జులై 22 అత్యంత వేడి రోజు
→ అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా జులై 22 రికార్డు సృష్టించింది. ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
→ జులై 21న రికార్డు సృష్టిస్తూ నమోదైన 17.09 డిగ్రీలను ఇది మించిపోయింది.
→ ఈ మేరకు ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తాజాగా వెల్లడించింది.
→ 1940 నుంచి ఇప్పటి వరకూ జులై 22న నమోదైన సగటు ఉష్ణోగ్రతే అత్యధికమని వివరించింది.
→ ఇప్పటి వరకూ 2023, జులై 6నాటి 17.08 డిగ్రీలు, 2024 జులై 21 నాటి 17.09 ఉష్ణోగ్రతలే గరిష్ఠంగా ఉన్నాయి.
→ కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో తాజా తాపస్థాయి రికార్డులు బద్దలుకొట్టింది.
→ అంతర్జాతీయంగా సాధారణం కంటే 1.5 డిగ్రీలు లేదా అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం 12 నెలలుగా వరసగా కొనసాగుతూ వస్తోంది.
→ గత జూన్ నుంచి ప్రతినెలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.