అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు









→ గురువు అంటే అంధకారం నుంచి వెలుగులోకి దారి చూపే దీపం.

→ ఉపాధ్యాయుడు అనేక అంశాలు చెబుతూ ఆసక్తిని రేకెత్తించి, విద్యార్థులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడానికి, దేశసేవకు వారి

అలోచనలను జోధించటంలో ఎంతగానో బాధ్యత ఉంది.

1. ఉపాధ్యాయుల సమర్థత :

→ విషయ పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను వృద్ధిచేసి, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి, అర్థవంతమైన, సమర్థవంతమైన బోధనా కృత్యాలతో, విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధిని, సమగ్ర ప్రవర్తనను రూపొందించి, బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దే బాధ్యతాయుత ప్రవర్తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిలో తప్పనిసరి.

→ విద్యార్థికి జన్మనివ్వడం తల్లిదండ్రుల బాధ్యత అయితే, బౌద్ధిక జన్మనివ్వడం ఉపాధ్యాయుని బాధ్యత

→ జాతీయ ఉపాధ్యాయ విద్యాసంస్థ (ఎన్.సి.టి.ఇ) నివేదికలో తెలిపిన దాన్ని బట్టి సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునికి 10 సామర్ధ్యాలు

విషయాల పట్ల అంకితభావం, 5 విషయాలలో నిష్పాదన అవసరంగా భావించవచ్చు శక్తిసామర్థ్యాల అంశాలు(10) నిష్పాదక అంశాలు(5) నిబద్ధత అంశాలు(5)




III సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండాల్సిన సామర్ధ్యాలు విషయ పరిజ్ఞాన సామర్థ్యా లు (Content Related Competencies) :

→ విషయ వినిమయ-సమన్వయ సామర్ద్యాలు (Transact and Coordination Competencies)

→ భావననా సామర్థ్యాలు (Conceptual Competencies)

→ సందర్భ సహిత సామర్ధ్యాలు (Contextual Competencies)

→ బోధనోపకరణ తయారీ సామర్థ్యాలు (TLM Preparation Competencies)

→ మూల్యాంకనా సామర్థ్యా లు (Evaluation Cornpetencies)

→ యాజమాన్య సామర్ధ్యాలు" (Management Competencies)

→ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పనిచేసే సామర్థ్యాలు (Parental Control & Co-opcration Competencies)

→ సహజ సహకారం పొందే సామర్థ్యాలు (Contact and Cooperation Competencies)

→ విద్యేతర సామర్థ్యా లు (Other Educational Activity Competencies)




III. మంచి బోధన- మంచి ఉపాధ్యాయుడు

→ బోధన ఎల్లపుడూ విద్యార్థి కేంద్రమై, సమైక్యత (Integrily, సహసంబంధం (Co-relation), సంబంధం (Association) అనే సూత్రాల ఆధారంగా కొనసాగినపుడే ఫలవంతమౌతుంది. మంచి బోధనకు మూలం మంచి ఉపాధ్యాయుడు. మంచి ఉపాధ్యాయుడు అనేక గురుతర బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది

→ K.F. నారాయణన్ మంచి ఉపాధ్యాయులకు ముఖ్యంగా 4 లక్షణాలు తప్పనిసరిగా భావించారు. దీన్ని "A, B, C, D" of a Good

Teacher అన్నారు. (మంచి లక్షణాలున్న ఉపాధ్యాయుడు)

'B' - Briliance (ప్రజ్ఞ)

A - Accessibility (అందుబాటు)

C - Communicative skills (భావప్రసార నైపుణ్యాలు)

D-- Devotion of Duty (కర్తవ్య నిష్ఠ)



ఎ) అందుబాటు:-


→ ఉపాధ్యాయుడు విద్యార్థికి అన్ని వేళలా అందుబాటులో ఉండి, అతనికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ మార్గదర్శకుడిగా ఉంటే వారిద్దరి మధ్య చక్కటి అనుబంధం, అవగాహన, ఆప్యాయతలు పెంపొందుతాయి. వారిద్దరి మధ్య చక్కటి సంబంధ

బాంధవ్యాలు ఏర్పడతాయి

బి) ప్రజ్ఞ :-

→ ఉపాధ్యాయుడు నిరంతర అధ్యయన శీలిగా ఉండి సమకాలీన సమాజంలో సంభవిస్తున్న మార్పులు చేర్పులను వరిశీలిస్తూ

అవగాహన పెంచుకుంటూ, విద్యార్థికి వెలుగునిచ్చే కొవ్వొత్తిలా తాను ఆరిపోతూ కూడా విద్యార్థిలో జ్ఞానజ్యోతులు వెలిగించాలి తన ప్రజ్ఞా పాటవాలను కూడా పెంపొందించుకోవాలి.


సి) భావప్రసార నైపుణ్యాలు :

→ ఉపాధ్యాయునిలో భాషా నైపుణ్యం ఉండాలి. చక్కటి వాగ్దాటి, వాక్పటిమ, వాక్ శుద్ధి, వాక్చాతుర్యం ఉండి చక్కటి పదాల పొందికతో ముత్యాల నరాల పంటి పలుకులతో. విద్యార్థి మనస్సులను రంజింపచేస్తూ, బోధనాప్రక్రియను కొనసాగించాలి

చక్కటి భావ ప్రసారాలతో విద్యార్థి జ్ఞాన అన్వేషణకు పురికొల్పాలి.





డి) కర్తవ్య నిష్ఠ :-

→ భావి పౌరులను రూపొందించుటలో ఉపాధ్యాయుడు కీలకమైన భూమికను నిర్వర్తించాల్సి ఉంది. కర్తవ్య దీక్షా, తత్పరతలతో సమాజంలో తాను కూడా ఒక సామాజిక వేత్తగా తన వంతు కర్తవ్య నిర్వహణ శ్రద్ద, భక్తి భావనలతో మెలగాలి ఆర్. హెచ్. దవే ప్రతిపాదించిన ఉపాధ్యాయ సామర్థ్యంలోని వివిధ అంశాలు- పాఠశాల గుణాత్మక విద్యకు సామర్థ్యాధార

నిబద్ధతాత్మక విద్య.

సామర్థ్యాలు: కార్యాచరణ పూర్వదశ చరాలు (10)

→ సందర్భానుసార

→ భావనాపరమైన

→ విషయపరమైన

→ వినియోగపరమైన

→ ఇతర విద్యా సంబంధిత కార్యక్రమాలు

→ బోధనాభ్యసన సామాగ్రి తయారు చేసే సామర్థ్యం

→ మూల్యాంకనం

→ విద్యార్థుల తల్లిదండ్రులతో పనిచేసే సామర్థ్యం

→ సమాజం, ఇతర సంస్థలతో పనిచేసే సామర్థ్యం




నిబద్ధత :-కార్యాచరణ పూర్వరశ & కార్యాచరణ దశ చరాలు (5)

→ అభ్యాసకుల పట్ల

→ సమాజంపట్ల

→వృత్తిపట్ల

→ప్రావీణ్యం పట్ల

→ప్రాథమిక విలువల పట్ల




నిష్పాదన -కార్యాచరణ దశ & ఫలితదశ చరాలు (5)

→ తరగతి గది

→ పాఠశాలేతర

→ పాఠశాల స్థాయి

→ విద్యార్థుల తల్లిదండ్రుల సంబంధిత

→ సమాజ సంబంధిత


IV. శాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు :

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్రింది లక్షణాలు కలిగి ఉండాలి

1. తగిన అర్హతలు

2. అభినివేశం

3.హావభావాలు

5. సహనశీలత

9. ఉత్సాహం

6. సమయస్ఫూర్తి

7. నమ్రత

10.విశ్వననీయత

11.నమగ్రమూర్తిమత్వం


V. ఎ.ఎస్.బార్ (1958) పేర్కొన్న ఉపాధ్యాయుడి లక్షణాలు: (మూసావి)

→ ఉపాధ్యాయులు మూర్తిమత్వ లక్షణాలు.

→ ఉపాధ్యాయుల సామర్థ్యాలు, తరగతి గదిలో వారి ప్రవర్తన.

→ వారికున్న విజ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, ఆదర్శాలు


VI. వేబర్ (1953) పేర్కొన్న లక్షణాలు (18 అంశాలు): (KORRATAGS)

1.విస్తృతమైన జ్ఞానం (Depth of Knowledge)

2. వ్యవస్థాపనలో పనితీరు (Delivery organisation)

3.మానవ సహసంబంధాలు (Inter Personal Relations)

4.ప్రస్తుతాన్వయం (Relevance)

5.పరీక్షించడం (Testing)

6.అసైన మెంట్ పనిభారం (Assignment and work load)

7. గ్రేడింగ్ (Grading)

8.ప్రేరేపించే సామర్థ్యం (Stmulating / Iaspinmtions)



VII మిశ్రా (1980) పేర్కొన్న లక్షణాంశాలు:

→ విద్యార్థులను ప్రోత్సహించడం.

→ ఆశక్తికరమైన వివిధ బోధన పద్ధతులను సందర్భానుసారంగా ఉపయోగించటం,

→ భావ ప్రకటన సామర్థ్యం .

→ విస్తృతమైన జ్ఞానం లేదా విషయ పరిజ్ఞానం.

→ నిర్ణయించిన లక్ష్యాలను సాధించడం


VIII సింగ్ (1982) ప్రకారం ప్రతిభావంతులయిన ఉపాధ్యాయుల లక్షణాలు :

→ విద్యార్థుల పెరుగుదల, అభివృద్ధిని గురించిన శాస్త్రీయ అవగాహన

→ మనోవైజ్ఞానిక శాస్త్ర పరిజ్ఞానం

→ విద్యార్థులను అన్నివేళలా ఉత్సాహపరుస్తూ వారికి తగిన కార్యక్రమాలను సూచించటం, వాటిని విజయవంతంగా పూర్తి

చేసేటట్లు ప్రోత్సహించడం.

→ వృత్తిపట్ల ఆసక్తి, అంకితభావం, పూజ్యభావం ఉండడం

→ విద్యార్థుల పట్ల ప్రేమ, దయ, ఓర్పు, సహనం ఉండటం తన శక్తి సామర్థ్యాలు, ప్రవర్తనల గురించి సరైన అవగాహన ఉండాలి


9. వేబర్ (1953) ప్రతిపాదించిన అంశాల ఆధారంగా :


ఎ) సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుని విద్యాపరిజ్ఞానాంశాలు

→ సమస్యల అవగాహన

→ వార్తాపత్రికలు, విద్యా పుస్తకాలలో పరిచయం

→ సామాన్య సాధారణ విద్యా పరిజ్ఞానం

→ బోధనా విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం



బి) వృత్తి శిక్షణ- మానవ సంబంధాలు :

1.వృత్తి శిక్షణ:-

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తాను బోధించాలనుకున్న తరగతికి సంబంధించిన కనీస అభ్యసన స్థాయి (Minimum level of Learning - (MLA) పట్ల పూర్తిజ్ఞానం, అవగాహన, క్రియాశీలత, సహ పాఠ్యాంశ పరిజ్ఞానంపై తగిన వృత్తిపరమైన తిక్షణు పాలది ఉండి అందులో నిష్ణాతుడై ఉండాలి. ప్రస్తుత పద్ధతి ప్రకారం విద్యార్థులను గరిష్ట ఆభ్యసస స్థాయికి (Maximum level

oflearning. (MLL) తీసుకురావడానికి ప్రయత్నించాలనే ఆలోచనలో జంది సాంఘికశాస్త్రం మానవీయ శాస్త్రాల సమ్మేళనం కాబట్టి, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు సమగ్ర అవగాహనతో మానవ నంబంధాల పట్ల తగిన జ్ఞానం, అవగాహనతో వ్యవహరించాలి.

2.మానవ సంబంధాలు :-

మానవ విలువలు, సామాజిక, ఆర్థిక సంబంధాల పట్ల అవగాహన పెంచుకోవాలి. వర్తమాన వ్యవహారాల పట్ల పూర్తి జ్ఞానం పొంది ఉండి, మానవ సంబంధాల అభివృద్ధికై ప్రయత్నించాలి.

సి) నాయకత్వ లక్షణాలు

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చక్కని నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి

→ ఆచార్య లైనింగ్ ప్రకారం యావత్ విద్యా వ్యవస్థ దాని కేంద్ర బిందువైన ఉపాధ్యాయుని చుట్టే పరిశ్రమిస్తుంది" రెండు పుస్తకాలు చదివిన పూర్తి సారాంశం కంటే ఒక ఉపాధ్యాయుని దగ్గర నుంచి ఎక్కువ జ్ఞానం పొందవచ్చు - జర్మనీ

సామెత

→ స్థిర చిత్తం, సామాజిక అవగాహన, ఆత్మనిగ్రహంతో సమస్యా సాధన పద్ధతులు తెలుసుకొని, క్రియాశీల నాయకుడిగా ఎదగాలి. - పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలకు ముందుండి, మార్గదర్శకుడిగా నాయకత్వం వహించి, సమర్ధంగా నిర్వహించాలి

→ క్షేత్రపర్యటనలు, సాంఘికశాస్త్ర క్షలు, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణకు నాయకత్వం వహించి, తగిన జ్ఞానాన్ని అందించాలి సాంఘిక సమస్యలైన ఎయిడ్స్, పోలియో, జనాభా విస్ఫోటనం ముఖ్యమైన అంశాలపై తన నాయకత్వంలో ర్యాలీలు నిర్వహించి

ప్రజలందరికీ విషయ జ్ఞానం, అవగాహన కల్పించాలి



డి) పట నైపుణ్యాలు :-

→ వివిధ మ్యాపులను గీయడం, క్షుణ్ణంగా మ్యాపులను చదవగలగడం, ఏ దేశపు ఉనికినైనా సులభంగా చెప్పడం, అట్లాస్ గ్లోబులకు సంబంధించిన వూర్తిజ్ఞానం కల్గి ఉండడం, విద్యార్థులకు సులభంగా మ్యాపులలో వివిధ అంశాలను గుర్తించే

విధంగా వివిధ మెళకువలను నేర్పాలి.

→ మ్యాప్ : పాయింటింగ్ ద్వారా విద్యార్థి ఒక ప్రదేశాన్ని గుర్తించే నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఒక ప్రదేశం ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉందో గుర్తింపు చేయాలి.

→ సమకాలీన సంఘటనలు, శీతోష్ణస్థితి, వివిధ విశ్లేషణలు, వివిధ ప్రదేశాలు, ప్రాముఖ్యతలను విద్యార్థులచే ఉపాధ్యాయుడు గుర్తింప చేయాలి.



X. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క మంచి లక్షణాలు :

→ ఆదర్శవంతమైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థికి అన్ని విషయాలలో....

Guide -సలహాదారుగా

Philosopher-తత్త్వవేత్తగా

Psychologist- మానసికవేత్తగా

Educationalist-విద్యావేత్తగా

Friend - స్నేహితుడిగా ఉండాలి.





Teacher - లోని అక్షరాలు క్రింది అంశాలను సూచిస్తాయి.



T - Tactful - నేర్పు

E-Efficient - సమర్థత

A-Affectionate -ప్రేమ

E-Enthusiastic -సహకారం

R-Responsibility- బాధ్యత .


→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వివిధ బోధనా పద్ధతులలో నిష్ణాతుడై ఉండాలి. అనువైన పద్ధతిని నందర్భోచితంగా ఉపయోగించగల

నేర్పు ఉండాలి



→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియలో విదార్థి ఆసక్తిని, అభిరుచిని తెలుసుకొని బోధించాలి. వినుగును

కలిగించరాదు.

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తనకు తెలిసిన విషయాలు మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థి అవసరాలు

తీర్చు విధంగా బోధన సాగించాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో దాగిన నైపుణ్యాలను వెలికితీసి మంచి అలవాట్లు నేర్పుసట్టి విద్యాబోధన

జరపాలి.


→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు నియోజనాలు ఇచ్చుట, తరగతిలో పాఠ్యాంశాల మూల్యాండనాలు జరిపి విద్యార్థి

ప్రగతికి ఉపాధ్యాయుడు తోడ్పడాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పనిచేయుట ద్వారా విద్యను అధ్యసించు అవకాశం కల్పించునట్లు ఉండాలి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వ్యక్తిగత కృత్యాలు, సామాజిక కృత్యాలను ప్రోత్సహించాలి.

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో క్రమశిక్షణను పాటించు నేర్చు కలిగి ఉండాలి - సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రవర్తనా సమస్యలు పరిష్కరించాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలోని వైయుక్తిక భేదాలను గుర్తించి, వాటి నివారణకు కృషి చేయాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠశాల నియమ నిబంధనలు పాటించుచు, ఇతరులు పాటించు విధంగా చేయాలి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠశాల ప్రమాణాలను పొందుపరచి కాపాడాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పెద్మాస్టర్ కు, పాఠశాల విషయంలో సహాయ సహకారాలు అందివ్వాలి

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సమాజ సేవా కార్యక్రమంలో (పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జనాభా నియంత్రణ సంఘ విద్రోహ చర్యల నివారణ, మొ|| వాటిలో) విద్యార్థులను పాల్గొనునట్లు చేసి తాను ఆదర్శంగా నిలవాలి


XI. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు :-

→ భారతదేశ భవిష్యత్ పాఠశాల తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుందని అభిప్రాయపడినది - కొఠారి కమీషన్

→ సాంఘిక శాస్త్రం బోధించుటలో ముఖ్యాంశం - విద్యార్ధులను సతీ పౌరులుగా తయారుచేయడం.


→ ఉపాధ్యాయునికి బోధనా సామర్థ్యం పెంచి బోధనా విలువలను సుసంపన్నము చేసేది వృత్తి శిక్షణ

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన ప్రత్యేక సామర్థ్యాలు..

1.పాండిత్య పటిమ

2.వృత్తి శిక్షణ

3.మూర్తిమత్వం

4. బోధనా నైపుణ్యం

5.మానవ సంబంధాలు



→ నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులు కల్పిస్తాను - ఐన్ స్టీన్

→ ఆధునిక, పరిశోధనా విషయాలను తెలుసుకోవడానికి అవసరమైనప్పుడు పరిశోధనా కార్యక్రమాలు చేపట్టడానికి కావలసిన

సామర్థ్యం సంపాదించుకోవడం - వృత్తి శిక్షణ

→ ఉపాధ్యాయుని మూర్తిమత్వాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.



భౌతికాంశాలు:-

1.వ్యక్తి స్వరూపం

2.జీవిత సౌకర్యాల గుర్తింపు

3. స్వరం

4.మంచి భాష

5.ఆరోగ్యం .



నిష్క్రియాశీలమైన అంశాలు:-

1.స్నేహశీలత

2.సానుభూతి

3. చిత్తశుద్ధి

4.యుక్తి

5.సముచితత్వం.

6. ఆత్మనిగ్రహం



కార్యనిర్వర్తనా సామర్థ్యాలు

1.ఆత్మవిశ్వాసం

2. చొరవ

3.అనుసరణీయత ఉపాయశీలత

4. నిర్వహణా సామర్థ్యం

5.నిర్దేశించే సామర్థ్యం

6. శ్రమించే స్వభావం,



XIL సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన సాధారణ లేక మంచి అలవాట్లు

1. వేళకు సరిగా బడికి వెళ్ళడం

2.విధులు సక్రమంగా నెరవేర్చడం

3. పొగత్రాగకుండా ఉండడం

4. పిల్లలలో నమ్మకాన్ని పెంచడం.

5.పిల్లల పట్ల సమానభావం, ప్రేమ, విశ్వాసాలు కల్గి ఉండడం,

6. లౌకిక దృష్టి, విశాల ప్రధానం, విశాల దృక్పథం కల్గి ఉండడం


XII. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని బోధనా నైపుణ్యాలు :

1. కృత్యాధార బోధనకు ప్రాముఖ్యత

2.సామాజిక వనరుల ద్వారా బోధన

3. పాఠ్యవిషయాలు సమన్వయం చేసే శక్తి

4. బోధనా పద్ధతుల్లో ప్రావీణ్యం

5. దైనందిన సంఘటనలను బోధించడం.

6. సహపాఠ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం

7.వివిధ నైపుణ్యాలను అలవరచుకోవడం.







"ఉపాధ్యాయునికి ప్రధానంగా కావలసినది - నమ్మకం, లక్ష్యం, ఉత్తమ జీవనం