పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు!




→ రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
→ ఇందులో ఒకటి జూన్‌ 29న ఒకటి, 30న రెండోది పుడమి సమీపానికి వచ్చింది. దాని పేరు 2024 ఎంకే. వెడల్పు 200 మీటర్లు.
→ అంతర్జాతీయ గ్రహశకల దినం. సరిగ్గా అదే రోజున ఈ పరిణామం జరగడం విశేషం.
→ మనకు అత్యంత చేరువగా వచ్చినప్పుడు ఈ గ్రహశకలం 3లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.
→ భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఇది 77 శాతంతో సమానం. భారత కాలమానం ప్రకారం ఈ పరిమాణం చోటుచేసుకుంది.
→ ఈ గ్రహశకలాన్ని ఒకమోస్తరు స్థాయి బైనాక్యులర్‌తో ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఔత్సాహికులు వీక్షించారు.
→ ఈ అంతరిక్ష శిల పెద్దది కావడం, చాలా దగ్గరగా రావడం వంటి కారణాల వల్ల అది ఒకింత ప్రకాశవంతంగా కనిపించింది.
→ దీన్ని తొలిసారిగా ఈ ఏడాది జూన్‌ 16న గుర్తించారు.రెండో గ్రహశకలం పేరు 2011 యూఎల్‌21. దీని వెడల్పు 2.3 కిలోమీటర్లు.
→ భూమికి సమీపంలోని 99 శాతం ఖగోళవస్తువుల కన్నా ఇది పెద్దది. కొద్దిరోజుల కిందట అది పుడమికి చేరువగా వచ్చి వెళ్లింది.
→ అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు 66 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.
→ 1900 తర్వాత పుడమి సమీపానికి వచ్చి వెళ్లిన పది అతిపెద్ద గ్రహశకలాల్లో ఇది కూడా ఒకటి.
→ భూమికి చుట్టుపక్కల 20 మీటర్ల కన్నా పెద్దగా ఉన్న శిలలు 50 లక్షల వరకూ ఉన్నాయి. అవి పుడమి మీదకు దూసుకొస్తే నష్టం తప్పదు.