అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




పార్యపుస్తకం









1. పాఠ్యపుస్తకం - ఆవశ్యకత:-

→ ఒక పాఠ్య పుస్తకం - తరగతికి నిర్ణయించిన పాఠ్యప్రణాళిక ఆధారంగా రాయబడుతుంది. కాబట్టి అది ఒక విషయానికి

సంబంధించి ఒక తరగతిలో ఎంత వరకు బోధించాలి? అనే విషయాన్ని తెలియజేస్తుంది.

→ ఒక పాఠ్యపుస్తకం తరగతి గది బోధనలో ఒక పాదాన్ని బోధించడానికి తగిన బోధనా పద్ధతుల బోధనాథ్యసన సామాగ్రి ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది

→ ఒక పాఠ్యపుస్తకం అనుభవజ్ఞులైన, గణితంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో రాయబడింది. కాబట్టి కొత్త ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది

→ ఒక గణిత పుస్తకంలోని విషయాలు, పిల్లల మనస్తత్వ ఆధారంగా తార్కిక క్రమంలో రాయబడతాయి. కాబట్టి ఉపాధ్యాయులకు విషయాన్ని తరగతి గదిలో క్రమంలో బోధించడానికి వీలవుతుంది పుస్తకంలో ఇవ్వబడిన మాదిరి సమస్యలు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు సమస్యల సాధనలో తయారీలో

ఉపయోగపడతాయి

→ విద్యార్థులకు ఇంటిపని ఇవ్వడం కోసం పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు ఉపయోగపడతాయి.

→ పుస్తకంలో ఇచ్చిన సమస్యలు, మళ్ళీ తాము సమస్యలు తయారు చేయవలసిన అవసరం లేకుండా సహాయపడుతుంది. అలాగే విద్యార్థులకు కూడా స్వయం అభ్యసనకు తోడ్పడతాయి. కాబట్టి పాఠ్యపుస్తకం ఉపాధ్యాయులకు విద్యార్థులకు తరగతి గది వినియోగానికి చాలా అవసరం.



2.ఉత్తమ గణిత పాఠ్య పుస్తకాల లక్షణాలు :-

ఎ) పాఠ్యపుస్తకాల భౌతికరూపం :-

→ ప్రాథవింక స్థాయి వీల్లల కోసం అభివృద్ధిపరచబడే పాఠ్యపుస్తకాలపై ప్రత్యేక శ్రద్ధ జవనరం.

→ పాఠ్యపుస్తకం సైజు పిల్లలకు మరీ ఎక్కువ కాకుండా తగినట్లుగా, సులభంగా పట్టుకోవడానికి, ఉపయోగించడానికి

వీలుండాలి,

→ పిల్లలకు సచ్చే అందమైన ముద్రణ కలిగి ఉండాలి. ముఖ్యాంశాలను ప్రత్యేకంగా వివిధ రంగుల్లోగాని, బాక్పుల్లోగాని ఉంచాలి

→ జ్యామితీయ పటాలు, బొమ్మలు, విషయానికి తగినట్లు ఉండాలి. ఇవి వివిధ రంగుల్లో ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు పాఠ్యపుస్తకంలో అక్షరదోషాలు, అచ్చుతప్పులు ఉండకూడదు.

→ కవరు పేజీ వివిధ రంగుల్లో, అందంగా ఉన్నట్లయితే పిల్లలు పుస్తకంవైపు ఆకర్షితులవుతారు. పుస్తకం ధర విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలి





బి) పాఠ్యపుస్తకంలోని విషయం :-

→ పాఠ్యపుస్తకంలో విషయం శాస్త్ర విద్యా ప్రణాళిక పరిధిలోనే ఉండాలి.

→ పాఠ్యపుస్తక విషయాలు, తార్కిక క్రమంలో ఉండాలి.

→ అందులోని విషయం విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి

→ విషయం మనోవిజ్ఞానశాస్త్రం ఆధారంగా తయారు చేయబడాలి. గణిత లక్ష్యాలు సాధించడానికి వీలుగా ఉండాలి.

→ ఇచ్చిన ఉదాహరణలు నిజజీవిత అనుభవాలకు దగ్గరగా ఉండాలి పుస్తకంలో రాసిన భాష విద్యార్థుల స్థాయికి తగినదిగా ఉండాలి

→ పాఠ్యపుస్తకంలోని విషయం స్వయం అభ్యసనానికి, స్వయం మదింపునకు వీలుగా ఉండాలి

→ ఆమోదిత శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించాలి.

→ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీనే అవకాశం కలిగించేవిగా ఉండాలి.

→ సామాజిక అవగాహనకు వీలుగా ఉండాలి

→ మౌఖిక అఖ్యాసాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

→ అభ్యాసంలో ని సమస్యలు పిల్లల్లో ఆలోచనా శక్తిని, హేతువాదాన్ని పెంపొందించేవిగా ఉండాలి.

సి) పాఠ్యపుస్తకం వల్ల ఉపయోగాలు :

→ ఇవి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మార్గదర్శిగా ఉంటే విలువైన టోధనోపకరణం.

→ విద్యార్థులు నేర్చుకున్న అంశాలు పునరభ్యానం, పునర్విమధ్మ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

→ విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అయినప్పుడు జరిగిన పాఠ్యాంశాలు తమకు తాము స్వయంగా నేర్చుకోవడానికి వీలుంటుంది

→ విద్యార్థులు వేర్చుకున్నంశాలు అభ్యాసం చేయడానికి పుస్తకంలోని అభ్యాసాలు చాలా ఉపయోగపడతాయి.


డి) పాఠ్యపుస్తక మూల్యాంకనం :

→ పాఠ్యపుస్తకం సరైనదా కాదా? సమర్థవంతమైనదా కాదా? అని తెలుసుకొనుటకు రెండు మూల్యాంకన సాధనాలున్నాయి.

1.హంటర్స్ స్కోర్ కార్డ్ (1000 పాయింట్స్)

2. వోగల్స్ స్పాట్ చెక్ లిస్ట్ (10 పాయింట్స్)

1.హంటర్స్ స్కోర్ కార్డ్ :-ఈ సాధనం ఆధారంగా ఉపాధ్యాయుడు తాను ఉపయోగిస్తున్న పాఠ్య గ్రంథాన్ని కింది ప్రమాణాల ప్రకారం 1000 పాయింట్లు స్కేలు ఆధారంగా మదింపు చేయవచ్చు

హంటర్స్ స్కోర్ కార్డు:

2. వోగల్స్ స్పాట్ చెక్ లిస్ట్ (10 పాయింట్స్)













100

140 50

1000

ఎ) రచయిత విద్యార్హతలు, సేవలు, వృత్తిలో గడించిన అనుభం - 60 పాయింట్లు

బి) పుస్తకం యొక్క భౌతిక రూపం (పుస్తకం వెలతో కలిపి) - 100

సి) మనోవిజ్ఞాన శాస్త్రాధారంగా విద్యార్థుల స్థాయికి తగినట్లు విద్యార్థులు నేర్చుకునే తీరు - 300

డి) విషయానికి - 250

ఇ) భాషా శైలికి - 100

ఎఫ్) పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు-140

జి) ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం- 50

Total =1000




2) వోగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం:

→ ఈ విధానంలో 10 ముఖ్య అంశాలున్నాయి, ప్రతి ముఖ్యాంశం కింద రెండు ప్రత్యేక ఆంశాలుంటాయి. ప్రతి ప్రత్యేకారిశానికి రెండు పాయింట్లు ఉంటాయి.

ఈ విధానంలో అనుసరించే పది ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి.

ఎ) పాఠ్యపుస్తకం రాయబడే రచయితకు గల విద్యార్హతలు (Qualification of the Author)

బి) పుస్తక రచనలో విషయాన్ని కూర్పు చేసిన పద్ధతి (Organisation of the subject matter)

సి) పుస్తకంలోని విషయం (Content)

డి) పుస్తక రచనా పద్ధతి (Presentation of Material)

ఇ) అవలంబించిన రచనా పద్ధతి (Accuracy)

ఎఫ్) పుస్తకం చదపదగిన స్థాయి (Resdability)

జి) పుస్తకాన్ని అనుసరించదగిన స్థాయి (Adaptibility)

హెచ్) బోధనోపకరణాలు (Teachine Aids)

ఐ) పట్టాలు (lustrations)


జె ) పుస్తక రూపం (Appearance)



3.క్రియా దీపిక/ అభ్యాస పుస్తకం (వర్క్ బుక్) :-

→పాఠ్యపుస్తకంలో ఎక్కువ అభ్యాసాలు కల్పించడం వల్ల పేజీల సంఖ్య పెరుగుతుంది. ఈ లోపాన్ని నవ 3శటానికి విద్యార్థులతో

తగినన్ని అభ్యాసాలు చేయించి వారిలో గణనా వైపుణ్యాలు పెంపొందించడం కోసం అభ్యాస పుస్తకాలు ఉపయోగపడును.

→ అభ్యాన పుస్తకం పాఠ్యపుస్తకంకు అనుబంధంగా ఉంటుంది.

→ కొన్ని సందర్భాలలో రెండూ కలిపి రాయడం జరుగును. అభ్యాస పుస్తకంలో అభ్యాసాలు సాధించడానికి తగిన ఖాళీలుంటాయి. కానీ పాఠ్యపుస్తకంలో ఆ అవకాశం ఉండదు.

ఎ) గణితానికి చెందిన మంచి అభ్యాస పుస్తక లక్షణాలు :-

→ విద్యార్థుల్లో అభివృద్ధి చేయవలసిన గణిత సామర్థ్యాలను పొందడానికి సహాయపడేదిగా ఉండాలి.

→ రాతపని చేయడానికి తగినన్ని ఖాళీలు ఉండాలి. ఇచ్చిన విషయం మూల పాఠ్యపుస్తకానికి అనుబంధంగా ఉండి దానితో

సహకరించేదిగా ఉండాలి

→ విద్యార్థులు వారి వారి స్థాయికి తగినట్లుగా సమస్యలు సాధించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి.

→ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. ఇందుకోసం అభ్యాసాలన్నీ తార్కికంగా కారిన్యాన్ని బట్టి క్రమంలో రాయాలి. - విద్యార్థులను ఆలోచింపచేసే అభ్యాసాలు కలిగినదిగా ఉండాలి.

→ విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలగడానికి తగిన పజిల్స్, రిడిల్స్, ఆటలకు అవకాశం ఉండాలి. - అభ్యాస పుస్తకంలో వీలున్న చోట తగిన బొమ్మలు, పట్టికలు, కార్టూన్లు ఏర్పాటు చేయాలి.

→ అభ్యాస పుస్తకంలోని సమస్యలకు సమాధానాలు సూచించబడాలి.

బి) ఉపయోగం:-

→ విద్యార్థులు వారి స్థాయికి తగినట్లుగా చేయగలిగినంత వేగంలో సమస్యలు సాధించే అవకాశం ఉంది.

→ ఆవర్తనం కోసం ఉపయోగపడుతుంది.

→ విద్యార్థి స్వయం అభ్యసనానికి దోహదపడుతుంది

→ తరగతి బోధనకు పాఠ్యపుస్తకానికి తోడ్పడే విధంగా ఉంటుంది

→ ఇంటిపని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది పజిల్స్, రిడిల్స్, ఆటలు కలిగిన అభ్యాస పుస్తకాలు విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి.

నోట్ :- క్రియా దీపికలో ముఖ్యంగా చరిత్ర, భూగోళశాస్త్రం, పౌర, అర్థశాస్త్రం మొ అంశాలలో కొన్ని పాఠ్యాంశాల బోధనకు ముందుగానీ, బోధనాంతరంగానీ విద్యార్థులకు నమాచార సేకరణ, నమోదు, చిత్రాలు చిత్రించడం, పటాలను

గీయించటం, స్థలాలను గుర్తించుటకు తోడ్పడును.

ఉపాధ్యాయ కరదీపిక: (హ్యాండ్ బుక్) :-

→ పాఠ్యపుస్తకంలో లేని విషయాలను ఉపాధ్యాయునికి అందించేది.

→ నిరంతరం మారుతున్న వర్తమాన విషయాలను తెలుసుకొంటూ తనను తాను సిద్ధపరచుకోవడానికి, వృత్తిపరమైన అభివృద్ధికి, బోధనా విషయం పైన, పద్ధతుల పైన సమగ్రమైన అవగాహనకు ఇది తోడ్పడును

1. రోజువారి పాఠాలకు ప్రణాళికలు తయారుచేసుకోవడానికి,

2.తగిన పద్ధతులు, ఉపగమాలు ఎంపిక చేసుకొనుటకు

3.సాధించవలసిన లక్ష్యాల ఎంపికకు

4.అధ్యయన పేటికలు తయారు చేయడానికి

5. అధ్యయన పేటికలను అవసరమైన సమయాలలో, వాడుకోవడానికి తోడ్పడును.

ఎ) అధ్యయన పేటికలో ఉండేవి :-

→ చార్టులు, ఫిల్మ్ లు, ఫిల్మ్ స్ట్రిప్ లు , సైడ్స్, ఆడియో క్యాసెట్స్, చిత్రాలు, నమూనాలు, మాతృకలు, పటాలు, పాంప్లేట్లు, పోస్టర్లు మొ॥వి.

వీటితోపాటు నష్టిమెంటరీ పుస్తకాలు, సూచిగ్రంథాలు, డిస్కవరీ సమాచార గ్రంథాలు, నిఘంటువులు, వార్తాపత్రికలు, పక్షవత్రికలు

→ మాసపత్రికలు, వార్షిక, అర్ధవార్షిక, జైనూనిక పత్రికలు మొ||వి గ్రంథాలయంలో చూపవచ్చు ఈ విధంగా గ్రంథాలయాలలో పఠనసామాగ్రి, లిఖిత సామాగ్రి ఎంతగానో ఉపయోగకారి అని చెప్పవచ్చు

గ్రంథాలయం-ప్రయోజనాలు :-

→ విద్యార్థులలో ఆసక్తి, అవగాహనను పెంపొందించవచ్చు.

→ అదనపు పరిజ్ఞానం, అన్వేషణా శక్తి లభించును

→ పఠనానైపుణ్యం, పఠనాశక్తి లభించును

→ సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడును.

→ విషయ సామాగ్రి అందుబాటులో ఉందును.

→ అభిరుచులు, వైఖరులు వృద్ధి చెందును

→ సంపూర్ణ వికాసం కలుగును

→ ప్రతిభావంతులకు ఉన్నతస్థాయి పుస్తకాల ద్వారా వారి ఙ్ఞానతృష్ట తీర్చవచ్చు.

→ మంద అభ్యాసకులకు గ్రంథాలయం వరం లాంటిది

→ తరగతి గదిలో చెప్పిన అంశాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని, పునశ్చరణ చేసుకొనుటకు తోడ్పడును.

→ విద్యార్థులతో పత్రికలలో ప్రచురించబడిన అంశాలు, వ్యాసాలు, పజిల్స్ ను సేకరింపచేయవచ్చు గ్రంథాలయ నిర్వహణ

→ గ్రంథాలయ నిర్వహణను తరగతి ఉపాధ్యాయుడే చేయాలి. తనకు తోడుగా ఆసక్తి, సామర్థ్యం ఉన్న ఒక సీనియర్ విద్యార్థిని

కూడా నియమించవచ్చు

→ తాను చదివి ఎంపిక చేసిన పుస్తకాలనే గ్రంథాలయంలో ఉంచాలి.

5.మ్యూజియం (వస్తుప్రదర్శనశాల) :-

→ మ్యూజియం అనేది మ్యూజ్ అనే గ్రీకు పదం నుండి వచ్చినది.

→ మ్యూజ్ అనగా విద్యా దేవతల నిలయం

→ వివిధ' రకాలైన వస్తువులను సేకరించి, పొందుపరచి, భద్రపరచి ప్రదర్శించే ప్రదేశాన్ని "మ్యూజియం" అనవచ్చు

→ మూర్తరూపంలో జ్ఞానాన్ని అందిస్తాయి

→దీనిలో చారిత్రక, భౌగోళిక, రాజకీయ, వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన వస్తువులు, వస్తుఖండితాలు (మాతృకలు), ప్రతిరూపాలు (మోడల్స్) ప్రకృతిలో లభించే వివిధ రకాల వనరులు, త్వరగా నశించిపోయే ధాన్యాలు, అటవిక ఉత్పత్తులు ముద్రణా సామాగ్రి, గ్లోబులు, మ్యాపులు, పరికరాలు, నాణేలు, పనిముట్లు, దుస్తులు, శిలలు మొ1ని ఉంచవచ్చు


→ దూది కూర్చిన పక్షులు, రసాయనాలలో భద్రపరచిన జీవులు, ఖనిజాలు, శిలలు, జలచరాలు, పశువులు మొ||వి ప్రదర్శనకు ఉంచాలి. నోట్ :- పాఠశాలలో ప్రయోగశాల లేకుంటే ఆ కొరతను మ్యూజియం కొంత వరకు తీరుస్తుంది

→ శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగే అభివృద్ధిని తెలియజేసే మ్యూజియం బెంగుళూరులో కలదు

V.I.T.M - విశ్వేశ్వరయ్య ఇందస్ట్రియల్ టెక్నలాజికల్ మ్యూజియం

ఉపయోగం :

→ కళాభిరుచి, సేకరణాభిచుచి పెరుగును

→ పరస్పర సహకార భావం, సేకరణ, అన్వేషణ లక్షణాలను పెంపొందించును.

→ పరిశీలనా శక్తి పెరుగును. ఇవి లోక ప్రియమైనవి.

→ ఇవి విద్యకు కేంద్రంగా ఉంటాయి.

6) వైజ్ఞానిక కేంద్రం (సైన్స్ సెంటర్)

→ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం కలిగించుటకు వైజ్ఞానిక కేంద్రం తోడ్పడును.

→ విద్యార్థులలో, ప్రజలలో మూఢనమ్మకాలను తొలగించి వైజ్ఞానిక వైఖరులను కలిగించుటకు సైన్స్ సెంటర్ కృషి చేయును

→ ఎ.పి.లో సైన్స్ సెంటర్ హైదరాబాద్లో కలదు

→ దీని నిర్వహణకు ఒక డైరెక్టర్ ఉంటారు

→ వైజ్ఞానిక కేంద్రాలు ప్రతి జిల్లాకు ఒకటి ఉండును

→ గ్రామీణ వైజ్ఞానిక కేంద్రాల నిర్వహణకు కేంద్రం నుండి నిధులు వస్తాయి

→ జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకు కలెక్టర్ చైర్మన్ గానూ, డి. ఇ.ఓ వైస్ చైర్మన్ గానూ ఉంటారు

→ గ్రామీణ వైజ్ఞానిక కేంద్రాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తాడు.

→ విద్యార్థులలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచుటకు ప్రతివారం క్విక్, వ్యాసరచన పోటీలు, ప్రతి నెల అధునిక విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు, చర్చలు, మూడు నెలలకోసారి నదస్సులు నిర్వహిస్తాయి.

వారానికి - క్విజ్లు, వ్యాస రచనలు

3 నెలలకి - సదస్సులు

నెలకి - ఉపన్యాసాలు, చర్చలు

→ సంవత్సరానికి -జిల్లా స్థాయి సదస్సులు

→ విద్యార్థుల కొరకు "యువ శాస్త్రవేత్తల పోటీ" నిర్వహించి, బహుమతులు ఇస్తారు

→ ఉపాధ్యాయుల కొరకు "ఇన్నోవేషన్ కాంపిటీషన్స్" కింద తక్కువ ఖర్చుతో తయారు చేయగల టి.ఎల్.ఎం. తయారీలో

పోటీని నిర్వహించి బహుమతులిస్తారు

→ వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకూ, గిరిజనులకూ వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగించి వారిలోని మూఢనమ్మకాలను తొలగించడానికి

→జిల్లా వైజ్ఞానిక కేంద్రాలు" తోడ్పడును

→ నోట్ :- హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ దేశంలోనే ప్రఖ్యాతి పొందిన సైన్స్ సెంటర్ గా చెప్పవచ్చు విద్యార్థులకు విజ్ఞానం పెంచుట, వైజ్ఞానిక అభిరుచులు పెంచుట, వైజ్ఞానిక దృక్పథం కలిగించుట వీని ముఖ్యోద్దేశ్యం

→ కార్యకారణ సంబంధాన్ని గుర్తించే దృక్పథాన్ని ప్రజలలో పెంపొందించే లక్ష్యంతో పనిచేయును. గిరిజనులు ఉండే ప్రదేశాలకు వ్యా ల్లో వెళ్ళి అక్కడ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, టి.వి. వి.సి.ఆర్ ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు

చేస్తారు

→ ఎయిడ్స్ డే, జనాభా దినోత్సవం, ఆరోగ్య దినోత్సవం, ఓజోన్ డే, వన్యప్రాణులు దినోత్సవం, సైన్స్ డే నిర్వహిస్తాయి. వాటిపై

పోటీలు నిర్వహిస్తాయి.

→ జన విజ్ఞాన వేదికల వంటి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటారు.