అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




గణిత బోధనోపకరణాలు








బోధనోపకరణాలు - వర్గీకరణ



→ శ్రవణ పరికరాలు : రేడియో, టేప్ రికార్డ్ లు (కేవలం వినే ఉపకరణాలు)
→ దృశ్యపకరణాలు : గ్రాఫ్ లు, కదలని చిత్రాలు, ఫోటోలు, ప్రదర్శనా బల్లలు (కేవలం చూడగలిగేవి)
→ దృశ్య శ్రవణ పరికరాలు : టి.వి. చలన చిత్రం, కంప్యూటర్లు (చూడడం మరియు వినే పరికరాలు
→ గ్రాఫిక్ ఉపకరణాలు / ద్విమితీయ ఉపకరణాలు :-
పొడవు, వెడల్పు కలిగి కేవలం చూడడానికి మాత్రమే వీలయ్యే ఉపకరణాలను గ్రాఫిక్ ఉపకరణాలు లేదా ద్విమితీయ ఉపకరణాలు అంటారు. ఈ ఉపకరణాలు తాకలేం. కేవలం చూడడం మాత్రమే వీలగును
ఉదా :- కార్డులు, ఫోటోలు, చిత్రాలు, పటాలు గ్రాఫ్ లు, మొ॥వి. బ్యానర్స్ పైన, ఫ్లెక్సీలపైన, బోర్డులపైన, పుస్తకాలలో, కాగితాలపైన ఉండే అక్షరాలు, చిత్రాలు మొ||వి.

→ త్రిమితీయ ఉపకరణాలు / 3-డి ఉపకరణాలు :-
→ పొడవు, వెడల్పు, మందం కూడా కలిగిన మూడు కొలతలు గలిగిన ఉపకరణాలను త్రిమితీయ ఉపకరణాలు / 3-డి ఉపకరణాలు అంటాం.
→ వీటినే చేతితో తాకగలం మరియు చూడగలం
ఉదా :- వాస్తవ వస్తువులు, మాతృకలు, నమూనాలు, డయాఫ్రంలు, కీలు బొమ్మలు, తోలుబొమ్మలు, కదిలే సమునాలు మొవి. బ్రెయిలీ లిపిలోని అక్షరాలు త్రిమితీయం

ప్రదర్శనా పరికరాలు :-

→ ఇతరుల దర్శించడానికి ఏర్పాటు చేసినవి ప్రదర్శనా పరికరాలు
→ ఉదా :- నల్లబల్ల, జియోబోర్డ్, బులిటెన్ బోర్డ్, నోటీస్ బోర్డ్ మొ.వి.

ప్రక్షేపిత ఉపకరణాలు /ప్రోజెక్టివ్ ఉపకరణాలు :-
→ ఇక్కడ వస్తువును ఒకచోట ఉంచి దాని యొక్క ప్రతిబింబాలను తెరమీద ప్రతిక్షేపిస్తాం కనుక వీటిని ప్రక్షేపిత వస్తువులు అంటాం
ఉదా :- ఫిల్మ్ లు, ఫిల్మ్ స్టిప్స్, సైన్స్, ఒహెచ్.పి., ఎపిడియోస్కోప్లు


కృత్య పరికరాలు:-
→ విద్యార్థులు స్వయంగా కృత్యాలు నిర్వహించడం ద్వారా తయారు చేసినవి
→ ఉదా :- క్షేత్ర పర్యటనలు, విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు, సర్వేలు ప్రయోగాలు మొ॥ని

ఎ) బోధనోపకరణాలు:-
→ ఉపాధ్యాయుడు వాడే ఉపకరణాలను బోధనోపకరణాలు అంటాం
ఉదా :- కంప్యూటర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇవి ఉపాధ్యాయుడు మాత్రమే ఉపయోగిస్తాడు కేవలం బోధనకు మాత్రమే ఉపయోగిస్తాడు.

బి) అభ్యసనోపకరణాలు :-
→ ఉపాధ్యాయుని సహాయం లేకుండా ఏ ఇతర బాహ్య సహాయం లేకుండా తమంట తామే నేర్చుకోవడానికి, అభ్యసన చేయడానికి భావనలను అవగాహన చేసుకోవడానికి, పటిష్ఠ పరచుకోవడానికి ఉపయోగపడే ఉపకరణాలను ఆభ్యననోపకరణాలు లేదా స్వీయ బోధనోపకరణాలు అంటారు.
ఉదా :- జియోబోర్డ్, గ్రాఫ్ పేపర్, దామినోలు, పూసల చట్రం




టి.ఎల్.ఎమ్.ఉపయోగించుటలో ప్రయోజనాలు


→ విద్యార్థులకు నేత్రానందం ఆసక్తి కలుగుట
→ఉపాధ్యాయుల ప్రతిభకు ప్రతీక
→ విద్యార్థులలో ఊహాశక్తి కలుగును, ఉపకరణాలను తయారుచేయు నైపుణ్యం కలుగును
→ ఉపాధ్యాయునికి సమయం ఆదా అగును శ్రమ తగ్గును
→ ఖర్చులేని, ఖర్చు తక్కువ సామాగ్రిచే తయారు చేయవచ్చు
→ ఉపాధ్యాయునిలో క్రియాశీలత, నిశిత దృష్టి, విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండును
→ లక్ష్యాత్మాక బోధన జరుగును
→ ఆధునిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటాడు
→ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఖాళీ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు



టి.ఎల్.ఎమ్. ఉపయోగించుటలో గుర్తుంచుకోవలసిన అంశాలు


→ ప్రతి బోధనోపకరణం పాఠ్యాంశానికి తగినదిగా ఉండాలి
→ వైయుక్తిక భేదానికి, స్థాయికి తగినట్లుగా ఉండాలి
→ ఉపకరణం నిర్దిష్టమైనదిగా, కచ్చితమైనదిగా ఉండాలి
→ సందర్భానుసారంగా అని ప్రదర్శించాలి. ముందుగానే ప్రదర్శించరాదు
→ వీలైనంత తక్కువ ఖర్చుతో తయారు చేయాలి
→ విద్యార్థులచే తయారుచేయించిన పరికరాన్ని వాని సొంత మాటల్లో రాయించాలి
→ ప్రత్యక్షంగా చూపలేని వాటిని తరగతి గదిలో వాటి నమూనాలను ప్రదర్శింపచేయాలి
ఉదా :- రాకెట్లు, విమానాలు, కోటలు, చార్మినార్, తాజ్ మహల్ మొ||వి.





టి.ఎల్.ఎమ్. ఉపయోగించుటలో ఎదురయ్యే సమస్యలు


→ ఉపాధ్యాయులలో ఉపకరణాలు తయారు చేయాలనే తపన లేకపోవడం
→ భద్రపరచడానికి వసతి లేకపోవుట
→ విద్యుత్ సరఫరా లోపం, బిల్లులకు వనరుల లేమి
→ శాస్త్రీయ దృక్పథం లేకపోవుట
→ ఉపాధ్యాయులకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవుట ఉపాధ్యాయులకు టి.ఎల్.ఎమ్. తయారీలో తగిన శిక్షణ లేకపోవుట
→ తగిన ఆర్థిక వనరులు లేకపోవుట
→ ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్లబ్ లు ఏర్పాట్లలో సమన్వయం లేకపోవడం
→ NPE 1986లో భాగంగా OBB స్కీమ్ 1987లో ఏర్పాటు చేశారు. OBB స్కీమ్ ముఖ్యోద్దేశాలు 3:
1) మౌలిక సదుపాయాల కల్పన
2) ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను నియమించుట
3) బోధనోపకరణాల సరఫరా
→ టి.ఎల్.ఎమ్. సరఫరాలో భాగంగా మ్యాథ్స్ కిట్ సరఫరా చేయుట జరిగింది
→ మ్యాథ్స్ కిట్ లో 7 వస్తువులు కలవు
1) పూసల చట్రం
2) డామినోలు
3) ఘనాకారపు కడ్డీలు
4) క్యూసేనియర్ పట్టీలు
5) నేపియర్ పట్టీలు
6) భిన్నాల చట్రం
7) జ్యామితీయ ఘనాకారాల పట్టిక



పూసల చట్రం ఉపయోగాలు:-
→ పూసలను లెక్కించడం
→ పూసలను వేయుట ద్వారా సంకలనం
→ పూసలను తీయుట ద్వారా వ్యవకలనం
→ పూసలు లేకుంటే శూన్యాంశ భావన / సున్నా భావన
→ స్థాన విలువలను గూర్చి మూర్తంగా బోధించుటకు
→ స్థాన విలువల ఆధారంగా సంఖ్యలను బోధించుటకు
→ పూసల చట్రం మధ్యలో ఒక బిందువునుంచగా దశాంశ స్థానాలు బోధించుటకు మరియు దశాంశ సంఖ్యలు వ్రాయించుటకు ఉపయోగిస్తాం



డామినోలు:-

→ ఇవి అట్టతో గాని, ప్లాస్టిక్ గాని చేయబడిన దీర్ఘచతురస్రాకారంలో ఉండును
→ ప్రతి భాగంలోను రంధ్రాలుంటాయి
→ ఈ రంద్రాలను బట్టి పేరు పెడతాం
→ విద్యార్థులకు దీర్ఘచతురస్రాకారం గూర్చి మూర్త భావన కల్గించుటకు
→ దీర్ఘచతురస్ర వైశాల్యం, దీ||చ చుట్టుకొలతలను గూర్చి బోధించవచ్చు.
→ రంధ్రాలను బట్టి సంకలనం, వ్యవకలనం బోధించవచ్చు
→ రంధ్రాలను బట్టి లెక్కించడం నేర్పవచ్చు
→ ఏ రంధ్రాలు లేకపోతే 0-0 డామినో అంటాం

ఘనాకారపు కడ్డీలు :-
→ ఇవి ఒక యూనిట్ నుండి 10 యూనిట్లు వరకు 10 సెట్లుoడును
→ ఈ కడ్డీలనుపయోగించి సరళరేఖలు, సమాంతర రేఖలను గీయవచ్చు
→ రకరకాల త్రిభుజాకారాలు ఏర్పరచవచ్చును
→ పెద్ద, చిన్న సైజులను పోల్చవచ్చు
→ పొడుగు, పొట్టి అనే భావన ఏర్పరచవచ్చు
→ సైజుల వారీగా ఆరోహణ, అవరోహణ భావనలను బోధించవచ్చు
→ భిన్నం భావనలు కూడా బోధించవచ్చు
→ దశాంశ, శతాంశ భావనలను బోధించవచ్చు


క్యుసేనియర్ పట్టీలు :-
→ దీనిలో మధ్యలో ఒకటి నుండి పది వరకు సంఖ్యలుండును. మధ్య స్మేలుకి ఇరువైపులా రెండు గాడులుండును
→ ఆ గాడులలో అట్టముక్కలు ఉంచి పరిక్రియలు చేస్తాం
→ సంఖ్యలు / అంకెలను పోల్చుటకు ఉపయోగిస్తాం
→ అట్టముక్కలను కదుపుట ద్వారా సంకలనం, తీసివేయుట ద్వారా వ్యవకలనం చేయవచ్చు


5. నేపియర్ పట్టీలు :-
→ దీనిని నేపియర్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు
→ దీనిలో తొమ్మిది ఎక్కాల పట్టీలు ఒక ప్రధాన పట్టి ఉందును
→ దీనిలో '0' ఎక్కం పట్టీ ఉండదు
→ నోట్ :- పెద్ద పెద్ద గుణకారాలు చేయుటకు నేపియర్ పట్టీలను ఉపయోగిస్తాం






6. భిన్నాల చట్రం

→ దీనిలో చతురస్రాకార చెక్కను పై భాగంలో వృత్తాకార పై పొరను తొలుస్తాము. అప్పుడు ఆ గాడిలో వివిధ అట్టముక్కల నుండి భిన్న భావనలను వివరిస్తాం
→ దీని ద్వారా భిన్నం భావనను విద్యార్ధికి కళ్ళకు కట్టినట్లుగా మూర్తంగా తెలుపుటకు - క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నాలను గూర్చి చెప్పవచ్చు
→ సజాతి, విజాతి భిన్నాలను గూర్చి చెప్పవచ్చు
→ లవం, హారం లాంటి భావనలను గూర్చి చెప్పవచ్చు
→ నోట్ :- మొట్టమొదటి సారిగా 3వ తరగతిలో భిన్నం భావనను తెలుపుటకు - భిన్నాల చట్రం




7. జ్యామితీయ ఘనాకారాల పెట్టె :-
→ విద్యార్థికి ఘనం, దీర్ఘ ఘనం, శంఖువు, స్థూపం, గోళం, పట్టిక లాంటి జ్యామితీయ ఆకారాలను గూర్చి మూర్తంగా వివరించుటకి జ్యామితీయ ఘనాకారాల పెట్టెనుపయోగిస్తాం

కృత్యకోశం :-
→ కృత్యానికి కావలసిన సామాగ్రి అంతా ఒక పేటికలో జమచేస్తే కృత్య పేటిక అగును ఆటువంటి కృత్య పేటికలన్ని జమచేస్తే కృత్యతోశం అగును
→ కృత్యతోశంలో నుంచి కావలసిన కృత్య పేటికను తీసుకొని తరగతి గదిలో కృత్యాన్ని చేయించవచ్చు



కృత్య పత్రం:-

→ కృత్యం ఏవిధంగా నిర్వహించాలో తెలిపేది కృత్య పత్రం
→ కృత్య కోశం =కృత్య పేటికలు + కృత్య పత్రాలు + పీరియడ్ ప్లాన్స్


కృత్యాధార షీట్స్ (తరగతి గదిలో కేవలం పాఠ్య విషయం అవగాహన కొరకు) :-
→ తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్య బోధన చేసే సమయంలో విద్యార్థికి భావనను అవగాహన పరచుట కొరకు తయారుచేసిన షీట్స్ ను "కృత్యాధార షీట్స్" అంటారు
→ ఉదా :- క్రమభిన్నాలు, అపక్రమ, మిశ్రమ భిన్నాలను గుర్తించడానికి, కృత్యం ఏవిధంగా నిర్వహించాలో తెలిపేది - కృత్య పత్రం

వర్క్ షీట్స్ (అవగాహన తర్వాత అవర్తనం కొరకు) :-
→ విద్యార్థులతో పని చేయించడానికి అనువుగా తయారు చేసేవి.
→ ఇవి తరగతి గదిలో మరియు ఇంటి పనిగా ఇవ్వవచ్చు
→ నేర్చుకున్న భావాలను ఆవర్తనం చేసుకొని పటిష్ట పరచుకోవడానికి
→ విద్యార్థులు పునశ్చరణ చేసుకొనుటకు వీటిని వాడుతారు.
→ విద్యార్థులను ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయుటకు వాడుతారు
→ నోట్ :- ఇవి తయారు చేయుట కష్టం కానీ విద్యార్థులు చాలా సులువుగా చేస్తారు

ఫ్లాష్ కార్డులు (ముందు చిత్రం చూపి, వెనుక వైపు పేరు రాసి చెప్పించుట) : -
→ ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి ప్లాప్ కార్డులు వాడతారు.
→ దళసరి కాగితంపై గాని, అట్టపైన గాని బోధించాల్సిన అంశం రాసి ప్రదర్శిస్తారు
→ ఇవి విద్యార్థులకు చూపి ప్రశ్నించుట ద్వారా డ్రిల్లింగ్ కు, మూల్యాంకనానికి ఉపయోగపడతాయి
→ బోధన పూర్తయిన తర్వాత పునశ్చరణకు తోడ్పడును
→ నిదానంగా అభ్యసించే విద్యార్థులకు ఈ కార్డులు ఇచ్చి తీరికగా అభ్యసించమని కోరవచ్చు
→ నోట్ :- ఇవి అందమైన చేతి రాతతో రాయలి. పటాలు స్పష్టంగా ఉండాలి
నోట్ :- రాజులు, జాతీయ నాయకులు, పక్షులు, జంతువులు, ప్రసారసాధనాలు, ప్రయాణ సాధనాలు మొ వాటి చిత్రాలు సేకరించి చిన్న సైజులో మందపు అట్టలు కత్తిరించి అతికిస్తాం. వీలైతే చుట్టూ ఫ్రేమ్ లాగా మెరుపు కాగితాలు అతికిస్తే అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి





గ్రాఫ్ పేపర్/గ్రిడ్ పేపర్ :-
→ గ్రాఫ్ పేపరు ద్వారా శాతాలు బోధించవచ్చు
→ దశాంశ భిన్నాలు బోధించవచ్చు
→ సాధారణ భిన్నాలను బోధించవచ్చు
→ దశాంశాలు, శతాంతాలు బోధించవచ్చు
→ భాగాలను గూర్చి చెప్పవచ్చు
నోట్ :- ప్రాథమిక పరిక్రియలైన సంకలనం, వ్యవకలనం కూడా బోధించవచ్చు




గణిత పరికరాల పెట్టె:-
→ దీనిలో స్కేలు, కోణమానిని, విభాగిని, వృత్తలేఖిని, రెండు మూలమట్టాలు ఉండును
→ ఈ పరికరాల సహాయంతో ఎటువంటి జ్యామితీయ చిత్రాన్నయినా గీయవచ్చు
→ పొడవులు కొలవడం, సరళరేఖలు గీయుటకు స్కేలు ఉపయోగిస్తాం
→ సమాంతర రేఖలకు - మూలమట్టాలు, కోణాల నిర్మాణంకు కోణమానిని, వృత్తాలు గీయుటకు వృత్తలేఖిని మొ||వి ఉపయోగిస్తాం


వాస్తవ వస్తువులు / నిజ వస్తువులు :-
→ ఇవి నిజమైనవి. విద్యార్థులకు ప్రత్యక్షానుభూతిని, వాస్తవికతను కలిగిస్తాయి
→ మూర్తానుభవాన్ని కలిగించును. అన్నింటికన్నా అత్యధిక ప్రభావం వాస్తవ వస్తువులు
ఉదా :- చెప్పుల ద్వారా జతభావన, క్యారెట్, ధాన్యంరాశుల ద్వారా శంఖువు భావన, అగ్గి పెట్టి, డస్టర్ ద్వారా దీర్ఘ ఘనాకార భావన, తాజ్ మహల్, ఎర్రకోట, గోల్కొండ కోటల ద్వారా చరిత్ర బోధన, గింజలు మొలకెత్తడం, తీర ప్రాంతాలో మృత్తికా క్రమక్షయం మొ॥వి.




మాతృకల / స్పెసిమన్స్ (సేకరణా నైపుణ్యం, ప్రదర్శనా నైపుణ్యం) :

→ నిజ వస్తువులలోని భాగాన్నే మాతృకలు లేదా స్పెసిమన్స్ అంటాం
→ వాస్తవ వస్తువులు లభించని సందర్భంలో మాతృకలు ఉపయోగిస్తాం
ఉదా :- పులిగోరు, పులి చర్మం, ఎనుగు దంతాలు, డైనోసార్ ఎముకలు, దంతాలు, గుడ్లు, శిలాజాలు, విత్తనాలు, కాయలు,బెరళ్ళు, వేరు. గాజు సీసాలలో భద్రపరచిన పిండాలు, రక్త నమూనాలు, మాంసం ముద్దలు, నాణేలు, బల్లెములు బాణాలు, ఆభరణాలు, తపాలా బిళ్ళలు, ఆదిమానవులు వాడిన పనిముట్లు, కొమ్ములు, ఈకలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆటవిక ఉత్పత్తులు మొ||వి.



3. నమూనాలు:-

→ నిజ వస్తువుగాని, మాతృకలుగాని లభించని సందర్భాలలో నమూనాలను ఉపయోగిస్తాం
→ నమూనాలు రెండు రకాలు : 1) పనిచేసేవి 2) పని చేయనివి (స్థిర నమూనాలు)
→ తరగతి గదిలో ప్రదర్శించడానికి వీలులేని సంక్లిష్టమైన / అరుదైన / అతి పెద్దదైన / అతిసూక్ష్మమైన / విలువైన వస్తువులకు నమూనాలు తయారుచేస్తాం.
→ నమూనాలు ఖర్చుతో కూడుకున్నవి.
→ ప్లాస్టిక్ తో గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో గాని, మట్టితోగాని, లోహంతోగాని, అట్టతోగాని దేనితోనైనా నమూనాలు తయారుచేయవచ్చు
→ ధృష్టిశ్రవణం అనే నంవేదనాత్మకమార్గాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించే సాధనాలే దృశ్య, శ్రవణ ఉపకరణాలు - విద్యా నిఘంటువు
→ బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి, ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలు సరఫరా చేయాలి. - కొఠారి విద్యా సంఘం
→ సంప్రదాయ దృశ్య, శ్రవ్య ఉపకరణాల స్థానంలో వెల తక్కువ గల, వెల లేని అభివృద్ది పరిచిన ఉపకరణాలను ఉపయోగింది బోధనకు ప్రభావకారిగా, వాస్తవికతకు దగ్గరగా మలచాలని చెప్పింది". - NPE 1986 .
→ సంక్లిష్ట భావనలు స్పష్ట పరచడానికి, భావనల మధ్య నహసంబంధాన్ని, సమన్వయాన్ని స్థిరపరచడానికి, విద్యార్థులకు తమ పరిశీలనలు వ్యాఖ్యానించడానికి, అభ్యసనాన్ని వాస్తవంగా, అర్ధవంతంగా, ఆసక్తికరంగా ఉత్తేజితంగా చేయుటకు దోహదపడతాయి
→ ప్రాచీన కాలంలో ఏకధృవ వ్యవస్థ (ఉపాధ్యాయ కేంద్రీకృతం)
→ కొంత కాలం తర్వాత ద్విధృవ వ్యవస్థ (శిశు కేంద్రీకృతం)
→ ప్రస్తుత త్రిధృవ వ్యవస్థ (సమాజ కేంద్రీకృతం)
→ ఏక ధృవ వ్యవస్థ ఉపాధ్యాయుడు చెప్పిందే విద్య
→ ద్విదృవ వ్యవస్థ ఉపాధ్యాయుడు విద్యార్థి భాగస్వామ్యం
→ త్రిధృవ వ్యవస్థ ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజంల సమ్మేళనం





త్రిధృవ ప్రక్రియ :-
→ ప్రత్యక్షంగాకాని లేదా పరోక్షంగా గాని బోధనోపకరణాలను చూపించడం ద్వారా సాంఘిక శాస్త్ర బోధనలో విద్యార్థులకు ఆసక్తి కలిగించవచ్చు” - బైనింగ్ & బైనింగ్
→ సాంఘిక శాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు - కొమినియస్
→ పిల్లల మనస్తాత్వాన్ని ఆశించిన అభిరుచులను పరిగణనలోకి తీసుకున్నది. -ప్రోబెల్, స్కిన్నర్
→ విద్యార్థులలో ఆశించిన ప్రవర్తనా మార్పులు, అభ్యసన ఫలితాలు పొందడానికి జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు పనిని కల్పించాలి". - స్పిన్నర్
→ కోబన్ ప్రయోగాల ఆధారంగా వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ మేరకు నాలెడ్జ్ ను గ్రహిస్తామో, జ్ఞానం మన స్మృతి ఎంత ఫలితాన్ని ఇస్తుందో కూడా వివరించాడు
→ అత్యధికంగా చూడడం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని ఆర్టిస్తాం - 83%
→ ప్రతిమనిషి తాను నేర్చుకున్న విషయంలో మర్చిపోయేది - 10%
→ విద్యార్థి పొందే అభ్యససనుభవాలను అధ్యయనం చేసి ఏవి ప్రభావవంతంగా పనిచేస్తాయో ఏవి తక్కువగా పని చేస్తున్నాయో వివరిస్తూ వాటిని ఒక వరుస క్రమంలో శంఖువులలో అమర్చినది -ఎడ్గార్ డేల్




అనుభవాల శంఖువు



→ అభ్యసననుభవాలను మూత్రం నుండి అమూర్తానికి అమర్చడం జరిగింది
→ వీటన్నింటిని ఒక శంఖువు రూపంలో ఖమర్చాడు
→ దీనిలో మూర్తానుభవాలను క్రింది భాగంలో అమూర్తానుభవాలను శంఖువు పై భాగంలో అమర్చడం జరిగింది
→ శంఖువు పైకి పోయే కొలది అమూర్తత, క్రిందికి వచ్చే కొలది మూర్ఖత్వం పెరుగును
→ మొదటి పట్టీలో ఆనుభవరంతి - వానపామును ప్రత్యక్షంగా చూడడం
→ తొమ్మిదవ పట్టీలో అనుభవం వానపాము చిత్రాన్ని చూడడం
→ పదవ వట్టీలో అనుభవం - వానపాము పదాన్ని చదవడం

ప్రత్యక్ష / ప్రయోగాత్మక అనుభవాలు :-

→ ఇవి శంఖువు పీఠభాగంలో మొదటి పట్టీ, దీనిలో అనుభవాలు ప్రత్యక్షంగా ఉంటాయి. విద్యార్థి తన జ్ఞానేంద్రియాలతో ప్రత్యక్షంగా చర్యలో పాల్గొంటాడు.
ఉదా :- పిరమిడ్లు, సమాధులు, కోటలు ప్రత్యక్షంగా చూడడం, మొక్కలు, జంతువులు వాటి నివాసాలు చూడడం. ప్రత్యక్షంగా గ్రాపులు, చిత్రాలు గీయడం


కల్పితానుభవాలు / ప్రతినిధిత్వ / ప్రాతినిధ్య / కృత్రిమ / సవరించబడిన అనుభవాలు :-
→ ప్రత్యక్ష అనుభవాలను కల్పించలేనప్పుడు వాటి యొక్క మాదిరులను ఉపయోగించి కృత్రిమంగా అలాంటి అనుభవాన్ని కల్పిస్తాం

ఎ) నమూనాలు :
→ నిజవస్తువుని పోలి ఉండే కృత్రిమ వస్తువులు. ఇవి పరిమాణంలో పెద్దవిగాగానీ, చిన్నవిగాగాని ఉండవచ్చు
ఉదా :- రక్తప్రసరణ వ్యవస్థ మాదిరి, విమానం మాదిరి, రైలు మాదిరి, తాజ్ మహల్ మాదిరి మొ

బి) డయోరమా :-
→ డయోరమా అనగా మొత్తం ఆవాసం యొక్క నమూనా / అనుకరణ
ఉదా :- ఎస్కిమోలు ప్రాంతంను తెల్లరంగు దూదితో, గట్టి అట్టతో ఇగ్లూలు, దృవపు జింకలు, నక్కలు, ఎలుగులతో ఒక దృశ్యం తయారుచేయాలి.

సి) మాతృకలు :-
→ నిజవస్తువులు గానీ, వాటి నుండి వేరు చేయబడిన భాగాలను మాతృకలు అంటాం.
→ ఉదా :- హెర్బేరియం, సీసాలలో భద్రపరచిన జంతువులు, కత్తులు, బాణాలు, డాలులు, శిలాజాలు, విత్తనాలు మొ॥వి

నాటకాలు :-
→ ఈ అనుభవాలు సహజమైన యధార్థాన్ని పునర్నిర్మించేవిగా ఉండవచ్చు. యథార్థ అనుభవాన్ని ప్రతిస్థాపన చేసేవిగా ఉండవచ్చు విద్యార్థులు వీటిలో పాత్రలుగా పాల్గొనవచ్చు
→ ఉదా :- సౌరకుటుంబం నాటకం, రాజారామ్మోహన్‌రాయ్ నాటకం, శివాజి ఏకపాత్రాభినయం, నాటకాలు, తోలుబొన్ములాటలు, మూకాభినయం,ఏకపాత్రాభినయాలు

ప్రదర్శనలు / మాదిరి పాఠాలు :-
→ దీనిలో విద్యార్థులు ఇతరులు చెప్పే మాదిరి పాఠాలను / ప్రదర్శనలను నిర్వహిస్తారు.
ఉదా : సూక్ష్మ బోధన



క్షేత్ర పర్యటనలు :-

→ దీనిలో విద్యార్థి బాహ్య క్షేత్రాలను సందర్శించి అధ్యయనం చేస్తాడు
→ ఇవి తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా బయట క్షేత్రాలను స్వయంగా సందర్శించి పరిశీలిస్తాడు
→ ఒక్కోసారి వస్తువులను సేకరించి భద్రపరచి, నమోదు చేసి అధ్యయనం చేస్తాడు. అప్పుడు ఇది మొదటి పట్టీలోకి వస్తుంది
ఉదా :- నేలులు - రకాలు, నేలలు - పంటలు, వివిధ వృత్తులు, పంచాయితీ - విధులు, బ్యాంకు - ఉపయోగాలు



ప్రదర్శితాలు :-

→ వీటిని విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తారు. ఇతరులు తయారు చేసిన మాదిరులు, మ్యూజియాలు, ఫెయిర్లలోని వస్తువులను విద్యార్థి ప్రత్యక్షంగా చూస్తారు

టి.వి. / చలన చిత్రం :-
→ ఇవి రెండూ చలనాన్ని చూపిస్తాయి. చూడడం మరియు వినడం ద్వారా విద్యార్థి అనుభవాన్ని సంపాదిస్తాడు. విద్యార్థిని ప్రేక్షకపాత్రే




శాబ్దిక మరియు దృశ్య చిహ్నాలు : రేడియో, రికార్డింగ్, జడచిత్రాలు :-
→ వీటిలో శ్రవణోపకరణాలైన రేడియో ప్రసారాలు, రికార్డు చేయబడిన టేపులు, డిస్క్ రికార్డ్లు, దృశ్య పరికరాలైన ఫిల్మ్ స్టిప్స్ ప్లైడులు, ఫోటోలు, మ్యాగజైన్లలో ఫోటోలు, చిత్రాలు ఉంటాయి. వీటిలో ఫోటోలు తప్పమిగిలిన వాటిని అన్నింటిని ప్రదర్శించడానికి ప్రక్షేపక యంత్రాలు కావాలి: ఇవి దృశ్య, శ్రవణ సందేశాలలో ఏదో ఒక దాన్ని మాత్రమే అండజేస్తాయి




దృశ్య సంకేతాలు :

→ ఇవి దృశ్య ఉపకరణాలు, యధార్థ చిత్రం యొక్క ఆమూర్త ప్రతినిధులు వీటిలో చార్టులు, బోర్డుపై చిత్రాలు, గ్రాఫ్ లు కార్టూన్లు, మాప్లు, ఓవర్' హెడ్ ప్రాజెక్టర్ ద్వారా ప్రక్షేపించే పారదర్శకాలు ఉంటాయి

శబ్ద సంకేతాలు :-
→ ఇవి చాలా అమూర్త దశలో ఉంటాయి. ఒక వస్తువు, భావన, సిద్ధాంతం యొక్క మొత్తం సమాచారం కుదించబడి సంకేతంగా మార్చబడుతుంది
→ ఇంతకు ముందు చర్చించిన అనుభవాలన్నీ శబ్టి సంకేతాలకి దారితీస్తుంది
ఉదా :- ఉపాన్యాసాలు, పుస్తకంలోని మాటలు చదవడం.