సాంఘిక శాస్త్రాలు లక్ష్యాలు / విలువలు
→ విద్య యొక్క ముఖ్య ఆశయము విద్యార్థుల ప్రవర్తనలో కోరదగిన మార్పులు తీసుకొని రావడము.
→ బెంజిమిన్ ఎస్. బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణ, అందులో గల వివిధ దశలను, బోధనా లక్ష్యాలను వర్గీకరణ చేసినాడు.
→ ఆశయాలు - లక్ష్యాలు పర్యాయపదాలుగా వాడటం జరుగుతున్నది.
→ ఆశయాలు విస్తృత పరిధి ఉండి, దీర్ఘకాలంలో సాధించబడ్డాయి.
→ లక్ష్యాలు సంక్షిప్తంగా ఉండి, స్వల్పకాలంలో సాధించేవిగా ఉంటాయి.
ఆశయము - ప్రాముఖ్యత
→ ఉద్దేశ్యం అనేది మన కళ్ళముందు ఎప్పుడూ కనిపిస్తూ, మనకి దిశానిర్దేశనం చేస్తూ, మనం చేసే ప్రతి పనిని ప్రభావితపరుస్తూ, మనల్ని సరైన మార్గంలో నడిపేది" అని జాన్ డ్యూయి పేర్కొన్నాడు.
ఆశయాలకు-లక్ష్యాలకు మధ్య ఉన్న భేదాలు
ఆశయాలు :-1. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి.
2. ఆశయాలు సాధరణమైనవి. దీర్ఘకాలిక సాధీతాలు.
3. ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి.
4. ఆశయాల విషయాన్ని బట్టి మారవు
5.ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది
6. ఆశయాలు సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు.
లక్ష్యాలు :-
1.ఆశయాల సాధన దిశగా ఈ మార్గంలో చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు
2 లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి, స్వల్పకాలిక సాధితాలు.
3.లక్ష్యాలకు తాత్కాలిక విలువలుంటాయి.
4. లక్ష్యాలు విషయాన్ని బట్టి మారతాయి. ఆశయాల నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి.
5. లక్ష్యాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది.
6. లక్ష్యాలను తప్పక సాధించవచ్చు
సాంఘికశాస్త్ర బోధన ఆశయాలు:-
→ సామాజిక విషయాల గురించిన ప్రాథమిక భావనలు అందించడము.
→ విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించడము.
→ విద్యార్థులలో పౌరసత్వ విలువల్ని పెంపొందించడము.
→ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడము.
→ భారతదేశ సంస్కృతిని ప్రశంసించడము.
→ పర్యావరణంతో పరిచయం కల్గించడము.
→ సాంఘిక, ఆర్థిక అంశాలపట్ల అవగాహన కల్గించడము.
→ జాతీయ సమైక్యతను పెంపొందించడము.
→ అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడము.
→ మానవ సంబంధాలపై అవగాహన కలిగించడము.
→ నాయకత్వ లక్షణాలను పెంపొందించడము.
→ నేను, నాది అనే భావన నుంచి మనం, మనది అనే భావన కల్గించడము.
→ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము.
→ సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధిని పెంపొందించడము.
→ అన్ని మతాలు, తెగలు, గ్రూపులపై గౌరవభావం కల్గించడము.
→ అంటరానితనం రూపుమాపటము.
→ ప్రజాస్వామ్యం - జాతీయ సమైక్యత మొదలైన జాతీయ ఆశయాలను పెంపొందించడము.
సాంఘికశాస్త్ర బోధన విలువలు:-
→ విలువ అనేది ఒక ఆలోచన
→ ఏదైతే ఒక వ్యక్తికి ఉపయోగపడుతుందో అదే అతనికి విలువగా ఉంటుంది.
→ విలువ అనేది మానవ ప్రవర్తనలో వచ్చే మార్పు
→ ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యత, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అంటారు
→ విలువ - బాండ్ అభిప్రాయం" : "ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, మంచితనమును గురించిన దృఢమైన నమ్మకమే విలువ."
విలువ - నిర్వచనాలు :-
→ విద్యాలక్ష్యాలే విద్యావిలువలు -కన్నింగ్ హాం
→ దేనిని అయితే ప్రేమగా చూస్తామో, పొందాలనుకుంటామో అభిమానిస్తామో, పొగుడుతామో అభినందిస్తామో దాన్ని విలువ" అంటారు -జాన్ డ్యూయి .
→ ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న" - ఆల్బర్ట్ ఐన్ స్టీన్
విలువల లక్షణాలు:-
1. అమూర్తమైనవి
2 అంతర్లీనమైనవి
3. ఆపాదింపబడేవి
4. నమ్యత కలిగినవి
5. సాపేక్షమైనవి
సాంఘిక శాస్త్ర బోధనలో విలువలు :-
1. బౌద్ధిక విలువలు
2.ఉపయోగితా విలువలు
3.వృత్తి విలువలు
4. సాంస్కృతిక విలువలు
5. నైతిక విలువలు
6. సౌందర్యాత్మక విలువలు
7. సృజనాత్మక విలువలు
8.క్రమ శిక్షణ విలువలు
9.విరామ సమయాన్ని సద్వినియోగ పరచుకొనే విలువలు
10.శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి
11.నిజాయితీ
12.సాహస గుణము
13. నాయకత్వము
సాంఘికశాస్త్ర బోధనా లక్ష్యాలు :-
→ విద్యావిధానము అనేది మొత్తము విద్యార్థి / శుకేంద్రకము / అభ్యాసకుల కేంద్రంగా పరిభ్రమిస్తుంది.
ఉద్దేశ్యాలు (ఆశయం) - గమ్యాలు - లక్ష్యాలు :-
→ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరినా, చేరకపోయినా నక్షత్రం అనేది అవసరము" అని ఇ.బి.వెస్లీ పేర్కొన్నాడు
→ ఆశయాలు అమూర్తభావనలు, తాత్త్విక స్వభావము ఉన్నవి.
→ లక్ష్యాలు - సంయుక్తమైనవి. విశ్వసనీయమైనవి.
→ తత్త్వము - ఆశయాలు - గమ్యాలు - లక్ష్యాలు.
బోధనా లక్ష్యాలు:-
→ టాబా అభిప్రాయంలో విద్యాలక్ష్యాలు రెండు రకాలు
→ పాఠశాల మొత్తానికి సంబంధించిన ఫలితాలను వర్ణించేది.
→ ఒక ప్రత్యేక అంశము,
→ ఒక ప్రత్యేక తరగతి స్థాయి కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేకాంత ప్రవర్తనలను గురించి చెప్పేది. ఈ ప్రత్యేక లక్ష్యాలనే బోధనా లక్ష్యాలు అంటారు.
బోధనా లక్ష్యాలు వాటి లక్షణాలు
→లక్ష్యాలు ఖచ్చితంగా, స్పష్టంగా ఉంటాయి.
→విద్యార్థులు సాధించేవిగా ఉంటాయి.
→లక్ష్యాలు పాఠ్యాంశాన్ని బట్టి మారుతాయి.
→లక్ష్యాలు విద్యావిషయకంగా ప్రాముఖ్యంగా ఉండాలి
→విద్యార్థుల ప్రవర్తనలో కలుగజేయు మార్పులుగా ఉండాలి
→విద్యార్థులు వరిశీలింపడగినవై, కొలవదగినవై ఉండాలి.
→ అక్ష్యం మూల్యాంకనమునకు అనువుగా ఉండాలి.
సృష్టికరణలు :
→విద్యార్థి మంచి అభ్యసనకోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో పేర్కొనడమును స్పష్టీకరణలు అంటారు.
స్పష్టీకరణల లక్షణాలు :
→లక్ష్యాల పరిధిని ప్రకటితం చేస్తాయి
→ఒక లక్ష్యానికి, మరొక లక్ష్యానికి ఉన్న తేడాను తెలియజేస్తాయి
→విద్యార్థి ప్రవర్తనా మార్పుకు దోహదం చేస్తాయి
→విద్యాభ్యాసానికి సాక్ష్యాధారాలు
→ విద్యార్థి వికాసానికి ప్రతీక
→ అభ్యసన అనుభవాలు ఏర్పడటానికి సహాయపడతాయి.
బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణ :-
→అమెరికాలో 1948లో బోస్టన్ పట్టణంలో మానసిక శాస్త్రవేత్తల సదస్సు జరిగినది.
→ఇదే బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణకు దారితీసినది.
→విద్యాలక్ష్యాలను స్థూలంగా 3 రంగాలుగా వర్గీకరించారు
1) జ్ఞానాత్మక రంగం
2).భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
→ జ్ఞానాత్మక రంగంపై బెంజిమిన్. ఎస్. బ్లూమ్స్, భావావేశం రంగంపై డేవిడ్. ఆర్. క్రాత్ హోల్, మానసిక చలనాత్మకరంగం పై ఎలిజబెత్ సింప్సన్, ఆర్. హెచ్, దవే, హేరో విశేషంగా కృషిచేసినారు.
→ విద్యలో పై మూడు రంగాలు పరస్పర సంబంధమైనవి. జ్ఞానాత్మక రంగం 1. జ్ఞానం 2.అవగాహన 3. వినియోగం 4.విశ్లేషణ 5. సంశ్లేషణ 6.మూల్యాంకనము
భావావేశ రంగం :- 1 గ్రహించడము 2. ప్రతిస్పందించడము 3.విలువ కట్టడము 4. వ్యవస్థాపనము 5. శీలస్థాపనము మానసిక చలనాత్మక రంగం
1.అనుకరణ
2.హస్తలాఘవము
3. సునిశితత్వం
4. సమన్వయం
5. సహజీకరణ
వర్గీకరణ ప్రయోజనాలు
→ మూడు రంగాలలో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు, అధిక్యతశ్రేణిలో ఉంటాయి.
ఉదా : విద్యార్థి అవగాహన లక్ష్యాన్ని సాధించడం అంటే జ్ఞానరంగంలో రెండోదశను చేరుకున్నట్లు చెప్పవచ్చును
జ్ఞానరంగము:
→ ఈ రంగం మెదడుకు, ఆలోచనలకు, ప్రవర్తనలకు సంబంధించింది. ఇందులో మొత్తము 6 లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు అమర్చినవి, వీటి ద్వారా విద్యార్థి పొందేవి తెల్సుకోవడము, ఆలోచించగలగడం, సమస్యను పరిష్కరించడం, జప్తికి తెచ్చుకోవడం, గుర్తించడము, మానసిక అభివృద్ధిని సాధించడము.
1. జ్ఞాన లక్ష్యము:
→ జ్ఞానరంగంలో మొదటిది, సులువైనది, విద్యార్థి నేర్చుకున్న విషయాలను, ఉన్నది ఉన్నట్లు చెప్పగలగడమే జ్ఞానము. ఇవి పదాలు, పేర్లు, తేదీలు, ప్రదేశాలు, వ్యక్తులు, విధానాలు, పద్ధతులు, వర్గీకరణలు లాంటివిగా ఉంటాయి.
1.నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానం
ఉదా : గర్జించే నలభైలు, పునరుజ్జీవనము, అంతర్జాతీయ అవగాహన
2.వివిధ శాస్త్రీయ పదాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా : ఐసోహైట్, ఐసోబార్, డెమోక్రసీ, బడ్జెట్
3. నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: సమాజానికి కుటుంబం పునాది,
దక్కన్ పీఠభూమి తూర్పునకు వాలి ఉంది
4.నిర్దిష్ట విధానాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానము
ఉదా : రైత్వారీ విధానము, ఎగుమతి - దిగుమతి విధానము
5.నిర్దిష్ట సంకేతాలకు సంబంధించిన జ్ఞానం ఉదా : పర్వతాలకు, M
6.వివిధ వరుసక్రమాలు, నూతన ధోరణులకు సంబంధించిన జ్ఞానం.
ఉదా : వివిధ ప్రణాళికల కాలం వరుసక్రమం, మొఘలాయి వంశస్తుల వరుసక్రమం, వివిధ రాష్ట్రపతుల వరుసక్రమం
2.అవగాహన
→ జ్ఞానరంగంలో రెండో లక్ష్యం అవగాహన,
1) పోలిక తెల్పడం
2) వివరించడం
3) తర్జుమా చేయడము
4) వ్యాఖ్యానించడము లాంటివి విద్యార్థి సాధిస్తాడు. విద్యార్థిలో ఆశించిన ప్రవర్తనా మార్పు ఈ దశ నుంచే మొదలవుతుంది. ఈ లక్ష్యాన్ని తిరిగి మూడు భాగాలుగా విభజించవచ్చు
i) అనువదించడము : a) ఒక స్థాయి అమూర్త భావనను మూర్తస్థాయికి మార్చడము
ఉదా: నిరపేక్ష సేదరికం-ఈ భావనను కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రజలు అని అనువదించుకోవడము.
b) ఒక సంకేతాన్ని మరొకపదంగా మార్చుకోవడము. ఉదా : |||| - రైలుమార్గాలు.
ii) వ్యాఖ్యానించడము : వివిధ విషయాలను, విద్యార్థి తనదైన శైలిలో వివరించడము.
ఉదా :- ముంబయి దాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలలో చోటుచేసుకున్న మార్పులను విద్యార్థి తన సొంతమాటల్లో వివరించి చెప్పటము,
iii) ఎక్స్ట్రాపౌలేషన్:- వివిధ ముగింపులను ఊహించగలగడం, ఆలోచనల్లో వైవిధ్యాన్ని, నూతనత్వాన్ని ప్రదర్శించడం, భవిష్యత్తును ఊహించడం, ఈ లక్ష్యంగా చెప్పవచ్చు. ఉదా : పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం మానవజీవనాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు
3. వినియోగము:-
→ విద్యార్థి తాను అవగాహన చేసుకొన్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భంలో ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవడము, చేశ పటాలను ఆధారం చేసుకొని హిమాలయాలు చేరగల్గడము
4.విశ్లేషణము:-
→ ఇచ్చిన భావాన్ని విద్యార్థి తనకు అర్థవంతంగా సంబంధ నహితభాగాలుగా విల్లేషణం చేయడము. ఒక న్టూలమైన విషయాన్ని అనేక సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య తార్కిక సంబంధ వ్యవస్థీకృత విధానం గురించి విద్యార్థులు తెల్సుకొంటారు దీన్నే విశ్లేషణ అంటారు
ఉదా : ఉష్ణమండల ఎడారులు ఖండముల తూర్పుభాగంలో లేకపోవడానికి గల వివిధ అంశాలు విశ్లేషించడము.
5. సంశ్లేషణము :
→ ఇది ఐదవ జ్ఞాన లక్ష్యము, సంక్లిష్టమైనది. చిన్న చిన్న విడిభాగాలను కలిపి అంశాన్ని చూడగలగడము, వివిధ దత్తాంశాల ఆధారంగా. నూతన విషయాలు తెలుసుకోవడము. ఉదా : సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో, ఉష్ణోగ్రతలను తెల్బి ఎందువల్ల అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉందో అన్న విషయాన్ని సాధారణీకరించడము,
6.మూల్యాంకనము:-
→ చివరి జ్ఞాన లక్ష్యం. జ్ఞానరంగంలో అత్యున్నత లక్ష్యంగా చెప్పవచ్చును. విద్యార్థి ఐదు లక్ష్యాలను సాధించి దీనిలోనికి వచ్చాక దేనిపైనా సరే సరియైన నిర్ణయం తీసుకునేలా తీర్చిదిద్దదమే మూల్యాంకనము.
ఉదా : పర్యావరణంను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందా ?
భావావేశ రంగము:
→ డేవిడ్, ఆర్., క్లాత్ హోల్, భావావేశ రంగాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో అభిరుచులు, విలువలు, వైఖరులు, దృక్పథాలు అభినందన మొదలైన లక్ష్యాలను వివరించారు
→ భావావేశరంగంలో 5 దశలు .ఉన్నాయి. భావావేశరంగం హృదయానికి' సంబంధించినది.
1. గ్రహించడము
2. ప్రతిస్పందన
3. విలువకట్టడము
4. వ్యవస్థావన
5. శీలస్థాపన
1. గ్రహించడము:
→ ఉపాధ్యాయుడు అందిస్తున్న ఉద్దీపనల ద్వారా ప్రస్తుత విషయాన్ని గ్రహించేందుకు విద్యార్థి సంసిద్ధుడు కావడమే దీని లక్ష్యం. సాంఘికతాస్త్రమునకు నంబంధించిన నమాచారం లభించే వివిధ ప్రదేశాలను తెల్సుకోవడము.
ఉదా : పర్యావరణ కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడము.
2. ప్రతిస్పందించడము:
→ ఇది గ్రహించడము కంటే ఉన్నతమైనది ఈ దశలో విద్యార్థి సాంఘిక శాస్త్ర విషయాలను గురించి చదువుతాడు. ఉదా :- ప్రాచీన కట్టడాలు చూడాలనే ఆసక్తి. 'ద్రవ్యం అనే పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత వివిధ రకాల కరెన్సీ నోట్లను సేకరించాలనే ఆసక్తి కల్గడము, క్షేత్ర పర్యటనలు చేయడము. ఆనాటి శిల్పకళా వైభవంను చూడాలనే అనక్తి
3. విలువకట్టడము :
→ భావావేశ రంగంలో 3వ దశ, దీనినే ప్రశంస అనే లక్ష్యంగా చెప్పుకోవచ్చును. ఈ భావనలో మంచి లక్ష్యాన్ని గుర్తింపజేయడమే ఈ లక్ష్యం. విద్యార్థులు కొన్ని విలువలకు కట్టుబడ్తారు . మంచి ఆరోగ్యకరమైన వైఖరులు ఏర్పడుతాయి. ఇతరుల అభిప్రాయాల కంటే నిర్దేశించిన ప్రయోగఫలితాలకు విలువ ఇవ్వడం జరుగుతుంది.
ఉదా :- మానవ జీవనానికి, పర్యావరణంనకు అవినాభావ సంబంధం ఉందని గుర్తించడము. అన్ని ప్రభుత్వాలకంటే ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానం అని విద్యార్థి గుర్తిస్తాడు.
4.వ్యవస్థాపన:-
→ఈ దశలో విద్యార్థులలో విలువలు పెంపొందించబడ్డాయి. విలువల మధ్య సంబంధాలు ఏర్పడి వాటి మధ్య పోలికలు, సంశ్లేషణ జరుగుతుంది.
ఉదా :- అహింసా విధానమే మన స్వాతంత్ర్య పోరాటంను శాంతి మార్గంలో నడిపించినది.
→విలువను అంతర్లీనం చేసుకోవడము, విలువలను వ్యవస్థీకరించడము, విలువల నమ్మేళనంతో శీలస్థాపనకు సిద్ధపడటం ఈ దశలో జరుగుతుంది
5. శీలస్థాపన :
→ వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తుంది. విలువలు ప్రవర్తనలో చేరిపోవడమే ఈ దశ, ఈ దశలో కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు 1. నమ్మకాలు, వైఖరులతో కూడిన ప్రవర్తన ఏర్పడుతుంది అంతర్లీనం చేసుకొన్న విలువలను బాహ్యంగా చూపడము శీలస్థాపనగా చెప్పవచ్చును. ఈ లక్ష్యాన్ని "వైఖరులు" అనవచ్చును.
ఉదా :- పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడము, చర్చలలో పాల్గొనప్పుడు ఇతరుల అభిప్రాయాలు గౌరవించడము.
మానసిక చలనాత్మక రంగము:-
మానసిక చలనాత్మక రంగం విద్యార్థి కర్మేంద్రియాలకు సంబంధించినది. దీనిని - మానసిక కండరాల చలనంగాచెప్పవచ్చు . ఎలిజబెత్ సింప్సన్, ఆర్.హెచ్.దవే, హేరో ఈ రంగాన్ని అభివృద్ధి చేశారు
ఆర్. హెచ్. దవే, ఈ మానసిక చలనాత్మక రంగంను 5 దశలుగా విభజించినాడు.
1.అనుకరణ
2.హస్తలాఘవము
3. సునిశితత్వం
4 సమన్వయం (లేదా) ఉచ్చారణ
5. సహజీకరణం
1.అనుకరణ:-
→ విద్యార్థి ఎలాంటి కృత్యాన్ని అయిన ఎలాంటి సూచనలు లేకుండా చేయగల్గడాన్ని అనుకరణ అంటారు. నైపుణ్యంను సాధించడంలో అనుకరణ చాలా ముఖ్యమైనది. అంతర్గత ప్రేరణతో అనుకరణ మొదలు అవుతుంది. అనుకరణ నైపుణ్యానికి ప్రాతిపదిక అనుకరణ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది
ఉదా :- కార్టూన్స్ గీయటం, మిమిక్రీ చేయటం, నమూనా పార్లమెంట్
2. హస్తలాఘవము :-
→ విద్యార్థులు వస్తువులను, పరికరాలను, ఉపకరణములను జాగ్రత్తగా ఉపయోగించడం చేస్తారు
ఉదా :- స్థానికంగా దొరికే వస్తువులతో పరికరాలు, నమూనాలు తయారుచేయడము, పరికరాలు జాగ్రత్తగా ఉపయోగించడము.
3.సునిశితత్వం :-
→ అభ్యాసకుడు పనిని స్వతహాగా, కచ్చితంగా చేస్తాడు. తాను చేస్తున్న పని మీద తన అవసరాలకు అనుగుణంగా, కృత్యాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని పొందగలదు, కృత్యంలో పొరపాట్లు జరగకుండా నిర్వహిస్తాడు.
ఉదా :- 1. మ్యాపులలో దూరాలు కొలిచేటప్పుడు స్కేలు ఉపయోగించడం
2.జాతీయ జెండా గీసేటప్పుడు అశోక ధర్మచక్రంలో 24 గీతలు సమానదూరంలో ఉండేటట్లుగా కోణమానిని వినియోగించడం
4 సమన్వయం (లేదా) ఉచ్చారణ :-
→ వేర్వేరు వనులను సమన్వయపర్చడము. వివిధ చర్యల శ్రేణిని సమన్వయీకరణ చెంది వరుసక్రమంలోను, నమ్మేళనంగాను జరుగుతుంది. అనేక విషయాలు స్పష్టంగా చెప్పబడుతాయి.
ఉదా : అనేక కృత్యాలు వేగంగా, సకాలంలో చేయడం నైపుణ్యం
5.సహజీకరణం:-
→ కృత్యాన్ని ఆలోచనతో పనిలేకుండా యాంత్రికంగా, అప్రయత్నంగా చేసేయగల్గడము, మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం .
ఉదా : దేశ పటాలను సులభంగా గీయటం, పటంలో ప్రదేశాలను కచ్చితంగా గుర్తించడం
ఈ నహజీకరణ లక్ష్యం సాధించిన విద్యార్థి మానసిక శక్తిని ఉపయోగించకుండానే కృత్యాన్ని చేయగల్గడము,
జ్ఞానాత్మక రంగము :-
జ్ఞానాత్మక రంగంనకు సంబంధించిన లక్ష్యాలు :
1.జ్ఞానం
2.అవగాహన
3.వినియోగం
1.జ్ఞానం:- విద్యార్థులు పాఠ్యాంశానికి, సంబంధించిన పదాలు, భావనలు, థోరణలు, సూత్రాలు, పదజాలాలు, విషయాలు, తేదీలు సామాన్యీకరణాలు మొదలయిన విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు
సృష్టీకరణలు:-
1.జ్ఞప్తికి తెచ్చుకోవడము
2.గుర్తించుట
2.అవగాహన:-
→ విద్యార్థి సాంఘికశాస్త్ర బోధన ద్వారా జ్ఞాన లక్ష్యంతో సముపార్జించిన పదాలు, భావనలు, సూత్రాలు, థోరణులు మొదలైన వాటితో పరిచయం మాత్రమే కాకుండా వాటి పట్ల సమగ్ర అవగాహన పొందటము.
అవగాహన లక్ష్యం - స్పష్టీకరణలు :-
1.వివరించుట
2. వ్యాఖ్యానించుట
3. పోలికలు చెప్పుట
4. తారతమ్య భేదాలు గుర్తించుట
5.వర్గీకరించడం
6. ఉదాహరణలు ఇవ్వడం
7. తప్పొప్పులు గుర్తించుట
8. తప్పొప్పులు సవరించుట
9. పరస్పర సంబంధాలు గుర్తించుట
10. సరిపోల్చటము.
3. వినియోగం :-
→ విద్యార్థి తాను నేర్చుకొన్ని జ్ఞానాన్ని, అవగాహన చేసుకున్న విషయాలను అవసరం అయిన పరిస్థితులలో ఉపయోగించి సమస్యా పరిష్కారం చేయడాన్ని వినియోగం అంటారు
స్పష్టీకరణలు :-
1. విశ్లేషించడము
2. కారణాలు తెల్పడము
3.కారణానికి, ఫలితానికి మధ్య సంబంధం ఏర్పరచడము
4. సామాన్యీకరణాన్ని ప్రతిపాదించడము
5.నూతన పరికల్పనలను రూపొందించడము
6. పరికల్పనల్ని ధృవీకరించడము
7.సమస్యా పరిష్కారానికి తాను 'సేకరించిన సమాచారం తగినదో లేదోనని గ్రహించుట
8. విద్యార్థి భావనలను ఊహించి నిర్ణయాలు చేయడము.
భావావేశ రంగము :
→ భావావేశ రంగం యొక్క లక్ష్యాలు
1.అభిరుచి
2. వైఖరి
3.ప్రశంస
అభిరుచి : విద్యార్థి సామాజిక, ఆర్థిక, సాస్మృతిక, భౌగోళిక, పౌర సమస్యల పట్ల ఆసక్తులను, అభిరుచిని పెంపొందించుకోవాలి.
స్పష్టీకరణలు:
→ విద్యార్థి సాంఘిక సమస్యలకు సంబంధించిన పుస్తకాలు, వార్తలు, పత్రికలు చదువుతాడు.
→ విద్యార్థి పాఠశాలలో, బయట సామాజిక కార్యకలాపాలలో భాగస్వామి అయి చురుకుగా పాల్గొంటాడు.
→ విద్యార్థి సాంఘిక అధ్యయనానికి సంబంధించిన ఛార్జులు, మ్యాపులు, చిత్రపటాలు. నమూనాలు సేకరించడంలో ఉత్సాహం చూపిస్తాడు.
→ విద్యార్థి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పౌరసమన్యలను చర్చిస్తాడు.
→ విద్యార్థి పాఠశాలలో వస్తు ప్రదర్శనలను ఏర్పాటు చేయడంలో ఉత్సాహం చూపుతాడు. తాను సేకరించిన వస్తువులను ప్రదర్శిస్తాడు
→ విద్యార్థి భౌగోళిక, చారిత్రాత్మక, రాజకీయ ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడతాడు.
వైఖరులు:
→ సాంఘికశాస్త్ర బోధన ద్వారా విద్యార్థులకు సాంఘిక దృక్పథాన్ని పెంపొందించాలి. విద్యార్థులలో వాంఛనీయమైన వైఖరులను పెంపొందింపజేయాలి
స్పష్టీకరణలు:
→ ఇతరుల పట్ల గౌరవం కల్లి ఉండటం.
→ దేశభక్తి పెంపొందించుకోవడము,
→ జాతీయ సమస్యలపై తన అభిప్రాయాలు తెలియజేయడం
→ సామాజిక కార్యక్రమాలలో ఇతరులతో సహకరించడం.
→ తన బాధ్యతలు స్వీకరించడం
→సానుభూతి చూపడము
→ చట్టం / న్యాయం పట్ల నమ్మకం కల్గియుండటం.
అభినందన / ప్రశంస :
→ సాంఘికశాస్త్ర బోధన విద్యార్థులలో ఆసక్తులు, వైఖరులతోపాటు అభినందనలు కూడా లభిస్తాయి
సృష్టీకరణలు:
→ ప్రపంచదేశాలు అందిస్తున్న సహాయ సహాకారాలు ప్రశంసించడం
→ సాంస్కృతిక భేదాలు ప్రశంసించడం
→ భిన్నత్వంలో ఏకత్వం ప్రశంసించడం
→ ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించడం.
→ ఇతరుల నాయకత్వాన్ని ప్రశంసించడం.
→ అన్వేషణల, ఆవిష్కరణల గొప్పతనం ప్రశంసించడం.
→ ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారంను ప్రశంసించడం
మానసిక చలనాత్మక రంగము :-
→ఆలోచనలకు, ఆచరణకు మధ్య సమన్వయమే మానసిక చలనాత్మక రంగం
మానసిక చలనాత్మక రంగంలోని నైపుణ్యాలు:
1.పటాలు గీయడంలో నైపుణ్యం
2 పరిశీలనా నైపుణ్యం
3. అభివ్యంజన నైపుణ్యం
4.నిర్వహణ నైపుణ్యం
1.పటాలు గీయడంలో నైపుణ్యం :
→ వివిధరకాల చిత్రాలను, పటములను, నమూనాలను గీయడము.
2.పరిశీలనా నైపుణ్యం
→ పరిశీలించడం ఒక నైపుణ్యం, విద్యార్థి పటములు, నమూనాలు, ధృగ్విషయాలను పరిశీలించడములో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం
3. అభిష్యంజన నైపుణ్యం :
→ విద్యార్థి చెప్పవలసిన విషయాన్ని సరళమైన, కచ్చితమైన సాంకేతిక భావనలను, పదాలను వినియోగించి, భావప్రకటన చేయడము.
4. నిర్వహణ నైపుణ్యం :
→ వివిధ వస్తువుల మధ్య సమన్వయంతో జరిగే నైపుణ్యాలను నిర్వహణ లేదా హస్తనైపుణ్యం అంటారు
ఉదా : వస్తువు / నమూనా తయారుచేయడము.
తక్కువ ఖర్చుతో తయారుచేయడము
పరికరాలను జాగ్రత్తగా వినియోగించడము.
పరికరాలను శుభ్రంగా ఉంచి భద్రపరిచే నైపుణ్యం