అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




మూర్తిమత్వ వికాసము - లక్షణాలు






విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు






మంచి బోధనా పద్ధతి లక్షణాలు :
→ ఆసక్తిని పెంపొందించాలి
→ విసుగును కలిగించకూడదు
→ సులభంగా అవగాహన చేసుకొనుటలో తోడ్పడాలి
→ ఆనందంగా అభ్యసించాలి
→ ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య మంచి అనుబంధాన్ని ఏర్పరచాలి.
→ మంచి వైఖరులను పెంపొందించాలి.
→ తరగతిలో అన్ని స్థాయిలవారికి తగినదిగా / ఉపయుక్తంగా ఉండాలి
→ విద్యార్థిలో సృజనాత్మకను పెంపొందించేట్లుగా ఉండాలి
→ విద్యార్థిలో ఆలోచనలను రేకెత్తించేట్లుగా ఉండాలి బట్టి విధానం కాకుండా, మూర్త, వాస్తవ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి
→ మంచి / విస్తృతమైన విషయ పరిజ్ఞానాన్ని అందించేట్లుగా ఉండాలి
→ సందర్భాన్ని బట్టి / అవసరాన్ని బట్టి రెండు మూడు రకాల బోధనా పద్ధతులను కలిపి బోధించాలి



బోధనా పద్ధతులు రెండు రకాలు :-

1) ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు
2) విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు

→ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులలో ఉపాధ్యాయుని పాత్ర అధికంగా ఉంటుంది. వీటిలో ఉపాధ్యాయులు చురకుగా క్రియాశీలకంగా ఉంటారు. విద్యార్థులు నిష్క్రియాత్మక శ్రోతలుగా ఉంటారు.
ఉదా :- ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, వనరుల పద్ధతులు, చారిత్రక పద్ధతి, నిర్మాణ వద్దతి, ఉవన్యాన ప్రదర్శనా పద్ధతి
→ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులలో విద్యార్థి పాత్ర అధికంగా ఉంటుంది. విద్యార్థులు క్రియాతీలురుగా, ఉత్సాహంతో ఆసక్తితో పాల్గొంటారు.
ఉదా :- క్రీడా, అన్వేషణ, ప్రకల్పన, ప్రయోగశాల, సమస్యా పరిష్కార, కృత్యాధార మొ॥॥

బోదనా పద్ధతి ఏ విధంగా సాగాలి :-
→ తెలిసిన దాని నుంచి తెలియనిదానికి
→ సరళత నుంచి క్లిష్టతకు
→ మూర్తం నుంచి అమూర్తానికి
→ ఆగమన నుంచి నిగమన
→ విశ్లేషణ నుంచి సంశ్లేషణ
→ ఉదాహరణల నుంచి సూత్రానికి
→ ప్రత్యేకాంశాల నుంచి సాధారణాంశాలకు
→ ప్రయోగాలు, పరిశీలనల నుంచి సూత్రీకరణలకు
→ మొత్తం నుంచి భాగాలకు (స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టి)
→ పిల్లలు తమంతట తామే జ్ఞాన నిర్మాణం చేసుకొనేందుకు తగిన అభ్యసనానుభవాలు కల్పించుట
→ అన్వేషణకు ప్రాధాన్యతనివ్వటం
→ సహజ అభ్యసన సన్నివేశాలు, ఉదాహరణలు కృత్యాల ద్వారా భావనలు ఏర్పడుట


→ బట్లర్, రెన్ ల ప్రకారం బోధనా దశలు నాలుగు స్థాయిల్లో ఉంటాయి
→ నూతన భావనల, సంబంధాల అవగాహణ గణితజ్ఞానార్జనకు
→ భావనలు, సంబంధాలు లోతుగా ఫలవంతంగా అవగాహన చేసుకోవడానికి
→ పొందిన అవగాహనలను, నైపుణ్యాలను పదిలపరచుకోవడానికి
→ అభ్యసించిన జ్ఞానం, నైపుణ్యాలను దైనందిక జీవితంలో సాంఘిక అవసరాలకు, బౌద్ధిక వికాసానికి అనువర్తించడానికి (జ్ఞానార్జనకు బోధన - జీర్ణపరచడానికి బోధన - శాశ్వతత్వానికి బోధన - బదలాయింపునకు బోధన)

బోధన:-
→ ఎక్కువ జ్ఞానం, ఎక్కువ అనుభవం గల వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తికి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించటం

అభ్యసన :-
→ అనుభవం ద్వారా లేదా అభ్యాసం ద్వారా లేదా శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తనా మార్పులు. ఇవి శాశ్వతమైనవి అభివృద్ధి చెందేవి
→ నోట్ :- బోధనాభ్యసనలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి

మానసిక వికాసం :-
→ ప్రజ్ఞ, ప్రత్యక్షజ్ఞానం, విషయ దృక్కోణం, ఆలోచన, పరిశీలన, భావనలు, స్మృతి, ఊహ, వివేచన, సమస్యా పరిష్కారం అవధానం మొవి మానసిక సామర్థ్యాలు, ఈ మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందటమే మానసిక వికాసం
→ బాల్య దశ (4-12 నం) - ప్రాథమిక పాఠశాల స్థాయిలు
→ కౌమార దశ (12-18 సం||) - ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాల స్థాయిలు



బాల్యదశ :-
→ పిల్లలు చుట్టూ ఉన్న వస్తువులను / పరిసరాలను కుతూహలంతో గమనిస్తారు
→ ఏమిటి ? ఎలా? తరచూ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకే దీనిని ప్రశ్నార్థకాల దశ
→ ఈ దశలో వారికి సంక్లిష్టమైన కాలం, భిన్నాలు, వైశాల్యం, దశాంశ భిన్నాలను అవగాహన చేసుకొనే ప్రయత్నం కనిపిస్తుంది
→ రాయడం, చదవటంలో అభివృద్ధి జరుగును
→ విషయానగాహనతోపాటు చర్చించటం, ఆలోచించటం, విశ్లేషించటం మొదలవుతుంది.



కౌమార దశ:-
→ మానసిక వికాసం ఉచ్ఛస్థితిలో ఉంటుంది
→ ఎక్కువ ఏకాగ్రత అవధానం ఉంటాయి
→ మానసిక స్వేచ్చ పెరుగుతుంది
→ ప్రాపంచిక విషయాలపై తర్కించటం జరుగుతుంది
→ అమూర్త విషయాలపై ఆలోచించటం జరుగుతుంది
→ భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛకావాలనుకొంటారు
→ నిర్మాణాత్మక కార్యాచరణతోపాటు, సృజనాత్మకతను ప్రదర్శిస్తాడు
→ స్వయం క్రమశిక్షణ ఏర్పడును
→ హేతువాద దృక్పథం కలిగి ఉంటారు
→ విశ్లేషణా శక్తి పటిష్టమగును.






బాల్యదశకి తగ్గ కార్యక్రమాలు :
→ మార్త విషయాలతో బోధించాలి
→ జట్టు కృత్యాలు నిర్వహించటం జరుగును
→ అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు అన్వేషణ అవకాశాలు కల్పించబడతాయి
→ కథలు, ఆట పాటలు, పరిశీలనలు, క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి

కౌమార దశకి తగ్గ కార్యక్రమాలు :-
→ అమూర్త అంశాలను బోధించవచ్చు
→ ప్రాజెక్టులు ఇవ్వాలి
→ పని అనుభవం ప్రాధాన్యత కలిగిన కృత్యాలు ఇవ్వాలి
→ ఊహాత్మక ఆలోచన, హేతువాద ఆలోచన, సమస్యా పరిష్కారం, సృజనాత్మకతను పెంపొందించే అనుభవాలు కల్పించాలి
→ వ్యక్తిగత గుర్తింపునిచ్చే వ్యాసక్తులు ఇవ్వాలి
→ గణితపరమైన భాషను, సంకేతాలను ప్రవేశపెట్టటం
→ గణిత సూత్రీకరణం చేయటం
→ గణితంలో స్వీకృతాలు, సిద్ధాంతాలు, వాటి నిరూపణలు ప్రవేశపెట్టటం








ఉపన్యాస పద్ధతి :-

→ ఉపాధ్యాయులకు ఇష్టమైన పద్ధతి
→ ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు మాత్రమే చురుకుగా ఉంటారు
→ దీనిని నల్లబల్లపై రాసి మాట్లాడే పద్ధతి అంటారు
→ దీనిలో విద్యార్థి కన్నా విషయానికే ప్రాధాన్యత ఉంటుంది
→ ఇది అత్యంత పురాతన పద్ధతి, స్పీచ్ మెథడ్ లేదా భాషణ పద్ధతి అంటాం. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి
→ ఇందులో ఉపాధ్యాయుడు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు
→ ఉపాధ్యాయుడు క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు
→ దీనిని ఎక్కువగా కళాశాల స్థాయి / ఉన్నతస్థాయిలో విరివిగా ఉపయోగిస్తారు
→ ఈ పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు తన అనుభవాలను, ఆలోచనలను అనర్గళంగా మాటల రూపంలో వివరిస్తాడు
→ ఉపాధ్యాయుడు శాస్త్రంలోని సంఘటనలను, ధోరణులకు సంబంధించిన సమాచారాన్ని ఒక క్రమమైన విధానంలో విద్యార్థులకు అందిస్తాడు
→ నోట్ :- కథలు, జీవిత చరిత్రలు ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరాలు


ఉపయోగించే సందర్భాలు : -

ఉద్దీపన చేయటంలో :-
→ నూతన పార్యాంతాల బోధనా సమయంలో వాటిని విద్యార్థికి ఆశక్తిగా చెప్పడానికి, వారిలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించడానికి "ఉపన్యాస పద్ధతి" ని ఉపయోగిస్తాం.
→ ఉదా :- 5వ తరగతిలో గ్రహణాలు పాఠ్యాంశం చెప్పే ముందు ఇటీవల ఏర్పడిన గ్రహణాల గురించి ఉపన్యసించుట



నూతన పాఠ్య పరిచయం :-
→ నూతన పాఠ్యాంశాన్ని పరిచయం చేసే ముందు విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరీక్షించే సందర్భంలో ఉపన్యానంను వాడుతాం ఉదా :- స్వాతంత్ర్యోద్యమం గూర్చి చెప్పే ముందు మొదటగా జరిగిన 1857 తిరుగుబాటు గురించి వివరించుట

విషయ స్పష్టతను కలిగించటంలో :-
→ ఉపాధ్యాయుడు వివరించటంలో, తన స్వీయ అనుభవాలను, పరిశీలనలను ఉటంకిస్తూ బోధించటంలో ఉపయోగిస్తాడు




విస్తృతమైన విషయ పరిజ్ఞానాన్ని అందించటానికి :-
→ ఉపాధ్యాయుడు పాఠ్య విషయాలను బోధించేటప్పుడు కేవలం అవగాహన కల్పించుట మాత్రమే కాకుండా వర్తమాన వ్యవహారాలను కూడా కలిపి విస్తృతమైన సమాచారాన్ని అందించటానికి ఉపయోగిస్తాం





పునఃసమీక్షించటానికి :-
→ ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన అంశాలను మరొక్కసారి క్లుప్తంగా వివరించి, సరైన అవగాహన కలిగించటానికి




అనుమానాలను నివృత్తి చేయటంలో :-
→ విద్యార్థులు పాఠ్యాంశాలను అభ్యసిస్తున్నపుడు, వాటిని అవగాహన చేసుకొనుటలో ఇబ్బందులను గుర్తించి తన వాక్చాతుర్యంతో వాటిని తొలగించవచ్చు
ఉదా :- జిజియా పన్ను, క్యుములోనింబస్ మేఘాలు


ఉపన్యాస పద్ధతి ఉపయోగాలు :
→ ఆర్థికంగా సులువైనది / ఖర్చులేనిది
→ బోధనకు పరికరాలు, ప్రయోగశాలలు అవసరం లేదు
→ తక్కువ కాలంలో ఎక్కువ అంశాల బోధన
→ సిలబస్ సకాలంలో పూర్తి చేసి, పునశ్చరణ చేయవచ్చు
→ అధిక సంఖ్య తరగతుల విద్యార్థులకు కూడా బోధన చేయవచ్చు.
→ పనిభారం తగ్గును
→ విద్యార్థులలో ఆసక్తిని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపవచ్చు
→ విద్యార్థుల అనుమానాలు తొలగించుట ద్వారా ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య సత్సంబంధాలు కలుగును
→ ఇది వినడంలో శిక్షణనిస్తుంది మరియు రాయడంలో శిక్షణనిస్తుంది
→ ఇది సమయాన్ని ఆదా చేస్తూ, విస్తృతజ్ఞానాన్ని అందివ్వడం జరుగును
→ ముద్రితా పదం కన్నా మాట గొప్పది






ఉపన్యాస పద్ధతి - దోషాలు :-

→ కృత్యాధార సూత్రానికి విరుద్ధం
→ ప్రయోగాలు చేయుటకు అవకాశం లేదు
→ నూతన విషయాలు బోరించుటకు అవకాశం లేదు
→ శాస్త్రీయ వైఖరులు పెంపొందించలేము
→ వైయుక్తిక భేదాలు దృష్టిలోకి తీసుకోడు
→ విద్యార్థుల అవగాహనను అంచనావేయుట కష్టం
→ విద్యార్థులు ఏకాగ్రత లోపిస్తే విసుగు చెందుతారు.
→ విద్యార్థులు భౌతికంగా తరగతిలో ఉన్నా మానసికంగా సిద్ధంగా ఉండరు
→ అన్ని పాఠ్యాంశాలనూ ఈ పద్ధతిలో బోధించలేము
→ విద్యార్థుల ప్రక్షా స్థాయిని పరిగణలో తీసుకోదు
→ విద్యార్థి క్రియారహితంగా / చైతన్య రహితంగా ఉండును
→ విద్యార్థి చురుకుగా లేకుండా స్తబ్దంగా ఉంగును




ఉపన్యాస పద్దతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

→ ముందుగా ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదివి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ముఖ్యాంశాలను నోట్స్ తయారు చేసుకోవాలి
→ ప్రారంభంలో విషయ పరిచయం గూర్చి ప్రస్తావించాలి.
→ విషయాన్ని సవివరంగా ఒకదాని తరువాత ఒకటి పరిచయం చేస్తూ తార్కికంగా, ఉదాహరణలతో వివరించాలి
→ ఉపన్యాసించేటప్పుడు కంఠస్వరంలో మార్పులు చేస్తూ బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా వింటారు
→ ముఖ్యమైన విషయాలను పలుమార్లు తిరిగి వక్కాణించాలి
→ మధ్యమధ్యలో సందర్భోచితంగా చతురోక్తులను జతచేసినట్లయితే అభ్యసన వాతావరణం ఆహ్లాదంగా ఉండును
→ విషయం' సంక్లిష్టంగా ఉండాలి. విషయ స్పష్టత ఉండాలి
→ ఉపాధ్యాయుడు ఉత్సాహంగా, అభిరుచిగా కనిపించాలి
→ పారిభాషిక పదాలు, శాస్త్రీయ పదాలు, భావనలు, నమీకరణాలు నల్లణల్లపై రాయాలి బోధించే విషయానికి సంబంధించిన సరైన ఉదాహరణలు ఉటంకిస్తూ బోధించినట్లైతే విషయం తేలికగా అర్థమవుతుంది.
→ మధ్యమధ్యలో విద్యార్థులను ప్రశ్నిస్తూ, వారు చర్చలో పాల్గొనేట్లు చేయాలి
→ ఉపన్యాసాన్ని రిహార్సిల్ చేసి దోషాలను సవరించుకోవాలి
→ పిల్లలవైపు చూస్తూ ప్రశాంతంగా ప్రసంగించాలి
→ విద్యార్థులందరికీ వినబడేలా కంఠస్వరముండాలి
→ ఉపన్యాసించేటపుడు తరగతి గదిలో విద్యార్థులందర్ని గమనిస్తూ ఉండాలి
→ మంచి సరళమైన భాష, తప్పులు లేని చక్కని ఉచ్చారణ, మంచి కంఠస్వరం కలిగి ఉపన్యానం అధ్యంతం విన్నవారికి హాయిగా ఉండాలి
→ ఉపన్యాసించే విషయానికి సంబంధించిన ముఖ్యాంశాలను ముందుగా నిర్దిష్టపరిచి విద్యార్థులకు పంచిపెట్టినట్లెతే విద్యార్థులు ఉపన్యాసాన్ని చక్కగా అనుసరిస్తారు
→ నోట్ :- ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయుని ప్రతిభాపాటవాల మీద ఆధారపడి ఉండును



ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి:-
→ ఉపన్యాస పద్ధతి కన్నా మెరుగైనది / గొప్పది
→ ఉపన్యాస పద్ధతిలోని లోపాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పద్ధతి
→ వినడం కన్నా చూడడం గొప్పది అనే సిద్ధాంతం ప్రకారం పనిచేయును
→ ఎక్కువకాలం గుర్తుండును
→ ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరస్పర చర్య జరిగి పరిశీలనా శక్తి అభివృద్ధి చెందును
→ ఉపాధ్యాయుడు విద్యార్థుల సమక్షంలో ప్రయోగాలు ప్రదర్శిస్తూ, వివరిస్తూ విద్యార్థులను బోధనాళ్యసన కార్యక్రమంలో పాల్గొనేట్లు చేయవచ్చు
→ విద్యార్థులలో పరిశీలనా శక్తి, హేతువాద చాకచక్యం పెంపొందును



నిర్వచనం:-

→ చార్టులు, నమూనాలు, మాతృకలు, నిజ వస్తువులు మొ॥ వాటిని ప్రదర్శించుట ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషయ సమాచారాన్ని అందిస్తాడు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ప్రదర్శన మరియు ఉపన్యాసాలను ఏకకాలంలో మేళవించి బోధిస్తాడు దీనినే ఉపన్యాస ప్రదర్శన అంటారు



ఉపన్యాస ప్రదర్శన ద్వారా బోధనకు అనుకూలాంశాలు :-

→ భూమి - అంతర్భాగం

→ గ్రహణాలు

→ సౌరకుటుంబం

→ అగ్నిపర్వత ఉద్భేద్యం

→ భూభ్రమణం పరిభ్రమణం

→ నేలలు - రకాలు - పంటలు

→ ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు

→ నాణేలు - స్టాంపులు

→ మానవ శరీర లోపలి వ్యవస్థలు వాటి పనితీరు

→ ఉదా :- జ్ఞానేంద్రయాలు వనితీరు, జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ మొ||

→ వివిధ రకాల జంతువులు వాటి లోపలి భాగాలు

→ మొక్కలు - వాటి భాగాలు

→ రాకెట్, విమానం మొ॥ పనితీరు

→ నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగం మొవి




ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి విధానం :-
1. లక్ష్యాత్మక పాఠ్య పథకం తయారీ
2. పరికరాలను సిద్ధం చేసుకోవాలి
3. ప్రయోగాలు సరిచేసి చూడడం



1. లక్ష్యాత్మక పాఠ్యపధకం :-

→ ఉపాధ్యాయులు బోధనను గూర్చి ముందుగానే యోచించి, సంసిద్ధుడై తరగతి గదిలో ప్రవేశించి బోధిస్తే బోధన, అభ్యసన ఫలవంతమగును

ఎ) విషయ ప్రతిపాదన :-
→ విషయాన్ని విద్యార్థులలో అభ్యసనపై అనురక్తిని కలిగించేలా ఉండాలి. విషయాన్ని నేర్చుకొనే విధానం, ప్రదర్శనకు సంబంధించిన విషయాలను క్రమబద్ధంగా ప్రదర్శించాలి

బి) మూల్యాంకనం :
→ క్రమబద్ధమైన పాఠ్యపథకంలో ప్రధానమైనది మూల్యాంకనం
→ విద్యార్థులు నల్లబల్లపై రాసిన విషయాలు గీచిన బొమ్మలు విద్యార్థులు నమోదు చేసుకున్నారో లేదో గమనించాలి
→ ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టుట ద్వారా వారి అవగాహనను కనుక్కోవాలి
→ సొంతంగా ప్రయోగాలు చేసేలాగా అవకాశాలు కల్పించాలి

1. పరికరాలను సిద్ధం చేసుకొనుట :

→ పరికరాల పనితనాన్ని ముందుగా పరీక్షించి వాటి సున్నితత్వాన్ని నిర్ణయించాలి
→ ప్రయోగాలకు అవసరమైన ప్రత్యామ్నాయ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలి

2. ప్రయోగాలు చేసి సరిచూడడం :-

→ ప్రదర్శనకు ముందుగా ప్రయోగాలు పరీక్షించి సిద్ధంగా ఉండాలి



మంచి ప్రదర్శన లక్షణాలు :-
→ ప్రారంభంలోనే ప్రదర్శనా లక్ష్యం తెలియజేయాలి
→ విద్యార్థులందరికీ ప్రయోగం కనిపించేలా బల్లపై ప్రదర్శన నిర్వహించాలి
→ సామాగ్రి తగిన పరిమాణంలో ఉండాలి
→ ప్రత్యామ్నాయ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి
→ తగిన పరిమాణంలో పెద్ద నల్లబల్ల ఉండాలి
→ పరికరాల నిర్వహణ, మరమ్మత్తు చేయగల సామర్థ్యం ఉండాలి.
→ మధ్యమధ్యలో విద్యార్ధులను ప్రశ్నలు వేసి ఆసక్తి కలిగించాలి
→ ప్రదర్శన చివరి వరకు విద్యార్ధులలో ఆసక్తి కొనసాగించాలి
→ ప్రదర్శన విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించాలి
→ విద్యార్థుల స్థాయికి తగిన ప్రయోగాలు నిర్వహించాలి
→ ప్రదర్శన నిర్వహిస్తూ మధ్యలో వివరిస్తూ విద్యార్థులలో ఉత్సాహం, అవధానం పెరగడానికి దోహదపడాలి




ఉపన్యాస ప్రదర్శనా పద్దతి - గుణాలు :-

→ మనోవైజ్ఞానిక విధానం

→ మూర్తానుభవాలు / ప్రత్యక్షానుభవాలు పొందుతారు

→ ప్రదర్శనా వస్తువులను పరిశీలించుట ద్వారా కార్యకారణ సంబంధాలు తెలుసుకొంటాడు

→ విషయావగాహన కలుగును

→ విషయం పట్ల ఆసక్తి, ఉత్సాహం కలుగును

→ విద్యార్థికి ప్రదర్శన అనందాన్ని కలుగజేయును / ఏకాగ్రతను కలుగజేయును

→ ప్రదర్శన ద్వారా మంచి ఆలోచనలను పొందుతాడు



చారిత్రక పద్ధతి :-
→ విజ్ఞాన శాస్త్ర బోధనలో దాని చరిత్ర ఆధారంగా విషయాలు బోధించాలి
→ విజ్ఞాన శాస్త్ర శాఖలు, వాటి అభివృద్ధి చరిత్రను గూర్చిన విషయాలు అందించాలి
→ శాస్త్రవేత్తల జీవిత చరిత్రను కధలుగా విద్యార్థులకు బోధించాలి శాస్త్ర విషయాలు, ఆవిష్కరణల ఆవశ్యక విధానాలు వాటి ప్రాముఖ్యత క్లుప్తంగా వివరించాలి .
→ కనుక ఈ విధంగా శాస్త్ర చరిత్రను, అభివృద్ధిని, శాస్త్రవేత్తల జీవితాలను విద్యార్థులకు వివరించాలి
→ నోట్ :- వీలైనంత వరకు వారి చిత్రపటాలను ప్రదర్శించాలి

నిర్మాణ పద్ధతి :-
→ విజ్ఞానశాస్త్ర నిర్మాణం ప్రకారం జరిపే పద్ధతే నిర్మాణ పద్ధతి. ఉపాధ్యాయుడు కేంద్రస్థానంలో ఉండి పాఠ్యవిషయాన్ని విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని అనుసరించి బోధిస్తాడు
నోట్ : ష్యాబ్, ఫినిక్స్ ప్రకారం విజ్ఞానశాస్త్ర ప్రక్రియ, ఫలితాల కలయికే విజ్ఞానశాస్త్ర నిర్మాణం. ప్రక్రియేలు నిర్మాణంగానూ, ఫలితాలు ద్రవ్యాత్మక నిర్మాణంగాను పేర్కొంటారు



ఎ) సంశ్లేషణాత్మక నిర్మాణం :-
→ జ్ఞాన సముపార్థనకు తోడ్పడే అన్వేషణ ప్రక్రియల సముదాయం
→ దీనిలో పరిశీలన, వర్గీకరణ, ప్రాగుప్తీకరణ, ప్రాకల్పన, ప్రయోగ నిర్వహణ, వ్యాఖ్యానం, కొలపడం మొ|| అంశాలుంటాయి
→ ఈ అంశాల ద్వారా బోధన జరిపిస్తాడు. అనగా ఒక సమస్యను విద్యార్థులు పరిశీలించి, ప్రాగుప్తీకరించి, ప్రాకల్పనను ప్రతిపాదించి ప్రయోగం చేసి వ్యాఖ్యానించే విధంగా బోధించుట జరుగుతుంది


బి) ద్రవ్యాత్మక నిర్మాణం:-
→ పైన తెలిపిన ప్రక్రియల ఫలితంగా ఏర్పడిన విజ్ఞానశాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణం
→ దీనిలో యథార్థాలు, భావనలు, సాధారణీకరణాలు, సూత్రం, సిద్ధాంతాలు, నియమాలు మొ|| వి ఉండును
→ ఈ విజ్ఞానశాస్త్ర ఫలితాలు / ఉత్పత్తులను అనుసరించి బోధన జరుగును

→ నోట్ :-
1. ఈ నిర్మాణ పద్ధతి ద్వారా విద్యార్థులలో విజ్ఞానశాస్త్ర నిర్మాణం గూర్చిన అవగాహన కలిగించవచ్చును
2. వైజ్ఞానిక వైఖరులు కల్గించవచ్చు
3. విద్యార్థులలో ఆలోచనలను, పరిశీలనా శక్తిని రేకెత్తిస్తుంది
4. కావున ఇది మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుగుణమైంది.


శాస్త్రీయ పద్ధతి (సైంటిఫిక్ మెథడ్) :-
→ విజ్ఞానశాస్త్రం అనేది ఒక ప్రక్రియ, అలాగే ఒక ఉత్పాదన.
→ ఎందుకంటే పరిశోధనల ఫలితంగా కొత్త సిద్ధాంతాలు బయటపడతాయి. కావున దీన్ని సత్యాన్వేషణ లేదా ఒక జీవన విధానంగా చెప్పవచ్చు.
→ ఈ సత్యాన్వేషణలను శాస్త్రవేత్తలు అనుసరించారు కావున దీనిని " శాస్త్రీయ పద్ధతి" అంటారు
→ సమస్యలను ఒక ప్రత్యేక రీతిలో క్రమబద్ధంగా పరిష్కరించటమే శాస్త్రీయ పద్ధతి. ఇందులో విద్యార్థుల ఆలోచనాశక్తి పెంపొందించటానికి, వారిలో శాస్త్రీయ ఆలోచనలు, అలవాట్లు పెంపొందించటం చేయవచ్చు
→ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ పొందిన విద్యార్థులు తమ జీవితంలో ఎదుర్కొబోయే సమస్యలను సమర్థవంతంగా తమకుతాము పరిష్కరించుకోగలరు
ఉదా :-
1) చిక్కుడు గింజలు మొలకెత్తడానికి కాలసిన పరిస్థితులను గుర్తించడానికి ప్రయోగశాలలో పరిశీలన చేసి నిర్ణయించటం
2) మెండల్ యొక్క జీవానువంశిత సూత్రాలను ప్రయోగశాలలో నిరూపించుట

→ నోట్ :- శాస్త్రీయ పద్ధతిలో నిర్దిష్టమైన సోపానాలు ప్రతిపాదించినది - కార్ల్ పియర్సన్, కీస్లర్
→ పై వారి సోపానాల నుండి అందరికీ ఆమోదయోగ్యమైన సోపానాలు ఇవ్వడం జరిగింది


సమస్యను గుర్తించటం :-
→ విద్యార్థులలో ఆసక్తి, పరిశీలనాదృష్టి, ఆలోచనా శక్తి, తార్కికత్వం పెంపొందించే విషయాలను ప్రకృతిలో పరిశీలిస్తున్నపుడు కొన్ని తెలియని, అవగాహన లేని ప్రశ్నలను విద్యార్థి ఉపాధ్యాయుని అడుగుతాడు. అలా అడిగే విధంగా ప్రోత్సహించాలి. దీనినే సమస్యను గ్రహించటం లేదా సమస్యను ఎన్నుకోవడం అంటారు
→ ఎన్నుకొన్న సమస్య వారి ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు, మానసిక శక్తులకు, ప్రజ్ఞకు తగినట్లుండాలి
→ ఉపాధ్యాయుని అభిప్రాయాన్ని విద్యార్థిపై రుద్దక స్వేచ్ఛగా విద్యార్థి ఎన్నుకొనేట్లు ఉండాలి
→ ఎన్నిక చేసిన సమస్య పాఠ్యప్రణాళికకు సంబంధించినదై అధికశాతం విద్యార్థులకు ఆమోదయోగ్యంగా ఉండాలి.

సమస్యలను నిర్వచించటం :-
→ గుర్తించిన లేదా ఎన్నుకొన్న సమస్యను సమగ్రంగా, నిర్దిష్టమైన భాషలో నిర్వచించాలి
→ నిర్వచనంలోనే దాని స్వభావం, పరిధి, స్వరూపం మొ॥ వాటికి స్థానం ఉండాలి
→ సమస్య నిర్వచించుటలోని లోటుపాట్లను గుర్తింపచేసి సరైన రీతిలో ఎట్లా రాయాలో ఉపాధ్యాయుడే మార్గదర్శకత్వం చూపించాలి.
→ సమస్యను చర్చించటం, వ్యాఖ్యానించటం ద్వారానే సమస్యాపూరణం జరుగవచ్చు.

సమస్య విశ్లేషణ / లక్ష్య నిర్ధారణ :-
→ సమస్యలో ఏల ఇచ్చాడు? ఏల కనుక్కోవాలి ? ఎలా కనుక్కోవాలి? అనే విషయాలను అవగాహన చేసుకొనుట
→ సమస్యలోని దత్తాంశ, సారాంశాలను తెలుసుకొనుట
→ ఇది దత్తాంశ సేకరణకు, ప్రాకల్పనల రూపకల్పనలకు తోడ్పడును
→ ఈ లక్ష్య నిర్ధారణముందు జరుగబోయే పరిష్కార మార్గానికి సోపానమైన పరిధి నిర్దేశించటంతో, శాంపిల్ నిర్ధారణ జరుగుతుంది.

దత్తాంశ సేకరణ :-
→ పుస్తకాలు, నమూనాలు, బొమ్మలు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాల ద్వారా సమాచారాన్ని ఉపాధ్యాయుని సహకారంతోనే సేకరిస్తారు





దత్తాంశాలను ప్రతిక్షేపించటం :-
→ సేకరించిన దత్తాంశాలను సమస్యకు సంబంధించినంత వరకు ఎట్లా ఉపయోగించాలో ఆలోచిస్తాడు.
→ ఇది చాలా కష్టతరమైన ముఖ్యమైన సోపానం
→ ఎంతో ఆలోచనలతో కూడి, విద్యార్థి నైపుణ్యాలను ప్రదర్శించటానికి అనువైనది

6. ప్రాకల్పనలు/ పరికల్పనలను ప్రతిపాదించడం :-
→ సేకరించిన సమాచారాన్ని పరిశీలించి దాని నుంచి ఎలాంటి ప్రాకల్పనలు ఏర్పరచాలో (సమస్యను బట్టి) నిర్ధారిస్తాడు

7. ప్రాకల్పనలను పరీక్షించటం :-
→ ప్రయోగపూర్వకంగా పరీక్షించి వచ్చిన ఫలితాలను బట్టి నిజాన్ని తెలుసుకొని ఆ ప్రాకల్పనలను అంగీకరించాలో, నిరాకరించాలో నిర్ణయిస్తారు

8. సాధారణీకరించడం
→ వచ్చిన ఫలితాలను ఐట్టి ఒక నిగమం. కాబట్టి సాధారణీకరణంగా చెప్పవచ్చు

9. కొత్త సంగతులకు అన్వయం :
→ పైన చెప్పిన సాధారణీకరణాన్ని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో అన్వయం చేసుకోగలుగుతారు. ఈ ఫలితాలు వారిని ఆలోచింపచేస్తాయి. భవిష్యత్ లో జరుగబోయే పరిణాసులను, పరిస్థితులను అంచనా వేస్తాయి



నియోజన పద్దతి :-
→ ఒక వారం రోజులలో పూర్తి చేయడానికి వీలుగా ఉండే చిన్న పాఠ్యాంశాల భాగాన్నే నియోజనం అంటారు
→ నియోజనా పద్ధతిలో రెండు భాగాలుంటాయి.
1) సన్నాహభాగం
2) ప్రయోగశాలభాగం
→ సన్నాహభాగంలో ఇంటి నియోజకభాగంలో ఏమి చదవాలో, ఏ ఏ పుస్తకాలను సంప్రదించాలో వివరిస్తూ ఉపాధ్యాయుడు సూచనా పత్రాల ద్వారా తెలియచేస్తాడు
→ వీటి ఆధారంగా ప్రయోగాలు చేయడానికి అనుమతిస్తారు విద్యార్థి సూచన కార్డులను అనుసరించి ప్రయోగాలు చేసి ఫలితాలు పొందుతారు .

నోట్ :-
1. నియోజనాలు ఇంటి వద్దకాని, బడి వద్ద కానీ నిర్వహించవచ్చు
2. జట్లుగా విభజించి నియోజనాలను కేటాయించాలి
3. విద్యార్థి వయస్సు, తెలివితేటలు, ఆసక్తిని బట్టి నియోజనాలుండాలి
4. విద్యార్థిలో కుతూహలాన్ని పెంచేట్లుగా ఉండాలి.





చర్చా పద్ధతి :-
→ సాంఘికాధ్యయనాలలో అత్యంత విలువైన బోధన పద్ధతి
→ ప్రాచీన నలంద యూనివర్శిటీలో ప్రముఖంగా ఉపయోగించారు
→ గ్రీకు తత్వవేత్తలు తమ శిష్యులతో అనేక విషయాలపై చర్చించేవారు
→ ఇది విద్యార్థి కేంద్రీకృతం. ఇది విద్యార్థికి ప్రథమస్థానం ఇవ్వడం జరుగుతుంది
→ విద్యార్ధులు కేవలం శ్రోతలుగాగాక క్రియాశీలురుగా ఉంటారు
→ ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి” అనే సామెత ప్రకారం పనిచేయును
→ చర్చాపద్దతిలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ ఎవరిపాత్రను వారు కలిగి ఉత్సాహంగా పాల్గొంటారు
→ తరగతి గదిలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని సృష్టించి, విద్యార్థి తన ఆలోచనలను, భావాలను స్వేచ్ఛగా నిర్భయంగా వ్యక్తీకరిస్తాడు
→ చర్చా పద్ధతి ద్వారా సమిష్టి నిర్ణయాన్ని ఒకేక్రమమైన ప్రక్రియలోకి తీసుకురావచ్చు
→ చర్చా పద్ధతిలో ఒక సమస్యను ఎన్నుకొని సామూహిళ ఆలోచన, విశ్లేషణ ద్వారా పరిష్కారాన్ని సూచించవచ్చు
→ చర్చలో పాల్గొన్న వ్యక్తులు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరుస్తారు. మరియు సామూహిక పోటీతత్వం ఉంటుంది
→ చర్చలో మానసికాంశాలైన ఆలోచన, విశ్లేషణ, ఊహ, విచక్షణ మొదలైనవి యిమిడి ఉన్నాయి. అందువలన దీన్ని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు






చర్చారూపాలు:-

→ చర్చ వివిధ రూపాలలో ఉండవచ్చు. ఉదాహరణకు వక్తృత్వం, సెమినార్లు, వృషాపు, కాన్ఫరెన్లు, సింపోజియాలు మొదలగునవి
→ నోట్ :- చర్చలో ఉపాధ్యాయుని పాత్ర స్వల్పంగా విద్యార్థుల పాత్ర అధికంగా ఉంటుంది. పాఠ్యాంశానికి తగిన, నందర్భోచితమైన ఏ రూపాన్నైనా ఎంచుకొని తరగతి గదిలో చర్చను నడిపించాలి

చర్చా ప్రక్రియలో సోపానాలు (4) PRME :

ప్రణాళిక : (Planning) :-

→ చర్చా ప్రక్రియలో ప్రథమ సోపానం, మంచి ప్రజాళిక మంచి చర్చకు దోహదపడును. కాలం, అంశం, విధానం, కార్యక్రమాలు ఏ విధంగా జరగాలో ముందుగానే నిర్ణయించుకొనుట.


సంసిద్ధత (Readyness) :-
→ ఉపాధ్యాయుడు, విద్యార్థి చర్చించాల్సిన అంశాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన విషయ సమాచారాన్ని సేకరించి విమర్శనాత్మకంగా పరించాలి, చర్చించబోయే అంశాలకు సంబంధించి లోతైన జ్ఞానాన్ని సంపాదించాలి. చర్చించబోయే! ఆంశాలను తార్కికంగా అమర్చుకొని, ఆ నమాచారాన్ని నివేదిక రూపంలో తయారు చేసుకొని సంసిద్ధులవ్వాలి

నిర్వహణ (Maintaining) :-
చర్చలో ఉపాధ్యాయుడే మాడరేటర్ (సమన్వయకర్తగా) ఉండి ప్రధాన పాత్ర పోషించి చర్చ క్రమశిక్షణతో, ప్రజాస్వామ్య వద్ధతిలో జరిగేట్లు చూడాలి

ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ, చర్చ ఆద్యంతం ఆహ్లాదంగా, ఉత్సాహంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగి మంచి విషయ పరిజ్ఞానాన్ని పొందేట్లు చూడాలి.

చర్చలో ప్రతి ఒక్కరూ ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటూ వారి అభిప్రాయాలను గౌరవిస్తూ చర్చ విజయవంతం అయ్యేట్లు చూడాలి

చర్చ ముగిసిన తర్వాత మాడరేటర్ (టీచర్) చర్చలోని సారాంశాన్ని పునఃశ్చరణ చేసి చర్చలోని ముఖ్యాంశాలన్నింటిని క్లుప్తంగా రాసి, నిర్ణయించిన తీర్మానాన్ని ప్రకటిస్తారు




4. మూల్యాంకనం (Evalution) :

→ చర్చా ప్రక్రియలో ఆఖరి సోపానం మూల్యాంకనం
→ చర్చ ముగిసిన తర్వాత ఎంత వరకు విద్యార్థి వైఖరులను ప్రభావితం చేసింది ? అతని ప్రవర్తనలో మంచి మార్పులను తీసుకురాగలిగిందా లేదా? సమయం సరిపోయిందా ? లేదా ?' అనుకున్న లక్ష్యాలను సాధించామా ? లేదా అనే విషయాలను మూల్యాంకనం చేయాలి.





చర్చా పద్ధతిలో ఉండాల్సిన అంశాలు - 5 :-

1. నాయకుడు (Teacher) :
→ చర్చలో ఉపాధ్యాయుడే నాయకుడు
→ చర్చించేది విద్యార్థులే అయినా చర్చ ఒక క్రమ విధానంలో జరగడానికి, అసాధారణ సంఘటనలు, అనవసరపు వాగ్వివాదాలు జరగకుండా, అందరి అభిప్రాయాలకు సమాన అవకాశాలిస్తూ, అందరి భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించరేట్టు చేసే ప్రధాన కారకుడు/ నాయకుడు ఉపాధ్యాయుడు
→ నోట్ :- చర్చించేది - విద్యార్థులు
→ చర్చా అంశం ఎంపిక, సమాచార సేకరణ, ప్రణాళికా రచన, నిర్వహణ, మూల్యాంకనం మొ||వన్నీ సమస్తం నిర్వహించేది - ఉపాధ్యాయుడు


2. సభ్యులు (Students) :-
→ చర్చలో పాల్గొనే సభ్యులు విద్యార్థులే
→ అందరికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
→ అందరూ పాల్గొనేట్లు చూడాలి
→ ఒకరిని ఒకరు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకొనేట్లు చూడాలి.

3. సమస్య (Topic) :-
→ చర్చలో ఎన్నుకొన్న అంశం / సమస్య విద్యార్థుల వయస్సు, స్థాయి, తరగతి, అవసరాలు, అభిరుచికి తగ్గట్లుండాలి
→ వాస్తవికతకు సంబంధించి, విద్యా విలువలు కలిగినదై ఉండాలి
→ విద్యార్థులకు విస్తృతజ్ఞానాన్ని అందించేట్లు, ఉపయోగపడేట్లుండాలి.

4. విషయ సమాచారం (TLM)
→ పుస్తకాలు, పత్రికలు, సంచికలు, దృశ్య, శ్రవణ పరికరాలు, చిత్రపటాలు, బొమ్మలు, నాణేలు, స్టాంపులు, రేడియోలు టి. వి. లు , టేప్ రికార్డర్ మొ॥ వాటి నుండి సమాచారాన్ని సేకరించవచ్చు
→ సేకరించిన సమాచారం సమస్యను సమర్థవంతంగా, ఖచ్చితంగా చర్చించేందుకు తోడ్పడును

5. మూల్యాంకనం (Evaluation) :-
→ చర్చ ముగిసిన అనంతరం నిర్ణయించుకున్న విద్యాలక్ష్యాలు ఎంతవరకు సాధించాం?
→ విద్యార్థుల వైఖరిని, ప్రవర్తనను చర్చ ఎంతవరకు ప్రభావితం చేసింది ?
→ సమస్య ఎంపిక, ప్రణాళిక రచన, అమలు మొ॥ అన్నింటిని మూల్యాంకనం చేయుట జరుగును




చర్చకు అనుకూలమైనవి :-

సోషల్ :-
→ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు - అవినీతి -నల్లధనం - నిరుద్యోగం - పార్టీ ఫిరాయింపులు- ఉచిత పథకాలు - పాశ్చాత్య సంస్కృతి

సైన్స్ :-
→ మొక్కలు నీటిని వదులుతాయా ? గ్రహణాలు ఎందుకు ఏర్పడును ? ధ్వని శూన్యంలో ప్రసారమవుతుందా ?

నోట్ :-
1) చర్చ వ్యక్తిగతంగానైనా, జట్లుగానైనా ఇవ్వవచ్చు.
2) కీలక భావనలు నల్లబల్లపై రాయాలి
3) కాల నిర్ణయపట్టికలో తగిన సమయం కేటాయించాలి
4) అవసరమైతే విద్యార్థులను జట్లుగా విభజించి జట్టు నాయకులను నియమించి చర్చలు పూర్తిచేయాలి
5) పాఠ్యాంశాలు సరళంగా ఉండాలి
6) చర్చ అంశాలుకు తగినట్లుండాలి
7) మాట్లాడడంలో క్రమశిక్షణ ఉండాలి






చర్చ పద్ధతి - ప్రయోజనాలు :-

→ ప్రజాస్వామ్య వాతావరణంలో అభ్యసన జరిగే విధంగా ప్రోత్సహించును
→ ఆసక్తితో అభ్యసిస్తారు
→ విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడును
→ విద్యార్థులకు, ఉపాధ్యాయునికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడును
→ విద్యార్థులు తమ సమస్యలకు వెనువెంటనే పరిష్కారాన్ని పొందుతారు
→ విద్యార్థులలో జట్టు భావన, జట్టుపోటీ, జట్టు సహకార భావాన్ని ప్రోత్సహించును
→ ఇది తోటి విద్యార్థులను, వారి అభిప్రాయాలను, భావాలను గౌరవించేట్లుగా శిక్షణనిస్తుంది.
→ ఉపాధ్యాయుడు విద్యార్థిలోనున్న ప్రతిభా పాఠవాలను గుర్తించేట్లు చేయును
→ వేదికపై నిర్భయంగా మాట్లాడడంలో స్వేచ్ఛగా, తమ తమ భావాలను వ్యక్తపరచడానికి శిక్షణనిస్తుంది.
→ వేదికపై కూర్చోవడం, నిలబడడం, మాట్లాడడంలో, సభాపద్ధతులు పాటించటంలో శిక్షణనిస్తుంది
→ బట్టీస్మృతి / బట్టి విధానాన్ని వ్యతిరేకిస్తుంది
→ విద్యార్థులలో తార్కిక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుంది
→ విద్యార్థులను నూతన విషయాలను అభ్యసించేందుకు ప్రోత్సహిస్తుంది
→ విద్యార్థులకు వివిధ మానసిక అంశాలపై శిక్షణనిస్తుంది
→ విద్యార్థులలో ఉన్న నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయును




దోషాలు :-
→ అన్ని పాఠ్యాంశాలను ఈ పద్ధతిలో బోధించలేం చురుకైన విద్యార్థులు అధిగమించే అవకాశం కలదు
→ అవసరమైన వాగ్వివాదాలకు, భేదాభిప్రాయాలకు, ఆవేశాలకు దారితీస్తుంది
→ చర్చలో జరిగే వాగ్వివాదాలు, చర్చను పక్కదోపవట్టించే అవకాశం కలదు
→ కాలయాపనతో కూడినది
→ సుశిక్షుతులైన ఉపాధ్యాయులు తప్పనిసరి
→ విద్యార్థులను భావోద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది