విజయవంతమైన పుష్పక్‌ ప్రయోగం




→ పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌) ‘పుష్పక్‌’ను ఇస్రో మూడోసారి ప్రయోగించి పనితీరును సమీక్షించింది.
→ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టిలోని డీఆర్‌డీవో ఆవరణలో ఈ సన్నాహక పరీక్షను నిర్వహించారు.
→ ప్రయోగంలో భాగంగా వాయుసేనకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది.
→ స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్‌ నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది.
→ రన్‌వేపై తొలుత దాని వేగం గంటకు 320 కి.మీ. ఉండగా పారాచూట్‌ సాయంతో 100 కి.మీ.కు వేగాన్ని కుదించుకుంది.
→ అనంతరం బ్రేకులు ఉపయోగించుకుని నిశ్చల స్థితికి చేరుకుంది. పుష్పక్‌ చివరి సన్నాహక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.