పక్షవాతాన్ని పసిగట్టే ముఖ గుర్తింపు సాధనం!


→ పక్షవాతం బారినపడిన వారిని కొన్ని సెకన్లలోనే గుర్తించే ఒక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ ఇది పారామెడికల్‌ సిబ్బందికి బాగా ఉపయోగపడుతుంది. 82 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని చెబుతుందని పరిశోధకులు తెలిపారు.
→ ఈ సాధనం.. కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేస్తుంది. ఇది ముఖం తీరుతెన్నులను, కండరాల కదలికలను విశ్లేషించి, ఆ వ్యక్తి పక్షవాతం బారినపడ్డాడా అన్నది గుర్తిస్తుంది.
→ ఈ రుగ్మత బాధితుల్లో గందరగోళం, కండరాల కదలికలపై నియంత్రణ లేకపోవడం, మాటల్లో స్పష్టత లోపించడం, ముఖకవళికలు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
→ ముఖ్యంగా ముఖంలోని రెండు పార్శ్వాల మధ్య తేడాలు కనిపిస్తాయి. పక్షవాతాన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం.
→ సకాలంలో చికిత్స అందిస్తే దీర్ఘకాల వైకల్యం ముప్పును, ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చు.
→ పక్షవాతం కేసుల్లో 13 శాతాన్ని అత్యవసర విభాగాలు, పెద్ద ఆసుపత్రుల్లోనూ గుర్తించలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
→ చిన్నస్థాయి ఆసుపత్రుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటోందని తెలిపాయి.