తెలుగులో హల్లులతో తొలి పాప్‌అప్ పుస్తకం!
→
తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడానికి టైపోవనం వ్యవస్థాపకుడు శశి గూడూరు వినూత్న ప్రయోగం చేశారు.
→
పుస్తకం తెరవగానే అక్షరాలు కదిలేలా రూపొందించారు. మాతృభాషపై మమకారం, తనకున్న డిజైనింగ్ నైపుణ్యంతో ‘కళాక్షరిక’ను రూపొందించారు.
→
ఇది ‘క’ నుంచి ‘క్ష’ వరకు తెలుగు హల్లులతో కూడిన పాప్ అప్ పుస్తకం. ఈ తరహా తెలుగులో ఇదే మొదటిది కావడం విశేషం.
→
ఐఐటీ బాంబే నుంచి విజువల్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శశి గూడూరు తెలంగాణ పర్యాటక సంస్థ, హైదరాబాద్ జంతు ప్రదర్శనశాల, టీ-శాట్ టీవీ, టీ యాప్ ఫోలియో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు తదితరాల లోగోల రూపకల్పనలో పాలుపంచుకుని గుర్తింపు తెచ్చుకున్నారు.
→
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ టైపోగ్రఫీ ప్రదర్శనల్లో పాల్గొంటూ ‘కళాక్షరిక’కు రూపమిచ్చారు.
→