అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సాంఘిక శాస్త్ర స్వభావం/ పరిధి






సాంఘికశాస్త్రము ఒక గతిశీలకమైన విషయము :-
→ సాంఘికశాస్త్రము భౌతిక, జైవిక, సాంఘిక పరిసరాలను గుర్తించి వాటిని, మానవుడు తన వ్రగతికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో, వివరిస్తుంది.
→ సాంఘికశాస్త్రము భౌగోళిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక అంశాలు, నైతిక విలువలు, సాంఘిక అంశాలు, ధార్మిక అంశాలు బోధిస్తున్నప్పటికి, భాష, భాషేతర, సామాజిక శాస్త్రాలను సహకారాన్ని కోరుతూ, తన వంతు సహకారాన్ని ఆయా శాస్త్రాలకు అందిస్తుంది. కాబట్టి సాంఘికశాస్త్రం ఒక సమైక్య అంశము మరియు అవసరాన్ని బట్టి విలీన అంశముగా కూడా సరళత్వాన్ని కల్గి ఉంటుంది.

సాంఘికశాస్త్రము అభ్యాసం అధ్యయనాల ఆవశ్యకత :-
→ సాంఘికశాస్త్రం ప్రకృతిలోని అనేక సజీవ, నిర్జీవ అంశాలతో ఏర్పడినది, మానవుడు సజీవ, నిర్జీవ అంశాలలోని మేలైన, కొన్ని అంశాలను జతచేసి సామాజిక-సాంఘిక అంశాలుగా రూపొందించినాడు.
→ సాంఘిక శాస్త్రము అనేది భౌతిక (నిర్జీవ), జైవిక (నజీవ), సాంఘిక పరిసరాలను గుర్తించి అవి మానవ ప్రగతికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో వివరిస్తుంది.

పరిసరాల విజ్ఞానము - అందలి అంశాలు:-
→ పరిసరాలు అనగా గాలి, నీరు, జంతువులు, వృక్షాలు, సాంఘిక విషయాలు, కట్టుబాట్లు మరియు ఇతరములు అన్ని కూడా పరిసరాలే.. పరిసరాలు అనేవి భౌతిక పరిసరాలు, జైవిక పరిసరాలు మరియు సామాజిక పరిసరాలు అని 3 రకాలుగా విభజించవచ్చును

→ ప్రకృతి / సహజ పర్యావరణం అనేది రెండు ప్రధాన అంశాలతో కూడి ఉంటుంది
1. జీవ వస్తువులు
2. నిర్జీవ వస్తువులు

1. జీవ వస్తువులు అనగా - జంతువులు, వృక్షాలు మరియు ప్రాణం ఉన్న సమస్త జీవరాశి, వీటిని జైవిక వనరులు అని కూడా అంటారు.
2. నిర్జీవ వస్తువులు అనగా - గాలి, నీరు, పర్యావరణం, ఖనిజసంపద, పర్వతాలు మొదలగునవి. వీటిని భౌతిక వనరులు అని కూడా పిలుస్తారు.

→ మానవ మనుగడ భౌతిక, జైవిక వనరులు రెండూ కూడా అవసరమే. ఈ రెండు పరస్పర పూరకాలు.
→ మానవుని చేత నిర్మితమైన పర్యావరణంను సామాజిక పర్యావరణం లేదా కృత్రిమ పర్యావరణం అని అంటారు. ఈ పర్యావరణం అనేది భౌతిక వనరులనుంచి లేదా జైవిక వనరుల నుంచి సేకరించబడినవి కావచ్చును.
→ సామాజిక సంస్థలకు మూలం - కుటుంబము
→ సామాజిక పర్యావరణంలోని అంశాలు - కుటుంబము, పాఠశాల, నమాజం, దేవాలయము - ధార్మిక సంస్థలు - రైల్వేలు ,బ్యాంకులు మొదలగునవి.

పరిసరాల విజ్ఞానము - ఈశ్వరీభాయ్ పటేల్ కమిటి (1977):-
→ మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా, ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి బాలబాలికలకు ఉపయుక్తమైన రీతిలో సాంఘికశాస్త్రంలోని భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరనీతి, (అర్థశాస్త్రము) సంబంధాలను సూక్ష్మీకరించి పరిసరాల విజ్ఞానముగా రూపొందించడమైనది
→ బాల్యం నుంచే పిల్లలకు పర్యావరణం - పరిరక్షణ అనే భావనను పెంపొందించడానికి బోధనాంశాలుగా పరిసరాల విజ్ఞానము - I మరియు పరిసరాల విజ్ఞానము - 2 లను బోధించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సూచించినది.


→ పరిసరాల విజ్ఞానము యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు మూడు. అవి
→ పరిసరాల గురించి పరిశీలన / తెల్సుకోవడం
→ పరిసరాల ద్వారా నేర్చుకోవడము / అభ్యసించడము
→ పరిసరాల పరిరక్షణ చేయడము
→ పరిసరాల విజ్ఞానమును 1 నుంచి 5 తరగతులకు పరిసరాల విజ్ఞానము - I అని, 6 నుంచి 10 తరగతుల వారికి సాంఘిక శాస్త్రము అనే పేరుతో బోధనాంశాలను అందించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సూచించినది.
→ ప్రకృతిని గురించి తెల్సుకోవడము, అభ్యసనము పటిష్టపర్చడమే పరిసరాల విజ్ఞానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము అని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటి పేర్కొన్నది.
→ పరిసరాల విజ్ఞానమును 1 మరియు 2 తరగతులవారికి ఉపాధ్యాయ కరదీపికల (Teachers Hand book) రూపంలో అందిస్తున్నారు. 3, 4, 5 తరగతులవారికి పాఠ్యపుస్తకముల రూపంలో విద్యార్థులకి అందించడం జరుగుతుంది
→ బోధనా అభ్యసన ప్రక్రియలో "పరిసరాన్ని" ఒక ఆయుధంగా స్వీకరించి బాల్యంలోనే సత్పౌరులకు కావల్సిన హితబోధన దేశభక్తిని ప్రేరేపించేదిగా ఉండాలని సూచించడమైనది

పర్యావరణ పరిరక్షణ - అభివృద్ధిపరచడము :-
→వనరులు దుర్వినియోగం కాకుండా చూడడమే కాక వనరుల దుర్వినియోగం వలన కల్గే అనర్థాలపై తగు నూచనలను ఎప్పటికప్పుడు సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి.
1. నీటి వినియోగము
2. విద్యుత్ వినియోగము
3. అడవుల సంరక్షణ
4. పర్యావరణ పరిరక్షణ
5. పశుపక్ష్యాదులపట్ల దయ
6. ఆపదలో ఉన్న వారిపట్ల ఆదరణ
7. దేశభక్తి
8. నైతిక విలువలు
9. క్రమశిక్షణ
10. వారసత్వ సంపద కాపాడటము
11.ఆచార వ్యవహారాల పట్ల అభినందనలు
12. చరిత్ర, భౌగోళిక అంశాలు పరిరక్షించేదిగా పరిసరాల విజ్ఞానము దోహదపడాలి.

సాంఘికశాస్త్రము - ఆవిర్భావము :-
→ క్రీ.శ. 1916 - 1917 మధ్యకాలంలో అమెరికాలోని చికాగో నగరములో "సాంఘిక శాస్త్ర నిపుణుల నదస్సు" నిర్వహింపబడినది .
→ అమెరికా దేశములో మొదటిసారిగా సాంఘికశాస్త్రము ఆవిర్భవించినది.
→ సాంఘికశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యము : విద్యార్థులలో సరియైన మానవ సంబంధాలను పెంపొందించడము.
→ సమాజంలో మానవుడు మంచి జీవనాన్ని కొనసాగించడానికి కావల్సిన పరిజ్ఞానంను, అనుభవాలను సాంఘికశాస్త్రము అందిస్తుంది అందుచేత సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల అభివృద్ధిశాస్త్రము అని కూడా పిలుస్తారు.
→ ఒక వ్యక్తి తన సమస్య పరిష్కార దశలో వేరొకరి సహాయం పొందడం తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడము ద్వారా మంచి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకొనుచున్నాడు. అందుకే సాంఘికశాస్త్రము "మానవ సంబంధాల అధ్యయన శాస్త్రము అని, మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడే శాస్త్రము" అని చెప్పవచ్చు

సాంఘికశాస్త్రము - గాంధీజీ :
→ క్రీ.శ 1937 సంవత్సరంలో గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యావిధానము అమలు సందర్భంలో సాంఘికశాస్త్రమును ప్రతిపాదించినాడు.
→ గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యావిధానము సాంప్రదాయిక విద్యాబోధనలో కొంత మార్పును తీసుకొనిరావడం జరిగింది బాల్యం నుంచే విద్యార్థులలో పని పట్ల గౌరవభావంను, ఆర్థిక స్వావలంబనను కల్గించే ఉత్పత్తి ఆధారిత విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడము జరిగింది

సాంఘికశాస్త్రం - సెకండరీ విద్యాకమిటి :-
→ 1952 - 53వ సంవత్సరంలో సెకండరీ విద్యాకమిటి చైర్మన్ శ్రీ లక్ష్మణస్వామి మొదలియార్ గారి అధ్యక్షత గల కమిటి మనదేశంలో సాంఘికశాస్త్రాన్ని ప్రవేశపెట్టినది.
→ 1952 - 53లో సెకండరీ విద్యాకమీషన్ మనదేశ పాఠ్యప్రణాళికలలో మాతృభాషతో పాటు భాషేతర అంశాలను కూడా బోధించడానికి ప్రణాళికలను ఏర్పాటుచేసినది.
→ ప్రాంతీయ భాష / తెలుగు, ద్వితీయ భాష / హిందీ, తృతీయ భాష / ఆంగ్లం, గణితము, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రములను బోధించాలని ప్రణాళికలను రూపొందించడమైనది

సాంఘికశాస్త్రము - కొఠారి కమీషన్ (1964-66) :-
→ బాలబాలికలను ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో పరినరాలపట్ల, సాంఘిక అంశాలపట్ల అవగాహన, భూగోళం, చరిత్ర రాజనీతి, ఆర్థికశాస్త్రం పరిచయం చేయాలని మరియు ఉన్నతస్థాయి / మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాలను పరిచయం. చేయాలని కొఠారి కమీషన్ సూచించినది.
→ విద్యార్థి పొందే జ్ఞానం కుటుంబం నుంచి మొదలై విశ్వజనీనమైన (Universal level) అంశాలను స్పృశించాలని కొఠారి తెల్పినాడు.
1. కుటుంబం
2. ఇరుగు పొరుగు
3. గ్రామం
4. తాలూకా
5. జిల్లా
6. రాష్ట్రం
7. దేశం (జాతీయ)
8. అంతర్జాతీయo

సాంఘికాధ్యయనాల స్వభావం - పరిధి :-
→ సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం
→ సమాజంలోని మానవ సంబంధాల అధ్యయనం
→ "వ్యవహారిక సత్తావాదం" వికాసం తర్వాత అమెరికా స్కూళ్ళలో 1916వ సంవత్సరం సాంఘికాధ్యయనాలు మొదలుపెట్టారు.
→ మనదేశంలో 1952లో సెకండరీ విద్యా కమీషన్ సూచనల ఆధారంగా ప్రవేశపెట్టారు

సాంఘికాధ్యయనం - నిర్వచనాలు :-
→ సాంఘికాధ్యయనం మానవ "సమాజ వ్యవస్థీకరణ" వికాసాలకూ నమాజంలోని వర్గాలలో సభ్యునిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం" - అమెరికా సెకండరీ విద్యా "పునర్వ్యవస్థీకరణ" కమీషన్ .
→ ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవిత సాంఘిక అధ్యయనం - విక్టోరియా స్కూల్ బోర్డు కమిటీ.
→ సాంఘికాధ్యయనం మానవునిలోనూ అతనికి తన సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన "అంతశ్చర్యల"తో వ్యవహరిస్తుంది - మైఖిలీన్
→ విద్యార్థులు బాధ్యతగల పౌరులుగా తయారుకావడానికి, వారికి వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించిన అవగాహన కలుగ చేయడం, విద్యార్థులలో విమర్శనాత్మక పరిఖ్ఞానాన్ని పెంపొందించటం, వ్యక్తి క్షేమం కంటే సామాజిక క్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం, వివిధ సంస్కృతుల పట్ల అవగాహన కలిగించడం, ప్రపంచంలో ఒక దేశం మరొక దేశంపై ఎలా ఆధారపడి ఉన్నాయో తెలియజేయుటయే సాంఘికాధ్యయనం - ఇ.ఎమ్. ఫారెస్టర్
→ "బోధించటం కోసం ఎంపిక చేసిన సామాజిక- అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం" - వెస్లీ .
→ ఒక వ్యక్తి రసాయన శాస్త్రంలో గణిత శాస్త్రాలలో దిట్టకావచ్చు. సాంకేతిక జ్ఞానం ఉండవచ్చు. కాని అతడికి సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే నమాజంఓ ఒక నవ్యమైన పౌరునిగా జీవించలేదు. జీవితం అనేది ఒక కళ. ఆ కళను గూర్చి తెలిపేదే సాంఘికాధ్యయనం - ఎమ్.పి. ముప్పట్
→ సాంఘికాధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం" - James Hamming
→ భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మకమైన ఒక నూతన పదం. సాంప్రదాయకంగా భూగోళశాస్త్రం, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రాలను విడివిడిగా బోధించే వివిధ సామాజిక శాస్త్రాలను కలిపి జోధించేడే సాంఘికాధ్యయనం - భారతీయ మాధ్యమిక విద్యా సంఘం

సాంఘికశాస్త్ర అధ్యయనం - ఆధునిక పద్ధతి:-
→ సాంఘిక అధ్యయనం వ్యక్తులు - వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాల గూర్చి తెలుపును.
→ సాంఘిక అధ్యయనం వివిధ సామాజిక శాస్త్రాల నుండి విషయాలను గ్రహించి వాటిని సమన్వయ పరుస్తుంది
→ సాంఘికాధ్యయనం వ్యక్తి దైనందిన జీవితంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు, సమస్యల గూర్చి అధ్యయనం చేస్తుంది.
→ సాంఘికాథ్యయనం మారుతున్న సమాజంలో పామాజిక పరిసరాలకనుగుణంగా ఎలా మసలుకోవాలో తెల్చసును

సాంఘికాధ్యయనాల ద్వారా సమాజం ఆశించేది :-
సాంఘికాధ్యాయనం ద్వారా విద్యార్థులకి :-

→ సామాజిక అనుభవం కలుగును
→ సామాజిక జ్ఞానం ఇస్తుంది
→ సామాజిక సమస్యల పట్ల అవగాహన కలుగజేస్తుంది
→ సామాజిక వైఖరులు కలుగును
→ సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది
→ సామాజిక పరిణామం గూర్చి తెలియజేస్తుంది

సాంఘికాధ్యయనాల పరిధి :-

→ సాంఘికాథ్యయనం "ప్రపంచమంత విశాలం, మానవ చరిత్ర అంత సుదీర్ఘం"
→ చరిత్ర భూగోళం, ఆర్థిక, పౌర శాస్త్రాల రూపంలో మానవ సంబంధ విషయాలను సమూలంగా, సమగ్రంగా అధ్యయనం చేస్తుంది
→ ఇది వ్యక్తికి, ప్రకృతికి వ్యక్తులకు, సామాజిక సంస్థలకు వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేస్తుంది. కనుక దీనిని మానవ అధ్యయన శాస్త్రం అంటారు
→ సాంఘికాధ్యయనం విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది
→ శాస్త్రంలో ప్రతిరోజూ వచ్చే మార్పులను సాంఘిక అధ్యయనంలో చేర్చవచ్చు. అందువల్ల ఈ శాస్త్రానికి అంతంలేదు

సాంఘికాధ్యయనాలు - వివిధ సామాజిక శాస్త్రాలు :-
→ గణితశాస్త్రం : సమాజ ప్రయోజనానికి, మానవ సంబంధాల పెంపుదలకు ఉపయోగపడును
→ విజ్ఞానశాస్త్రం : భౌతికమైన విషయాలు చర్చించును.
→ భాష : - భావవ్యక్తీకరణకు, సందేశం అందించటానికి సంబంధిత విషయాలుంటాయి. కానీ సాంఘికాథ్యయనంలో మానవ సంబంధాలకు ప్రాధాన్యం.
→ సాంఘిక కార్యకలాపాలకు ప్రాధాన్యమిచ్చి ఇది వ్యక్తులను కూడా తయారుచేస్తాయి.


→ సాంఘికాధ్యయనం ప్రధాన సంకల్పాలు మూడు :-
→ వ్యక్తి అవసరాలు తీర్చడం
→ విద్య సాంఘిక, వైజ్ఞానిక సంబంధమైన జ్ఞానం సంసాదించడం
→ సాంఘికావసరాలనుగుణంగా పొరులకు కావలసిన విద్య అందించడం

NEW ENCYCLOPEDIA BRITANICA ఉద్దేశం ప్రకారం :-

→ మానవుని కార్యకలాపాలతో సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేది - సామాజిక అధ్యయనం
→ సహజీవనం, విశ్వమానవ సౌత్రాతృత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది - సాంఘీకాధ్యయనం

సామాజిక శాస్త్రం :-

→ మానవునికి సంబంధించిన లేదా ప్రకృతికి సంబంధించిన నిర్ధిష్టమైన ఒక ప్రత్యేకాంశమును దాని పుట్టు పూర్వోర్తరాలు నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి.
ఉదా :- చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, రాజనీతి శాస్త్రం.

→ సాంఘిక శాస్త్ర అధ్యయనం, సామాజిక శాస్త్ర విషయ జ్ఞానం ఒక్కటే
→ ఈ రెండు శాస్త్రాలు మానవుల మధ్య గల సంబంధాల, మానవునికి సమాజంతో గల సంబంధాలు, మానవ అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయి.
→ ఈ విధంగా వివిధ సామాజిక శాస్త్రాలలోని ముఖ్య విషయాలను ఎంపికచేసి వాటిని ప్రాథమిక తరగతులలో పరిసరాల విజ్ఞానంలో మాధ్యమిక తరగతులలో సాంఘిక శాస్త్రాలుగా బోధిస్తున్నారు

సాంఘిక- సామాజిక శాస్త్రాల మధ్య పోలికలు - భేదాలు :-
→ సామాజిక శాస్త్రాల్లో నిగమ, జగమ పద్దతుల ద్వారా తమ తమ విషయాలను చర్చిస్తాయి.
→ సాంఘిక అధ్యయనాలు సామాజిక సిద్ధాంతాల అమలు తీరును వివరిస్తాయి
→ సాంఘిక అధ్యయనాలు తమ తమ పరిధిలో తమ విషయాలను చర్చిస్తాయి
→ ప్రాథమిక స్థాయిలో బోధించే సాంఘిక అధ్యయనాలు ఉన్నత విద్యా స్థాయిలో పరించే వివిధ సామాజిక శాస్త్రాలకు మూల జ్ఞానంగా వ్యవహరిస్తాయి.

సాంఘికశాస్త్రం ఇతర సామాజికశాస్త్రాలతో గల సంబంధాలు


→ సామాజిక శాస్త్రాలు అనగా సమాజంలో వ్యక్తులు యొక్క కార్యకలాపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాలు

వివిధ సామాజిక శాస్త్రములు :-
1. భూగోళశాస్త్రం
2. చరిత్ర
3. రాజనీతిశాస్త్రం
4. అర్థశాస్త్రం
5. తత్త్వశాస్త్రం
6. మానవ శరీరనిర్మాణ శాస్త్రం
7. పౌరవిజ్ఞానశాస్త్రం
8. మనోవిజ్ఞానశాస్త్రం
9. సమాజశాస్త్రం
మొదలగునవి సామాజిక శాస్త్రములు.

భూగోళశాస్త్రము :-

→ భూగోళశాస్త్రమును ఆంగ్లంలో జియోగ్రఫీ అంటారు. జియోగ్రఫీ అనే పదం జియో, గ్రఫీ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించినది. జియో అనగా భూమి,గ్రఫీ అనగా వర్ణన అని అర్థం
→ అంటే "భూమిని గురించి వర్ణన" చేసే శాస్త్రం అని చెప్పవచ్చును.
→ భూమిపై ఉన్న ప్రకృతి వనరులు, భూ అంతర్భాగంలో దాగివున్న వనరులు, పర్వతాలు, నదులు, జంతుసరపద ఖనిజనంపద వాతావరణం, భూన్వరూపాలను గురించి, వాటి స్థితిగతులను గురించి తెలియపరుచుతుంది.

చరిత్ర :-
→ చరిత్రను ఆంగ్లంలో హిస్టరీ అంటారు. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకుపదం నుంచి ఉద్భవించింది
→ హిస్టోరియా అనగా నూతన విషయాలను పరిశోధన, అన్వేషణ చేయటం ద్వారా అభ్యసనాన్ని కొనసాగించడం అని అర్థం. చరిత్రకు మూలపురుషుడు హెరిడోటస్
→ చరిత్ర అనగా "గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదుచేసిన లిఖిత సమాచారం" గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఉజ్జ్వల భవిష్యత్తు లేదు".

పౌరవిజ్ఞానం (సివిక్స్) :-
→ పౌరనీతి శాస్త్రాన్ని ఆంగ్లములో సివిక్స్ అంటారు. సివిక్స్ అనే ఆంగ్లపడం సివిస్, సివిటాస్ అనే రెండు లాటిన్ పదముల నుంచి ఆవిర్భవించింది.
→ సివిస్ అనగా పౌరుడు, సివిటాస్ అనగా నగరము అని అర్థం.
→ సమాజంలో మానవుడు అతని సంబంధ బాంధవ్యాలను గురించి తెలియజేసే సామాజికశాస్త్రం - పౌరశాస్త్రము.

అర్థశాస్త్రం :-
→ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఎకనామిక్స్ అనే ఆంగ్లపదం ఓకియో, నామన్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వలన ఏర్పడినది.
→ ప్రాచీనకాలంలో గ్రీకులు అర్థశాస్త్రం అనగా "గృహనిర్వహణాధికారం గురించి తెలియజేస్తుంది అని భావించడం జరిగింది
→ ఓకియో అనగా గృహము, నామస్ అనగా నిర్వహణ అని అర్థం. వస్తుసంపద, జనాభా ఈ రెండింటి పరస్పర ఉపయోగాలు కొరత వాటికి విలువకట్టడం, పొదుపు, ఆదాయం, వ్యయం గురించి తెలియజేసే శాస్త్రం - అర్థశాస్త్రము,

1.ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటి 1 నుంచి 5 తరగతులవారికి వరిసరాలవిజ్ఞానం-1 గా సాంఘికశాస్త్ర విషయాలను బోధించాలని పేర్కొన్నది
2. 1952 సెకండరీ విద్యాసంఘం భూగోళం, చరిత్ర, పౌరవిజ్ఞానాన్ని బోధించాలని, కొఠారి కమీషన్ 1-7 తరగతులలో ప్రాథమిక స్థాయిలో సూక్ష్మంగా బోధించాలని, కృత్యాధార బోధనను ప్రోత్సహించి విద్యార్థి సాంఘిక పరిజ్ఞానాన్ని కుటుంబస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించాలని పేర్కొన్నది.
3. యశ్ పాల్ కమిటి రూపొందించిన సూత్రం ఆధారంగా, మానవతా విలువలు, సాంఘిక విలువలు సూక్ష్మస్థాయిలో బోధించాలన్నారు

సాంఘికశాస్త్రం - ఇతర సామాజికశాస్త్రాలతో గల సంబంధము : -
→ సాంఘికశాస్త్రం అనేది సామాజికశాస్త్రంలో అంతర్భాగము అయినప్పటికి ఇతర శాస్త్రాలతో సహసంబంధం ఉంది
→ సాంఘికశాస్త్రంనకు విద్యకు అన్వయించబడిన ప్రత్యేకశాస్త్రాలు అయిన విద్యాతత్త్వశాస్త్రము. (ఫిలాసఫీ) విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రాలతో ప్రత్యేకమైన సంబంధం వుంది. లలితకళలు, గణితం, రసాయన, భౌతిక జీవశాస్త్రాలు, న్యాయశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలైన అనేక విషయాలతో సంబంధం ఉంది

తత్త్వశాస్త్రం - సాంఘికశాస్త్రము :-
→ ప్రతివ్యక్తికి సహజంగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాలనే ఆశయం వుంటుంది.
→ ధర్మనిరతి ప్రబోధించే మహనీయుల బోధనలు, సందేహనివృత్తి, ధార్మిక భావనలు, శాంతియుత జీవనం అలవర్చుకోవడానికి, మేధావులు తాత్త్వికుల రచనలు, వారి జీవనవిధానాలు ఆచరించడం ద్వారా మంచి ఆలోచనలను ప్రోత్సహించి, నమాజ అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి అంతరాయం కాకుండా చూడాలి. ఇలా వ్యక్తి శ్రేయస్సే సామాజిక శ్రేయస్సు. కాబట్టి సాంఘకతాస్త్రం | ఆయా అంశాలను ప్రామాణికంగా పరిగణనలోనికి తీసుకొని బాలబాలికలను సుగుణ సంపన్నులుగా చేయడానికి తోడ్పడుతుంది.
→ విద్వేషాలను రెచ్చగొట్టే మతమౌధ్యాన్ని, అశాస్త్రీయ అలోచనలను రూపుమాపి, ప్రేమ, దయ, జాతి, సహనం, నహకారం సత్యం, శివం, సుందరం అనే తత్త్వాన్ని ప్రేరేపించి విద్యార్థులను చైతన్యవంతులను చేస్తుంది.

మనస్తత్వ శాస్త్రం - సాంఘికశాస్త్రము:-
→ మానవుడు సమాజంపట్ల ప్రేరణ కలిగే రీతిలో మార్పుచేయాలి. సాంఘిక మార్పు, వ్యక్తి మార్పును కోరి, అతనికి విద్యామనస్తత్వ నిపుణులచే కౌన్సిలింగ్ ఇప్పించి ప్రవర్తనలో మార్పులు తీసుకుని రావచ్చు. మంచి ఆరోగ్యకర నమాజం రూపొందడానికి నేటి బాలబాలికలకు, మంచి ప్రవర్తన అలవడే రీతిలో బోధనాంశాలు ప్రవేశపెట్టాలి. సామాజిక దృక్పథం, శాంతి, క్రమశిక్షణను అలవర్చటానికి ఆశించిన ప్రవర్తనా మార్పు తీసుకురావాలి
→ సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో ఉపాధ్యాయుడు ఒక గ్రామీణ వైద్యుడు.

సాంఘిక శాస్త్రం - ఇతర పాఠశాల స్థాయి బోధనావిషయాలు

→ భాష విషయ అంశాలు:- మాతృభాష, ద్వితీయభాష (హిందీ), తృతీయ భాష మొదలైనవి బోధించేటప్పుడు భాషకు పరిసరాల విజ్ఞానం - 1 కి సాంఘికశాస్త్ర బోధనా విషయాలలో ఏదైనా సామ్యాలు ఉంటే వాటిని ఉపాధ్యాయుడు జాగురూకతతో బోధించాలి

కళలు - సాంఘికశాస్త్రం :-
→ వివిధ కళలలోని సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనము, గాత్రం, నాట్యం ద్వారా విద్యార్థులకు సాంప్రదాయ రీతులు బోధించడంలో సాంఘికశాస్త్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఆయా కాలాలకు సంబంధించిన రీతులు, చారిత్రక నేపథ్యాలు, సాంఘిక అంశాలే. అజంతా చిత్ర సంపద, ఎల్లోరా, ఎలిఫెంటా గుహలు, గోపురాలు, పురాణ నంబంధమైన ఇతిహాసగాథలు ఇవి అన్ని సాంఘికశాస్త్ర అనుబంధ విషయాలే

సామాన్యశాస్త్రం - సాంఘిక శాస్త్రాల మధ్య సంబంధము :-
→ సాంఘికశాస్త్రంలోని భూగోళం, చరిత్ర, పౌరవిజ్ఞానం, అర్థ శాస్త్రాలకు సామాన్యశాస్త్రములోని ఫౌతిక, రసాయనిక, వృక్ష జంతుశాస్త్రాలలోని కొన్ని పాఠ్యాంశాలతో సహసంబంధం వున్న పాఠ్యాంశాలు ఉన్నాయి
→ పరిసరాల విజ్ఞానం I, II లను వేరువేరుగా బోధించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటి నిర్ధారించింది
→ N.C.F 2005 (National Curriculam Frame Work-2005) ప్రకారంగా 1 నుంచి 5 తరగతులవారికి విజ్ఞానం - 1 మరియు పరిసరాల విజ్ఞానము - II అను ఒకే పాఠ్యపుస్తకంగా రూపొందించాలని సిఫారస్ చేయడమైనది.

పరిసరాల విజ్ఞానం - నూతన ప్రక్రియలు :-
→ I మరియు II తరగతులకు సమాజం - ప్రకృతి పట్ల అవగాహన కల్గించాలని కొఠారి కమీషన్ పేర్కొనడం జరిగింది
→ విద్యార్థులు పాఠశాలలో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి చిన్నపిల్లల్లో సృజనాత్మకత, క్రియాశీలత, వినూత్న కార్యక్రమాలు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ పోటీలు, విద్యామేశాలు నిర్వహించబడుతున్నాయి. విద్యార్థులు తాము నేర్చుకొన్న అంశాలు తపాల పెట్టె కృత్యం, దినచర్య నివేదికల ద్వారా తెలియపర్చడం జరుగుతుంది.
→ విద్యార్థులకు ఎప్పటికప్పు మ తగిన సమాచారాన్ని అందించడంలో
1. బాలల సంఘాలు
2. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు
3. మండల వనరుల కేంద్రాలు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయి.

→ గాంధీగారి మాటలలో "పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశము.
→ నికోలస్ రైట్ అభిప్రాయం ప్రకారం "సాంఘికశాస్త్రం పరిధి చాలా విశాలమైనది."
→ అంటే "సాంఘికశాస్త్ర పరిధి ప్రపంచమంత విశాలమైంది, భూమిపై మానవుని చరిత్ర అంత సుదీర్ఘమైనది.
→ N.C.C, N.S.S Scoutt and Guides వంటి కృత్యాలు విద్యార్థులలో దేశభక్తిని ప్రోత్సహిస్తున్నాయి

అమెరికా :-
→ 1905 సామాజిక శాస్త్రాల యొక్క ప్రాధాన్యత సమయంలో సింప్సన్ అనే మహాశయుడు సాంఘిక శాస్త్రమును ఉంచితే బాగుంటుంది అని సూచించెను
→ విద్యా విషయక సాహిత్యములో" సాంఘిక శాస్త్రము అనే పదము చేరిన సంవత్సరం - 1905
→ 1912 - ప్రాథమిక తరగతులలో సాంఘిక శాస్త్ర ఆవశ్యకతను చర్చేందుకు "సాంఘిక శాస్త్ర జాతీయ మండలి" ఏర్పాటు
→ వీరు సామాజిక శాస్త్రాలలో కొన్ని అంశాలును సాంఘిక శాస్త్రంలో ప్రవేశపెట్టవచ్చునని సూచించారు
→ 1914 - ఉన్నత తరగతులలో సాంఘిక శాస్త్ర ఆవశ్యకతను చర్చించేందుకు "సాంఘిక విజ్ఞాన కమిటీ" ఏర్పాటు
→ ఈ కమిటీనే "జాతీయ విద్యాసంఘము" అని అంటారు (అమెరికా)
→ సాంఘిక శాస్త్రానికి అధికారయుతమైన గుర్తింపు వచ్చిన సంవత్సరం - 1914
→ 1916 - సాంఘిక శాస్త్రము ఎక్కువ వాడుకలోనికి వచ్చిన సంవత్సరము

ఇండియాలో :-
→ 1952-53 (Secondary Education Commission)
→ లక్షణస్వామి మెదలియర్ కమీషన్
→ సాంఘిక శాస్త్రం భారతీయ విద్యలో తులనాత్మకంగా ఒక నూతన భావనను
→ సాంఘిక శాస్త్రము అనే పదము భారతదేశంలో తెలిసిన సంవత్సరం - 1952-53

1964-66-కొఠారీ కమీషన్ (లేదా) జాతీయ విద్యామండలి:-
→ ఈ కమీషన్ పరిసరాల విజ్ఞానానికి అంతగా ప్రాధాన్యత ఈయలేదు
→ వీరి యొక్క సిపార్పులు 1968 నుండి అమలులోనికి వచ్చాయి

1977-ఈశ్వరీభాయి పటేల్ కమిటీ :-
→ పరిసరాల విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ
→ వీరు యొక్క సిఫార్సులు మేరకు 1979-80 విద్యా సంవత్సరం నుండి సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది

జాతీయ విద్యా విధానం(1986) :-
→వీరి యొక్క సిఫార్సులలో :- 1) 1, 2 తరగతులు పరిసరాల విజ్ఞానం , 2) 3, 4, 5వ తరగతులు పరిసరాల విజ్ఞానం- I, 3) 6 నుంచి సాంఘికశాస్త్రంగా ఉండాలని సూచించారు నోట్ :- 1, 2 తరగతులలో పరిసరాల విజ్ఞానం యొక్క సిలబస్ ఉపాధ్యాయ కరదీపికలలో పొందుపరచబడింది
→ కొఠారీ కమీషన్ (1964-66) విద్యాప్రణశిక పాఠశాలలో విస్తృతి పరిధిలో ఉండాలి.
→ ఈశ్వరీబాయి కమిటీ (1977) - పాఠ్యప్రణాళిక విద్యార్థి విస్తృతి అవసరాలు తీర్చేదిగా ఉండాలి.

నిర్వచనములు :-
→ బోధనకోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్తాలే సాంఘిక శాస్త్రము - వెస్లీ & రాస్స్కీ
→ సాంఘిక శాస్త్రము ఒక అధ్యయన క్షేత్రము, సబ్జెక్టు సమాజ కరికులమ్ భాగము- వెన్లీ & ఆడమ్స్
→ చరిత్ర, భూగోళము, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము మొదలైన వాటికి అధ్యయన విభాగమే సాంఘికశాస్త్రం - Secondary Education Commission
→ సమాజ, రాష్ట్ర, జాతీయ అంశాలలో విద్యార్థికి అవగాహన ఏర్పరచి వాటి అంతర్గత సంబంధాలను చూడటానికి తోడ్పడేదే సాంఘిక శాస్త్రము - కొఠారీ కమీషన్
→ సమాజములో సభ్యునిగా విద్యార్థిని తీర్చిదిద్దేది సాంఘికశాస్త్రము - సాంఘికశాస్త్రము కమిటీ

ప్రకృతి :-
→ పురాతన కాలంలో ప్రకృతిని దేవతగా భావించినవారు ఆర్యులు
→ ప్రకృతిలో వుండే కొన్ని శక్తులు ఆర్యులుకు అంతగా అవగాహన కాలేదు.

ప్రకృతిపై నెహ్రూ వ్యాఖ్య :-
→ ఇందిరాగాంధీకి వ్రాసిన ఉత్తరంలో నెహ్రూ ప్రకృతి గురించి తెలుసుకోవాలంటే నీకున్న జ్ఞానము, శక్తి నరిపోదు దానికి నైపుణ్యాలు' అయిన పరిశీలన అవసరము.
→ పరిసరాల పరిరక్షణే ధ్యేయముగా ముందుకు సాగుతున్న సంస్థలు (UNEP) - United Nations Environmental Programmittie
→ UNEP ప్రాజెక్టులలో ప్రధానమైన ప్రాజెక్టు - సౌర కుక్కర్
→ సౌరకుక్కర్ లో ముఖ్యమైన సూత్రము - నల్లని వస్తువులు తొందరగా ఉష్ణాన్ని గ్రహించి వదులుతాయి
→ సౌరకుక్కర్ అనగా - నల్లని ట్యూబ్ లో గాలిని నింపి మధ్యలో పాత్రను ఉంచి పైన పారదర్శక గాజు ప్రేమ్ ను అమర్చుట
→ ఈ సెట్ మొత్తము సూర్యరశ్మిలో ఉంచాలి
→ రాబోయే తరాలు పర్యావరణం పై ఎదుర్కొనే అతి ప్రధానమైన సమస్య - (Green house affect)
→ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనగా - భూమి యొక్క పొరలలో CO, శాతము పెరుగుట వలన ఉష్ణోగ్రత పెరిగి ధృవ ప్రాంతాలలో మంచుకరిగి నముద్రజలాలు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదం ఉంది. దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు

మానవుడు:-
→ మానవ వనరు ఒక ధనాత్మకమైన వనరు
→ దీనిని జేగురు కర్రతో జాగ్రత్తగా పెంచి పోషించాలి NPE - 86
→ పరిసరాలలో పుట్టి పెరిగిన మానవుడు వాటిని తన అవసరాలకు ఉపయోగించుకోవాలి. స్వార్థానికి ఉపయోగించరాదు - గాంధీజీ
→ No man is Island (ఏకాకిగా ఏ మనిషి జీవించలేడు) - Donne (డన్)