రోబోలకు జీవకళ!


→ రోబోలకు జీవకళ జోడించే దిశగా జపాన్‌ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
→ ఈ మరమనుషుల ముఖాలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించేందుకు ఒక విధానాన్ని కనుగొన్నారు.
→ దీనివల్ల సౌందర్య ఉపకరణాలు, వైద్యశాస్త్రంలోనూ ప్రయోజనాలు ఉంటాయి. టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
→ వీరు మానవ చర్మ కణాలతో ఒక ముఖాన్ని వృద్ధి చేశారు. లిగమెంట్‌ తరహా సాధనాలతో దాన్ని సాగేలా చేసి చిరునవ్వు ముఖకవళికను సృష్టించారు.
→ రోబోలకు లోహాలు, ప్లాస్టిక్స్‌కు బదులు సజీవ కణజాలాన్ని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
→ చర్మానికున్న స్వీయ మరమ్మతు సామర్థ్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు.
→ తదుపరి దశలో ఈ చర్మానికి రక్త ప్రసరణ వ్యవస్థ, నాడులను జోడించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
→ దీనివల్ల చర్మంపై వాడే సౌందర్య లేపనాలు, ఔషధాలను పరీక్షించే సురక్షిత సాధనాలుగా వీటిని ఉపయోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.