అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞానశాస్త్ర లక్ష్యాలు/విలువలు








విజ్ఞానశాస్త్ర ఉద్దేశాలు, విలువలు :-
→ ఉద్దేశం అనేది మన కళ్ళముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుంది
→ మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం
→ నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో సమగ్ర మూర్తిమత్వాన్ని సాధించడం, ఈ గమ్యాన్ని విద్య యొక్క ఉద్దేశంగా భావించవచ్చు -రెడిన్
→ ఉద్దేశాన్ని ఒక ప్రక్రియ ద్వారా సాధించవలసిన గమ్యాలు (లేదా) ఒక ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనాలుగా చెప్పవచ్చు
→ "సూద్" ఉద్దేశాలకు, గమ్యాలకు కూడా స్వల్ప తేడా తెల్పాడు. గమ్యాలనేవి ప్రయోజనాల నుంచి ఏర్పరచుకొనేవి. గమ్యాలనుంచి కొన్ని నిర్దిష్ట ప్రయోజనం కోసం ఎన్నుకొనే వాటిని ఉద్దేశాలంటారు.

బోధనోద్దేశం - నిర్వచనం :-
→ విజ్ఞానశాస్త్ర బోధనా కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను విజ్ఞానశాస్త్ర బోధనోద్దేశం అంటారు.

ఉద్దేశాల లక్షణాలు:-
1) ఆశయాలు సామాజిక అవసరాలు, మార్గదర్శక లక్షణాలు కలిగి ఉండాలి
2) దీర్ఘదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి
3) దీర్ఘకాలిక గమ్యంగా ఉండాలి

→ విజ్ఞానశాస్త్ర బోధన. ఉద్దేశాల్ని జాతీయ విజ్ఞానశాస్త్ర అధ్యాపకుల సంఘం (The National Sciente Teachers Association Washington) వారు 1961వ సం||లో ఈ విధంగా పేర్కొన్నారు
1) విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని గూర్చిన మౌలిక జ్ఞానాన్ని కలిగించడం.
2) గణితశాస్త్ర నైపుణ్యాలను, పరిశీలన నైపుణ్యాలను, ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంపొందించడం.
3) విజ్ఞానశాస్త్రానికి, సమాజానికి గల సంబంధాలను అవగాహన చేసుకోవడం.
4) విజ్ఞానశాస్త్రంలోని వివిధ శాఖలను, వివిధ అంశాలను సమన్వయపరచడం, విజ్ఞానశాస్త్రాన్ని వివరించే భావనల, సిద్దాంతాల అవగాహనను పెంపొందించడం


→ ప్రొ॥ బి.షారన్ (Prof.B.Sharon) NCERT (1980) వారు విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాల్ని ఈ విధంగా పేర్కొన్నారు.
1) విజ్ఞానశాస్త్ర అంశాలలో ముఖ్యంగా జీవికేంద్రీకృత, పరిసరాల ఆధారిత అంశాలను తెలియపరచడం
2) నమన్యల సాధనలో తోడ్పడిన శాస్త్రీయ పద్ధతిని వక్కాణించడం.
3)శాస్త్రీయ పరికరాలను ఉపయోగించడం, నిర్వహణలో విద్యార్థులకు శిక్షణనివ్వడం.
4) విద్యార్థులను సృజనాత్మకంగా తయారు చేయడం
5) విశాల భావాలు గల మానసిక శక్తిని పెంపొందించడం.
6)జీవితంలో వచ్చే మార్పులకు విద్యార్థులను సిద్ధపరచడం.


→ విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు, విలువలు క్రమంగా ఉండాలంటే కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
1) .విద్యార్థి అవసరాలు, సామర్థ్యాలు
2)సమాజ అవసరాలు
3) బోధనాంశం స్వరూప స్వభావాలు
4)విద్యా వ్యవస్థ స్వభావం
5)ఉపయోగ విలువ (వినియోగ విలువ)
6) సమకాలీనత
7)క్రమంగా ఉన్నత, విశాల లక్ష్యాలను చేర్చునట్లుగా ఉండాలి.
8) విద్యార్థుల మేథస్సుకు, పరిపక్వతకు తగినట్లుగా ఉండాలి
9) అభ్యసనకు, పరిస్థితులు ఆచరణాత్మకంగా ఉండాలి


→ విలియమ్ జె.జాకబ్ సన్ (WJ. Jacobson) ప్రకారం ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనల వల్ల కింది ఉద్దేశాలు నెరవేరుతాయి.
1) స్వాభావిక ప్రపంచం గురించిన దృష్టిని వృద్ధిపరచడం
2) విశాలమైన శాస్త్ర సాధారణీకరణాల్ని అభివృద్ధి చేయడం
3) విజ్ఞానశాస్త్ర ప్రక్రియలు, పద్ధతులను వినియోగించడంలో నైపుణ్యాన్ని పెంపొందించడం
4) అదర్శపౌరునిగా తయారు చేయడం
5) మానవదేహం, దాని సంరక్షణ గురించిన అవగాహన పెంపొందించడం.
6)శాస్త్రాభివృద్ధిలో భాగస్వామ్యం వహించే సామర్థ్యాన్ని పెంపొందించడం
7) విజ్ఞానశాస్త్ర ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించడం,
8) శాస్త్రవేత్త కృషిని ప్రదర్శించడం,




→ వీటితో పాటుగా విజ్ఞానశాస్త్రం కింది బోధనోద్దేశాలను కూడా కలిగి ఉన్నది.
1) విమర్శనాత్మక వైఖరి, శాస్త్రీయ వివేచనను వృద్ధి పొందించడం
2) పర్యావరణం గూర్చిన జాగృతిని అభివృద్ధిపరచడం

విజ్ఞానశాస్త్ర విలువలు :-
1)సాంఘిక విలువలు
2) క్రమశిక్షణా విలువలు
3) ఉత్తేజాన్ని కలిగించే విలువలు
4) సృజనాత్మక విలువలు
5)వివరణాత్మక విలువలు
6)ఉన్నత విద్యకు, వృత్తి విద్యకు భూమిక
7) ఉన్నత జీవితానికి భూమిక
8)నైతిక విలువ
9)సాంస్కృతిక విలువ
10)సౌందర్యాత్మక విలువ -
11) బౌద్ధిక విలువ
12) విరామ సమయ. వ్యాపకం
1.సాంఘిక విలువ :-
→ విజ్ఞానశాస్త్రం మానవుడిని సమాజాభివృద్ధికి పాటుపడే ఉపయుక్తపౌరుడిగా తయారుచేస్తుంది.
→ విజ్ఞానశాస్త్ర పఠనం ద్వారా ఆరోగ్యవిద్య, పలినరాలను పరిశుభ్రంగా ఉంచడం, కాలుష్యనివారణకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించగలరు
→ ప్రకృతి ప్రళయాలపుడు చేయవలసిన సహాయం వ్యక్తి సమాజ బాధ్యతను తెలియజేస్తుంది.
→విజ్ఞాన శాస్త్రాధ్యయనం మనం సమాజంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా జీవించడానికి తోడ్పడుతుంది.

2. క్రమశిక్షణా విలువ :-
→ విజ్ఞానశాస్త్రం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది.
→ సమస్యల నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచనానరళి, ఓర్పు, సరియైన నిర్ణయాలు చేయడం, →నిశితంగా పరిశీలించడం, పరిశీలించిన విషయాలపై ఖచ్చితమైన నివేదికలను చేయడం, పరికల్పనలు రూపొందించడం,
→పరీక్షించడం, లాంటి ఎన్నో సుగుణాలను పెంపొందిస్తుంది.

→ దీనివల్ల విద్యార్థులు తమ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల్ని సహితం క్రమశిక్షతో పరిష్కరించుకొంటారు.
→ క్రమబద్ధమైన జీవిత విధానంతో ఆనందాన్ని పొందుతారు

3.ఉత్తేజాన్ని కలిగించే విలువ :-
→ ప్రకృతి రహస్యాలను అన్వేషించడంలో శాస్త్రజ్ఞులు అవలంభించిన పద్ధతులు, నాటి దేతకాల పరిస్థితులు, శాస్త్రజ్ఞులు పడినపాట్లు తెలుసుకోవడంలో విద్యార్థులు అమితమైన ఉత్సాహం చూపుతారు శాస్త్రవేత్తలు సత్యాన్వేషణలో తాము కనుగొన్న వాస్తవాల్ని వెల్లడించడంలో తమ జీవితాలను సైతం లక్ష్యపెట్టని సంఘటనలు మన హృదయాలమీద చెరగని ముద్రవేస్తాయి.

→ ఉపాధ్యాయుడు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలను చదవడంలో అభిరుచి కలిగించాలి.

4.సృజనాత్మక విలువ:-
→ శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థులలో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది
→ శాస్త్ర అధ్యయనానికి కావలసిన పరికరాలను సమకూర్చడం, ప్రయోగాలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రయోగానికి కావలసిన పరికరాలను క్రమపద్ధతిలో అమర్చి పరిశీలనలను జరపడం మొదలైన చర్యల వల్ల విద్యార్థులలో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది.
→ సృజనాత్మకత అంటే కొత్త కోణంలో ఆలోచించగలగడం (లేదా) ఉన్న విషయానికి కొత్త భాష్యాన్ని చెప్పగలగడం, ఒక పాఠ్యాంశాని కొత్తరీతలో బోధించి, తార్కికమైన వ్యాఖ్యానం చేయడం.
→ సృజనాత్మక శక్తి గల విద్యార్థులు సామాన్యంగా కనిపించే విషయాల్లో సైతం నూతన విషయాలు ఊహిస్తారు. గమనిస్తారు.
→ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కావలసిన పరికరాలకు ప్రత్యామ్నాయం వారే చేయడం.
→శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన విద్యార్థులలో పెంపొందించుకొంటారు.



5. వివరణాత్మక విలువ:-
→ విజ్ఞానశాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థులలో ప్రకృతిలో జరిగే సంఘటనలు, యథార్థాలను వ్యాఖ్యానించే శక్తి కలుగుతుంది
→శాస్త్ర అధ్యయనంలో ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తూ, వాటి ఫలితాలను పరిశీలిస్తూ, కారణాలు వివరించడం ద్వారా విద్యార్థులకు వివరణాత్మక శక్తి కలుగుతుంది
→ ప్రయోగశాలలో నేర్చుకొనిన విషయాలకు నిత్యజీవితంలో చేసే పనులతో నంబంధముండుటను గుర్తించి వాటిని నమన్వయపరచడానికి ప్రయత్నిస్తారు
→ ప్రయోగఫలితాన్ని పట్టికలద్వారా, రేఖాపటాల ద్వారా వ్యాఖ్యానిస్తారు.
→ ప్రయోగశాలలో నేర్చుకొనే సూత్రాల ఉపయోగాలను నిత్య జీవిత పనులలో గమనిస్తారు.
→ నిత్యజీవిత పరిణామాలైన సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, రేయింబవళ్ళు ఏర్పడుట, మొ॥ వాటిని గమనిస్తూ, వాటికి గల కారణాలను అన్వేషిస్తూ, వాటికి హేతుబద్ధమైన వివరణలు ఇవ్వగల సామర్థ్యం విద్యార్థులలో పెరుగుతుంది.

ఉన్నత విద్యకు, వృత్తివిద్యకు భూమిక :
→ విద్యార్థులు భవిష్యత్తులో వివిధ వృత్తులను చేపట్టడానికి కావలసిన పరిజ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు విజ్ఞానశాస్త్ర బోధనవల్ల కలుగుతాయి
→ డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, లాయర్లు మొదలైన వృత్తిపరమైన కోర్సులకు కావలసిన ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతారు
→ శాస్త్ర బోధన ద్వారా వివిధ రకాల హాబీలైన పొటోగ్రఫీ, ప్రకృతి అధ్యయనం, వస్తు సేకరణ, కూరగాయల పెంపకం మొ|| 'వాటిలో విద్యార్థులలో అనక్తి పెంపొందించవచ్చు
→ విద్యార్థి తన సామర్థ్యాలకనుగుణంగా ఇష్టానుసారంగా వివిధ వృత్తులను చేపట్టడానికి కావలసిన ప్రాథమికజ్ఞానం, నైపుణ్యం ఏర్పడతాయి. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మస్టైర్యం పెరిగి భవిష్యత్తులో తాము ఎంచుకున్న ఉపాథిద్వారా తమ జీవితాల్ని నుఖమయం చేసుకొంటారు.
→ ప్రధాన విజ్ఞానశాస్త్ర రంగాలలో ఉన్నత విద్యనభ్యసించడానికి, దానిలో పరిశోధనలు చేయడానికి కూడా ఇది తోడ్పడుతుంది

7.ఉన్నత జీవితానికి భూమిక :-
→ విజ్ఞానశాస్త్ర అధ్యయనం ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది.
→ నేడు విజ్ఞానశాస్త్ర, సాంకేతిక రంగాల పురోభివృద్ధి ఫలితంగా మనం అనేక వనతి సదుపాయాలు పొందుతున్నాము. ఉదా: టెలిగ్రాము, టెలిఫోనుల ద్వారా వార్తనలు స్వల్పవ్యవధిలో దూరప్రాంతాలకు అందచేస్తున్నాము. సూపర్‌ఫాస్టురైళ్లు, విమానాల ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ దూరాలకు సామానులు, మనుష్యులను చేరవేస్తున్నారు.

8.నైతిక విలువలు :-

→ నీతిలేని మనిషి చుక్కాని లేని నావ వంటివాడు
→ మనిషిని పశువు నుంచి వేరుచేస్తూ జీవవరిణామక్రమంలో ఉన్నత స్థానానికి వచ్చినవారిలోని గుణగణాలు విద్యార్థులకు బోధించడం వల్ల వారిలో నైతిక విలువలు పెంపొందించుతాము.
→ విద్యార్థులు శాస్త్రవేత్తల జీవితాలనుంచి వారు ఎలాంటి ప్రయాసలుకోర్చి, ఎలాంటి త్యాగాలు చేసి, ప్రాణాలు సైతం లెక్కచేయక సత్యాన్వేషణలో తమ జీవితాలను ధన్యం చేసుకున్నారో గ్రహిస్తారు.
→ సత్యాన్వేషణలో వారు క్రమశిక్షణతోను, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా, నిష్కపటంగా, త్రికరణ శుద్ధితో, ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకొంటారు.
→ నిజజీవితంలో సత్యాన్నే పలకడం, ధర్మం నాచరించడం, తోటిబాలలతో సోదరభావంతో మెలగడం, సర్వమత సహనం అంతర్జాతీయ అవగాహన, జాతీయ భావాలు, ఓర్పు, సుగుణం మొదలయిన సద్గుణాలను అలవరచుకుంటారు కోపర్నికస్, గెలీలియో, డా.హనిమాన్ మొ||న శాస్త్రవేత్తలు తమ జీవితకాలంలో తాము అన్వేషించిన సత్యాన్ని వ్యక్తం చేయడం వల్ల హింసింపబడ్డారు. కాని వారు సత్యమార్గాన్ని విడనాడలేదు.

9.సాంస్కృతిక విలువ:-
→మానవ సంస్కృతిని, జీవన విధానాలను నిర్ణయించడంలో శాస్త్రం ప్రముఖపాత్ర వహిస్తుంది.
→మన ఆలోచనా సరళి, నమ్మకాలు, ఆచారాలు, సంస్కృతి మొదలయిన అంశాలు శాస్త్ర ప్రభావం వల్ల మార్పు చెందుతూ ఉంటాయి. అంటే శాస్త్రాభివృద్ధి ప్రతి అంశంలో మార్పుకు దారితీస్తుంది.
→ మన పూర్వీకుల సరళతార్కిక ఆలోచనా ఫలితమే మనకున్న విజ్ఞానసంపద.
→ విజ్ఞానశాస్త్ర అధ్యయనం వల్ల వ్యక్తులకు (విద్యార్థులకు) శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించడం వల్ల కొత్త సత్యాలు కనుొంటారు శాస్త్రీయ చింతనా పద్ధతులు వృద్ధిపొంది విశాల దృక్పథం ఏర్పడుతుంది.
→ మన సంస్కృతి వికాసానికి మన విద్యావిధానం, విద్యావిధానంలో సరియైన మార్పుల వల్ల మన సంస్కృతి పరస్పరం ఉపయోగపడాలి

10. సౌందర్యాత్మక విలవ :
→ విజ్ఞానశాస్త్రం ప్రకృతిని పరిశీలిస్తుంది.
→ శాస్త్రవేత్తలు ప్రతి దృగ్విషయాన్ని గమనించి, పరిశీలించి, ఇది ఏమిటి ? ఇది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ? ఎందుకు జరుగుతుంది ? మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానాలను నిరంతరం శ్రమించి అన్వేషిస్తుంటారు. ఈ అన్వేషణ ఫలితంగా వారు ప్రతి వస్తువులోను క్రమాన్ని, సౌష్టవాన్ని, మృదుత్వాన్ని రమణీయతను గమనిస్తారు. ఆశ్చర్యం చెందుతారు, ఆనందిస్తారు, అభినందిస్తారు
→ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణు నిర్మాణం నుంచి స్థూలమైన నక్షత్ర మండలాల వరకు అవి ప్రవర్తించే తీరును క్రమంగా గమనిస్తారు
→ ఐన్ స్టీన్ చెప్పినట్లుగా ముందే ఒదిగియున్న సమన్వయమే (Pre established harmony) ఈ సృష్టి
→ శాస్త్రజ్ఞుడు ఈ ప్రకృతిలో దాగియున్న అద్భుతనమన్వయం (లేదా) సమతాస్థితిని చూచి నివ్వెరపోతాడు. ఆనందానుభూతులకు లోనవుతాడు
→ శాస్త్రమే ఒక కళ. శాస్త్రజ్ఞుడు కళాకారుడు, కళాకారులు సౌందర్యోపానకులు .
→విజ్ఞానశాస్త్ర బోధనద్వారా విద్యార్థులలో 'మనుషులకు, ప్రకృతిగల నంబంధాలను వివరిస్తూ రసానుభూత, రసజ్ఞత, సౌందర్యాత్మక విలువలు పెంపొందింపజేయాలి.
→ అతి స్వల్పకాల వ్యవధి నుంచి రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు మొదలయిన విధాలుగా కాలగతిని నిర్ణయించేవిధం తెలుసుకొని ఆశ్చర్యం చెందుతారు
→ స్వల్పదూరం మొదలుకొని అనంత దూరాలను అంచనా వేసి కొలిచే పాత పద్ధతులకు, మైక్రానులు మొదలు కాంతి సంవత్సరం వరకు గల దూర ప్రమాణాలను తెలుసుకొంటారు. → కాలం, దూరం, పదార్థాల స్వభావాలు తెలుసుకొని ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందుతారు

11. బౌద్ధిక విలువ :-
→ వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక, కొత్త విషయాలను, సంఘటనలను నిరంతరం పరిశీలించి, వివరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాన, దురభిమానానికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు చేసే శక్తి శాస్త్రాభ్యసనం వల్ల విద్యార్థులకు కలుగుతాయి
→ విజ్ఞానశాస్త్ర అభ్యసనం, సత్యంపట్ల సద్భావన కలిగించడమే కాక, సత్యాన్ని అన్వేషించడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది.
→ విద్యార్థుల్లో, తార్కిక చింతన, విమర్శనాత్మక పరిశీలన, సృజనాత్మక నైపుణ్యాలను కలుగజేస్తుంది.
→ మానవుడు అతని పరిసరాలు గురించిన జ్ఞానం విద్యార్థులకు కలుగుతుంది. ఈ విధంగా కలిగిన జ్ఞానం తన పరిసరాలను గూర్చి ఇంకా తెలుసుకోవాలనే వాంఛను విద్యార్థుల్లో కలిగిస్తుంది.
→ సత్యాన్వేషణలో విద్యార్థులు తమ జ్ఞానాన్ని వినియోగించి కొత్త సాధనాలు, విధానాలు, పరికరాలు మొదలైనవాటిని కనిపెడతారు.
→ తమ పరిశీలనలను నిర్భయంగా వెల్లడించి నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకొంటారు.
→ క్రమశిక్షణతో వ్యవహరించి సమాజాభివృద్ధికి తోడ్పడతారు. సత్యాన్వేషణకోసం ప్రయత్నిస్తారు. దీనివల్ల వారిలో బుద్ధికుశలత పెరుగుతుంది
→ వ్యావహారిక సత్తావాదుల ప్రకారం శాస్త్రం విద్యార్థిలో చురుకైన, ఎటువంటి అనుభవాలైనా తట్టుకోగల, సర్దుబాటు చేసుకోగల మనిషిని అభివృద్ధి చేస్తుంది.
→ ఒక ఆచారం ఎంత గొప్పదైనా దేశ కాలమాన పరిస్థితులు మారితే ఆ ఆచారం - సమాజం మీద దుష్పలితాలను సూచిస్తుంది. అంటే దీని అర్థం పాత ఆచారాలన్నీ చెడ్డవనికాదు. ఏ ఆచారాలైతే నిరుపయోగమని రుజువు చేయబడతాయో వాటిని వదిలిపెట్టడం, మంచినిచేసే కొత్త ఆచారాలను అవలంభించడం శాస్త్రం వల్లనే జరుగుతుంది
→ ఆహారం, వైద్యం, ఆరోగ్యం జీవనవిధానాలలో పెనుమార్పులు రావడానికి కారణం విజ్ఞానశాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో పెంపొందింపబడిన బౌద్ధిక విలువలేనని చెప్పవచ్చు
→ 1958లో అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ చెప్పినదేమంటే ఏ శాస్త్ర బోధనకైనా ప్రాథమికగమ్యం విద్యార్థులకు బౌద్ధిక విలువలను పెంచడమే 12.విరామ సమయ వ్యాపకం :
→ విద్యార్థులకు తీరిక సమయానికి తగిన పని కల్పించడం విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలలో ఒక ప్రధాన అంశం.
→ ప్రకృతిలో దృగ్విషయాల్ని పరిశీలించడం, చిన్న చిన్న ప్రయోగాలు చేయడం, వాటికి అవసరమైన వాటిని ఉన్న వనరులతో చేయడం, సేకరించడం చేస్తుంటారు
→ సమాజానికి ఉపయోగపడే సిరా, కొవ్వొత్తులు, సుద్దముక్కలు మొదలైన ఉత్పత్తి పనులు అవకాశాన్ని బట్టి చేపట్టడానికి వారిని ప్రోత్సహించవచ్చు
→ సమాజాభివృద్ధికై విజ్ఞానశాస్త్ర సంఘాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, వాతావరణ కాలుష్య నివారణ మార్గాలు, జల సంరక్షణా చర్యలు, మొక్కలు నాటడం, పెంచడం, నిరక్షరాస్యతా నిర్మూలన మొదలైన కార్యక్రమాల్ని చేపట్టవచ్చు.
→ విజ్ఞాన విహారయాత్రలలో పాల్గొనడం, నర్సరీలు, తోటలు, పార్కులు, జంతు ప్రదర్శనశాలలు, కుటీర పరిశ్రమలు, దగ్గరలోనున్న పరిశ్రమలు, మ్యూజియంలు మొదలైన వాటిని సందర్శించవచ్చు. వారికి యిష్టమైన హాబీలను చేపట్టవచ్చు
→ వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డిబేట్లు, క్విజ్ పోటీలు, కవితాగోష్టులు, కవి సమ్మేళనాలు మొదలైన సారస్వత కార్యక్రమాలలో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి



గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు :
→సాధారణంగా ఉద్దేశాలు (Aims), గమ్యాలు (Goals), లక్ష్యాలు (Objectives) అనే పదాలను పర్యాయపదాలుగా వాడతారు.
→విద్యాపరంగా ఉద్దేశాలు, గమ్యాలు అనే పదాలను ఒక అర్ధంలోను లక్ష్యాలు అనే పదాన్ని వేరొక అర్ధంలో వాడతారు.
ఎ) గమ్యాలు : గమ్యాలు విభాలమైన, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనాల్ని తెలియజేస్తాయి.
ఉదా :- విద్యకు పరమార్ధం మోక్షం - ఉపనిషత్తులు.
బి) ఉద్దేశాలు : ఉద్దేశాలు గమ్యాల నుంచి ఏర్పడినాయి. ఇవి గమ్యాలకంటే నిర్దిష్టమైనవే కాకుండా విద్యా దిశలను కూడా సూచిస్తాయి. కాబట్టి వీటిని సాధించడానికి నిర్ణీత దీర్ఘకాలవ్యవధి అవసరం
ఉదా :- విద్యార్థులలో విజ్ఞానశాస్త్ర జ్ఞానం కలిగించడం
సీ) లక్ష్యాలు : అనతికాలంలో చేరగల గమ్యాలను లక్ష్యాలనవచ్చు.
ఉదా : T.E.T పరీక్ష పాసవడం
ఉద్దేశాలు, లక్ష్యాలు ఏర్పడే విధానాన్ని కింది విధంగా చూపవచ్చు.
విజ్ఞానశాస్త్ర బోధనా ఉద్దేశాలు
ఉద్దేశాల ఎంపిక నుంచి ఏర్పడినది
ప్రత్యేక కోర్సుల లక్ష్యాలు
ఎంపిక చేసిన లక్ష్యాలను నిర్దిష్ట పాఠ్యాంశ, బోధనా పద్ధతులను అన్వయిస్తే ఏర్పడేవి నిర్దిష్ట పాఠ్యాంశ లక్ష్యాలు

బోధనా లక్ష్యాలు:-
→ కొందరి విద్యావేత్తల అభిప్రాయంలో బోధనా లక్ష్యాలే ప్రవర్తనా లక్ష్యాలు
→ ఒక యూనిట్లో విషయ బోధన జరిగిన తరువాత విద్యార్థి నుంచి అశించబడే నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన రూపంలో (ప్రకటింప) వ్యక్తం చేయబడిన ప్రవర్తనా లక్ష్యాలు. విద్యా లక్ష్యాల స్థాయి నిర్ధారణ ప్రక్క పటంలో చూపిన విధంగా చూడవచ్చు.

ఉద్దేశాలు, లక్ష్యాలకు గల భేదాలు :-
ఉద్దేశాలు :-
1.ఇవి విద్యలో దిశానిర్దేశాన్ని చేస్తాయి. ఉద్దేశాలు లేకుంటే విద్య ద్వారా మనము గమ్యాలను చేరలేము.
2. ఉద్దేశాల లక్ష్యసాధన పాఠశాల కార్యక్రమాలకు అతీతంగానే ఉంటుంది
3.రాజకీయ, విద్యావేత్తలు నిర్ణయిస్తారు
4.సాధారణంగా సామాజికవసరపరంగా రూపొందించడం ఉద్దేశాల నుంచి రూపొందించడం జరుగుతుంది.
5.ఉద్దేశాలు సార్వత్రికమైనవి. అంటే విషయానికి, విషయానికి ఉద్దేశాలలో మార్పు ఉండదు.
6.ఉద్దేశాలు విశాలమైనవి, విస్తృతమైనవి. అందువల్ల ఇవి ఒక నిర్దిష్ట విషయానికి పరిమితం కాజాలవు.
7. ఉద్దేశాలు సుదూర గమ్యాలు.
8. ఉద్దేశాలు వెంటనే నెరవేరవు కాట్టి అర్ధరహితంగా అనిపిస్తాయి.
9.ఉద్దేశాలు నుంచి లక్ష్యాలు పుడతాయి. ఉద్దేశాలను సాధించడానికి సోపానాలే లక్ష్యాలు.

లక్ష్యాలు:-
1.ఉద్దేశాలు అనుకున్న దిశలో సాధించగల నొక్కి చూపగలిగేదే లక్ష్యం
2.లక్ష్యాలు సాధించేవిగా ఉంటాయి
3.అధ్యాపకులు నిర్ణయిస్తారు.
4.ఉద్దేశాల నుంచి రూపొందించిటం జరుగుతుంది.
5.బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాలలో మార్పు ఉంటుంది
6.లక్ష్యాలు తరగతి ఉపాధ్యాయునికి, అతని దైనందిన బోధనా కార్యక్రమంలో ఎంతో ఉపయోగపడతాయి.
7.లక్ష్యాలు దగ్గరి గమ్యాలు , త్వరితంగా ఫలితాలనిస్తాయి.
8.లక్ష్యాలు అర్ధవంతంగా అనిపిస్తాయి. ఎందుకంటే అవి నిర్దిష్టంగా సాధిం చేవిగా ఉంటాయి
9.లక్ష్యాలు ఉద్దేశాలనుంచే ఉద్భవిస్తాయి. ఒక్కొక్క లక్ష్యసాధన చేసుకుపోతుంటే కొన్నాళ్ళకు ఉద్దేశాన్ని సాధించగలం

విద్యా లక్ష్యాల వర్గీకరణ :-
→ విద్యార్థి ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పును తీసుకొచ్చి అతన్ని సమాజానికి ఉపయోపగవడే పౌరునిగా తీర్చిదిద్దడమే అంతిమ విద్యాలక్ష్యం.
1) గేగ్నే అనే విద్యావేత్త సూచించిన వర్గీకరణం:-
→ గేగ్నీ ఎనిమిది రకాల అభ్యసనాన్ని విడమర్చి చెప్పాడు
→ వీటిలో నూచి అభ్యసనం, ఉద్దీవన - ప్రతిన్చందన ఆభ్యసనం, భావనాభ్యసనం, సూత్రాల అభ్యసన, నమస్యావరిష్కారం మొదలైన ఎనిమిది రకాల అభ్యసనాలున్నాయి,
→ఇవి సరళం నుంచి నంక్లిష్టానికి ఒక క్రమంలో అమర్చబడ్డాయి

2) బెంజమిన్ బ్లూమ్, క్రాత్ హాల్, డేవిడ్ మొదలయినవారు సూచించిన వర్గీకరణం :
→ ఈ వర్గీకరణకు నాంది. 1948 సంవత్సరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారి సమావేశంలో పాల్గొన్న అనేక కళాశాలలకు చెందిన పరీక్షకుల తర్జన భర్జనలే.
→ వీరందరి ఒప్పందం ప్రకారం మొత్తం విద్యా లక్ష్యాలను మూడు వర్గాలుగా విభజించారు అవి
ఎ) జ్ఞానాత్మక రంగం
బి) భావావేశరంగం
సి) చలనాత్మక రంగం

→ జ్ఞానాత్మకరంగం గురించి బెంజమిన్ ఎస్.బ్లామ్, భావావేశరంగం గురించి దేవిడ్ ఆర్. క్రాత్ హాల్ విశేషకృషి చేయడం జరిగింది
→ మానసిక చలనాత్మక రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్, ఆర్. హెచ్. దావే, హీరో మొదలైన వారు కృషి చేశారు
ఈ మూడు రంగాలకు పరస్పర సంబంధం :-

→ విద్యార్థి ప్రవర్తన మూడు రంగాలపై ఆధారపడి ఉంటుంది
→ విద్యయొక్క పరమావధి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమే. - గాంధీజ్
→ జ్ఞానాత్మక రంగం మెదడుకు (Hcad), భావావేశ రంగం హృదయానికి (Heart), మానసిక చలనాత్మకరంగం మనసుకు శరీరానికి (Hand-body) సంబంధించినది. అంటే మూడు రంగాల ప్రాముఖ్యత మూడు | లన్నమాట.
→విద్యా లక్ష్యాల వర్గీకరణ కింది విధంగా చూపవచ్చు.

విద్యాలక్ష్యాలు :-
→జ్ఞాన :జ్ఞానానికి సంబంధించిన జప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం మానసిక సామర్థ్యాలు, నైపుణ్యాలు అభివృద్ధిపరచడం
→భావావేశ : ఆసక్తులు, విలువలలో మార్పులు, అభినందనను పెంపొందించడం
→మానసిక చలనాత్మక:హస్తలాఘవ మోటారు నైపుణ్యాలు, అభివృద్ధి చేయడం
వర్గీకరణ ప్రయోజనాలు :-
1. ఆధిపత్య శ్రేణిలో వర్గీకరించబడిన లక్ష్యాలకు సంబంధించిన ఒక సామాన్య అవగాహనను పెంపొందించుకొనవచ్చు.
2. ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు, పాఠ్యప్రణాళిక నిర్మించేవారు, మూల్యాంకనం చేసేవారితో ఈ విద్యాలక్ష్యాల వర్గీకరణకు సంబంధించిన సరియైన సమాచారం పెంపొందించవచ్చు
3.విద్యావేత్తలు అధ్యసనానుభవాలను రూపొందించి మూల్యాంకనం చేయడానికి ఈ వర్గీకరణం సహాయపడుతుంది
4.మూల్యాంకనంలో సార్వత్రిక విధానాన్ని నెలకొల్పవచ్చు
5.పాఠశాల విద్యా ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించి అర్ధవంతంగా మూల్యాంకనం చేయడానికి సహాయపడుతుంది.

→ లక్ష్యాలను జ్ఞాన, 'భావావేశ, మానసిక చలనాత్మక రంగాలుగా విభజించడం వల్ల ఉపాధ్యాయుడు వాటిని నరియైన రీతిలో నిర్వచించి, అనువదించగలడు
→ నమాచార మార్పిడికి, పాఠ్యప్రణాళికా అభివృద్ధికి, మూల్యాంకనా విధానాలకు కూడా ఈ వర్గీకరణ సహాయపడుతుంది.
→ ప్రతి క్షేత్రంలో ఉన్న లక్ష్యాలను 'ఒక లక్షణం ఆధారంగా ఆధిపత్య శ్రేణిలో అమర్చారు. దీనిలో ప్రతిస్థాయి దాని పూర్వస్థాయిపై ఆధారపడి దాని సామర్థ్యాలన్నీ చేర్చుకొని ఉంటుంది .

ఎ) జ్ఞానాత్మకరంగం :
→ బ్లూమ్ మాటలలో జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తుంచుకోవడం అనే వాటికి సంబంధించినది.
→ ఈ క్షేత్రంలో ఆరు తరగతులు సరళం నుంచి సంక్లిష్టం అనే లక్షణం ఆధారంగా ఒక ఆధిపత్యశ్రేణిలో అమర్చబడ్డాయి

1. జ్ఞానం :-
→ ఇది జ్ఞానాత్మక రంగంలో సరళమైన తక్కువస్థాయి (లేదా) ప్రథమస్తాయి లక్ష్యం. దీనిద్వారా వివిధ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది
→ ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం జ్ఞానమే
→ ఈ లక్ష్యంలో కింది అంశాలను చేర్చడం జరిగింది
ఎ) నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానం
బి) వివిధ శాస్త్రీయ పదాలకు సంబంధించిన జ్ఞానం
సి) నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానం
డి) నిర్దిష్ట విధానాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానం
ఇ) నిర్దిష్ట సంకేతాలకు నంబంధించిన జ్ఞానం
ఎఫ్) వివిధ వరుసక్రమాలు, నూతన ధోరణులకు సంబంధించిన జ్ఞానం,
జి) వర్గీకరణ జ్ఞానం,
హెచ్) కొన్ని లక్షణాంశాల జ్ఞానం,
ఐ) పద్ధతులకు సంబంధించిన జ్ఞానం,
జె) సిద్ధాంతాలు, నిర్మాణాలకు సంబంధించిన జ్ఞానం.

2.అవగాహన:-
→ ఇది జ్ఞానాత్మకరంగ ఆధిపత్య శ్రేణిలో రెండవ లక్ష్యం.
→ ఈ స్థాయిలో విద్యార్థి తన వద్దనున్న సమాచారాన్ని మనసులో గానీ, బహిర్గతమైన ప్రదర్శనలోగానీ తనకు ఎక్కువ ఆర్థవంతమయ్యే విధంగా మార్చుకుంటాడు
→ ఈ రంగాన్ని తిరిగి మూడు రంగాలుగా విభజించడం జరిగింది. అవి

1) తర్జుమా చేయడం :
ఎ) ఒక స్థాయి అమూర్త భావన నుంచి వేరొక స్థాయికి మార్చడం.
బి) ఒక సంకేతాన్ని మరొక పదం (లేదా) సంఖ్యగా మార్చడం,
సి) శాబ్దికం నుంచి వేరొక దానికి అనువదించటం.
2) వ్యాఖ్యానించడం : వివిధ విషయాలను వివరించడం.
3) ఎక్స్ట్రాపోలేషన్ : వివిధ ముగింపులను గ్రహించగల ప్రవర్తన
3.వినియోగం:-
→ ఇది మూడవ లక్ష్యం. ప్రస్తుత విద్యావ్యవస్థలో ముఖ్యమైనది
→ విద్యార్థి స్వయంగా తన వద్దనున్న సమాచారాన్ని వినియోగించి సమస్యను పరిష్కరిస్తాడు.

4. విశ్లేషణం :
→ ఇది నాలుగవ లక్ష్యం.
→ ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య గల తార్కిక సంబంధమే. వ్యవస్థీకరణ విధానాన్ని గురించి తెలుసుకోవడమే
→ విశ్లేషణ అంటే ఉదా: H2SO4, అనే ఫార్ములాను చూసి దానిలోని మూలకాలను వాటి సంఖ్య, వరమాణు భారాలు, అణుభారాలు విశ్లేషించి చెప్పడం.

5.సంశ్లేషణం:-
→ ఆధిపత్య శ్రేణిలో ఇది ఐదవ లక్ష్యం. సంక్లిష్టమైనది.
→ వివిధ దత్తాంశాల ఆధారంగా నూతన విషయాల ఆవిష్కరణ జరుగుతుంది.
→ వ్యాసాల్ని రాయడం, సిద్ధాంత వ్యాసాల్ని వ్యవస్థీకరించడం, క్రమబద్ధమైన భాషణనివ్వడం, నూతన పద్ధతులను కనుగొని నమస్యా పరిష్కారం చేయడం మొదలైనవి ఈ లక్ష్యంగా పేర్కొనవచ్చు.

6.మూల్యాంగనం:-
→ ఇదే చివరి, ఆరవ లక్ష్యం. ఉన్నత క్రమ లక్ష్యం కూడా
→ వివిధ వాక్యాలు, సత్యాలు, విలువలు, విధానాలు, పద్ధతులకు సంబంధించిన నిర్ణయాలను చేయగలిగే శక్తి పెంపొందించడమే ఈ లక్ష్యం యొక్క ఉద్దేశం.

బి) భావావేశ రంగం:
→ డేవిడ్ ఆర్. క్రాత్ హాల్ ఈ రంగానికి సంబంధించిన వివరాలను ఇచ్చారు.
→ ఈ రంగం మానసిక స్థాయికి, హృదయానికి సంబంధించినది.
→ చక్కటి విలువలకు, సన్నివేశాలకు, వేరు వేరు సందర్భాలలో విద్యార్థి హృదయం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి ఉన్నతమైన విషయాలకు స్పందింపచేసి, వారి శీలనిర్మాణం చేయవచ్చో ఈ రంగంలోని లక్ష్యాల ద్వారా తెలుస్తుంది.
→ ఇది అభిరుచులు, వైఖరులు, విలువలు, అభినందనలు, సర్దుబాటుకు సంబంధించినవి.
→ ఈ క్షేత్రంలో ఐదు ప్రధాన వర్గాలున్నాయి. ఇవి 'అంతర వృద్ధి' అనే అంశంపై ఆధారపడి ఓ ఆధిపత్యం శ్రేణిలో అమర్చబడి ఉంటాయి
→ బ్లూమ్ ఈ క్షేత్రాన్ని ఐదు రకాలుగా వర్గీకరించారు. అవి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన చేయడం, శీలస్థాపన చేయడం

1. గ్రహించడం :
→ కొన్ని ఉద్దీపనలకు (లేదా) దృగ్విషయాలకు తగిన సునిశితత్వాన్ని ప్రదర్శించడం లేదా అయా ఉద్దీపనలను గ్రహించడానికి లేదా వాటిపై అవధానం చూపడానికి సంసిద్ధతను తెలియజేయడమే గ్రహించడం అంటే ఉదా : ధ్వని కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడం

2.ప్రతిస్పందించడం:-
→ ఇది గ్రహించడం కంటే ఉన్నత క్రమానికి చెందినది. విద్యార్థి కోరిన ప్రకారం ప్రతిన్నందిస్తాడు. ఉదా : వివిధ మూలకాలు, సంయోగ పదార్థాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి విజ్ఞానశాస్త్ర మ్యూజియంలు చూడాలనే

3. విలువ కట్టడం :
→ ఇది భావావేశ రంగంలో మూడవది
→ విద్యార్థిలో ఏర్పడిన భావాలు, విలువలు అంతర్లీనత చెంది ఆయా భావాలకు, విలువలకు కట్టుబడి ఉండటం జరుగుతుంది దీన్నే వైఖరి (లేదా) దృక్పథం అంటారు.
→ దీనిలో విద్యార్థులు శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చేసికొంటారు.
→ మూఢనమ్మకాలను విస్మరించి, ఇతరులు చెప్పిన విషయాలు గ్రుడ్డిగా నమ్మకుండా పరిస్థితులను పరిశీలించి, తగిన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది

4.వ్యవస్థాపన :
→ దీనిలో భావనలకు, అభిప్రాయాలకు విలువ కట్టిన తరువాత మదింపు చేసి కొన్ని విలువలను స్థిరీకరించడం జరుగుతుంది.
→ పక్షపాత వైఖరి లేకుండా లక్ష్యాత్మకంగా అన్ని సన్నివేశాలలో ప్రవర్తించడం జరుగుతుంది.
→ వ్యవస్థాపనం నుంచి విలువలను అంతర్లీనం చేసుకోవడం, విలువల వ్యవస్థను వ్యవస్థికరించడం విలువ (లేదా) విలువల సమ్మేళనంతో శీలస్థాపనం చేయడం' జరుగుతుంది
→ ఇది జ్ఞాన రంగంలోని సంశ్లేషణ, విశ్లేషణాలకు సరిపడే మానసిక స్థాయి

5.శీలస్థాపనం .
→ ఇది భావావేశ రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం.
→ కొన్ని ప్రవర్తనలు, భావాలు, విలువలు విద్యార్థి ప్రవర్తనలో భాగంగా మారతాయి
→ భావావేశ రంగపు ఈ దశలో వ్యక్తి యొక్క విలువలను వ్యవస్థ పూర్తిగా తన ప్రవర్తనను చాలాకాలంగా నియంత్రిస్తూ ఒక నిర్ధిష్టమైన జీవన విధాన అభివృద్ధికి తోడ్పడుతుంది
→ ఈ దశలో విలువ (లేదా) విలువల సమన్వయంతో శీలస్థాపనం' చేయడం తద్వారా సాధారణీకరణ సమితిని పెంపొందించుకోవడం తరువాత శీలస్థాపనం జరుగుతుంది



మానసిక చలనాత్మక రంగం :-
→ ఈ రంగంలో నైపుణ్యాలుంటాయి. దీనిలో 5 సోపానాలుండును.
→ మానసిక చలనాత్మక రంగాన్ని ఆర్. హెచ్.దవే, ఎలిజిబెత్ సింప్సన్, హీరో వర్గీకరించారు. నోట్ :- ఇంకా సంపూర్ణంగా లక్ష్యాలు వర్గీకరించబడని రంగం

→ దీనిలో మానవులు చేసే కృత్యాలుంటాయి.
→ మనస్సులో పుట్టిన ఆలోచనలను, ఆచరణలో పెట్టే రంగం
→ దీనిలో చిత్రలేఖన, హస్త, చలన, పరిశీలన, ప్రయోగ మొదలైన నైపుణ్యాలుంటాయి
→ ఇది శరీరానికి, మనస్సుకు సంబంధించినది. ఇది మెదడు కండరాలకు సంబంధించినది.
→ శారీరక శక్తికి, మానసిక శక్తికి మధ్య అనుసంధానం జరుగును
→ ఈ విధంగా ఆలోచన - ఆచరణ / శారీరక శక్తికి, మానసిక శక్తికి / మెదడు - కండరాలకు మధ్య సమన్వయం ఏర్పడుటయే మానసిక చలనాత్మక రంగం
→ దీనిలో ఐదు సోపానాలు వరుసగా, అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజత్వం ఉండును
→ గుర్తుంచుకునే కోడ్ - IMPAN

1).అనుకరణ (ఇమిటేషన్)
→ అభ్యసనం అనుకరణ వలన జరుగుతుంది.
→ ఎలాంటి సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడాన్నే అనుకరణ అంటాం.
→ ఎదుటి వ్యక్తిని చూస్తూ ఎలాంటి సూచనలు లేకుండానే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చేసే పనిని అనుకరిస్తాడు
→ అనుకరణ అనేది వినడం, చూడడం, ముట్టుకోవడం, రుచి, వాసన మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా జరుగును.
→ ఇందులో విద్యార్థికి కృత్యం పైన ఎలాంటి నియంత్రణ ఉండదు
→ విద్యార్థి యొక్క నిష్పాదనలు, అసంపూర్ణంగాను, అపరిపక్వంగాను ఉంటాయి.
→ అనుకరణ అనేది నైపుణ్యాలను సాధించుటలో ప్రత్యేక పాత్ర పోషించును.
→ మానసిక చలనాత్మక రంగంలో మొట్టమొదటి / ప్రాముఖ్యత / మౌలిక సోపానం
→ మొదట మానవుడు వస్తువులను చూడగానే వాటిని తాకాలని ప్రబోధం పొందుతాడు.
నోట్ :- అనుకరణలో ప్రమాదాలు ఎక్కువ
కోడ్ :- వ్యక్తిని అనుసరిస్తూ, జ్ఞానేంద్రియాలను ఉపయోగించి, పనిమీద ఎలాంటి నియంత్రణ, నిష్పాదన, పరిపక్వత లేకుండానే ఎటువంటి సూచనలు లేకుండానే పనిని చేయుట

ఉదా :-
1) ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేసేటప్పుడు పరికరాలను అమర్చే విధానాన్ని అనుకరిస్తాడు.
2) ఉపాధ్యాయుడు పటాలను గీచేటప్పుడు విద్యార్థి అనుకరిస్తాడు. .

2) హస్తలాఘవం (మాని ప్లేషన్) : (సూచనలు -సలహాలు):-

→ ఇది రెండవ సోపానం
→ దీనిలో చేతులు, కాళ్ళను ఉపయోగించి వాటితో పనిచేస్తాడు నోట్ :- 1) అనుకరణలో ఎలాంటి సూచనలు లేకుండా వ్యక్తిని అనుసరిస్తూ పని చేస్తాడు, కానీ హస్తలాఘవంలో వ్యక్తి అవసరం లేకుండా / వ్యక్తి పరిశీలనా అవసరం లేకుండా సూచనలు ఆధారంగా నైపుణ్యం పొందును .
2)అనుకరణలో ప్రమాదాలెక్కువ, కానీ హస్తలాఘవంలో విద్యార్థి వస్తువులను, పరిక్తాలను, ఉపకరణాలను జాగ్రత్తగా అమర్చి ఉపయోగిస్తారు.
3) అనుకరణలో ప్రయోగ విధానంలో, పరికరాల అమరికలో విద్యార్థికి ఎలాంటి నియంత్రణ, నిష్పాదన ఉండవు కానీ హస్తలాఘవంలో నియంత్రణ, నిష్పాదన పొంది పరికరాలను, ప్రయోగాలను జాగ్రత్తగా నిర్వహిస్తాడు.

ఉదా :- 1) కృత్యాలను సాధన చేయడం, పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం
2) విద్యార్థి తనతంతట తాను పటాలు గీయడం, పరికరాలను అమర్చడం, ప్రయోగాలు చేయడం

కోడ్ :- కాళ్ళు చేతులతో పని చేయుట -- హస్తలాఘవం
జాగ్రత్తగా పని చేయుట -హస్తలాఘవం

పరికరాలను, ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించుట- హస్తలాఘవం.
నోట్ :- విద్యార్థి బ్యూరెట్ ను స్టాండుకు జాగ్రత్తగా అమర్చుట, గాజు కుప్పె, పిప్పెట్లను ఉపయోగించుట.
విద్యార్థి వృత్తలేఖిని, విభాగిని, స్కేలు మొదలైన ఉపకరణాలను ఉపయోగించుట.

3) సునిశితత్వం (సున్నితంగా / ఖచ్చితంగా) :
→ ఇది మానసిక చలనాత్మక రంగంలో 3వ మెట్టు
→ దీనిలో విద్యార్థి నిష్పాదన ప్రావీణ్యత ఉన్నతస్థాయికి చేరును .
→ అభ్యాసకుడు పనిని స్వంతంగా, సున్నితంగా, ఖచ్చితంగా చేస్తాడు.
→ ప్రయోగ ఫలితాలు సరిగ్గా ఉండాలంటే సునిశితత్వం అవసరం.
→ సున్నితంగా పరిశీలించడం, ఖచ్చితంగా రీడింగులు తీసుకొనుట
→ సంశ్లేషణ ప్రక్రియలో ఇమిడి ఉన్న అనేక పరికర్మలను నిష్పాదన చేసి అన్నింటికి తగిన సాధన చేయగల సామర్థ్యమే సునిశితత్వం
కోడ్ :- సునిశితత్వం / సున్నితత్వం / ఖచ్చితంగా చేయుట / అన్ని భాగాలు, అన్ని అవయవాలు ఉపయోగించుట ఇక్కడ పనిని చేయుట / ఉత్పత్తిని సృష్టించుట
ఉదా :- 1) స్కేలుతో రేఖా ఖండం కొలిచేటప్పుడు / రీడింగులు తీసుకునేపుడు ఖచ్చితంగా కొలవడం
2) బ్యూరెట్లో రీడింగును తీసుకునేటపుడు ఖచ్చితంగా తీసుకొనుట
3) పటంలో వివిధ స్థానాలను ఖచ్చితంగా గుర్తించుట / మ్యాప్ పాయింటింగ్
నోట్ :- సునిశితత్వంతో ప్రక్రియలు నెమ్మదిగా, ఖచ్చితంగా జరుగును, సమన్వయంలో ప్రక్రియలు వేగంగా సకాలంలో, ఖచ్చితంగా జరుగును.

4.సమన్వయం / ఉచ్చారణ (వేగం. ఖచ్చితత్వం. సకాలంలో)
→ ఇది 4వ సోపానం
→ దీనిలో వివిధ చర్యల శ్రేణి సమన్వయీకరణం చెంది వరుసక్రమంలో జరుగును
→ వివిధ చర్యలను సమన్వయించి, క్రమపద్ధతిలో స్పష్టంగా వివరించగలరు
→ అనగా వివిధ చర్యలు / పనులు ఒకదాని తర్వాత ఒకటి వరుసక్రమంలో జరుగును
→ దీనిలో వేగం, ఖచ్చితత్వం రెండు ఉండును ఉదా :- 1) విద్యార్థి త్రిభుజ పరివృత్తాన్ని వేగంగా, ఖచ్చితంగా చేశాడు.
2) విద్యార్థి లవణ విశ్లేషణా ప్రయోగాన్ని సకాలంలో, ఖచ్చితంగా చేశాడు
3) విద్యార్థి భారతదేశ పటాన్ని వేగంగా, సకాలంలో ఖచ్చితంగా గీచి భాగాలను గుర్తించాడు

5) సహజత్వం / సహజీకరణ / స్వాభావీకరణం:

→ మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం. 5వ లక్ష్యం
→ నైపుణ్యాలలో ప్రావీణ్యత పొందుతారు. ప్రావీణ్యత శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది
→ దీనిలో విద్యార్థికి ఏ పనినైనా అనాలోచితంగా, యాంత్రికంగా, అప్రయత్నంగా, ఎలాంటి తడబాటు, సులభంగా చేయడాన్నే సహజీకరణం అంటారు
→ తక్కువ, తక్కువ ఖర్చుతో కృత్యం స్వయంగా నిర్వహిస్తాడు.
→ తాను నేర్చుకున్న నైపుణ్యాలను అప్రయత్నంగా, ప్రయాస, జంకు లేకుండా ధైర్యంగా వివిధ పరికరాలను ఉపయోగిస్తాడు.
→ నైపుణ్యం వ్యక్తి యొక్క ప్రవర్తనలో భాగం అగును. జీర్ణ ప్రవర్తన అగును.
ఉదా :- 1) విద్యార్థి పరిషృత్తాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, అప్రయత్నంగా గీస్తాడు
2) ఆక్సిజన్ తయారీ ప్రయోగాన్ని సహజంగా, తక్కువ శక్తితో, ప్రయాస లేకుండా నిర్వహిస్తాడు
3) విద్యార్థి భారతదేశ పటాన్ని అనాలోచితంగా, యాంత్రికంగా గీస్తాడు

ఉదా :- టి.వి. చూస్తూ గృహిణులు కూరగాయలు తరగడం
సెల్ మాట్లాడుతూ బైక్ నడుపుట
ఇతర వ్యక్తులతో మాట్లాడుతూ డి.టి.పి. చేయుట
నోట్ :- ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఈ 3 రంగాలను సమైక్యంగా, సమన్వయంగా, కలిసికట్టుగా సాధించాలి

నోట్ :- జ్ఞాన లక్ష్యాలు : జ్ఞానం, అవగాహన, వినియోగం

భావావేశ లక్ష్యాలు : అభిరుచి, ప్రశంననీయత, వైఖరి
మానసిక చలనాత్మక లక్ష్యాలు : నైపుణ్యాలు.