విజ్ఞాన శాస్త్ర మూల్యాంకనం / నిరంతర సమగ్ర మూల్యాంకనం
→ పాఠశాలలో పాఠ్య ప్రణాళిక ద్వారా ఆశించిన లక్ష్యాలు నెరవేరతాయో, లేదో, తెలుసుకోవడమే మూల్యాంకన ఉద్దేశం.
→ విద్యా ప్రక్రియలో మూల్యాంకనం నిరంతరం కొనసాగుతుంటుంది. విద్యా ప్రక్రియలో లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకన సాధనాలనే అంశాలకు పరస్పర సంబంధం ఉంది
→ మూల్యాంకనం చేయవలసిన వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని మూల్యాంకన సాధనాలను అనేకరకాలుగా విభజించవచ్చు.
1.పరీక్షలు - మౌఖిక
2.రాత పరీక్షలు
3.నిష్పాదన పరీక్షలు
4.సమస్యా నిధాన పరీక్షలు
5.ప్రశ్నావళి
6.పురిపుచ్చ
7.అభిరుచి శోధిక
8) అంచనా మాపసులు
9) చెక్ లిస్టు
10 .జీవిత' సంఘటన పత్రావళి
11.క్రమాభివృద్ధి పత్రావళి
12.సోషియోమెక్రీ (సాంఘిక మాపని)
సాధన పరీక్ష స్వభావం, భావన, ప్రయోజనాలు:
→ డెన్నిస్ బేరన్, హెరాల్డ్, దబ్యు, బెనార్టె ప్రకారం సాధన భావన అభ్యసనం పట్ల ఆభిరుచి, అభ్యననానికి సద్దపడటం, ఆభ్యసనానికి
అవకాశం అనే మూడు అంశాల సమ్మేళనం.
→ ఈ అంశాలే కాకుండా, ఆరోగ్యం, శారీరక దాదుధ్యం, ప్రేరణ, ప్రత్యేక అభిరుచి, ఉద్వేగాలలో సమస్వయం లేకపోవడం,
అంశాలు కూడా ఈ భావనలో ఉన్నాయి
→ సరిగ్గా చెప్పాలంటే విద్యా సాధన అంటే ఒక ప్రత్యేక పాఠ్య విషయం (లేదా) కొన్ని పాద్య విషయాల సమూహాంలో ఒకరి జ్ఞానం, అవగాహన (లేదా) నైపుణ్యంగా చెప్పవచ్చు
→ పాఠశాల మూల్యాంకన కార్యక్రమంలో సాధన పరీక్ష అనేది ఒక ముఖ్యమైన సాధనం.
→ విద్యా పాఠ్యప్రజాళికలను గురించి శిక్షణ (లేదా) అభ్యసనం తరువాత విద్యార్థి ప్రావీణ్యత, నైపుణ్యాన్ని (సాధన),
సముపార్థనలను మాపనం చేయటానికి ఉపయోగించే పరీక్షను సాధన పరీక్ష అంటారు. ఎన్.ఎమ్.దేనీ.
→ కింది విషయాలలో సాధన పరీక్ష అనేది ప్రజ్ఞ (లేదా) అభిరుచి పరీక్షల కంటే వేరుగా ఉంటుంది.
1) సాధన పరీక్ష కొంతకాలం బోధన జరిగిన తరువాత ఒక ప్రత్యేకమైన పాఠ్య విషయం (లేదా) కొన్ని పాఠ్యవిషయాలలో అతడు సాధించిన అభ్యసనం పరిమాణాత్మక, గుణాత్మక సాధనను మావనం చేస్తుంది.
2) ప్రజ్ఞ (లేదా) అభిరుచి పరీక్షలను అభ్యసనలో సంబంధం లేకుండా అతని సాధన (లేదా) నైపుణ్యం యొక్క ఆంతర్గత తక్తులను మాపనం చేస్తుంది
సాధనా పరీక్షలు ప్రయోజనాలు :-
1) వేరే తరగతిలోకి వెళ్ళడానికి (ప్రమోట్ కావటానికి) ఒక ఆధారాన్ని మనకిస్తాయి.
2) సంవత్సరం మొదట్లో వివిధ అకడమిక్ విషయాలలో విద్యార్థి పరిజ్ఞానం ఎంత వరకుందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
3) కొన్ని పాఠశాలలో విద్యార్థులకు తరగతిలో వారి మార్కులను బట్టి తరగతిలో సెక్షన్లను జరుగుతుంది.
4) విద్యార్థిని ఏ సెక్షన్లో ఉంచాలో అనే నిర్ణయాన్ని తీసుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి.
5) ఒక క్రొత్త అసైన్ మెంట్ ఇచ్చేముందు విద్యార్థులలో బాగా ప్రేరణ కలుగజేయటానికి ఉపయోగపడతాయి.
6) ఉపాధ్యాయుడు, తన బోధనా విధానంలో ఉన్న లోటుపాట్లు ఏమిటి, ఉన్న సుగుణాలు ఏమిటి? ఎంతవరకు తన చెప్పేది
పిల్లవాడు అర్థం చేసుకొంటున్నాడో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
7) విద్యార్థులు ఏ విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోవటం లేదు. వారికి గల అభ్యసనా సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటిని
పరిష్కరించడంలో ఇవి ఉపయోగపడతాయి.
సాధనా పరీక్షలు - రకాలు
→ పాఠశాలలో ఉపయోగించే 'సాధన పరీక్షలు' రెండు రకాలు :
1) ఉపాధ్యాయ నిర్మిత సాధన పరీక్షలు
2) ప్రామాణీకృత సాధన పరీక్షలు
1) ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు :
→ ఇవి పాఠ్యభాగాలకు సంబంధించిన పరిజ్ఞానం (లేదా) ప్రయోగాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలకు సంబంధించిన
అవగాహనను పరిశీలించి, అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు స్వయంగా నిర్మించే పరీక్షలు.
→ ఇవి తరగతిలోని విద్యార్థుల అవసరాలు, అభిరుచులు దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్మించే పరీక్షలు
2) ప్రామాణిక పరీక్షలు:
→ కొన్ని ప్రమాణాల ఆధారంగా, విశ్వజనీయత, సప్రమాణత ఉన్న పరీక్షలు ప్రామాణిక పరీక్షలు స్థానిక జిల్లా, జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని
→ వీటిని బోధన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొనే క్రమపద్ధతిలో నిర్మిస్తారు
ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు - రకాలు :
1) మౌఖిక పరీక్షలు
2.,రాత పరీక్షలు
3.ప్రయోగ పరీక్షలు
1.మౌఖిక పరీక్షలు :-
→ ఉపాధ్యాయ నిర్మిత సాధన పరీక్షలలో ఇది చాలా పురాతనమైంది.
→ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, ప్రయోగాలకు సంబంధించిన నైపుణ్యాలు, విద్యార్థి ప్రాజెక్టు పనిచేసినప్పుడు అతను పొందిన అనుభవాలు, అవగాహన, పరిశీలనలను అంచనా వేయడానికి మౌఖిక పంక్షలను
ఉపయోగించవచ్చు.
→ వీటిని ఎక్కువగా చిన్న తరగతులలో ఉపయోగిస్తారు.
→ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు విద్యార్థి మౌభికంగా సమాధానం ఇస్తాడు
ప్రయోజనాలు:
1) విద్యార్థిలో కనుగొన్న లోపాన్ని ఉపాధ్యాయుడు వెంటనే సవరించటానికి వీలవుతుంది.
2) విద్యార్థి జ్ఞానాన్ని గణించటానికి సహాయపడుతుంది.
3) విద్యార్థిలో వినడం, మాట్లాడటం, చదవడం, ఉచ్చారణా భావాలను సూటిగా, వ్యక్తీకరించడం లాంటి నైపుణ్యాలను పరీక్షించవచ్చు.
4) విద్యార్థుల ఆలోచనా విధానాన్ని తెలుసుకోవచ్చు.
5) ఉపయోగించే భాష, ఎంచుకొనే పదజాలం, సబ్జెక్టుపై పట్టు తెలుసుకోవచ్చు.
6) వ్యక్తిగత పరీక్షలకు అవకాశం ఉంటుంది.
పరిమితులు:
1) సామూహిక మూల్యాంకనం సాధ్యంకాదు.
2) తరగతిలోని విద్యార్థులందరినీ పరీక్షించటానికి చాలా సమయం పడుతుంది.
3) వ్యాసరూప పరీక్షలాగా విషయాన్ని పూర్తిగా పరీక్షించటానికి వీలుండదు.
4) ఆత్మాశ్రయతకు ఎక్కువ అవకాశముంది.
5) సమాచారాన్ని భద్రసరిచే అవకాశం లేదు
6) విద్యార్థులకు వేసే ప్రశ్నలను పోల్చడం కష్టమైన పని.
7.మౌఖికంగా వ్యక్తమయ్యే అభ్యసనా లక్షణాలను మాత్రమే మూల్యాంకనం చేయగలం.
మౌఖిక పరీక్షలు మెరుగుపరచటానికి కొన్ని సూచనలు:-
→ప్రశ్నలు అడగదలుచుకొన్న పాఠ్యాంశం ఉద్దేశాలను ముందుగా నిర్ణయించుకోవాలి
→ ఉపాధ్యాయుడు అడగబోయే ప్రశ్నలు ప్రశ్నలకు రాబట్టే సమాధానాలు నిర్ణయించుకోవాలి.
→ విద్యార్థులు ఇచ్చే సమాధానాన్ని బట్టి విద్యార్థిని ఏ విధంగా గ్రేడ్ చేస్తామో ముందుగా నిర్ణయించుకోవాలి.
మౌఖిక పరీక్షల విశ్వసనీయత - సప్రమాణత :
→ 'సిమ్స్', 'నాక్స్ చేసిన అధ్యయనం ప్రకారం మౌఖికంగా పరీక్షించటం వల్ల చాలా స్వల్పంగా పరీక్ష కఠినత్వం స్థాయి పెరిగినది. కాని, విశ్వసనీయతలో గాని, సప్రమాణతలో గాని మార్చేమీ లేదు
2.రాత పరీక్షలు :-
రాత పరీక్షలు మూడు రకాలు, అవి
ఎ) వ్యాసరూప పరీక్షలు
బి) లఘుసమాధాన పరీక్షలు
సి) విషయతంత్ర పరీక్షలు
ఎ) వ్యాసరూప పరీక్షలు :
→ ఉపాధ్యాయుడు వాడే పరీక్షలలో అత్యంత ప్రముఖస్థానాన్ని అలంకరించినవి వ్యాసరూప పరీక్షలు
→ వీనినే స్వేచ్చాయుత ప్రతిస్పందన ప్రశ్నలు అంటారు - ఇవి అతి ప్రాచీనకాలం నుంచి అమలులో ఉన్నాయి
→ వ్యాసరూప పరీక్షల వల్ల విద్యార్థులు స్వేచ్చాయుత సమాధానాలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఇటువంటి పరీక్షలలో వాడే ప్రశ్నలకు సమాధానమివ్వటంలో హెచ్చుస్థాయిలో ఉండే మానసిక ప్రక్రియలో విద్యార్థి నిమగ్నమై
ఉంటాడు,
→ విద్యార్థికి తన సృజనాత్మకత శక్తిని ప్రకటించటానికి అవకాశం ఎక్కువ
→ ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానాన్ని సాధారణంగా 400-500 పదాలలో రాయమని వ్యాసరూప ప్రశ్నలలో నూచనలిస్తారు
వ్యాసరూప పరీక్షల విధులు :-
1) విద్యార్థులను ప్రత్యేక విషయంలో పరీక్షించినప్పుడు పూర్తి సాధనను బట్టి వారిని ర్యాంకింగ్ చేయటానికి సాధన పరీక్షం ఉపయోగపడుతుంది
2.విభ్యార్థులకు, తరగతిలోని ఆభ్యసనా సమస్యలను, తెలుసుకొని, వాటిని తొలగించటానికి తగిన శ్రద్ధ తీసుకోవటానికిగాను
పరీక్షలు నిర్వహిస్తారు.
3.కొన్ని బోధనా విధానాల సామర్థ్యాలను గణించటానికి ఇవి సహాయకారిగా ఉంటాయి. బోధనా విధానాన్ని ఎన్నుకోవటంలో కోర్సు మెటీరియల్ సరిగ్గా క్రమపద్ధతిలో అమర్చటంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
4) విద్యార్థులు ఉత్సాహంగా కష్టపడి చదువుకోవటానికి ఇది ప్రేరకంగా పనిచేయటమేకాక ఉపాధ్యాయులను కూడా పరిపూర్ణులుగా చేయటంలో సహాయపడుతుంది
5) ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండటంలో ఇవి సహాయపడతాయి. విద్యార్థుల వివరణా సామర్ధ్యం, వ్యాఖ్యాన సామర్థ్యం, విమర్శించడం, పోల్చడం వంటి సాగుర్జ్యాలను కనుక్కోవటానికి వీలుగా
ఉంటుంది
6.విద్యార్థులు క్రమశిక్షణతో స్థిమితత్వంతో పరీక్ష రాయవలసి ఉంటుంది. విద్యార్థికి పట్టుదల, శ్రమ కూడా అవసరమవుతాయి
యోగ్యతలు :-
1) బోధన లక్ష్యాలలో అత్యంత ప్రాముఖ్యమైన భావ వ్యవస్థాపితా సామర్థ్యం, భావ వ్యక్తీకరణ సామర్ధ్యం, విమర్శించడం, పోల్చడం మొదలయిన వాటిని ఈ పరీక్షల వల్లనే మాపనం చేయగలం.
2. ఈ పరీక్షలు విషయతంత్ర పరీక్షల కంటే ఉత్తమమైన అధ్యయనపు అలవాట్లను ప్రోత్సహిస్తాయి
3.పరీక్షా పత్రాలను తయారుచేయడం.
4) స్కూల్ కరిక్యులమ్ లోని అన్ని సబక్యులలోను వ్యాసరూప ప్రశ్నలు తయారుచేయడానికి వీలుంది.
5.విద్యార్థి సమాధానం ఇస్తున్నప్పుడు చాలా స్వేచ్ఛను అనుభవిస్తాడు.
6.భావాన్ని శబ్దరూపంలో వ్యక్తం చేయడం లాంటి గుణాత్మకాంతాన్ని వ్యాసరూప పరీక్షల ద్వారా మాత్రమే మూల్యాంకనం
చేయవచ్చు
పరిమితులు :-
1) అల్ప సప్రమాణత :
→ వ్యాసరూప పరీక్షల ప్రమాణత తక్కువగా ఉంటుంది
→ ఎటువంటి ప్రశ్నపత్రంలోనైనా 8 లేదా 10 ప్రశ్నలకు మించి ఇవ్వటానికి వీలులేదు
→ ఈ పద్ధతి వల్ల విద్యార్థి జ్ఞానాన్ని సంపూర్ణంగా గాక కొద్దిగా మాత్రమే మాపనం చేయటానికి వీలవుతుంది
→ దస్తూరి, వ్యాకరణం, విరామ చిహ్నాలు, సమాధానం నిడివి, బుకాయింపు మొదలయిన అసందర్భాలైన కారణాలవల్ల ఈ
→ పరీక్షల సప్రమాణత అల్పత్వాన్ని పొందుతుంది.
→ పైన పేర్కొన్న అసందర్భ కారకాలు గణన దోష ప్రవేశాన్ని చేయిస్తున్నాయి. ఇటువంటి దోషాలను 'స్థిరదోషాలు' అంటారు.
→ వీటివల్ల నికష సప్రమాణత తగ్గిపోతుంది. 2) అల్పవిశ్వగీయత:
→ వ్యాసరూప పరీక్షల విశ్వసనీయతపై ప్రయోగాన్ని జరిపిన వ్యక్తి "ఎల్స్"
→ వివిధ వ్యక్తులు వివిధ సమయాల్లో తమ నిర్ణయాల్లో భిన్నత్వాన్ని చూపినట్లే అదే వ్యక్తులు వివిధ సమయాల్లోను భిన్నత్వాన్ని
చూపుతారని "ఎల్" నిర్ధారించాడు
→ సమాధానం నిడివి, పరీక్షకుని మనోస్థితి. పరీక్షకునిగాని, పరీక్షపై ఉపాధ్యాయుని వైఖరి, మొదటి ప్రశ్నలర సమాధానం చదపకుండానే
బాగుంటుందనే అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. దీన్ని "హోలో ప్రభావం" అంటారు ఒకే సమాధానానికి సంబంధించిన వివిధ అంశాలకు, ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రాముఖ్యతలవల్ల పైన పేర్కొన్న భేదాలు
సంభవిస్తున్నాయి
→ విశ్వసనీయతలో రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి
1) జవాబు పత్రాలను సరిదిద్దడంలో విశ్వసనీయత:
2) పరీక్ష విశ్వసనీయత
→ పరీక్షాంశాలను అభివృద్ధి చెందించడం వల్ల పరీక్ష విశ్వసనీయతను కలిగి ఉండేటట్లు చేయవచ్చు.
→ సరిదిద్దే విధానంలో మార్పులుచేసి అభివృద్ధి చెందించడం వల్ల నరిదిద్దడంలో విశ్వసనీయతను సాధించవచ్చు.
3) అల్పమైన ఉపయోగార్హత :
→ ఇటువంటి పరీక్షలకు అధికంగా సమయాన్ని వెచ్చించాలి. అందువల్ల ఉపయోగార్హత కొంచెం తగ్గుతోంది జవాబు పత్రాలను చదవటానికి ఎక్కువ సమయాన్ని వినియోగించాలి
→ అందువల్ల వీటిని దిద్దడానికి పట్టే సమయం ఎక్కువగా ఉండటమేకాక, చికాకును, శ్రమను కలిగిస్తుంది
4) కంఠతపట్టే అలవాటును ప్రోత్సహిస్తాయి :
→ విద్యార్థులు అతి ముఖ్యమైన పాఠ్యాంశాలపై మాత్రమే చదువును కేంద్రీకృతం చేస్తారు > సంవత్సరకాలం మొత్తం వ్యర్థంగా గడిపి, విద్యార్థులు పరీక్షలకు కొద్దివారాల ముందు చదువుతారు.
→ ఇటువంటి పరీక్షలలో విద్యార్థి ఫలితం అతని అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. వ్యాసరూప పరీక్షలను ఎప్పుడు ఉపయోగించాలి.
1) పరీక్షింపవలసిన సమూహం చిన్నదిగా ఉన్నప్పుడు.
2) పరీక్షను తిరిగి ఉపయోగించవలసిన అవసరం లేనప్పుడు
3.విద్యార్థి సాధన కంటే, వైఖరులను బయట పెట్టాలనే ఆసక్తితో ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు.
4) రాయటంలో విద్యార్థి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడాన్ని, ప్రశంసించడాన్ని ఉపాధ్యాయుడు కోరినప్పుడు
5) పరీక్షను దిద్దడానికి అవసరమైన కాలం కంటే తయారుచేయడానికి పట్టీకాలం తక్కువగా ఉన్నప్పుడు
బి) సంక్షిప్త సమాధాన పరీక్షలు :
→ ఇవి వ్యాస, లక్ష్యాత్మక ప్రశ్నలలో మధ్యరణానికి
చెందినవి.
→ ప్రతి ప్రశ్నకు జవాబు నాలుగైదు వాక్యాలలో రాయమని అడగడం జరుగుతుంది
→ జవాబు పత్రం గణన, స్కోరింగ్ స్కీమ్ ఆధారంగా చేస్తారు. కాబట్టి కొంతవరకు విశ్వసనీయంగా జరుగుతుంది
→ వీటిలో జవాబు క్లుప్తంగా, కచ్చితంగా ఉండటంవల్ల వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం లేదు సాధారణంగా సమాధానం 40-50 పదాలలో రాయమని సూచనలుంటాయి
→ తక్కువ కాలంలో ఎక్కువ జ్ఞానాన్ని, అవగాహన లక్ష్యాలను మాపనం చేయడానికి ఇది పనికి వస్తాయి.
→ నిర్దిష్ట సమాచారం కోసం ఇటువంటి ప్రత్నలను తయారుచేస్తారు
లాభాలు:-
1) వ్యాసరూప ప్రశ్నలకంటే లఘు సమాధాన ప్రశ్నలను ఇవ్వడం ద్వారా యని లోని చాలా పాఠ్యాంశాల మీద ప్రశ్నలు
అడగవచ్చు
2) విద్యార్థుల అవగాహన, అనువర్తన సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ రకం ప్రశ్నలు తోడ్పడతాయి
3) సూత్రాలు, నియమాలు, భావనలు, చిన్న బొమ్మలు గీయడం మొదలయిన వాటిని పరీక్షించడానికి తోడ్పడతాయి
4) వ్యాసరూప పరీక్షలకంటే ఎక్కువ మార్కులను పొందటానికి అవకాశం ఉంది.
5) ఈ రకం పరీక్షలు బోధనా లక్ష్యాలను పరీక్షిస్తాయి.
6) గణన చేయడం సులభం, తక్కువ ఆత్మాత్రయతను కలిగి ఉంటుంది
7) మూల్యాంకనం విశ్వసనీయతను కలిగి ఉంటుంది
లఘు సమాధాన ప్రశ్నలు తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన జాగ్రత్తలు
1) 5 నిమిషాలలో జవాబు రాయగలిగినంత వ్యవధి ఉన్న ప్రశ్నలను మాత్రమే ఇవ్వాలి
2) రాయవలసిన అంశాల సంఖ్యను బట్టి మార్కులు గణన చేయాలి
3) సూటిగా స్పష్టమైన భాషను ఉపయోగించాలి
సి) విషయతంత్ర పరీక్షలు (లక్ష్యాత్మక ప్రశ్నలు) :
→ విషయతంత్ర పరీక్షలు (లేదా) లక్ష్యాత్మక పరీక్షల వర్గీకరణ లక్ష్యాత్మక ప్రశ్నల సమాధానాలు రాసే విధానాన్ని బట్టి సాధారణంగా
రెండు రకాలుగా వర్గీకరిస్తారు
1) సరయిన సమాధానాన్ని సరఫరా చేసే రకాలు :
ఎ) ఖాళీలు పూరించే ప్రశ్నలు
బి) అతిచిన్న సమాధానాల ప్రశ్నలు
2) ఇచ్చిన ప్రత్యామ్నాయాలలో సరయిన సమాధానాన్ని ఎంపికచేసుకొనే రకాలు :
ఏ) తప్పు ఒప్పు సమాధాన ప్రశ్నలు (True or False type questions)
బి) బహుళైచ్ఛిక ప్రశ్నలు (Multiple choice type questions)
సి) జతపరిచే ప్రశ్నలు (Matching type questions) డి) వర్గీకరణ ప్రశ్నలు (Clasification type questions)
ఇ) సాధ్భశ్య ప్రశ్నలు (Analogy type questions)
ఎ) ఖాళీలను పూరించే ప్రశ్నలు :
→ ఈ రకమైన ప్రశ్నలు విద్యార్థికి సాధారణ జ్ఞాన సంబంధ విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి,
→ ఈ రకమైన ప్రశ్నలు విద్యార్థులలోని జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి,
→ పూరణ ప్రశ్న విధానంలో వాక్యాన్ని పూరించాలి.
ఉదా : ఖారతదేశంలోని పురాతన ఒండ్రుమట్టిని.... అంటారు.
లాభాలు :-
1) పూరణ ప్రశ్నలలోని పదజాలాన్ని, నిర్దిష్ట యథాద్థాలకు నియమాలకు, పద్ధతులను సంబంధించిన జ్ఞానాన్ని పరిగణన చేయవచ్చు.
2) సమాధానాన్ని గుర్తించటం కంటే ఎక్కువ జ్ఞానం కావలసి ఉంటుంది వ్యాసరూప ప్రశ్నలకంటే ఎక్కువ లక్ష్యాత్మకంగా గణనలు ఇవ్వవచ్చు.
3) వ్యాసరూప ప్రశ్నలకంటే త్వరగా దిద్దవచ్చు.
లోపాలు :
1.క్లిష్టమైన అభ్యసనానుభవాలను వీటి ద్వారా మాపనం చేయడం కష్టం
2.ఈ ప్రశ్నలకు అలవాటుపడిన విద్యార్థులను జప్తి పెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చి, బలహీనమైన అధ్యయ అలవాట్లను
పెంపొందించుకోవచ్చు
3.గణన చేసేటప్పుడు వాక్యదోషాలు, వ్యాకరణ దోషాలు విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడంలో అడ్డం వస్తాయి
4. ఎక్కువ సమాధానాలు గల పూరకాలను ఇవ్వడం వల్ల అస్పష్టత ఏర్పడుతుంది ప్రశ్న వాస్తవికత, ప్రయోజనం లోపిస్తాయి
బి) లఘు సమాధాన పరీక్షాంశం :
→ ఈ అంశానికి సమాధానాన్ని ఒక మాటలో గాని, కొన్ని మాటలలోగాని ఇవ్వవచ్చు
→ ఈ అంశం ప్రశ్న మాదిరిగా గానీ, అసంపూర్ణ వాక్యంగా గాని ఉండవచ్చు - వ్యాసరూప - పరీకాంశాలు, విషయతంత్ర పరీక్షాంశాలు ఈ రెండింటి ప్రయోజనాలను ఇది కొన్నింటిన కలిగియుండటమే
→ ఎక్కువమంది మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయులు దీనిలో మక్కువ చూపడానికి కారణం:
→ మిగిలిన వాటితో పోల్చినప్పుడు దీన్ని నిర్మించడం సులభం. వీటి ద్వారా సూత్రాలు, భావనలు, సిద్ధాంతాలు, నిర్వచనాలు, నియమాలు, సత్యాలను పరీక్షించడం సులభం.
లాభాలు :-
→ సమాధానాన్ని గుర్తించడం అంటే ఎక్కువ జ్ఞానం కావలసి ఉంటుంది
→ వ్యాసరూప ప్రశ్నలకంటే ఎక్కువ లక్ష్యాత్మకంగా గణనలు ఇవ్వవచ్చు.
→ సాపేక్షికంగా ఎక్కువ విషయ భాగాన్ని పూర్తిచేయవచ్చు.
లోపాలు :-
→ సంబంధం లేని ప్రత్యేకమైన యథార్థాలపై కేంద్రీకృతం చేయడం ప్రప్రథమమైన లోపం. దీనివల్ల ముఖ్యమైన లక్ష్యాలను మాపనం చేయడం వదలివేయబడుతుంది.
→ విద్యార్థులలోని సంశ్లేషణ, వ్యాఖ్యాన సామర్థ్యాలను పరీక్షించే నంక్షిప్త నమాధాన ప్రశ్నలను తయారు చేయడం కష్టం
సి) బహుళైచ్ఛిక ప్రశ్నలు :
→ బహుళైచ్ఛిక అంశాలు నాలుగు రకాలు
1.ఒక సరియైన సమాధానం
2. ఒక ఉత్తమమైన సమాధానం
3. సాదృశ్యరకం
4.(వ్యతిరేక) తారుమారైన బహుళైచ్ఛిక అంశం
1. ఒక సరియైన సమాధానం :
→ సులభతరమైన బహుళైచ్ఛిక ప్రశ్నల రకానికి చెందింది
→ దీనికి నాలుగైదు సమాధానాలు ఇస్తే అందులో ఏది సరియైనదో దానికి ముందు ఉన్న సంకేతాన్ని ఎత్తి బ్రాకెట్లలో రాయాలి
2.ఒక ఉత్తమమైన సమాధానం
→ విద్యార్థికి ఇచ్చిన సమాధాన జాబితాలో సమాధానాలు ఇంచుమించు ఒకే రకమైనవిగా ఉంటాయి.
వీటిని వికర్షణీయాలు అంటారు
→వికర్మణీయాలు అన్నీ సరైన సమాధానాలే అనిపిస్తాయి, కాని వాటిలో అత్యంత సముచితమైన ఒకదాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది
→ ఇవి కష్టమైనవి.
→ ఉన్నత పాఠశాల దశలో మొదటిరకం ప్రశ్నలు వాడటం- ఉచితం.
3) సాదృశ్యపు రకమైన అంశం :
→ గణితంలో వాడే అబ్రివేషన్స్ నుంచి ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఉదా (4: 2: 10)
→ విద్యార్థి మొదట అంశంలోని మొదట రెండు
→ మూడు నాలుగు భాగాలకు అన్వయిస్తాడు.
→ భాగాల మధ్యగల సంబంధాన్ని కనుగొని తద్వారా ఖడేరకవు సంబంధాన్ని
→ ఈ రకం అంశాన్ని సాధనా పరీక్షలలో కంటే ఎక్కువగా ప్రజ్ఞ పరీక్షలలో వాడటం జరుగుతుంది.
4) తారుమారైన బహుళైచ్ఛిక అంశం :
1) ఈ అంశాలలో జ్ఞప్తికంటే గుర్తింపుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు
2) మిగిలిన రకాల అంతాలలాగా (గిస్సింగ్ ఫ్యాక్టర్) ఊహించే కారకం అంత పెద్ద సమస్య కాదు. ప్రత్యామ్నాయాలు 4 కానీ
→అంతకంటే తక్కువ కానీ అయినట్లైతే ఒక సవరణ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఊహించే కారకాన్ని
→ఊహించే కారకం సూత్రం : S= R-w/N-1 ఊహించే కారకానికి సరిచేసిన సవరణ 5
→సరియైన సమాధానాల సంఖ్య R
→తప్పయిన సమాధానాల సంఖ్య w
→ప్రత్యామ్నాయాల సంఖ్య N
→ప్రత్యామ్నాయాలు ఎక్కువైతే ఊహించే కారకం విలువ తగ్గుతుంది గణన కీ (స్కోరింగ్ కీ) ఆధారంగా చేసికొని అక్ష్యాత్మకంగా దిద్దవచ్చు
→ ఈ రకపు ప్రశ్నల ద్వారా విద్యార్థి సమర్థవంత అవగాహనకు, నిర్ణయాలకు, వివేచనా సామర్థ్యాలను బాగా మూల్యాంకనం
చేయవచ్చు
లోపాలు :-
→ సరిగా అలోచించకుండా, బహుళైచ్చిక ప్రశ్నలను తయారుచేసి నాడే అవకాశం ఉంటుంది
→ ఒక సమాధానం కరెక్టుగా ఉండేటట్లు అంశాన్ని రాయడం చాలా కష్టం
→ చాలా ఎక్కువ సమయం పడుతుంది, రాసే ప్రశ్నలు ఎక్కువ స్థలం కూడా ఆక్రమిస్తాయి
డి) జతపరిచే ప్రశ్నలు: -
→ ఈ పద్ధతిలో రెండు వరుసలుంటాయి.
→ ఒక వరుసలో నమస్యలు, రెండవ దానిలో సమాధానం ఉంటుంది
→ సమస్యా వరుసలోని నమన్యకు నమాధాన వరుసలో నుంచి సరియైన సమాధానాన్ని జతచేసి దాని నంఖ్యను, గుర్తును
→ సమస్యకు పక్కగా ఇచ్చిన స్థలంలో సూచించాలి.
→ విషయానికి సంబంధించిన వివరాలను జాతీయ విషయాల మధ్య సంబంధాలను కార్యకారణాలను పరస్పర చర్యలను,
→ నిర్మాణాలు, లక్ష్యాలకు గల సంబంధం పరీక్షించడానికి ఈ రకమైన ప్రశ్నలు ఎక్కువగా ఉపయోగపడతాయి
జత పరిచే ప్రశ్నల లాభాలు :
1) జతపరిచే ప్రశ్నలను పూర్తిగా లక్ష్యాత్మకంగా తయారుచేయవచ్చు. త్వరగా కూడా గణించవచ్చు. ఇవి విశ్వసనీయత, సప్రమాణత గల అంశాలు
2) ఈ అంశాలను సరిగా నిర్మించినటైతే ఊహించే కొరకాన్ని తగ్గించవచ్చు.
నష్టాలు :
→ ఈ అంశంలో వాడే పదాలు (లేదా) క్లాసస్ (Chatuses) చిన్నదిగా ఉండాలి కాబట్టి విధ్యార్థి పూర్తి అవగాహన (లేదా! వివరణాశక్తిని గణించడం కష్టం
→ నేర్చుకొన్న విషయాలను, వినియోగించడం, వాటి తీర్పు తీర్చే శక్తి, బహుళైచ్చిక అంశాలకంటే తక్కువగా ఉంటుంది
ఇ) వర్గీకరణ ప్రశ్నలు :-
→ ఈ రకపు ప్రశ్నలలో నాలుగైదు పదాలు లేదా విషయాలు ఇవ్వబడటం జరుగుతుంది
→ అందులో ఒకటి మిగతా వాటితో సంబంధం లేనటువంటిదిగా ఉంటుంది. విద్యార్థులు, ఆ అంశాన్ని గాని, విషయాన్ని గాని మిగతా వాటి నుంచి వేరుపరచవలసి ఉంటుంది.
→ వీటి పరిధి చాలా తక్కువ
→ ఉదా : (అ) మొక్కజొన్న (ఆ) గోధుమ (ఇ) బరాని (ఈ) బార్లీ
ఎఫ్) సాదృశ్య ప్రశ్నలు :
→ ఈ రకం ప్రశ్నలలో మూడు అంశాలు వరుసగా ఇవ్వడం జరుగుతుంది
→ మొదటి జతలోని అంశాల మధ్యగల సంబంధం చూపడం జరుగుతుంది
→ మొదటి జతతో పోల్చి, రెండవ జతలోని భాళీని పూరించాల్సి ఉంటుంది
→ దీని ద్వారా విద్యార్థుల తార్కిక శక్తిని పరీక్షించవచ్చు
→ వీటి పరిమితి చాలా తక్కువ
→ ఉదా : బొద్దింక - ఆర్రోపొడా : వానపాము :
జి) ఉపాధ్యాయ నిర్మిత సాధన పరీక్ష ఉపయోగాలు :
→ ఇవి తయారుచేయుటకు, ఉపయోగించుటకు సరళమైనవి.
→ ఈ సదీక్షలు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని, నైపుణ్యాలను పరిశీలించడానికి ఉపయోగపడతాయి.
→ తరచుగా తరగతిలోని జోధనాళ్యనన ప్రక్రియలను పరీక్షించడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగవడతాయి.
→ విద్యార్థుల్లో ప్రేరణ కలిగించుటకు ఉపయోగపడుతుంది,
→ ఉపాధ్యాయుడు తాను ముందుగా రూపొందించుకున్న నిర్దిష్ట లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడతాయి ఉపాధ్యాయులకు ఈ పరీక్షలు పరిపుష్టి కలుగజేయును
→ విద్యార్థుల సామర్థ్యాలను, బలహీనతలను కనుగొనుటకు ఉపయోగపడును ఉపాధ్యాయుడు తన బోధనలోని లోపాలను కనుగొనుటకు, నమర్ధతతో బోధించుటకు, వ్యూహాలను రూపొందించుకొనుటకు
ఉపయోగపడును
→ ఈ పరీక్షలు విద్యార్థులను తరచుగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడును--
→ ఉపాధ్యాయునకు తరగతిలో ఏమి బోధించవలెను? ఎందుకు బోధించవలెను? ఎలా బోధించవలెను మొదలగు విషయాలను పరిశీలించును.