గణిత ఉపాధ్యాయుడు
గణిత ఉపాధ్యాయుని లక్షణాలు:-
→చక్కని విషయ పరిజ్ఞానం ఉండాలి, మంచి బోధనా పరిమ ఉండాలి .
→ గణితానికి సంబంధించిన నూతన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండాలి. అది అవసరమైన మేరకు విద్యార్థులకు
అందిస్తూ ఉండాలి
→సదా చిరునవ్వుతో ఉండి, గణిత ఉపాధ్యాయుడన్నా, గణితమన్నా స్నేహభావం పెంపొందేలాగా ఉండాలి.
→విద్యార్థులకు, విద్యాభివృద్ధికి తగిన సూచికలను ఇవ్వాలి.
→ విద్యార్థులకు దిశా నిర్దేశం చేయగలిగి ఉండాలి.
→సమయపాలన పాటించాలి. విద్యార్ధులకు సమయపాలన పాటించటంలో ఆదర్శంగా నిలవాలి
→నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, ఏ పనినైనా చక్కగా నిర్వహించే సామర్ధ్యం ఉండాలి.
→నిరంతరం విజ్ఞానార్థనకై కృషి చేయాలి, మంచి పాఠకుడుగా ఉండాలి.
→గణిత పత్రికలకు చందాదారుగా ఉంటూ, ఆ పత్రికలలో వ్యాసాలు రాయగలిగి ఉండాలి. - తన వృత్తిపట్ల గౌరవం పెంపొందించుకోవాలి, మంచి చమత్కార భాషణం చేయగలిగి ఉండాలి
→సమస్యా పరిష్కార శక్తి కలిగి విద్యార్థులకు సమన్య వచ్చినపుడు సహాయపడాలి. గణిత సామాగ్రిని సమర్థవంతంగా ఉపయోగించగలిగి ఉండాలి.
→గణిత బోధనోపకరణాలను స్వయంగా తయారు చేస్తూ ఆ విషయం పట్ల విద్యార్థులకు శిక్షణనిచ్చి వారితో కూడా
బోధనోపకరణాలను తయారు చేయించాలి.
→ విద్యార్థులకు అవసరమైనపుడు పరీక్షలు నిర్వహించి వాటిని మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాన్ని తెలపాలి
→ పరీక్షలలో విద్యార్థి యొక్క విషయ పరిజ్ఞానాన్ని సామర్థ్యాన్ని అంచనావేసి వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలి. గణితంలో వెనుకబాటుతనం పరిపాటి. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి
వెనుకబాటుతనాన్ని రూపుమాపాలి
→తాను నిర్వహించవలసిన అన్ని రికార్డులను, రిపోర్టులను సమయానుకూలంగా నిర్వహిస్తూ పాఠశాల నిర్వహణకు దోహదపడాలి. చక్కటి గంభీరమైన, స్పష్టమైన వాచకాన్ని కలిగి ఉండాలి.
→తనకన్నా సీనియర్ ఉపాధ్యాయుల నుంచి సూచనలను సలహాలు స్వీకరిస్తూ, తనకన్నా జూనియర్ ఉపాధ్యాయులకు తగు విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలి
→గణితమే కాక వీలైనన్ని ఇతర రంగాలలో కనీస పరిజ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు రచించగల్గాలి
→పాఠశాలలో అందరితోనూ సఖ్యంగా ఉంటూ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి - విద్యార్థుల ఇబ్బందుల పట్ల సానుభూతితో స్పందించగలిగి ఉందాలి
→ వేగం, కచ్చితత్వం, తర్కం, హేతువులను ఆదర్శవంతంగా ఆచరిస్తూ విద్యార్థులు కూడా ఆచరించేలా శిక్షణనివ్వాలి.
→ మేధస్సుకు పదును పట్టే కార్యకలాపాలు నిర్వహిస్తూ, సదా విద్యార్థులను తరగతి గదిలో చురుకుగా ఉండాలి.
→ పాఠశాలలో ఒక గణిత క్లబ్బుని, ఒక గణిత ప్రయోగశాలను, గణిత గ్రంథాలయాన్ని స్థాపించి, వాటి నిర్వహణ విద్యార్థులను భాగస్వాములను చేయాలి, గణితం అంటే అపారమైన ప్రేమ, ఇష్టం కలిగి ఉండాలి.
నోట్ :- ఒక సంగీత ఉపాధ్యాయుడు ఏ రకంగా తాను స్వయంగా పాడడం కంటే విద్యార్థులతో పాడించుటకు ప్రయత్నిస్తాడో అదే విధంగా గణితోపాధ్యాయుడు కూడా తాను నల్లబల్లపై సమస్యా సాధన చేసే కంటే విద్యార్థులను సమస్యా సాధన వైపు పురోగ ఎంకేలా చేసి వారే సమస్యకు పరిష్కారం కనుగొనేలా చేయాలి.
1.గణితోపాధ్యాయుని సాధారణ విద్యార్హతలు :-
→ గణితాన్ని అభ్యసించి, గణితం ప్రక్రియల పట్ల, గణిత భావనల పట్ల చక్కని పట్టు కలిగి ఉండాలి.
→ ప్రాథమిక -పాఠశాలలో బోధించడానికి కనీసం ఇంటర్మీడియట్ వరకు గణితాన్ని స్వీకరించాలి.
→ మాధ్యమిక స్థాయిలో బోధించటానికి గణితంలో పట్టభద్రుడై ఉండాలి
→ గణిత పుస్తకాలు నిరంతరం చదివే పాఠకుడై ఉండాలి.
→ గణితంలో వస్తున్న నూతన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
2. గణిత ఉపాధ్యాయుని వృత్తిపరమైన విద్యార్హతలు :
→గణిత బోధనలో శిక్షణ పొంది ఉండాలి
→గుర్తింపు ఉన్న శిక్షణా కళాశాలలో శిక్షణ పొంది, గుర్తింపు ఉన్న పాఠశాలలో శిక్షణా కార్యక్రమంలో భాగంగా గణిత పాఠాలు బోధించి ఉండాలి,
→అవసరమైనప్పుడల్లా వృత్యంతర శిక్షణ పొందాలి
→ వర్క్ షాపులు, కాన్ఫరెన్స్ లు మొ|| వాటికి హాజరవుతుండాలి, గణితవ్యాసాలు, పుస్తకాలు రాస్తుండాలి
3.గణిత ఉపాధ్యాయుని గుణగణాలు :
→ గణితం పట్ల సంపూర్ణ అవగాహన, సాధికారత కల్గి ఉండుట
→ గణితాంశాల' పట్ల సమగ్ర పరిశీలన, పఠనం, స్వీయపఠనం చేయగలిగి ఉండాలి
→ గణితజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవాలి.
→ గణితం పట్ల విద్యార్థులను ఉత్సాహితులను చేయాలి
→ గణిత పట్ల విద్యార్థులకు ఆసక్తి కల్గించాలి. గణిత పరటాలను సృష్టంగా గీయగలగాలి
→ ఏ విషయాన్నైనా గణిత పరంగా, తార్కికంగా విశ్లేషించి చూడగలగాలి
→ తాను సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు సమయపాలన నేర్పాలి.
→ మర్యాదవూర్వకమైన చస్రధారణ, భాష, ప్రదర్శన కలిగి ఉండాలి
→ తనంతట తానుగా నమస్యలు రచించి వాటి సాధనకై విద్యార్థులను ప్రేరేపించాలి
→ మనోగణితం విద్యార్థుల నిత్యజీవితంలో భాగం చేయాలి
→ పాఠశాలలో గణిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి.
→ గణిత క్విజ్లు నిర్వహిస్తూ, గణిత క్లబ్లను నిర్వహిస్తూ, నందర్భానుసారంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం, మంత్రణం
చేయగలిగి ఉండాలి
→ ఈ లక్షణాలన్ని మూర్తిభవించిన వ్యక్తి ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు కాగలడు
నోట్ :- గణిత ఉపాధ్యాయుడు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య విద్యార్థులలో "అనక్తి"ని కలుగజేయుట
గణితం పట్ల ఆసక్తిని కలిగించుట :-
→ గణితం నిత్యజీవితంలో చాలా ఉపయోగకరమైన శాస్త్రం అని గణితం వాడనిదే ఏ రోజూ పూర్తికాదనే విషయాన్ని విద్యార్థికి
అర్థమయ్యేలా చెప్పాలి
→జీవిత అవసరాలు ఏ విధంగా తీరుస్తుందో, దైనందిన జీవితంలో గణితాన్ని ఎలా ఉపయోగిస్తుంటున్నామో చెప్పాలి.
→ చిక్కు ప్రశ్నలు, పజిల్స్, రిడిల్స్ ద్వారా గణితం అంటే ఇష్టాన్ని కలిగించాలి *
→ విద్యార్థులచేత బోధనాళ్యసన సామాగ్రి తయారు చేయించాలి *
→ బులెటిన్ బోర్డు నిర్వహణ ద్వారా
→ నల్లబల్లను వాడేట్లు ప్రోత్సహించాలి.
→ విద్యార్థుల ప్రతిభను ఎప్పటికపుడు గుర్తించి ప్రోత్సహించాలి.
→ గణిత చరిత్ర, గణిత శాస్త్రజ్ఞులు లాంటి విషయాలను సమయోచితంగా విద్యార్థులకు తెలపాలి.
→ గణితం నేర్చుకోవడం ద్వారా ఇతర అంశాలను నేర్చుకోవడం సులభతరం అవుతుందని గ్రహించేలా చేయాలి.
5.గణిత బోధనలో వైయుక్తిక భేదాలను గుర్తించి బోధన చేయుట :-
→ సాధారణంగా తరగతి గదిలో అధిక, సగటు, అల్ప ప్రజ్ఞా స్థాయి కల విద్యార్థులుంటారు.
→ వారి వారి అభ్యసనా వేగాలను బట్టి బోధిస్తూ ఉండాలి.
ఉదా :- 1) ఒక్కొక్క పెన్సిల్ వెల 5 రూ/- అయితే 10 పెన్సిళ్ళ వెల ఎంత? (అల్ప ప్రజావంతులు)
2) 5 వరుసల్లో 80 చెట్లను నాటాలంటే ఒక్కొక్క వరుసలో ఎన్ని చెట్లు నాటాలి? (సగటు ప్రజ్ఞావంతులు)
3) 100 గుడ్డ ఖరీదు 750/- అయితే 6 మీ గుడ్ల ఖరీదు ఎంత? (అధిక ప్రజ్ఞావంతులు)
6.విద్యార్థులు గణితంలో వెనుకబడుటకు కారణాలు - నివారణ మార్గాలు :
1) గణితం పట్ల ఆసక్తి లేకపోవుట :
→ గణితం యొక్క గొప్పదనాన్ని ఉపయోగాన్ని, గణితంలో ఉన్న చిక్కు ప్రశ్నలు, పజిల్స్, రిడి లను బోధించుట ద్వారా ఆనక్తి
పొందును.
2) గణితం తనకు అవసరం లేదు అనుకొనుట :
→ దైనందిన జీవితంలో సకల కార్యకలాపాలలో గణితం మన అవసరాలను ఎలా తీరుస్తుందో చెప్పుట
3) క్రమరహిత హాజరు:
→ తరగతి గది బోధన ఆసక్తికరంగా సాగించుట. కొట్టకుండా/ తిట్టకుండా ఉపాధ్యాయుడు మంచి ప్రవర్తనతో బోధించుట పాఠశాలకు రాకపోవటానికి గల కారణాన్ని అన్వేషించి సరిచేయుట.
4) ఉద్వేగ విషమయోజనం:-
→ విద్యార్థిలోని భయం, తొందరపాటుతనంలను పోగొట్టి, ధైర్యంగా ఏకాగ్రతతో చేసేలా చేయుట
5) ఉపాధ్యాయుని అనుచిత బోధన :
→ ఉపాధ్యాయుడు నూత్రం, సాధారణీకరణాలు తెలిపేటపుడు ఆగమన, నిగమనలను, సమస్యలను సాధింపజేసేటప్పుడు విశ్లేషణ సంక్షేషణ, నిత్యజీవిత అంశాలను బోధించేటప్పుడు ప్రకల్పనా పద్ధతులు లాంటి మంచి బోధనా పద్ధతులను ఉపయోగించి ఆసక్తిగా, అర్థవంతమైన బోధన చేయాలి.
6) ఉపాధ్యాయుని అనుచిత ప్రవర్తన :
గణిత ఉపాధ్యాయుడు ఓర్పు, సహనంతో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాన్ని బోధించాలి.
→ విద్యార్థులను వినుక్కోరాదు, సందేహాలు తీర్చుటలో చికాకు పడరాదు,
7) తరగతి గది ఆసక్తిగా లేకపోవుట :
→ తరగతి గదిని ఆసక్తిగా ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా చేయుట
8) ప్రాథమిక భావనలు/ పూర్వభావనలు లేకపోవుట :
→ విద్యార్థి గణితంలో ఏ స్థాయిలో ఏ ప్రాంతంలో అయితే పూర్వ భావనలు లోపించినచో గుర్తించి వాటిని సరిచేయుట ద్వారా
గణితాన్ని అభివృద్ధి చేయవచ్చు
9) వైయుక్తిక భేదాలు పట్టించుకోకపోవుట :
→ ఉపాధ్యాయుడు నిరంతర మూల్యాంకనం చేయుట ద్వారా విద్యార్థులలో అభ్యసనా భేదాలు గుర్తించి, వైయుక్తిక భేదాల ద్వారా
బోధన సాగించాలి.
10) శారీరక వైకల్యం
→ విద్యార్థులలో దృష్టి దోషాలుగానీ, వినికిడి బోషాలుగానీ ఉన్నపుడు విద్యార్థి గణితంలో వెనుకబడతాడు. ఇతర శారీరక వైకల్యాల వలన విద్యార్థి ఆత్మన్యూనతకు లోనవుతాడు
→ విద్యార్థిలో, ఆత్మన్యూనత పోగొట్టి అందరితో సమానంగా అభ్యసించేటట్లు చూడాలి. - శారీరక లోపాలను సరిచేయుటకు డాక్టరును సంప్రదించేట్లు చూడాలి
మానసిక వైకల్యం:
→ ఇటువంటి విద్యార్థులను తెలివిగల విద్యార్థులతో జత చేయటం ద్వారా కొంత వరకు లోపాలను సరిచేయవచ్చు
12) అననుకూల గృహవాతావరణం :
→ విద్యార్థికి గృహవాతావరణం సరిలేనపుడు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఈ లోపాన్ని సవరించాలి. అవసరమైతే ప్రత్యాస్నూయంగా ఏ విధుగా చదువును కొనసాగించాలో తెలియజెప్పాలి
13) వలసపోపుల :
→ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థిని ఒకే పాఠశాలలో వీలైనంతవరకు అభ్యసన సాగించేలా చేయాలి.
→ సీజనల్ హాస్టల్ సదుపాయాలు" వివరించాలి.
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించుట :-
→ ఉన్నతస్థాయి అంశాలు ఇచ్చి చదివించుట,
→ స్వంతంగా ప్రశ్నలు రాసే నైపుణ్యాన్ని కలిగించుట -
→ నూతన మార్గాలు అన్వేషించేట్లు చేయుట.
→ గణిత గ్రంథాల పఠనం, గణిత పత్రికల పఠనం అలవర్చుట.
→ బోధనాళ్యసన సామాగ్రి తయారుచేయుట
→ వారిచే గణిత నమూనాలు తయారు చేయించి ప్రదర్శన లిప్పించుట
→ ప్రతిభావంతులకు మండ అభ్యాసులకును జతచేర్చుట,
→ ఒలంపియాడ్స్, టాలెంట్ టెస్టు సన్నద్ధం చేయుట
→ పోటీ పరీక్షలకు సిద్ధం చేయుట మొ||వి.
→ చిక్కు ప్రశ్నలు, పజిల్స్, రిడిల్స్ పూర్తి చేయించుట మొ॥వి.
→ వీరికి ఉన్నత స్థాయి/ ప్రత్యేక కరికులమను అవలంబించుట.