చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
→
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది.
→
వీటిని శోధించడం ద్వారా జాబిల్లి ఆవిర్భావ తీరుపై మరింత అవగాహన పెంచుకోవచ్చని చైనా అంతరిక్ష సంస్థ-సీఎన్‌ఎస్‌ఏ తెలిపింది.
→
‘‘ఈ వ్యోమనౌక 1,935.3 గ్రాముల మేర నమూనాలను తెచ్చినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. గతంలో తెచ్చిన చందమామ శాంపిళ్లతో పోలిస్తే తాజాగా తెచ్చిన మట్టి ఒకింత అధిక సాంద్రతను కలిగి ఉంది. అందులో మట్టి ముద్దలు కూడా కనిపించాయి’’ అని పేర్కొంది.
→
తొలుత ఈ నమూనాలను భద్రపరచడం, ప్రాసెసింగ్ వంటివి చేస్తామని, ఆ తర్వాత శాస్త్రీయ పరిశోధన పని మొదలవుతుందని వివరించింది.
→
→