అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




గణిత మూల్యాంకనం / నిరంతర సమగ్ర మూల్యాంకనం









మదింపు, మూల్యాంకనం - నిర్వచనం, అవసరం. ప్రాముఖ్యత, ముఖ్యమైన పద్ధతులు :-

→ దేశమంతటా విద్యాప్రణాళికలో, బోధన, 'ూ ల్యాంకనంలో మార్పులను పాఠశాల పరిధిలోని అన్ని స్థాయిలలో సార్వబనీవం చేయాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవసరమైన అన్ని ప్రక్రియలు చేపడుతుంది. ఛాత్రోపాధ్యాయులు కూడా వారి, వారి శిక్షణా కాలంలో విద్యాప్రణాళికలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి సంపూర్ణంగా జ్ఞానాన్ని పొంది దాన్ని పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించాల్సి ఉంది. బోధనాభ్యసన ప్రక్రియ ఏదో ఒక సంఘటనకో, నందర్భనికో పరిమితం కాకుండా అభ్యసనాంశాలన్నింటినీ ఎల్లప్పుడూ పరిశీలిస్తూ, విద్యార్థులు శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి జరిగేలా విద్యాసంవత్సరమంగా ముదింపు చేసేదిగా ఉండాలి.

మదింపు, మాపనం, మూల్యాంకనం భావనలు :-

→ ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా విద్యార్థులు ఏర నేర్చుకున్నారు ఎంతవరకు నేర్చుకున్నారు? తనబోధన పంతవరకు ఫలపంతమైనది? అనే విషయాలను తెలుసుకోవడమనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కానీ, ఎప్పుడైతే విద్యార్థులు అభ్యసన, ఉపాధ్యాయుని విషయబోధన విధానంలో మార్పులు వచ్చాయంటున్నామో వాటి కనుగుణంగానే వారి అభ్యాసన ఫలవంతతను కూడా మార్చవలసిన అవసరముంది. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో వచ్చిన మార్పుల కసుగుణంగానే, విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించడానికి తగిన పద్ధతులను ఎన్నుకోవలసి ఉంది. మనం విద్యార్థుల అభ్యాసన స్థాయిలను గుర్తించడానికి కావచ్చు, లేదా ఉపాధ్యాయుని బోధనా సాఫల్యతను తెలుసుకోవడానికి కావచ్చు. వివిధ వద్దతులను ఉపయోగిస్తుంటాం. దీని కోసం మనకు వాడుకలో మదింపు (Assessment). మాపనం (Measurement), మూల్యాంకనం (Evaluation) మొదలైన పదాలున్నాయి



మదింపు :-

→ మదింపు, అనే పదాన్ని కొంత విస్తృత అర్థంలో ఉపయోగిస్తుంటారు. కేవలం విద్యార్థుల విద్యాపరమైన సాధనతోపాటు విద్యార్థి వైఖరులు, నైపుణ్యాలు, ఆనక్తులు మానసిక వికాస స్థాయిలను పరిమాజబద్ధంగా సూచించడమచేది మదింపులో

జరుగుతుంది

→ విద్యార్థుల అధ్యసనకు సంబంధించిన సమాచారాన్ని

సేకరించడం

వర్ణించడం

నమోదు చేయడం

స్కోరింగ్

వ్యాఖ్యానించడమనే ప్రక్రియలతో కూడుకున్నది మదింపు.

→ పాఠశాలలో నిర్వహించే వివిధ అభ్యసన సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు నేర్చుకొనే క్రమాన్ని తద్వారా వారిలో కలిగే చైతన్యాన్ని పరిశీలించే ప్రక్రియను "మదింపు' అని అంటారు. ఇది ఫలితానికి కాకుండా విధానానికి ప్రాధాన్యతనిస్తుంది. మదింపు అనేది సామర్థ్యాల వారీగా విద్యార్థుల ప్రగతిని పరిశీలించి నమోదు చేయడం ద్వారా జరుగుతుంది

మాపనం :

→ పరిమాణాన్ని అంచనా వేయడానికి లేదా కచ్చితంగా కనుక్కోవడానికి మాపనాన్ని వాడతాం. పరిమాణాన్ని యూనిట్లలో

తెలుపుతాం.


→ మనం ఎత్తును, బరువును, ప్రజ్ఞను సామర్థ్యాలను కూడా కొలుస్తాం. ఎత్తు, బరుపు పరిమాణాత్మకమైనవి అయితే ప్రజ్ఞ, సామర్థ్యం గుణాత్మకమైనవి.


→ ప్రజ్ఞను IQ తోనూ, విద్యాపరమైన సామర్థ్యాలను మార్కులు లేదా గ్రేడులతో నూ కొలవవచ్చు,

→ మాపనం అనే ప్రక్రియ పరిమాణాత్మకమైనది. విద్యార్థిని వివిధ పరీక్షల ద్వారా పరీక్షించి, వారి అభ్యసనా సామర్థ్యాన్ని

సంఖ్యాత్మక రూపంలో లెక్కించడమే మాపనం

→ ఈ విధంగా విధ్యార్ధి అభ్యసన స్థాయిని మార్కుల ద్వారా నిర్ణయించడాన్ని మాపనం అంటారు.

మూల్యాంకనం :-

→ బోధన, అభ్యసన అనంతరం విద్యార్థుల ప్రవర్తనలో వచ్చిన మార్చులకు చెందిన సాక్ష్యాల సంగ్రహంలో మూల్యాంకనం ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది.

ఈ సాక్ష్యాలు ఆధారంగా విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరణలు, తీర్చులు చేసి నిర్ణయాలు తీసుకోబడతాయి. సాధారణంగా తీర్పులు, నిర్ణయాలు నిర్దేశిత లక్ష్యాల ఆధారంగా చేయడం జరుగుతుంది.

→ ఈ విధంగా మూల్యాంకనా ప్రక్రియ 4 ప్రధాన ఉప ప్రక్రియలను కలిగి ఉంది.

1. సమాచారాన్ని సేకరించటం (Gathering information)

2.సమాచారాన్ని వ్యాఖ్యానించడం (Interpretation of Information )

3. తీర్పును చెప్పడం (Making judgements)

4. నిర్ణయం తీసుకోవడం (Taking Decisions)

→ మొదటి మూల్యాంకనా ఉపప్రక్రియ అయిన సమాచారం సేకరించడానికి మూల్యాంకనా సాధనాలు, సాంకేతిక నిధానాలు

అవసరం.

→ విద్యార్థుల ప్రగతిని తప్పు లేకుండా కొలవడానికి సప్రమాణత, విశ్వసనీయత కలిగి ఉపయోగించదగిన సాధనం, సాంకేతిక విధానం అవసరం. విద్యార్థి ప్రగతికి సంబంధించి కావలసిన సమాచారాన్ని సేకరించడానికి సరైన సాధనాలను ఎంపిక చేసుకొని ఉపయోగించగలగడం ఒక ముఖ్యమైన ఉపప్రక్రియ

→ గుణాత్మకతను వివరించడానికి మూల్యాంకనాన్ని మూడు దిశలలో ఉపయోగిస్తాం, మొదటి దిశ విద్యార్థి వ్యక్తిగతానికి

సంఖంధించింది.

→ అంటే విద్యార్థి మునుపటితో పోల్చుకుంటే ప్రస్తుత ప్రగతి ఎలా ఉంది ? అతని అభివృద్ధికి దోహాదపడే కష్టమైన అంశాలు .

→ అభ్యసన లోపాలు ఏవి ? రెండవ దిశ విద్యార్థి తోటి విద్యార్థులకు సంబంధించింది.

→ తరగతిలో అతని స్థానమేంటి ? తరగతిలోని ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు అతని ప్రగతి ఎంటి ? మూగవ దిశ నిర్ణయ ప్రమాణాలకు సంబంధించింది. నిర్ణయ ప్రమాణం అంటే విద్యార్థులు తమ తరగతికి నిర్దేశించిన సామర్థ్యాల దృష్ట్యా అశించిన

అభ్యసన స్థాయి అని అర్ధం.

→ మూల్యాంకనం, మాపనాల సంబంధాన్ని కింది విధంగా సూచించవచ్చు.

మూల్యాంకనం = మాపనం+ న్యాయ నిర్ణయం

(Evaluation) = (Measurement) + (Judgement)





మూల్యాంకనం - నిర్వచనం :-

→ పరిమాణ బద్ధంగా వ్యక్తీకరించడం జరిగే పరీక్షలే కాకుండా, ఆ వ్యక్తి ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు మొదలైన గుణాలన్నీ వర్ణితమై అతని స్థాయి నిర్ణయం పొందుతుంది. ఈ విధంగా విద్యాత్మక, విద్యేతర సాధనల స్థాయిని నిర్ణయించటమే

మూల్యాంకనం.

→ మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ, ఇది విద్యా లక్ష్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది వ్యక్తి ప్రవర్తనలో కలిగే



మార్పుల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది. నిర్దేశించుకొన్న లక్ష్యాలు సామర్థ్యాలు పూర్తిగా సాధించడం జరిగిందా, లేదా ఎంతవరకు సాధించడం జరిగింది అనేది ధ్రువీకరించే సాక్ష్య సేకరణ ప్రక్రియనే మూల్యాంకనం అంటాం

మదింపు, మాపనం, మూల్యాంకనాల మధ్యగల తేడాలు :

→ మాపనానికి మూల్యాంకనానికి మధ్య దగ్గర సంబంధం ఉన్నప్పటికీ, వాటి మధ్య తేడాలు కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి.

అవి

1.మూల్యాంకనం, మాపనం రెండూ పరీక్షమించడం అనే భావనలోని అంతర్భాగాలే,

2.మూల్యాంకనంలో మాపనం ఒక సాధనం

3) మాపనం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేయడం జరుగుతుంది

4) మదింపు అభ్యసన ప్రగతి నిర్ధారణకు రావడానికి జరిపే ప్రక్రియ, మూల్యాంకనం అభ్యసనాన్ని నిర్ధారించే ప్రక్రియ

5) మదింపు సామర్థ్యాలను అంచనా వేయడం, మూల్యాంకనం ద్వారా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.

6) మదింపు బోధనాభ్యసన విధానానికి ముడిపడి ఉంటుంది, మూల్యాంకనం బోధనాభ్యసన ప్రక్రియ ఫలితానికి సంబంధం

ఉంటుంది

7) మాపనం ఓ సన్నివేశాన్ని వివరిస్తే మూల్యాంకనం ఆ సన్నివేశానికి విలువ కడుతుంది.

8) మాపనం పరిమాణాత్మకంగా మాత్రమే మదింపు చేయగలదు.

9) మూల్యాంకనం పరిమాణాత్మకంగా, గుణాత్మకంగాను కూడా మదింపు చేయగలరు

10) మాపనం పరిమిత విషయాలనే మదింపు చేయగలదు, కానీ, మూల్యాంకనం పరిపూర్ణంగా సమగ్రంగా మదింపు చేయగలదు.

11) మాపనం పరిమితార్థాన్నిస్తుంది. ప్రయోజనం కూడా పరిమితంగా ఉంటుంది.

12) మూల్యాంకనం విస్తృతార్థాన్నిస్తుంది. విస్తృత ప్రయోజనాలు నిస్తుంది.

13) మాపనం నిర్ణీత కాలానికి, విషయాలకు పరిమితంగా ఉంటుంది.

14) మూల్యాంకనం నిరంతరం సాగే సమగ్రమైన ప్రక్రియ



మూల్యాంకనం - రకాలు : -

1.నిర్మాణాత్మక మూల్యాంకనం :

→ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అని కూడా విలుస్తాం:. బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు భావనలు ఏర్పడే క్రమంలో నిర్మాణాత్మక మూల్యాంకనం జరపబడుతుంది. బోధనా సమయంలో విద్యార్థుల అభ్యసన ప్రగతిని తెలుసుకొని విద్యార్థికి ఉపాధ్యాయునికి నిరంతరం పరిపుష్టిని అందించడానికి తోడ్పడుతుంది.

విద్యార్థులకు ఇచ్చిన పరిపుష్టి సాఫల్యత అభ్యసనకు వునర్భలనాన్ని చేకూర్చి, ప్రత్యేకంగా నరిదిద్దవలసిన అభ్యసనలోని తప్పులను గుర్తింపజేస్తుంది. ఉపాధ్యాయులకిచ్చిన పరిపుష్టి బోధనను మార్పు చేయడానికి, సామూహిక, వ్యక్తిగత లోపాలను సరిదిద్దేందుకు కావలసిన సమాచారం ఇస్తుంది దీని ద్వారా విద్యార్థుల ప్రగతిలో ప్రతీస్థాయిలో వస్తున్న మార్పులను, అభ్యసనానుభవాల ప్రభావాన్ని సామర్ధ్యాన్ని పరీక్షించి బోధనాభ్యసన అభివృద్ధికి తగిన సూచనలు, మార్పులు చేస్తారు.

→ భోధనలోని ప్రతి విభాగానికి తయారుచేసిన నిర్మాణాత్మక నికషలు, క్విజ్ లు, ప్రాజెక్టు పనులు, రాతపని, స్లిప్ టెస్ట్లు మొదలైన వాటిపైన 'నిర్మాణాత్మక మూల్యాంకనం ఆధారపడి ఉంటుంది. ఇవి బోధనాభ్యసనలో భాగంగా ఉపాధ్యాయులు నిర్మించినవే పరిశీలన పద్ధతులు, విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షిం చడానికి, అభ్యసన లోపాలను గుర్తించడానికి కూడా ఉపయోగ పడతాయి - ఈ విధంగా నిర్మాణాత్మక మూల్యాంకనం పిల్లవాడు ఏమి అభ్యసించాడనే నంగతిని నిర్దాదించడానికి ఒక సాధనంగాను, ఇంకా నేర్చుకోవలసినది ఏమిటి అని తెలిపి, తద్వారా విద్యార్థుల అభ్యసనను అభివృద్ధి పరచడానికి ప్రాతిపదికగా పనిచేస్తుంది నిర్మాణాత్మక మూల్యాంకనం జక అవిచ్ఛిన్న ప్రక్రియ

2) సంగ్రహణాత్మక మూల్యాంకనం : -


→ నిర్దేశిత పాఠ్యాంశాలు బోధనానంతరం లేదా ఒక కోర్సు పూర్తయిన తర్వాత ముందుగా ఏర్పరచుకున్న సామర్ధ్యాలు ఎంతమేరకు సాధింపబడినాయో తెలుసుకోవడానికి ఉద్దేశించిన మూల్యాంకనాన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటారు.

దీనినే సంకలన మూల్యాంకనం అని కూడా పిలుస్తాం. ఒక నిర్దిష్ట పాఠ్యక్రమ అనంతరం ఉద్దేశించిన లక్ష్యము ఫలితాలపై విద్యార్థిని సాధించిన నైపుణ్యతను లేదా పాఠ్యక్రమం గ్రేడులను నిర్ణయంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. అభ్యసన , లక్ష్యాలు, మనం

ఉపయోగించే సంగ్రహణాత్మక మూల్యాంకన పద్ధతులను నిర్ణయిస్తాయి.



→ సంగ్రహణ మూల్యాంకనం న్యాయ నిర్ణయ స్వభావం కలంగా ఉంటుంది, ఇది పిల్లల కార్యసిద్ధికి కొలత. అంతేకాని, పిల్లల రోజువారీ అభివృద్ధి కాదు. కాబట్టి ఇది విద్యార్థి స్తాయి మూల్యాంకనం.

ఇందులో విద్యార్థుల అభ్యనన బోధనా కార్యక్రమం అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యలకు సంబంధించిన నిర్ణయాలు చేయబడి ఉంటాయి

→ ఇది ఒక ప్రక్రియ ఫలితం లేదా ఒక విద్యార్థి సాధనపై తుది నిర్ణయం జరుగుతుంది. విధ్యార్ధిని ఉత్తీర్ణున్ని చేయాలా వద్దా , పై తరగతికి పంపించాలా వంటి నిర్ణయాలు చేయడానికి వీలవుతుంది.


3.లోపనిర్ధారణకు మూల్యాంకనం :-

→ విద్యార్థిని మూల్యాంకనం చేసేటప్పుడు, వివిధ అంశాలలో, రంగాలలో విద్యార్థిలోని లోపాలు బయటపడుతూ ఉంటాయి యా బోపాలను ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా గుర్తించి, ఆ లోపాలను సవరించే కార్యక్రమం చేపట్టాలి. ఆ విధంగా భోషాలు న రంగాలలో ఉన్నవో గుర్తించే ప్రక్రియే లోప నిర్ధారణ మూల్యాందనం.

ఉదా :- 5వ తరగతిలో భిన్నాలకు సంబంధించిన సమస్యను పరిశీలిద్దాం.


3/4 + 2/7 సమస్యను సాధించాలంటే, విద్యార్థికి ఏఏ భావనలు తెలిసి ఉండాలి ?

1) సంఖ్యాభావన

2) కూడిక, గుణకారం, భాగహారం ప్రక్రియలపై అవగాహన

3) సజాతి భిన్నాల కూడిక

4) క.సా. గు, (కనిష్ట సామాన్య గుణిజం)


→ మొదలైన భావనలు కలిగి ఉండడంతో పాటు వాటిపై ఆధారపడిన సమస్యలను విద్యార్థులు సాధించగలగాలి. ఒకవేళ సమస్యను నరిగా సాధించలేకపోతే, ఆయా అంశాలలో విద్యార్థిలోని లోపాలను గుర్తించి నవరించే కార్యక్రమం చేపట్టాలి.

→ ఈ విధంగా విద్యార్థి బల, దుర్భలాలను వివిధ విషయాలను అంచనా వేయడానికి అనువుగా ఎంచుకొన్న పాల్యాంశం నుంచి అన్ని కోణాల నుంచి వీకైన్ని ప్రశ్నలను సంధించి విద్యార్థిని సమాధానం ఇవ్వమనాలి. ఆ సేనూధాన పత్రాన్ని సరిదిద్దేటప్పుడు స ఉపాధ్యాయునికి, ఆ విద్యార్థి ఏయే అంశాలలో భావనలలో బలంగా లేదా దుర్బలంగా ఉన్నాడో అవగతమవుతుంది. విద్యార్థి అభ్యసన, ధారణలలో గల లోపాలను గుర్తించడం ఉపాధ్యాయుని బాధ్యత. ఈ విధంగా ఆ లోపాలను గుర్తించే మూల్యాండనమే లోపనిర్ధారణ మూల్యాంకనం.


4) ప్రాగుక్తిక మూల్యాంకనం :

→ విద్యార్థి భవిష్యత్ లో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా, సమర్దవంతంగా ఎదగగలడో ఆ నైపుణ్యాలను అంచనా వేసి

చెప్పే మూల్యాంకనాన్ని ప్రాగుక్తిక మూల్యాంకనం అంటాం. ఈ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు రాబోయే కాలంలో విద్యార్థి ఏ రంగంలో మంచి ప్రతిభను కనబరచగలదో, ఏ రంగంలో బలహీనుడో తెలుసుకొని విద్యార్థికి మార్గదర్శకత్వం చేయాలి. ఈ మూల్యాంకనంలో విద్యార్థిలోని సహజంగా ఉన్న నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభలను కూడా అంచనా వేయటం జరుగుతుంది. ఈ మార్గదర్శనం విద్యార్థికి తాను ఉన్నత విద్యలో లేదా ఉద్యోగంలో ఏ రంగంలో ముందుకు వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది.

→ పైన చర్చించిన వివిధ రకాల మూల్యాంకనాలు నిర్ణీత సమయంలో అవసరమైన సందర్భంలో ఉపాధ్యాయుడు నిర్వహించాలి. ఇవి బోధనాళ్యసన కార్యక్రమం మరింత మెరుగుపడడానికి సహకరిస్తాయి.

కృత్యం


→ మదింపు, మావనం, మూల్యాంకనంపై మీ అవగాహనను, గణిత అభ్యసనలో విద్యార్థుల నిష్పాదనకు ఎలా అన్వయిస్తారు. నివేదికను రూపొందించండి.




నిరంతర సమగ్ర మూల్యాంకనం :-

→ విద్యాప్రణాళిక బోధనాభ్యననకు ఎంత ప్రాముఖ్యతనిస్తుందో విద్యార్థుల ప్రగతిని సమగ్రంగా పరిశీలించేందుకు కూడా అంతే ప్రాముఖ్యతనిస్తుంది. పాఠశాలస్థాయి మూల్యాంకనం, విద్యార్థుల జ్ఞాన నిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా మదింపు చేసేదిగా ఉండాలి.


NCF - 2005, SCF - 2011, RTE - 2009 నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని కోరాయి. అందుకు అనుగుణంగా మన రాష్ట్రం మూల్యాంకనంలో నూతన విధానం ప్రవేశపెట్టింది. ఎల్లవేళలా గణిత అభ్యసనలో విద్యార్థి అభివృద్ధిని మదింపు చేయడమే నిరంతర మూల్యాంకనం ఈ నూతన విధానం ప్రకారం, మూల్యాంకనం నిరంతరం జరగాలి. అంతేకాక పాండిత్య, పాండిత్యేతర రంగాలలోనూ జరగాలి . ఆంటే మూల్యాంకనం సమగ్రంగా జరగాలి. దానినే

నిరంతర సమగ్ర మూల్యాంకనంగా భావించవచ్చు.



నిరంతర మూల్యాంకనం :-

→ నిరంతరం" అంటే బోధనాభ్యసన ప్రక్రియ ఒక సంఘటనకో, నందర్భానికో పరిమితం కాకుండా అభ్యసనాంశాలన్నింటినీ పరిశీలించడం, అభ్యసన లోపాలను గుర్తించి నవరణాత్మక చర్యలు వినియోగించడం ద్వారా ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇరువురూ స్వీయ మూల్యాంకనం చేసుకోగలగాలి. బోధనాభ్యసనలో నిరంతర మూల్యాంకనం ద్వారా మనం విద్యార్థి ప్రస్తుత స్థాయిని అతడు ఏ దిశగా అభివృద్ధి చెందుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం. నిరంతర మూల్యాంకనం అనేది విద్యార్థులు మనం ఆశించే లక్ష్యాల దిశగా ఏ రకంగా ముందుకు పోతున్నారో, సామర్థ్యాలను విద్యార్థులు ఏ రకంగా సాధించ గలుగుతున్నారు అనే విషయాలను నిరంతరం మదింపు చేసే ప్రక్రియ

→ ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసన అనుభవాలను అభివృద్ధి పరచడానికి, తదనుగుణంగా తన బోధనా కార్యక్రమాలలో మార్పు తీసుకురావడానికి నిరంతర మూల్యంకన ప్రక్రియను చేపట్టాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల బలహీనతలను, బలాలను గుర్తించగలిగేటట్లు చేసే ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించే ప్రక్రియలో నిరంతర మూల్యాంకనం తోడ్పడుతుంది. నిరంతర మూల్యాంకనం అనేది విద్యార్థులకు సంబంధించిన పరిపుష్టిని ఉపాధ్యాయునికి చేకూర్చుతూ కొన్ని నిర్ణయాలు చేయడంలో

→ ఉపాధ్యాయులకు సహాయపడుతుంది సమగ్రం" అంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మకరంగాలలో అభివృద్ధి అని అర్థం. ఇందుకోసం పాండిత్య, పాండిక్యేతర రంగాలను విడివిడిగా చూడకుండా, రెండింటికీ నేమాన ప్రాధాన్యతను ఇవ్వడం. వీటిని మదింపు చేయాలంటే నిరంతర, సమగ్ర మూల్యాంకనం అవసరం


సమగ్ర మూల్యాంకనం :

నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యాలు :

→ విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలలోని నైపుణ్యాలను అభివృద్ధి వరచడం

→ ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడం వల్లె వేసే పద్ధతిని నివారించడం

→ సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకొనేటట్లు ప్రోత్సహించడం

→ బోధనాభ్యననతో మూల్యాంకనాన్ని జతకూర్చడం విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం

→ ఉపాధ్యాయుల బోధనా కార్యక్రమం, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా మార్పులు చేయడం లోప నిర్ధారణ పరీక్షలు జరిపి, లోప నిదానం చేయడం

→ బోధనాభ్యననతో ప్రక్రియలో విద్యార్థి కేంద్రీకృత విధానం అనలు చేయడం

→ బోధనాభ్యసన కార్యక్రమంలో ఉపయోగిత, అభిలషణీయత, ప్రభావశీలత మొదలైనవి నిర్ణయించడం



నిరంతర సమగ్ర మూల్యాంకనం - లక్షణాలు :-

→ విషయ, విషయేతర రంగాలకు సంబంధించిన సామర్థ్యాలను విద్యార్థులు ఎంతమేర సాధించగలుగుతున్నారు. ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు ఆనే విషయాన్ని నిరంతరం మదింపు చేయడం.

→ మూల్యాంకనం నిరంతరంగా నియమిత కాల పరిధుల్లో జరగడం.

→ ఉపాధ్యాయునికి సమర్థవంతమైన బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించడంలో సహాయపడటం

→ వివిధ రకాల సాధగాల ద్వారా వివిధ అంశాలపై మదింపు చేసి పద్ధతులను వాడి అన్నింటిపై సమగ్రంగా పరిపూర్ణంగా

→ మదింపు చేసి ఒక నిర్ణయానికి రావడం.

→ నిరంతర సమగ్ర మూల్యాంకనం - ప్రయోజనాలు

→ విద్యార్థి సాధనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి సాధనా స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం. వారు ఏ విషయాల్లో వెనకబడి ఉన్నారో ఏ బోధనాంశాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందో విద్యార్థులకు

తెలియజేయడం

→ విద్యార్థి అభిరుచులను, వైఖరులను గుర్తించగలగడం. అదే విధంగా విద్యార్థుల వైఖరులు, ప్రవర్తనల విలువంలో వచ్చే మార్పులను లక్షణాలను గుర్తించేటట్లు తోడ్పడటం

నిర్దేశించిన, నియమిత కాల పరిధుల్లో నిర్మాణాత్మక మదింపు జేయడం

→ మూల్యాంకనం సమగ్రంగా జరగడం వల్ల విద్యార్థి పొండిత్య, సహ పాండిత్య రంగాలలో నమ ప్రాధాన్యత కలిగి ఉంటుంది నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో అభ్యసన మదింపు రెండు విధాలుగా జరుగుతుంది. అవి

1) అభ్యసనం కోసం మదింపు

2) అభ్యసనం యొక్క మదింపు

అభ్యసనం కోసం మదింపు :-

→ అభ్యసనం కోసం మదింపు' వాక్యంలో 'మదింపు' అభ్యసన పురోగతికి సహాయపడుతుంది అనే అర్థం స్ఫురిస్తుంది, ఇది మూల్యాంకనంలో రకాలైన "నిర్మాణాత్మక మూల్యాంకనం" లక్ష్యం, అందులో ఇమిడి ఉన్న మదింపు ప్రక్రియలన్నీ 'అభ్యసనం కోసం మదింపు గా పరిగణించవచ్చు. ఇందువల్ల 'అభ్యసనం కోసం మదింపు' అనేది బోధనాభ్యసన ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది, విద్యార్థులలో గణిత భావనలు ఏర్చడుతున్నప్పుడు, గణిత ప్రక్రియలు, సూత్రాలు, నియమాలు నేర్చుకుంటున్న క్రమంలో నియత, అనియత రూపంలో జరిగే మదింపు ప్రక్రియలన్నీ "అభ్యసన కోసం మదింపు" అపుతాయి.

ఇది ఉపాధ్యాయులకు ఆ తరగతిగదిలో వెలుపల జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలు, ఆ ప్రక్రియల వల్ల కలిగే అభ్యసన ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తద్వారా అవసరమైన బోధనాభ్యసన ప్రక్రియలను మార్పు చేసుకొనే అవకాశం ఇస్తుంది.

అలాగే విద్యార్థులకు తమ అభ్యసన ప్రగతిని వెనువెంటనే తెలుసుకొనేందుకు ఒక పరిపుష్టి సాధనంగా ఉపయోగపడుతుంది

లక్షణాలు :-

→ ఉపాధ్యాయుడు, విద్యార్థులు కలిసి నమస్వయంగా నిర్వహించుకొనే విధానం

→ దీని ద్వారా విద్యార్థుల స్థాయి గుర్తించి వారికి ఎక్కడ సహకరించాలి. ఏ విధంగా సహాయమందించాలో వాటి గురించి

ఉపాధ్యాయులు తెలుసుకొంటారు.

→ ఇది బోధనలో అంతర్భాగంగా, నిరంతరంగా జరిగే అభ్యసన మూల్యాంకన ప్రక్రియ

→ అభ్యసన పురోభివృద్ధిలో ఉపకరిస్తుంది

→ అన్ని రకాల అభ్యసన లక్ష్యాలను సాధింపజేస్తుంది

→ ఇది గుణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది

→ విద్యార్థులు సాధించే సామర్థ్యాలను గుర్తించడానికి ఉపకరిస్తుంది

అభ్యసన కోసం మదింపు - ప్రయోజనాలు :-

→ ఉపాధ్యాయులు విద్యార్థులు ఏమి నేర్చుకున్నారు ? ఎలా నేర్చుకున్నారు ? నేర్చుకోవడంలో ఏయే అంశాలు సహకరించాయో

తెలుసుకోవడానికి తోడ్పడుతుంది

→ అభ్యసనాన్ని క్రమబద్ధీకరించడం, అభ్యసనలో లోటుపాట్లు, వెను వెంటనే తెలుసుకోవడం, దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి

వీలవుతుంది.

→ ఈ మదింపు ప్రక్రియ అనియత రూపంలో జరిగే అవకాశం ఉన్నందున, విద్యార్థులను పరీక్షిస్తున్నట్లు, వారు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా సహజ సిద్ధంగా మదింపు చేసే అవకాశాలు కల్పిస్తుంది

→ విద్యార్థులు కూడా తమ అవగాహన లోపాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థుల సహాయంతో నరిదిద్దుకునే అవకాశం ఉన్నందువల్ల అందరూ నిర్దేశిత విద్యా ప్రమాణాలు అందుకోవడానికి బకాశాలు హెచ్చుగా ఉంటాయి.

→ విద్యార్థులలో కూడా: తమకు తామే భావనలను ఏర్పర్చుకునే శక్తి సామర్థ్యాలు, వివిధ అభ్యసన మార్గాలను ఎంచుకోవడం అంటే నేర్చుకోవడాన్ని నేర్పడం (Learning how to learn) పై దృష్టి ఏర్పడుతుంది


అభ్యసనం యొక్క మదింపు :-

→ విద్యార్థులు వివిధ అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ, వివిధ గణిత భావనలను, వాటిపై ఆధారపడే వివిధ నమస్యలను సాధించే నైపుణ్యాలను పొందుతారు. విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత ఏ. ఏ అంశాలను, ఎంతమేరకు అభ్యసించారో తెలుసుకోవడానికి ఉపకరించేదానిని, "అభ్యసనం యొక్క మదింపు" అని అంటారు. ఇది విద్యార్థుల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఉపాధ్యాయుల ద్వారా గాని, బాహ్యనికషల ద్వారా లేదా రెండింటి ద్వారా గాని దీనిని మదింపు చేస్తారు. ఈ వద్ధతిలో చాలా మంది విద్యార్థులు ఒకేసారి, ఒకే విధంగా మదింపు చేయబడతారు. సాధారణంగా ఒక యూనిట్ లేదా ఒక టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు "అభ్యసనం యొక్క మదింపు"ను తెలియజేస్తాయి. ఇది విద్యార్థుల అభ్యసన సాధనపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది

లక్షణాలు :-

→ విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయుల ద్వారా గానీ, బాహ్యనికషల ఆధారంగా గానీ అంచనా వేస్తుంది

→ విద్యార్థుల ప్రగతి ఫలితాలను, మార్కులు, గ్రేడులు, గ్రేడుల రూపంలో ప్రదర్శించబడుతుంది

→ విద్యార్థులందరినీ ఒకే విధానంలో మదింపు చేయడం ఇరుగు

అభ్యసనం యొక్క మదింపు - ప్రయోజనాలు :-

→ విద్యార్థుల ప్రగతిని నమోదు చేయడానికి, ఇతరులకు తెలియజేయడానికి

→ విద్యార్థులు ఏ మేరకు అభ్యసన ఫలితాలు సాధిచినారో తెలుసుకోవడానికి

→ విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయడానికి

→ పాఠశాల స్థాయిలో, తరగతి స్థాయిలో విద్యార్ధుల గుణాత్మక అభ్యసనాన్ని పోల్చుకోవడానికి

→ బోధనాభ్యసనను మెరుగుపరచుకోవడానికి అభ్యసన మదింపు ఉపయోగపడుతుంది.


కృత్యం:

→ ప్రాథమికస్థాయి గణితంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలుపరచబడుతున్న తీరుపై పాఠశాల ఉపాధ్యాయులతో చర్చించి, మూల్యాంకనంలో వచ్చిన మార్పుల ఆధారంగా నివేదిక రూపొందించండి.


నిర్మాణాత్మక మూల్యాకనం, సాధనాలు:-


→ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా, పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన విధానాలు విద్యార్థులను సమగ్రంగా

పరిశీలించి నమోదు చేసేవిగా ఉండాలి. ఉపాధ్యాయులు తరగతి గది లోపల, బయట విద్యార్థులను పరిశీలిస్తూ చేసే అంశాలతో పాటు క్రమానుగతంగా నిర్ణీత కాలష్యవధులలో నిర్వహించే మూల్యాంకనం అవసరం.

ఇవి వార, పక్ష మాస టర్మినల్ రూపాలలో కూడా ఉండటం అవసరం.


విద్యార్థులు ఎలా నేర్చుకున్నారు ? ఏమి నేర్చుకున్నారు ? అనే అంశాలు పరిశీలించడంతో పాటు అభ్యసనాంశం స్థిరంగా ఉండేందుకు మూల్యాంకనం తోడ్పడాలి. జ్ఞానం, అవగాహన, వినియోగం

విశ్లేషణ, నూతన సందర్భాలలో సర్దుబాటు చేసుకోవడం అనే అంశాలతోపాటు అభిరుచులు, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక ఎదుగుదల, ఆరోగ్యకరమైన విషయాలను కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి

1) నిర్మాణాత్మక మదింపు (Formative Assessment)

2) సంగ్రహణాత్మక మదింపు (Summative Assessment)

1.నిర్మాణాత్మక మదింపు:-

→ పాఠ్యాంశబోధన జరుపుతున్నప్పుడు తరగతి గదిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో విద్యార్థులు పాల్గొంటున్నప్పుడు పరిశీలిస్తూ అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనాన్ని "నిర్మాణాత్మక మూల్యాంకనం" అంటాం.

దీనినే రూపణ మూల్యాంకనం అని కూడా అంటారు.

→ ఇది బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ స్థాయిలలో జరుగుతుంది. దీని వలన అభ్యసనలో లోపనిర్ధారణ, లోపనిదానం జ్ఞాన నిర్మాణానికి దోహదం చేస్తుంది.

→ ఈ మూల్యాంకనం తరగతి గదిలో స్లిప్ టెస్ట్ల రూపంలో, మౌఖిక పరీక్ష రూపంలో రాతపరీక్ష రూపంలో, విద్యార్థులు అభ్యసన కృత్యాలలో పాల్గొన్న తీరు, వారి అభ్యసన సాక్ష్యాలైన నోటుపుస్తకాలు, ప్రాజెక్టు నివేదికలు మొదలైన వాటిపై మదింపు ఆధారంగా జరుగుతుంది. ఈ రకమైన మూల్యాంకనంలో రకరకాలు నికషలు, నియోజనాలు, క్విజ్ పోటీలు, ప్రాజెక్టులు, జట్టువనులు, వక్తృత్వాలు, క్లబ్ల ద్వారా చేయగలిగే వివిధ కృత్యాలు, ఇంటర్వ్యూలు, చెలు , సంఘటనలను నమోదు చేసే రికార్డులు, పరిశీలనా కార్యక్రమాలు విద్యార్థి తయారుచేసే వస్తువులూ, నమూనాలు మొదలైనవన్నీ వాడుకోవచ్చు. అంటే

→ ఉపాధ్యాయుడు విద్యార్థిని విద్యానంవత్సరమంతా సమగ్రంగా పరీక్షిస్తూ, పరిశీలిస్తూ ఉండాలి.


నిర్మాణాత్మక మూల్యాంకన విధానాలు - సాధనాలు:-

→ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయుడు చెక్ లిస్ట్లు, విద్యార్థుల నోట్పున్తకాలు, పిల్లల డైరీలు, రేటింగ్ స్కేలు, పోర్టుఫోలియోలు, పత్రావళులు, వ్యక్తిగత పరిశీలనలు, ఉపాధ్యాయుని డైరీలు మొదలైన సాధనాల ద్వారా మూల్యాంకనం

చేయవచ్చు.


నిర్మాణాత్మక మూల్యాకనం, సాధనాలు :-


→ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా, పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన విధానాలు విద్యార్థులను సమగ్రంగా పరిశీలించి నమోదు చేసేవిగా ఉండాలి.

ఉపాధ్యాయులు తరగతి గది లోపల, బయట విద్యార్థులను పరిశీలిస్తూ చేసే అంశాలతో పాటు క్రమానుగతంగా నిర్ణీత కాలష్యవధులలో నిర్వహించే మూల్యాంకనం అవసరం. ఇవి వార, పక్ష మాన టర్మినల్ రూపాలలో కూడా ఉండటం అవసరం. విద్యార్థులు ఎలా నేర్చుకున్నారు ? ఏమి నేర్చుకున్నారు ? అనే అంశాలు పరిశీలించడంతో పాటు అభ్యసనాంశం స్థిరంగా ఉండేందుకు మూల్యాంకనం తోడ్పడాలి. జ్ఞానం, అవగాహన, వినియోగం

విశ్లేషణ, నూతన సందర్భాలలో సర్దుబాటు చేసుకోవడం అనే అంశాలతోపాటు అభిరుచులు, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక ఎదుగుదల, ఆరోగ్యకరమైన విషయాలను కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి

1) నిర్మాణాత్మక మదింపు (Formative Assessment)

2) సంగ్రహణాత్మక మదింపు (Summative Assessment)

1) నిర్మాణాత్మక మదింపు

→ పాఠ్యాంశబోధన జరుపుతున్నప్పుడు తరగతి గదిలో కల్పించిన అభ్యసన కృత్యాలలో విద్యార్థులు పాల్గొంటున్నప్పుడు పరిశీలిస్తూ అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు చేసే మూల్యాంకనాన్ని "నిర్మాణాత్మక మూల్యాంకనం" అంటాం. దీనినే

రూపణ మూల్యాంకనం అని కూడా అంటారు.

→ ఇది బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ స్థాయిలలో జరుగుతుంది. దీని వలన అభ్యసనలో లోపనిర్ధారణ, లోపనిదానం జ్ఞాన

నిర్మాణానికి దోహదం చేస్తుంది.

→ ఈ మూల్యాంకనం తరగతి గదిలో స్లిప్ టెస్ట్ల రూపంలో, మౌఖిక పరీక్ష రూపంలో రాతపరీక్ష రూపంలో, విద్యార్థులు అభ్యసన కృత్యాలలో పాల్గొన్న తీరు, వారి అభ్యసన సాక్ష్యాలైన నోటుపుస్తకాలు, ప్రాజెక్టు నివేదికలు మొదలైన వాటిపై మదింపు ఆధారంగా జరుగుతుంది. ఈ రకమైన మూల్యాంకనంలో రకరకాలు నికషలు, నియోజనాలు, క్విజ్ పోటీలు, ప్రాజెక్టులు, జట్టువనులు, వక్తృత్వాలు, క్లబ్ల ద్వారా చేయగలిగే వివిధ కృత్యాలు, ఇంటర్వ్యూలు, చెలు , సంఘటనలను నమోదు చేసే రికార్డులు, పరిశీలనా కార్యక్రమాలు విద్యార్థి తయారుచేసే వస్తువులూ, నమూనాలు మొదలైనవన్నీ వాడుకోవచ్చు. అంటే

→ ఉపాధ్యాయుడు విద్యార్థిని విద్యానంవత్సరమంతా సమగ్రంగా పరీక్షిస్తూ, పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మక మూల్యాంకన విధానాలు - సాధనాలు

→ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయుడు చెక్ లిస్ట్లు, విద్యార్థుల నోట్పున్తకాలు, పిల్లల డైరీలు, రేటింగ్ స్కేలు, పోర్టుఫోలియోలు, పత్రావళులు, వ్యక్తిగత పరిశీలనలు, ఉపాధ్యాయుని డైరీలు మొదలైన సాధనాల ద్వారా మూల్యాంకనం

చేయవచ్చు.

→నిర్మాణాత్మక మూల్యాంకనంలో కింద పేర్కొన్న నాలుగు సాధనాలు మన రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాం. కాని ఇవి కాక అదనంగా పిల్లల భాగస్వామ్యం - ప్రతిన్పందనలు రాత అంశాలు ప్రాజెక్టు వనులు లఘువరీక్ష (ప్లిప్టెస్ట్)

మరికొన్ని ఉండవచ్చు

→ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎప్పుడు ఎలా నిర్వహించాలి? నిర్మాణాత్మక మూల్యాంకనం జోధనాథ్యననలో అంతర్భాగం కాబట్టి, ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రగతిని పరిశీలించి నమోదు

చేయాలి

→ విద్యా సంవత్సరంలో FA 1, FA 2, FA 3. FA 4 ద్వారా నాలుగు సార్లు నిల్మాణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించి, విద్యార్థుల

→ ప్రగతిని గికార్డులో నమోదు చేయాలి.

→ ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాల సాధనను పరిశీలిస్తూ ప్రగతిని నిర్ధారించాలి.

→ ఉపాధ్యాయుడు టీచర్ డైరీ, నోట్ వున్తకాలు, ప్రాజెక్టు నివేదికలు, దిద్దిన జపాలు పత్రాల పరిశీలనల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించాలి.


→ నిర్మాణాత్మక మూల్యాంకనంలో నాలుగు సాధనాలను ఉపయోగించాలి. అవి ;

1) పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు (10 మార్కులు)

2) రాత అంశాలు (నోటుపుస్తకాలు, ఇంటిపని) (10 మార్కులు)

3) ప్రాజెక్టుపనులు (10 మార్కులు)

4) స్లిప్ టెస్ (20 మార్కులు)

మొత్తం (50 మార్కులు)



సంగ్రహణాత్మక మూల్యాంకనం :-

→ విద్యానం వత్సరంలో విద్యార్థి పాండిత్య, పాండిత్యేతర రంగాలలో చేసిన కృషి, సాధించిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని చేసే మూల్యాంకనం 'సంగ్రహణాత్మక మూల్యాంకనం

→ విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకొన్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడం అని అర్థం. దీనిలో కోర్స్ మొత్తం పూర్తయిన తర్వాత లేదా నిర్ధారిత పాఠ్యప్రణాళిక పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనను మూల్యాంకనం చేస్తాం.




సంకలనాత్మక మదింపు లక్షణాలు :-

→ అభ్యసన స్థాయిని మదింపు చేస్తుంది

→సాధారణంగా, ఒక టర్క్ చివరలో నిర్వహించబడి విద్యార్థికి తాను ఇప్పటివరకు ఏమి, ఎంతనేర్చుకోగలిగాడో తెలియజేస్తుంది.

→ సాంప్రదాయక పద్ధతుల ద్వారా నిర్వహించబడుతుంది.

వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అనే వంటను అతిథులు రుచి చూస్తే

మూల్యాంకనం" - రాబర్ట్ స్టేక్స్

సంగ్రహణాత్మక మూల్యాంకనం-సాధనాలు :-

- సంగ్రహణాత్మక మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయునికి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలుస్తుంది. రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన సి.సి.ఇ. విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో మాదిరిగా, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అనేక రకాల సాధనాలను ఉపయోగించి విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి వీలుగాదు. అందువల్ల విద్యార్థుల ప్రగతిని రాత పరీక్షల ద్వారా మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో మూల్యాంకనం చేసేటప్పుడు1, 2 తరగతులకు రాతపరీక్షతోపాటు, మౌలిక పరీక్షలను కూడా ఉపాధ్యాయుడు సాధనాలుగా ఉపయోగించాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నలను విద్యాప్రమాణాల వారీగా ఇవ్వాలి. కొన్ని విద్యా ప్రమాణాలకు మౌలిక పరీక్ష కూడా అవసరం ఉంటుంది

సంగ్రహణాత్మక మూల్యాంకనం ఆధారంగా సాధన నికష - నిర్మాణం:

→ నికషలన్నీ నియమిత కాల వ్యవధులలో నిర్వహించి, వారి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ అంచనాల శధారంగా విద్యార్థి సాధన నైపుణ్యం లేదా లోపాలు గుర్తించి, దానికనుగుణంగా లోపనిదాన కార్యక్రమాలు చేపట్టాలి సాధన నికషను క్రమపద్ధతిలో నిర్వహిస్తే అది ఉపాధ్యాయునికి, విద్యార్థికి ఎంతో మార్గనిర్దేశనం చేస్తుంది .

సాధన నికష నిర్మాణం :-

ఇది విద్యార్థి గణిత సాధన ఎంతవరకు ఎంతబాగా జరిగిందో నిర్ధారించుకోవడానికి ఉపాధ్యాయుడు నిర్వహించే నికష ఈ నికష ద్వారా ఉపాధ్యాయుడు తన బోధనాభ్యసన ఫలితాలను కూడా తెలుసుకోగలుగుతాడు. అదే సమయంలో విద్యార్థికి తాను ఎదుర్కొనే అభ్యసనా సమస్యలు అవగ అవుతాయి, ఉపాధ్యాయుడు తాను నిర్దేశించిన లక్ష్యాలను విద్యార్థి సాధించాడో లేదో తెలుసుకొంటూ, విద్యార్థి విషయ ప్రావీణ్యతను ఎంతగా సాధించాడో నిర్ధారించుకొంటాడు. అంతేకాకుండా తాను నిర్వహించిన బోధనాభ్యసన ఏ మేరకు ఫలవంతం అయిందో, ఇంకా ఏయే మార్పులు చేయాలో నిర్ధారించుకోగలుగుతారు. విద్యార్థికి సరైన మార్గదర్శనం చేయగలుగుతాడు


నికష నిర్మాణంలోని సోపానాలు:-

1. ప్రశ్నాకృతి భారత్వ పట్టిక తయారీ :

→ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలలో ఎన్ని వ్యాసరూప ప్రశ్నలుండాలి. వాటికి సమాధానం రాయడానికి సగటున ఎంత నమయం

అవసరమో అంచనా వేసుకోవాలి.

→ ప్రశ్నాపత్రంలో ఎన్ని సంక్షిప్త సమాధాన ప్రశ్నలుండాలి. వాటికి సమాధానం రాయడానికి సమయ ఎంత ఆపసరమో అంచనా

వేసుకోవాలి.

→ ప్రశ్నాపత్రంలో ఎన్ని లఘు సంక్షిప్త సమాధాన ప్రశ్నలుండాలి. వాటికి సమాధానం రాయడానికి ఎంత నమయం అనసరమో

అంచనా వేసుకోవాలి.

→ ప్రశ్నాపత్రంలో ఎన్ని విషయ నిష్ఠ ప్రశ్నలుండాలి. వాటికి సమాధానం రాయడానికి ఎంత సమయం అవసరమో అంచనా వేసుకోవాలి

→ ఈ నాలుగు రకాల ప్రశ్నలకు కేటాయించిన మార్కులు, వాటికి సమాధానాలు రాయడానికి పట్టే సమయంలో నమతుల్యత

ఉండాలి.




2) విద్యాప్రమాణాల (సామర్థ్యాలు వారి భారత్వ పట్టిక తయారీ :

→ ఉపాధ్యాయుడు తన బోధనాళ్యననలో విద్యాప్రమాణాలు ఎంత మేరకు సార్ధకం అయ్యాయో, విద్యార్థులను పరీక్షించుకోవడానికి వీలుగా విద్యాప్రమాణాలను సిద్ధం చేసుకోవాలి.

→ ఏ విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు ఇవ్వాలో నిర్ధారించుకోవాలి,

→ ఆయా విద్యా ప్రమాణాలు, వాటికి నిర్దేశించిన మార్కులతో సామర్థ్యాల వారీగా భారత్వ పట్టికను తయారుచేసుకోవాలి.


3) విషయ భారత్వ పట్టిక తయారీ :-


→ ముందుగా నికషని ఏయే పాఠ్యాంశాలకు నిర్వహించాలో ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి.

→ ఆ పాఠ్యాంశాలలో ఏయే ఉప అంశాలు, ఖావనలు నికష ద్వారా పరీక్షించాలో నిర్ధారించుకోవాలి - తరవాత ఆయా అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించాలో నిర్ణయించాలి.

→ ఆ అంశాలు, వాటికి కేటాయించిన మార్కులతో నిషయభారత్వ పట్టికను తయారు చేసుకోవాలి


4) కఠినతా స్థాయి భారత్వ పట్టిక తయారీ :-

→ ఆ తరవాత ప్రశ్నల కఠినత్వ స్థాయిని మదింపు చేసుకోవాలి.

→ ఏయే కరినత్వ స్థాయిలలో ఎన్ని ప్రశ్నలు అడగాలో నిశ్చయించుకోవాలి.

→ ఆ ప్రశ్నలకు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో కూడా నిశ్చయించుకోవాలి

→ తరవాత ప్రశ్నల కఠినత్వస్థాయి, వాటికి కేటాయించిన మార్కుల వివరాలతో భారత్వ పట్టికను తయారుచేసుకోవాలి.


5.బ్లూ ప్రింట్ తయారీ :

→ మొదటి మూడు భారత్వ పట్టికలను కుదిస్తూ ఒక సమగ్రమైన పట్టిక, బ్లూ ప్రింట్ ను తయారుచేసుకోవాలి.

→ పై నాలుగు భారత్వ పట్టికలు, బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందించాలి.


6.బ్లూప్రింట్, భారత్వ పట్టికల ఆధారంగా ప్రశ్నాపత్రం తయారీ :-

→ ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులో స్పష్టంగా ప్రశ్నాపత్రంలో సూచించాలి.

→ మొత్తం నికష కాలవ్యవధిని కూడా ప్రశ్నాపత్రంలో సూచించాలి.

→ విద్యార్థికి ఇవ్వదగిన ఇతర సూచనలు కూడా ప్రశ్నాపత్రంలోనే పొందుపరచాలి.

→ ప్రశ్నలు సందిగ్ధంగా ఉండకూడదు. భాష నరకంగా, సూటిగా ఉండాలి, సందేహాలకు తావివ్వకూడదు...



7) సమాధానపత్రం గణన సూచిక :

→ సమాధాన పత్రంలోని అన్ని ప్రశ్నలకూ, సరైన సమాధానాలు రాసి, ఒక ప్రమాణ సమాధాన పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి

→ ప్రతీ ప్రశ్నలో ఏఏ అంశానికి ఎయే సోపానానికి ఎన్ని మార్చులో సూచించే గణన సూచితను తయారుచేసుకోవాలి.

→ ఈ సూచీ అధారంగా, సమాధాన పత్రాలను సరిదిద్ది కచ్చితమైన మూల్యాంకనం చేయాలి


8) మూల్యాంకనం :

→ గణ సూచిక ఆధారంగా ప్రతి విద్యార్థి నిష్పాదనను మార్కుల ద్వారా నిర్ణయించాలి.

→ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడులు నిర్ధారించాలి.


9) ప్రశ్నాపత్ర, సమాధాన పత్ర విశ్లేషణ :

→ తదుపరి నికష గణనలను పక్షపాత రహితంగా విశ్లేషించాలి

→ ప్రతి విద్యార్థికి ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు వచ్చాయో సూచించే పట్టికను తయారుచేసి, ఆ పట్టిక ఆధారంగా ఏ ప్రశ్నకు ఎక్కువ మంది సమాధానం రాశారు, ఎంత సంపూర్ణంగా సమాధానం రాశారు అని విశ్లేషించుకోవాలి

→ ఏ ప్రశ్నకు తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ప్రయత్నించారు ఎంతవరకు సరైన సమాధానం రాయగలిగారు ఆనే

విషయాన్ని కూడా విశ్లేషించాలి.

→ అదే విధంగా విద్యాప్రమాణాల వారీగా, భావనల వారీగా ఆయా ప్రశ్నలను గ్రూపింగ్ చేసి పేయే ప్రమాణాలలో ఏయే

→ భావనలతో విద్యార్థుల నిష్పాదన ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు ఏ ప్రశ్నను విద్యార్థులు ఎవరూ కూడా సరైన సమాధానం రాయలేకపోయారు. ఎందుకు రాయలేకపోయారు అనే అంశాన్ని

కూడా విశ్లేషించాలి

→ ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి. ఎంత శాతం వచ్చింది, మార్కుల పరంగా తరగతిలో ఏ విద్యార్థి ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాన్ని కూడా విశ్లేషించాలి