జలవనరుల పరిరక్షణపై ఏఐ


→ చెన్నై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో జల వనరులు కలుషితం కాకుండా, నాణ్యతను పాటించేలా తమిళనాడులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
→ ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను వినియోగించేలా పరిశోధనలు చేస్తున్నారు.
→ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఐఐటీ మద్రాస్‌లోని పరిశోధక నిపుణులతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాయి.
→ చెన్నైకి తాగునీటినిచ్చే 7కు పైగా జలాశయాలు నగర పరిసరాల్లో ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
→ ప్రత్యేక సెన్సర్లు వినియోగించి, వివిధ విభాగాల దగ్గరున్న డేటాతో అనుసంధానించి నీటి నాణ్యతను నిత్యం(రియల్‌టైం) పర్యవేక్షించే విధానాన్ని తెస్తున్నారు.
→ నీటి రంగు మారినా, పరిసర ప్రాంతాల వాతావరణం కలుషితమైనట్లు తెలిసినా, ఇతర ప్రాంతాల నుంచి కలుషితాలు జలాల్లో కలుస్తున్నా... సెన్సర్లు అప్రమత్తం చేస్తాయి.