అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




సాంఘికశాస్త్ర బోధనోపకరణాలు








→ సాంఘికశాస్త్రం సకల సామాజిక శాస్త్రాల సమ్మేళనము. నమాజంలోని అచార వ్యవహారాలు - సంప్రదాయాలు, సంస్కృతి - సభ్యత, నాగరికత సమ్మిళితం-సాంఘికశాస్త్రము.
→ సమాజంలో మానవుడు మంచి జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన పరిఙ్ఞానం, అనుభవాలను సాకూజికశాస్త్రంలో అంతర్భాగమైన సాంఘికశాస్త్రం అందిస్తుంది
→ సాంఘిక శాస్త్రాన్ని మానవ సంబంధాల ఆభివృద్ధి శాస్త్రం అని, మానవ సంబంధాలు, పరిణామక్రమాల అధ్యయనశాస్త్రంగా కూడా పిలుస్తారు.

సామాజిక వనరులు - వాటి ప్రాధాన్యం :-

→ పరికరాలను మనం సద్వినియోగం చేసుకోవాలి
→ ప్రకృతిలో లభించే సహజవనరులను తన అవసరాలకు మించి వినియోగించి, ప్రకృతిలో విలయాన్ని సృష్టిస్తున్నాడు
→ ప్రకృతి మనకు అందించే వనరులను మన అవసరాలకు వినియోగించుకోవడానికి మాత్రమే గానీ- మనలోని పేరాశ అత్యాశలను తీర్చుకోవడానికి కాదు" అని గాంధీ పేర్కొన్నాడు.



సాంఘిక శాస్త్రం - వనరుల వర్గీకరణ :-

→ సాంఘికశాస్త్రం - ప్రకృతిలో లభించే ప్రతి అంశం కూడా ఒక వనరు. ప్రకృతిలో లభించే వాటి ప్రయోజనాలు - స్వభావాలను బట్టి వనరులను ఈ క్రింది విధంగా విభజించడమైనది

1) భౌతిక వనరులు

2) జైవిక వనరులు

3) సామాజిక వనరులు

4) సామగ్రిరూగ పనరులు


1) భౌతిక వనరులు :-
→ గాలి, నీరు, పర్యావరణం, ఖనిజసంపద, ఇతర నిర్ణీవ పదార్థములు మొదలగునవి భౌతిక వనరులు,

2.జైవిక వనరులు:-

→ జంతువులు, వృక్షములు మొదలగునవి జైవిక వనరులు,

3.సామాజిక వనరులు

→ భౌతిక, జైవిక వనరుల నుంచి రూపొందించబడిన జీవ, నిర్జీవ అంశాలు, మానవులకు తమ వంతు సహాయం అందించే nవనరులును సామాజిక వనరులు అంటారు.

4. సామగ్రిరూప వనరులు

→ ప్రభుత్వ ప్రవేట్ రంగ సంస్థలు, ధార్మిక సంస్థలు, రకరకాల వస్తుసామగ్రి, భవన సముదాయాలు,

→ ముద్రిత రూప వనరులు : గ్రంథాలయాల వినియోగం

గ్రంథాలయం ను ఆంగ్లంలో (Library) లైబ్రరీ అంటారు. (Liber) లిబర్ అనే పదం నుంచి వచ్చింది . లిబర్ అనగా గ్రంథాలయం అని అర్థం.

→ సాంఘికశాస్త్ర బోధనలో పఠనసామగ్రి, లిఖిత సామగ్రి ఎంతో ఉపయోగకారి.


→ అముద్రిత వనరులు : విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల వస్తు సామగ్రి

→ పాఠ్యపుస్తకం: ప్రముఖ విద్యావేత్త ఫ్రాన్సిస్ బేకన్ అభిప్రాయంలో "సాంఘికశాస్త్ర బోధనలో పాఠ్యపుస్తకం మంచి సహాయకారి అని పేర్కొన్నాడు.

→ సాంఘికశాస్త్ర పాఠ్యగ్రంథాన్ని విశ్వాసం ఉన్న ఒక సేవకుడిగా ఉపయోగించాలి అంతేగాని ఒక చెడ్డ యజమానిగా కాదు.


అనుబంధ పఠనా సామగ్రి :

1.కరదీపికలు / అధ్యాపన దీపికలు

2. విద్యార్ధుల క్రియాదీపికలు

3. సప్లిమెంటరీ పుస్తకాలు సూచీ గ్రంథాలు

5. డిస్కవరి (విజ్ఞానం అందించే మ్యాగజైన్)

6.జంతు వృక్ష సంబంధమైన సమాచార గ్రంథాలు

7. నిఘంటువులు

8.వార్తాపత్రికలు

9.విజ్ఞాన సర్వస్వం



సాంఘికశాస్త్ర ప్రయోగశాల :-

→ వివిధ రకాల బోధనా సామగ్రిని వినియోగించి పాఠ్యాంశంలను బోధించడం అంటే, వివిధ రకాల నమూనాలు, స్పెసిమన్స్ మరియు చిత్రపటాల సహాయంతో బోధన చేయడము.

→సాంఘికశాస్త్ర తరగతి గదిని సాంఘికశాస్త్ర ప్రయోగశాల అనవచ్చును అయితే జాన్ డ్యూయి గారి మాటల్లో సమాజమే అతి పెద్ద సాంఘికశాస్త్ర ప్రయోగశాల పేర్కొనడం జరిగింది



ప్రదర్శనశాల :

→ (Museum) మ్యూజియం అనే పదం Musc అనే పదం నుంచి రావడం జరిగింది. Muise అనగా విద్యాదేవత.

→ పాఠశాల స్థాయిలో సాంఘికశాస్త్ర వస్తు ప్రదర్శనశాల అంటే విలువైన వస్తువులు, నమూనాలు, స్పెసిమన్స్ సేకరించడం -

భద్రపరచడం మరియు బోధనోపకరణములు తయారుచేయడం, భద్రపర్చడం మొదలగునవి జాగ్రత్తగా నిర్వహించడము.





పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళడము :-

→ విద్యార్థి పాఠశాలలో నాలుగుగోడల మధ్య పొందే సామర్థ్యాలకంటే సమాజంలోకి వెళ్ళి పొందే సామర్థ్యాలు అనేకం. కావున కొన్ని కార్యక్రమాల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది

1.క్షేత్ర పర్యటనలు - సమీపంలోని క్షేత్రాలు, పాఠ్యాంశానికి సంబంధించిన జ్ఞానం

2. విహారయాత్రలు - నూతన ప్రదేశాలు - జీవన స్థితిగతులు తెలుసుకొనే జ్ఞానం

3. యన్. సి. సి / స్కౌట్ / జాతీయ సేవా కార్యక్రమ శిబిరాలు

4. స్వచ్ఛంద సంస్థలు ఇతర ధార్మిక, సేవాతత్పరత గల సంఘాలు

5. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల వద్దకు, ప్రజాప్రతినిధులు, అధికారులు వద్దకు వెళ్ళి సమాచారంను సేకరించడం మొదలగునవి

సమాజంను పాఠశాలకు ఆహ్వానించడము:

→ పాఠశాల అభివృద్ధికి సమాజంలో అందరి సహాయ, సహకారాలను పొందడం కోసం, దాతల నుంచి విరాళాలను సేకరించడం కోసం, సమాజాన్ని పాఠశాలకు ఆహ్వానించడం.

1. విద్యాభివృద్ధి సంఘాలు

2. తల్లిదండ్రుల సంఘాలు

3. అధికారులతో కూడిన అనుసంధాన కమిటీలు


→ P.T.A (Parent - Teacher Association) :

→ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లి, తండ్రి ఎవరో ఒకరు PTA సభ్యులుగా ఉంటారు. PTA కి ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. పాఠశాల ఆర్థిక లావాదేవీలు, విరాళాల సేకరణ ఖర్చు ప్రభుత్వేతర అదాయ వనరుల వినియోగాన్ని

పరిశీలిస్తుంది.


స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం:-

→ N.S.S., రెడ్ క్రాస్, N.G.O స్వచ్చందనంస్థల ప్రతినిధులను ఆహ్వానించి వారిచే సందేశాలు, బహుమతులు ఇప్పించడం చేయడం


వివిధ వృత్తుల నిపుణులతో కూడిన కమిటీలు :


→ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్, ఇతర వృత్తుల వార్షికోత్సవాలు నిర్వహించడం, సైన్స్ డే మొదలగునవి నిర్వహించడం



జాతీయ - అంతర్జాతీయ - అంశాలు- కార్యక్రమాల నిర్వహణ :-

1.జనాభా దినోత్సవం నిర్వహణ

2.బాలల హక్కుల దినం

3.మానవ హక్కుల దినం

4.విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులచేత ప్రతిభా పురస్కారాలు అందజేయడం మొదలగునవి.




వర్తమాన వ్యవహారాలు - సాంఘికశాస్త్రం :- ,

→ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యగ్రంథంలోని అంశాలను మాత్రమే విద్యార్థులకు అందించినట్లు అయితే విద్యార్థులు

ఆశించిన సామర్థ్యాలు పెంపొందించబడవు. అంతేగాకుండా, పాంఘికతాస్త్రబోధనలో వర్తమాన వ్యవహారాలను గురిం ప్రస్తావించకుండా బోధన జరిగినట్లు అయితే ఆ బోధన జీవంలేని బోధనగా మారుతుంది. వివాదాస్పద అంశాలకు తావీయకుండా

బోధన జరగాలి.

→ వర్తమాన అంశాలు సమ్మదగిన, నమకాలీనమైనవిగా ఉండాలి. పాఠ్యాంశానికి అనుబంధంగా ఉండాలి. పరిణామక్రమంలో బోధించడానికి, నమోదుచేయడానికి వీలుగా ఉండాలి



బోధనోపకరణములు :

→ జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు పనిని కల్పించి అభ్యసనాన్ని పటిష్టపరచడానికి బోధనాంశాలతోపాటు వివిధ రకా బోధనా సామాగ్రిని కూడా ఉపయోగిస్తే మంచి అభ్యసన ఫలితాలను సాధించవచ్చును.

→ గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుడు సామాజిక రుగ్మతలను రూపుమాపే వైద్యుడు, విద్యార్థులలో జ్ఞానాత్మక, గుణాత్మక విద్యను

సృజనాత్మకత, కల్పనా చాతుర్యంను, ప్రేరణను ప్రోత్సహించే జోధనకోనం తరగతి గదిలో అధ్యాపకులు ఉపయోగించే సామాగ్రి, వరికరాలు, బోధనాసామాగ్రి దాని ద్వారా ఆశించిన మూల్యాంకనా ఫలితాలను అందించే పరికరాలను బోధనోవకరణములు అంటారు



బోధనోపకరణములు - ప్రాముఖ్యత:-

→ బైనింగ్ అండ్ ట్రైనింగ్ "సాంఘికశాస్త్ర బోధనలో విద్యార్థులకు ప్రత్యక్షంగా కాని, లేదా పరోక్ష పద్దతి ద్వారా గాని, బోధనోపకరణములను చూపించడం ద్వారా పరిసరాలలోని అనేక అంశాలు గమనించడం వల్ల విద్యార్థులలో ఆసక్తి కల్గిస్తాయి'.

→కోమినియన్ - సాంఘికశాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు.

→ బోధనోపకరణాల ఉపయోగితను, వాటి లక్షణం, ఉపయోగితా విధానం లభ్యతను వర్గీకరణ చేసినది - ప్రొజెల్, స్కిన్నర్

→ కోబిన్ పరిశోధన - బోధనోపకరణాలు, జ్ఞానేంద్రియాలకు మధ్యగల సంబంధము :-



→జ్ఞానేంద్రియం - అభ్యసన శాతం

రుచి (నాలుక) - 1.0%

స్పర్శ (చర్మం) -1.5%

వాసన (ముక్కు) - 3.5%

వినడం (చెవి) - 11.0%

చూడటం (కన్ను) -83.0%


→చూడటం ద్వారా జరిగే అభ్యసనశాతం 83%. మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అభ్యసన శాతం 17%

→ బోధనోవకరణములపై ఎనలేని సేవచేసి, పరిశోధన చేసిన విద్యాతత్త్వవేత్త - ఎడ్గర్ డేల్


→ ఎడ్గర్ డేల్ శంకు ఆకృతి కలిగిన అనుభవ సోపానాలు :-

;;;;;;;;;;;;;;;;;;;




1.ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మొదటి సోఫాసంలో పదజాలం, చిన్న చిన్న పదాల రూపంలో నేర్చాలి.

2.పదాలకు తోడు బొమ్మలను ఉపయోగించి బోధించాలి.

3. చిత్రాలు - మాటలతో కూడి అంశాలు జోడించాలి.

4.కదిలే చిత్రాలు - సినిమాలు, తోలుబొమ్మలాట

5. విద్యార్థిలో దాగిన శక్తులు వెలికితీయడానికి తగిన నూచనలతో వస్తుసామాగ్రి చేయించడం

6. విద్యాబోధన - మాదిరి పాఠాలు (బోధించాలి / అందించాలి)

7.పాఠ్యాంశం ఆధారంగా విద్యార్థులకు పాత్రలు కేటాయించి సంభాషణలు వ్రాసి నాటకాలు రాయించాలి.

8. కల్పితానుభవాలను, ప్రాచీన సినిమాలు, ఏర్పరచి బోధన పటిష్టపర్చాలి.

9. విద్యార్థులకు విజ్ఞాన, విహారయాత్రలు, క్షేత్రపర్యటనకు తీసుకొని వెళ్ళి ప్రత్యక్ష అనుభవాలు కల్గించాలి




ఎడ్గర్ డేల్ - బోధనోపకరణముల వర్గీకరణ :

ఎడ్డర్ డేల్ తన శంఖు ఆకృతి అనుభవ సోపానంలోని 10 కోణాలను ముఖ్యంగా ఆరు రకాలుగా వర్గీకరించారు.

1. గ్రాఫిక్స్ ఉపకరణములు : కార్డులు, ఫోటోలు, చిత్రాలు, పటాలు

2.ప్రదర్శనా వరికరములు : నల్లబిల్ల, ప్రదర్శనాబల్ల, పెగ్ బోర్డు, విద్యార్థులు తయారుచేసిన పరికరాలు,

3.దృశ్య శ్రవణ పరికరాలు : రేడియో, టి.వి. 'గ్రామఫోన్ రికార్డ్, టేప్ రికార్డర్, కంప్యూటర్ మొదలైనవి.

4.త్రిమితీయ పరికరాలు : నమూనాలు, మాతృకలు, డయాగ్రం, మాకే అప్స్, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు

5.ప్రతిక్షేపణ పరికరాలు: స్లైడులు, ఫిల్ములు, స్థిర చిత్రాలు

6) కృత్య పరికరాల కృత్యాలు : విద్యార్ధులు తయారుచేసినవి, క్షేత్ర పర్యటనలు, బొటానికల్ టూర్స్ మొదలైనవి.





బోధనోపకరణాలు ఉపయోగించడం వల్ల కల్గే ప్రయోజనాలు

1.విద్యార్థులకు అభ్యసనంపట్ల ఆసక్తిని పెంపొందిస్తాయి

2 .విద్యార్థులకు విషయ అవగాహన పెరుగుతుంది

3.జ్ఞానాత్మక, భావావేశ, మానసిక రంగాలలో పురోగతి కల్గుతుంది.


4.సంపూర్ణ సమాచారంను పొందుతారు

5. సామర్థ్యాధార బోధన జరుగుతుంది

6.క్రియాశీలత, నిశిత దృష్టి కళా విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం అందించబడుతుంది

7.అభ్యసనం ఏర్పడే విసుగును పోగొట్టడం జరుగుతుంది

8. విద్యార్థులలో సరియైన భావనలు, వైఖరులు పెంపొందించబడ్డాయి




బోధనోపకరణములు ఉపయోగించడంలో జ్ఞప్తిలో ఉంచుకోవల్సిన అంశాలు :

1.పాఠ్యాంశానికి తగినదిగా ఉండాలి

2.విద్యార్థుల స్థాయికి తగినదిగా ఉండాలి.

3. ఉపకరణం నిర్దిష్టమైనదిగా, ఖచ్చితమయినదిగా ఉండాలి .

4.ఆర్థిక విలువలను పాటించాలి

5.పార్యాంశం బోధించిన తర్వాత బోధనోపకరణాన్ని ప్రదర్శించాలి.

6. బోధనోపకరణంను సందర్భానుసారంగా ప్రదర్శించాలి.

7.ప్రత్యక్షంగా చూపలేని పరిస్థితులలో నమూనాలను తయారుచేసి ప్రదర్శించాలి.

ఉదా : కోటలు, దర్గాలు, చార్మినార్, తాజ్ మహల్ మొ॥నవి




సాంఘికశాస్త్ర ఉపకరణాలు :

ఎ) పటాలు :

→ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి పటం ఊత కర్రలాంటిది.

→ సాంఘిక శాస్త్ర బోధనలో ఉపయోగించే ఉపకరణాలలో ముఖ్యమైనది.

→ పటం అనే పదం MAPPA అనే లాటిన్ వేదం నుండి పుట్టినది

→ MAPPA అంటే చదునైన సమతలాన్ని భూఉపరితల అంశాలను చూపడం అని అర్ధం

→ గ్లోబు పైనున్న సమాచారాన్ని సమతంగా చూపడానికి *

→ పర్వతాలు, సముద్రాలు, మైదాన ప్రాంతాలు, ఎడారులు, ద్వీపాలు, ద్వీపకల్పాలు మొదలైన అంశాలను సులభంగా సంకేతాల

ద్వారా తెలుసుకోవడానికి వీలగును

→ అక్షాంశాలు, రేఖాంశాలు ఇతర ముఖ్య సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు

మాప్లు - రకాలు :-

1.భౌగోళిక / భౌతిక పటాలు

2) రాజకీయ పటాలు

3.ప్రత్యేక ప్రయోజన పటాలు

4.ఆవరణ దేఖా రూపురేఖా పటాలు

5.రిలీఫ్ పటాలు



1.భౌగోళిక పటాలు / భౌతిక పటాలు (నైసర్గికస్వరూపం, భౌగోళిక స్వరూపాలు) :-

→ భూగోళంలో నున్న పర్వతాలు, నదులు, కొండలు, సముద్రాలు, సరస్సులు, ఎడారులు, ద్వీపాలు, ద్వీపకల్పాలు, తీర మైదానాలు

లోయలు లాంటి భౌగోళిక స్వరూపాలను వివరించేవి

→ నైసర్గిక స్వరూపాలను వివరించేవి/భూస్వరూపాలు/స్వాభావికమండలాలు మొ||వాటిని వివరించేది


2.రాజకీయ పటాలు (సరిహద్దులు వివాదాస్పద అంశాలు) :-

→ భూగోళంపై నున్న వివిధ ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, రాజధానులు, ముఖ్యమైన నగరాలు మొదలైన వాటి సరిహద్దులను గూర్చి తెలిపేది.

→ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాంటి వివాదస్పద ప్రాంతాలను సూచించేవి ఒక ప్రాంతం యొక్క ఉనికి, విస్తీర్ణంను తెలిపేవి.

→ అనగా ఒక ప్రాంతంను అక్షాంశాలు, రేఖాంశాల పరంగా ఉనికి, విస్తీర్ణంను తెలిపేవి

→ రవాణా మార్గాలను గూర్చి తెలిపే మ్యాపులు

నోట్ :- రాజకీయ పటాలు (ఉనికి, విస్తీర్ణం, సరిహద్దు ప్రాంతాలు, వివాదస్పద ప్రాంతాలు)


3.ప్రత్యేక ప్రయోజన పటాలు (ఏదో ఒక ప్రత్యేక విషయం) ) :

→ఏదో ఒక సమాచారాన్ని / విషయాన్ని / ప్రాంతాన్ని గూర్చి తెలిపే పటాలను ప్రత్యేక ప్రయోజన పటాలంటారు ఉదా :- ఖనిజాలు, పరిశ్రమలు, వాటి విస్తీర్ణం, కేంద్రీకృత స్థలాలు, దేవాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, నడులు

పంటలు పండే ప్రాంతాలు మొ||వి.

→ ఖగోళం, చరిత్ర, పౌర విజ్ఞానం, అర్థశాస్త్రం మొ॥ విభాగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రదేశాలు

→ రాజుల సామ్రాజ్యాలు మొ॥వి (ఇవి మారుతూ వుంటాయి)



4. అవుట్లైన్ / ఆవరణా రేఖా పటాలు (బోధనాభ్యసన ప్రక్రియకు తోడ్పడేవి) :

→ దీనినే శ్వేత పటాలు / ఖాళీ పటాలు అంటారు

→ దీనిలో సరిహద్దులు మాత్రమే గుర్తించబడి ఉంటాయి. ప్రావీణ్యత గల ఉపాధ్యాయుడు వీటిని ఉపయోగించి వివిధ ఖండాలు దేశాలు, స్థలాలలను సుద్దముక్కతో తాత్కాలికంగా రాసి చూపిస్తాడు. పాఠశాల తరగతి గది ఉపయోగానంతరం తుడిచివేసి

మరొక పాఠ్యాంశానికి ఉపయోగిస్తారు.

→ తగిన రంగులను ప్రక్షేపిస్తే మరింత ఆసక్తిగా ఉంటుంది

→ విద్యార్థుల్లో పట నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్ బుక్ లో పటాలు గీయసుని లేదా అవుట్ లైన్ మ్యాప్ ఇచ్చి ప్రదేశాలను

గుర్తింపజేసి విద్యా కౌశలాలను అభివృద్ధి పరచవచ్చు.

నోట్ :- తరగతి గదిలో బోధనాఖ్యానన ప్రక్రియకు బాగా ఉపయోగపడే పటాలు- అవుట్లైన్ మ్యాప్




5.రిలీఫ్ మ్యాప్స్ (త్రిమితీయ పటాలు / ఆకర్షణీయ పటాలు) :-

→ భూగోళంపై వివిధ ప్రాంతాలు, పర్వతాలు, సముద్ర ప్రవాహాలు, ఉష్ణోగ్రతా విస్తృతి, వర్షపాతం, అడవులు జన్మసాంద్రత మొ|| అనేక సమాచారాన్ని రిలీఫ్ పటాల ద్వారా తెలియజేస్తుంది.

→వీటిని 3-డి మ్యాప్స్ / త్రిమితీయ పటాలంటారు.

→ భౌగోళిక పటాలలోని సమాచారాన్ని కళ్ళకు కట్టినట్లు సహజ రీతిలో గమనించిన రీతిలో వీటి నిర్మాణాన్ని చేస్తారు

→ సహజ రీతి అనగా లోయ ప్రాంతాలు లోతు కల్గినట్లుగా పర్వతాలు ఎత్తుగా భౌగోళిక లక్షణాలు కలిగినట్లుగా కృత్రిమంగా పటంపై తయారుచేస్తారు.

→చేతితో తడిమి / తాకి చూడవచ్చు

→ ఎత్తు పల్లాలతో కూడిన పటం

→ అందమైనది. ఆకర్షణీయమైనది. త్రిమితీయమైనది సహజమైనది.

→ ఇది చాలా ఖర్చుతో కూడినది

→ వీటి తయారీలో మాపన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి

నోట్ :- 1) భౌగోళిక, రాజకీయ, అవుట్ లైన్. ప్రత్యేక ప్రయోజనాలు నాల్గు పటాలు ద్విమితీయ పటాలు.

(కేవలం చూడటమే, తాకలేం)

2.రిలీఫ్ పటం - త్రిమితీయ పటం (తాకగలం)


గ్లోబులు - పాత్ర :-

→ భూమికి నమూనా గ్లోబు

→ గ్లోబు ద్వారా భూమి గూర్చి భూభ్రమణం, భూ పరిభ్రమణం, అక్షాంశాలు, రేఖాంశాలు, సమయాలు, పగలు: రాత్రి ఏర్పడే

విధానాన్ని తెలుసుకోవచ్చు.

→ వివిధ ప్రాంతాల శీతోష్ణస్థితులను తెలుసుకుంటాడు

→గ్లోబుల పరిశీలన, తయారీ ద్వారా క్రియాశీలత, సృజనాత్మకత జ్ఞానేంద్రియాలకు పని కల్పించి అభ్యాసను స్థిరపరుస్తుంది

1.భౌతిక గ్లోబులు (భౌగోళిక / నైసర్గిక స్వరూపాలు):-

→ నదీప్రవాహాలు, సముద్రాలు, శివిధ ఖరదాలు, వివిధ ప్రాంతాలు, వాటి ఉష్ణోగ్రతా విస్తృతి, శీతోష్ణస్థితులను, అక్షాంశ రేఖాంశాల ఆధారంగా బ్రిడ్ బను, వివిధ సంకేతాల ఆధారంగా రంగు పర్వతాలు, మైదానాలు మొవాటిని యొక్క భౌగోళిక || భౌతిక స్వరూపాలను తెలుసుకొనుటకు తోడ్పడును!

2.రాజకీయ గ్లోబులు (సరిహద్దులు, వివాదస్పద ప్రాంతాలు, ఉనికి, విస్తీర్ణం) :-

→ భూగోళంపై ఉన్న వివిధ ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్య పట్టనాలు మొవాటి యొక్క ఉనికి, విస్తీర్ణాలు

తెలుపుట

→ వివాదస్పద ప్రాంతాలను గూర్చి తెలుపుట. ఉదా :- పాక్ ప్రాంతం


3.ఆవరణరేఖా / రూపురేఖా గ్లోబులు (బోధనాభ్యాసన ప్రక్రియకు) :-

→ విద్యార్థులలో సృజనాత్మకత, క్రియాశీల, సామర్ధ్యాధార జ్ఞానం పొందడానికి గ్లోబుల నిర్మాణం, గ్లోబుల పై ప్రదేశాలను

గుర్తించడానికి తోడ్పడును

→ గ్లోబుల సహాయంతో పాఠ్యాంశ బోధనకు అనుకూలంగా, తాత్కాలికంగా నమాచారాన్ని పొందు పరచి విద్యార్థులకు

తెలియజేయుటకు తోడ్పడును

→ దీని ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారం అందించవచ్చు



గ్రాఫులు - రకాలు :-

→ ప్రభుత్వ కార్యాలయాలలో గాని, విద్యా సంస్థలలోగానీ, జరిగిన ప్రగతిని అంకెలలో, సంజ్ఞలలో రేఖా చిత్రాలు తెలియజేస్తాయి.

→ విస్తారమైన లిఖిత సమాచారం కంటే, తక్కువ శ్రమతో ఎక్కువ సమాచారాన్ని అందించడానికి వీలు ఉంటుంది

→ సాంఘీక శాస్త్రంలో ముఖ్యంగా అర్థశాస్త్రంలో ఈ గ్రాపుల ద్వారా ప్రగతి సమాచారాన్ని తెలపడానికి అవకాశం కలదు

→ జనాభా సమాచారం, నిర్ణీత కాలం - అక్షరాస్యత, ఉద్యోగిత, పారిశ్రామిక అభివృద్ధి మొ॥ తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి

గ్రాఫ్లు - 4 రకాలు :-

1) కమ్మీ గ్రాఫ్

2) రేఖా చిత్ర గ్రాఫ్

3) సచిత్ర గ్రాఫ్

4) వృత్తాకార గ్రాఫ్



కమ్మీగ్రాఫ్ / బార్ గ్రాఫ్ / దిమ్మ గ్రాఫ్ / సోపాన చిత్రం : (ప్రగతి / అభివృద్ధి) :

→ ఒక నిర్ణీత కాలంలో ఒక సంస్థలో గానీ, దేశంలో గానీ, జరిగిన ప్రగతి ఇతర సమాచారాన్ని గణాంక ఆధారాల ద్వారా తెలుపుటకు తోడ్పడును

→ క్రమేపి' పెరుగుదల / క్రమేపి తరుగుదలను సూచించుటకు వాడుతారు

→ ఒక సంస్థ / ఒక విషయంలో అభివృద్ధిని సూచిస్తాం

కోడ్ :- ప్రగతి (అభివృద్ధి, పెరుగుదల - తరుగుదల)


→ దీనినే బార్ గ్రాఫ్ అని, దిమ్మా రేఖా చిత్రం అని మెట్లు వలె ఉండును కనుక సోపాస చిత్రమని అంటాం

ఉదా :- జనాభా పెరుగుదల, తలసరి ఆదాయం పెరుగుదల, జాతీయాదాయం పెరుగుదల, పారిశ్రామికాభివృద్ధి, వన్నుల

రాబడి పెరుగుదల మొ॥వి. నోట్ :- దీనిని నిర్మించడం సులభం మరియు అర్థం చేసుకోవడం సులభం

2. రేఖా చిత్ర గ్రాఫ్ : : (హెచ్చు తగ్గులు పరస్పర సంబధం) :

→రెండు పరస్పర సంబంధాలు కలిగిన విషయాల మధ్య సంబంధం ఎలా ఉంటుందో వివరించే గ్రాఫ్

→ దీనిని నిర్మించడానికి రెండు విషయాలు కావలెను

→ ఒక నిర్ణీత కాలంలో ఒక సంస్థ లోగానీ, ఒక వ్యవస్థలోగాని ఒక విషయంలో గాని జరిగిన వృద్ధిలో హెచ్చు తగ్గులను సూచించును

→ ప్రతి పది సం॥ల కాలక్రమ విరామంలో జనాభా ఏ విధంగా పెరిగిందో చూపుట


→ చాత్రోపాధ్యాయసాట్లో స్కాలస్టిక్ ఎచీవ్ మెంట్ లో మూల్యాంక వివరాలను ఈ గ్రాఫ్ ద్వారానే చూపుతాం.

→ ఈ రోజు రోజుకు హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్ మార్కెట్, కమెడిటీ మార్కెట్లో వివరాలు ఈ గ్రాఫ్ ద్వారానే చూపుతాం.

→ ప్రతి పది ఓవర్లకు టీమ్ యొక్క స్కోరు ఏ విధంగా హెచ్చుతగ్గులకు లోనయ్యిందో తెల్పవచ్చు .

→ ప్రతిరోజు లేదా ప్రతినెల ద్రవ్యోల్బణం ఏవిధంగా హెచ్చుతగ్గులకు లోనవుతుందో చెప్పవచ్చు.

→ ఇంకా పారిశ్రామిక వృద్ధిరేటు, డాలర్ రూపాయి మారకం విలువ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మొ||వి ఏ విధంగా రోజుల

వారిగా, నెలల వారీగా హెచ్చుతగ్గులకు లోనవుతుందో చెప్పవచ్చు.





3. (సచిత్ర గ్రాఫ్ / మూర్త గ్రాఫ్ ):

→ సచిత్ర గ్రాఫ్ లో ఒక సంస్థలో జరిగిన వస్తూత్పత్తిని విడివిడిగా చూపకుండా దానిని చిత్రాల ద్వారా చూపుతాం

→ ఒక్కొక్క చిత్రం ఒక్కో యూనిట్ కింద లెక్కిస్తాం

→ ఒక్కో యూనిట్ కి ఒక్కో నిర్ధారిత విలువను ఇస్తాం

→ ఒక్కో యూనిటీ ను ఒక్కో చిత్రం / ఒక్కో గుర్తు ద్వారా చూపిస్తాం కనుక దీనిని "సచిత్ర గ్రాఫ్" అంటాం

నోట్ :- సచిత్ర గ్రాఫ్ బార్ గ్రాఫ్ ని పోలి వుండును


→ ఇక్కడ ఒక్కో యూనిట్ కి 10 కోట్ల జనాభాని సూచిస్తుంది. జనాభా యూనిట్ కి గుర్తుగా "ఒక మనిషి సంకేతం"

ఇస్తాం= 10 కోట్లు

4.వృత్తాకార గ్రాఫ్ /వలయకార గ్రాఫ్ / గ్రాఫ్ / పంపిణీ గ్రాఫ్ :

→ ఒక వృత్తంలో వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ వృత్తాలలో ఆయా అంశాల నైప్ృత్తిక ప్రాధాన్యతా అవరణను

వర్గీకరించి చూపిస్తాం.

→ అనగా ఏదైనా ఒక విషయాన్ని భాగాలుగా చేసి పంపిణీ చేయవలసిన సందర్భంలో దీనిని ఉపయోగిస్తాం .

భాగాలుగా విభజించవలసిన విషయాన్ని శాతాలుగా మార్చి ఆ శాతాలను బట్టి వృత్తాన్ని కూడా అనురూపంగా శాతాలుగా

విడగొట్టి చూపుతాం.

అందుకే దానిని "పంపిణీ" గ్రాఫ్ అంటాం.

కోడ్ :- విభజించి భాగాలుగా పంచుకొనే సందర్భం


ఉదా :- దేశంలో వివిధ మతాలవారి సంఖ్యా వివరాలు జాతాలలో దేశంలో వివిధ కులాల వారి సలభ్యా వివరాలు శాతాలలో దేశంలో వివిధ భాషలవారి సంఖ్యా వివరాలు శాతాలలో దేశంలో నీటివనరుల లభ్యత శాతాలలో

పాఠశాలలో వివిధ గ్రేడ్లకు పొందిన విద్యార్థులు: శాతాలలో ఉదా :- 2009 ఎలక్షన్స్ లో వివిధ పార్టీలవారు పొందిన / పంచుకున్న ఓట్లు శాతాలలో

;;;;;;;;;;;;;;;;;;;;;;


నోట్ :- దేశ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, ఇంటి ఐడ్జెట్లన్నీ కూడా ఈ గ్రాఫ్ ద్వారానే సూచిస్తాం

వెన్ గ్రాఫ్ లు:-

→ వీటినే వెన్ డయాగ్రమ్స్ అని పిలుస్తారు. ఒక బాహ్య వృత్తంలో దాని

అంతర వృత్తాలు వాటి ప్రాధాన్యతలను సూచిస్తారు.

→ పై విధంగా సాంఘిక పరిసరాల నుండి అంతర్జాతీయం వరకు

ఒకదానిలో ఒకటి అంతర్భాగాలుగా ఉన్న వ్యవస్థలను తెలుపును

కోడ్ :- అంతర్భాగాలు

బోర్డులు రకాలు :-

→ వివిధ సంస్థలలో ముఖ్యంగా విద్యా సంస్థలలో వివిధ సమాచారాన్ని తెలియజేయుటకు బోర్డులను ఉపయోగిస్తాం

నల్లబల్ల :

→ గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక పంటిది.

→ గణిత ఉపాధ్యాయుడు ఇది లేనిదే ఏమిచేయలేడు

→ ఖర్చు తక్కువ గల ఉపకరణం

→ ప్రాచీనమైనది ప్రస్తుత కాలంలో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది

→ ఉపాధ్యాయుడు కళాకారుడు అయితే దీనిని బహుళ ప్రయోజనకారిగా ఉపయోగిస్తాడు

→ తరగతి గదిలో విస్తృతంగా విరివిగా ఉపయోగించే ఉపకరణం

→ నల్లబల్లలో రెండు రకాలు గలవు అవి :

1) స్థిర బోర్డ్

2) కదిలించే బోర్డ్ - కనీసం ఉపకరణం సిద్ధం చేయలేని పరిస్థితులలో ఉపాధ్యాయుని క్రియాశీలత, సృజనాత్మకతతో తరగతి నిర్వహణ ఆదర్శవంతంగా ఉంటుంది

ఉపయోగాలు-

→పిల్లల ఏకాగ్రతను పెంపొందించుటలో తోడ్పడును

→అమూర్త భావనల మండి కొంతవరకు మూర్తభావనల సమాచారాన్ని అందిస్తుంది *


→ ముఖ్యమైన సమాచారాలు అంటే పేర్లు, స్థలాలు, తేదీలు, సమయాలు, నల్లబల్లపై సందర్భానుసారంగా రాయడం వల్ల విద్యార్థులు చక్కగా, అవగాహన చేసుకొని పుస్తకాలలో రాసుకుంటారు

- బోర్డుపై గీచిన బొమ్మలు, రంగు రంగు చిత్రాలు పటాలు వల్ల విద్యార్థులలో ప్రేరణ కలుగును - విద్యార్థులచే నల్లబల్లపై రాసిన విషయాలను విద్యార్థులచే చదివించ భాషాదోషాలు నివారించవచ్చు

→నల్లబల్లపై సృష్టంగా రాసిన సమాచారాన్ని రాసుకోవడంలో ఎవరు దృష్టి లోపం కలిగి ఉన్నారో గమనించవచ్చు. వారికి తగిన

సూచనలు, 'సలహాలు ఇవ్వవచ్చు

→ఉపాధ్యాయుడు నమస్యలను సాధించేటప్పడు, వటాలను గీచేటప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడిని అనుకరిస్తారు.

→ చక్కగా సొంతంగా నోట్సను తయారు చేసుకుంటారు

→ అభ్యాసాలు, తరగతి పని, ఇంటి పని మొ॥వి నల్లబల్లపై ఇవ్వవచ్చు

→ కేవలం నల్లబల్లను ఉపాధ్యాయుడే కాకుండా విద్యార్థులచే ఉపయోగింపజేయాలి



నల్లబల్లను ఉపయోగించుటలో తీసుకోవలసిన జాగ్రత్తలు :-

→ ఉపాధ్యాయుడు సమర్థత నల్లబల్లను ఉపయోగించి దానిని బట్టి తెలుస్తుంది

→ నల్లబల్లపై రాసే సమాచారం నిర్ధిష్టమైనదిగా ఉండాలి. తప్పుడు సమాచారం రాయకూడదు

→ ఎడమ నుండి కుడికి రాయాలి

→ 6 అడుగుల నుండి 20 అడుగుల మధ్య కూర్చున్న వారికి స్పష్టంగా కన్పించాలి

→ బోర్డుపై రాసే సమాచారాన్ని విద్యార్థులందరికి కనబడే విధంగా పలుకుతూ రాయాలి.

→ అక్షరాలు గుండ్రంగా స్పష్టంగా, దోషాలు లేకుండా వుండాలి.

→ విద్యార్థులకు నల్లబల్లపై రాయడానికి లేదా బొమ్మలు గీయడానికి అవకాశం కలిగించాలి

→ సందర్భానుసారంగా ముఖ్యంగా బొమ్మలు గీసేటప్పుడు రంగు రంగుల నుద్దముక్కలు ఉపయోగించి ఆకర్షణీయంగా స్థిరపరచాలి



2.బులిటెన్ బోర్డు:-

→ పెద్ద పెద్ద సంస్థలలో అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అందులో కొన్ని వేర్వేరు ఆవరణలలో జరుగును. అటువంటి సమయంలో ఆయాకార్యక్రమాలలో పాల్గొనే వారికి సమాచారాన్ని అందించే బోర్డు.

→ బులిటెన్ కొత్త సమాచారం.

→ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని అందిస్తాం.

→ శాస్త్రవేత్తల ఫోటోలు, శాస్త్రీయ సమాచారం, శాస్త్రవేత్తలను గూర్చిన సమాచారం అందిస్తాం

→ పజిల్స్, పొడుపుకథలు, సామెతలు, సూక్తులు, ఇస్తాం.

→ సునామీలు, భూకంపాలు, వరదలు, మృత్తికా క్రమక్షయం, ప్రపంచయుద్ధం లాంటి వాటి పేపర్ కటింగ్స్ ని తెలియజేస్తాం.


→ ప్రతి రోజూ ఏదో ఒక నూతన సమస్యలను ప్రదర్శిస్తాం.

→ దానికి సమాధానాన్ని మరుసటిరోజు ప్రదర్శిస్తూ మరలా కొత్త సమన్యలను నూతన సమాచారాన్ని ఇస్తాం.

→ శాస్త్రవేత్తల ఫోటోలు, శాస్త్రీయ సమాచారం, శాస్త్రవేత్తలను గూర్చిన సమాచారం అందిస్తాం పజిల్స్, పొడుపుకథలు, సామెతలు, సూక్తులు, ఇస్తాం.

→ సునామీలు, భూకంపాలు, వరదలు, మృత్తికా క్రమక్షయం, ప్రపంచయుద్ధం లాంటి వాటి పేపర్ కటింగ్స్ ని తెలియజేస్తాం. ప్రతి రోజూ ఏదో ఒక నూతన సమస్యలను ప్రదర్శిస్తాం.

→ దానికి సమాధానాన్ని మరుసటిరోజు ప్రదర్శిస్తూ మరలా కొత్త సమన్యలను నూతన నమాచాతాన్ని ఇస్తాం

→ విద్యార్ధికి ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని తెలుసుకుంటాడు.

→ శాస్త్రీయ వైఖరి / వైజ్ఞానిక వైఖరి కలుగును.

→ శాస్త్రవేత్త లక్షణాలు వస్తాయి. పరిశీలన, పరిశోధన, అన్వేషణా లక్షణాలు వస్తాయి

→ ఉత్సాహం, ఆనందం అభిరుచి, అవగాహన, సృజనాత్మకత లాంటి లక్షణాలు అభివృద్ధి చెందును నోట్ :- బులిటెన్ బోర్డ్ లో ప్రదర్శించిన పేపర్ కటింగ్స్ ను తీసి వాటిని స్ర్రాప్ బుక్ తయారు చేయాలి

నోట్ :- విద్యార్థిని శాస్త్రవేత్తలాగా తయారు చేసే బోర్డ్ బులిటెన్ బోర్డ్

3.ప్రకటన బోర్డు /నోటీస్ బోర్డు :-

→ పాఠశాలలో గానీ, ఇతర ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యాలయాలలో గానీ ఎప్పటికప్పుడు జరిగే సమావేశాలలో 'కొన్ని ఉమ్మడి నిర్ణయాలు, తీర్మానాలు, నియమాలు రూపొందిస్తాం


→ఇలా రూపొందించిన నిర్ణయాలు, తీర్మానాలు, నియమాలు సమాచారం సంస్థలోని వ్యక్తులందరికీ మరియు బహిరంగ ప్రజలకు ప్రకటించడానికి సంస్థ బయట ప్రదర్శించే బోర్డ్

→ ఇవి సంస్థ రిజిష్టర్ లో నమోదు చేయబడి నంస్థాధికారి చేవ్రాలు సంస్థ స్టాంపుతో ఉండును.


→ కొన్ని సందర్భాలలో కాగితంపై రాసి కూడా అందిస్తారు

ఉదా :- మండల విద్యాశాభాధికారి వారి కార్యాలయంలో విద్యావాలంటీర్ల ఎంపిక సమాచారం బయట ప్రదర్శించుకు

ఎల్.ఐ.సి. కార్యాలయంలో పాలసీ క్లైమ్ చేసుకొనుటకు, పాలసీ తీసుకోవడానికి కావలసిన సమాచారం ప్రదర్శించుు

→ బ్యాంక్ లో ఖాతా చేరడానికి, ఇన్సూరెన్స్ కవరేజ్ సవరించిన వడ్డీరేట్లు, లోను వివరాలు, మొదలగునవి నోటీస్ పోర్డులీ

ప్రదర్శిస్తారు.


4. అయస్కాంత బోర్డు:-

→ఒక మామూలు మందం నిర్ణీత కొలతలతో తయారు చేయబడ్డ బోర్డు

→ చిన్న పిల్లలకు ఆసక్తికరంగా, బొమ్మల ద్వారా, చిత్రాల ద్వారా బోధించవచ్చు

→ ముందుగానే తయారు చేసిన చిత్రం, బొమ్మ, అంకెలు, అక్షరాలు చిన్న రేకుపై గాని, దళనరి అట్లపై గాని బిగించి వెనుక అయస్కాంత బిళ్ళను బిగించి అయస్కాంత బోర్డుకి దగ్గరగా ఉంచగానే అయస్కాంత బిళ్ళ ప్రభావంతో బోర్డుకు అతుక్కొనును -ఈ విధంగా కదలికలతో కూడిన కృత్యాలు చేయించవచ్చు.


5. ఖాదీ - ఉన్ని గుడ్డ / ప్లానెల్ బోర్డు : -

→ఇది రాయడానికి ఉపయోగపడదు.

→ అడుగున దొడ్డు అట్ట రేకుగాని ఉండి మధ్యలో ధర్మాకోల్ షీట్ ఉండి పైన ఖాదీ బట్ట / మక్కల్ గుద్డతో తప్పి ఉండును అట్టపై గీసిన చిత్రాలు, జంతువులు, రాజులు, నాయకుల చిత్రాలు ప్లాష్ కార్డుల సైజులో చేయబడి వెనుకవైపు అయసస్కాంతంకీ

→ బదులు ఉప్పు కాగితం ముక్కను అతికించి తయారుచేస్తారు.

→ అలాగే డ్రాయింగ్ పిన్నుల సహాయంతో అమర్చవచ్చు

నోట్ :- ఈ విధంగా విద్యార్థులు గీచిన చిత్రాలు, కవిత్వాలు, బొమ్మలు డ్రాయింగ్ పిన్స్ సహాయంతో అతికించుట ద్వారా మిగిలిన విద్యార్థులు ఇన్ స్పెర్ అవుతారు. మిగిలిన వారు కూడా తమ నైపుణ్యాలను పెంచుకొనుటకు చొరవ చూపిస్తారు

6. రోలింగ్ బోర్డు :-

→ ముఖ్యంగా చాత్రోపాధ్యాయులకు నల్లబల్ల పని తీరులో సమయాలు ఆదా చేసే బోర్డు

→ విద్యార్థులకు ఇచ్చే ఇంటిపని / కొన్ని చిత్రాలు / వలు ముఖ్య సమాచారాలు ముందుగానే చుట్టబడి తరగతిబోధన సమయంలో ప్రదర్శించడానికి ఉపయోగపడే బోర్డు

7. పిన్ బోర్డు:

→ అక్షరాలు, అంకెలకు వెనుకాల తోకల్లోంటి ఉబ్బెత్తుగా ఉన్న ప్లాస్టిక్ పుల్లలుంటాయి.

సిద్ధపరచుకొని చార్టు రూపంలో

→ వీటిని గ్రాఫ్ పేపర్ నమూనాలలో చిన్నచిన్న రంధ్రాలు / గాదులు కలిగిన ప్లాస్టిక్ ఫ్రేమ్లో అమర్చి ప్రదర్శించడానికి తోడ్పడును

→ఉదా :- సినిమా థియేటర్లో సినిమా పేరు. నటీ నటుల పేర్లు, ప్రదర్శనా సమయాలు, టిక్కెట్ ధరలు ప్రదర్శిస్తాం పెద్ద పెద్ద వాహనాలు అమ్మే షోరూమ్స్ వాటి ధరలను ప్రదర్శించుటకు

8. కొక్క బోర్డులు :

→ముఖ్యంగా వివిధ విభాగాలకు సంబంధించిన తాళాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ కొక్కాలకు చేలాడదీయడానికి

ఉపయోగించబడుతుంది

→లాడ్జీలు / హోటల్ లో వివిధ రూములు తాళాలు తగిలించే కొక్కీలు

→కొన్ని రకాల బొమ్మలు తగిలిస్తాం