాను ఇతరుల జీవితాలలోకి తదాల్మీకరణ చేసుకొని ఆయా పాత్రను సహజమైన రీతిలో ప్రతిబింబించేలా పోషిస్తాడు
→ దీనిలో పాత్ర పోషణే కాకుండా ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని కూడా పాత్రల ద్వారా చూపించవచ్చు
ఉదా :- శివాజి - అతని పరిపాలన, పరమత సహనం
→ పాత్ర పోషణ ద్వారా విద్యార్థులలో నిబిడీకృతమైన కళాత్మక సామర్థ్యాలను వెలికితీయవచ్చు.
→ సాంఘిక జీవనంలో ఉన్న వివిధ వ్యక్తులు వారి మధ్య ఉండే సంబంధాలు తెలుసుకొని తద్వారా వాస్తవ పరిస్థితులలో ఎలా మెలగాలో తెలుసుకొంటాడు

ఉపాధ్యాయుని పాత్ర :

→ వీలైనంతవరకు ఉపాధ్యాయుడు సామాజికాంశాలకు సంబంధించిన పాత్రలను ఇవ్వాలి
→ విద్యార్థి అభిరుచికి, సామర్థ్యానికి తగిన పాత్రను విద్యార్థి స్వయంగా ఎంపిక చేసుకొనేట్లు చేయాలి
→ విద్యార్థి ఎంచుకున్న పాత్రకు సంబంధించిన విషయ సమాచారాన్ని ఉపాధ్యాయుడు అందించాలి
→ పాత్ర పోషణలో తన హావభావాలను, ముఖ కదలికలు, స్వరంలో మార్పులు ఎలా వ్యక్తపరచాలో శిక్షణనివ్వాలి

సిమ్యులేషన్ :-
→ బోధన పరోక్షంగా కల్పితమైన పరిస్థితులలో ప్రదర్శింరచబడటాన్ని "సిమ్యులేషన్ బోధన" అనవచ్చు

→ ఈ విధానం మానవ చరిత్రంత పురాతనమైనది
ఉదా :-
1. జంతువులు తమ పిల్లలకు భౌతికవాతావరణంలో సర్దుబాటు చేసుకొనేందుకు శిక్షణనివ్వడం
2. సైనికులకు శిక్షణనిచ్చే కార్యక్రమాలలో కృత్రిమ యుద్ధ వాతావరణం కల్పించుట
3.ఫైలు శిక్షణ మొ॥

→ జాతీయ క్రీడా మండలిలో సిమ్యులేషన్ / కల్పితాల ప్రాధాన్యతను వెల్లడించినది" - 1961 అమెరికా
→ అంతర్జాతీయ సిమ్యులేషన్ - క్రీడలు అనే త్రైమాసిక సంచిక - 1970 జర్మనీ
→ నోట్ :- సిమ్యులేషన్ విధానాన్ని క్రీడలలో ఒక బలమైన సమాచార ప్రసార సాధనంగా వాడుతున్నారు.
→ బోధనా - శిక్షణ సంస్థలలో నిపుణులైన, సామర్ధ్యలున్న ఛాత్రోపాధ్యాయులకు కావలసిన బోధనా నైపుణ్యాలను పెంపొందించుటలలో ఉపయోగించవచ్చు
→ ఉదా :- సూక్ష్మబోధనలో ఒక్కొక్క నైపుణ్యాన్ని ఛాత్రోపాధ్యాయునికి బోధించుట

→ వృత్తిపూర్వక, వృత్తంతర శిక్షణలలో కూడా సిమ్ములేషన్ పద్ధతిలో మాదిరి పాఠాలను ఉపాధ్యాయులకు బోధించుట
ఉదా :- టీచర్ సెంటర్ / స్కూల్ కాంప్లెక్స్ లో బోధించే మాదిరి పాఠాలు

→ సిమ్యులేషన్ విధానం పిల్లలు ఆడే ఆటలలో కూడా చూడవచ్చు
ఉదా:- అమ్మ - నాన్న - పిల్లలు - బంధువులుగా అభినయించుట

→ దీన్ని ఆధారంగా చేసుకొని విద్యా కార్యక్రమాలలో, పాఠ్యాంశ బోధన ఆసక్తికరంగా అర్ధవంతంగా చేయవచ్చు.



సిమ్యులేషన్ సోపానం :-
→ ఉపాధ్యాయుడు ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర ఇచ్చి పోషించమంటాడు.