అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సూక్ష్మ బోధన ( Micro Teaching )











→ సూక్ష్మబోధన విధానాన్ని 1980 దశకంలో అమెరికాలో స్టాన్ఫోర్డ్ (Srurvford) విశ్వవిద్యాలయంలో డ్వైట్. దబ్యు, ఎల్లన్ (Dwight, wollen), రాబర్ట్ బుష్ (Robert Bush), కీర్ ఎక్సన్ (Keith Elsan|లు రూపొందించారు. మనదేశంలో బరోడాలోని "సెంటర్ ఫర్ ఎడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్" (CASE) లో సూక్ష్మబోధనపై పరిశోధనలు జరిగాయి.

→ మనదేశంలో మైక్రోటీచింగ్ పై పరిశోధన చేసిన వారిలో డా.పాసి (Dr 8.K.P.assi), జంగీరా ప్రముఖులు.


సూక్ష్మబోధన - నిర్వచనాలు :-

→తరగతి పరిమాణంలో, తరగతి కాలంలో తగ్గించబడిన వ్యూహమే నూక్ష్మబోధన - సూక్ష్మబోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానం, ఇందులో స్వల్పకాల వ్యవధిలో, స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు

- Dwight, W.Allen

→ నిర్దుష్టమైన బోధనా నైపుణ్యాలనుపయోగించి ఒకే ఒక భావన (పాఠ్య విషయసంబంధిత) ను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు.

-B.K.Passi and M.S.Lalitha

→ సూక్ష్మబోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. ఇది బోధనాభ్యాసాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి, తరగతి కాలాన్ని తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన, ఎక్కువ నియంత్రణ చేయబడిన వ్యూహంగా తుస్తుంది. "

- Clift

→ ఉపాధ్యాయ శిక్షణా విద్యలో నిర్ణయించిన సమయంలో, నిర్ణయించిన తరగతి గదిలో, నిర్ణీతమైన విద్యార్థుల సంఖ్యతో నిర్వచించబడ్డ బోధనా నైపుణ్యాలను, ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసిన పాఠ్యవధకాల ఆధారంగా 5 లేదా 10 నిమిషాల సమయంలో టేపుల్లో బోధనాధ్యయన విధానాన్ని చూసుకోవడానికి వీలుగా అమలు జరిపే ఉపాధ్యాయ శిక్షణలో సాంకేతికవరంగా



నిర్వహించే ఒకే ప్రక్రియ.- M.B.Buch




సూక్ష్మబోధన - విధానం :-


→ నూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని నంక్షిష్టతలను తగ్గించడానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది

→ సూక్ష్మబోధనలో పాఠ్యాంశాన్ని బోధించే సమయం, తరగతిలోని విద్యార్థుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటాయి - సూక్ష్మబోధన పద్ధతిలో ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్యాంశంలోని ఒక భావనను బోధించడానికి ఒక సూక్ష్మమైన బోధనా నైపుణ్యాన్ని

అభ్యసిస్తాడు.

→ ఉపాధ్యాయ విద్యార్థి 5 - 10 మంది విద్యార్థులకు, 5 - 10 నిమిషాల్లో బోధిస్తాడు. ఉపాధ్యాయ విద్యార్థి బోధన అనంతరం

పరిపుష్టిని పొందుతాడు.


బోధనా నైపుణ్యాల విశ్లేషణ :-

భారతీయ విద్యావేత్త B.K.Passi బోధనా వ్యవస్థను విశ్లేషించి 197గలో 13 బోధనా నైపుణ్యాలను ప్రతిపాదించాడు

1) బోధనా లక్ష్యాలు - స్పష్టీకరణాలు రాయడం (Writing instructional objectives)

2) పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టే స్థాయి (Introducing a lesson)

3) ధారాళంగా ప్రశ్నించడం (Fluency in questioning)

4) అన్వేషణాధార ప్రశ్నలు (Probing questions)

5) వివరించడం (Explaining)

6) ఉదాహరణలు ఇవ్వడం (Illustrating with examples)

7) ఉద్దీపన చరత్వం (Stimulus variation)

8)నిశ్శబ్దం, శాబ్దికేతర సూచనలు (Silence and Non-verbal clues)

9) పునర్బలనం (Reinforcement)

10 .విద్యార్థుల భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం (Increasing pupil participation)

11)నల్లబల్లను వినియోగించడం (Using Blackboard)

12) ముగింపు (Achieving closure)

13 ) విద్యార్థుల సంసిద్ధతా ప్రవర్తన (Recognising attentive behaviour)




మైక్రోటీచింగ్ కార్యక్రమంలోని సోపానాలు :-

1.నైపుణ్యం హాజరు పరచడం

2.నైపుణ్య ప్రదర్శన

3.మైక్రో టీచింగ్ వాతావరణాన్ని సృష్టించడం

4) బోధన లేదా నైపుణ్య అభ్యాసం

5) పునఃపథక రచన, పునఃబోధన పునఃపరిపుష్టి

6) పై చక్రాన్ని పునరావృతం చేయడం



మైక్రోటీచింగ్ ను బోధన పునఃబోధనా శిక్షణా చక్రం అని కూడా అంటారు



సూక్ష్మబోధన ప్రయోజనాలు

→ ఉపాధ్యాయ విద్యార్థికి తాను చేసే పనిని గురించి సరైన అవగాహన ఉంటుంది. అంటే బోధనా ప్రక్రియ ఎందుకోసం చేస్తున్నాడు

→ ఏమి బోధిస్తున్నాడు అనే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది

→ సాంప్రదాయక బోధనలో క్వాలిటీ పెరుగుతుంది

→ వివిధ బోధనా సామాగ్రిని ఉపయోగించడంపై అవగాహన ఏర్పడుతుంది

→ పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం వల్ల బోధన సులభమవుతుంది.

→ బోధనను అంచనా వేయడంలో సాంకేతిక లక్ష్యాత్మక పద్ధతి ఉంటుంది

→ క్రమశిక్షణా రాహిత్యాన్ని అరికట్టవచ్చు

→ మైక్రోటీచింగ్ శిక్షణా సమయంలో ఇతర ఉపాధ్యాయ విద్యార్థులే పరిశీలకులుగా ఉండవచ్చు. అందువల్ల వారికి కూడా లోపాలను గుర్తించే అవకాశం ఉంటుంది

→ మైక్రోటీచింగ్ శిక్షణా వలయం వల్ల తిరిగి పాఠ్య పథకాన్ని, బోధనా విధానాన్ని నవరించుకోవడానికి అవకాశం ఉంది


సూక్ష్మబోధన పరిమితులు :-

→ సూక్ష్మబోధనలో ఉపయోగించే పరికరాలు ఖర్చుతో కూడినవి - ఒకే నైపుణ్యం (Skill) ఆధారంగా బోధించడం కృత్రిమమైంది.

→ నూక్ష్మబోధనకు ఎక్కువ సమయం అవసరమవుతుంది.

→ ఇది నైపుణ్యాల అభ్యసనానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. మైక్రోటీచింగ్ శిక్షణ మాత్రమే పాఠ్యబోధనకు సరిపోతుందన్న భావన సరైంది కాదు

→ అనేక మంది కళాశాల అధ్యాపకులు కూడా ఈ శిక్షణ పొంది ఉండకపోవచ్చు




సూక్ష్మ బోధన (Micro Teaching) :-



→ స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎ.డబ్లయడ్వై ట్ ఎలెన్, కీత్ ఏక్ సన్ పరిశీలనల ఆధారంగా, 1963లో నూక్ష్మబోధన

విధానాన్ని ప్రవేశ పెట్టినాడు / రూపొందించినాడు.

→ సూక్షమబోధన అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రిటన్, నెదర్లాండ్స్, మొదలైన దేశాలలో ప్రవేశపెట్టడమైనది.

→ మనదేశంలో 1967లో నూక్ష్మబోధనను D.D. తివారిచే ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల అహ్మదాబాద్ లో ప్రారంభించడమైనది.

→ 1976 Dr. B.K.L పాసీ తన గ్రంథమైన 'Becoming Better Teaching Micro Teaching Approach" లో వివిధరకాలు అయిన బోధనానైపుణ్యాలను Model lessons తయారుచేశారు.

→ 1977 Dr.N.L. డోపాస్ "Modification of Teacher. Behaviour through Micro Teaching" అనే గ్రంథాన్ని వ్రాశారు.


సూక్షబోధన నిర్వచనాలు:

→ సూక్షబోధన తరగతి పరిమాణంలోను, కాలంలోను, కుదించబడిన ఒక ఎదురెదురు బోధనావ్యూహం" - ద్వైట్ ఎలెన్

→ సూక్ష్మబోధన అంటే బోధనా నైపుణ్యాలను స్పష్టంగా నిర్వచించి, జాగ్రత్తగా తయారుచేయబడిన పాఠ్యాంశాలకు అన్వయించి చిన్న సమూహంతో విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాలలో బోధించి, దాని ఫలితాలను వీడియోటేప్ల ద్వారా వరిశీలించడానికి అవకాశం కల్పించి అనుమతి ఇచ్చే బోధనా సాంకేతిక విధానం - ఆర్.ఎస్. బుష్

→ తక్కువమంది విద్యార్థులు తక్కువ సమయంలో, నిర్దేశిత బోధనా నైపుణ్యాన్ని వినియోగించి ఉపాధ్యాయ విద్యార్థులు ఒక భావాన్ని బోధించే తిక్షణాపద్ధతినే నూక్ష్మబోధన అంటారు. - పాసీ మరియు లలిత

→ "సూక్ష్మబోధన ఒక ఉపాధ్యాయుడు చిన్న పాఠ్యాంశాన్ని తీసుకొని 5 మంది విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల సమయంలో

కుదించి బోధించే ఒక ఎదురెదురు వ్యూహ రచన" - *విల్.సి.సింగ్


→ సూక్ష్మబోధన అనే పదం ఉపాధ్యాయ విద్యార్థుల ని్పాదనను నరళీకరించిన పరినరాలలో, తరచుగా క్లోజ్ సర్క్యూట్

టెలివిజన్ ను ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టి అందించే ప్రక్రియ" - మెక్ అలెన్ & యుర్ విన్



సూక్ష్మబోధన - సోపానాలు (Steps in Micro-Teaching) :-

1.నైపుణ్యాన్ని నిర్వచించడం

2. నైపుణ్య ప్రదర్శన

3. సూక్ష్మ పాఠ్య ప్రణాళికను తయారుచేయడం

4).సూక్ష్మ పాఠాన్ని బోధించడం

5) పరిపుష్టి / పునర్బలనము / Feed back

6) పునఃపథక తయారీ

7) పునఃబోధన

8) పునఃపరిపుష్టి




→ పై విధం ఒక నైపుణ్యం తర్వాత మరొక నైపుణ్యాన్ని ఎన్నుకొని బోధనకు అవసరం అయిన అన్ని నైపుణ్యాలను ఒక్కొక్కటిగా

పొందడమే సూక్ష్మబోధన.

సూక్ష్మబోధన ముఖ్య లక్షణాలు

1) సూక్ష్మ అంశాలు

2) బోధగా నైపుణ్యాలు -బోధనా ప్రక్రియలు

ఎ) బోధనకు ముందు నైపుణ్యాలు

బి) బోధనా నైపుణ్యాలు

సి) బోధనానంతర నైపుణ్యాలు

3.పరిపుష్టి అంశం

4.సు రక్షిత అభ్యననాక్షేత్రం

5) బోధనా నమూనాలు



సూక్షబోధనలో దశలు :-

→ జె.సి. క్లిఫ్ సూక్ష్మబోధనలో అభివృద్ధి చేయవల్సిన అంశాలను ముఖ్యంగా 3 దశలుగా విభజించాడు

1.జ్ఞాన సముపార్జన దశ

2. నైపుణ్య సముపార్థన దత

3. బదిలీ దశ


సూక్ష్మబోధన - బోధనా నైపుణ్యాలు

1. 1969వ సంవత్సరంలో 'ఎలెన్ - రేయాన్' విద్యాతత్త్యవేత్తలు 14 బోధనా నైపుణ్యాలను గుర్తించారు

పాఠ్యాంశ బోధనా ప్రణాళిక దశలు :-

1.పాఠ్యాంశ పరిచయ దశ

2.పాఠ్యాంశ బోధన దశ

3.గ్రహించిన విషయాలను ఉపయోగించే దశ

4.అంతిమ దశ లేక ముగింపుదశ


సూక్షబోధనా ప్రయోజనాలు:-

1) బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చే ఒక ప్రయోగశాల

2) అభ్యసనం చేసేటప్పుడు సమయాన్ని, విద్యార్థుల సంఖ్యను, విషయ పరిధిని నియంత్రించడం బోధన సులభం అవుతుంది

3) విద్యాబోధన లక్ష్యాత్మకంగా మారుతుంది

4) ఉపాధ్యాయ శిక్షణ వ్యక్తిగతంగా జరుగుతుంది

5) బోధనా నైపుణ్యంలో ప్రావీణ్యం పొందడానికి అవసరం అయిన శిక్షణ


సూక్ష్మబోధనలో పరిమితులు :-

1) అభ్యసనకు ప్రాధాన్యం ఇస్తుంది. విషయానికి, ఖావనలకు కాదు

2) 6 - 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి

3. ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల కొరత

4) పరిపుష్టి అందించే ఆడియో, వీడియో సామాగ్రి అధిక వ్యయంతో కూడినది.

5) పూర్తి బోధన అనేది సంక్లిష్టం, నైపుణ్యాలు విడదీయలేదు

6) కాలనిర్ణయపట్టికకు అంతరాయం కల్గుతుంది.


గణిత వ్యాసక్తులు ఉపయోగాలు :-

పాఠశాల వెలుపలి జీవశాస్త్ర కృత్యాలు:- ప్రాముఖ్యత :-

→ తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను బయటి ప్రదేశాలలోని విషయాలతో పోల్చుకుని నమైఖ్యపరచుకోవటం వల్ల విద్యార్థులలో

అభివృద్ధి జరుగును

→ ప్రత్యక్షానుభవాల ద్వారా ప్రకృతిని ప్రశంసిస్తూ, ఆశూర్హ విషయాలను కూడా అవగాహన చేసుకోగలడు

→ ప్రకృతి పరిశీలన, ప్రకృతి అధ్యయనం ద్వారా జీవరాశులు, జీవన విధానాలు, జీవసమతుల్యత మొ॥ ప్రక్రియలను గూర్చి

సంపూర్ణ జ్ఞానం పొందును

ఉదా :- 1) గుబురు వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ గూర్చి తెలుసుకొనుట

2.ఆకు ఆకారాలు, పత్ర అంత్య భాగాలను గూర్చి తెలుసుకొనుట

3.బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన కలిగే వ్యాధుల లక్షణాలను గూర్చి క్షేత్ర పర్యటనలు చేసి తెలుసకొనుట

4. పక్షులు , వాటి అవయవ నిర్మాణం, వాటి నివాసం, ఆహారపు అలవాట్లు, వలసపోవటం మొ||వి



కృత్య పత్రం:-

→ కృత్యాన్ని నిర్వహించే విధానాన్ని ఒక పేపరుపై సూచనల రూపంలో రాసి ప్రతి జట్టుకు విడి విడిగా ఆందజేయాలి దీనినే

"కృత్యపత్రం" అంటారు

కృత్య కోశం :-

→ కృత్యపత్రం, కృత్యం నిర్వహించటానికి కావలసిన సామాగ్రి నమోదు పత్రాలు మొదలైన వాటిని విడిగా ఒక కవర్లో వేసి

ఉంచాలి. దీనినే "కృత్యకోశం" అంటాం,

కృత్యపత్రంలో 4 భాగాలుంటాయి.

→ 1.కృత్యం పేరు

2 .కావలసిన సామాగ్రి

3. కృత్యం చేసే విధానం

4.ప్రశ్నలు




కృత్యాలు - నిర్వహించుటలో ఉపాధ్యాయుడు ఎదుర్కొనే సమస్యలు :-

→ భావోద్రేకాలను అణచటానికి కృత్యాలు

→ విద్యార్థుల సామాజిక అవసరాలు

→ వ్యక్తిగత భేదాలు, సామర్థ్యాలు, అభిరుచులు

→ నిర్దేశిత అధ్యయనం

→ అభ్యసనానుభవాలను సమైక్య పరచటానికి (సిద్ధాంతం - ఆచరణకు)


మనోగణితం:

→ సమన్యలను మనస్సులోనే సాధన చేసుకోవటమే మనోగణితం

→ మనోగణన చేయటం వల్ల సమస్యను వేగంగా చేయటం, జ్ఞాపకశక్తి పెరగటం, మెదడును చురుకుగా పనిచేయటం అవగాహనా శక్తి, ఏకాగ్రత, కల్పనా, వివేచనా శక్తులు, బౌద్ధిక ఆలోచనలు, అంతరదృష్టి అభివృద్ధి చెందును

→ ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానసంబంధ నైపుణ్యాలు పెరుగును

→ మనోగణితంలో వట్టున్నదేశాలు ఇండియా, చైనా, జపాన్

→ మనదేశంలో హ్యూమన్ కంప్యూటర్ గా పేరొందినది . శకుంతలాదేవి

→ పుట్టుగుడ్డి అయిన ఎల్. సంజీవయ్యశర్మ గణితంలో ప్రసిద్ధుడు


→ నిశ్చల్ నారాయణం 132 ఇంకెలు గల సంఖ్యను ఒక్క నిమిషంపాటు అవధానం చేసి అదే క్రమంలో చెప్పి 7 అంతకుముందు అలాగే 76 అంకెల సంఖ్యను చెప్పి వరల్డ్ రికార్డు సృష్టించిన 35 ఏళ్ళ దామిన్కి ఓబ్రాయిన్ (ఇండోనేషియాను ఓడించాడు

- నిత్యజీవితంలో అమ్మణాలు, కొనడాలు, జీతం, సరుకుల కొనుగోలు అన్నింటిలో ఉపయోగిస్తాం.

నోట్ :- 1) ప్రతిరోజు 52 - 10 ని॥ వరకు మనోగణిత సమస్యలు చేయించాలి దురం, ఐరుపు, వైశాల్యం, ఘనపరిమాణం, కాలం, వస్తువుల సంఖ్య మొ|

ఉదా :- రెండు రెట్లు చేయుట, వర్గం చేయుట

2) జీవితంలో ఎదురయ్యే విషయాలపై అంచనాలు వేయాలి

ఉదా :- దూరం, బరువు, వైశాల్యం, ఘనపరిమాణం, కాలం, వస్తువుల సంఖ్య మొ||వి

3) మనోగణిత అభివృద్ధికి క్విజ్, మౌఖిక పరీక్షలు ఉపయోగించాలి.

4) మనోగణితలకి సంబంధించిన సాహిత్యాన్ని పరిచయం చేయాలి

5.వైయుక్తిక భేదాలను బట్టి అభ్యానం చేయించాలి

6) సూత్రాలు, నియమాలు వల్లె వేయించాలి

7.భాజనీయతా సూత్రాలు, ఎక్కాలు మొ॥ వల్లె వేయించాలి

8) అబాకస్న ఉపయోగించి సమస్యలను వేగంగా చేసే నైపుణ్యాలు కలిగించాలి

ఇండియా-వేదగణితం

చైనా-గణిత కళ

ఉక్రెయిన్ -ట్రాక్టర్గ్ సీడ్ సిస్టమ్ ఆఫ్ మేథమేటిక్స్ (ట్రాక్టిన్బర్గ)

జపాన్- కుమాన్ గణితం మొ॥ వాటిని పరిచయం చేయాలి




మనోగణితం-గుణాలు:

→సమస్యలను వేగంగా చేయటానికి

→ మెదడును చురుకుగా ఉంచటానికి

→ ఏ పరికరం అవసరం లేకుండా సమస్యలను సాధించుట నూతన ఆలోచనలకు తావిస్తుంది

→ పిల్లల్లో పోటీతత్వం పెరుగును వారిలో విశ్లేషణా శక్తి, నూతన పద్ధతులను, నూతన రూపాలను అన్వేషించుటకు

→ అంతరబౌద్ధిక అభ్యసన జరుగును

→ అంతరదృష్టి పెంపొందును

→ వారిలో సమస్యలు చేయటంలో ప్రేరణ కలిగిస్తుంది

→ క్లిష్టమైన సమస్యల సాధనలో అందుకు తగ్గ సవాళ్ళను ఎదుర్కొనే ఆత్మస్టెర్యం పొందును. ఆత్మతృప్తి అనందాన్ని పొందుతాడు గణిత భావనలను మూడు రూపాల్లో వ్యక్తపరుస్తాం. :

1) మౌఖిక పని

2) రాతపని

3) పటరూపంలో



1.మౌఖిక పని:-

→ గణిత అభ్యసనంలో మాట్లాడడం, చర్చించటం, వివరించటం, చదపటం, ప్రశ్నించటం, చెప్పటం, మనోగణ చేయటం, ఇలా

ఎన్నో మౌలిక వ్యాసక్తులు గణితాభ్యననానికి దోహదపడతాయి


మౌఖిక వ్యాసక్తుల ఉపయోగం :-

1.పునఃస్మరణ చేసుకోవడానికి

→ బోధించిన విషయాలను / విద్యార్థి నేర్చుకున్న విషయాలను ఒకసారి సమీక్షించి విద్యార్థులను ప్రశ్నించటమో. చర్చించడమో చేసి వారికి గుర్తు తేవదానికి

2.చదవడం:-

→ సమస్యను చదవడం, అర్థవంతంగా చదవడం

→ ఉదా :- సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు, సిద్ధాంతాలు



3. తిరిగి చెప్పించటం :-


→ విద్యార్థులు అభ్యసించిన గణిత భావజాలాన్ని, సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు స్థిరపరచటానికి ఒకటికి రెండుసార్లు

కంఠస్థం చేయటం / వల్లె వేయించటం ద్వారా అభ్యసనం జరుగును.

4.పునర్విమర్శ :-

→ నేర్చుకున్న విషయాలు ఎంతవరకూ నేర్చుకున్నాడో విద్యార్థిని ప్రశ్నించటం వారు సమాధానాలు చెప్పటం జరుగుతుంది నోట్ :- ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను మదింపు చేయుటకు, మౌలిక పరీక్షలను ఉపయోగిస్తున్నాం

5.కారణాలు తెలియజేయడానికి

→ సమస్యను సాధించుటలో విద్యార్థులకు ఏ సోపానం ఎందుకు ఉపయోగించారో తెలుపుటకు


ప్రయోజనాలు:-

→ కన్నులకు, చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందిస్తుంది • మౌలిక పని ద్వారా సమయాన్ని పొదుపు చేయవచ్చు

→ ఉపాధ్యాయుడు ప్రస్తుతాంశాన్ని వివరిస్తూ, వారికి కలిగే సందేహాలను తీర్చుటకు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించవచ్చు

→ బోధన స్థిరీకరణ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు

→ ఉచ్చారణ దోషాలను సరిచేయవచ్చు

→ వేగం, ఖచ్చితత్వాన్ని పెంపొందించవచ్చు

→ విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవర్చవచ్చు ఈ పద్ధతి ద్వారా విద్యార్థులలో ఆలోచించటం, వేగంగా గణించటం, మానసిక చురుకుదనం అభివృద్ధి చెందుతాయి



లోపాలు :-

→ దీనిని సరిగా ఉపయోగించకపోతే త్వరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది

→ క్లిష్టమైన సమస్యలను ఈ పద్ధతి ద్వారా సాధించలేం

→ ఇది ఎక్కువగా విద్యార్థి జ్ఞాపకశక్తి పై ఆధారపడును

→ విద్యార్థులు ఏకాగ్రతను నిలపలేకపోతే, మంచికన్నా కీడు జరుగును నియమబద్ధ ఆలోచనను పెంచుకోనల్లేతే దీనివల్ల ఫలితం ఉండదు

→ ఉపాధ్యాయుడు అధిక ఉత్సాహాన్ని ప్రదర్శించి ఎక్కువగా ఉపయోగిస్తే విద్యార్థుల ఏకాగ్రత



గణితం - రాతపని:-

→ రాతపని అనేది క్రమబద్ధమైన అలవాటుకి, కచ్చితత్వానికి ఎంతో అవసరం

→ గణితంలో రాతపనికి చాలా ప్రాధాన్యత కలదు

→ గణితానికి ఒక ప్రత్యేకమైన సంజ్ఞలు, సంకేతాలు, గుర్తులు, పారిభాషిక పదాలతో కూడి ఉంది. అందువల్లన గణిత విషయాలను

→ రాతపూర్వకంగా వ్యక్తం చేయుటలో ఎటువంటి ఇబ్బంది లేకుండా శిక్షణనివ్వాలి

ఉదా:- 1) సంఖ్యలు - సంజ్ఞలు సరిగా రాయటంలో 2) సంఖ్యకు తగ్గ సంజ్ఞలు రాయటం



3.సంఖ్యలను వరుస క్రమంలో రాయటం

4.నంఖ్యలను స్థాన విలువల ప్రకారం రాయించుట

5. గణనలు చేసేటపుడు పరిక్రియలు, సోపానాలు క్రమపద్ధతిలో రాయుట

6.రాత సమస్యల సాధనకు పోపానాల యుక్తంగా వాక్య రూపంలో రాయుట

7. విద్యార్థులు పరిశీలనలు, అనుభవాలు, ఆలోచనలు రాతరూపంలో పెట్టటం


రాతపని - జాగ్రతలు:

→ స్పష్టత, శుభ్రత ఉండాలి

→ ఒక క్రమ పద్ధతిలో సంపూర్ణ వాక్యాలను తార్కిక క్రమంలో ఉంచాలి

→ అవసరమైన చోట నిర్దేశాలు, మూలం రాయాలి - సమస్యా సాధనలో వాడే పద్ధతులు, విధానాలు ఎంపికచేసి కారణాలు తెలపాలి

→ యూనిట్లు / ప్రమాణాలు సూచించాలి

→ చిత్తుపటాలు / చిత్తుపని ప్రక్కన కేటాయించిన స్థలంలో రాయాలి.

నోట్ :- 1 - 3 తరగతులకు గళ్ళ నోట్ పుస్తకం

4-5 తరగతులకు కట్ నోట్ పుస్తకాలు వాడాలి




రాత పని - ప్రయోజనాలు:-

→ అభ్యసించిన విషయాలపట్ల స్పష్టత వస్తుంది

→ అభ్యసించిన విషయాల పట్ల మనస్సులో స్థిరంగా ఉండిపోవును

→ మన ఆలోచనా విధానాన్ని / నమస్యా పరిష్కార విధానాన్ని ఇతరులకు తెలియజేయటానికి అనువైనది సాక్ష్యం

→ విద్యార్థులు చేసే పనులు గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు.

→ విద్యార్థుల పనిని ఒక క్రమ పద్ధతిలో చేయటం, ఆలోచించే అలవాటు, మానసిక క్రమశిక్షణ అలవడును విద్యార్థులు నమస్యా సాధనను తార్కికంగా సమర్పించటానికి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి

→ క్లిష్ట సమస్యల సాధనకు తోడ్పడును

→ పరీక్షలు రాయుటకు సిద్ధం చేయును

→ చేసిన సమస్యలు, రాసుకొన్న గణితాంశాలు, సమీక్షించుకోవడానికి, గుర్తుకు తెచ్చుకోవటానికి

→ విద్యార్థులను ఉపాధ్యాయుడు మదింపు చేయటానికి వీలగును

→ మౌలిక పని మొదటి రూపం అయితే రాతపని తుది రూపం

నోట్ :- *చదవటం వలన సంపూర్ణ మానవుడు, సంభాషించటం వలన సన్నద్ధమైన మానవుడు, రాయటం వలన ఖచ్చిత

మానవుడు"గా రూపొందుతాడు

కోడ్ :- స్పష్టత ఇచ్చితత్వం స్థిరత్వం శాశ్వతం క్రమశిక్షణ, క్రమబద్ధ అలవాటు సాక్ష్యం మొ॥ పదాలు రాతవనిని తెలియజేయును



గణితం- ఆవర్తన పని (డ్రిల్లింగ్) :-

→ గణిత అభ్యసనలో భావనలు, సూత్రాలు, నియమాలు, ప్రక్రియల పట్ల జ్ఞానం పొందటం ఎంత ముఖ్యమో వాటిని పటిష్ట

పరచుకోవటం అంత ముఖ్యం

→పునరావృతానికి కల్పించే అనుభవాలనే "ఆవర్తవని" అంటారు గణితంలో విషయావగాహనతోపాటు ఆవర్తం కూడా అవసరమే

→ గణితంలో సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు, సమస్య సాధనా పద్ధతులు, సిద్ధాంతాలు, ప్రక్రియలు ఎక్కువకాలం

→ గుర్తుండడానికి "ఆవర్తనం" తప్పనిసరి

→ ఆవర్తన పని అభ్యాస నియమాల్లో ధార్నడైక్ ప్రతిపాదించిన "అభ్యాస నియమం ప్రకారం' పనిచేయును గణితంలో అన్ని విషయాల్లోనూ 'ఆవర్తపని' అవసరమే



ఆవర్తన పని-వినియోగం:

→ ఆవర్తన పని ఇచ్చే ముందు ఆ విషయంపై అవగాహన కల్పించాలి

→ఆవర్తన పని ఉపయోగం విద్యార్థులకు తెలియజెప్పాలి

→అవర్తన పని తొలిదశలో కొద్దికొద్దిగా ఇస్తూ స్థాయిని పెంచాలి (10 - 15 ని॥లు)

→ ఆవర్తన పని సామర్థ్యాలకనుగుణంగా ఇవ్వాలి

→ఆవర్తన పని సాధించగలిగినదై ఉండాలి

→ఆవర్తన పని ఇచ్చేముందు తగిన సూచనలు, ఉదాహరణలు ఇవ్వాలి

→ ఆవర్తన పని చిన్న చిన్న భాగాలుగా కాకుండా మొత్తం ప్రక్రియగా అవగాహన చేసుకోవటమే తోడపడాలి

→ఆవర్తన పనిలో తప్పులు సరిదిద్ది సవరణాత్మక బోధన చేయాలి

→ ఆవర్తన పనిలో వేగం, ఖచ్చితత్వం పెంపొందించేట్లుందాలి

→ ఆవర్తవనిని సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా ఇవ్వాలి

→ ఆవర్తన పని వీలైనంత వైవిధ్యంగా ఉండాలి

→ ఆవర్తన పనిని సాధ్యమైనంత వరకూ ప్రయోగశాల పద్ధతి, కృత్యాధార, ప్రాజెక్ట్ పద్ధతులలో ఇవ్వాలి - పునర్విమర్శ అభ్యాసాలు, పాఠ్యపుస్తకాలలోని అభ్యాసాలు ఖచ్చితంగా చేయించాలి

ఉపయోగాలు :-

→ ఆవర్తన పని ద్వారా వేగం, ఖచ్చితత్వం పెరుగును - ఆవర్తన పని ద్వారా సమస్యా సాధనలో నైపుణ్యాలు పెరుగును

→ఆవర్తన పని ద్వారా వివిధ సన్నివేశాలలో ఎలా ప్రతిస్పందించాలో తెలుపును - ఆవర్తన పని ద్వారా సమస్యలకు ప్రతిస్పందన అనేది అనుకోకుండా కలుగును

→ ఆవర్తన పని వలన సమస్యల పట్ల వెచ్చించే కాలం, శ్రమ పొదుపు అగును



వేగం - ఖచ్చితత్వం :-

→ గణితానికి "వేగం - ఖచ్చితత్వం" రెండు కళ్ళులాంటివి. ఒకే నాణేనికి గల బొమ్మ - బొరుసులాంటివి విడదీయలేనివి.

వేగం :-

→ గణితదంలో నమస్యా సాధనా వేగాన్ని సూచించడం లేదా ప్రామాణికరించుట కష్టం

→ ఈ వేగం, విద్యార్థుల మానసికస్థాయి, నమస్య కాలిన్యతాస్థాయి, నమన్య సాధనా విధానం, నసమస్య నిడివి మొ వాటిపై

ఆధారపడి, ఉండును

వేగంలో ఇబ్బందులు :-

→గణన నైపుణ్యాలు లేకపోవుట

→ఎక్కాలు, సూత్రాలు, నియమాలు గుర్తుంచుకోకపోవటం

→సమస్యను అర్థం చేసుకోలేకపోవటం

→అలోచనలో స్పష్టత లేకపోవటం / తికమకపడడం

→సరైన విధానాన్ని ఉపయోగించకపోవటం

→ అతృతకి గురికావడం ఏకాగ్రత లేకపోవటం

→చేసే సమస్యను ఒక క్రమపద్ధతిలో చేయకపోవటం

వేగం - అభివృద్ధి చర్యలు :-


→ గుణకార పట్టీలు, ప్రాథమిక సూత్రాలు, నియమాలు, ఇవర్తనపని డ్వారా ఉపయోగించటం (డ్రిల్లింగ్)

→ అందగుర్తులు ఉపయోగించుట ద్వారా

→ సులల / సరళమైన పద్ధతులు ఎంపిక చేసుకొనుట ద్వారా

→మనోగణనలోని మెళకువలు ఉపయోగించుట ద్వారా

→ సమస్యా పరిష్కారానికి ఉపయోగించే వ్యూహాలు తెలిసి ఉండటం ద్వారా

→ క్విజ్ లు, స్పీడ్ టెస్ట్ పోటీలు నిర్వహించుట ద్వారా

→ విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుట ద్వారా

→ సమస్యా సాధనలలో కాలాన్ని నిర్దేశించుట ద్వారా / కాలపరిమితి

→ సమస్యా సాధనలో ఒక క్రమపద్ధతిని పాటించుట, అంకెలు, సోపానాలు రాయుటలో స్పష్టత కలిగి

→ సమస్యల జవాబులను అంచనా వేసుకోవటం, నరిచూసుకోవటంలో నైపుణ్యం

→ సమస్యా సాధనలో గణిత గుర్తులు, సంకేతాలు ఉపయోగించుట- ద్వారా

→ అవసరమైన చోట ఉపకరణాలు వాడుట ద్వారా

→ వీలైనంత వరకూ ఉపకరణాలు వాడకుండా మనోగణితాన్ని ఉపయోగించుట ద్వారా

→ వైయుక్తిక భేదాలననుసరించి సమస్యలను సాధింపచేయుట ద్వారా


ఖచ్చితత్వం - లేకపోవటానికి కారణాలు :-

→ విద్యార్థి ఆలోచనలో స్పష్టత లేకపోవుట ఏమిచ్చారు ? ఏమి చేయాలి ? ఎలా చేయాలి ? అనే వాటిపట్ల స్పష్టత లేకపోవుట

→ రాతపని సరిగ్గా లేకపోవుట ఒక పద్ధతి ప్రకారం రాయకపోవటం

→ గణన నైపుణ్యాలు లేకపోవుట, గణనలో తప్పులు చేయటం

→ సాధన ద్వారా వచ్చిన జవాబును సరిచూసుకునే అలవాటు లేకపోవుట

ఖచ్చితత్వం - అభివృద్ధి చర్యలు :

→ ఇచ్చిన సమస్యను స్థూల దృష్టితో అవగాహన చేసుకొనుట

→విద్యార్థులు రాతపనిలో సాధనకు ఉపయోగించే సోపానాలను తర్కబద్ధంగా క్రమణద్ధంగా రాసేలా చూడడం

→రాతలో శుభ్రత, స్పష్టత పాటించేటట్లు అలవాటు చేయాలి

→ విద్యార్థులలో గణన నైపుణ్యాలు పెంపొందించాలి

→విద్యార్థులు ఎక్కడ తప్పులు చేస్తున్నారో విశ్లేషణ చేసి సవరణాత్మక బోధన చేయాలి.

→విద్యార్థులు నమస్యల జవాబులను సరిచూసుకొనే పద్ధతులు, మెళకువలు నేర్పాలి

→విద్యార్థుల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గ మనో గణితం, సంక్షిప్త పద్ధతులలో ప్రవేశం కల్పించుట

→మౌలిక భావనలు, నైపుణ్యాలు, ప్రక్రియలు పట్ల సంపూర్ణ అవగాహన కల్గించుట

→ సరళ సమస్యల నుంచి క్లిష్ట సమస్యలను ఒక పద్ధతి ప్రకారం చేయటం అలవాటు చేయాలి

→ విద్యార్థులు మౌఖిక గణనలు, ఉపకరణాలు వాడుటలో ప్రవేశం కల్పించాలి



బహుళ తరగతుల బోధన & బహుళస్థాయి బోధన :-

బహుళ తరగతి బోధన : (మల్టీ క్లాస్ టీచింగ్) :-

→ వివిధ వయోపరిమితులు గల విద్యార్థులకు, విభిన్న అభ్యసనా స్థాయి గల విద్యార్థులకు ఒకే విషయం లేదా వివిధ విషయాలపై ఒకే సమయంలో బోధనాభ్యసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. దీన్నే "బహుళ తరగగి బోధన" అంటారు (మల్లీ క్లాస్ టీచింగ్)

బహుళస్థాయి బోధన (మల్టీ గ్రేడ్ టీచింగ్) :-ఒకే తరగతిలోని విషయాలలో అభ్యసన క్రమం, వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థి ప్రజ్ఞ భికృ విషయాలకు

→ భిన్నమైన రకాలుగా ఉంటుంది. ఇలా వైయుక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని ఒకే తరగతికి సంబంధించిన విద్యార్ధులకు

బోధించుటనే "విహళస్థాయి బోధన" (మల్టీ గ్రేడ్ టీచింగ్) అంటారు.

బహుళ తరగతి బోధన :-

దీనిలో ఉపాధ్యాయుడు తన బోధనా కాలాన్ని పూర్తిగా ఒకే తరగతికి వినియోగించలేదు. ఒక్క ప్రత్యక్ష బోధన మినహా మిగతా సందర్భాలలో మిగిలిన తరగతుల్లో విద్యార్ధులను ఏదైనా బోధనాథ్యనన ప్రక్రియలో నిమగ్నమయ్యేట్లు చేయాలి.

వ్యూహాలు :

→ ప్రత్యక్ష బోధన

→ జట్టు బోధన

→ మానిటర్ సహాయం

→ తోటి విద్యార్థులతో బోధన / సమవయస్కుల బోధన

→ స్వయం అభ్యసన

→ అనుబంధ పతనం

→ తరగతి వెలుపల నిర్వహించే కృత్యాలు

→ మొత్తం తరగతి పని

1. ప్రత్యక్ష బోధన :-

→ ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా ఒక తరగతికి పరిమితమై బోధన చేయుట

→ ఏ ఏ సందర్భాలలో ప్రత్యక్ష బోధన చేస్తాడు ?

→ కొత్త విషయాలను బోధించుటకు

→ విద్యార్థుల సంశయాలను తీర్చటానికి

→ విద్యార్థులు చేసిన పనిని సమీక్షించి, సరిదిద్దడానికి నియోజనాలు ఇవ్వడానికి

→ సూచనలు ఇవ్వడానికి

→ సమస్యల సాధనను వివరించటానికి

→ గణిత పరికరాలను వినియోగించే పద్ధతిని ప్రదర్శించటానికి

నోట్ :- కొన్ని సందర్భాల్లో ఉమ్మడి పాఠ్యాంశాన్ని ఎన్నుకొని రెండు / మూడు తరగతులకు ఒకేసారి ప్రత్యక్ష బోధన

2) జట్టు కృత్యాలు :


→ ప్రత్యక్ష బోధన కేవలం ఒక తరగతికి మాత్రమే పరిమితమగును. ఇటువంటి సందర్భాలలో మిగిలిన తరగతుల విద్యార్థులకు

జట్టు కృత్యాలు ఇస్తాం.

జట్టు కృత్యాలు ఇచ్చే సందర్భాలు :-

→ బోధించిన అంశాలు పునర్విమర్శ చేసుకోవడానికి

→ బోధించిన పాఠంలోని నమస్యలను అభ్యాసం చేయించటానికి |

→ జట్టు సభ్యులతో చర్చించుకోవడానికి

→ ఆవర్తన పనిని ఇవ్వడానికి

→ ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యాలను కొనసాగించటానికి

→ జట్టు సభ్యులతో ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడానికి

జట్టు రకాలు :- 1) హోమోజీనియస్ గ్రూప్ - ఒకే తరగతి / ఒకే వయస్సుకి చెందినవారు

2) హెటిరోజీనియస్ గ్రూప్ - వేరు వేరు తరగతులు / వేరు వేరు వేయస్సులకు చెందినవారు



సమవయస్కుల జట్టు :-

→ ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతుల్లో పాఠ్యాంశాలు వేరువేరుగా ఉన్న వారికి నియోజనాలు కూడా వేరువేరుగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఇరువర్గాల అభ్యసనకు ఆటంకం కలుగకుండా తరగతి వారీగా జట్లు చేసి అయా జట్లకు అభ్యసన

పనులు ఇస్తాడు

నోట్ :- సామర్థ్యాలకనుగుణంగా తరగతిగదిలో మూడు రకాల విద్యార్థులుంటారు

1. ప్రతిభావంతులు

2. నగటు స్థాయి

3) అభ్యసనలో వెనుకబడినవారు


→ మిక్సడ్ గ్రూప్ :- మూడు రకాల విద్యార్థులను కలిపి సమూహం చేయుట



ఉపయోగం:-

→వెనుకబడిన విద్యార్థి ప్రతిభావంతులతోను, సగటు విద్యార్థితోనూ పరస్పర చర్యనొంది అభివృద్ధి చెందును సగటు విద్యార్థి ప్రతిభావంతుని ద్వారా మరింత జ్ఞానాన్ని పొందును

→ ప్రతిభ గల విద్యార్థి తాను నేర్చుకున్న అంశాలను తిరిగి బోధించుట ద్వారా స్థిరీకరణ పొందును మరియు ఓర్పు, సహనం

అలవడును

ఎజిలిటీ గ్రూప్ :-

→ ఒకే స్థాయి సామర్థ్యం గల పిల్లలను కొన్ని కొన్ని సందర్భాలలో వేరు వేరు నమూహాలుగా చేయుట

ఉపయోగం :-

→ ప్రతిభ గల విద్యార్థులకు సవాలు విసిరే క్లిష్టమైన, కష్టమైన సమస్యలు ఇచ్చి వారిని అభివృద్ధి చేయుట -

→ వెనుకబడిన విద్యార్థులకు ప్రాథమిక అంశాలు స్థిరవరచడానికి, ఆవర్తన పని ఇవ్వడానికి లేదా లోపనివారణ బోధన జరపదానికి

తోడ్పడును.

వేరువేరు తరగతుల జట్టు :-

→ వేరు వేరు తరగతుల విద్యార్థులను కలిపి జట్టుగా చేసి జట్టు నాయకునిగా పై తంగతి విద్యార్థిని నియమించుట ద్వారా, జట్టు పనిని అతదు పర్యవేక్షిస్తాడు. సందేహాలను నివృత్తి చేస్తాడు. మార్గదర్శకత్వం వహిస్తాడు నోట్ :- ఇలాంటి జట్టు చేసినపుడు జట్టులోని సభ్యులు అభ్యసించే విషయాలు ఉమ్మడి పాఠ్యాంశాలు ఆయిపుంటే అభ్యసన ఇంకా సరళంగా, సమర్థవంతంగా జరుగును

జుట్టు కృత్యాల వల్ల ప్రయోజనాలు :

→పదస్పరం ప్రతిస్పందించుకొంటూ అభ్యసనలో చురుకుగా పాల్గొంటారు

→ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండా అభ్యసన ప్రక్రియలో ఎక్కువ కాలాన్ని గడుపుతారు

→సాధారణంగా తరగతిలో నిశ్శబ్దంగా ఉండే విద్యార్థులు సైతం జట్లలో పాల్గొని చురుకుగా అభ్యసిస్తారు
→ విద్యార్థులతో కలిసి పనిచేయటం, ఓర్పు సహనం, సాంఘిక నైపుణ్యాలు, మానవ సంబంధాలు వృద్ధి చెంది సర్జుబాటు

సమస్యలు మొ||వి పరిష్కారం అగును

→తోటి పిల్లలకు చెప్పడం, చేసి చూపడం ద్వారా విషయం స్థిరీకరణ జరుగును

→విద్యార్థులు తమకు తాము మదింపు చేసుకొనుట, ఒకరికొకరు వివరించుకొనుట, సవరించుకొనుట ద్వారా ఉపాధ్యాయునికి

భారం తగ్గును

→ఒకరికొకరు చర్చించుకోవటం, వివరించటం, ఒకరి అనుభవాలు ఒకరు ముచుకోవటం ద్వారా ఇతరులతో కలిసి నేర్చుకోవటం

అనే సూత్రం బలపదును.





జట్లుగా విభజించేటపుడు పాటించే జాగ్రత్తలు:-

→జట్లు సాధ్యమైనంత వరకు చిన్నగా (5-6)గా ఉండాలి

→ వీలైనంతవరకూ మూడు రకాల విద్యార్థులు కలిగి ఉండేట్లుగా చూడాలి

→ వివ్వుడూ పిల్లలను ఒకే జట్టులో ఉంచరాదు

→ జట్టు నాయకులను కూడా మారుస్తూ ఉండాలి. దీని వలన అందరికీ అవకాశం కలుగును. ఇలా చేయటం వలన ఆత్మవిశ్వాసం పెరిగి, న్యూనతాభావం అధిక్యతాభావం తొలగుతాయి

→ కృత్యం యొక్క లక్ష్యం, స్వభావాన్ని బట్టి ఎలాంటి జట్టు ఏర్పాటు చేయవచ్చో నిర్ణయించాలి.

→ నిర్ణీత సమయాన్ని అర్థవంతంగా, సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడానికి తగ్గ వరుస కృత్యాలు

→ జట్లను వేర్వేరు దిక్కుల్లో కూర్చోబెట్టటం ద్వారా ఏకాగ్రత పెరుగును

→ జట్టు సభ్యులకు, నాయకులకు తగిన సూచనలివ్వాలి

→జట్టు పనిలో ప్రతి విద్యార్థి నాయకునితో సహా కృత్యంలో పాల్గొనేటట్లు ఉండాలి



జట్టు కృత్యాలు:-

→ ఆటలు ఆడించటం, పాటలు పాడించటం, అభినయం చేయించటం

→పజిల్స్ చేయించటం, పొడుపు కథలు చెప్పించటం •

→ ఆవర్తన పనిని, అభ్యాసాలు చేయించటం

→ క్లిష్టమైన సమస్యలు ఇచ్చి ఏ విధంగా సాధించాలో చర్చించటం ప్రయోగాలు చేయుట

→ పుస్తక పఠనం, సమాచార సేకరణ

→ వస్తువుల సేకర.


→రేడియో, టి.వి. కంప్యూటర్ వినియోగించి పాఠ్యాంశాల అభ్యసన చేయించుట

→ ప్రాజెక్ట్ ఇచ్చి చేయించుట మొవి

3.మానిటర్ సహాయం :-

→ ఉపాధ్యాయుడు ఒక తరగతికి ప్రత్యక్ష బోధన చేసే సమయంలో మిగిలిన తరగతులు నిరాటంకంగా కొనసాగుటకు లీడర్

ఆవశ్యకత కలదు

→ లీడరు తప్పనిసరిగా విషయంలో ప్రావీణ్యత కలిగి ఉండి, విద్యార్థులందరి ఆమోదం కలిగి వుండి, తరగతిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో బోధనాభ్యాసన ప్రక్రియను సజావుగా కొనసాగించే అవకాశం కలదు


మానిటర్ ని ఉపయోగించే సందర్భం :-

→ ఉపాధ్యాయుడు ఇచ్చిన నియోజనాలు / కృత్యాలు తరగతి విద్యార్థులతో చేయించే సందర్భాల్లో పర్యవేక్షకుడిగా, మార్గదర్శకుడిగా సహాయకారిగా వ్యవహరిస్తాడు

→ ఉపాధ్యాయుడు లేని సమయంలో ప్రత్యక్ష బోధన లేదా సహాయం అవసరమైన విద్యార్థులకు బోధించడం, వివరించడం

చేస్తాడు

→ బి.ఎల్, ఎమ్. ఏర్పాటు చేస్తాడు

→ తరగతి గదిలో క్రమశిక్షణ ఉండేట్లు చేస్తాడు.

→ కొన్ని సార్లు బయట చేసే కృత్యాలు లేదా క్షేత్ర పర్యటనల నిర్వహణకు ఉపయోగపడతాయి

→ ప్రతిసారీ మానిటర్‌ను మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మానిటరింగ్ కు కోల్పోయే కాలాన్ని అందరూ పంచుకొన్నట్లు

ఆగును

నోట్ :- ఒకే మానిటర్ను నిత్యం ఉపయోగించరాదు.



4) సమయస్కుల బోధన:-

→ఒక తరగతిలోని విద్యార్థి మరొక విద్యార్థికి గానీ, ఎక్కువ మంది విద్యార్థులకు గానీ బోధించే న్నివేశాన్ని సమవయస్కుల

బోధన అంటారు

నోట్ :- ఒక విషయంలో ప్రావీణ్యత గల విద్యార్థి ఇతర విద్యార్థులకు బోధకుడిగా, సహాయకుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు, మరొక పాఠ్య విషయబోధనలో అతను అభ్యాసకుడిగా మారతాడు నోట్ :- ఏక కాలంలో బోధకుడు - అభ్యాసకుడు రెండు పాత్రల్లో ఉంటాడు

ప్రయోజనాలు :-

→ తరగతి గదిలో విద్యార్థులందరిలో నిర్దేశించబడిన సామర్థ్యాల అభ్యాసనకు దోహదపడును - తరగతిలోని విద్యార్థుల అభ్యసనలోపాలను ఉపాధ్యాయునికి నివేదిస్తాడు

→ సమవయస్కుల బోధన వల్ల అభ్యసించిన విషయం పునర్బలనం చెందుతుంది

→ విద్యార్థులలో పరస్పర చర్య వలన జ్ఞాన విస్తరణకు, సహాకారభావనకు తోడ్పడును స్వయం అభ్యాసం

→ బహుళ తరగతులు బోధనలో ప్రత్యక్ష బోధనలో పాల్గొనని, విద్యార్థులకు తమ యొక్క అభ్యసనాన్ని తమంతట తామే వ్యక్తి గతంగా కొనసాగించుటకు ఇచ్చే వ్యాసక్తులు ఎవరి సహాయ సహకారాలు లేకుండా విద్యార్థి సొంతంగా చేయు కృత్యాలు

ఉదా :- 1) సమాచార, వస్తు సేకరణ, మ్యాక్స్ కిట్, సైన్స్ కి పరికరాలనుపయోగించి భావనలను నేర్చుకోవడం

2) సూత్రాలు, ఎక్కాలు, నియమాలు నేర్చుకోవడం

3) ఫజిల్స్, సమస్యలు, కృత్యాలు, పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు వ్యక్తిగతంగా చేయడం



స్వయం అభ్యాసనా కృత్యాలు లక్షణాలు :

→ నూతన ఖావాలు, నూతన సమర్థ్యాలు పెంపొందించేట్లుండాలి

→ ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా బోధించిన అంశాలను అభ్యాసం చేయడానికి మరింత అవగాహన చేసుకోవడానికి తోడ్పడాలి

→ స్వయంగా, స్వతంత్రంగా చేయగలిగేట్లుండాలి.

→ నేర్చిన జ్ఞానం, నైపుణ్యాలు స్థిరపడటానికి ఉపయోగపడాలి

→ సమస్యాసాధనలో నైపుణ్యాలు అభివృద్ధి చేసే విధంగా ఉండాలి.

→ విద్యార్థులు ఊహాత్మక, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేట్లుగా ఉండాలి



6) మొత్తం - తరగతి పని :

→ బహుళ తరగతి బోధనలో భాగంగా ఒక తరగతికి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష బోధన చేస్తే మిగతా తరగతులు విద్యార్థులను

→ అభ్యాసన ప్రక్రియలో ఉంచడానికి వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాలతో పాటు కొత్తం తరగతి విద్యార్థులు పాల్గొనే కృత్యాల

ఆవశ్యకత ఎంతైనా ఉంది

ఉదా :- 1) మ్యాడ్స్ కార్నర్ కి చెందిన వస్తువులను తయారుచేయడం

2) ప్రాజెక్ట్లు ఇవ్వడం, చర్చలు, సెమినార్లు

3) తరగతి గదిని చార్టులు, నమూనాలు, పటాలతో క్రమపద్ధతిలో అమర్చడం

4) ఆటలు ఆడడం, పాటలు పాడడం, టి.వి., రేడియో కార్యక్రమాల్లో గణిత పాఠాలు వినడం, చూడడం

5) క్షేత్ర పర్యటనలు - పరిశీలన, నాటకీకరణ,




7. తరగతి - వెలుపల నిర్వహించే కృత్యాలు:-

→ క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందేలా చేయవచ్చు

→ క్షేత్ర పర్యటనలో గమనించిన విషయాలను, నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో పిల్లలు క్షేత్ర పర్యటనలో చర్చ ఎర్పాటు

చేయాలి


8) అనుబంధ పఠనం :-

→ బహుళ తరగతి బోధనలో స్వయం అభ్యసన ప్రక్రియ కింద వినియోగించవచ్చు డీని ద్వారా అధ్యయన పటిమ ద్విగుణీకృతమగును. పఠనా శక్తి పెరుగును

→ అనుబంధ పఠవాలుగా ఒ.బి.బి. క్రింద సరఫరా చేసిన పుస్తకాలను, లైబ్రరీలో గల పుస్తకాలను ఇతర తరగతుల బోధనకు

ఉపయోగించవచ్చు

బహుళ స్థాయి బోధన :-

→ బహుళ స్థాయి జోధనకు ముందుగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఒక నిర్ధారణకు వచ్చపాక వారివారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేయడానికి క్రింది వ్యూహాలను చేపట్టవచ్చు

→ ఉదా - 3వ తరగతి తులామాన సంకలనాన్ని వివిధ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులకి భోధించుట