అత్యంత వేడి నెలగా జూన్‌!


→ అయిదు ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్‌ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌(సీ3ఎస్‌) నిర్ధారించింది.
→ ఆ నెలలో ఉపరితల సగటు ఉష్ణోగ్రత 16.66 డిగ్రీలుగా ఉందని, అది 1991-2020 వ్యవధిలో సగటు నెల ఉష్ణోగ్రతతో పోలిస్తే 0.67 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది.
→ 2023 జూన్‌తో పోలిస్తే 0.14 డిగ్రీలు అధికమని వెల్లడించింది.
→ అలాగే వరుసగా 12 నెలలపాటు పారిశ్రామికీకరణ ముందు (1850-1900) ప్రపంచవ్యాప్త సగటు ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
→ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా ఇదే నెలలో అధికంగా నమోదైందని చెప్పింది.
→ 2023-2024లోని ఎల్‌నినో ప్రభావం, మానవ చర్యల ఫలితమే దీనికి కారణంగా పేర్కొంది.
→ ఫలితంగా జూన్‌లో వివిధ దేశాలు అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, తుపానులు ఎదుర్కొన్నాయని తెలిపింది.