భారత్‌లో మెటా ఏఐ సేవలు


→ కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ ‘మెటా ఏఐ’ సేవలను భారత్‌లోనూ అందుబాటులోకి తెచ్చినట్లు మెటా ప్రకటించింది.
→ వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, మెటా.ఏఐ పోర్టల్‌పై ఈ సేవలను పొందొచ్చని తెలిపింది.
→ ఈ యాప్స్‌లో ఫీడ్, చాట్స్‌పై ఖాతాదారులు మెటా ఏఐను వినియోగించుకోవచ్చని, యాప్‌ను వీడకుండానే కొత్త అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని మెటా తెలిపింది.
→ భారత్‌లో ఈ సేవలు ఆంగ్లంలో లభించనున్నాయి. అత్యంత అధునాతన మెటా లామా 3పై మెటా ఏఐను అభివృద్ధి చేశారు.
→ గతేడాది జరిగిన కనెక్ట్‌ సదస్సులో మెటా ఏఐను తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది.
→ ప్రస్తుతం లామా 3తో అభివృద్ధి చేసిన మెటా ఏఐ తాజా వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
→ మెటా ఏఐ సాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌పై సమీపంలోని రెస్టారెంట్‌ల వివరాలు, ప్రయాణంలో చూడదగ్గ ప్రదేశాలు వంటి వాటిని తెలుసుకోవచ్చు.
→ ఫీడ్‌లో ఉన్న అంశానికి సంబంధించి అదనపు సమాచారాన్ని కూడా మెటా ఏఐతో వెతికి తెలుసుకోవచ్చని మెటా వివరించింది.