అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞానశాస్త్రం స్వభావం మరియు పరిధిు






విజ్ఞానశాస్త్రం - అర్థం


→ విజ్ఞానశాస్త్రం - సైన్స్ అనే పదం లాటిన్ భాషలో "Scientia" or "Scire" అనే పదాల నుంచి వచ్చింది

→ "సైన్సియా" లేక సైర్ అంటే జ్ఞానం అని అర్ధం. ఈ పదం నుంచి విజ్ఞానశాస్త్రం అంటే "క్రమబద్ధమైన విజ్ఞానం" అని అనుకోవచ్చు

→ శాస్త్రం అంటే చేయడం అని అర్థం. కేవలం నమ్మకాలతో, ఊహలతో విషయ జ్ఞానం సంపాదించడం కాదు

→ నిరంతరం ప్రకృతిని గూర్చిన అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, పరిశోధనలు, ఆలోచనా విధానాలు ఉపయోగించారు. వీటన్నింటి ఫలితమే విజ్ఞానశాస్త్ర విజ్ఞానం.

→ శాస్త్రమనేది సంచిత జ్ఞానమే కాకుండా సమస్యలను పరిష్కరించే ప్రక్రియ కూడా. '.

విజ్ఞానశాస్త్రం-నిర్వచనాలు


→ శాస్త్రమనేది ఒక ఆలోచనా పద్ధతి - సమస్యా పూరణం, అందులో ఒక దృక్పథం, అందులో సమస్యా పూరణానికి ఉపయోగించే సాధన, ప్రకృతిలోని సంభవాలను పరిశోధించగా ఏర్పడే జ్ఞానం. - రిచర్డ్ సన్

→ విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం, దాని పూర్వ చరిత్ర, అందలి జీవ ప్రపంచం ఒక ముడి పదార్దమే - కార్ల్ పియర్ సన్

→ విజ్ఞానశాస్త్రమనేది స్పష్టమైన పరిశీలన ద్వారా, మార్పులు స్థితిగతులు నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా, దీనిని నిగమన పద్ధతిలో సంయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానమే విజ్ఞానశాస్త్రం. - లెక్సికన్ వెబ్ స్టర్ డిక్షనరీ

→ నిరంతరం పరిశీలనల ద్వారా భావనలను, సిద్ధాంతాలను రూపొందించడాన్ని శాస్త్రం అంటారు. ఈ భావనలు, సిద్ధాంతాలు భవిష్యత్ లోని పరిశీలనలకు లోబడి అవసరమైతే మార్పులు చేయబడతాయి. అందుకే శాస్త్రం అంటే జ్ఞాన సముపార్థనే కాక జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా - ఫ్రెడరిక్ ఫిట్జీ పాట్రిక్

→ విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞానశాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినది. -పాయింకేర్

→ శాస్త్ర అభివృద్ధిలో భావనలు, ప్రక్రియలు, పద్ధతులు, సామాన్యీకరణాలు ఈ మూడు ముఖ్య అంశాలు

→ శాస్త్ర నిర్మాణానికి భావనలు పునాది. పద్ధతులు, ప్రక్రియలు, అడ్డుస్తంభాలు, కొత్త పరిశీలనల ద్వారా కొత్త సామాన్యీకరణాలను ఏర్పరచడం మరొక నిలువుస్తంభం చేర్చడంలాంటిది.

→ విజ్ఞానశాస్త్రం శాస్త్రజ్ఞులచేత నిర్మించబడిన సత్యాలతో కూడినదిగా భావించబడుతుంది. అయితే విజ్ఞానశాస్త్రం కేవలం సత్యాలనే కాక, సాధారణీకరణాలు సిద్దాంతాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మార్పుకు అవకాశం ఉంటుంది

→ విజ్ఞానశాస్త్రం సత్యాలను మాత్రమే కలిగి ఉన్నది అని వివరిస్తే, అది విజ్ఞానశాస్త్రానికి ఘనరూపం ఆపాదించినట్లవుతుంది

→ విజ్ఞానశాస్త్రం ద్రవరూపం కూడా కలిగి ఉన్నట్లు భావించవచ్చు. ఎందువలనంటే కొత్త విషయాన్ని కనుగొనినప్పుడల్లా స్వరూపం మారుతుంటుంది

→ శాస్త్రజ్ఞులు విజ్ఞానశాస్త్రాన్ని ముఖ్యంగా రెండు కోణాలలో చూస్తారు

→ స్థబ్దదృష్టిలో విజ్ఞానశాస్త్రం అంటే యథార్థాలు భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు మాత్రమే. అంటే విజ్ఞానశాస్త్రం ఒక ఉత్పన్నం మాత్రమే

→ గతిశీల దృష్టితో చూసిన విజ్ఞానశాస్త్రం ఒక నిరంతర ప్రక్రియ

→ విజ్ఞానశాస్త్ర నిర్వచనాన్ని బట్టి శాస్త్రం యొక్క స్వభావాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.


→ శాస్త్రం = పద్ధతులు + జ్ఞానం
= ప్రక్రియ + ఫలితం
= జ్ఞానం + జ్ఞానం సముపార్జించే మార్గం
= శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ వైఖరి + శాస్త్రజానం



విజ్ఞానశాస్త్ర లక్షణాలు


→ విజ్ఞానశాస్త్ర లక్షణాలను షో ఆల్టర్ కింది విధంగా వివరించారు.
1) శాస్త్రం అనుభవాత్మకం,
2) శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే,
3) శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైంది,
4) శాస్త్రీయజ్ఞానం అసమానమైంది.
5) శాస్త్రీయాభివృద్ధి శాస్త్రీయ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది.
6) శాస్త్రీయజ్ఞానం పునరావర్తమై ఉంటుంది.
7) శాస్త్రీయజ్ఞానం పరిపూర్ణమైంది.
8) శాస్త్రం విలువలతో కూడింది.


→నిపుణుల అవిధ్యమీద నమ్మకం ఉంచడమే శాస్త్రం- రిచర్డ్ ఫైనామన్

→ విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి మూలం శాస్త్రీయ విధానమే.

→ శాస్త్రీయ పద్ధతిలో నమస్యను కనుక్కొన్న దగ్గరనుంచి సామాన్యీకరణం చేసేవరకు అనేక సోపానాలను వివిధ మనోవైజ్ఞానిక ఉపగమాలైన "తెలిసినదానినుంచి తెలియనిదానికి", "సులభం నుంచి కష్టమైన దానికి” 'సరళం నుంచి సంక్లిష్టతకు " "మూర్తం నుంచి అమూర్తానికి" మొదలయిన వాటిని అనుసరిస్తూ అనుసరిస్తూ జ్ఞానాభివృద్ధి చేయడమే విజ్ఞానశాస్త్ర లక్షణం

పరిసరాలపై విజ్ఞానశాస్త్ర ప్రభావం


→ విజ్ఞానశాస్త్రం మనచుట్టూ ఉండే భౌతిక వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది.

→ ఈ యుగానికి సంబంధించిన సాంఘిక సమస్యలైనా 'జనాభా సమస్య', 'దారిద్ర్య సమస్య, కాలుష్య సమస్య", శాంతి నెలకొల్పే సమస్యలను ఎదుర్కొని సాధించడం విజ్ఞానశాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది - వీన్ బర్గ్

విజ్ఞానశాస్త్ర పరిధి


→ తత్వశాస్త్రం అన్ని శాస్త్రాలకు తల్లివంటిది.

→ విజ్ఞానశాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుంచి విడివడి అది ఇంకా ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందింది.

→ బోధనాపరంగా విజ్ఞానశాస్త్రాన్ని రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి : 1) భౌతిక రసాయనశాస్త్రాలు, 2) జీవశాస్త్రాలు

→ భౌతిక రసాయన శాస్త్రాలు : భౌతికశాస్త్రంలో పదార్థాలు, శక్తి శక్తిమార్పులు గురించి వివరించబడుతుంది. రసాయనశాస్త్రంలో పదార్థ రచన, పదార్థ రచనలో మార్పులు వివరించబడుతుంది

→ జీవశాస్త్రాలు : జీవ, భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. వృక్ష, జంతుశాస్త్రాల కలయికే జీవశాస్త్రం

విజ్ఞానశాస్త్ర నిర్మాణం :-

→ విజ్ఞానశాస్త్ర నిర్మాణం - రకాలు : విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని దాని విధానం, ఉత్పత్తుల ఆధారంగా కింది విధంగా పేర్కొనవచ్చునని స్వాబ్, పినిక్స్ తెలిపారు. అవి

→ సంశ్లేషాత్మక నిర్మాణం : శాస్త్రజ్ఞులు అవలంభించే పద్ధతులు, ప్రక్రియలు, శాస్త్రజ్ఞుల వైఖరులు ఆనేవి సంక్లేషాత్మక నిర్మాణంలోనికి వస్తాయి

→ ద్రవ్యాత్మక నిర్మాణం :- ప్రాయోగికజ్ఞానం, సిద్ధాంత పరిజ్ఞాన్థం, శాస్త్రజ్ఞుల పరిశోధనలు, పరిశోధనల ఫలితంగా పిర్పడే జ్ఞానమే విజ్ఞానశాస్త్ర ఫలితంగా చెప్పవచ్చు

→ ద్రవ్యాత్మక నిర్మాణం : విజ్ఞానశాస్త్ర ఉత్పత్తుల సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణం.

→ క్రమబద్ధమైన జ్ఞానాన్ని 1) ప్రాయోగిక జ్ఞానం, 2) సిద్ధాంత పరిజ్ఞానం అనే రెండు ముఖ్య భాగాలుగా విడదీయవచ్చు

ఎ) యదార్థాలు (సత్యం) :-

→ ఒక భౌతిక వస్తువు / యదార్ధ సంఘటనను వివరించే ప్రవచనం యదార్ధం

→ దేనినైతే ప్రత్యక్షంగా చూడగలమో, అలా చూడబడిన విషయం ఎన్నిసార్లయినా నిరూపించబడితే అది యథార్థం / సత్యం" - జేమ్స్ బి.కొన్నెట్

→ ఇతని ప్రకారం యదార్థం ఈ లక్షణాలను కలిగి ఉండాలి.
1) ప్రత్యక్షంగా పరిశీలింపదగినదిగా ఉండాలి
2) ఎన్నిసార్లైనా, ఎవుడైనా ప్రదర్శించగలిగి ఉండాలి.
3) వివాదరహితంగా ఉండాలి.
4) మారనిదిగా ఉండాలి


→ దేనికైతే ఆస్థిత్వం ఉందో, ఏదైతే జరిగిందో, ఏదైతే తగిన ఆధారాలతో ఋజువు చేయబడుతుందో అదే యథార్థం

→ యథార్థాలన్నీ కూడా శాస్త్రీయ సత్యాలు కానేరవు. ఎందుకంటే ఏ సత్యమైతే శాస్త్రీయ పద్ధతి ద్వారా ఋజువు చేయగలమో దానినే శాస్త్రీయం అంటారు.

→ శాస్త్రీయ సత్యాలు హెచ్చు విశ్వసనీయతను కలిగి ఉంటాయి మరియు హెచ్చు లక్ష్యాత్మకతను, సప్రమాణతను కలిగి ఉంటాయి.

→ శాస్త్రీయ సత్యాలన్నీ ఎల్లవేళలా సత్యాలని చెప్పలేం. ఎందుకంటే తదుపరి పరిశోధనల్లో ఇవి పాక్షిక సత్యాలు కావచ్చు లేదా పూర్తి అసత్యాలు కావచ్చు.

→ అందువలన శాస్త్రీయ సత్యాలు ఎల్లపుడూ చైతన్యవంతంగానూ, మరియు వాటి విశ్వసనీయతను చాటడానికి పరీక్షలకు సిద్ధంగానూ ఉంటాయి.

→ ఉదా:- 1) భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది
2) గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది.
3) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు
4) భూమి పరిశ్రమణానికి 365.25 రోజులు పడుతుంది
5) ఆక్సిజన్ గాలికన్నా తేలికైనది.
6) కాంతి వేగం 3 x 1010 సెం.మీ./సె.


బి) భావన:-

→ కొన్ని యథార్థాల ఆధారంగా ప్రకృతిలో జరిగే విషయాలపై ఏర్పరచుకొనే అభిప్రాయమే భావన

→ఆ విషయానికి సంబంధించిన అనుభవాలు పెరిగిన కొద్దీ భావనలు మారుతుంటాయి.

→ ఉదా :- 6 సం|| బాలుడికి ఆవు /పిల్లిపై ఒక భావన ఉంటే, 10 సం॥ల బాలుడికి వేరుగా ఉండవచ్చు.

→ వారి వారి అనుభవాలను బట్టి భావనలో తేడాలు వస్తుంటాయి

→ వైజ్ఞానిక భావనలు లక్ష్యాత్మకతను కలిగి ఉండి స్థాపించబడిన నియమాలకు లోబడి ఉంటాయి.

→ నోట్:- ఒక భావన ఏర్పడాలంటే కనీసం రెండు సత్యాలు అవసరం మరియు వాటి మధ్య నంబంధం ఉండాలి.

→ నోట్ :- సత్యాలు అందరి ఆస్తి, కానీ భావనలు ఎవరు సంపాదించుకుంటే వారి ఆస్తి అగును

→ ఒక ఆలోచనను తెలిపే / ఒక భావాన్ని తెలిపే ఒక సాధారణ వివరణను భావన అంటారు.

→విద్యార్థులలో సరైన భావనలు ఏర్పడేలా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిదే.

→ ఉదా:-
i) కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి
ii) స్థితిని బట్టి పదార్థాలు మూడు రకాలు
iii)రసాయన చర్య జరిగే విధానాన్ని' అనుసరించి రసాయన చర్యలు అనేక రకాలు
iv)ఆధారం, భారం, బలం, స్థానాలననుసరించి తులాదండాలు 3 రకాలు

సి) సామాన్యీకరణాలు:-

→ యథార్థాలను ఒక చోట కూర్చినపుడు అవి మాదిరి సంబంధాలను సూచిస్తాయి. ఈ మాదిరి సంబంధాలనే సామాన్యీకరణం అంటారు

→ సత్యాల మధ్య పరస్పర సంబంధం ఏర్పరచగలిగితే అది భావన. ఈ భావనలను నియమబద్ధం చేసి వివరించగలిగితే అవి సాధారణీకరణాలు / సామాన్యీకరణాలు

→ రెండు లేదా అంతకన్నా ఎక్కువ భావనల మధ్య సంబంధం లేదా సాన్నిహిత్యాన్ని తెలిపేది సాధారణీకరణం

→ సాధారణంగా ఆగమన, నిగమన, విశ్లేషణల ద్వారా సాధారణీకరణాలు ఏర్పడును
ఉదా :-
1) మేఘాలు ఆవరించినపడల్లా వర్షం వస్తుందనే భావన
2) భూమి నుండి పైకి పోయిన కొలదీ ఉష్ణోగ్రత తగ్గును.

డి)పరికల్పన :-

→ పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహానే పరికల్పన అంటారు

→ ప్రకృతిలో మనం చూసే సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలకు సమాధానంగా చేసే ఊహలే పరికల్పనలు.

→ దత్తాంశాల ఆధారంగా నమస్యా పరిష్కారానికి తాత్కాలికంగా సంభావ్య ప్రాకల్చన రూపొందించాలి. ఇది పరీక్షించండి, పరీక్షకుని సమస్యకు సమాధానం అగును.

→ ఋజువైన పరికల్పన కొత్త సూత్రాలు, సిద్ధాంతాలు కనుగొనటానికి తోడ్పడును.

శూన్య పరికల్పన :-

→ రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం లేదని చేసే పరికల్పన శూన్య పరికల్పన
ఉదా :-
1) నీటి లోతుకు పీడనానికి సంబంధం లేదు
2) ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం పడడానికి ఎలాంటి సంబంధం లేదు

ప్రకటనాత్మక పరికల్పన :-

→ రెండు చేతుల మధ్య సంబంధం ఉంటుంది అని తెలిపే ప్రకటనాత్మక పరికల్పన

→ ఉదా :-

→ నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉంది

→ ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం పడడానికి సంబంధం ఉంది

3. ప్రాగుక్తిక పరికల్పన :-

→ జరుగబోయే సంఘటనలు ఊహించి చేసే పరికల్పనలే ప్రాగుక్తిక పరికల్పనలు

→ ఉదా :- 1) నీటి లోతుకు, పీడనానికి సంబంధం ఉండొచ్చు.
2)ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం రావడానికి సంబంధం ఉండొచ్చు.
4.ప్రశ్న పరికల్పన :-

→ ప్రశ్నరూపంలో ఉండేది ప్రశ్నా పరికల్పన

→ ఉదా:- 1) నీటి లోతు పెరుగుతుంటే నీటి పీడనం పెరుగుతుందా ?
2) ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం రావడానికి ఏమైనా సంబంధం ఉందా ?

ఇ) సిద్ధాంతం:-

→ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్నాల ఫలితాలే సిద్ధాంతాలు
ఉదా :-
1) అయస్కాంత సిద్ధాంతాలు,
2) కాంతి స్వభావ సిద్ధాంతాలు,
3) ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం

ఎఫ్) నియమాలు :-

→ విస్తారంగా పరీక్షించబడి, రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతాలను నియమం అంటారు

→ ఇవి సప్రమాణతను కలిగి ఉంటాయి

→ ఇవి రెండు యదార్థాల మధ్య సంబంధాన్ని వివరిస్తాయి
ఉదా :- 1) న్యూటన్ నియమం
2) ద్రవ్య నిత్యత్వ నియమం

g) సూత్రం :-

→ అనేక ఉదాహరణలతో విస్తారంగా పరిశీలించిన తర్వాత ఏర్పడిన సాధారణీకరణమే సూత్రం
ఉదా :- ఆర్కిమెడిస్ సూత్రం, ప్లవన సూత్రం

హెచ్) ప్రయోగం :

→ విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగం పునాది

→ ఒక పరికల్పనను వివరించాలంటే ప్రయోగం
1) అనుమితి :-

→ యథార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయటాన్ని అనుమితి అని చెప్పవచ్చు

→ అనుమితులను ఋజువు చేయటం ఒక నైపుణ్యం

→ ఆటపాటల ద్వారా, అనేక కృత్యాల ద్వారా పిల్లల్లో ఈ అనుమితి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు

→.శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధనాలు - ప్రక్రియలు

→ ప్రయోగాత్మకంగా, సిద్ధాంతరీత్యాగానీ పరికల్పనల వివరాలను సూత్రీకరించుటలో సహాయపడేది - వద్దతులు

→ శాస్త్రీయ అన్వేషణలో ముఖ్యమైన భాగం - వైఖరులు ప్రాథమిక / మౌలిక శాస్త్రీయ నైపుణ్యం - పరిశీలన

→ ప్రయోగం దేనితో ప్రారంభమగును - పరిశీలన

→ ఒక సంఘటన ఎందుకు జరుగుతుందో ఊహించుట - పరికల్పన

→ జరుగబోయే సంఘటనలు ఊహించుట - ప్రాగుక్తీకరణ

→ ఒక ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సర్వసాధారణ స్వభావం గల సత్యాలను రాబట్టుట - అనుమితి చేయుట

→ విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని వివరించినది - స్వాబ్, ఫినిక్స్

→ విజ్ఞానశాస్త్ర ప్రభావాన్ని / ఉపయోగం చెప్పినది -వీన్ బర్గ్

→ విజ్ఞానశాస్త్ర లక్షణాలను చెప్పింది - షో అల్టర్

→ యథార్థాలు → భావనలు → సామాన్యీకరణాలు ఏర్పడును

→ పరికల్పనలు → సిద్ధాంతాలు → నియమాలు

→ సూక్ష్మం చేసిన సాధారణీకరణమే / గుర్తులతో కూడిన సాధారణీకరణే - సూత్రం



→ ఈ ప్రక్రియా నైపుణ్యాలను రెండురకాలుగా విభజించవచ్చు
i) మౌలిక ప్రక్రియలు
ii) సమకాలీన ప్రక్రియలు

a) మౌలిక ప్రక్రియలు :- జ్ఞానేంద్రియాల నుపయోగించి వస్తువు గురించి గానీ, సంఘటన గూర్చి గానీ చేసే ప్రక్రియలే మౌలిక ప్రక్రియలు

→ పరిశీలన : ఇది ప్రాథమిక శాస్త్రీయ నైపుణ్యం, ప్రకృతిలో సాగించిన అన్వేషణా ఫలితం విజ్ఞానశాస్త్రం. ప్రకృతిపై మన పరిశీలన ఎంత నిశితంగా ఉంటే విజ్ఞానశాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుంది.
→ పరిశీలన రెండు రకాలు : -
1. బాహ్య పరిశీలన,
2. ప్రయోగ పరిశీలన


→ వర్గీకరణం : వివిధ వస్తువులను, సంఘటనలు విడివిడిగా వర్ణిస్తే సాధారణీకరించడం కష్టమవుతుంది. అందుకే విజ్ఞానశాస్త్రంలో వర్గీకరణం ముఖ్యపాత్ర వహిస్తుంది. వస్తువుల మధ్య సాదృశ్యాలను, వ్యత్యాసాలను గుర్తించి వస్తువులను సరైన క్రమంలో ఏర్పాటు చేయడం వర్గీకరణ
→ దేశకాల సంబంధాలు ఉపయోగించడం : వివిధ సంఘటనలు, స్థలం (లేదా) కాలాలను బట్టి ఏవిధంగా మారుతాయన్న విషయాన్ని అన్వేషించాలి
→ పరిమాణీకరించడం పొడవు, బరువు, ఘనపరిమాణం, వైశాల్యం, కాలం వంటి రాశులను నరైన ప్రమాణాలలో తెలియజేయడం, సరిమాణీకరించడం వల్ల ప్రకృతి వ్యవస్థను మరింత సున్నష్టంగా ఆర్థం చేసుకోవచ్చు
→ కొలవడం : వివిధ భౌతిక రాసులను కొలవడానికి వివిధ ప్రమాణాలు పాడతాము. పదార్లాల బరువు, ఘనపరిమాణం సాంద్రత, వేర్వేరు పనులు చేయడానికి పట్టే కాలం, ఉష్ణోగ్రత ఈ విధంగా ఎన్నో అంశాలను ఖచ్చితంగా కౌలవడం శాస్త్ర అభ్యసనలో ప్రముఖ నైపుణ్యం
→ ప్రసారం చేయడం : శాస్త్రజ్ఞులు తాము కనుగొన్న విషయాన్ని ప్రపంచానికి అర్ధవంతంగా తెలియజేయాలంటే భావ ప్రసారం చాలా ముఖ్యం.
→ ప్రాగుక్రీకరించడం : జరుగబోయే సంఘటనలు ఊహించడమే ప్రాగుక్తీకరించగం. ప్రయోగాలు చేసే ముందు జరుగబోయే పరిమాణాలు ముందుగా ఊహించినట్లైతే దానికి కావలసిన జాగ్రత్తలు శాస్త్రజ్ఞులు తీసుకోవడానికి వీలవుతుంది
→ అనుమతిని రాబట్టడం : ప్రత్యేక స్వభావం గల సత్యాలనుంచి సర్వసాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించవచ్చు. ఆగమన, నిగమన పద్ధతుల ద్వారా అనుమతిని రాబడతాము.

బి) సమకాలీన ప్రక్రియలు :-
→ దత్తాంశాలను నియంత్రించడం' : ప్రకృతిలో జరిగే అనేక సంఘటనలలో ఒకటి కంటే ఎక్కువ అంశాలు (కారకాలు) ప్రభావం చూపుతుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఒక అంశం ప్రభావాన్ని వరక్షించేటప్పుడు రెండవ అంశ ప్రభావాన్ని నియంత్రించగలగాలి.
→ దత్తాంశ వ్యాఖ్యానం : సేకరించిన సమాచారాన్ని బట్టి దత్తాంశాలను వ్యాఖ్యానించడం ద్వారా పరిశోధనలు ముందుకు సాగుతాయి. ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి, విశ్లేషించి, ప్రతిక్షేపించడాన్ని దత్తాంశ వ్యాఖ్యానం అంటారు
→ పరికల్పన ప్రతిపాదన : మనసుకు తట్టే ఊహయే వాదం కాబట్టి దానికి రుజువుగాని, సాక్ష్యంగానీ, లేదు. కాకపోతే వాదం సరియైనదా కాదా అని రుజువు చేయడానికి వీటైనదిగా ఉండాలి
→ ప్రయోగం చేయడం : ప్రయోగం పరిశీలనతో ప్రారంభమవుతుంది. తర్వాత సరిగ్గా కొలవడం, రీడింగులు తీసికోవడం ఇలా అన్ని ప్రక్రియలను కలిపి చేసే ప్రక్రియ ప్రయోగం

b) శాస్త్రీయ పద్ధతి :-
→ శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అనవచ్చు
→ ప్రయోగాత్మకంగా గానీ, సిద్ధాంతరీత్యా గాని, పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో సహాయపడేది శాస్త్రీయ విధానం
→ శాస్త్రీయ విధానం ద్వారా శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు అలవడతాయి

శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉన్న అంశాలు : -
1. సమస్యను గుర్తించడం
2. సమస్యను విశ్లేషించడం
3. పరిశీలన
4. పరికల్పనలు ప్రతిపాదించడం
5. పరిశోధన ప్రయోగాల నిర్వహణ
6. సంశ్లేషణ - విశ్లేషణ
7. సిద్ధాంత సూత్రీకరణ
8. సిద్ధాంత రూపకల్పన

సి) శాస్త్రీయ వైఖరులు :-
→ పరిశోధన ఏదైనా అది పరిశోధన చేసే వ్యక్తి యొక్క శాస్త్రీయ వైఖరులపై ఆధారపడి ఉంటుంది
శాస్త్రీయ వైఖరులు కలిగిన వ్యక్తి లక్షణాలు :-
→ విశాల దృక్పథం కలిగి ఉండటం
→ లక్ష్యాత్మకతను కలిగి ఉండటం
→ సహనశీలురుగా ఉండటం
→ పుస్తక పఠనం లో ఆసక్తి కలిగి ఉండుట
→ సందేహాత్మక భావం కలిగి ఉండటం
→ సత్యం పై ఆధారాలు , నమ్మకాలు కలిగి ఉండటం
→ పరాజయానికి జంకకపోవడం
→ సత్యాలనే నమ్మటం
→ స్వతంత్ర ఆలోచనా ధోరణి కలిగి ఉండటం
→ కుతూహలం తో ప్రయోగాలు నిర్వహించటం
→ మూఢనమ్మకాలు లేకపోవడం
→ మనసులో ఉంచుకున్న భావనల యొక్క ఫలితాల కోసం వేచి ఉండటం
→ ఏ విషయాన్నైనా గ్రుడ్డిగా నమ్మకపోవడం
→ సునిశిత పరిశీలన
→ ప్రతి సంఘటనకు కారణాలు వెతకడం



విజ్ఞానశాస్త్ర చరిత్ర - అభివృద్ధి


→ నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న నమన్యలను సాధించడంలోను ప్రపంచం ఎదుర్కొంటున్న నమన్యలను సాధించడంలోను విజ్ఞానశాస్త్రం, సాంకేతికశాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది .
→ శాస్త్రం అంటేనే చేయడం, కాబట్టి విజ్ఞానశాస్త్రం వలననే మనిషి ప్రగతి సాధించాడని చెప్పవచ్చు విజ్ఞానశాస్త్రం ఆవిర్భావం మానవుడి ఆవిర్భావంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు
→ ప్రాచీన శిలాయుగానికి చెందిన నియాండర్తల్ మానవుడు ఆహారం కోసం, జంతువులను వేటాడటానికి రాతితో ఆయుధాలను తయారుచేయడం, వాటిని ఉపయోగించడం నేర్చుకొన్నాడు,
→ నియోలిథిక్ మానవులు అంటే నవీన శిలాయుగానికి చెందిన మానవుడు వ్యవసాయం చేయడం, జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం, జంతువుల చర్మాలతో దుస్తులు తయారుచేసుకోవడం, గృహాలను నిర్మించి సమూహాలుగా జీవించడం నేర్చుకున్నాడు
→ విజ్ఞానశాస్త్ర ఆభివృద్ధి క్రీస్తుశకానికి 5 మిలియన్ల సం||ల పూర్వం జరిగిందని యూఘ్రటిస్, నైలు నది తీర ప్రజల నాగరికతను పరిశీలిస్తే అర్థమవుతుంది.
→ చరిత్ర ప్రకారం మానవ నాగరికత మెసొపొటేమియా, ఈజిప్టు మరికొన్ని ప్రదేశాలలో ప్రారంభమైందని చెప్పవచ్చు -విజ్ఞానశాస్రాభివృద్ధిలో గ్రీకులు ప్రముఖపాత్ర వహించారు
→ మనిషి రోగాలకు స్వాభావిక కారణాలుంటాయి. మానవుడి శరీరానికి వాటిని బాగుచేసుకొనే శక్తి ఉంటుందని హిష్పోక్రటీస్ బోధించాడు
→ ఆరిస్టాటిల్ ప్రముఖ జీవశాస్త్రవేత్త. అశడు విజ్ఞానశాస్త్రంలో జ్ఞానాన్ని వర్గీకరించి తద్వారా పరిశీలన ప్రాధాన్యతను గుర్తించడం అత్యావశ్యకమని చూపాడు.
→ భారతదేశములో విజ్ఞాన శాస్త్రాభివృద్ధి: బుగ్వేదంలో వ్యాధులు, వీటిని తగ్గించే మూలకాలను గూర్చి వివరించడం జరిగినది.
→ 'వైశేషిక' అనే ఉపనిషత్ లో అణువుల గురించి, భూమి ఏర్పడిన విధానాన్ని గూర్చి వివరించబడినది.
→ కపిల' రాసిన సంఖ్యా సిద్ధాంతములో డార్విన్ తెలియజేసిన సిద్ధాంతాలు వివరింపబడి ఉన్నాయి
→ మెటీరియా మెడికాలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నోరకాల జంతువులు, మొక్కలను గురించి వివరించారు.
→ 1,2, 3... 10 అనే అంకెలను భారతదేశంలో మొదటిసారిగా వాడారు.
→ గణితశాస్త్రంలో గొప్ప విప్లవాత్మక ఘట్టంగా దీనిని వర్ణిస్తారు. - 0 వాడకం, దశాంశ పద్ధతి రూపొందించడం
→ ఆర్యభట్ట - II విలువను నాలుగు దశాంశాల వరకు ఖచ్చితంగా కనుగొన్నాడు
→ యజుర్వేదం 27 నక్షత్రాల గురించి వివరించినది.
→ శతపథ బ్రాహ్మణం అనేక ఖగోళ విషయాల గూర్చి వివరించినది..
→ విశ్వచంద్ర రచించిన విశిష్ట సిద్ధాంతంలో ఆకాశం 12 భాగాలుగా విభజించినట్లు చెప్పబడినది
→ ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాలపరిమితి 12 ఊచల చక్రంగా వివరింపబడినది
→ అధ్వరణ వేదంలో 5 సం||ల కొకసారి వచ్చే 13వ నెల గూర్చి వివరించబడినది
→ ఆర్యభట్ట రచించిన 'ఆర్యభట్టీయం' ఖారతీయ భోగళ శాస్త్రానికి పునాది
→ ఆర్యభట్టీయంలో కాల విభజన పట్టిక, భూత్రమణ సిద్దాంతం, ఖగోళ స్థిరాంకాలు, గ్రహాల స్థానాలను వివరించారు
→ క్రీ.పూ. 476లోనే ఆర్యభట్ట సూర్య కేంద్రక సిద్ధాంతానికి పునాదులు వేశారు
→ భిన్నము యొక్క ప్రస్తావన ఋగ్వేదంలోను, వేద సంహితలోను కన్పిస్తుంది
→ రసాయనశాస్త్రం, లోహశాస్త్రాలలో ప్రావీణ్యుడైన నాగార్జునుడు 'రసరత్నాకరం' అనే గ్రంథంలో స్వేదనం, ఎర్రని నల్లని రెడ్ సల్ఫేట్, లోహ సంగ్రహణ విధానము, ఉత్పతనము వంటి వాటి గురించి వివరించాడు.
→ చరకుడు రాసిన చరక సంహితలో చర్మవ్యాధులు, మూత్రపిండ వ్యాధుల రోగ నిర్ధారణ విధానాలున్నాయి
→ అలాగే వాత, పిత్త, శ్లేష్మ దోషాలపరంగా రోగ నిర్ధారణ చేయడం, వాటికి అనుగుణంగా ఔషధ ధాతువులను నిర్ణయించడంలో చరకుడు శ్రద్ధ వహించాడు.
→ సుశ్రుతుడు రచించిన నుత్రుత సంహితలో రెడీనా, హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ నర్జరీలకు కావాల్సిన వరికరాల నివరాలున్నాయి
→ భూమి ఆకర్షణ గురించి 7వ శతాబ్దంలోనే బ్రహ్మగుప్తుడు తెలియజేశాడు.
→ వకధ కాత్యాయినీ అనే శాస్త్రవేత్త భౌతిక ప్రపంచం యొక్క అణు నిర్మాణాన్ని గూర్చి వివరించాడు
→ బ్రహ్మ, గుప్తుడు చతుర్భుజాలకు, ప్రభుతాలకు వైశాల్యం కనుగొనే విధానాలను తెలియజేసాడు.

శాస్త్రవేత్తగ్రంథం
వరాహమిహరుడుపంచ సిద్ధాంతం
బ్రహ్మ గుప్తుడుబ్రహ్మస్పుట సిద్ధాంతం, ఖండఖద్యక
మహావీరుడుగణిత సార సంగ్రహం
భాస్కారాచార్యుడులీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి
శ్రీధరాచార్యుడుత్రిశతిక

→ విలియం జోన్స్ 1784లో కలకత్తాలో రాయల్ ఎసియాటిక్ సొసైటీని స్థాపించాడు.
→ 1687 నుండి 1887 వరకు గల కాలం భౌతికశాస్త్ర యాంత్రిక యుగంగా పిలువబడుతుంది
→ 1828లో యునాని ఆయుర్వేద వైద్యం బోధించడం ప్రారంభించారు
→ బ్లాక్ హాల్స్ పై పరిశోధనకుగాను సుబ్రమణియన్ చంద్రశేఖర్ 1987లో నోబెల్ బహుమతి వచ్చింది

కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు, అన్వేషణ - చారిత్రిక అంశాలు

ధామస్ అల్వా ఎడిసన్ :-

→ ఈయన 1847లో ఆమెరికాలోని ఒహియోలోని మిలన్ లో జన్మించారు

→ మెన్లో పార్క్ ప్రాంతములో 1879 డిసెంబర్ లో మొదటిసారిగా విద్యుత్ బల్బును ప్రదర్శించి 1880 జనవరి 27న పేటెంట్ పొందాడు.

→ పేటెంట్ పొందిన ఆయన మొదటి వరికరం: ఓటు యంత్రం

→ స్టాక్ టిక్కర్ (స్టాక్ మార్కెట్ కోసం), ఫోనోగ్రాఫ్, విద్యుత్ రైళ్ళు, ఖనిజం వేరుచేసే (192లను కనుగొన్నాడు

→ ఇతనిని క్రొత్త పరికరాలు తయారు సృష్టించే మంత్రగాడు అని పిలిచేవారు

→ మొత్తం 1069 వస్తువుల తయారీకి పేటెంట్ పొందాడు.

→ 1890లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో సభ్యునిగా ఎన్నికయ్యాడు.

→ 1887లో మెటుచ్చే మెడల్ పొందాడు.

→ ఎడిసన్ ప్రయోగాలపై విమర్శలు చేసిన వ్యక్తి నికోవా టెస్లా

→ ఈయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 11ను 1983 నుంచి అమెరికాలో నేషనల్ ఇన్వెస్టర్స్ డే (జాతీయ పరిశోధకుల దినోత్సవం)గా జరుపుకుంటున్నారు

ఆల్బర్ట్ ఐన్ స్టీన్:-

→ ఈయన 1879లో సౌత్ జర్మనీలో ఉల్మ్ లో జన్మించారు.

→ ఈయన జాకోబ్ ద్వారా గణిత శాస్త్రంపై కాజర్ కోచ్ ప్రభావంతో సైన్స్ పై మక్కువ పెంచుకున్నాడు.

→ 1905లో తన ప్రఖ్యాత ధియరి ఆఫ్ రెలిటివీటి (సాపేక్షతా సిద్ధాంతం)ను ప్రతిపాదించాడు - శక్తి నుంచి ద్రవ్యరాశిని ఉత్పత్తి చేయవచ్చని ఐన్ స్టీన్ నిరూపించాడు.

→ మాక్స్ ప్లాంక్ సిద్ధాంతం E = MC2 ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తూ ఈ సిద్ధాంతం వినియోగించి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం ను వివరించాడు.

→ థియరి ఆఫ్ ఎలిటివిటీని జర్మనీ నుంచి ఆంగ్లంలోని తర్జుమా చేసి మొత్తం ప్రపంచానికి తెలియడానికి తోడ్పడినది - సత్యేంద్రనాథ్ బోస్

→ 1915లో ఐన్ స్టీన్ పెద్ద పెద్ద నక్షత్రముల వద్దకు కాంతి కిరణం వెళ్ళినపుడు అది వంగి ప్రయాణిస్తుందని తెల్పగా దానిని ఎడ్డింగ్ టెన్ రుజువు చేశాడు

→ 1921లో ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది

→ ఈయన ప్రజ్ఞా పాటవాలకు గుర్తుగా ఒక మూలకానికి 'ఐన్స్టేనియా' అని పేరు పెట్టడం జరిగింది.

సర్.సి.వి.రామన్:-

→ ఈయన 1888లో తమిళనాడులోని తరుచునాపల్లిలో జన్మించారు

→ ఫిలసాఫికల్ మ్యాగజైన్, లండన్లో 1906లో రానున్ పరిశోధనా పత్రం ప్రచురించబడినది

→ 1909లో నేచర్ పత్రికలో తరంగాలు, కంపనాలు గురించి రెండు పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి.

రామన్ ఎఫెక్ట్ :-

→ వేరు వేరు పదార్ధాలలో ఒకే కాంతిని పతనమయ్యేటట్లు చేసినపుడు బయటి వెలువడే పరిక్షేపక వర్ణపటం చారలలో ఉండే తేడానే రామన్ ఎఫెక్ట్ గా పేరు గాంచినది.

→ 1928 లో ఈయన విషయాన్ని ప్రతిపాదించగా 1930లో నోబెల్ బహుమతి వచ్చింది.

→ 1924లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో సభ్యుడిగా ఎన్నిక.

→ 1929లో బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ (సర్) బిరుదు ప్రధానం

→ 1928లో ఇటాలియన్ సొసైటీ ఆఫ్ సైన్స్ వారిచే మెట్టుచ్చే మెడల్ ప్రధానం

→ 1954లో భారతరత్న బిరుదు దక్కింది

→1958లో లెనిన్ శాంతి బహుమతి

→ ఈయన సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి ఆసియా ఖండవాసి.

→ 1970 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ స్మారకోపన్యాసం చేశారు

లూయీపాశ్చర్:-

→ ఈయన 1822లో ఫ్రాన్స్ లోని డోలో జన్మించారు.

→ ఈయన స్పటికాల నిర్మాణంపై పరిశోధన చేస్తూ సోడియం అమ్మోనియం టార్ట్రేట్, ఇస్తూ ఖైరల్ స్పటికాల గురించి వివరించాడు

→ కార్న్ బెర్నార్డ్ తో కలిసి పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టాడు పట్టు పురుగులకు వచ్చే వ్యాధుల పైన, కోడిపిల్లలకు వచ్చే కలరా వ్యాధిపై ఎనిరోబియాసిస్ పై వరిశోధనలు చేశాడు

→ పెంపుడు జంతువులలో ప్రబలే ఆంత్రాక్స్ వ్యాధికి మందు కనిపెట్టాడు.

→ 1880లో కుక్కకాటు వల్ల వచ్చే రాబిన్ వ్యాధికి మందు కనిపెట్టి జోనఫ్ మైనస్టర్ అనే బాలునిపై ప్రయోగించి సఫలీకృతుడయ్యాడు

గ్రెగర్ జోహన్ మెండల్ :

→ ఈయన 1822లో ఆస్ట్రియాలో జన్మించాడు.

→ 1856 నుండి 1863 వరకు బఠాని మొక్కలపై పరీక్షలు జరిపి రెండు సిచ్చాంతాలను ప్రతిపాదించాడు. అవే మెండల్ అనువంశిక సూత్రాలుగా పేరుపొందాయి.

→ ఈయన మూత్రనాళ వ్యాధితో మరణించాడు.

ఎల్లాప్రగడ సుబ్బారావు:-

→ ఈయన 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించారు
ఈయన పరిశోధనాంశాలు: -

→ కండరాల పనితీరుపై ఎడినోసిస్ టైఫాస్ఫేట్ (ATP) చర్య

→ విటమిన్ B9 (బోధకాలు) హెట్రజాన్ మందు కని పెట్టాడు.

→ 1945లో మొట్టమొదటి ఆంటిలయాటిక్ టెట్రాసైక్లిన్, ఆరియోమైసిన్లను కనిపెట్టాడు.

→ న్యూక్లియోటైడ్స్ వంటి, ఇతర పరిశోధనలు.

→ టెట్రాసైక్లిన్ ప్లేగు వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా ఉపయోగపడింది.

→ ఈయనను అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు (Wizard of the Wonder Drugs) గా పిలుస్తారు