ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’




భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది.
→ మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది.
→ వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్‌ ఇవ్వగా వాటిలో తొలి విడతగా 120 అందాయి.
→ జీపీఎస్‌ ఆధారంగా పని చేసే ‘నాగాస్త్ర-1’ రెండు మీటర్ల కచ్చితత్వంతో దాడి చేయగలదు.
→ దీనిని ఆత్మాహుతి (సూసైడ్‌) డ్రోన్‌ అని కూడా పిలుస్తుంటారు. తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్‌ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.
→ రాడార్లకు దొరక్కుండా దాడులు చేయగలదు. దాదాపు గంటసేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది కచ్చితత్వంతో పనిచేయగలదు.
→ అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైంది.
→ లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్‌ను మధ్యలో రద్దు చేసినా తిరిగి వెనక్కి రప్పించవచ్చు.
→ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం దీనికి పారాషూట్‌ సదుపాయం కూడా ఉంటుంది. అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించారు.