అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞానశాస్త్ర బోధనోపకరణాలు








→వ్యవహారిక సత్తావాది జాన్ డూయి విద్యను త్రిదృవ ప్రక్రియగా వర్ధించాడు. అవి ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం.


→ ఏ వయసులో ఉన్న పిల్లలకైనా సంవత్సరమంతా చాలినంత విలువైన సైన్సు కార్యక్రమాలను ఏర్పరచడానికి పాఠశాల వాతావరణంలోనూ, వెలుపల కూడా అసంఖ్యాక శాస్త్రీయ అవకాశాలు ఉన్నాయి." - రూత్ ఆంథోని

→ వ్యక్తి జీవించడానికి సమాజం కావాలి. కాబట్టి పాఠశాల స్థాయినుంచి సామాజిక వనరులను ఉపయోగించుకోవాలి.

సామాజిక వనరులను ఎందుకు ఉపయోగించుకోవాలి ? :-

→ ఫ్రీమన్, కె.డేలింగ్, లేసియన్, టీవెట్, JS విజ్ఞానశాస్త్ర బోధనలో సామాజిక వనరుల ఉపయోగానికి గల కారణాలను పేర్కొన్నారు


1. ప్రత్యక్ష అనుభవాలు కల్గించవచ్చు

2. అమూర్త విషయాలు మూర్త రూపంలోకి వస్తాయి.

3. సమీప పరిసరాల్లో ఎక్కువగా దొరుకుతాయి.

4.పాఠశాల వనరులలో లభ్యంకాని సమాచారం పొందవచ్చు.


సామాజిక వనరుల వినియోగం- ప్రయోజనాలు :

→ హాస్ ED, ఓటర్స్ ES, హాఫ్ మన్ CW ప్రకారం సామాజిక వనరులను వినియయోగించుట

1.పాఠ్యాంశాలకు సంబంధించిన అవగాహన కలుగుతుంది.

2, పరిశీలనా శక్తి, సునిశితత్వం, అన్వేషణా శక్తి పెరుగుతుంది.

3.పాఠశాల బోధనకు కావలసిన సామాగ్రిని, వనరులను సేకరించవచ్చు

4.పాఠ్యాంశానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించవచ్చు.

సామాజిక వనరులు:-

1.భౌతిక వనరులు:-ప్రకృతిలో నదులు,సరస్సులు, చెరువులు,కర్మాగారాలు ,పరిశ్రమలు

2.సజీవ వనరులు:-జంతువులు,వృక్షాలు,వ్యవసాయ క్షేత్రాలు,జంతు ప్రదర్శనశాలలు

3.బౌద్దిక వనరులు:- వివిధ వృత్తులలో నిపుణులు,ప్రొఫెసర్లు, ఇంజనీర్లు డాక్టర్లు, టెక్నీషియన్లు

'సామాజిక వనరులను ఉపయోగించుకొనే పద్ధతులు :


→ సామాజిక వనరులను 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎ) పాఠశాలను సమాజంలోకి తీసుకొని వెళ్ళటం, బి) సమాజాన్ని

పాఠశాలకు తీసుకొని రావటం.

→VTM బెంగుళూరు వారు 12 సంచార వాహనాలను తయారుచేసి గ్రామీణ ప్రాంతాలవారికి సైతం విజ్ఞానాన్ని పంచుతున్నారు.

→ UNESCO SOurce book for Science Teaching లాంటి పుస్తకాలలో బోధనోపకరణాలు, ప్రత్యామ్నాయ సాధనాల తయారీ

వివరించబడింది

→ UNESCO source book for Science Teaching. Teaching of Science by using Local Resources (NCERT publication) ఈ రెండు పుస్తకాలు స్థానిక వనరులలో సైన్సు బోధించటానికి ఉపాధ్యాయునికి బాగా ఉపయోగపడతాయి


ఎడ్గార్డేల్ అనుభవాల శంఖువు :


→ విద్యలో, అనుభవాలను వాటి మూర్త, అమూర్త మితిని ఐట్టి ఎడ్గార్ డేల్ ఒకదానిపై ఒకటి అమర్చగా ఒక శంఖుపు ఆకారం వచ్చింది. దీనినే 'ఎడ్గార్ డేల్ శంఖువు" అంటారు


బోధానోపకరణాలు - నిర్వచనాలు

→ అభ్యసనానికి ప్రేరణ, పునర్బలనం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం, లేదా చిత్రాలే దృశ్య

శవణోపకరణాలు - బర్టన్

→ అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రేరణ, వర్గీకరణ, సన్నివేశ కల్పనలను పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు- కార్టర్ వి.గుడ్

→ బోధన, శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవటానికి, సమాచారాన్ని వినిమయం చేసుకోవటానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవ్య సాధనాలు- ఎడ్గార్ వేల్

→ పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయటానికి వివరించటానికి, పోల్చటానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయ సాధనాలే బోధనోపకరణాలు.- మెక్ కౌన్, రాబర్ట్

→ దృష్టి శ్రవణం అనే సంవేదనాత్మక మార్గాలు ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు -విద్యా నిఘంటువు


→ బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపర్చుకోవటానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలి-కొఠారి కమీషన్


→ సాంప్రదాయక దృశ్యశ్రవణ ఉపకరణాల స్థానంలో వెల తక్కువ గల లేదా వెలలేని అభివృద్ధిపరచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా వాస్తవికతకు దగ్గరగా మలచాలని నొక్కి చెప్పింది. - జాతీయ విద్యా విధానం-1986



విజ్ఞానశాస్త్ర ప్రయోగశాల :-

→ ప్రతిభావంతమైన, సమర్థవంతమైన బోధనకు మంచి ప్రయోగశాల అవసరం

→ విజ్ఞానశాస్త్ర బోధనకు ప్రయోగాత్మక కృత్యాలు గుండెవంటివి.


లాభాలు :

→ తరగతి గదిలో నేర్చుకొన్న సత్యాలు ప్రయోగశాలలో నిజనిరూపణ చేయబడతాయి

→ వివిధ ప్రక్రియా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి

→ శాస్త్రీయ నైపుణ్యాలు అభివృద్ధి చేయబడతాయి.

→ నేర్చుకున్న అంశాలు ఎక్కువకాలం గుర్తుంటాయి.

→ శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తాయి.

→ విరామ సమయం సర్వినియోగం అవుతుంది. విజ్ఞానశాస్త్ర తరగతులకు ప్రయోగశాలలను ఉపయోగించటం ద్వారా

సాధింపబడతాయని భావింపబడ్డ 5 వర్గాల లక్ష్యాలను షుల్మాన్ , టామిర్ అనువారు Second Hanhook of Research on teaching అనే గ్రలధంలో ఇచ్చారు.

1) నైపుణ్యాలు

2) భావనలు

3) జ్ఞానసంబంధ

4) విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవటం

5) వైఖరులు


ప్రయోగశాల ప్రణాళిక :-

1.విశాల ప్రదేశం:-

→ ప్రయోగశాల 48 * 25 చ అడుగుల స్థలంలో, ఉండి, విద్యార్ధికి విద్యార్థికి మధ్య కనీసం 1 మీటరు దూరముండాలి. ప్రయోగశాల గోడలకు, బెంచీలకు మధ్య దూరం కనీసం 1.7 మీటర్లుండాలి.

2.బహుముఖ వాడుట:-

→ ఉపాధ్యాయుడు, ప్రదర్శన, విద్యార్థి స్వంతంగా లేదా సమూహకృత్యాలకు అనుగుణంగా బహువిధాలుగా ప్రయోగశాల పొడుకోవటానికి అనుకూలంగా ఉండాలి.

3.ఉనికి :-

→ క్రింది అంతస్తులో ఏదో ఒక చివరన ప్రయోగశాల ఉండాలి. తద్వారా విద్యార్థులకు ఎటువంటి అటంకం కలగదు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా భద్రతా నిర్వహణకు వీలుగా ఉంటుంది.

4.పరిసరాల ప్రాముఖ్యత:-

→ ఉత్తర, దక్షిణ అభిముఖంగా ప్రయోగశాల ద్వారాలుంటే మంచిది

5.నల్లబల్ల, ప్రదర్శనాల్ల :-

→ సాధారణంగా 2.7 మీ. X 0.75 మీ. x 0.9 మీ. కొలతలు గల ప్రదర్శనా బల్ల, సింకులు, నీటివనరులు ఏర్పరచాలి

6. బెంచీలు, కుర్చీలు :-

→ ఉపాధ్యాయుని బల్ల 8 X 26 కొలతలతోను వేదికమీద ఉండటం అందరు విద్యార్థులను వర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది.


→ సెవేజ్ గ్రామ (1966)సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బెంచీల మధ్య దూరం 1 మీ, ఉండాలి, 6, 7 తరగతుల విద్యార్థులకు బెంచీల మధ్య దూరం 1,3 మీ. ఉండాలి.

→ శాస్త్రీయ పానెల్ సూచనల మేరకే ప్రతి విద్యార్థికి 19.6 చదరపు అడుగుల వైశాల్యం కేటాయించాలి .


ప్రయోగశాలలు - రకాలు:

→ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు అనువుగా

1.ఉపన్యాస - ప్రయోగశాల → UNESCO నమూనా

2.ఉపన్యాస గది, ప్రయోగశాల → RH వైట్‌హౌస్ నమూనా

3.బహుళ ప్రయోజన ప్రయోగశాల


1.ఉపన్యాస ప్రయోగశాలను


→ 1964లో నియమించిన మాధ్యమిక పాఠశాల శాస్త్రీయ విద్యాపానెల్ వారు UNESCO Planning Mission నిపుణుల సిఫారసులను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పథకాన్ని రూపకల్పన చేయటం జరిగింది

2. ఉపన్యాస గది, ప్రయోగశాల

→ అవిభక్త భారతదేశంలోని లాహోర్ కేంద్ర శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ Dr. RH White House ఉన్నత పాఠశాలల కోసం పొదుపుతో కూడిన శాస్త్ర వాతావరణం ఇమిడియున్న ఉపన్యాసగది మరియు ప్రయోగశాల ప్లాన్ ను రూపొందించారు

3. ఉపన్యాస గది ప్రయోజనాలు

→ఎక్కువ డబ్బు ఖర్చు కాదు

→ కూర్చునే వసతి సహజంగాను, సౌకర్యంగాను, సుఖంగాను ఉంటుంది.

→ అమరిక చౌకగా ఉండి ఒకచోట నుండి మరొకచోటుకి వదలవచ్చు.

బహుళ ప్రయోజన ప్రయోగశాల:-

→ ఒకే ఫర్నిచర్ ను ఒకే గదిని ప్రయోగశాల, తరగతిగదిగా ఉపయోగించే ప్రయోగశాలను బహుళ ప్రయోజన ప్రయోగ శాల

అంటారు.

→ ఈ ప్రయోగశాల సిద్ధాంతపర బోధన, ప్రయోగ నిర్వహణ రెండింటికీ ఉపయోగపడుతుంది.

→ బహుళార్ధ సాధక ప్రయోగశాల వైట్ హౌస్ ప్లాన్ లో లాగే అనేక అంశాలున్నప్పటికీ చిన్న చిన్న భేదాలున్నాయి

→ 40 మంది పనిచేయటానికి 45' X 25' పరిమాణం గల ప్రయోగశాల గది సరిపోతుంది .


→ రిజిష్టర్ల నిర్వహణ ప్రయోగశాలలో క్రింది రిజిష్టర్లు ఉండాలి

1. ఆక్సిషన్ రిజిస్టర్

2. పగిలే వస్తువుల కోసం స్టాక్ రిజిష్టర్

3. పగలని వస్తువుల కోసం స్టాక్ రిజిష్టర్

4.రసాయన పదార్థాల కోసం, స్టాక్ రిజిష్టర్

5.బ్రేకేజి రిజిష్టర్

6. ఇష్యూ రిజిస్టర్

7.ఆర్డర్ రిజిష్టర్

8. అవసరతల రిజిష్టర్


ప్రాథమిక విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక (Primary Science Kit (PSK) :

→ OBB పథకం క్రింది సరఫరా చేయబడ్డ 35 వస్తువుల్లో ఇది ఒకటి

→ దీన్ని NCERT నిర్మించినది.

ఉద్దేశ్యం - సైన్స్ లో చిట్టి చిట్టి ప్రయోగాలతో ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులకు విషయాన్ని అవగాహన చేయటం



→ దీనిలో ఉండే అంశాలు:

1.ప్రయోగాలు, ప్రదర్శనలు చేయటానికి అవసరమయ్యే తక్కువ ఖరీదుండే సామాగ్రి

2.రసాయన పదార్థాలు

3. చేతి పనిముట్లు

→ కిట్లోని వస్తువులను గుర్తించటానికి వీలుగా కిట్ మాన్యువల్ అనే పుస్తకం ఉంటుంది

→ కిట్లోని 76 వన్తువులుంటాయి.

→ కిట్ను ఉక్కుతో చేస్తారు. బరువు 11 1/2 కి. గ్రా. ధర రూ. 300/-




సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనాపేటిక (Integrated Science Kit (ISK) :-


→ ప్రాథమికోన్నత తరగతులకు (6, 7) బాలబాలికలకు వైఙ్ఞానిక భావనలను కల్గించటానికి పాఠ్యాంశాలు అర్థం చేసుకోవటానికి *

ఇది ఉపయోగపడును


→ NCERT దీనిని తయారు చేసింది.

→ దీనిలో 107 వస్తువులుంటాయి.

→ ఈ పేటికను 3 భాగాలుగా విభజించారు. అవి

ఎ) పరికరాలు

బి) రసాయనాలు

సి) గాజు సామాగ్రి

ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు :-

→ ఒక నియమాన్ని లేదా ఒక శాస్త్రీయ లేదా ఒక దృగ్విషయాన్ని లేదా ధర్మాన్ని లేదా యధార్థాన్ని స్పష్టంగా వివరించుటకు, తయారుచేయబడిన తక్కువ ధరతో కూడిన సాంప్రదాయసిద్ధ పరికరానికి బదులుగా వాడే పరికరాన్ని ప్రత్యామ్నాయ పరికరం

అంటారు.

→ UNESCO SOurce book for science teaching వంటి పుస్తకాల్లో స్థానిక ననరులను ఉపయోగించి పరికరాలు, ప్రయోగాలు చేయటానికి ఏర్పాట్లు చాలా విస్తృతంగా ఇవ్వబడ్డాయి

లాభాలు:

→ ద్రవ్యాన్ని పొడుపు చేయవచ్చు.

→ నిర్మాణాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి

→ వ్యర్థ వస్తువులను, ఉపయోగపడే వస్తువులుగా మార్చవచ్చు

→ పాఠశాలకు ప్రయోగశాలలు, ప్రయోగ పరికరాల లోటు తీరుతుంది.

→ బోధించడానికి, అభ్యసనానికి ఎంతో తోడ్పడతాయి.