మసాజ్‌తో నొప్పి తగ్గుతుందనడానికి గట్టి ఆధారాల్లేవు


→ నొప్పి నుంచి ఉపశమనం కోసం కొందరు మసాజ్‌ మార్గాన్ని ఆశ్రయిస్తుంటారు.
→ వందలాది క్లినికల్‌ ప్రయోగాలు, పెద్ద సంఖ్యలో శాస్త్రీయ సమీక్షలు జరిగినప్పటికీ.. ఈ విధానం సమర్థతపై ఇప్పటివరకూ కచ్చితమైన ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ ఓపియాడ్లు వంటి ఇతర చికిత్సల కన్నా ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిర్ధారణగా చెప్పే శాస్త్రీయ సమీక్షలు లేవని పేర్కొన్నారు.
→ మసాజ్‌ విధానంలో.. చర్మంలోని మృదువైన కణజాలాలు, కండరాలు, లిగమెంట్లకు చేతితో సవరించడం చేస్తుంటారు.
→ దీనికి బాగానే ఆదరణ లభిస్తోంది. చాలాకాలంగా ఆచరణలో కూడా ఉంది.
→ అయితే మసాజ్‌ వల్ల కలిగే ప్రయోజనాలపై ఆధారాలు పరిమితంగానే ఉన్నాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
→ వీరు 2018 నుంచి జర్నళ్లలో ప్రచురితమైన 129 సమీక్షలను విశ్లేషించారు.
→ వీటిలో 41 మాత్రమే.. పెద్దల్లో నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో మసాజ్‌ సాయపడిందని చెప్పే ఆధారాలకు సంబంధించిన ప్రామాణిక రేటింగ్‌ విధానాన్ని అనుసరించాయని తేల్చారు.
→ వీటిలో నడుం నొప్పి నుంచి క్యాన్సర్‌ సంబంధిత నొప్పి వరకూ 13 భిన్న రకాల ఆరోగ్య పరిస్థితులతో ముడిపడిన 17 సమీక్షలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
→ ఈ సమీక్షల్లో తేలిన అంశాలు.. ‘అత్యంత కచ్చితత్వంతో కూడినవన్న’ రేటింగ్‌ సాధించలేకపోయాయని తెలిపారు.
→ ఏడు సమీక్షలు ఒక మోస్తరుగా, మిగతావి చాలా స్వల్ప స్థాయిలో కచ్చితత్వాన్ని కలిగినవిగా తేలినట్లు వివరించారు.