అరుణాచల్‌ప్రదేశ్‌లో సరికొత్త కప్ప జాతి!
→ అరుణాచల్ ప్రదేశ్‌లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
→ దీని తలపై కొమ్ముల్లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు.
→ దీన్ని తొలుత.. వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించే జెనోపైరిస్ మాసోనెన్సిస్ అనే కప్ప జాతిగా భావించామని తెలిపారు.
→ అయితే రెండింటి మధ్య జన్యుపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు.