అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సాంఘిక శాస్త్ర విద్యాప్రణాళిక/బోధనా ప్రణాళిక










→ విద్యాప్రణాళికను ఆంగ్లంలో కరికులం అంటారు. కరికులం అనే ఆంగ్లపదం "కరే" అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. 'కరే అనగా "పందెపుబాట" లేదా "ప్రణాళిక చట్రము" అని అర్థం.

→ విద్యాధ్యేయం అయిన సమగ్ర మూర్తిమత్వంను విద్యార్థులలో సాధించడానికి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏర్పాటుచేసే్ సమస్త కార్యక్రమాలు అన్నింటిని విద్యాప్రణాళిక అంటారు.




విద్యాప్రణాళిక - నిర్వచనాలు:-

1) విద్యార్థులు అభ్యసనానుభవాలను పొందటానికి ఏర్పరచే మార్గాలను కరికులం" అంటారు. - ఎద్వార్డ్ ఎ. క్రగ్

2) "పాఠ్య ప్రణాళిక అనేది ఒక వ్యక్తి తన నిత్యజీవితంలో పరిసరాలకు ఒదిగిపోవడం తర్వాత విశాలమైన పరిసరాలలో తన కృత్యాలను నెరవేర్చే విధానమే పాఠ్యప్రణాళిక -కె.జి. సాయిడిన్

3) విద్యార్థి నేర్చుకొనే అంశాల సమాహార రూపం" కరికులం - అల్బర్టీ మరియు అల్బర్టీ

4) "విద్యార్థికి అందించే పాఠ్యాంశాలు, పాఠ్యాంశాలలో వినియోగించే అంశాలు, వాటిని మూల్యాంకనం చేసే పద్ధతులను కదికులం“ అంటారు - కీం బెల్

5) విద్యార్థి అభ్యసనలో మార్పు తీసుకొని వచ్చే కృత్యాలు గాని, విషయాలు గాని, విద్యార్థి వైఖరిలో, ప్రవర్తనట” మార్పుతీసుకొని వచ్చేదే కరికులం - కార్ల టాన్ వాష్ బర్న్


6) కరికులను విద్యార్థి పూర్తి అభ్యసనానుభవంగా, పాఠశాల లోపలి, వెలుపలి మార్గదర్శకం" అని ఇ.ఎమ్. డ్రాపర్ పేర్కొన్నాడు

7) 3వ అంతర్జాతీయ వెబ్ స్టర్ నిఘంటువు ప్రకారం కరికులం అనగా "ఒక విద్యాసంస్థ తన సంస్థ ద్వారా అందించే విద్యాప్రణాళిక విద్యార్థులకు అందించే పాఠ్యాంశాలు, ఆటలు, నాటకాలు, క్లబ్బులు"

8) విలియం జె. బెన్నెట్ (1984) అభిప్రాయంలో "ఉపాధ్యాయుడు మార్గదర్శికాగా, కరికులం ఒక మార్గం"


9) బార్నిన్ డగ్లస్ రచించిన గ్రంథం "ప్రాక్టికల్ కరికులం స్టడీ" కరికులం అనేది సామాజిక సౌభాగ్యానికి ఇది ఒక రాచమార్గాన్ని

చూపేది.



మూల విద్యా ప్రణాళిక (కోర్ కరికులమ్) :

→ విషయ కేంద్రీకృత, శిశు కేంద్రీకృత పాఠ్యప్రణనికలకు వ్యతిరేకంగా మౌళిక పాఠ్యప్రణాళిక ఆవిర్భవించినది

→ మొట్టమొదటసారిగా అమెరికా దేశంలో మౌళిక పాఠ్యప్రణాళిక ఆచరణలోనికి వచ్చిందని కేస్ వెల్ పేర్కొన్నాడు.



మౌళిక ప్రణాళిక - నిర్వచనము :

1) మౌళిక ప్రణాళిక నిర్దిష్ట అనుభవాల కంటే విస్తృత అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తుంది". - హరాల్డ్ స్పీయర్

2) విద్యార్థుల భావి అవసరాలకు సహాయపడ్డాయనే నమ్మకంతో తప్పనిసరిగా నిర్ణయించిన పాఠ్యాంశాల మూల విద్యా ప్రణాళిక - ఇబి,వెస్ట్లీ.





→ మౌళిక పార్యప్రణాళికకు ఉదాహరణ - గణితం, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం అనేవి కోర్ సబ్జెక్టులు.


→ 1986 జాతీయ విద్యా విధానంలో దేశమంతా ఒకే మౌళిక ప్రణాళిక ఉండాలని సూచించడం జరిగింది. ఆ విధంగా 80%

ఒకే పాఠ్యప్రణాళిక, 20% స్థానిక అవసరాలకు అనుగుణంగానే రచించబడాలని సూచించబడినది: దానికి అనుగుణంగానే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో భారతీయ సంస్కృతి - వారసత్వలను, రెండవ సంవత్సరంలో విజ్ఞానశాస్త్రం - నాగరికత అనే

అంశాలను, కోర్ సబ్జెక్టుగా చేయడమైనది.


మూల ప్రణాళిక లక్షణాలు :-

→ ఆల్ బెరీ కోర్ పాఠ్య ప్రణాళిక లక్షణాలు గురించి విశదీకరించాడు.

1) విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందిస్తుంది.

2) సామాజిక సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుంది

3) మౌలికాంశాలు మొత్తం పాఠ్యప్రణాళికలో ఒక భాగం.

4) సమస్యా పరిష్కారానికి ఉపయోగపడే మౌళిక నైపుణ్యాలను అందిస్తుంది.

5) ప్రత్యేక అవసరాలు, సమస్యలు, ప్రయోజనాలతో సంబంధం లేకుండా విద్యార్థులు అందరూ అధ్యయనం చేయాలి

6) పిల్లల అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరిస్తుంది




సాంఘిక అధ్యయనాన్ని మూలప్రణాళికలో చేర్చడానికి కారణాలు

1) మనోవైజ్ఞానిక కారణాలు :

2) సామాజిక కారణాలు

3) ప్రయోగాత్మక కారణాలు


1) మనోవైజ్ఞానిక కారణాలు : -

→ పిల్లల్లో వికాసం, వైఖరులు, సంబంధ బాంధవ్యాలు, మానసిక పరిపక్వత, సాంఘికరణం, నియంత్రణలాంటి విషయాలు మనోవైజ్ఞానిక పునాదుల మీద ఆధారపడి ఉంటాయి.

2) సామాజిక కారణాలు :
→ సమాజానికి దూరంగా శిశువు అభివృద్ధి ఊహించడానికి వీలులేదు" అని రేమాంట్ పేర్కొన్నాడు

→సొంఘిక చైతన్య స్రవంతిలోనే శిశువు యొక్క అభివృద్ధి సాధ్యం" అని జాన్ద్యూయి పేర్కొన్నాడు

3) ప్రయోగాత్మక కారణాలు:

→ సమాజం నిరంతరం మార్పులకు లోను అగుతూ ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ప్రణాళికలలో కూడా

మార్పులు సంభవించడం జరుగుతుంది.

మూల విద్యా ప్రణాళికలోని విషయ అంశాలు:

1) మాతృభాష

2) సాంఘికశాస్త్రం

3) సామాన్యశాస్త్రం

4) గణితశాస్త్రం



5.నేతపని / లోహపని / తోటల పెంపకం / బట్టలు కుట్టడం / విచిత్ర వేషధారణ / టైపు చేయడం / కుట్లు, అల్లికలు.





1986 జాతీయ విద్యావిధానం-10 మౌలిక అంశాలు :-

→ 1986 జాతీయ విద్యావిధానంలో వది మౌలిక అంశాలను చేర్చడము జరిగింది. సవరించబడిన నూతన పాఠ్యప్రణాళిక

1993-94 నుంచి అమలులోనికి వచ్చింది.

→ 10 మౌలిక అంశాలు

1) భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర

2) రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులు - బాధ్యతలు

3) జాతీయభావనా వికాసానికి దోహదపడే విషయాలు

4)భారతీయ సంస్కృతి సాంప్రదాయాల


5) సమానత్వం - ప్రజాస్వామ్యం - సామ్యం

6) స్త్రీ - పురుష సమానత్వం

7) పర్యావరణ పరిరక్షణ

9) చిన్నకుటుంబ భావన కల్గి ఉండటం

10) శాస్త్రీయ దృక్పథంను పెంపొందించడం



పై 10 మౌలిక అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా

1.లింగ వివక్షత తొలగింపు

2.ప్రాంతీయ అసమానతల తొలగింపు

3.జాతీయ, అంతర్జాతీయ అవగాహన

4).కుల, మత, విచక్షణలు తొలగింపు మొదలగువాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది


→ 1992 లో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ పథకంలో అనేక విషయాలను తెచ్చినది.

→ 1986 జాతీయ విద్యావిధానం ఈ క్రింది అంశాలను సెకండరీ పాఠశాల కరికులంలో చేర్చాలని సూచించింది.

1. భాష


2.గణితం

3. సాంస్కృతిక అంశం

4.మౌల్యవిద్య

5.శాస్త్రవిజ్ఞానం

6.మౌలిక అంశాలు

7. పని అనుభవం-

8. పరిసరాల విద్య

9.ఆటలు - శారీరక విద్య




విషయ ప్రణాళిక

1. దీనినే పాఠ్యక్రమం అంటారు

2.ఇది సంకుచితం

3. విద్యాప్రణాళికలో ఒక భాగం

4.ఇది విషయవస్తు ప్రధానం

5.ఇది ఆచరణ రూపం

6.ఇది బోధనకు / బోధకుడుకు మార్గదర్శకత్వని వహించును

7.జ్ఞాన విషయాలకు ప్రాధాన్యత

8.ఇది ఉపాధ్యాయుని వ్యక్తిగతం

9.జ్ఞానం, నైపుణ్యాలకు ప్రాధాన్యత నిస్తుంది


10. విద్యార్థులు ఇతర జలోచనలకు ప్రభావితమవుతారు

11) విషయకేంద్రం

12)ఇది స్వేచ్ఛాయుతమయినది

13) స్థానిక భేదాలతో విషయాల వారీగా లేదా తరగతుల వారిగా విభజించి బోధిస్తారు

14)నిర్దిష్ట విషయంపై మాత్రమే దృష్టి ఉంటుంది

15) ఉపాధ్యాయునికి విషయపరంగా మార్గదర్శకత్వం కలిగిస్తుంది


16) ఇది కేవలం జ్ఞాన / పాండిత్య / విద్యా / చదువు / విషయ సంబంధ అంశాలను తెలియజేయును

17.తరగతి గదికి మాత్రమే పరిమితం

18) దీనిని Knowledge తో పోలుస్తారు

19) ఇది పరిమితి కలిగినది

20) సిలబస్ అనేది పాఠ్య ప్రణాళికకు ఉపసమితి












విద్యా ప్రణాళిక

1.దీనినే పాఠ్యప్రణాళిక అంటారు

2) ఇది విశాలమైనది

3.సిలబస్ లాంటి ఎన్నో భాగాలు కలిసి విద్యా

ప్రణాళిక ఏర్పాడును

4) ఇది లక్ష్య ప్రధానం

5) ఇది సిద్ధాంత రూపం

6) ఇది. విద్యావ్యవస్థకు మార్గదర్శకత్వంలో

ఉందును

7) సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయును

8) ఇది సమిష్టి కృషితో కూడినది.

9.ఇది నృజనాత్మకతకు ప్రాధాన్యత నిస్తుంది

10.ఇది సొంత ఆలోచనలను అభివృద్ధి చేయును

11.ఇది విద్యార్థి కేంద్రం

12) ఇది క్రమశిక్షణా బద్ధమైనది

13.ఒక దేశం / రాష్ట్రం అవసరాలకు ఆసువుగా నిర్మిస్తారు


14) విద్యార్ధుల యావత్ శిక్షణ దీనిపై ఉంటుంది

15) విద్యా ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది

16 ) దీనిలో విద్యా విద్యేతర / పాండిత్య-పాండిత్యేతర / చదువు - చదువేతర/ జ్ఞాన- జ్ఞానేతర /

పాఠ్య - నహపార్వేతర కార్యక్రమాల నమ్మేళనం

17.పారశాల వెలుపల, లోపల కార్యక్రమాలకు

సంబంధించినది

18) దీనిని Wisdom తో పోలుస్తారు

19.ఇది అపరిమితమైనది

20) పాఠ్య ప్రణాళిక అనేది అనేక సిలబస్ కలయిక





విద్యా ప్రణాళిక నిర్వహించే ఉపగమాలు (వివిధ రీతులు) :-


గణిత రీతులు :

→ శీర్షికా పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి

సాంఘిక శాస్త్ర రీతులు :

→ శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల, యూనిట్, కాలక్రమ, సహసంబంధ, సమైఖ్య సమ్మిశ్రణ పద్దతులు.

1) శీర్షికా పద్ధతి / అంశాల పద్ధతి / ప్రకరణాల పద్ధతి / పాఠ్యవిభాగ పద్ధతి / టాపికల్ పద్ధతి : -

→ ఈ పద్ధతిలో బోధించదలచిన విషయాన్ని ఎన్నుకొని కొన్ని అంశాలుగా లేదా శీర్షికలుగా విభజించి ఒక క్రమ పద్దతిలో

సులభమైన వాటి నుండి కరినమైన విషయాలకు బోధించడం జరుగుతుంది

→ ఇది విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రంపై ఆధారపడి పనిచేయును

→ దీనిలో ఒక అంశాన్ని తీసుకుని దానికి సంబంధించిన అన్ని విషయాలను ఒకే తరగతిలో ఒకేసారి బోధిస్తారు.


→ మరల పై తరగతిలో బోధించుట గానీ, పునర్విమర్శ చేయుట గానీ జరుగదు.

→ దీనిలో విద్యార్థులకు మొత్తం విషయాలు బోధించినప్పుడు వారికి కేవలం ప్రాథమిక భావనలు మాత్రమే ఆర్ధమవుతాయి / అందుబాటులో ఉంటాయి. మిగిలిన కఠినమైన భావనలు అందుబాటులో ఉండవు ఇది చాలా అసహజం, అసాధ్యం. తనకు అవసరం లేని విషయాలు కూడా నేర్చుకోవలసిన అవసరం: ఉంటుంది

→ ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం, పాఠశాలస్థాయిలో మళ్ళీ ఏ తరగతిలోనూ బోధించనందు వలన విద్యార్థులు పూర్తిగా

మరిచిపోయే అవకాశం కలదు

→ ఉదా

1వ తరగతి - సంఖ్యామానం

2వ తరగత -సంకలనం

3వ తరగత-వ్యవకలనం

4వ తరగతి - గుణకారం

5వ తరగత-భాగాహారం

9వ తరగత- చలన జ్యామితి

ఉదా :- యుద్ధం, శాంతి, మతం




గుణాలు :-

→ విద్యార్థి ఒక తీర్షికకు సంజాంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు

→ విద్యార్థి విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రంపై నేర్చుకుంటాడు

→ విద్యార్థిలో ఏకాగ్రత, కేంద్రీకరణ శక్తిని సాధించడం జరుగుతుంది

→ విద్యార్థి ఏయే విషయాలలో వెనుకబడి ఉన్నారో గ్రహించి లోపనివారణా బోధన చేపట్టడానికి వీలు కల్గుతుంది - విద్యార్థి ఏ విషయం నేర్చుకుంటాడో తెలుసుకోగలడు.

→ జ్ఞానార్థన తార్కిక క్రమంలో ఉంటుంది

→ విద్యార్థి సమగ్ర జ్ఞానం పొందును

→ విద్యార్థులలో ఆసక్తులు, ప్రేరణలు పెంపొందిస్తుంది

→ సహజ అభివృద్ధి దశలో విషయావగాహన ఏర్పడును

→ వివిధ విషయాల మధ్య సంబంధం, నిజజీవిత పరిసరాలకు సంబంధించి ఉంటుంది



దోషాలు:

→విషయ భారం ఎక్కువ కావటం వలన అవగాహన సన్నగిల్లి అలసట ఏర్పడును

→ఇది అసహజం, అసాధ్యం, ఆచరణాత్మకం కాదు

→మనో వైజ్ఞానికం కాదు, శిశుకేంద్రీకృతం కాదు

→మధ్యలో బడిమానివేసిన విద్యార్థులకు ఇబ్బంది

→ఒకే శీర్షికకు మరొక శీర్షికకు సంబంధం లేకపోవుట వలన ముందు నేర్చుకున్న శీర్షికలు మరిచిపోయే అపకాశం కలదు

→పునర్విమర్శకు అవకాశం లేదు

→ఈ పద్దతి విజయవంతమవడానికి గ్రంథాలు అందుబాటులో ఉండవు

→ఈ పద్ధతికి కావలసిన బోధనా సామాగ్రి అభ్యసనానుభవాలు సమకూర్చండవు

→ఈ పద్ధతి విజయవంతం కావడానికి సమర్థులైన, ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులు అవసరం


ఏకకేంద్ర పద్ధతి / అమర్చే పద్ధతి :-

→ఈ విధానంలో ఏదైనా ఒక శీర్షికను ఎన్నుకొని దాని కాదిన్యతా స్థాయిని అనుసరించి అర్థవంతమైన భాగాలుగా విభజించిన

వివిధ తరగతులలో అమాన్ని అనేక సం||ల పాటు బోధన చేస్తారు


→ ఇది విషయ కాఠిన్యం, విషయ విస్తరణ సూత్రాలపై ఆధారపడి పనిచేయును.

→ ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాల్ని ప్రాథమికంగా సూక్ష్మంగా చెప్పటం, పై తరగతులకు పోయేసరికి శీర్షికలను. క్రమక్రమంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందించే పద్ధతి

→ ఒక పాఠ్యాంశం (ప్రాథమిక భావనలు, విద్యార్థుల పరిపక్వత పెరిగే కొద్దీ విషయ పరిజ్ఞానం వివరణలో క్లిష్టత పెరుగుతుంది విద్యార్థులు, తమ అనుభవాలను క్రమపద్ధతిలో రూపొందిస్తూ అనుభవ క్షేత్రంలో "క్రమాభివృద్ధిని సాధిస్తారు.

→ ఒకే విషయం అనేక తరగతులలో విస్తరించబడి / వ్యాపించబడి ఉంటుంది

→ విద్యార్థులకు మొదట మూడు తరగతుల్లో విద్యార్థులకు గృహము నందలి పాఠశాలలోని, ఇరుగుపొరుగున ఉన్న ఆరోగ్య సమస్యలను అధ్యయనం చేస్తారు. ఉన్నత స్థాయిలో విద్యార్థులు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలను గూర్చి అధ్యయనం చేస్తూ,

సాధారణీకరణ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొందురు.

→ ఇందులో అభ్యసన కేవలం పరిసరాల నుండి ప్రారంభమై క్రమేణా ప్రపంచ స్థాయి వరకు ప్రగతి చెందును

ఉదా :- 3, 4, 5, 6, ............. 10 తరగతుల వరకు 'రోడ్డు భద్రతా విద్య' పాఠ్యాంశం అమర్పబడిన రీతి

ఉదా : 1 - 6 తరగతుల వరకు వ్యాపించిన 'సంఖ్యామానం - సంజ్ఞామానం' పాఠ్యాంశం /శీర్షిక వ్యాపించబడిన తీరు

ఉదా :- 3-10 వరకు దేఖాగణితం

6-7-8 వరకు ప్యాపారగణితం, క్షేత్రగణితం

7-9-10 తరగతులలో సాంఖ్యక శాస్త్రం

9-10లలో గణన, 8, 9, 10లలో సమితులు

→ ఉదా :- సామాన్య శాస్త్రంకి చెందిన మానవ శరీరం, ఆరోగ్యం, మనం పీల్చే గాలి, మనం క్రాగేనీరు, మనం తినే ఆహారం మన ఇల్లు, మనం వాడే పనిముట్లు, మన దుస్తులు, మన విశ్వం మొదలైనవి

→ ఉదా :- 8, 9, 10లలో వ్యాపించిన భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలైన కొలతలు, మన విశ్వం., శుద్ధగతిక, గతిశాస్త్రాలు అయస్కాంతత్వం, విద్యుత్, కాంతి మొదలైనవి





ఏకకేంద్ర పద్ధతిని సూచించు పదాలు :

→ విస్తరణ, వ్యాపించడం, వెదజల్లబడటం, అమర్చబడటం, క్రమాభివృద్ధి, సాధారణీకరణ జ్ఞానం, విస్తృతి, సంగ్రహచిత్రణ, నమస్తం మొదలైనవి



ఏకకేంద్ర పద్ధతి - ప్రయోజనాలు

1)శిశు కేంద్రీకృత పద్ధతి

2) మనో వైజ్ఞానిక పద్ధతి

3.సరళత నుండి క్లిష్టతకు పోవును .

4.తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవును

5.అనేక సం||లో పాటు ఒకే శీర్షిక జోధించుట వలన

విద్యార్థులు ఉత్సాహంగా అభ్యసిస్తారు.

6.ఉపాధ్యాయులు ప్రేరణ కల్గించుట సులభం

7.మధ్యలో బడిమానివేసిన వారికి కూడా ఉపయోగపడును


8.అనేక సం||ల పాటు ఒకే శీర్షికను బోధించుట వలన ధారణ' అభివృద్ధి చెందును

9) డ్రిల్లింగ్ కి అవకాశం కలదు

10) పై తరగతులలో నూతన అంశాలు నేర్చుకుంటాడు

11.విద్యార్థి "సమస్తం"గా నేర్చుకుంటాడు

12) విద్యార్థుల వయస్సు పరిపక్వత కఠినతా సూత్రాల ఆధారంగా నిర్మిస్తారు

13.సులభంగా భావ సంగ్రహణం జరుగును

14)పరిచయం లేని విషయాలు నేర్చుకుంటున్నామన్న భావన ఉండదు




దోషాలు:-


1.ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్న భావన ఉండదు: .


2.తెలివిగల విద్యార్థులు అసౌకర్యానికి, అసహనానికి

వినుగుకు గురవుతారు

3.శీర్షికను అర్ధవంతమైన భాగాలుగా చేయుట కష్టం


4) భాగాలను మొత్తంగా సమస్తంగా /అమర్చడం కస్టం

5.ఏదైనా శీర్షికా భాగం ఎక్కువైతే ఆసక్తి క్షీణిస్తుంది

6) ఒకే శీర్షికను బోధించుటకు ఎక్కువ కాలం పడుతుంగి

7.నూతనత్వం లోపించి వినుగు జనించవచ్చును

8.ఒకే శీర్షికను అనే సం||ల పాటు బోధించుట ద్వారా విలువైన సమయం వృధా అగును





1-5 తరగతుల వరకు వ్యాపించిన సంఖ్యామానం - సంజ్జామానం :-

1 వ భాగం : 1- 100

2వ భాగం: 101- 1000

వ భాగం : 1001 - 10,000

4వ భాగం : 10,001-1,00,000

'5వ భాగం : 1 లక్ష - 10 లక్షలు

నోట్ :- ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని అర్థవంతమైన భాగాలుగా చేసి వివిధ తరగతులలో అమర్చుట / విస్తరించుట వ్యాపింపజేయుట / వెదజల్లుట / విస్తృతి / క్రమాభివృద్ధి చెందించుట / సమస్తంగా / సాధారణీకరణ జ్ఞానం

పొందేలా చేయుట -- ఏకకేంద్ర పద్ధతి

3.సర్పిల పద్ధతి/ఉదావర్తరీతి(వలయాపద్ధతి/అరోహణ క్రమాభివద్ధి పద్ధతి/కుంతల ఉపగమం(శ్రేణీకృత పద్ధతి :-

→ ఈ పద్ధతిలో ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా వాటి కారిన్యత ఆధారంగా విభజించడం జరుగుతుంది సులభమైన వాటి నుండి కష్టమైన వాటికి అనే సూత్రం ఆధారంగా క్రమంగా అమర్చుతారు

→విద్యార్థుల మానసిక స్థాయిని ఐట్టి వివిధ తరగతులలో ప్రతి ఛాగాన్ని సరైన దశలో ప్రవేశపెట్టడం జరుగుతుంది

→ ఈ విధానం ఒక తీగ చుట్టను పోలి ఉంటుంది

నోట్ :

→ దీనిలో ఏ అంశం కూడా ఒకేసారి పూర్తిగా బోధించడం జరగదు

→ ఈ విధంగా బోధించదలచిన పాఠ్యాంశాన్ని భాగాలుగా చేసి వాటిని కాఠిన్యతా స్థాయిననుసరించి శ్రేజీకృతం చేసి ఒక భాగం

తరువాత ఇంకొక భాగం ఒక క్రమపద్ధతిలో క్రమానుగతంగా బోధించుట జరుగును

→ పాఠ్యవిషయం అవిచ్చిన్నంగా / అవిరకంగా బోధన జరుగును.

→ తరగతి పెరుగుతున్న కొలదీ పాఠ్యాంశాల లోతు కూడా / సంక్లిష్టత కూడా పెరుగుతుంది

నోట్ :- 1) ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులమ్ సర్పిల విధానంలోనే రచించబడింది

2) శీర్షికా పద్ధతికి వ్యతిరేకం సర్సిల పద్ధతి

→ సర్పిల విధానంలో ఒక శీర్షికకు సంబంధించిన భాగం బోధించిన తరువాత రెండవ భాగం బోధిరచే ముందు ముందు

భాగాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది.

→ ఉదా :- సమితులు , సంబంధాలు, ప్రమేయాలు

8వ తరగతి మొదట సమితులు బోధించిన తరువాత 9వ తరగతిలో పునర్విమర్శ చేసి సంబంధాలు బోధించుట మరియు 10వ తరగతిలోని ప్రమేయాలు చెప్పేటప్పుడు సమితులు, సంబంధాలు పునర్విమర్శ చేసి బోధించుట

→ ఉదా :- సంఖ్యామానం - సంజ్ఞామానం 1వ తరగతిలో బోధించేటప్పుడు మొదటి మూడు నెలల్లో 1-10 వరకు వేర్చి తరువాత వచ్చే మూడు నెలల్లో 1-10 వరకు పునర్విమర్శ చేసి 1-50 వరకు నేర్పడం


→ ఉదా :- 1) భూమి అనే పాఠ్యాంశం 3, 4, 5 తరగతులలో అమర్చబడిన విధానం -- ఏకకేంద్ర పద్దతి

2) భూమిని గూర్చి 3, 4, 5 తరగతులలో బోధించుట సర్పిల వద్దతి

→ 3వ తరగతిలో భూమి భావన గూర్చి బోధించి, తరువాత 4వ తరగతిలో వివిధ ప్రకృతి సిద్ధమండలాల గూర్చి బోధన మరియు 5వ తరగతిలో భూమి గుండ్రంగా ఉందనడానికి సాక్ష్యాలు గూర్చి చర్చించడం విద్యార్థి నిచ్చెన పై ఒక మెట్టు తర్వాత, ఇంకొక మెట్టు ఎక్కుతున్నట్లుగా తేలికాంశాల నుండి కఠినాంతాలకు పోవును

→ సర్పిల విధానంలో యూనిట్ డై యూనిట్, లెసన్ టై లెనన్, డే డే మంత్ బై మంత్, ఇయర్ టై ఇయర్, సబ్ యూనిట్స్ బై సబ్ యూనిట్స్, పార్ట్ డై పార్ట్, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ మొదలైన విధంగా ఒక క్రమవద్దతిలో ఒకదాని తరువాత ఒకటి

బోధించుకుంటూపోతాం.

గుర్తుంచుకునే పదాలు :-

→ సంచిత బోధన, సంచిత అభ్యసన, అవిచ్చిన్న బోధన, అవిచ్ఛిన్న అభ్యసన, అవిరళ బోధన, అవిరళ అభ్యసన, క్రమానుగత బోధన, క్రమానుగత అభ్యసన, వలయాకార బోధన, ఆరోహణ క్రమ బోధన మొదలైన పదాలు

నోట్ :- ఏకకేంద్ర పద్ధతిలో కాలవ్యవధి -- .నర్సిల వద్దతిలో కాల వ్యవధి --

సర్పిల పద్దతి గుణాలు :-

→ మనో వైజ్ఞానిక పద్ధతి

→ శిశుకేంద్రీకృత పద్ధతి

→ సరలత నుండి క్లిష్టతకు పోవును నిరంతరం పునరుక్తి జరుగుట మూలంగా ధారణ అభివృద్ధి చెందును

→ తార్కిక, హేతువాద ఆలోచనలు అభివృద్ధి చెందును

→ శీర్షికా పద్ధతికి వ్యతిరేక పద్ధతి

→ గణిత, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఏర్పాటుకు తగిన పద్ధతి

→ విద్యార్థులు అభ్యసనలో చురుకుగా పాల్గొంటారు

→ సంక్షిప్త భావనలు చక్కగా అవగాహన చేసుకొనును

→ పాఠ్యాంశాలను సమగ్రంగా అర్థం చేసుకొనును

→ ఇది సాధారణ మార్గాలను అన్వేషించును

→ దీనిలో నవరణ సులభమగును

→ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన జరుగును

దోషాలు :

→ పునర్విమర్శ అభ్యాసాలు ఎక్కువవటం వలన కాలం ఎక్కువ పడుతుంది

→ ఈ పద్దతిని ఉపయోగించడానికి నిష్ణాతులైన ఉపాధ్యాయులు అవసరం బోధించిన విషయం పదేపదే బోధించుట వలన / పునరుక్తి వలన వినుగువనస్తుంది .

→ప్రతి తరగతిలోను ప్రతి పాఠ్యాంశం తెలిసినట్లుగానే ఉండును. కానీ దానిని గూర్చి పూర్తి జ్ఞానం తమకు లేదన్న భావం

విద్యార్థులలో కలుగును


→ విద్యార్థులలో ఆసక్తి సన్నగిల్లుతుంది

→వ్యక్తీకరణలో కొత్తదనం లోపిస్తుంది

→ దేశకాలాలకు సంబంధించిన భావన విద్యార్థులలో ఏర్పరచడం కష్టం

→ విద్యార్థులను ఆకర్షించుటలో విఫలమగును

→ విద్యార్థులు తాము కోరిన సంఘటనల గూర్చి తెలుసుకొనలేరు

కాలక్రమ రీతి ఉపగమనం:-

→ చరిత్ర పాఠ్యాంశాల బోధనకు ఇది ఎంతో' ఉపకరిస్తుంది .

→ ఒక అంశానికి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా అందించడంలో ఈ ఉపగమం తోడ్పడును

→ దీనిలో యావత్తు విద్యా బోధన కాలానికి సంబంధించి ఉంటుంది

→ కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఈ ఉపగమం ముఖ్య లక్ష్యం.

→ ఈ కాలక్రమ ఉపగమం ప్రాథమిక స్థాయికి అంతగా ప్రయోజనం కాదు. మాధ్యమిక స్థాయిలో ఉపయోగించదగిన ఉపగమనం.

నోట్ :- ప్రాచీన యుగం నాటి ప్రపంచ / భారత్ / యూరప్ / ఆంధ్ర చరిత్ర

మధ్యయుగం నాటి ప్రపంచ / భారత్ / యూరప్ / ఆంధ్ర చరిత్ర

ఆధునిక యుగం నాటి ప్రపంచ / భారత్ / యూరప్ / ఆంధ్ర చరిత్ర

కాలక్రమ ఉపగమం ప్రయోజనాలు :-

→ విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసన జరుగుతుంది ఒక అంశం సమగ్ర అవగాహన విద్యార్థులకు కలుగుతుంది

→ గతించిన ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలనే తృష్ణ విద్యార్థులలో ఏర్పడుతుంది

→ ప్రతి నం|| కొత్త విషయాల్ని ఈ ఉపగమంలో బోధించడం వల్ల విద్యార్థులకు వైవిధ్యం ఉండం వల్ల అభ్యనన పట్ల మక్కువ

చూపుతారు

→ "దేశ కాలాల భావన' ఏర్పడుతుంది

→ దేశభక్తి, జాతీయతా భావాల్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ ఉపగమం ఎంతో ఉపయోగపడుతుంది.

→ తన జాతి, సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల విద్యార్థులకు ఆకర్షణ ఏర్పడుతుంది


కాలక్రమ ఉపగమం - పరిమితులు :-

→ మధ్యలో బడి మానేసిన విద్యార్థులకు కొన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆపుతుంది -

→ చారిత్రాత్మక యుగ విభజనలు విద్యార్థులు మానసికాభివృద్ధి దశలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పలేం

→ నిరంతర కాలాలకు సంబంధించిన విషయాలుండటం వల్ల విద్యార్థులకు వినుగు ఏర్పడవచ్చు

→ వేరు వేరు యుగాల గురించి తెలుసుకొంటున్నపుడు ముందు నేర్చుకున్న వివరాలు మరచిపోయే అవకాశం ఉంది

→ ఉపగమం "మొత్తం నుంచి భాగాలకు" అనే సూత్రానికి పరిమితమై ఉంది

5.యూనిట్ - ఉపగమం :-

→ ఈ పద్ధతిలో ఒక సబ్జెక్టుకు సంబంధించిన విషయాల్ని కొన్ని విస్తృతమైన భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క

భాగాన్ని యూనిట్ అంటారు

→ ఒక్కొక్క యూనిట్ ను సబ్యూనిట్స్ గా విభజించి వాటిని శ్రేణీకృతం చేసి సులభం నుండి కఠినం అనే మనోచైజ్ఞానిక సూత్రాన్ని

పాటిస్తారు

నోట్ :- యూనిట్ కు, యూనిట్ కు మధ్య చక్కని అంతర సహసంబంధాన్ని నెలకొల్పేట్లుండాలి

→ రెండు సంఘటనల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసినపుడే విద్యార్థులలో చక్కని అవగాహన ఏర్పడును. -- బైనిఎగ్ * జైనింగ్ (మాధ్యమిక పాఠశాలల్లో సామాజికాధ్యయనాల బోధన)

→ యూనిట్ అనేది మానవ పరిసరంలో సమగ్రంగా, ప్రముఖంగా ఉండే అంశం -- మోరిసన్


→ నోట్ :- సమగ్రం - మోరిసన్, రెండు సంఘటనలు -- బైనింగ్ & జైనింగ్

→ ఒక పరిసరానికి గానీ, శాస్త్రానికి గానీ, కళకు గానీ, ప్రవర్తనకు గాని సంబంధించిన ముఖ్యమైన, సమగ్రమైన భాగమే

యూనిట్" -- హెన్రీ మోరిసన్

→ "విద్యార్థిలో అంతర్లీనంగా దాగి ఉన్న అభిలషణీయమైన ఫలితాలను బయటకు తీయడానికి క్రమపద్ధతిలో పొందుపరచిన

విషయ, అనుభవాల నిర్మాణ అంశం" -- వెస్లీ

→ సాంఘికాధ్యయనంలో బోధనాంశం అనేది ఏమిటి ? ఎలా ? ఎక్కడ ? ఒక ముఖ్య విషయాన్ని బోధించాలనే ప్రశ్నలన

జవాబు చెప్పే సమగ్ర బోధనాభ్యసన ప్రణాళిక యూనిట్" -- రిచర్డ్

→ అభ్యాసకుడు సమీక్షా పూర్వ పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే ఒక



మంచి యూనిట్ లక్షణాలు:-

→ విద్యార్థుల వయస్సు, స్థాయి, అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఉండటం

→ తార్కిక పద్ధతిలో, సహసంబంధాన్ని కలిగి ఉండటం

→ విద్యార్థుల జీవన సరళికి అనుకూలంగా ఉండటం

→ అర్థవంతమైన బోధనను కలిగించడం

→ భౌతిక, మానసిక, అభ్యసన కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రమేయాన్ని ప్రోత్సహించడం లాంటి లక్షణాలన్నీ ఒక మంచి యూనిట్ ఉండాలి.

→ ప్రత్యేక విషయాన్ని కలిగి ఉండటం

→ నిర్ణీత పరిధి ఏకత్వాన్ని కలిగి ఉండటం

→ విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉండటం

→ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తుల్ని పెంపొందించే విధంగా ఉండటం

→ ఒక అంశానికి సంబంధించిన వివిధ విషయాల్ని సంపూర్ణంగా అందించడం



యూనిట్ ఉపగమం మనో వైజ్ఞానిక ఆధారాలు :-

→ ప్రతి యూనిట్ దాని ముందు వెనుక యూనిట్లలో సహసంబంధాన్ని కలిగి ఉంటుంది

→ సులభం నుండి కష్టమైన దానికి, సరళత నుండి సంక్లిష్టత లాంటి మనోవైజ్ఞానిక ఉపగమాల ఆధారంగా యూనిట్లు అమరిక ఉండును.

→ ఈ ఉపగమం గెస్టాల్ట్ వాద పునాదుల మీద నిర్మించబడిందని చెప్పవచ్చు. దీనిలో ప్రతి యూనిట్ సంపూర్ణ స్వరూపంగా నిర్మించబడుతుంది. భాగంగా కంటే మొత్తంగా చూస్తాం

నోట్ :- ప్రతి యూనిట్ ఒక సంపూర్ణ స్వరూపంగా ఉండాలి -- గెస్టాల్




యూనిట్ పద్దతి - ఉపగమాలు:-

→ విషయావగాహన, సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించడానికి సహకారం, సంఘీభావం లాంటి సుగుణాలు పెంపొందించడానికి

→ విద్యార్థుల్లో సమస్యా పరిష్కార శక్తిని పెంపొందించడానికి

→ సహజ వాతావరణంలో సామూహిక కృత్యాలను నిర్వహించడానికి

→ ప్రజాస్వామ్య వాతావరణంలో వివిధ కృత్యాలను చేపట్టడానికి

→ వివిధ బోధనోపకరణాల వినియోగం వల్ల విద్యార్థుల్లో విషయం పట్ల అభిరుచిని పెంపొందించడానికి

→ విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను తెలుసుకోవడానికి



యూనిట్ పద్ధతి పరిమితులు :-

→ ఈ పద్ధతి వల్ల ముఖ్య తేదీలు, వ్యక్తులు, సంఘటనల వివరాలు మరుగున పడే అవకాశముంది.

→ వివిధ బోధనోపకరణాల్ని వాడటం, సమస్యల్ని కల్పించడానికి మంచి ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులు అవసరం. అలాంటి

ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది.

→ బాష బాషాయేతర అంశాలన్ని యూనిట్ పద్ధతిలోనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.



వివిధ రకాల యూనిట్లు :-

→ ఇవి 5 రకములు. అవి

1.నిర్మాణాత్మక యూనిట్

2.విషయజ్ఞాన అంశం యూనిట్

3.భోధన యూనిట్

4.అనుభవ ప్రాముఖ్యత యూనిట్

5. వనరుల యూనిట్


1) వనరుల యూనిట్ (ఉపాధ్యాయుడు) :

→ ఉపాధ్యాయునికి విస్తృత నమాచారాన్నదించే యూనిట్లను వనరుల యూనిట్లు అంటారు.

→ తరగతి గది బోధనకు అవసరమైన ఆలోచనలు అందిస్తారు.

→ ఉపాధ్యాయునికి జ్ఞాననిధిలా తోడ్పదును

→ వీటి మాటల పరిధి విస్తృతం

కోడ్ :- ఉపాధ్యాయునికి కావలసిన సమాచారం + ఆలోచనలు + తెలివితేలు + జ్ఞాననిధి - వనరుల యూనిట్



2) బోధనా యూనిట్ (విద్యార్థి) :-

→ ఇది విద్యార్థికి అవసరమైన సమాచారం ఇస్తాయి

→ ఇవి వనరుల యూనిట్లలో భాగంగా ఉంటాయి

→ ఇవి ప్రత్యేక ఉద్దేశాలకనుగుణంగా ఉంటాయి

→ ఇది కార్యనిర్వహణ విభాగం, కార్యనిర్వహణ కేంద్రంగా ఉంటాయి

→ దీనిని ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి బోధన కోసం తయారుచేసుకుంటాడు

కోడ్ - విద్యార్థులకు కావలసిన సమాచారం + కార్యనిర్వహణ + పనివిభాగం + ప్రత్యేక తరగతి బోధన


బోధనా యూనిట్ లక్షణాలు:-

→ కావలసినన్ని ఉప అంశాలుగా విడగొట్టి వీలు కలిగి ఉండుట

→ సమాచార సేకరణకు కావలసిన వనరుల లభ్యత

→ విద్యార్థుల వయస్సుకు తగిన పరిమాణంలో ఉండుట

→ బోధనోపకరణాల వినియోగంతో కార్యకలాపాల నిర్వహణకు వీలుగా ఉండుట

→ విద్యార్థుల ఆనక్తులు, అవసరాలు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి.




విషయ విజ్ఞానంశ యూనిట్ (జ్ఞానం) :-

→ ఇందులో విద్యార్థి కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండును .

→ విద్యార్థి సాధించవలసిన జ్ఞానం సమగ్రంగా అందించబడును.

→ విద్యార్థికి విషయ పరిజ్ఞానం ఇవ్వడం జరుగును


దీనిలో 4 ముఖ్య విధులున్నాయి. అవి

1.సాధారణీకరణ అంశం

2) ప్రకరణ అంశం

3) పరిసరాల అంశం

4.అనుభవ ప్రాముఖ్య అంశం



4.అనుభవ ప్రాముఖ్య యూనిట్స్ :-

→ ఈ రకం యూనిట్లు, అనుభవ కేంద్రంగా ఉండును.

→ విద్యార్థి నిజజీవిత సన్నివేశాలు లేదా సమస్యలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.

→ దీని వలన బల్లార్డ్ చెప్పినట్లుగా నిజజీవిత భాగాన్ని తరగతి గదిలోకి దిగుమతి చేసుకొన్నట్లు ఆగును.

→ విద్యార్థులు భావి జీవితాన్ని సమర్థవంతంగా గడపదానికి కావలసిన పరిఖ్ఞానం, అవగాహస అందించబడును.



5) నిర్మాణాత్మక యూనిట్స్ :

→ ఈ నిర్మాణాత్మక యూనిట్ రూపకర్త పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన జోన్స్

→ విద్యార్థి నిజజీవిత సమస్యల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ యూనిట్ యొక్క లక్ష్యం.


యూనిట్ పద్ధతిలో ముఖ్య సోపానాలు :-

1.లక్ష్యాలు (అబ్జెక్టివ్స్).

2.యూనిట్- యొక్క భావనలు గ్రహించడం

3.విషయ సేకరణ

4.బోధనా కార్యక్రమాల ఎంపిక

5. పరిశీలనా గ్రంథాలు

6.బోధనోపకరణాల ఉపయోగం



సహసంబంధ ఉపగమం :-

→ సహసంబంధం అంటే వివిధ పాఠ్య విషయాల మధ్య అంత సంబంధాలను చెప్పడం

→ ఉపాధ్యాయుడు వివిధ విషయాలకు చెందిన పాఠ్యాంశాలను సంపూర్తిగా తెలుసుకుని వాటిలోని సాదృశ్యాలను, భేదాలను సంబంధాలను రూపొందించుట.



→ వివిధ భాగాల మధ్య అనుసంధానం చేయడానికి పాఠ్య విషయాలలోని సంబంధిత అంశాలను కనుక్కొని వినియోగించుటే

సహసంబంధం

→ పాఠ్య విషయ విలువను పెంచే విధంగా చూడడమే సహసంబంధం యొక్క ముఖ్యోద్దేశ్యం.

ఉదా :- జనాభా పెరుగుదల చెప్పేటప్పుడు పట్టణీకరణ, మురికివాడల అభివృద్ధి లాంటి సామాజిక పరిజ్ఞానం, మైదాన టండ్రా ప్రాంతాలలో జనసాంద్రత గూర్చిన భౌగోళిక పరిస్థితుల జ్ఞానం, తలసరి జాతీయాదాయాలను గూర్చిన

అర్థశాస్త్రం జ్ఞానాన్ని గూర్చిన విషయాలు చెబుతాం.

సహసంబంధం రెండు రకాలు

1) అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం

2) పాఠ్య విషయక సహసంబంధం (సబ్జెక్ట్ సహసంబంధం)


అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం :-

దీనిలో విద్యార్థి చదువుకున్న అంశాన్ని / సంఘటనలను అతను ఇదివరకే నేర్చుకున్న సంబంధిత జ్ఞానంతో లంకెచేసి జోధన చేయడం.

ఉదా :- విద్యార్థులు గ్రామ పంచాయితీ విధులు గూర్చి తెలుసుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ విధులు గూర్చి తెలుసుకొనుట

లాభం.

→ విద్యార్థి పూర్వజ్ఞానంతో నూతన జ్ఞానంను జతచేర్చి బోధించుట




2) సబ్జెక్ట్ సహసంబంధం :-

→ వివిధ పాఠ్య విషయాల మధ్య ఏర్పడు సహసంబంధం

→ ఉదా :- భారత సాహిత్యాన్ని గూర్చి చదివినపుడు ఖారతదేశ చరిత్ర తెలుసుకొనుట


→ ఈ విధంగా రెండు పాఠ్య విషయాలలోని విజ్ఞానాన్ని అనుసంధానం చేయుట

→ చరిత్ర - భూగోళం - కళ - సాహిత్యం సంగీతం మొదలైన వాటి ద్వారా సహసంబంధం.




ఏకైక సహసంబంధిత పాఠ్యక్రమం :-

భూగోళంలో మొదటి యూనిట్ -- చరిత్రలో మొదటి యూనిట్

పౌరశాస్త్రంలో మొదటి యూనిట్ -- అర్థశాస్త్రంలో మొదటి యూనిట్

సహసంబంధంలో మరో రకం విభజన 2 రకాలు :-

1.అంతర్గత సహసంబంధం :-

→ ఒకే సామాజిక శాస్త్రంకి చెందిన వివిధ అంశాల మధ్య సహనరిచింధం కలుగజేయుట.

→ ఒకే సబ్జెక్ట్ కి చెందిన వివిధ టాపిక్ మధ్య సహసంబంధం.

ఉదా :- 1) అశోకుడి గూర్చి బోధించేటపుడు మౌర్య సామ్రాజ్య స్థాపన సుండి బోధించుట

2) అక్బర్ గూర్చి బోధించేటపుడు బాబర్ దగ్గర నుండి బహదూర్ షా - 2 వరకు బోధించుట

2) బాహ్య సహసంబంధం :

→ సామాజికాధ్యయనాలలో వివిధ పాఠ్య విషయాల మధ్య సహసంబంధం

→ వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధం

ఉదా :- 1) ముంబాయి చుట్టుపక్కల వందే ప్రత్తి పంటకు అక్కడ ఉండే నేలలకు వాణిజ్యానికి, రవాణాకు మధ్య నంబంధం

2) నాగరికతలన్నీ నదుల ఒడ్డునే ఏర్పడుటకు కారణం

ప్రయోజనాలు :

→ ఇంట్లో, నమాజంలో, పాఠశాలలో పొందే అనుభవాల మధ్య లంకె ఏర్పరచుట.

→ విద్యార్థులలో ఆసక్తి / ప్రేరణ, విషయావగాహన కలుగును శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించుట, సృజనాత్మకత అభివృద్ధి చెందును



పరిమితులు :-

అనవసర / కృత్రిమ / అసహజ సహసంబంధాలు ఏర్పరచుట వలన విద్యార్థికి అవగాహన కుంటుపడుతుంది.

→ సరైన సహసంబంధాలు ఏర్పరచుకుంటే అనుకున్న లక్ష్యాలు’ నెరవేరవు.

→ ఈ పద్దతిని బోధించడానికి, ఉపాధ్యాయులకు సరైన విషయ పరిజ్ఞానం అవగాహన ఉండాలి

7.సమైక్య పద్ధతి :-

→ ఏ మంచి ప్రణాళికైనా సమైక్యత ఒక మంచి లక్షణం

→ పాఠ్య విషయాల హద్దులు, ఇంచుమించు విస్మరించుట జరుగును కానీ విషయం మాత్రం యధాతథంగా ఉండును

→ సమైక్య పరచడం అంటే విజ్ఞానంలో ఒక భావాన్ని మాత్రమే కాకుండా యావత్ స్వభావాన్ని వ్యక్తపరచడానికి అనేక రంగాల నుండి సమైక్యపరచిన విషయ విశేషాలను తీసుకొని వాటిలో, లభ్యంకాగల అవగాహన గూర్చి చెప్పుట జరుగును.

ఉదా :- సింధూ నాగరికత లాంటి ప్రాచ్య నాగరికతలను బోధించేటప్పుడు

1.చారిత్రకాంశాలు

2.రాజనీతి అంశాలు

3) భౌగోళికాంశాలు

4) కళలు

5) సాహిత్యం

6) సంగీతం

7.ఆర్థికాంశాలు


→ మొదలైన అనేక సామాజికాంశాలను కలిపి ఒక్కటిగా సమైక్యం చేసి బోధిస్తాం ఈ విధంగా అనేక సామాజిక శాస్త్రాల మధ్యనున్న హద్దులను ఇంచుమించు విస్మరించు వీటన్నింటిని నమైక్యవరుస్తాం / ఒకటిగా బోధిస్తోం

→ పాండిత్యపరమైన అంశాలను ఇది పరిగణనలోకి తీసుకోదు

→ విషయ సామాగ్రి అంశాలను ఇది పరిగణనలోకి తీసుకోదు

→ విషయ సామాగ్రి ఉపయుక్తతకు తోడ్పడును

→ మనస్తత్వపరంగా విషయసామాగ్రి కూర్పును సూచిస్తుంది

నోట్ :- సాంఘిక శాస్త్రం సమైక్య పద్ధతిలో తయారుచేయబడింది కోడ్ :- మంచి పద్ధతి, మనస్తత్వ శాస్త్రంని అనుసరించుట, యావత్ స్వరూపం, విషయసామాగ్రి ఉపయుక్తం

→ వివిధ సామాజిక శాస్త్రాలను ఏకీకరించే ప్రయత్నం ఒకటిగా చేసే ప్రయత్నం/ సమైక్యంచేయు ప్రయత్నం

యోగ్యతలు :-

→ ఈ రకమైన దృక్పథంలో అతి తక్కువ క్షేత్రాలుంటాయి. అందువలన ఏదైనా ఒక క్షేత్రంలో ఎక్కువ కాలం గడవవచ్చు .

→ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి బదులు సామాన్యీకరణలను అవగాహన చేసుకోవడానికి తోడ్పడును.

సమ్మిశ్రణ పద్ధతి :-

→ రెండు లేదా మూడు పాఠ్య విషయాలను పూర్తిగా విలీనం చేయుట.

ఉదా :- 1) బయోలజీ + టెక్నాలజీ = బయోటెక్నాలజీ

2) జియోలజీ + ఫిజిక్స్ = జియోఫిజిక్స్

3. ఒక దేశం దాని భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరవిషయాలను మొత్తం కలిపి బోధించుట

4.మూడు మెథడాలజీలు కలిపి బోధించుట

5) పాలు + నీరు + టీ పొడి + పంచదార = టీ

→ సమ్మిశ్రణ పద్ధతిలో వివిధ పాఠ్య విషయాల మధ్య సరిహద్దులు పూర్తిగా అంతర్జానమగును. పార్యవిషయం కూడా మారిపోవును.

→సమ్మిశ్రణం అంటే అవిభక్త సంక్లిష్టత / అవిభాజ్యమైనది.

→ సమ్మిశ్రణం అనేది భేదం చూపజాలని రాశి చిహ్నం





దోషాలు :-

→ అసాధ్యమైనది, అసహజమైనది

→ మనస్తత్వపరంగా వివేకవంతమైనది కాదు

→ సమ్మిశ్రణసూత్రం దృఢంగా / కష్టంగా ఉంటే పాఠ్యాంశాలన్నింటినీ చేర్చుట కష్టం

→ సాధారణ అభిప్రాయాలను మనస్సు తేలికగా అవగాహన చేసుకోలేదు

→ సంప్రదాయకమైన దాని కన్నా మరింత కష్టతరమైనది ఇది విద్యార్థికి మరొక పాఠ్యాంశం లాగా 'అనిపిస్తుంది

→ దీనిలో లక్ష్యాలు, సాధనాలు గందరగోళ రూపాన్ని పొందుతాయి

→ దీనిలో ఒక పద్ధతి అంటూ ఏమీ లేదు. ఉపగమాలు లేవు, దృష్టాంతాలు లేవు విజ్ఞాన విధి లేదు

→ క్రమీకరణ విలువను విచ్చిన్నం చేయును

→ సమకాలీన ప్రపంచ అవగాహన దీనిలో ఒక సంభావిత లక్ష్యం

→ దీనికి అన్ని వైపుల నుండి ప్రత్యక్ష దాడి అవసరం

→ ఇలా సమ్మిశ్రణం విద్యలో కేవలం ఒక వ్యవహారికవాద దృక్పథం మాత్రమే