అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




గణితశాస్త్ర విద్యా ప్రణాళిక - బోధనా ప్రణాళిక







విద్యా ప్రణాళిక :-

→ విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో కరికులం (Curriculum) అంటారు.

→ కరికులం అనే పదం కరిరే (Currere) అనే లాటిన్ భాషకు చెందిన పదం నుంచి వచ్చింది. దీని అర్ధం "Course of run", ఈ అర్థాన్ని బట్టి విద్యను ఒక పరుగు పందెంతో పోల్చవచ్చు.

→ విద్యా లక్ష్యాలను సాధించడానికి పాఠశాల, ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక అంటారు.

→ విద్యా ప్రణాళికను విద్యావేత్తలు పలు విధాలుగా నిర్వచించారు.

1) పది సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశాకృతి ప్రకారం :

ఎ) "బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. "

బి) ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన నమస్యలను, ఆలోచనలను ప్రతిబింబింపచేస్తుంది.

2) పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది." - ఆల్బర్టీ (Alberty)

3) విద్యా ప్రణాళిక కళాకారుని (ఉపాధ్యాయుని) చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేతంలో (పాడశాలలో) తన సామాగ్రి (విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం." - కన్నింగ్ హోమ్ (Cunninghom)

4) పాఠశాల ఆవరణలో తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆటస్థలంలో, ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది." - పి.శామ్యూల్ (P.Samuel)

→ విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వ సాధనకు ఏర్పరచుకొన్న లక్ష్యాల దిశలో తీసుకొని రావలసిన ప్రవర్తనా మార్పులకై వారికి ఉద్దేశ్యపూర్వకంగా తరగతి గది లోపల, వెలుపల కల్పించబడిన అనుభవాలన్నింటిని కలిపి విద్యా ప్రణాళిక అనవచ్చ.

→ జాతీయ విద్యా విషయక సంఘం : (1964 - 1966) సమగ్రమైన విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను ఏర్పరచే

సందర్భంలో కింది సిఫార్సులు చేసింది.

1.ప్రజల జీవన విధానం, అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా కరికులమ్ తయారుచేయబడాలి.

2.హేతువాద దృక్పథాన్ని పెంపొందించగలగాలి.

3. అభ్యసనం, పని అనుభవం అనే సూత్రాలను దృష్టిలో ఉంచుకొని కరికులమ్ తయారుచేయాలి.

4.కళాత్మక అనుభవం పొందడానికి, వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి

5. విద్యార్థుల్లో క్రమశిక్షణా విలువలను పెంపొందించగలిగేదిగా ఉండాలి.

6.శీలాన్ని, మానవతా విలువలను పెంపొందించేదిగా ఉండాలి

7.విద్యార్థిలో ఆసక్తిని, అభిరుచి పెంపొందిస్తూ విద్యార్థులు తమకుతాము అభ్యసించే విధంగా ఉండాలి.

8.అన్వేషణ, ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేదిగా ఉండాలి

9.ప్రయోగాత్మకంగా, శాస్త్రానికి అనుభవానికి సమతుల్యతనిచ్చే విధంగా ఉండాలి.

10. గణిత కరికులమ్ గణిత ఆశయాలు, లక్ష్యాలు సాధింపజేసేదిగా ఉండాలి.

జాతీయ విద్యా విధానం 1986 :-

→ జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం గణితం ద్వారా ఆలోచన, హేతువాద నైపుణ్యాలు ప్రాథమిక దశలో విద్యార్థులకు అలవాటు కావాలి.


→ విద్యా ప్రణాళిక సర్పిల విధానాన్ని అనుసరించి తయారుచేయబడాలి. శిశుకేంద్రీకృతం కావాలి. కృత్యాధార జోధనను ప్రోత్సహించాలి.

→ ప్రాథమికోన్నత స్థాయిలో గణిత విద్యా ప్రణాళిక నిత్యజీవితానికి అవసరమైన గణితాంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి.


జాతీయ విద్యా ప్రణాళిక 2005

→ జాతీయ విద్యా ప్రణాళిక 2005 ప్రకారం విద్యా ప్రణాళిక అనేది శిశుకేంద్రీకృత విధానాలకు అవకాశం కల్పించాలి * తరగతి గదిలో పిల్లల యొక్క ఆసక్తికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

→ విద్యార్థులు స్వయంగా, సహజంగా అభ్యసించే విధంగా ఉండాలి. తరగతి గది వెలుపల పిల్లలు అటపాటల్లో చాలా ఆసక్తితో

పాల్గొనడం జరుగుతుంది

→ బోధన అనేది విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకొనే దానికి దోహదపడాలి.

→ పిల్లల్లో గణితం అంటే భయాన్ని తొలగించి గణిత అభ్యసనంలో ఆనందాన్ని పొందేటట్లు చూడాలి.


విద్యాప్రణాళిక - నిర్మాణ సూత్రాలు

→ విద్యా ప్రణాళిక (Curriculum) తయారీ రెండు దశల్లో జరుగుతుంది

→ మొదటి దశలో పది సంవత్సరాల లక్ష్యాలకు కావలసిన పాఠ్య విషయాలు, అభ్యసన అనుభవాలు, వివిధ వ్యాసక్తులు ఎన్నుకోవడం

జరుగుతుంది. దీన్నే కరికులం నిర్మాణం (Curriculum construction) అంటారు.

→ రెండో దశలో ఎన్నుకున్న మొత్తం పాఠ్య విషయాలను, ఇతర వ్యాసక్తులను పది తరగతులుగా 10 సంవత్సరాల బోధనకు

అనువుగా విడగొట్టడం జరుగుతుంది, దీనినే విద్యాప్రణాళిక నిర్వహణ లేదా విద్యాప్రణాళిక వ్యవస్థాపన అంటారు.

కరికులమ్ నిర్మాణ సూత్రాలు :-

1.ప్రయోజన విలువ: పాఠశాలలో నేర్చుకొన్న గణితాంశాలు విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్ళినప్పుడు వారి నిత్యజీవితంలో

ఉపయోగపడేదిగా, వారు ఎన్నుకొన్న వివిధ వృత్తులు సక్రమంగా నిర్వహించడానికి సహాయపడేదిగా తద్వారా నాగరికతాభివృద్ధికి

తోడ్పడేవిగా ఉండాలి.

2. సన్నాహ విలువ : ఈ సన్నాహ విలువ రెండు రకాలు

1)విద్యార్థి పాఠశాల విద్యాభ్యాసం పూర్తికాగానే భవిష్యత్ జీవితానికి నన్నాహవరచడం

2) పై చదువులు చదవడానికి సన్నాహపరచడం.

3.క్రమశిక్షణ విలువ : గణితాధ్యయనం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, హేతువాదం అభివృద్ధి చెందుతాయి.

4.సాంస్కృతిక విలువ :- గణిత విద్యా ప్రణాళికకు ఎంపిక చేసుకొన్న అంశాలు, శుభ్రత, క్రమం, నత్యం, స్పష్టత, క్లుప్తత మొదలైన గుణాలు ఏర్పరచేవిగా ఉండాలి.

ఉదా: గుడులు, గోపురాలు, చర్చి, మసీదులు నిర్మాణాల్లోని సౌష్ఠవాకారం మొదలైన గణితాంశాలు తెలుసుకొనేటట్లు చేయడం

5.వ్యాసక్తి సూత్రాలు : కృత్యాధారంగా నేర్చుకొన్న అంశాలు త్వరగా అవగాహన కావడమే కాకుండా విద్యార్థి ఎక్కువ కాలం

గుర్తుంచుకొంటాడు.

6. శిశు కేంద్రీకృత ప్రణాళిక పద్ధతి : గణితశాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి ఆసక్తులకు, అవసరాలకు, సామర్ధ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి

7. కఠినతా సూత్రం : విద్యార్థుల మనో వికాస స్థాయిని పరిశీలించి, కష్టమైన అంశాలను పై తరగతుల్లో ప్రవేశపెట్టాలి

8.సహసంబంధ సూత్రం : సహసంబంధం అనేది

1) జీవితం - దాని సమస్యలతో సహసంబంధం.

2) కరికులమ్ ని ఇతర విషయాలతో సహసంబంధం,

3) గణిత శాఖల పరస్పర సహసంబంధం.


9.ఉపాధ్యాయుని సమ్మతి : పాఠశాల విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలు, ఆసక్తులు, ఆలోచనా రేతులు క్షుణ్ణంగా తెలిసి ఉండే

వ్యక్తి ఉపాధ్యాయుడు.

→ నిర్దేశించిన విద్యా ప్రణాళిక విద్యార్థులకు అందించి భావితరాలకు సంసిద్ధులైన పౌరులను తీర్చిదిద్దేది కూడా ఉపాధ్యాయుడే గణితశాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణంలో గణితోపాధా్యాయులకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి.

గణిత విద్యా ప్రణాళిక నిర్మాణానికి సూచనలు :-

1. జాతీయ విద్యా విషయ సంఘం / కొఠారి కమీషన్ (1964-66) :-

→ ప్రజల జీవన విధానం అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా కరికులమ్ తయారు చేయబడాలి

→ హేతవాద దృక్పథాన్ని పెంపొందించాలి

→ అభ్యసనం, పని అనుభవం అనే సూత్రాలను దృష్టిలో ఉంచుకుని కరికులమ్ తయారు చేయాలి

→ కళాత్మక అనుభవం పొందడానికి వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి

→ విద్యార్థుల్లో క్రమశిక్షణా విలువలను పెంపొందించగలిగేదిగా ఉండాలి

→ శీలాన్ని, మానవతా విలువలను పెంపొందించేదిగా ఉండాలి

→ విద్యార్ధిలో ఆసక్తిని, అభిరుచిని పెంపొందిస్తూ విద్యార్థులు తమకుతాము అభ్యసించే విధంగా ఉండాలి

→ అన్వేషణ, ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేదిగా ఉండాలి - ప్రయోగాత్మకంగా, శాస్త్రానికి అనుభవానికి సమతుల్యతనిచ్చే విధంగా ఉండాలి

→ గణిత కరికులమ్ గణిత ఆశయాలు, లక్ష్యాలు సాధింపజేసేదిగా ఉండాలి.



2. జాతీయ విద్యా విధానం 1986 సూచనలు :

→ ప్రాథమిక దశలో విద్యార్థులకు గణితం ద్వారా ఆలోచన, హేతవాద నైపుణ్యాలు అలవాటు చేయాలి

→ ప్రాథమిక దశను మూర్త వస్తువుల దశ అంటాం. కనుక మూర్త వస్తువులతో బోధన చేయాలి

→ విద్యా ప్రణాళిక సర్పిల విధానాన్ని అనుసరించి తయారు చేయాలి

→ శిశుకేంద్రీకృత, కృత్యాధార బోధనను ప్రోత్సహించాలి

→ ప్రాథమికోన్నత స్థాయిలో గణిత విద్యా ప్రణాళిక నిత్యజీవితానికి అవసరమైన గణితాంశాలకు ప్రాముఖ్యతనివ్వాలి.


3. జాతీయ విద్యా ప్రణాళిక 2005 :-

→ దీని ప్రకారం విద్యా ప్రణాళిక అనేది శిశువు కేంద్రీకృత విధానాలకు అవకాశం కల్పించాలి.

→ విద్యార్థులు స్వేచ్ఛగా, సహజంగా, నిర్భయంగా అడగడం ద్వారా నేర్చుకోవాలి విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకునే విధంగా ఉండాలి

→ విద్యార్థులకు గణితం అంటే వల్లెవేయడం, కంఠతావట్టడం లేదా భయపడడం లాంటివి లేకుండా నేర్చుకోవాలి

→ నిత్యజీవిత సందర్భాల ఆధారంగా నేర్చుకునేటుగా ఉండాలి పూర్వ ప్రాథమిక స్థాయిలో గణితాళ్యసనం అంతా ఆట పాటల ద్వారా నేర్చుకోవాలి

→ ప్రాథమిక స్థాయిలో ఆటపాటలు, పజిల్స్, కధల ద్వారా గణితం పట్ల విద్యార్థులకు ఆసక్తి కల్పించాలి

→ ప్రాథమికోన్నత స్థాయిలో గణిత నిర్వచనాలను, సత్యాలను గణిత పరిభాషలో చెప్పడం, రాయడం జరగాలి. బీజగణితం ప్రవేశ పెట్టాలి. బీజ గణితం సహాయంతో సమస్యలు సాధించడం నేర్పాలి

→ ప్రాథమిక జ్యా మితి భావనలను శాస్త్రీయంగా నేర్చుకోవడం జరగాలి. దత్తాంశ సేకరణ, వివరణ, విశ్లేషణ, గ్రాఫ్ లు గీయడం

నేర్పబడాలి.

నోట్ :- ఏకైక ప్రపంచ భాష గణితమే నాధానియల్ వెస్ట్ :


→ విద్యా ప్రణాళిక తయారీ రెండు దశల్లో జరుగుతుంది


→ మొదటి దశలో పది సం||ల లక్ష్యాలకు కావలసిన పాఠ్య విషయాలు, అభ్యసననుభవాలు, వివిధ వ్యాసకులు ఎన్నుకోవడం

జరుగుతుంది. దీనినే కరికులం నిర్మాణం అంటారు

→రెండవ దశ ఎన్నుకున్న మొత్తం పాఠ్వ విషయాలను, ఇతర వ్యాసట్లులను పదితరగతులుగా పది నంవత్సరాల చోధనకు అనువుగా విడగొట్టడం జరుగుతుంది. దీన్నే విద్యా ప్రణాళికా నిర్వహణ లేదా విద్యా ప్రణాళికా వ్యవస్థాపన అంటారు



విద్యా ప్రణాళిక రూపొందించే విధానాలు:

1.శీర్షిక పద్ధతి/ అంశాల పద్దతి / పాఠ్య విభాగ పద్ధతి / ప్రకరణాల పద్ధతి :

→ ఈ పద్ధతిలో గణిత విద్యా ప్రణాళికలోని ఒక తరగతిలో బోధించవలసిన అంశాలు ఎన్నుకొన్న తరవాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి, ఒక క్రమ పద్ధతిలో సులభమైన విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలు బోధించడం

జరుగుతుంది

→ ఈ పద్ధతి విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాల మీద ఆధారపడుతుంది

→ ఒక శీర్షిక తరవాత రెండవ శీర్షిక బోధించడం జరుగుతుంది

2.ఏకకేంద్ర పద్ధతి (Concentric Method) :

→ ఈ పద్దతిలో ఒక శీర్షికను అనేక భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది

→ సులభమైన ప్రాథమిక విషయాలను కింది తరగతుల్లో చెప్పి, కఠినమైన విషయాలను క్రమక్రమంగా పెద్ద తరగతుల్లో చెప్పే

పద్ధతి ఏకకేంద్ర పద్ధతి.

→ ఏకకేంద్ర పద్ధతిలో ఒక శీర్షికను అర్ధవంతమైన భాగాలుగా విడగొట్టిన తరవాత మొదటి భాగాన్ని ఒక తరగతిలో బోధించిన తరవాత రెండవ సంవత్సరం లేదా ఆ తరవాత రెండవ భాగం బోధించేటప్పుడు ముందు ఖాగాన్ని పునర్విమర్శ చేయడం

జరుగుతుంది.



2 సర్పీల పద్ధతి :

→ఈ పద్ధతిలో ప్రతి శీర్షికను భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది

→ కఠినతను అనుసరించి భాగాలను క్రమంలో అమర్చడం జరుగుతుంది. తగిన భాగాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.

→ భాగాలను విషయ కారిన్యతను అనుసరించి విద్యార్థుల మానసిక పరిపక్వతను బట్టి వివిధ తరగతులకు విభజిస్తారు.

→ ఈ విధానాన్ని సర్పిల విధానం లేదా కుంతల ఉపగమనం అంటారు.


→ ఒక శీర్షికకు సంబంధించి ఒక భాగం బోధించిన తరవాత రెండవ భాగం బోధించేటప్పుడు ముందు భాగాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది.

→ తీగ చుట్ట ఒక కొన వద్ద బయలుదేది దారి తప్పక చివర వరకు ఎట్లా ఎడతెగక పోతుందో అట్లాగే విషయం కూడా అవిచ్చిన్నంగా కొనసాగుతుంది.

- సర్పిల పద్ధతిలో వునరావృతానికి ఒక సంవత్సరం కాకుండా 3 లేదా 4 నెలలు ఉంటుంది.

→ 18వ శతాబ్దం చివరి భాగం వరకు సాధారణంగా పాఠ్యపుస్తకాలు ఉపయోగించేవారు కాదు,

→ 1797లో థామస్ డిల్ వర్క్ (Thouas Dil Worth) తో - The School Master's Assitant" అనే పుస్తకం రాయబడింది ప్రస్తుతం తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోవకరణం పాఠ్యపుస్తకం

→ సాధారణంగా పది సంవత్సరాలకు ఒకసారి విద్యా ప్రణాళికను షనఃవ్యవస్థీకరించడం జరుగుతుంది భాషేతర పుస్తకాలను ప్రస్తుతం ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతిలో అమర్చడం జరుగుతుంది

→ రాష్ట్రస్థాయిలో యస్.సి.ఇ ఆర్.టి (S.C.E.R.T) వారి ఆధ్వర్యంలో పాఠ్యపున్నకాలను అభివృద్ధిపరచడం జరుగుతుంది - పాఠ్యపుస్తకాలు విద్యార్థి కేంద్రంగా తయారు చేయబడతాయి. .

ఎ) పాఠ్య గ్రంథం ఆవశ్యకత :

→ ఒక పాఠ్య పుస్తకం ఆ తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళిక (Syllabus) ఆధారంగా రాయబడుతుంది

→ ఒక పాఠ్యపుస్తకం తరగతి గది బోధనలో ఒక పాఠాన్ని బోధించడానికి తగిన బోధనా పద్ధతులు బోధనాభ్యసన సామగ్రి

ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది *

→ ఒక పాఠ్యపుస్తకం అనుభవజ్ఞులైన, గణితంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో రాయబడింది. కాబట్టి కొత్త ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

→ గణిత పుస్తకంలోని విషయాలు, పిల్లలు మనస్తత్వ ఆధారంగా తార్కిక క్రమంలో రాయబడతాయి. కాబట్టి ఉపాధ్యాయులకు విషయాన్ని తరగతి గదిలో క్రమంలో బోధించడానికి వీలవుతుంది

→ పుస్తకంలో ఇవ్వబడిన మాదిరి సమస్యలు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు సమస్యల సాధనలో, తయారీలో

ఉపయోగపడతాయి

→ విద్యార్థులకు ఇంటిపని ఇవ్వడం కోసం పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు ఉపయోగపడతాయి పుస్తకంలో ఇచ్చిన సమస్యలు, మళ్ళీ తాము సమస్యలు తయారుచేయవలసిన అవసరం లేకుండా సహాయపడతాయి.

→ అలాగే విద్యార్థులకు కూడా స్వయం అభ్యసనకు తోడ్పడతాయి. కాబట్టి పాఠ్యపుస్తకం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తరగతి గది వినియోగానికి చాలా అవసరం


బి) ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం లక్షణాలు:-

1.పాఠ్యపుస్తకాల భౌతిక లక్షణాలు :

→ ప్రాథమిక స్థాయి పిల్లల కోసం అభివృద్ధిపరచబడే పాఠ్యపుస్తకాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

→ పాఠ్యపుస్తకం సైజు పిల్లలకు మరీ ఎక్కువ కాకుండా తగినట్లుగా, సులభంగా పట్టుకోవడానికి, ఉపయోగించడానికి వీలుండాలి

పిల్లలకు నచ్చే అందమైన ముద్రణ కలిగి ఉండాలి

→ ముఖ్యాంశాలను ప్రత్యేకంగా వివిధ రంగుల్లోగాని, బాక్సుల్లో గాని ఉంచాలి.

→ పాఠ్యపుస్తకంలో అక్షర దోషాలు, అచ్చు తప్పులు ఉండకూడదు

→ కవరు పేజీ వివిధ రంగుల్లో, అందంగా ఉన్నట్లయితే పిల్లలు వైపు ఆకర్షితులు అవుతారు

→ పుస్తకం ధర విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలి



2 .పాఠ్యపుస్తకంలోని విషయం :-

→ పాఠ్యపుస్తకంలోని విషయాలు గణితశాస్త్ర విద్యా ప్రణాళిక పరిధిలోనే ఉండాలి

→ పాఠ్యపుస్తక విషయాలు, తార్కిక క్రమంలో ఉండాలి


→ అందులోని విషయం విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి

→ విషయం మనోవిజ్ఞానశాస్త్రం ఆధారంగా తయారుచేయబడాలి.

→ గణిత లక్ష్యాలు సాధించడానికి వీలుగా ఉండాలి.

→ ఇచ్చిన ఉదాహరణలు నిజజీవిత అనుభవాలకు దగ్గరగా ఉండాలి.

→ పుస్తకంలో రాసిన భాష విద్యార్థుల స్థాయికి తగినదిగా ఉండాలి.

→ పాఠ్యపుస్తకంలోని విషయం స్వయం అభ్యసనానికి, స్వయం ఆమోదిత శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించాలి.

→ మదింపునకు వీలుగా ఉండాలి •

→ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి అవకాశం కలిగించేవిగా ఉండాలి

→సామాజిక అవగాహనకు వీలుగా ఉండాలి.

→ మౌలిక అభ్యాసాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

→ అభ్యాసంలోని సమస్యలు పిల్లల్లో ఆలోచనా శక్తిని, హేతువాదాన్ని పెంపొందించేవిగా ఉండాలి

3.పాఠ్యపుస్తకం వల్ల ఉపయోగాలు :-

→ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మార్గదర్శిగా ఉండే విలువైన బోధనోపకరణం.

→ విద్యార్థులకు నేర్చుకొన్న అంశాలు పునరభ్యాసం, పునర్విమర్శ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది,
→ విద్యార్థులకు పాఠశాలకు గైర్హాజరు అయినప్పుడు జరిగిన పాఠ్యాంశాలు తమకు తాము స్వయంగా నేర్చుకోవడానికి వీలుంటుంది

→ విద్యార్థులు వేర్చుకొన్న అంశాలు అభ్యాసం చేయడానికి పుస్తకంలోని అభ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. గణిత పాఠ్యపుస్తక మూల్యాంకనం (గణిత పాఠ్యపుస్తక విశ్లేషణ):

→ ఒక పాఠ్యపుస్తకం యొక్క సమర్ధతను నిర్ణయించడానికి ఉపయోగపడే రెండు మూల్యాంకన సాధనాలు, అవి హంటర్స్ స్కోర్ కార్డు (Hunters Score Card) వోగల్స్ స్పాట్ ెక్ లిస్ట్ (Vogels Spot Check List)

అభ్యాస పుస్తకం

→ విద్యార్థులతో తగినన్ని అభ్యాసాలు చేయించి వారిలో గణన నైపుణ్యాలు పెంపొందించడం కోసం అభ్యాస పుస్తకాలు అభివృద్ధి

చేయడం జరుగుతుంది

→ అభ్యాస పుస్తకం సాధారణంగా పాఠ్యపుస్తకానికి అనుబంధంగా ఉంటుంది .




గణితానికి చెందిన మంచి అభ్యాస పుస్తక లక్షణాలు :-

→ విద్యార్థుల్లో అభివృద్ధి చేయవలసిన గణిత సామర్థ్యాలను పొందడానికి సహాయపడేదిగా ఉండాలి

→ రాతపని చేయడానికి తగినన్ని ఖాళీలు ఉండాలి. ఇచ్చిన విషయం మూల పాఠ్యపుస్తకానికి అనుబంధంగా ఉండి దానితో

సహకరించేదిగా ఉండాలి.

→ విద్యార్థులు వారి వారి స్థాయికి తగినట్లుగా సమస్యలు సాధించడానికి అవకాశం కల్పించేదిగా ఉండాలి

→ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. ఇందుకోసం అభ్యాసాలన్ని తార్కికంగా కాఠిన్యాన్ని ఐట్టి క్రమంలో రాయాలి - విద్యార్థులను ఆలోచింపచేసే అభ్యాసాలు కలిగినదిగా ఉండాలి

→ విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలగడానికి తగిన పజిల్స్, రిడిల్స్, ఆటకు అవకాశం ఉండాలి అభ్యాస పుస్తరంలో వీలున్నచోట తగిన బొమ్మలు, వట్టికలు, కార్టూన్లు ఏర్పాటు చేయబడాలి.

→ అభ్యాన పుస్తకంలోని సమస్యలకు సమాధానాలు నూచించబడాలి.


ఉపయోగం :-


→ విద్యార్థులు వారి స్థాయికి తగినట్లు చేయగలిగినంత వేగంలో సమస్యలు సాధించే అవకాశం ఉంది.

→ ఆవర్తనం కోసం ఉపయోగపడుతుంది.

→ విద్యార్థి స్వయం అభ్యసనానికి దోహదపడుతుంది

→ తరగతి బోధనకు పాఠ్యపుస్తకానికి తోడ్పడే విధంగా ఉంటుంది

→ ఇంటిపని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

→ పజిల్స్, రిడిల్స్, ఆటలు కలిగిన అభ్యాస పుస్తకాలు విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని

బోధన ప్రణాళిక:

→ లెక్కించని వారు లెక్కలోకి రారు.

ప్రణాళిక రచన :

→ ఉపాధ్యాయుడు ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థుల్లో సాధించవలసిన సామర్థ్యాలు, దానికి ఉపకరించే బోధనాంశాలు

→ బోధనా పద్ధతులు, వాటికి పట్టే సమయం, కావలసిన బోధనాభ్యసన సామగ్రి, అభ్యసన మూల్యాంకనం తదితర అంశాలను రూపొందించుకోవాలి, ఈ రూపకల్పననే ప్రణాళిక రచన' లేదా 'పథక' రచన' అంటారు


ప్రణాళికా రచన చేసుకోవడం వల్ల ప్రయోజనాలు :-

→ బోధనా కార్యక్రమం సులభతరం అవుతుంది

→సకాలంలో అన్ని అంశాలు మెరుగైన పద్ధతిలో ఉంచవచ్చు

→ సకాలంలో బోధనాభ్యసన సామగ్రి సిద్ధం చేసుకోవచ్చు.

→ అభ్యసనా ఫలితాలు ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయవచ్చు.

→ బోధనాభ్యస ప్రక్రియల్లో కావలసిన మార్పులు, చేర్పులు చేయవచ్చు.


→ లక్ష్యాత్మక విద్య నిర్ణీత సమయంలో అందించవచ్చు.

→ ఉపాధ్యాయుడు బోధనకు ముందుచేసే ఆలోచనల రాత ఝూపాలే వార్షిక పథకం, పాఠ్య విభాగ పథకం, లేదా పీరియడ్ పథకం ,



వార్షిక పథకం:

→ ఒక తరగతికి ఒక సంవత్సరంలో బోధించవలసిన గణిత పాఠ్య ప్రణాళికను, అందుబాటులో ఉండే బోధనా సమయం దృష్ట్యా కొన్ని పాఠ్య విభాగాలుగా విభజించి, ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టే సమయం, తద్వారా సాధించాల్సిన లక్ష్యాలను

సూచించే పట్టికే "వార్షిక పట్టిక లేదా “వార్షిక పథకం".

వార్షిక పథక రచనకు గుర్తు పెట్టుకోవలసిన అంశాలు :-

→ ఆ విద్యా సంవత్సరంలో సాధించవలసిన

→ పాఠశాల పని దినాల సంఖ్య


→ గణిత శాస్త్రాన్ని బోధించడానికి ఆ సంవత్సరంలో కేటాయించిన పీరియడ్ల సంఖ్య

→ ఒక్కొక్క యూనిట్ ను బోధించడానికి పట్టేకాలం.

→ ఉపాధ్యాయుడు తీసుకొనే సెలవు దినాల సంఖ్య

→ పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే దినాల సంఖ్య

→ ప్రత్యేక సెలవు దినాలు


యూనిట్ పథకం (Unit Plan):-

→ ఒక తరగతిలో ఒక పాఠ్య విషయానికి చెందిన పాట్శప్రణాళికలోని అంశాలన్నింటిని విడివిడి అంశాలుగా భావించకుండా ఇక సామాన్య సూత్రం లేదా నియమం ఆధారంగా ఒకచోట చేర్చి బోధించవలసిన శీర్షికలు లేదా అంశాల కూటమినే "పౌక్య

విభాగం" (యూనిట్) అంటాం.

→ నిర్ణయించబడిన బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి, అభ్యసనకు తోడ్పడే కృత్యాలను ఏర్పాటు చేయడానికి, అనువైన సమస్య కేంద్రంగా ఉన్న లేదా భిన్న భావనలను కేంద్రీకరించే ఒకే సందేశమున్న విషయ భాగాన్ని "యూనిట్" అంటారు

→ ఒక యూనిట్ కు సంబంధించి రాసిన విషయ విశ్లేషణ, పిల్లల్లో అభివృద్ధి పరచవలసిన సామర్థ్యాలను, వాటిని ఆభివృద్ధిపరచడానికి కావలసిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను తయారుచేసుకోవాలి. దీన్నే "యూనిట్ పథకం" అంటారు

యూనిట్ లక్షణాలు:-

→ సారూప్యత కలిగి, సంబంధం కలిగి ఉన్న వివిధ గణిత భావనల సమన్వయమే యూనిట్ విషయ భాగంలో వివిధ భాగాలున్నప్పటికీ వాటిని కూర్చి సమన్వయ వరలి ఒక అంతిమ ఉద్దేశంతో ఇవ్వడం జరిగి ఉంటుంది

→ దానిని బోధించడానికి కాలం ఒక పీరియడ్ కంటే ఎక్కువ ఉంటుంది

→ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి అనుకూలంగా ఉంటుంది.

→ వివిధ అభ్యసనా కృత్యాలకు అవకాశముంటుంది.

యూనిట్ పథకంలో సోపాలు:-

1 సంగ్రహ విషయ విశ్లేషణం :

1)అధ్యాయ ప్రాధాన్యం, ఈ యూనిట్‌లోని విషయ భాగానికి నిత్యజీవితంలో ఎటువంటి సంబంధం ఉందో రాయాలి.

2) యూనిట్ కీలక భావన: ఉపభావనలు, మూల సూత్రాలు, గుర్తులు, సాంకేతికాలు, న్యాయాలు మొదలైనవి.

→ యూనిట్ ను బోధించడానికి విద్యార్ధి పూర్వ జ్ఞానం,

→ యూనిట్ కు సంబంధించిన కాల నిర్ణయ పట్టిక,

→ యూనిట్ బోధించడం వల్ల నెరవేరే లక్ష్యాలు యూనిట్ ను బోధించడంలో ప్రత్యేక బోధనాభ్యసన సామగ్రి,

→ యూనిట్‌లో కల్పించే బోధనాభ్యసన కృత్యాలు.

→ యూనిట్ లోని వివిధ భాగాలను మూల్యాంకనం చేసే విధానం



యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలు:-

→ యూనిట్లోని సమైక్య లక్ష్యాలను ఏర్పరచడానికి వీలవుతుంది

→ నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తి చేయడానికి వీలవుతుంది

→ యూనిట్ ను బోధించే సమయంలో కల్పించే వివిధ కృత్యాలను ఏర్పరచడానికి ఉపాధ్యాయుడు ముందుగానే సంసిద్ధత

పొందుతాడు.


→కావలసిన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది.

→ యూనిట్ బోధనలో ఉపయోగించే ప్రత్యేక పరికరాలు, సామగ్రిని విద్యార్థులచేత కాలయాపనం లేకుండా సమకూర్చుకోవడానికి

వీలవుతుంది

→ ఉపాధ్యాయుడు అన్ని పౌర్యాంశాల విషయాలను వరసక్రమంలో బోధించగలుగుతాడు.

→ ఒక యూనిట్' పూర్తి చేసిన తరవాత పరీక్ష ద్వారా విద్యార్ధులు పొందిన సామర్థ్యాలను మదింపు చేయగలుగుతారు.

యూనిట్ పథకం తయారీలో చేర్చబడే అంశాలు:

→ యూనిట్ పేరు

→ భావనలు

→ సాధించవలసిన సామర్థ్యాలు

→ బోధనాళ్యనన సామగ్రి

→ పేరున సంఖ్య స యూనిట్ పేరు / విషయం

→ సబ్ యూనిట్ పేరు

→ పీరియడ్ల సంఖ్య

→ చేపట్టే కృత్యాలు/ప్రాజెక్టులు



పీరియడ్ పథకం :-

→ పాఠ్య పధకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక.

→ యూనిట్లోని నబ్యూనిట్ నందు ఒక పీరియడ్ లో బోధించడానికి తగిన విషయంపై తయారుచేసే పథకాన్ని "పాఠ్యపథకం“

లేదా "పీరియడ్ పథకం" అంటారు

→ నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చడానికి తయారుచేసే పథకాన్ని "పాఠ్యపథకం" లేదా “పీరియడ్

పథకం" అంటారు

→ Bining and Bining ప్రకారం రోజువారీ పాఠ్య పథకంలో లక్ష్యాలను నిర్వచించడం, విషయాన్ని ఎంపికచేసి క్రమంలో

ఉంచడం, పద్ధతిని, విధానాన్ని నిశ్చయించడం ఇమిడి ఉంటాయి.

→ Lester B.Sands ప్రకారం పాఠ్యపథకం ఉపాధ్యాయుని యొక్క వనిలోని వేదాంతం (Working philosophy) , అతని

వేదాంత జ్ఞానం (Knowledge of philosophy), అతని విద్యార్థుల యొక్క సమాచారం, వారిపై అతని అవగాహన విద్యాలక్ష్యాలపై అతని అవబోధం, అతను బోధించబోయే పరికరాలపై అతని జ్ఞానం, సఫలమైన వద్ధతులను

ఉపయోగించడంలో అతని సామర్థ్యాలను కలిగి ఉంటుంది.




పీరియడ్ పథకం (పాఠ్య పథకం) ప్రయోజనాలు :


→ పాఠ్యాంశాల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగా స్పష్టంగా ఏర్పరచుకోవచ్చు

→ ఆ లక్ష్యాల సాధనకు కావలసిన సంసిద్ధతను ఉపాధ్యాయుడు మానసికంగా, పొందగలడు

→ బోధనాభ్యసనకు కావలసిన సామగ్రిని తయారుచేసుకోగలరు.

→ సేకరించవలసిన సామగ్రిని విద్యార్థులు పరిసరాల నుంచి సేకరించడం వల్ల వారికి అభ్యసన పట్ల ఆసక్తి డుతుంది

→ ఆటంకం లేకుండా భోధనాభ్యసన కార్యక్రమం జరుగుతుంది

→ పాఠ్యబోధన ఆసక్తికరంగా ఉంటుంది

→ బోధనా సమయం వినియోగం సరైన విధంగా జరుగుతుంది


→ బోధనలో కచ్చితమైన గమ్యాల్ని, లక్ష్యాల్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది బోధనాథ్యనన ప్రక్రియలో పాఠ్యపథకం ఉపాధ్యాయునికి మార్గదర్శకాలను ఇస్తుంది .*

→ సరైన విధంగా మూల్యాంకనం చేయడానికి కావలసిన సామగ్రి (కృత్య పత్రాలు, నియోజన పత్రాలు)ని ఏర్పాటు చేసుకోగలరు



పాఠ్యపథక రచనలో సోపానాలు :-

→ పాఠ్యపథక రచనలోని ప్రాముఖ్యం "హెర్బార్డ్" అనే విద్యావేత్త కృషివల్ల గుర్తించబడింది. పాఠ్యపథక రచనలో ఈ కింది సోపానాలు అనుసరించాలని అతడు సూచించాడు.

→వీటినే "హెర్బార్టు పాఠ్యబోధనా దశలు" అని అంటారు.

→ ఈ విధానంలోని పాఠ్యపథక రచన ఈ క్రింది అధ్యసన సూత్రాలపై ఆధారపడింది.

→ అంతకు ముందే పొందిన అభ్యసనంపై ఆధార నూతన అభ్యసనం జరుగుతుంది.


సోపానాలు

1. సన్నాహం (Preparation)

2.విషయ విశదీకరణం (Presentation)

3. సంసర్గం (Association)

4. సాధారణీకరణం (Generalisation)

5.అన్వయం (Application)

6.పునర్విమర్శ (Recapitulation)

→ నేడు ఉపయోగంలో ఉన్న పాఠ్య పథకాలు కచ్చితంగా "హెర్బార్డ్" సూచించిన దశల్లో రచించడం లేదు

→ నేడు అమలులో ఉన్న పాఠ్యపథకంలో బోధనా దశలు లేదా సోపానాలు మూడు ప్రవేశ వ్యాసక్తులు (Introductory activities):

1) పూర్వజ్ఞాన మూల్యాంకనం/పరీక్షించడం

2) ప్రేరణ (motivation)/ ఉన్ముఖీకరణం

3) శీర్షిక లేదా ప్రకటన.



2.వికాన వ్యాసక్తులు (Development activities) :

1.బోధన పద్ధతుల ద్వారా విషయ సమర్పణ/ప్రదర్శన (Presentation)

2.విశదీకరణ (Explanation)

3.ప్రత్యక్ష నిరూపణ (Demonstration)


3.అంత్య (వర్యవసాన) వ్యాసక్తులు (Criminating activities):

1) పర్యవేక్షణాధ్యయనం

2) సమీక్ష/పునర్విమర్శ

3) మూల్యాంకనం

ఎ) పరీక్షించడం

బి) నిర్దేశాలు



→ నేడు ప్రాథమిక పాఠశాలలో APPEP (Andhra Pradesh Primary Education Project) సూత్రాలు లేదా అభ్యసన సూత్రాల ఆధారంగా కృత్యాధార బోధనకు అనువుగా పాఠ్యపథకం రూపొందించి, అమలు చేయబడుతుంది