అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక/బోధనా ప్రణాళిక













పాఠ్యప్రణాళిక - అర్థం :

→ పాఠ్య ప్రణాళికను ఆంగ్లంలో 'కరికులమ్' అని అంటాము.

→ కరికులమ్' అనే ఆంగ్ల పదానికి కరీర్ (Carrere) అనే లాటిన్ పదం మూలపదం.

→ కరీర్ అంటే పందెపు బాట లేదా పరుగెత్తే దారి అని అర్థం.

→ విద్యాపరంగా నిర్వచిస్తే 'కరికులమ్' అనేది బోధనాథ్యనన కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు తమ గమ్యాలను

చేరుకోవడానికి ఉపయోగించే మార్గం

→ కన్నింగ్ హామ్" (Cunningham) ప్రకారం 'కరికులమ్' అంటే పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలనూ, ఉద్దేశాలనూ రూపుదిద్దేటట్లు

చేయడానికి ఒక కళాకారుడిగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం.



జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం (NCF -2005) - విజ్ఞానశాస్త్రం:-

→ జాతీయ పాఠ్యప్రణాళికలో కింది విధంగా పేర్కొనబడిన మార్గదర్శక సూత్రాలననుసరించి

1. బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని, మన బోధనతో అనుసంధానించాలి

2. కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి.

3. పాఠ్యపుస్తకాల్లో చిక్కుకొనేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాన్ని రూపొందించుకోవాలి.


4. పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి




కరికులమ్, ఆచరణలో ఇమిడి ఉన్న అంశాలు :-

→ జ్ఞాన నిర్మాణం కోసం, బోధన ప్రతిచర్యల విలువ, అభ్యసనానుభవాల్ని రూపొందించడం, ప్రణాళిక పట్ల వైఖరి, విమర్శనాత్మక

బోధనా వ్యూహం.

విజ్ఞానశాస్త్రం - పాఠ్యప్రణాళిక :-

→ విజ్ఞానశాస్త్ర (సైన్స్ ఎంతో గతిశీలమైంది. నూతన అనుభవాలతో నానాటికీ విస్తరిస్తున్న జ్ఞానరంగమిది.

→ పరిశీలన, సామాన్యాంశాల క్రోడీకరణ, ఊహించడం, నాణ్యమైన, తార్కికమైన నమూనాల్ని రూపొందించడం, పరిశోధనల ద్వారా, పరిశీలనల ద్వారా సిద్ధాంతాల్ని నరిచూచుకోవడం అవి సరైనవో కావో తేల్చుకోవడం, సూత్రాలను ఆవిష్కరించడం

ఇదంతా సైన్స్ పద్ధతి.

→ సైన్స్లో ఊహలకు కూడా అవకాశముంది. కాని అవి ప్రయోగాల ద్వారా / పరిశీలనల ద్వారా రుజువు కావల్సి ఉంటుంది

→ విశ్వజనీన సైన్స్ సూత్రాలు కూడా తాత్కాలికమైనవే అని సైన్స్ భావన్తుంది

→ కొత్త పరిశీలన, విశ్లేషణ, ప్రయోగాలు జరిగితే వీటిని కూడా సవరించాల్సి వస్తుందని సమ్ముతుంది

→ నిజమైన విజ్ఞానశాస్త్ర విద్య అంటే పిల్లవాడికి తన జీవితం గురించి, శాస్త్రీయంగా నిజానిజాలు చెప్పడమే. ఇదే సైన్స్ పాఠ్య ప్రణాళికలో ప్రధానమైన అంశం

కొన్ని పరిశీలనలు :

→ పిల్లల వయసుకు తగిన విషయం, పద్ధతి, భాష, బోధనానుభవాలతో కూడిన జ్ఞానాన్ని కలిగించేలా పాఠ్యప్రణాళిక (కరికులమ్) ఉండాలి

→ సైన్సులో చెప్పే అంశాలు శాస్త్రీయమైనవిగా ఉండాలి .


→ పిల్లలలో గల సహ మైన కుతూహలం, సృజనాత్మకతలను మెరుగుపరచేలా నేర్చుకొనే పద్ధతులు, విధానాలు ఉండాలి. శాస్త్రం దాని చారిత్రక ప్రగతి, కాలానుగుణంగా సైన్స్లో వస్తున్న మార్పులు తెలుసుకునేందుకు పైన్స్ చరిత్రకు తగిన ప్రాధాన్యత

ఉండాలి



→ స్థానిక పరిసరాల నుంచి ప్రపంచం వరకు అర్థం చేసుకోవడానికి పాఠ్యప్రణాళికలో పరిసరాలకు తగిన ప్రాధాన్యత ఉండాలి. విద్యా కార్యక్రమం (NPE) ప్రతిపాదించి ముందుకు తెచ్చింది.

→ అదే సందర్భంలో కొన్ని ముఖ్యమైన సాధారణ విలువలకు, సాధారణ పాఠ్యాంశాలకు జాతీయ విద్యా వ్యవస్థ (NPE జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రంపై ఆధారపడి ఉంటుంది

→ ఈ ప్రణాళికలో అందరికీ సాధారణమైన ముఖ్యాంశాలతో పాటు ఎవరికి వారు మార్చుకోగల అంశాలు కూడా ఉంటాయి ప్రధానంగా విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళికలో పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రబోధించడంలాంటి

→ విలువల్ని పెంచేలా ఈ అంశాలుంటాయి. (DSC 2006)

→ జాతీయ పార్యప్రణాళికలో కింది విధంగా పేర్కొనబడిన మార్గదర్శక సూత్రాలననుసరించి సైన్స్ పాఠ్యప్రణాళిక ఉండాలి. - బయటి జీవితాన్ని, జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి

→ కంఠస్తం చేసే పద్ధతులనుంచి మన బోధనను దూరం చేయాలి

→ పాఠ్యపుస్తకాల్లో చిక్కుకొనేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాల్ని రూపొందించుకోవాలి

→ పరీక్షలని మరింత సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి

→ కరికులమే, ఆచరణలో ఇమిడి ఉన్న అంశాలు :

1) జ్ఞాననిర్మాణం కోసం జోధన

2) ప్రతిచర్యల విలువ

3) అభ్యసనానుభవాల్ని రూపొందించడం

4) ప్రణాళిక పట్ల వైఖరి



1.ప్రాథమిక స్థాయి :-

→ విద్యార్థి తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా తెలుసుకుంటూ దానితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం అవసరం

→ పిల్లలు వివిధ కృత్యాలు చేస్తూ పరిశీలించడం, వర్గీకరించడం, ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది, వాటి ద్వారా జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక నైపుణ్యాలు పెంపొందుతాయి

→ ప్రస్తుతం సైన్స్ ను, సామాజిక శాస్త్రాల్ని కలిపి పర్యావరణ విద్యగా (పరిసరాల విజ్ఞానం) మనం బోధిస్తున్నాం. ఆరోగ్యానికి ఇందులో చాలా ప్రాధాన్యతనిస్తున్నాం,

→ ప్రాథమిక స్థాయిలో పీరియాడికల్ పరీక్షలు, మార్కులు, గ్రేడులు నిర్ణయించడం, అదే తరగతిలో మళ్లీ చదివించడం ఉండకూడదు

2. మాధ్యమిక స్థాయి :-

→ పిల్లలు శాస్త్రీయ సూత్రాలను పరిచితమైన ప్రయోగాల ద్వారా, సరళమైన సాంకేతిక డిజైనులు, నమూనా నిర్మాణాల ద్వారా నేర్చుకోవాలి

→ వివిధ కృత్యాలు, సర్వేలలో పాల్గొనడం ద్వారా పరిసరాల గురించి, ఆరోగ్యం గురించి మరింత తెలుసుకోవాలి

→ ఈ స్థాయిలో నిరంతరం నియమిత కాలవ్యవధి మూల్యాంకనాలు (యూనిట్ పరీక్షలు, టెర్మినల్ పరీక్షలు) ఉందాలి.

→ ప్రత్యక్ష పద్ధతి ద్వారానే గ్రేడింగ్ ఇవ్వాలి. పరీక్షలో తప్పిపోవడం ఉండరాదు.


3. సెకండరీ స్థాయి:

→ మాధ్యమిక స్థాయికన్నా మరింత మెరుగైన సాంకేతిక అంశాలను, పరికరాలను ఉపయోగించి చేస్తూ నేర్చుకోవాలి.

→ కృత్యాలు విశ్లేషణల ద్వారా సైన్సు నేర్పండాలి.

→ సిద్ధాంతపరంగా ఉన్న సూత్రాలను క్రమబద్ధమైన ప్రయోగాలు చేయడం ద్వారా అర్థం చేసుకోవాలి.

→ స్థానిక ప్రాధాన్యత గల ప్రాజెక్టుల మీద పనిచేయడాన్ని శాస్త్ర సాంకేతిక అక్షరాస్యతగా గుర్తిస్తారు


విజ్ఞానశాస్త్రం - సహపాఠ్య ప్రణాళిక :

→ విద్యార్థిలో పరిశీలనాత్మక నైపుణ్యాలు పెంపొందించాలి. పరిశీలనా దృక్పథం కలిగించేలా, సృజనాత్మక శక్తిని పెంపొందించేలా,

→ పరిశోధనాభిలాషను కలిగించేలా పాఠశాలలు కృషి చేయాలి. అందుకుగాను, పార్వేతర, నహపాత్యాంశాలకు విద్యలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

→ కొన్ని సైన్స్ సహపాఠ్య కార్యక్రమాలు కింద ఇవ్వబడినవి.

1. సైన్స్ కార్నర్ ఏర్పాటు

2) సైన్స్ కిట్ల తయారి

3. ప్రయోగశాలల, ఏర్పాటు

4) సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానంట్

5) సైన్స్ సెమినార్ నిర్వహించడం

6) సైన్స్ డ్రామాల్లో పాల్గొనడం

7) క్షేత్ర పర్యటనలు విజ్ఞాన విహారయాత్రలు

8)పర్యావరణ విద్యా కార్యక్రమాలు





విషయ ప్రణాళిక (సిలబస్):

→ విషయ ప్రణాళిక (Syllabus) అనేది ఆయా తరగతుల్లో బోధించవలసిన విషయం పరిధిని తెలియజేస్తుంది

→ విషయ ప్రణాళిక అనేది అంశాల విస్తృతినీ, పరిమితిని తెలియజేస్తుంది. ఇది ఆ తరగతి విద్యార్థుల మానసిక స్థాయి

→ విషయజ్ఞానం, దశలపై ఆధారపడి ఉంటుంది

→ పాఠ్య పుస్తకాలలో ఒక క్రమంలో విషయ ప్రణాళికననుసరించి విషయాన్ని రూపొందిస్తారు సాధారణంగా పాఠ్యప్రణాళిక, విషయ ప్రణాలిక అనే వాటిని పర్యాయపదాలుగా భావిస్తారు. కానీ ఈ రెండింటికీ వ్యత్యాసం

ఉంది

→ జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం-2005 ననుసరించి విషయ ప్రణాళిక (Syllabus) ఎలిమెంటరీ దశ తరగతులకు, సెకండరీ దశ 1X-X తరగతులకు, హయ్యర్, సెకండరీ దశ XI-XII తరగతులకు గాను తయారుచేయడం జరిగింది.

→ పరిసరాల పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను 1, 11 తరగతులలో భాష, గణిత పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయ ప్రణాళికలలోనే అనుసంధానం చేయబడింది.

→ II, IV. V తరగతులకు సంబంధించి ప్రాకృతిక, భౌతిక అంశాలు (సైన్స్), సామాజిక అంశాలు (సాంఘిక) రెండింటినీ కలిపి పరిసరాల విజ్ఞానం' అని పేరు 'పెట్టడం జరిగింది

→ తరగతులు 1 నుంచి X వరకు సామాన్యశాస్త్రం (Science) అనే పేరు పై పాఠ్యపుస్తకాలుంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాలన్నీ ప్రత్యేకంగా గాక అన్నీ మిళితంగానే ఉంటాయి


పాఠ్యప్రణాళిక విషయ ప్రణాళిక భేదాలు:

పాఠ్య ప్రణాళిక

1) పాఠశాలలో పాఠశాల వెలుపల విద్యార్థులు పొందే

అనుభవాల సమగ్రరూపం.

2.విద్యా ప్రణాళికలో గొప్ప పాత్రను పోషిస్తుంది

3) విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళిక, సామాజిక మార్పులకు అనుగుణంగా ఉంది. సామాజిక అవసరాలు

తీర్చగలిగేట్లు ఉండేది.

4)విద్యార్థుల మధ్య గల ఆంతరంగిక సంబంధాలను కూడా చేర్చడం జరుగుతుంది.

5) శాస్త్రలక్ష్యాలు ఉద్దేశాలన్నింటిలో అభ్యసన అనుభవాలను ఏర్పరుస్తూ నిత్యజీవితంలో ఉపయోగపడే విధంగా ఉండేది.


6) పాఠ్యప్రణాళిక అనేది "శాస్త్రమంటే చేయడం" అనే నిర్వచనానికి ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉండేది.


7) తరగతి అంతర బాహ్య కార్యకలాపాలకు సంబంధించిన విశాలమైన, సమగ్రమైన ప్రణాళికగా పాఠశాల జీవనం మొత్తం అని చెప్పవచ్చు




విషయ ప్రణాళిక

1) తరగతిలో బోధించవలసిన విషయం , పరిధిని తెలియజేసేది.

2) పాఠ్యాంశాల విస్తృతినీ, పరిమితిని తెలియజేసేది తరగతి విద్యార్థుల మానసిక స్థాయి, విషయ జ్ఞానం, దశల ఆధారపడి ఉంటుంది .

3) పాఠ్యపుస్తకాలలో ఒక క్రమంలో విషయాన్ని రూపొందించడం

4) విద్యార్థి పరిపక్వత పెరిగే కొద్ది విషయ పరిజ్ఞానం, వివరణ, క్లిష్టత పెరుగుతూ ఉండేది

5.విధ్యార్ధి పరిపక్వత పెరిగే కొద్ది పరిఙ్ఞానం, వివరణ, క్లిష్టత పెరుగుతూ ఉంటుంది.

6.విషయ ప్రణాళిక అనేది విజ్ఞానశాస్త్రం 'Sceince e is doing' అనే దానికి ప్రక్రియా విధానంలో భావనలకు తెలియజేసేది


7.ఇది పాఠ్యప్రణాళికలో అంతర్భాగం. తరగతి జీవనం మొత్తం అని చెప్పవచ్చు.


విజ్ఞానశాస్త్ర కరికులమ్ లో విద్యాకమిషన్లు, కమిటీల సిఫార్సు :

• పాఠ్య ప్రణాళికను గురించి సెకండరీ విద్యా కమీషన్ (1962) వారి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి

1) అనుభవాల సమగ్రరూపం

2) భిన్నత్వం మార్పుల కనుగుణం

3) సామాజిక జీవనంలో సంబంధం


4) విరామసమయ వినియోగానికి శిక్షణ

5 ) సమైక్యత, సహసంబంధం




→ విశాలదృక్పథాన్ని జ్ఞానపరమైన నిజాయితీని అలవరచుకోవడం, ప్రశ్నించడంలో ధైర్యం పెంచుకోవడం, మానవ గౌరవాలను

కాపాడటం, నిర్ణయాలు చేయడం మొదలైన అంశాలతో శాస్త్రీయ వైఖరినీ, శాస్త్రీయ విధానాన్ని వృద్ధి చేయడం - శాస్త్రజ్ఞుల కృషిని అభినందించడం, జీవావరణ వ్యవస్థను కాపాడటం, శాస్త్రాన్ని దుర్వినియోగం చేసే అనకాశాలపై జాగరూకులను

చేయడం

→ కొరారి కమీషన్ (1964-66) వారు పాఠశాలలో విద్యా ప్రణాళిక విస్తృత పరిధిలో ఉండాలని కింది విధంగా సూచించారు.

1.పరిశోధనల ఆధారంగా పాఠ్య ప్రణాళికలో తరచూ మార్పులుండాలి.

2.పాఠ్య పుస్తకాలను బోధనాథ్యసన సామాగ్రిని హెచ్చు స్థాయిలో రూపొందించాలి

3.పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి. కొత్త పార్య్రణాళికను రూపొందించడంలోనూ విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా రూపొందించడానికి ప్రయత్నించడంలోనూ పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుండాలి.

4.వివిధ విద్యావిభాగాలవారు, శాఖలవారు జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగా పాఠశాల పాఠ్యప్రణాళికను రూపొందించాలి.

5.ప్రాథమిక దశలో విద్యార్థికి సంబంధించిన సామాజిక, భౌతిక, జీవసంబంధమైన పరిసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమికోన్నత దశలో విద్యార్థుల జ్ఞాన సముపార్జనతోపాటు తార్కికంగా ఆలోచించడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ

6.సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.




→ ఈశ్వరీభాయి పటేల్ కమిటీ (1977) నివేదిక ప్రకారం విజ్ఞానశాస్త్రం పాఠ్య ప్రణాళికకు కింద తెలిపిన అంశాలకు ప్రాధాన్యం

ఇవ్వాలని సూచించింది.

1.పరిశీలన ద్వారా జ్ఞానాన్ని పొందడం

2. ఆటపాటల ద్వారా శరీర దారుఢ్యాన్ని పెంచడం, జట్టు భావనను పెంపొందించడం

3.సామాజికంగా ఉపయోగపడే కృత్యాల ప్రణాళికను రూపొందించడం, అమలుపరచడంలోనూ నైపుణ్యాన్ని ఏర్పరచడం

4. సృజనాత్మక శక్తిని పెంపొందించడం.

5.స్వయం అభ్యసనంలో నైపుణ్యాలను ఏర్పరచడం,

6. కణాత్మక కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసి రసాత్మక దృష్టిని, రసాత్మక అభినందనను పెంపొందించడం.

7. జీవితంలోని అన్ని రంగలలో సమైక్యత, ఓర్పు, సహకారం, నిరాడంబరత అలవరిచేట్లు ఉండాలి

→ జాతీయ విద్యావిధానం (1986):
ప్రకారం జాతీయ సమగ్ర పాఠ్య ప్రణాళిక జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించటం కోసం శాస్త్ర పాఠ్యప్రణాళికు సంబంధించిన అంశాలు కింద ఇవ్వబడినవి
1.పర్యావరణ పరిరక్షణ
2.పరిమిత కుటుంబ భావన
3.శాస్త్రీయ వైఖరులను పెంపొందించటం
4. సమస్యా పరిష్కార పద్దతినీ, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించడం
5.పరిసరాలకు సంబంధించి వివిధ అంశాలపై నిశితమైన ప్రశ్నలు చేసేట్లు చేయడం.
6.పరిశీలన ద్వారా సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడటం.
7.కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, వివరాలనూ అందించడం
8. శాస్త్రం, శాస్రాభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, సంఘానికి సంబంధించిన ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి గల సంబంధాలు తెలుసుకొనేట్లు చేయడం
9. వివిధ శాస్త్ర విభాగాలకు గల సమన్వయం తెలపడం

10. శాస్త్రీయ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపట్ల అవగాహన ఏర్పరచడం

11. విద్యార్థులలో సామాజిక నైతిక విలువలను పెంచడానికి శాస్తాన్ని ఒక సహాయకంగా తెలియజేయడం