అంతరిస్తున్న జీవజాతుల్లో మరో వెయ్యి
→
ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది గత ఏడాదికన్నా ఇది 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ (ఐయూసీఎన్) హెచ్చరించింది.
→
వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతుల చొరబాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది.
→
అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని ఐయూసీఎన్ గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తోంది.
→
సంరక్షణ చర్యల వల్ల ఐబీరియన్ లిన్‌క్స్ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది.
→
చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే ఒక రకం బ్రహ్మజెముడు మొక్కలు, బోర్నియో ద్వీప ఏనుగులు, గ్రాన్ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది.
→
చిలీ బ్రహ్మజెముడుకు అలంకరణ మొక్కగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరగడమే దానికి ముప్పు తెచ్చిపెట్టిందని ఐయూసీఎన్ తెలిపింది.
→
ఇప్పుడు ఈ మొక్క కోసం ఐరోపా, ఆసియా దేశాల సంపన్నులు ఎగబడుతున్నారు. బోర్నియో ఏనుగులు ఇప్పుడు కేవలం 1,000 మాత్రమే మనుగడలో ఉన్నాయి.
→