సాంఘిక శాస్త్ర మూల్యాంకనం - నిరంతర సమగ్ర మూల్యాంకనం
నికష - పరీక్ష మధ్య తేడా :
నికష :-
1.నిర్దిష్ట కాలంలో పూర్తి అగును
2.నిర్దిష్ట అంశాలను పరీక్షించును
3.నిర్దిష్ట లక్ష్యాలను పరీక్షించును
ఉదా : స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్, వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్,
పోటీ నికషలు, ప్రవేశ నికషలు, డైట్ సెట్లు, ఎమ్సెట్
ఎడ్ సెట్, పోలీ సెట్
గమనిక : అన్ని పోటీ నికషలు, ప్రవేశ నికషలలో కేవలం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం లాంటి 4 లక్ష్యాలనే పరీక్షించవచ్చు.
పరీక్ష :-
1.ఎక్కువ కాలం పదుతుంది
2.ఎక్కువ అంశాలను పరిశీలించును
3.ఎక్కువ లక్ష్యాలను పరీక్షించును
ఉదా : క్వార్టరీ పరీక్షలు, అర్ధ సంవత్సర పరీక్షలు, మాన్యువల్ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు
గమనిక : పరీక్షలలో జ్ఞానం, అవగాహన, వినియోగం నైపుణ్యం అభిరుచులు, వైకరులు, ప్రసంస నేయత వంటి అన్ని లక్ష్యాలను పరీక్షించును.
పాండిత్య రంగంలో విద్యార్థుల వికాస మావనం తోడ్పడునవి.
1) నియోజనాలు
2) పరీక్షలు
3) ప్రాజెక్టులు
1. నియోజనాలు:
→ విద్యార్థులు తప్పనిసరిగా ఆచరించవలసిన పనులను నియోజనాలంటారు
→ ఇవి విద్యార్థుల యొక్క వికాసాలకు తోడ్పడును
→ తరగతి గదిలో గాని, ఇంటి వద్ద గాని పూర్తి చేయాలి
→ విద్యార్థి పాఠ్యాంశాలను ఎంత వరకు గ్రహించినది తెలుసుకోవచ్చు
→ విద్యార్థికి జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొనుటకు
→ నేర్చుకున్న విషయాలకు పరిపుష్టి నందించుటకు
→ నేర్చుకున్న జ్ఞానాన్ని నూతన పరిస్థితులలో అన్వయించుటకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనుటకు
→ పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ రకాల ప్రశ్నలకు తమకు తాను సమాధానాలు కనుగొనుట
నియోజనాలుగా ఇవ్వదగిన అంశాలు :-
→ బోధించిన పాఠం పై ప్రశ్నలడగడం
→ కొన్ని విషయతంత్ర పరీక్షలు నిర్వహించడం
→ ఇచ్చిన పటంలో భాగాలను గుర్తింపచేయడం
→ పరికరాలను అమర్చడం, ప్రయోగాలను చేయడం
నమస్యలు సాధించడం :-
నోట్ :- 1) నియోజనాల వలన తల్లిదండ్రులు కూడా పిల్లల చదువులలో పాలు పంచుకునే అవకాశం కల్గును
2) ఇంటి పనిగా కొన్ని గృహనిర్దేశాలు ఇవ్వవచ్చు
నోట్ :- థార్న్ డైక్ రెండవ సూత్రం (అభ్యాస నియమం)ను పోత్సహిస్తాయి
నోట్ :- ప్రగతి పత్రంలో ఈ నియోజనాలను చూపి, విద్యార్థి అభివృద్దిని అంచనా వేయవచ్చు వెనుకబడిన వారికి తగిన
• సహాయాన్నిచ్చి ముందుకు తీసుకురావడానికి, మేధావంతులకు అదనంగా పని కల్పించడానికి వీలు కలుగును.
నియోజనాలు ఇవ్వడానికి సూచనలు - ఎల్.జి.దాస్ :-
→ ప్రతి నియోజనం ఏదో ఒక పాఠ్యపుస్తకంపై ఆధారపడి ఉండాలి
→ నియోజనానికి సంబంధించి పార్యప్తస్తకంలో ఏ ఏ భాగాలు చదవాల్లో పేర్ొనబడాభి
→ నియోజనంపై కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి
ఎ) ఇచ్చిన విషయాలు విద్యార్థి అర్ధం చేసుకున్నాడా ? లేదా ?
బి) వ్యాస రూప ప్రశ్నలు ఇవ్వరాదు
సి) చిత్రాలు గీయుటకు వీలైన ప్రశ్నలు ఇవ్వాలి
డి) ప్రయోగశాల పనికి కావలసిన పరికరాల జాబితా గూర్చి ప్రశ్నించాలి •
→ పాఠానికి సంబంధించిన అదనపు సమాచారం గల పుస్తకాలను చదివేలా చూడాలి.
→ ప్రాక్టికల్ పనికి సంబంధించి
ఎ) ఉపాధ్యాయుడిచ్చే నూచనలు
బి) ఫలితాలు నమోదు చేసే పద్ధతి.
సి) తీసుకోవలసిన జాగ్రత్తలు
డి ) పరికరాల అమరికను చూపే పటం
వియోజనాలు - ప్రయోజనాలు:
→ శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి
→ శాస్త్రీయ విధానాలలో శిక్షణ
→ విద్యార్థి ప్రగతి గూర్చిన అవగాహన
→ విద్యార్థులకు ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి
→ విద్యార్థులలో అధ్యయన అలవాట్లను అభివృద్ధి చేయుటకు
→ వైయక్తిక భేదాలకనుగుణంగా అభ్యసన కల్పించుట
→ విద్యార్థుల సామర్థ్యాలకనుగుణంగా అవకాశం ఇవ్వడం
→ విరామకాల సద్వినియోగం
రియోజనాలు ఇచ్చే విధానం :-
→ 1వ తరగతి విద్యార్థికి 10 ని|లలో, 5వ తరగతి విద్యార్థికి 50 ని||లలో ముగించగలిగేలా ఇన్వాలి
→ ఎక్కువ మొత్తంలో ఇచ్చే నియోజనాలు విద్యార్ధికి భారం కల్గించకూడదు
→ వీలైనంత వరకూ పాఠశాలలోనే పూర్తయ్యేట్లుండాలి స్థాయికి / సామర్థ్యానికి / వయస్సుకి / తరగతికి తగ్గట్లుగా ఇవ్వాలి
→ జ్ఞానం, నైపుణ్యాల వికానం, కల్పనా శక్తిని పెంపొందించేట్లుగా ఉండాలి
→ ఉల్లాసం కలిగించేవిగా ఉండాలి
నియోజనాలు 3 రకాలుగా ఇవ్వవచ్చు :
1.పాఠం చెప్పకముందు / సన్నాహం చేయు భాగం
2.పాఠం ద్వారా మధ్యలో / సాధన చేయు భాగం
3 పాఠం బోధించిన తర్వాత / వ్యాసక్తుల భాగం
1. పాఠం చెప్పకముందు :-
→ ఆ పాఠ్యాంశంలో గల సూత్రాలు, నిర్వచనాలు, పరికరాల కూర్పు, పద్ధతులు మొదలైన వాటిలో విద్యార్థికి గల పూర్వ జ్ఞానం
ఉచగాహన, గతానుభవాలను పరీక్షించుటకు అవకాశం గలదు.
ఉదా :- 1) ఆకారాలు' చెప్పే ముందు విద్యార్థులకు తెలిసిన ఆకారాలు వేయమనుట ద్రవ్యమానం' చెప్పే ముందు చెలామణిలో ఉన్న నాణేలను, నోట్లు సేకరించమనడం
2.సాధన చేయాల్సిన భాగం / పాఠంను మధ్యలో (సాధన అభ్యాసం) :
→ జోధించిన పార్యాంశానికి చెందిన సూత్రాలు, నిర్మాణాలు, నమస్య సాధనా పద్ధతులు మొదలైన వాటిని ఆభ్యాసం చేయుటడు
తోడ్పడే నియోజనాలు.
1. పాఠ్యపుస్తకంలోని అభ్యాసాల సాధన
2. వివిధ పటాలను నిర్మించడం
3) ఎక్కాలు, సూత్రాలు, వల్లెవేయించుట
4.సమస్యలను మళ్ళీ, మళ్ళీ సాధన చేయించుట
5) నేర్పిన విషయాన్ని క్లుప్తంగా రాయమనడం
3) వ్యాసక్తుల భాగం / పాఠ్య బోధన తర్వాత / వికాస భాగం :
→ పాఠ్య బోధన తర్వాత విద్యార్థి పొందిన జ్ఞానం, అవగాహన సామర్ధ్యాలను తెలుసుకొనుటకు మరియు విద్యార్థి వినియోగ ! సామర్థ్యాన్ని లేదా క్రియాత్మక నైపుణ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగించే దశ
→ వివిధ దేశాల నాణేలను సేకరించడం
→ దినచర్య పట్టికలను తయారుచేయమనుట
→ తరగతి గది ఉష్ణోగ్రతను ప్రతి రోజు నమోదు చేయుట
→ క్యాలండలోని పండుగలను గుర్తించుట
→ కొలతలను వేరు వేరు ప్రమాణాలలోకి మార్చుట.
2. ప్రాజెక్టులు :-
→ విద్యార్థులు సమాజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి, పరిశోధించి, సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల అవగాహనను ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలను ప్రాజెక్టు పనులు అంటారు
→ విద్యార్థులు తరగతి గది బయట సాధించుకోవడానికి అవకాశం కల్పించాలి
→ విద్యార్థులు ఎక్కువ నైపుణ్యాలు పొందే అవకాశం ఉంది
ఉదా :- 1) దుకాణానికి వెళ్ళి సబ్బుల ధరలను తెలుసుకుని, పట్టికలో నమోదు చేయడం
2) విద్యార్థుల ఎత్తు/ ఐరువుల జాబితా తయారుచేసి నమోదు చేయుట
3) వివిధ తరగతుల విద్యార్థుల సంఖ్య సేకరించి కమ్మీ రేఖాచిత్రంలో చూపించుట
ప్రాజెక్టులు పనులు :
1)బడిలో చేసేవి
2) బడి బయట చేసేవి
నోట్ :- విద్యార్థులు ఏదైనా సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, నమోదు చేసి, విశ్లేషించి, నిర్ధారణకు నావడం కోసం నిర్ణీత కాలంలో చేసే వనే ప్రాజెక్టు
ప్రాజెక్టు పని - ఆవశ్యకత :-
→ స్వయంగా పాల్గొంటారు
→ సామూహిక కార్యక్రమాలలో పాల్గొనుట ద్వారా కలిసి పని చేయు భావన
→ సహజంగా, సందర్భోచితంగా నేర్చుకుంటారు
→ చురుకుగా, వేగంగా నేర్చుకుంటారు
→ పట్టుదల, ఆత్మస్టెర్యం, వ్యూహరచనాశక్తి, స్వయం జలోచన అలవడతాయి
→ సొంతంగా నిర్ణయాలు తీర్చుకుంటారు
→ శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మక అభ్యసనం జరుగును
→ పని పట్ల గౌరవం
→ నిజజీవిత సమస్యలను ఎదుర్కొనే సత్తా అలవడును
→ నిర్ణీత సమయంలో మంచి ఫలితాలు పొందవచ్చు.
ప్రాజెక్టు పని - లక్షణాలు
→ పిల్లల స్థాయికి తగినట్లుగా ఉండాలి
→ పిల్లలందరూ పాల్గొనేటట్లుగా ఉండాలి
→ సందర్భోచితంగా ఉండాలి
→ సహజంగా, స్వయంగా నేర్చుకొనేదిగా ఉండాలి
→ ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి
→ నిత్య జీవిత సమస్యల సాధనకు తోడ్పడేట్లుగా ఉండాలి
→ ప్రయోజనాత్మకంగా ఉండాలి
→ ఛాలెంజింగ్ గా ఉండాలి
ప్రాజెక్టుపనిలో సోపానాలు -
→ సమస్యను గుర్తించడం
→ నమోదు చేయడం
→ విశ్లేషించడం
→ సాధారణీకరించడం
→ కోడ్: గుడిసేటి నా ని వి ని సా వు
1 2 3 4 5 6 7
1.సమస్యను గుర్తించడం
→ వివిధ పక్షులు / జంతువుల ఆహారపు అలవాట్లు" అనే సమస్యను ఎంపిక చేసుకొనుట
2. సమాచార సేకరణ
→ తాము ఎంపిక చేసిన జంతువులు / పక్షులు ఏం తింటున్నాయి ? వేటితో తింటున్నాయి ? అనే విషయాల సేకరణ
3.నమోదు చేయుట
→ వివరాలన్నీ ఒక పట్టికలో
4.నమోదు చేయుట నివేదిక తయారు చేయుట :
→ సమస్యను గుర్తించిన దగ్గర నుండి నమోదు చేసిన వరకు నివేదిక తయారుచేయుట
5) విశ్లేషించుట :
ఏ ఏ జంతువులు శాఖాహారులు ? ఏ ఏ జంతువులు మాంసాహారులు ? తినేటప్పుడు ఏ భాగాలు ఉపయోగిస్తున్నాయో
విశ్లేషించుట
6.నిర్ధారించుట
→ అన్వేషించిన విషయాల నుండి ఒక నిర్ధారణకు రావడం
7.సాధారణీకరించుకొనుట :-
→ నిర్ధారించుకొన్న విషయాలను సాధారణీకరించుకొనుట
→ పరిసరాల విజ్ఞానంలో ప్రాజెక్టులు
1.ఎగుమతులు - దిగుమతులు
2.పోస్టాఫీసు
3.పంటలు
4.వృత్తులు
5) బడితోట
6) ఇళ్ళు
7)ఆహారం
పరీక్షలు రకాలు :-
సాధనా పరీక్ష
→ సాధారణంగా ఒక పాఠం లేదా అధ్యాయం బోధించిన వెంటనే నిర్వహిస్తాము ఇది విద్యార్థుల అభ్యసనను అంచనా వేయడమే కాక ఉపాధ్యాయుడు తాను చేపట్టిన వ్యాసక్తులను కూడా మూల్యాంకనం
చేసుకొనును
→ లక్ష్యాత్మక/విషయ నిష్ట/స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు - రకాలు
1) బహుళైచ్ఛిక ప్రశ్నలు
2) ఖాళీలను పూరించుట
3) జతపరచడం
4) సత్యాసత్య / ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నలు
5) అతి లఘు సమాధాన ప్రశ్నలు / ప్రశ్నల రూపం
6) వర్గీకరణ రూప ప్రశ్నలు
7) మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు / ర్యాంకింగ్ ఇచ్చే ప్రశ్నలు
8) సాదృశ్య ప్రశ్నలు
9) సంసర్గ రూప ప్రశ్నలు
నోట్ :- లక్ష్యాత్మక ప్రశ్నలు 2 రకాలు
సమాధానాన్ని సరఫరా చేసే రకం :-
1.ఖాళీలను పూరించుట
2. అతి చిన్న సమాధాన ప్రశ్నలు
3. సంసర్గ రూపం
4. సాదృశ్యరూపం
5.గుర్తుకు తెచ్చుకొని రాయాలి / సరఫరా)
→ సమాధానాన్ని ఎంపిక చేసేది
1) బహుళైచ్ఛిక
2) జతపరచడం
3) ప్రత్యామ్నాయ ప్రతిస్పందనాలు
4) వర్గీకరణ
5) మాస్టర్ లిస్ట్ (ఇచ్చిన సమాధానాలలో సరియైన దానిని గుర్తిస్తాం / ఎంపిక)
వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు (ప్రపూసాస):
→ గణితంలో ప్రశ్నల రూపం, పూరణం, నంనర్గం, సాధృభశ్యం మొదలైన నాలుగు ప్రశ్నలను అతి చిన్న ప్రశ్నలు / అతి లఘు
సమాధాన ప్రశ్నలుగా భావిస్తాం.
అబ్జెక్టివ్స్ ప్రశ్నలు :-
→ సమాధానాన్ని ఎంపిక చేసి ప్రశ్నలను లక్ష్యాత్మక / విషయనిష్ఠ ప్రశ్నలుగా భావిస్తాం
→ వర్గీకరణ, బహుళైచ్చిక, మాస్టర్ లిస్ట్, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు, జతపరుచుట మొదలైన 5 ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు
నోట్ -
గణితంలో ప్రశ్నలు 4 రకాలు :
1) సైన్స్, సోషల్ లో సంక్షిప్త పేరుకి బదులు లఘు అని వాడతారు
2) సైన్స్, సోషల్ లో గణితంలోని 3వ రకం ప్రశ్నలు లఘు సమాధాన / అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను విషయతంత్రలో కలిపి చెబుతాం. కనుక సైన్స్, సోషల్లో ప్రశ్నలు 3 రకాలు
1) వ్యాసరూప
2) లఘు ప్రశ్నలు
3.విషయతంత్ర
ఎ) బహుళైచ్ఛిక ప్రశ్నలు - జ్ఞానం :
→ దీని ద్వారా జ్ఞాన లక్ష్యాన్ని పరీక్షించవచ్చు.
→ దీనిలో రెండు భాగాలుంటాయి
1) సమస్యా భాగం
2) సమాధాన భాగాలు
→ ఇటువంటి ప్రశ్నలలో 3/4/5 సమాధానాలు / ప్రత్యామ్నాయాలు ఇస్తారు సరైన దానిని ఎన్నుకొని ఎదురుగా ఇచ్చి బ్రాకెట్లలో
గుర్తించాలి
→ అన్నింటిని కలిపి - వికల్పాలు అంటాం
→ సరైనది - 'కీ' నరికానిది - 'వికర్షణీయాలు" అంటా
ఉదా :-
ఒక మిలియన్ అంటే
ఎ) లక్ష
బి)కోటి
సి ) పది లక్షలు
డి ) పది కోట్లు
answer : సి.
→ ప్రతి ప్రశ్నకు వికల్పాలన్ని సంభవనీయాలుగా ఉండాలి.
→ ప్రతి ప్రశ్నకు ఒకే ఒక జవాబుండాలి.
→→ అన్ని ప్రశ్నలకు ఇచ్చిన వికల్పాలన్నింటి సంఖ్య సమానంగా ఉండాలి
గుణాలు:-
→ ఇవి ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ఉపయోగించవచ్చు
→ ఎక్కువ మందిని, ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో పరీక్షించవచ్చు స్కోరింగ్ నీ, ఆన్సరినీ శ్రీ ప్రకారం లక్ష్యాత్మకంగా దిద్దవచ్చు
→ వీటి ద్వారా విద్యార్థి సమర్థవంతమైన అవగాహన, నిర్ణయాలు, వివేచనా సాగర్యాలను మూల్యాంకనం చేయవచ్చు.
→ విశ్వసనీయత, సప్రమాణత ఎక్కువ |
→ ఈ రకమైన ప్రశ్నలు చేయుటలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.
→ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యంత్రాలు ఎవరైనా తేలికగా గణన చేయవచ్చు.
→ ఇప్పుడు అన్ని పోటీ పరీక్షలలో ప్రవేశ పరీక్షలలో విరివిగా ఉపయోగిస్తున్నారు
ప్రశ్నాపత్రం తయారీ కష్టం, నిర్వహణ తేలిక
పరిమితులు :-
→ ప్రశ్నాపత్ర తయారీ కష్టం, కాలయామనతో కూడినది
→ ఎక్కువ స్థలం కావాలి
→ సరిగా అలోచించకుండా బహుళైచ్చిక ప్రశ్నలను తయారుచేసే వాడే అవకాశం ఉంది
→ బావ ప్రకటన విషయ నివేదన నైపుణ్యానికి అవకాశం లేదు
- గ్రెస్సింగ్ కారకం ఊహించే కారకం సమస్య కాదు
నోట్ :- గెస్సింగ్ కారక సూత్రం $ = R-W/N- 1, సరైన సమాధానాలు R, ప్రత్యామ్నాయాలు N, సరికాని సమాధానాలు W
ఉదా :- 100 మార్కుల బహుళైచ్ఛిక ప్రశ్నలలో 4 ప్రత్యామ్నాయాలు ఇవ్వబడినాయి. అయితే విద్యార్థి పొందిన మార్కులు
అయితే విద్యార్థి ఊహించిన మార్కులు
S=R WIN-1 = 75- 25/3
225 - 25/3
200/3 =66.6
S = 67 Marks
బహుళైచ్ఛిక ప్రశ్నలు 4 రకాలు :-
1.ఒక సరైన సమాధానం :
ఇచ్చిన ప్రశ్నలలో జవాబులలో ఒకటి మాత్రమే సరైనది ఉండును. మిగిలినవన్ని దోషయుక్తం, సరైన దానిని ఎన్నుకోవాలి.
ఉదా
:- అశోకుడు ఏ మతాన్ని స్వీకరించెను
ఎ) హిందూ
బి) జైన
సి ) బౌద్ధ
డి) అజీవక
Answer :సి .
2.ఒక ఉత్తమమైన సమాధానం :
ఇచ్చిన ప్రశ్నలలో జవాబులు అన్ని ఇంచుమించుగా ఒకే రకంగా అనిపిస్తాయి (వికర్షణీయాలు) వాటిలో అత్యంత సముచితమైన
దానిని సూక్ష్మ భేదంను దృష్టిలో ఉంచుకుని ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి ఇది కష్టమైన వని ఉదా :-
ఈ క్రింది వానిలో సరియైనది
ఎ) స్వాతంత్ర్యం ఆగస్టు 15న వచ్చింది
బి) స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చింది
సి) భారతదేశంకు స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చింది
డి) భారతదేశానికి స్వాతంత్ర్యం 1947వ సం ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వచ్చింది.
Answer : డి.
3.సాదృశ్య రకం :
విద్యార్థి మొదటి అంశంలో రెండు భాగాల మధ్య గల సంబంధాన్ని కనుగొని దాని ద్వారా 3, 4 భాగాలను కనుక్కొంటాడు .
ఉదా :- బొద్దింక- ఆర్ధ్రోపొడా ,వానపాము-
ఎ) పొరిఫెరా
బి) ఆనెలిడా
సి) ఇఖైనోడెర్మాటా
డి) మొలస్కా
Answer : బి.
4.తారుమారైన బహుళైచ్చిక అంశం : దీనిలో విద్యార్థి ఇచ్చిన వానిలో తప్పుని గుర్తించాలి. ఇది మిగిలిన అంశాలకు
భిన్నమైనది
ఉదా : 1. ఈ క్రింది వానిలో, భిన్నమైనది.
ఎ)చతురస్రం A = a2
బి) దీర్ఘచతురస్రం A = lb
సి) త్రిభుజం = bh
డి) సమాంతర చతుర్భుజం A=bh
బి) ఖాళీలను పూరించడం : (జ్ఞానం)
ఈ పద్ధతిలో అసంపూర్ణమైన వాక్యం ఇవ్వడం మరియు దానిని ఒకటి లేదా రెండు వదాల్లో వాక్యం పూర్తి చేయవలసి ఉంటుంది. దీని ద్వారా జ్ఞాన లక్ష్యంలోని పునఃన్మరణ లేదా గుర్తుకు తెచ్చుకోవడంను పరీక్షించవచ్చు
ఉదా :- 1) (a+b)2
2) విమానాలు ............ సూత్రంపై ఆధారపడి పనిచేయును
3) అశోకుడు మతాన్ని స్వీకరించెను
లాభాలు:-
→ పూరణ ప్రశ్నలోని పదజాలాన్ని నిర్దిష్ట యధార్థాలకు, నియమాలకు సంబంధించిన జ్ఞానాన్ని పరిగణ చేయవచ్చు
→ గుర్తించడం కన్నా ఎక్కువ జ్ఞానం కావాలి
→ వ్యాసరూప ప్రశ్నల కన్నా త్వరగా దిద్దవచ్చు
→ వ్యాసరూప ప్రశ్నల కన్నా లక్ష్యాత్మకంగా గణనలు ఇవ్వవచ్చు
లోపాలు:-
→ క్లిష్టమైన అభ్యసనానుభవాలను వీటి ద్వారా మాపనం చేయుట కష్టం
→ కేవలం జప్తిక ప్రాధాన్యత ఇచ్చి ఐలహీన అధ్యయన అలవాట్లను పెంపొందించును
→ ఎక్కువ సమాధానాలు గల పూరకాలు ఇవ్వడం వల్ల లోపిస్తాయి
→ గుర్తుంచుకోవలసిన అంశాలు : మొదట మరియు చివరన ఖాళీలు ఇవ్వరాదు
→ ముఖ్యమైన పదాల స్థానంలోనే ఖాళీలు వదలాలి
→ ఒక ప్రశ్నలో ఒక్క ఖాళీనే ఉండాలి
→ ఒక ప్రశ్నలో ఎక్కువ భాళీలు ఉండరాదు
→పాఠ్యపుస్తకంలో ఖాళీలను యధాతథంగా వాడరాదు
→ ఒక భాళీకి ఒకే సరైన పదం ఉండాలి
సి) జతపరచడం: (సంబంధాలను గుర్తించడం) :-
→ విషయానికి సంబంధించిన వివరాలను, సతాతీయ విషయాల మధ్య సంబంధాలను, కార్య కారణాలను, పరస్పర చర్యలను నిర్మాణాలు, లక్ష్యాలకు సంబంధాలను పరీక్షించుటకు ఉపయోగిస్తాం
→ రెండు వరుసల్లో గల పదాల మధ్యగల సంబంధాలను కలుపుట
→ ఇది అవగాహనా లక్షలను పరీక్షించును
ప్రత్యేక సూచనలు:-
→ ప్రతి అంశానికి ఒకే ఒక ఒప్పు జత ఉండాలి
→ జతపరచడానికి వాక్యాలు అర్ధవంతంగా స్పష్టంగా ఉండాలి.
→ వరుసలో ఇవ్వబడే అంశాలు సజాతీయులై ఉండాలి (ఒకే రకమైన అంశాలు ఉండాలి)
ఉదా :- అన్ని కోణాలు / అన్ని వైశాల్యాలు / అన్ని చుట్టుకొలతల సూత్రాలుండాలి
→ ఇవ్వబడిన వరుసల్లో ఒక వరుసలో పదాలు ఎక్కువ ఉండాలి. (ఊపాను తగ్గించడానికి) ప్రశ్నలు అక్షరాలతో, జవాబులు సంఖ్యలతో సూచించాలి
లాభాలు:-
→ ఇవి పూర్తిగా లక్ష్యాత్మంగా ఉండును
→ త్వరగా గణించవచ్చు
→ విశ్వసనీయత, సప్రమాణత కల్గినవి
→ తక్కువ చోటులో ఎక్కువ అంశాలను పొందు పరచవచ్చు
→ ఈ అంశాలను నిర్మించడం సులభం
→ ఈ అంశాలను సరిగా నిర్మించినట్లయితే ఊహించే కారకాన్ని తగ్గించవచ్చు
→ విద్యార్థులు సంబంధాలను గుర్తించి వారు నేర్చుకున్న వస్తువులను గుర్తించే సామర్థ్యాన్ని కొలవవచ్చు
నష్టాలు:-
→ఈ అంశంలో వాడే పదాలు/క్లాసస్ చిన్నవిగా ఉంటాయి. కావున విద్యార్థి పూర్తి అవగాహన, వివరణాశక్తిని గణించడం కష్టం
→కొన్నిసార్లు యథార్థాలను జ్ఞాపకం చేసికొని రాయడానికి మాత్రమే అవకాశం ఉండును
→ నేర్చుకున్న విషయాలను వినియోగించడం, వాటికి తీర్పు ఇచ్చే శక్తి ఐహుకైళ్చిక అంశాల కన్నా తక్కువగా ఉంటుంది
డి) సత్యాసత్య ప్రశ్నలు / ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నలు : (జ్ఞాపకం)
→ వీటిల్లో సాధారణంగా ఒక సూత్రం గానీ, నియమం గానీ, వాక్యం గానీ ఇచ్చి అది తప్పొ, ఒప్పొ లేదా సత్యం, అసత్యం అని
→ ఏదో ఒక మాటలో సమాధానం చెప్పటం జరుగును
→ ఇవి ఊహించి సమాధానం రాయుటకు అవకాశం కలదు
→ ఈ ప్రశ్నలలో ఊహకు 50% అవకాశం కలదు
→ ఈ ప్రశ్నలున్న సమాధాన పత్రాలను గణించుట సులభం
→ వీటి ద్వారా జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే కొలవగలం
ఉదా
1) సరి ప్రధాన సంఖ్య 2 (T)
2) త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవచ్చు.(F)
3.విమానాలు ఆర్కిమెడిస్ సూత్రం పై పనిచేయును(F)
4) సెల్యులోజ్ పదార్థంను మనిషి త్వరగా జీర్ణం చేసుకోలేదు(T)
5. భూమి గోళాకారంగా ఉంది(T)
6) అశోకుడు జైనమతాన్ని స్వీకరించెను(F)
లోపాలు:-
→ ఈ ప్రశ్నల్లో విద్యార్థికి జవాబులు రాయడంలో స్వేచ్ఛ ఉండదు
→ సమాధానాల సంఖ్య రెండే కావడం వలన విద్యార్థి ఎక్కువగా ఊహిస్తాడు
→ కేవలం జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే కొలుస్తుంది
→ అనిశ్చిత వాక్యాలను ఇవ్వరాదు
నోట్ :- సత్యం అసత్యంలు రెండే ప్రత్నామ్నాయాలుండటం వలన విద్యార్థి ఊహించే అవకాశం ఎక్కువ కనుక ప్రశ్నాపత్రంలో
→ ఈ రకమైన ప్రశ్నలు వీలైనన్ని తక్కువగా ఇవ్వాలి
ఈ) ప్రశ రూపం / అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు (గుర్తుకు తెచ్చుకొనుట జ్ఞానం): (వెరీ షార్ట్ అన్సర్ టైప్)
→ ఈ రకమైన ప్రశ్నలకు ఒక మాటలో గానీ, ఒక్క పదంలో గానీ, ఓక్ళు చిహ్నంతో గానీ నమాధానాలివ్వాలి
→ వీటినే అతి లఘు సమాధాన ప్రశ్నలు అంటారు
→ వీటిని నిర్మించడం సులభం.
→ వీటి ద్వారా జ్ఞాన, అవగాహన, వినియోగాల లక్ష్యాలను పరీక్షించవచ్చు
→ వీటిలో కేవలం ఒకే ఒక్క సమాధానం వచ్చే విధంగా ప్రశ్నలను రూపొందించవలసి ఉంటుంది
→ వ్యాసరూప పరీక్షాంశాలు, విషయతంత్ర పరీక్షాంశాల రెండింటి
→ పాఠశాల ఉపాధ్యాయులు దీనిపై మక్కువ చూపుతారు
→ జవాబు సరఫరా చేయాలి
→ దిద్దడం సులభం
→ వీటి ద్వారా సూత్రాలు, భావనలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు, నియమాలు, సత్యాలను పరీక్షించడం సులభం
లాభాలు : (జ్ఞానం):-
→ సమాధానం గుర్తించడం కన్నా ఎక్కువ జ్ఞానం కావాలి
→ ఎక్కువ లక్ష్యాత్మకంగా గణనలు చేయవచ్చు
→ ఎక్కువ విషయం విషయ భాగంపై ఇవ్వవచ్చు
లోపాలు:-
→ ఒకే ఒక్క సమాధానం వచ్చేటట్లు ప్రశ్నలు తయారుచేయుట కష్టం
→ విద్యార్థులలో సంశ్లేషణ, వ్యాఖ్యాన సామర్ధ్యాలను పరీక్షించుట కష్టం
→ సంబంధం లేని ప్రత్యేకమైన యథార్థాలపై కేంద్రీకృతం చేయడం ప్రప్రథమమైన లోపం సూచనలు
→ ప్రశ్నలు, ఎప్పుడు ఒకే సమాధానం వచ్చేలా తయారు చేసుకోవాలి
→ ఒక మాటతో గాని, రెండు మూడు మాటలతో గాని సమాధానం ఏర్పడే అంశాలను ఎంపిక చేసుకోవడం
→ పుస్తకంలో నుంచి యధాతథంగా ఏ అంశాన్ని రాయకూడదు
నోట్ :- సాధనా నికషలలో విరివిగా ఉపయోగించే ప్రశ్నలు - అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ఎఫ్) వర్గీకరించే ప్రశ్నలు : (అవగాహన)
→ ఇచ్చిన పదాల నుండి సారూప్య నంఖంధం) నజాతీయ సంబంధం గల నదాలను వేరు చేసే ప్రక్రియ ఇచ్చిన జాబితా నుండి ఆ జాబితాకు చెందని
ఉదా :-
2, 3, 5, 6,7.................
→ మొక్కజొన్న, గోధుమ, బఠానీ, బార్లీ
→ పదాన్ని వేరుచేయుట గంట, మీటరు, సెకను, నిమిషం, రోజు
→ చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు,
బి) మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు / ర్యాంకింగ్ ఇచ్చేవి : (గుర్తించడం - జ్ఞానం)
→ ఇవి ఐహుళైచ్చిక వ్యతిరేకంగా ఉండును. పైన జాబితాలో నమాధానాలిచ్చి, క్రింది ప్రశ్నలు ఖళీల రూపంలో ఉండును.
నోట్ :- వీటినే ర్యాంకింగ్ ఇచ్చే ప్రశ్నలు అంటాం
హెచ్) సాదృశ్య ప్రశ్నలు: (అవగాహన)
→ ఇది మూడు అంశాలుగా ఇవ్వడం జరుగుతుంది.
→ మొదటి జతలోని రెండు అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించి, రెండవ అతలోని ఖాళీ అంశాన్ని పూరించుట
→ దీని ద్వారా విద్యార్థుల తార్కిక శక్తిని పరీక్షించవచ్చు
→ వీటిని ఎక్కువగా ప్రజ్ఞా పరీక్షలలో ఉపయోగిస్తాం
→ వీటిలో సంబంధాలను గుర్తిస్తున్నాడు. కనుక ఇది అవగాహన లక్ష్యాన్ని ప్రోత్సహించును
→ వీటి పరిమితి చాలా తక్కువఉదా :- రాంబస్ 1/2 4, d, చతుర్భుజం
→ వరి : పిండి పదార్థం , వేరుశనగ ...........
→ చంద్రగుప్త మౌర్యుడు : జైనమతం, అశోకుడు ...........
ఐ) సంసర్గ ప్రశ్నలు :
→ ఈ ప్రశ్నలు ఒక ఉమ్మడి సంబంధాన్ని కాని, ధర్మాన్ని కాని దృష్టిలో పెట్టుకొని కొన్ని పదాలు వాక్యాలు ఇస్తారు. ఆ పదాలు /
→ వాక్యాల సంబంధాన్ని లేదా ఏదైనా ఒక ధర్మాన్ని అర్థం చేసుకుని సమాధానాలు రాయాలి. ఉదా :- కింది ఇచ్చిన ఆకారాల వైశాల్యాలు తెల్పండి, కింద ఇచ్చిన పదార్థాల సాపేక్ష సాంద్రతలు రాయండి.
లక్ష్యాత్మక పరీక్షలు తయారుచేయుటకు సూచనలు :
→ ప్రాముఖ్యత గల్గిన అంశాలపై మాత్రమే ఇవ్వాలి
→ విద్యార్థి వయస్సు, సామర్థ్యం, స్థాయి మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి
→ జవాబులు / ప్రశ్నలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి
→ ఒక ప్రశ్నకి ఒకే జవాబు వచ్చేట్లుండాలి
→ సందేహాస్పదంగా ఉండకూడదు
→ పాఠ్యపుస్తకంలో వాక్యాలు యధాతథంగా స్వీకరించకూడదు.
- వ్యతిరేకార్థాన్నిచ్చే వాక్యాలు ఇవ్వకూడదు
నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) :
→ విద్యార్థిని అన్ని దశలలోనూ కొలవడం
→ఏదో ఒక రాత పరీక్ష ద్వారా కాకుండా అన్ని రకాల పరీక్షల ద్వారా అన్ని రంగాలను, అన్ని లక్ష్యాలను, అన్ని వేళల్లోనూ చేయు
మూల్యాంకనం
→ విద్యార్థి సర్వతోముఖాభివ తోడ్పడును
→ఇది మన సంప్రదాయ విధానాలకు భిన్నమైనది
→నిరంతరం అనే పదం విద్యార్థుల ప్రగతిని క్రమబద్ధంగా మూల్యాంకనం చేయుట, ప్రతి దశలోనూ మూల్యాంకనం చేయుట
→మూల్యాంకనం అనేది బోధనలో అంతర్భాగం కావాలి
→ప్రతి సందర్భంలో మూల్యాంకనం జరుగుతూ ఉండాలి
→ సమగ్రత అనే పదం పార్య, నహసాద్య కార్యక్రమాలలో విద్యార్థుల ప్రగతిని నూచిస్తుంది. ఇది కేవలం జ్ఞాన రంగ నైపుణ్యాలను మాత్రమే కాక భావావేశ, మానసిక, చలనాత్మక రంగ నైపుణ్యాలను కూడా మదింపు చేయాలి
→ విద్యార్థి యొక్క శారీరక, మానసిక, భావావేశ / ఉద్వేగపరమైన అభివృద్ధిని సంపూర్ణంగా అంచనా వేయడం
నిరంతర సమగ్ర మూల్యాంకనం - లక్షణాలు (CCE) :
→ విద్యార్థి అభ్యసనలో లోపాలను గుర్తించి నివారణ మార్గాలను సూచించుట
→ పార్య, పాల్యేతర అంశాలలో విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేయుట
→ దీనిని బోధన చేసే ఉపాధ్యాయులే నిర్వహిస్తారు
→ దీనిలో కేవలం రాత పరీక్షలే కాకుండా పరిశీలనలు, మౌఖిక పరీక్షలు, ప్రయోగాలు, ప్రాధాన్యత మాపనాలు ఉంటాయి
→ బోధనాభ్యాసన ప్రక్రియలో మూల్యాంకనం అంతర్భాగంగా ఉందును
→ స్వీయ మూల్యాంకనానికి వీలు కల్పించుట
→ విద్యార్థుల అభివృద్ధికి / ప్రగతికి తగిన నిర్ణయాలు తెలుసుకొనుట
నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాల్సిన అంశాలు:-
→ పాఠ్య కార్యక్రమాల మూల్యాంకనం
→ సామాజిక వైయక్తిక లక్షణాలు
→ పని అనుభవం
→ గ్రేడింగ్ మొదలైనవి
→ సహ పాఠ్య కార్యక్రమాల మూల్యాంకనం
→ ఆసక్తులు - శారీరకాభివృద్ధి సమవయస్కుల మడింపు
ఉత్తమ మూల్యాంకన లక్షణాలు :-
→ విషయ నిష్ఠత / లక్ష్యాత్మకత / వస్త్యాశ్రయత : (టీచర్) :-
→ ఒక పరీక్షను నిర్వహించిన తర్వాత ఆ నికషను ఒకే వ్యక్తి భిన్న సమయంలో గానీ, భి్న వ్యక్తులు అనేక వర్యాయాలు
→ దిద్దినప్పుడు వచ్చే ఫలితాలు ఒకేవిధుగా ఉండాలి. అనగా ఒక పరీక్షా జవాబు పత్రాన్ని ఎంత మంది ఎన్నిసార్లు దిద్దినా ఫలితాలలో మార్పు లేకుండా ఉండాలి.
→ అప్పుడు దానిని విషయ నిష్ఠత / లక్ష్యాత్మకత / వస్తు ఆశ్రయత అంటాం.
ఉదా :- 'ఎ' అనే ఉపాధ్యాయుడు గడించగా 92 మార్కులు వచ్చినవి. అదే పేపరును "బి" అనే ఉపాధ్యాయుడు గణించగా మార్కులు వచ్చిన దీనిలో లోపించిన అంశం - విషయ నిష్టత
ఉదా :- 'ఎ' అనే ఉపాధ్యాయుడు మొదటిసారిగా గణించినపుడు 90 మార్కులు, రెండవసారి, మూడవసారి. నాల్గవసారి కూడా 90 మార్కులే వచ్చాయి.
అయితే దీనిలోనున్న గుణం - లక్ష్యాత్మకత / విషయ నిష్ఠత
కోడ్ :- ఇక్కడ గుణం అయినా దోషం అయినా టీచర్ ది. కావున టిద్దినపుడు / గణించినపుడు / మాపనం చేసిన అనే పదాలు
వస్తే దానిని విషయ నిష్ఠతగా భావించాలి
నోట్ :- విషయ నిష్టత X వ్యక్తి నిష్టత
వస్త్వస్యత X ఆత్యాశ్రయత
→ విభిన్న కాలాల్లో విభిన్నమైన వ్యక్తులు దిద్దినపుడు ఫలితాలు విభిన్నంగా వస్తే దానిని వ్యక్తి నిష్టత / అత్యాశ్రయత ఆంటాం
ఉదా :- 'వ' అనే ఉపాధ్యాయుడు దిద్దినపుడు 92 మార్కులు, 'బి' అనే ఉపాధ్యాయుడు దిద్దినపుడు 20 మార్కులు వస్తే వారిలో ఒకరు వ్యక్తి నిష్ఠతకు లోనైనట్లు
→ అందం, శుభ్రత, పేరాలు, పాయింట్లు, పేజీలు పంటి ఇతర కారణాలకు, ప్రభావితమై దిద్దితే దానిని 'వ్యక్తి నిష్టత' అంటాం
అనగా విషయానికి ప్రాధాన్యత లేకుండా దిద్దడం
2. విశ్వసనీయత : (విద్యార్థి)
→ ఇది విద్యార్థిపై ఆధారపడును
→ ఒక నికషను ఎన్నిసార్లు నిర్వహించినా / ఒక నికషను విద్యార్థి ఎన్నిసార్లు రాసినా విద్యార్టీ ఫలితాలలో తేడా లేకుండే
విద్యార్థిలో 'విశ్వసనీయత' కలదు
→ ఉదా :- 1) సోమవారం పరీక్షను నిర్వహించినపుడు 92 మార్కులు వచ్చాయి. అదే పరీక్షను తిరిగి మంగళవారం నిర్వహించినపుడు. మార్కులు వచ్చాయి.
అయితే దీనిలో దోషం విశ్వసనీయత
2) ఒక నికషను జూన్లో నిర్వహించినపుడు 90 మార్కులు, తిరిగి అదే పరీక్షను ఆగస్టు, సెప్టెంబర్లలో నిర్వహించినపుడు కూడా 90 మార్కులే వచ్చిన దీనిలో గుణం - విశ్వసనీయత
కోడ్ :- ఇక్కడ గుణం అయినా దోషం అయినా విద్యార్థిది కావున నిర్వహించిన / రాసిన / పరీక్ష పెట్టినా అనే పదాలు వస్తే విశ్వనీయతగా గుర్తించాలి
సప్రమాణత /వ్యాలిడిటీ (ప్రశ్నాపత్రం) :-
→ ఒక నికష ఏ లక్ష్యాలనైతే పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే లక్ష్యాలను ఖచ్చితంగా మాపనం చేయగలిగిరే / పరీక్షించగలిగితే దానికి "సప్రమాణత” కలదు అంటాం.
ఇది ప్రశ్నాపత్రానికి సంబంధించినది
→ ఉదా :- 1) ఒక ప్రశ్నాపత్రం జ్ఞానాన్ని పరీక్షించదలచినది. కాని దానిలో ప్రశ్నలు వినియోగ లక్ష్యానికి సంబంధించినవి ఉన్న ఆ ప్రశ్నాపత్రంలోని దోషం - సప్రమాణత
→ ఒక ప్రశ్నాపత్రం నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించబడి అదే నైపుణ్యాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తే దానిలో గుణం -సప్రమాణత .
విచక్షణా శక్తి : (వేరు చేయు లక్షణం) :-
→ సాధారణంగా తరగతి గదిలో 3 రకాల సామర్థ్యాలు గలవారు ఉంటారు
→ ఒక నికషను నిర్వహించుట ద్వారా ఆ తరగతిలోని అధిక, అల్ప, సగటు ప్రజ్ఞావంతులను 3 రకాలుగా వేరు చేయగలిగితే దానిని విచక్షణా శక్తి కలదు అని అంటాం.
→ వేరు వేరు సామర్థ్యాలున్న విద్యార్థులను సామర్థ్యాల వారీగా వేరు పరచే లక్షణం 5) ఆచరణాత్మకత : (సుషగా / సరళంగా / పొదుపుగా
→ అన్ని రకాలుగా సులభంగా / సరళంగా / పొదుపుగా నిర్వహించగలిగితే దానికి "ఆచరణాత్మకత లక్షణం ఉందని అంటాం
→ సులభంగా తయారుచేయగలుగు సరళంగా నిర్వహించగలుగుట
→ తక్కువ సమయంలో గణన చేయగల్గుట
→ సులభంగా వ్యాఖ్యానించగల్గుట
→ కాలం, ఖర్చు, శ్రమలలో పొదుపును పాటించును
→ ఈ విధంగా పై లక్షణాలు కలిగి ఉంటే ఆ నికషకు "ఆచరణాత్మకత" లక్ష్యం ఉంది అంటాం