అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు










విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు :-

→పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటి వారు వారి ఆలనాపాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు, వారి ప్రేమ అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు - స్వామి వివేకానంద

→మొట్టమొదటిగా విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయునికి వృత్తిపట్ల ప్రేమాభిమానాలు, అంకిత భావం ఉండాలి. తన విధిని బాధ్యతాయుతంగా నిర్వహించే వాడై ఉండాలి. బోధనాభ్యసన ప్రక్రియను కష్టంగా కాకుండా ఇష్టంగా నిర్వహించాలి

→ అందుకే డా|| సర్వేపల్లి రాధాకృష్ణగారు. ఉత్తమ ఉపాధ్యాయునిలో మూడు విశిష్ట లక్షణాలుండాలని తెలిపారు. "Love for the profession, for the subject, and for the students"

→ మిగిలిన ఉపాధ్యాయులకు ఉండవలసిన విద్యార్హతలు, గుణగణాలు ఉండటమేగాక, విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడికి శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత లాంటి ప్రత్యేక గుణాలు కలిగి ఉండాలి.

→ తాను బోధించే విజ్ఞానశాస్త్ర పాఠ్యాంశాలలోని విషయాలపై తిరుగులేని ఆధిపత్యం ఉండాలి. తరగతి గదిలోకి వెళ్ళే ముందుగానే

పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదివి ఏ విధంగా బోధించాలని, పీరియడ్ ప్లాన్ తప్పకుండా తయారు చేసుకోవాలి. ప్రతి పాఠ్యాంశానికి

కావలసిన కృత్య పత్రాలను, బోధనాభ్యసన సామాగ్రిని, మూల్యాంకన పత్రాలు సమకూర్చుకొని కృత్యకేతాలను తయారుచేసుకోవాలి


→ ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు- విజ్ఞాన శాస్త్రాన్ని శిశుకేంద్రీయు కృత్యాధార పదతి ద్వారా అభ్యనన జరిగేట్లు

చూడాలి. దీని వల్ల విద్యార్థులలో పరిశీలించటం, ఊహించటం, ప్రయోగాలు చేయటం, నిర్ధారించటం లాంటి ప్రక్రియా

నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. వారిలో శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది


→ సైన్స్ కిట్, మినీ టూల్ కిట్లోని పరికరాలను, దృశ్య, శ్రవణ పరికరాలను వినియోగించడాన్ని తెలుసుకొని బోధనాభ్యసన

కృత్యాలను నిర్వహించేటప్పుడు అవసరానికి తగినట్లు ఉపయోగించుకోవాలి.


→ పాఠశాలలో ప్రయోగశాల లేకుంటే ప్రయోగాలు చేయలేమనే భావన లేకుండా ప్రకృతి, పరిసరాలనే ఒక ప్రయోగశాలగా

ఉపయోగించుకోవాలి, లోకాస్ట్, నో కాస్ట్ బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేసుకోవడంలో సిద్ధహస్తుడై ఉండాలి.


→ ప్రతిరోజు టోధనాథ్యసన ప్రక్రియలో చర్చకు కొంత సమయం కేటాయించాలి. చర్చలో పాల్గొనడానికి అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలి. వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి.

ముఖ్యంగా ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు ఉండాలి. పిల్లలు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రోత్సహించాలి పిల్లల అభిప్రాయాలను ఓపికతో వినాలి, వెంటనే ఖండించరాదు. దండించటం లాంటివి చేయరాదు. ఉపాధ్యాయుడికి ఓర్పు సహనం, ప్రేమ, భూతదయ, వాత్సల్యం కలిగి ఉన్నపుడే స్నేహితుడుగా, తత్వవేత్తగా, మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థులలో తాను ఆశించిన మార్పులను తీసుకొని రాగలుగుతాడు.

"A poor teacher tels, An average teacher explains. A good teacher demonstrates A great teacher inspires



→ ఉపాధ్యాయుడు భవవ్యత్ రూపశిల్పి, దేశభవిష్యత్ తరగతి నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది" కొరారీ

→ పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటి వారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు, వారి ప్రేమ అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు"

నోట్ :- "విజ్ఞానశాస్త్ర బోధనలో విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పటం కంటే ఎలా నేర్చుకోవాలో నేర్పించాలి "Make them learn how to learn

→ పూర్వం ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమయ్యేవారు. కానీ నేటి ఉపాధ్యాయుడు బహుముఖ పాత్రలు

పోషించాలి. అది...

1. ప్రణాళికా రచయిత,

2.నిర్వాహకుడు,

3. సమన్వయకర్త,

4. మధ్యవర్తి,

5. మార్గదర్శకుడు,

6. సౌకర్యకర్త.


ప్రణాళికా రచయిత (Planner) (పథకాలు తయారు చేయువాడు):-

→ నిర్ణీత కాలవ్యవధిలో లక్ష్యసాధనకోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా సమగ్రంగా ఆచరణాత్మక పథకాన్ని తయారు చేసేవాడే

ప్రణాళికా రచయిత. సాధారణంగా రెండు రకాల పథక రచనలు చేపట్టాలి. అవి... 1. పాఠ్యప్రణాకా పథకరచన (Cunculum.planting) 2. సహపాత్యప్రణాళికా పథకరచన (Co- curriculuri planning)

1. పాఠ్య ప్రణాళికా పథక రచన: (Institutional Plan)

→ సిలబస్ లో నిర్దేశించిన పాఠ్యాంశాలు ప్రణాళికా రచనకు పునాది. వీటి ఆధారంగా నిర్మించే పథకాలు.

ఎ) సంస్థాగత ప్రణాళిక :

→ ఒక విద్యాసంవత్సరంలో సంస్థలో నిర్వహించవలసిన అన్ని రకాల కార్యక్రమాలపై అవగాహన కల్గి ఉండాలి

→ సంస్థ లక్ష్యాలపై ఉపాధ్యాయుడికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి

బి) వార్షిక పథకం : (Year plan)

→ ఒక విద్యా సం||లో పూర్తి చేయాల్సిన విజ్ఞానశాస్త్ర అంశాలకు సంబంధించి వేసవి సెలపుల తరువాత పాఠశాల తెరవకముందే రూపొందించుకోవాలి.


సి)యూనిట్ పథకం: (Unit plan)

→ వార్షిక పథకం ఆధారంగా, వార్షిక పథకంలో సంక్షిప్తంగా పేర్కొన్న అంశాలను విస్తృతపరచుకొని ప్రతి యూనిట్లోని సబ్ యూనిట్లో గల విషయానికి తగిన విషయ విశ్లేషణ చేసి, పూర్తి చేయడానికి కావలసిన పీర్ియడ్ల సంఖ్యను నమోదు

చేయాలి.

డి) పిరియడ్ పథకం

→ యూనిట్ పథకం ఆధారంగా అందులో సూచించిన పీరియడ్ ప్రకారం తయారు చేసుకొనేది. పీరియడ్ పథకం లేకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి వెళ్ళరాదు.

ఇ) మూల్యాంకనం :

→ బోధనలోని లోటుపాట్లను మూల్యాంకనం తెలియజేయును.

→ అనుకున్న లక్ష్యాలు, సామర్ధ్యాలు పూర్తయినదీ లేనిదీ తెలుసుకోవచ్చు.

→ వైయుక్తిక భేదాలు గుర్తించవచ్చు. కనుక మూల్యాంకనం నిరంతరం జరిగేట్లు చూడాలి



ఎఫ్) వ్యక్తిగత భేదాలకు తగిన పథకం: (Plan for Individual Differences)

→ తరగతి గదిలో మూడు ధకాల విర్యార్థులుంటారు. కనుక ప్రతిభావంతులు, సగటు, అల్ప మూడు స్థాయిల వారికి అనుగుణమైన

పథకాలు తయారుచేయాలి.

2. సహపాఠ్య ప్రణాళికా పథక రచన :- (Planning for Co- curricular Activities) '

→ విద్యార్థి విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన సహపాఠ్య కార్యక్రమాలైన సైన్స్ క్లబ్స్, క్షేత్ర పర్యటనలు, వైజ్ఞానిక యాత్రలు, వైజ్ఞానిక

ప్రదర్శనలు మొ|| వాటికి కూడా ఉపాధ్యాయుడు ప్రణాళికను తయారుచేయాలి.

→ సహపాళ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులు "విరామ కాలాన్ని సద్వినియోగం" చేసుకుంటారు

ఎ) సైన్స్ క్లబ్లు :

→ ప్రతి పాఠశాలలో సైన్స్ క్లబ్బులు ఏర్పాటు చేసుకొని ఆ విద్యా సం॥లో చేపట్టే కార్యక్రమాల విషయంలో వధక రచన

చేసుకోవాలి

→ విద్యార్థులు నిర్వహించిన అంశాలకు సంబంధించి మ్యాగజైన్ తయారు చేయవచ్చు

బి) వైజ్ఞానిక యాత్రలు, క్షేత్ర పర్యటనలు :


→ వైజ్ఞానిక యాత్రలు, క్షేత్ర పర్యటనలు మొ॥ ఏ విధంగా చేపట్బాలో పథక రచన చేసుకోవాలి.

సి) వైజ్ఞానిక ప్రదర్శనలు:

→ వైజ్ఞానిక ప్రదర్శనలను ఎలా నిర్వహించాలో, వాటిలో ఎలా పాల్గొనాలో ముందుగానే పథకం సిద్ధం చేసుకోవాలి.

→ ఇవే కాకుండా క్విజ్ లు, వ్యాసరచనలు, పక్తృత్వం, నాటకాలు మొ॥వి నిర్వహించుటకు పథకాలు రూపొందించాలి.


II. నిర్వాహకుడు (అన్ని పనులను/ చర్యలను నిర్వహించేవాడు) :-

→ ఉపాధ్యాయుడు నిర్మించుకొన్నటువంటి ప్రణాళికలన్నింటిని ఫలప్రదంగా నిర్వహించగలగాలి.

→ శిశుకేంద్రీకృత పద్ధతుల ద్వారా విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికి తీయాలి. వారిలో శాస్త్రీయ వైఖరులను సైన్స్ కార్నర్

ద్వారా వెలికి తీయాలి

→ బడి తోట, ప్రాజెక్ట్ పనులు కూడా చక్కగా నిర్వహించాలి.

→ సంస్థాగత ప్రణాళికలో భాగంగా వివిధ పరీక్షలు, దినోత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించాలి



III సమన్వయకర్త : (అన్ని విషయాలను సమన్వయపరచాలి) :-

→ వివిధ రకాల విభాగాలను ఒక క్రమపద్ధతిలో సమన్వయపరచి అమర్చడం ద్వారా యంత్రం నిర్మించబడి నరిగ్గా పనిచేయును

→ పై విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వం కొరకు అనేక బోధనాభ్యసన అనుభవాలను సమన్వయవరచి

బోధించాలి.

→ విజ్ఞాన శాస్త్రంలో వివిధ భాగాలను ఒకదానికొకటి సమస్వయపరచి బోధించాలి తరగతి గదిలో నేర్చుకొన్న విషయాలు, నిత్యజీవితంలో ఉపయోగపడేట్లు సమన్వయపరచాలి*

→ పాఠ్య విషయాలు, పాఠ్యేతర విషయాలను సమన్వయపరచి బోధించాలి.

→ సహోపాధ్యాయులతో, ప్రధానోపాధ్యాయునితో, పాలనాయంత్రాంగంతో స్నేహపాత్రుడిగా సమన్వయకర్తగా ఉందాలి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘంలోని వ్యక్తులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి.

→ ఎమ్మార్సీ కార్యక్రమాలలో, ఎ.ఎం.సి కార్యక్రమాలలో, స్కూల్ కాంప్లెక్స్ కార్యక్రమాలలో సమన్వయకర్తగా ఉండాలి. IV. అన్వేషకుడు : తెలియని సమాచారాన్ని కనుక్కోవడం

→ ఉపాధ్యాయుడు నూతన విషయాలను, నూతన వృత్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచుకోవడానికి నిరంతరం అన్వేషించాలి సెమినార్లు, వర్క్షాపులు, పునశ్చరణ తరగతులు, సైన్స్ సెంటర్స్, సైన్స్ ఫేర్స్ మొ|| కార్యక్రమాలలో పాల్గొని నూతన విషయాలు

తెలుసుకోవాలి

→ రోజు రోజుకూ విశేషంగా అభివృద్ధి చెందుతున్న విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని అన్వేషించాలి


V. మధ్యవర్తి : (సమస్యలు పరిష్కరించేవాడు) విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొనేట్లు చేయాలి.

→ పాఠశాలలో తయారు చేసిన ప్రణాళికల అమలులో, ఆయా తరగతుల సిలబస్ లో ఉన్న సామర్థ్యాలను అభివృద్ధి పరచుటలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియచెప్పుటకు మధ్యవర్తిగా ఉండాలి

VI. మార్గదర్శి: (ఆదర్శమూర్తిగా ఉండాలి) విద్యార్థి స్వయంగా అభ్యసించడానికి మార్గదర్శకత్వం వహించాలి.

ఉపాధ్యాయుడు హావభావాలు, ప్రవర్తన, నడక, నడత, తీరుతెన్నుల్ని విద్యార్థి గమనిస్తాడు కనుక ఉపాధ్యాయుడు ఆదర్శమూర్తిగా

ఉండాలి.

→ వివిధ వ్యాధి నివారణా చర్యలు చేపట్టటంలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించాలి.

→ జనాభా పెరుగుదల, మద్యపానం, ధూమపానం వల్ల కలిగే అనర్థాలు హెచ్.ఐ.వి వ్యాప్తి భాంటి విషయాలను ప్రజలకు తెలియజేసి "జాగృతం" చేయాలి

→ ప్రజలలో ఉన్న మూధనమ్మకాలను తొలగించేటట్లు మార్గదర్శనం చేయాలి

→ సంఘంలో ప్రబలి ఉన్న మూఢనమ్మకాలను తొలగించేటట్లు మార్గదర్శకత్వం వహించాలి. - విద్యార్థిలో స్వయం అభ్యసనకై పరిశీలన, ఆలోచన, విశ్లేషణ, సృజనాత్మకత మొ|| ప్రక్రియ నైపుణ్యాలు పొందడానికి

→ ఉపాధ్యాయుడు అలా ప్రవర్తించాలి నోట్ :- విద్యార్థిలో కలిగించాలనుకున్న ప్రతి లక్షణం ముందు తాను కలిగి ఉండాలి


VII. సౌకర్యకర్త: (సహాయం చేసేవాడు

- ఉపాధ్యాయుడు విద్యార్థికి సమన్వయకర్త, మార్గదర్శి వీటన్నింటికి మించి వివేకవంతుడైన స్నేహితుడు, సహాయకుడు

సౌకర్యకర్త కూడా,

→ విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు వారికి ఏదైనా సమాచారం అవసరమైనపుడు, వారికి ఉపాధ్యాయుడు సహనం ఓపికతో విద్యార్థులకు తగిన సహాయం అందిస్తాడు.

→ విద్యార్థులకు తెలియని విషయాలు, సమాధానాలు తెలుసుకొని చెప్పాలి. అంతేగానీ విసుక్కోరాదు.

→ కృత్యాలలో/ ప్రయోగాలలో/ ప్రదర్శనలలో పాల్గొనుటలో విద్యార్థికి ఎదురయ్యే సమస్యలకు, ఇబ్బందులకు సహాయం చేస్తాడు. > "జ్వాలతో ప్రజ్వరిల్లో దీపం ఏ విధంగా మరొక దీపాన్ని వెలిగించగలదో, అదే విధంగా ఉపాధ్యాయుడు తనలో ప్రజ్వరిల్లే

→ జ్ఞానం ద్వారా విద్యార్థుల జ్ఞానాన్ని వెలిగించగలడు" రవీంద్రనాథ్ ఠాగూర్

→ ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీలాంటివారు. పిల్లల అభ్యసనానికి పరిజ్ఞానానికి అతనే ఆధారం. వారిలో సృజనాత్మకత మేల్కొలిపే ఆదర్శమూర్తి పాత్ర పోషించవలసిందీ అతనే" - డా.పి.జె.అబ్దుల్ కలామ్

→ "నన్ను ఒక గుడ్ టీచర్ అని అందరూ ఆలోచించేలా చేశాను అంతే" - సోక్రటీస్

అంటారు. నిజానికి అందులో సత్యం లేదు. నేను చేసిందల్లా నా విద్యార్థులను

"If science is poorly taught and badly learnt. It is little more than burdening the mind with dead information and it could degenerate even into a new superstition - కొఠారీ కమీషన్

→ ఉపాధ్యాయుడు సరిగా బోధించుటకు వృత్యంతర ఉపాధ్యాయ విద్య ఎంతో అవసరం" NPE 1986

వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు 7:

→ ఉపాధ్యాయులలో అలసత్వం, జడత్వం తొలగించుకొనుటకు వృత్త్యంతర శిక్షణా కార్యక్రమాలు తోడ్పుడును.

→ బాధ్యతాయుత బోధనకు, నూతన పద్ధతులను తెలుసుకొనుటకు వృత్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి తోడ్పడును » మండల స్థాయిలో ఎమ్మార్సీ, జిల్లాస్థాయిలో డైట్, రాష్ట్రస్థాయిలో ఎన్.సి.ఇ ఆర్.టి, ఎస్.ఐ.ఇ.టీలు, జాతీయ స్థాయిలో ఎన్.సి.ఇ.ఆర్.టి, సి.ది. ఇ టి, ఎన్.సి.టి. ఇలు శిక్షణా తరగతులు నిర్వహిస్తాయి



వృత్త్వంతర శిక్షణలో ముఖ్యాంశాలు :-

→ పాఠ్యాం శాలలోని కష్టతర విషయాలు

→ అధునిక బోధనా పద్ధతులు - శిశు కేంద్రీయ కృత్యాధార పద్ధతులు

→ నూతన మూల్యాంకన పద్ధతులు - నిరంతర సమగ్ర మూల్యాంకనం

→ పాఠశాలకు అందించిన దృశ్య శ్రవణ సామాగ్రి పరిచయం, నిర్వహణ, ఉపయోగించటం•


→ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం - కంప్యూటర్ విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

→ ఒక్కోసారి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం

ఉదా :- బహుళ తరగతి బోధన, బహుళ స్థాయి బోధన, పర్యావరణ విద్య, జనాభా విద్య మొ||వి. నోట్ :- ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణా కార్యక్రమాలకు హాజరైనపుడు భాగస్వామ్యం వహించాలి. కేవలం

పరిమితం కాకూడదు

→ వివిధ విషయాలపై నవివరమైన చర్చలు, కార్యగోప్ఠులు నడవలడాలి

→ పార్టిసిపేటరీ అప్రోచ్"లో శిక్షణా తరగతులు నిర్వహించబడాలి.

→ Two or More brains are better than a single Brain"

→ "Teacher must be a life long student"

→ విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు కొత్త శాస్త్ర విషయాలను ఎప్పటికపుడు వార్తాపత్రికలు, విజ్ఞానశాస్త్ర విషయాలు, సైన్స్ మ్యాగజైన్స్, విజ్ఞాన సర్వస్వాలు, పరామర్శ గ్రంథాలు, టి.వి.కార్యక్రమాలు, ఇంటర్నెట్, సైన్స్ విషయాలు గల సి.డిల నుండి నేర్చుకోవాలి

→ పైన్స్ సబ్జెక్టుపై తిరుగులేని ఆధిపత్యం కోసం

→ స్వతహాగా అధ్యయనం చేయటం. - సైన్సు జర్నల్స్ చదవడం

→ విజ్ఞానశాస్త్ర మ్యాగజైన్లకు విజ్ఞానశాస్త్ర విషయాలపై రాయడం.

→ విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యత గల ప్రదేశాలను సందర్శించడం.

→ సహోపాధ్యాయులతో, విషయ ష్టాతులతో చర్చలు జరపడం

→సబ్జెక్టు సమావేశాలు, సెమినార్లకు హాజరుకావడం, పాల్గొనడం

→ ప్రతి యూనిట్‌లోని విషయాలకు తగిన కృత్యపత్రాలు, టి.ఎల్. ఎంతో యాక్టివిటీ ప్యాక్ తయారు చేసి విజ్ఞానశాస్త్ర తరగతిగదిలో వినియోగించడం

→ జిల్లాలో ఇంచుమించు ఎస్.సి.ఇ.ఆర్.టి మాదిరిగా నడుపుతున్న "జిల్లా విద్యా శిక్షణ సంస్థ" ద్వారా అందించే విస్తరణ కార్యక్రమాలు (ఎక్స్టెన్షన్ సర్వీసెస్) ద్వారా తమ వృత్తి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సంప్రదించడం.